24-03-2026, 07:25 AM
Part - 21
శాంభవి ఉదయమే లేచి రెడీ అయ్యి,పూజ చేసుకుని కిచెన్ లోకి వస్తుంది. ఏమన్నా కావాలా శాంభవి అని సావిత్రి అడుగుతారు.
ఈరోజు నేను ఒక స్వీట్ చేసి ఆఫీస్కి పట్టుకెళ్దాం అని వచ్చాను అంటుంది. ఏం స్వీట్ కావాలో చెప్పు చేసి పెడతాను అని సావిత్రి గారు అంటే...
నేనే చేస్తాను. నిన్న నేను భయపడుతుంటే మా సార్ నాకు చాలా ధైర్యం చెప్పారు. అందుకే ఈరోజు స్వీట్ చేసి థాంక్స్ చెబుదామని అని చెప్పి ఏం చేయాలా అని చూస్తుంది.
క్యారెట్ హల్వా చేద్దాము అనుకుని...క్యారెట్ తీసుకుని హల్వా చేస్తుంది.
భాను గారు శాంభవి కి ఫోన్ చేస్తారు. ఫ్యామిలీ మొత్తం వీడియో కాల్ లో రెడీగా ఉంటారు. శాంభవి హల్వా చేస్తూనే కాల్ అటెండ్ అవుతుంది.
చెప్పండి నాన్న అంటే..ఏం చేస్తున్నావ్ బంగారం అంటే.. నిన్న సార్ నాకు హెల్ప్ చేశారు కదా! అందుకే ఆ సార్ కోసమని క్యారెట్ హల్వా చేస్తున్నాను అని చెబుతుంది.
నొప్పి ఏమైనా వస్తుందా అమ్మ అని శివ గారు అడుగుతారు. దానికి ధరణి బావగారు అది చాలా చిన్న ఇంజక్షన్.
జస్ట్ బ్లడ్ తీస్తారు అంతే.. అదొక 10 మినిట్స్ కు సెట్ అయిపోతుంది అనగానే.. అలా ఏమీ లేదు ధరణి మనం ఎవరం పక్కన లేము కదా భయపడి ఉంటుంది అని అడుగుతున్నాను అని చెప్తారు.
ధరణి, జయంతి నవ్వుకుంటారు. చూడండి నాన్న మీరు అలా అడుగుతుంటే అమ్మలు ఇద్దరు ఎలా నవ్వుతున్నారు. అందుకే వాళ్ళ ముందు ఏమీ అడగకండి అని అలకగా చెబుతుంది.
మీ అమ్మల గోల ఎప్పుడూ ఉండేదే కానీ అమ్మ జాగ్రత్త కొత్త వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇస్తే తినకమ్మ అని చెబుతారు.
పక్కనుంచి జయంతి అది ఏమైనా చిన్నపిల్ల. ఆలా చెబుతున్నారు అంటే.. నీకెందుకు జయంతి మేమేదో చెప్పుకుంటుంటే ఎందుకు మధ్యలోకి వచ్చేస్తారు అని శివ గారు చిరాకు పడతారు.
సరే బాబు మేము ఎవరో రాము బాబు కూతుర్లు మాట్లాడుకోండి. పద ధరణి మనకు టైం అవుతుంది అని చెప్పి తీసుకెళ్లి పోతుంది.
సరే నాన్న నాకు టైం అవుతుంది సాయంత్రం చేస్తాను అని చెబుతుంది. సరే అమ్మ జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేసి పక్కకు తిరగగానే నివాస్ చూస్తూ ఉంటాడు.
ఏమైంది బావ అలా చూస్తున్నావు అంటే.... నిన్ను మరీ ఇలా చిన్న పిల్లల ట్రీట్ చేస్తూ ఉంటే, రేపు అన్న రోజు నీకు చాలా కష్టం కదా శాంభవి అంటాడు.
ఎందుకు కష్టం బావ అంటే.. అది ఇప్పుడు అర్థం కాదులే అనుకుంటు వెళ్ళిపోతాడు.
బృందావనం
రిపోర్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. దేవేంద్ర గారు అయితే రాత్రంతా నిద్ర పోకుండా తిరుగుతూ పచార్లు చేస్తూనే ఉంటారు.
విహాన్, అద్వైత్ ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే రాఘవేంద్ర గారు అడుగుతారు. విహాన్ రిపోర్ట్ వచ్చాయా అని...
హ, తాతగారు ధీరజ్ ఇప్పుడే మెసేజ్ చేశాడు. చూస్తున్నాను అని చెప్పి... స్టూడెంట్స్ అందరివి వరుసగా చూస్తూ ఉంటాడు.
ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా అని... ఒక రిపోర్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి విహాన్ చేతిలో వణుకుతున్నాయి.
ఏమైంది విహాన్ అనగానే, ఆ రిపోర్ట్స్ దేవేంద్ర గారి ముందు పెడతాడు.
