25-03-2026, 10:36 AM
Part - 23
లంచ్ అయిపోయిన తర్వాత దేవేంద్ర గారి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. శాంభవి స్కిల్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంది అని అర్థమవుతుంది.
దేవేంద్ర కి టైం తెలియకుండానే అయిపోతూ ఉంటుంది. సాయంత్రం అయిన తర్వాత ఓకే లీవ్ ఏమన్నా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. రేపు క్లారిటీ ఇస్తాను వర్క్ ఇంకా ఫాస్ట్ గా చేద్దామని చెబుతారు.
ఒకే సార్ థాంక్యూ అని చెప్పి, బయటకు వస్తారు. శాంభవి బ్యాచ్ బయటికి రాగానే అక్కడ కారు రెడీగా ఉంటుంది.
వెంటనే శాంభవి నివాస్ కి ఫోన్ చేసి బావ కారు వచ్చింది నేను స్టార్ట్ అవుతున్నాము అని చెబుతుంది. జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
మిత్ర శాంభవి తో మీ బావ నీ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటున్నాడు. ఏంటి సంగతి అని అడిగితే... అలా ఏముంది అంత ఫ్యామిలీ కదా అని నవ్వుతుంది
శాంభవి కి తెలియకుండా సీక్రెట్ గా పెట్టిన సెక్యూరిటీ ఫోన్ నుండి ఇవన్నీ వెంటనే రుద్రకి పిడికిలి బిగుస్తోంది. ముఖం కోపంగా ఉంటుంది
అది చూస్తున్న ధీరజ్ మెల్లిగా రుద్ర చెవులు దగ్గర ఏంటి బావ నీ మరదలు ఇంకొకరిని బావ అని పిలుస్తుంది అని కోపం వస్తుందా అని అడుగుతాడు.
నేను అలానే ఏమన్నా చెప్పాన నీకు అని రుద్ర అంటే. నీ మొఖం చూస్తే అలాగే అనిపిస్తుంది. నీకు కాంపిటేషన్ ఏమో బావ! ఒకసారి చెక్ చేసుకోరాదు అంటూ రుద్ర వంక చూస్తాడు.
రుద్ర ధీరజ్ కాలు నీ గట్టిగా తొక్కుతాడు చచ్చాను రా బాబోయ్అని ఆరిస్తే... చాలా తెలుసుకోవడం ఇంకా తెలుసుకోన అనే కళ్ళు ఎగరేస్తాడు.
నీకు దండం రా బాబు, ఏదో నిన్ను కాసేపు ఏడిపిద్దామని అనుకుంటే... ? నన్ను ఏడ్చేలా చేసావ్ రా అని ఏడుపు మొహం పెడతాడు.
బావ పబ్ కి వెళ్దామా! ఈ పది రోజుల నుంచి వర్క్ లో పడి స్ట్రెస్ ఎక్కువ అయ్యింది అంటాడు వీకెండ్ ప్లాన్ చేద్దాం ఇప్పుడు కాదు అని రుద్ర కూడా బయటికి వస్తాడు.
రుద్ర ఇంటికి వెళ్లగానే అమ్మ అని గట్టిగా అరుస్తాడు. ఏమైందిరా అంతలా అరుస్తున్నావ్ మీ అమ్మని అని తులసి అడిగితే...
డార్లింగ్ ఈరోజు మీ కోడలు ఏం చేసిందో తెలుసా అని అడుగుతాడు. చెప్పు అంటే... నాకు తెలియకుండానే నాకు పెళ్లి ఫిక్స్ చేసారు.
శాంభవిని లైన్లో పెట్టాలంట వీళ్ళ ఆర్డర్ మళ్ళీ నాకు అంటూ రుసరుసలాడతాడు.
శాంభవి కే రా బంగారం లాగా ఉంది. మీ ఇద్దరి పేర్లు కూడా చక్కగా మ్యాచ్ అయినాయి. శాంభవి రుద్ర అనగానే...
దానికి రుద్ర అది నాన్నకు కూచి నీకు తెలుసా ఆ విషయం అంటాడు.. అయితే ఏమైందిరా నాన్న కూచి నుంచి బావ కుచ్చిగా మార్చుకో అని వెటకారంగా చెబుతుంది.
అంత వెటకారం వద్దు డార్లింగ్. అది అంత ఈజీ అనుకుంటున్నావా! చినమామతో వర్క్ లో లేదా వాళ్ళ నాన్నలతో ఫోన్లో ఉంటది.
ఆఫీస్ అయిపోతే కార్ ఎక్కేస్తుంది. అసలు బయట ప్రపంచమే తెలియదు అని చిరాగ్గా అంటాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి....
శాంభవి కి నీతో కలిసి ఉండే టైం ఇవ్వడం లేదా అనా లేక మేము మ్యాచ్ ఫిక్స్ చేసేస్తున్నామన్న అని డౌట్ గా రుద్రవంక చూస్తారు.
దానికి నాకు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు ముందు మామతో కనెక్ట్ అవ్వనివ్వండి. మెల్లిగా తనని ఇక్కడ అన్ని పరిస్థితులకు అలవాటుపడనివ్వండి అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోతాడు.
ఆ మాటలకు తులసి గుమ్మనంగా నవ్వుకుంటుంది. నీకు మనసులో శాంభవి అంటే ఇష్టం ఉందిరా.. కాకపోతే బయటికి ఎదవ బిల్డ్ అప్ ఇస్తున్నావు.
చారులత కిచెన్లోంచి వస్తూ ఏంటి అత్తయ్య గారు మీ మనవడు ఎగురుతున్నాడు అంటే....శాంభవి గురించి అని నవ్వుతారు.
ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి చారు ఎలా శాంభవిని ఇంటికి తీసుకురావాలి అంటే ఇంకా ఏమీ అర్థం కావడం లేదు అత్తయ్య చూడాలి.
ముందు శాంభవి పెరిగిన ఇంట్లో వాళ్లతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయండి. వాళ్లు క్లోజ్ అయ్యారు అనుకో... మనకి ఏదో ఒక దారి కనిపిస్తుంది కదా అని తులసి గారు సలహా ఇస్తారు. ఇది బానే ఉంది అత్తయ్య అని కౌసల్యకు ఫోన్ చేసి అదే విషయం చెబుతారు.
కౌసల్య కి.కూడా ఈ ప్లాన్ నచ్చుతుంది. విహాన్ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా అడిగి తెలుసుకుందాంలే వదినా అని కౌసల్య ఫోన్ పెట్టేస్తుంది.
తన వెనకే వస్తున్న ప్రమాదాన్ని గుర్తించక ఉదయమే అనసూయ గుడికి వెళుతుంది. అమ్మవారి దర్శనం చేసుకుని .ఆలయ ప్రాంగణంలో కూర్చుంటుంది.
అత్తయ్య అన్నా వాయిస్ వినిపించిన వైపుకి చూస్తుంది అక్కడ మయూరి కనిపిస్తుంది చిరాగ్గా మొఖం పెట్టుకొని పక్కకు తిప్పేస్తుంది.
ఏంటి అత్తయ్య నన్ను చూడగానే మొఖం అలా తిప్పేసావు అని నవ్వుతుంది నాకు నీతో మాట్లాడాలని లేదు దయచేసి నా దగ్గరకు రాకు అని లేచి నుంచి ఉంటారు.
ఎందుకత్తయ్య నామీద అంత కోపం? నేనేం చేసినా బావ కోసమే కదా చేశాను. బావ ని ప్రేమించాను కాబట్టే కదా ఇప్పటికే అలాగే ఉన్నాను అంటే.. నీది ప్రేమ కాదు ఉన్మాదితత్వం.
ఒకసారి నేను మాయలో పడి చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ నీ మాటలు నమ్ముతానని ఎలా అనుకున్నావు మయూరి అని చాలా సీరియస్ గా అడుగుతారు.
దానికి మయూరి నవ్వుతూ నేనేమీ మాయ చేయలేదు అత్తయ్య, అంతా నిజమే చెప్పాను. రుద్ర కి పెళ్లి కుదిరింది అంట కదా! అమ్మాయి ఎవరు అని అడుగుతుంది.
ఆ విషయాలన్నీ నీకు అనవసరం. నా కుటుంబానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కోపంగా చెబుతుంది.
నాకు అనవసరమా లేక నీకే తెలియదా అత్తయ్య అని వెటకారంగా అడుగుతుంది . నీకు ఒకసారి చెబితే అర్థం కాదా మయూరి ఎందుకు ప్రతిసారి ఇలాగే విసిగిస్తావు అని చిరాకు పడుతుంది.
అయ్యో అత్తయ్య నీకు ఎలాగా మీ ఇంట్లో చెప్పరు కదా! నేనైనా చెబుదాము అని నా ప్రయత్నం అంతే అని అమాయకంగా ముఖం పెడుతుంది.
నీకు నిన్న ఆఫీసులో జరిగిన విషయం కూడా తెలియదు కదా అత్తయ్య సాగదీస్తుంది .
దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావ్ మయూరి అంటే... అందుకే అత్తయ్య నేనే నీకు చెప్పాలి అనేది.
సరే చెబుతాను విను. నిన్న ఆఫీసులో రుద్ర కి కాబోయే కాబోయే భార్య దీపం వెలిగించింది అని ఓరగంట అనసూయ ని అబ్జర్వ్ చేస్తుంది.
అనసూయ ఆ విషయం వినగానే బిగుసుకుపోతుంది. అత్తయ్య ఏమైంది నీకు అని మయూరి కదుపుతుంది.
నువ్వు చెప్పేది నిజమా అని అడిగితే... నీతో నేను ఎందుకు అబద్దం చెబుతాను అత్తయ్య. ఆరోజు నిజమే చెప్పాను, ఈరోజు నిజమే చెబుతున్నాను. నువ్వే నన్ను నమ్మడం లేదు అని బాధగా చెబుతుంది.
ఆ విషయం వినగానే ఒకపక్క ఆనందం, ఒకపక్క ఆశ్చర్యంతో అనసూయ గబగబా బయటకు వస్తుంది.
వెంటనే డ్రైవర్ ని కారు తీయమని ఇంటికి వచ్చే కౌసల్య అని పిలుస్తుంది ఏమైంది అత్తయ్య గారు అంటే...
మీరందరూ రెండు రోజుల నుంచి ఆఫీస్ కి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతుంది. ఇప్పుడా విషయాలన్నీ ఎందుకు అత్తయ్య అంటే....
నాకు నిజం చెప్పు కౌసల్య నిన్న అమ్మవారి ముందు కూడా దీపం వెలిగించారంట కదా అని సంతోషంగా అడుగుతుంది.
ఈ విషయం మీకు ఎవరు చెప్పారు అత్తయ్య అంటే...
ఎవరు చెప్పారు అన్నది కాదు. నాకు నిజం చెప్పు కౌసల్య తనే రుద్రకి కాబోయే భార్య అంట కదా అని చాలా ఆత్రంగా అడుగుతారు.
జితేంద్ర అనే రాఘవేంద్ర గారు చాలా గట్టిగా పిలుస్తారు. ఏమైందో అని అందరూ కంగారుగా హాల్లోకి వస్తారు.
జితేంద్ర కంగారుగా ఏమైంది నాన్నగారు అంత కోపంగా ఉన్నారు అంటే.... ఆ మనిషికి ఆఫీసులో జరిగిన విషయం ఎలా తెలిసిందో కనుక్కో అని గట్టిగా అంటారు.
భర్త మాట తీరుకి అనసూయ కి భయం వేస్తుంది. జితేంద్ర అనసూయ ముందుకు వచ్చి చెప్పమ్మా నీకు ఎలా తెలిసింది అని అడిగితే...
మయూరి విషయం చెబితే ఇంట్లో వాళ్ళందరికీ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది అని టెన్షన్ తో చెమటలు పడతాయి.
నిజం మాత్రమే చెప్పమని చెప్పు జితేంద్ర అని రాఘవేంద్ర గారు మళ్ళీ గట్టిగా మాట్లాడతారు.
అమ్మా, నాన్న గారికి కోపం తెప్పించకు నీకు ఎలా తెలిసిందో చెప్పు అని కొంచెం సీరియస్ గానే జితేంద్ర అడుగుతాడు.
దానికి అనసూయ గారు కొంచెం కంగారు పడుతూనే మయూరి చెప్పింది అని చెబుతారు నువ్వు ఇంకా మయూరిని కలుస్తున్నావా అని అసహ్యంగా చూస్తారు.
భర్త చూపులోని అసహ్యాన్ని, కొడుకుల చూపులోని చిరాకుని చూసేటప్పటికి అనసూయకి ప్రాణం చివుక్కుమంటుంది.
లేదురా నేను కలవడం లేదు. ఇందాక గుడిలో అనుకోకుండా కలిసి నాకు విషయం చెప్పింది.
అది తెలుసుకోవాలని ఆనందంతో నేను ఇంటికి వచ్చాను అని చెబుతారు.
భర్త కొడుకు మొఖంలో కనిపిస్తున్న విసుగుని కూడా పక్కన పెట్టేసి దీపం వెలిగించారు అంటే.. దేవేంద్ర కూతురు కనిపించినట్టేనా అని చాలా ఆత్రంగా అడుగుతారు.
అత్తగారు ఆత్రం చూసి కౌసల్యకి జాలి వేస్తుంది. మామగారిని కాదు అని నిజం చెబితే ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏమీ చేయలేక మౌనంగా జరిగేది చూస్తూ ఉంటుంది.
జితేంద్ర నిట్టూర్చి ఇప్పుడు నువ్వు తెలుసుకుని మాత్రం ఏం చేస్తావ్ అమ్మ అని అడుగుతాడు. అంటే నేను ఏమీ తెలుసుకోకూడదా జితేంద్ర.
నాకు అంత అర్హత లేదా అని బాధగా అడుగుతుంది. అవన్నీ నీకే తెలుసు కదా అమ్మ! ఇంకా దయచేసి ఈ విషయాల గురించి మాట్లాడి నాన్నగారికి కోపం తెప్పించకు అని రూమ్ లోకి వెళ్లి పోతారు.
భర్త వెనకాల కౌసల్య కూడా రూమ్ లోకి వెళ్ళిపోతుంది. రాఘవేంద్ర గారి కోపంగా చూస్తూ అక్కడినుండి వెళ్ళిపోతారు. విహాన్, అద్వైత్ కూడా ఏం చేయాలో తెలియక సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు హాలులో అనసూయ ఒక్కతే మిగులుతుంది.
అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోవడం అంటే ఇదేనేమో అని మనసు లోపలే బాధపడుతూ ఉంటారు
ఇంతకీ అనసూయ చేసిన తప్పు ఏమిటి??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)