దేవేంద్ర కి ఆ రిపోర్ట్స్ చూసి కళ్ళంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. రాఘవేంద్ర, జితేంద్ర,, కౌసల్య చాలా ఆత్రుతగా చూస్తూ ఉంటారు.
విషయం ఏంటో చెప్పు రా ముందు.. నిన్ను అలా చూస్తుంటే మాకు చాలా కంగారుగా ఉంది అంటే...
నాన్న నా కూతురు దొరికేసింది అని ఆనందంతో చెప్తారు. రాఘవేంద్ర గారు పూజ గది వైపు చూస్తా అమ్మా ఇన్ని సంవత్సరాలకు మమ్ములు కరుణించావా.
అమ్మాయిని ఎలాగైనా తీసుకు వస్తాను అని దండం పెట్టుకుంటారు. ఇంటి ముందు కారు ఆగుతుంది. రుద్ర చాలా స్పీడ్ గా వస్తాడు చారులత సంతోష్ తులసి గారు కూడా వస్తూ ఉంటారు.
రాఘవేంద్ర తులసిని చూసి చెల్లమ్మా ఇన్నాళ్లకు మా ఇంటి దీపం మళ్లీ తిరిగి మా ఇంటికి వస్తుంది .. ఈ ఆనందాన్ని ఎలా చూపించాలో కూడా తెలియడం లేదు అని భావోద్వేగంతో చెబుతారు.
అన్నయ్య మీరు ఇంత ఆవేశపడకండి. మనవరాలు వస్తుంది కదా! మనవరాలు తో ఎన్నో ముచ్చట్లు చెప్పాలి.
ఇన్నేళ్లు తన జీవితంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి అని ఆనందంగా చెబుతుంది. ధీరజ్ కూడా తన పేరెంట్స్ రమణ, మాధురి తీసుకుని చాలా ఆనందంగా అక్కడికి వస్తాడు.
రమణ స్పీడ్ గా వచ్చి దేవేంద్రుని హత్తుకొని ఎంత మంచి విషయం విన్నాము, చాలా ఆనందంగా ఉంది అనిచెబుతాడు.
అవును రమణ నాకు ఇప్పుడే వెళ్లి నా కూతుర్ని చూడాలని ఉంది. నన్ను నాన్న అని పిలిస్తే వినాలని ఉంది అని చాలా సంతోషంగా చెబుతాడు.
దానికి అందరూ అవును ఇప్పుడే వెళదాము అంటే...రుద్ర ఆపుతాడు ఆగండి తాతయ్య అనగానే... ఎందుకు రుద్ర మమ్మల్ని ఆపుతున్నావు అని అడుగుతారు.
మీకు మనవరాలను తెలిసింది కానీ... తనకి మీరు ఫ్యామిలీ అని తెలియదు కదా! ఇప్పుడు వెళ్లి మేమే నీ ఫ్యామిలీ, ఇప్పుడు దాకా నీతో ఉన్న వాళ్ళు కాదు అని చెబితే తన పరిస్థితి ఏమిటి??
తన అర్థం చేసుకోగలుగుతుందా, తట్టుకోగలుగుతుందా... ఒకసారి ఆలోచించండి తాతయ్య అనగానే... అందరూ ఒక్కసారిగా నీరు కారిపోతారు.
ఇప్పుడు ఎలా రా అని దేవేంద్ర చాలా బెలగా అడుగుతాడు. చిన్న మామ మీరు కంగారు పడకండి.
మనం మెల్లిమెల్లిగా తనకి దగ్గరవుతాము. పరిస్థితి ఇది అని అర్థమయ్యేటట్టుగా చెబుదాము.
ఇప్పుడే మనం చెప్పాము అనుకుంటే... తన తప్పుగా అర్థం చేసుకుంటే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. శత్రువులకు కూడా మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము.
అవును బాబాయి రుద్ర చెప్పింది కూడా నిజమే అని విహాన్ ముందుకు వస్తాడు. తను మన ఆఫీసులోనే ఉంది కదా!
మెల్లిగా దగ్గరవుదాము అని చెప్పి అందర్నీ ఆపుతారు. సరే అయితే నా కూతుర్నే మాత్రం నేను వెంటనే చూడాలి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తాను అని చెప్పి రెడీ అవ్వడానికి అని దేవేంద్ర వెళతారు.
తులసి రాఘవేంద్రని అన్నయ్య అని పిలుస్తుంది. చెప్పమ్మా అనగానే.. ఇప్పటికైనా వదిన క్షమించి మాట్లాడొచ్చు కదా అంటే...
నువ్వు ఏమైనా అడుగు ఇస్తాను. అది మాత్రం అడగవద్దు. ఒక తండ్రి నన్ను అడిగిన దానికి ఇప్పటికి నేను సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను.
ఆ పరిస్థితికి అంతటికి కారణం ఎవరు తులసి అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతారు.
అందరూ రెడీ అవ్వడానికి వెళ్తే కౌసల్య, చారులత స్వీట్ తయారు చేస్తూ ఉంటారు. ఈరోజు ఎలాగైనా మనమే తినిపించాలి వదిన అనుకుని స్వీట్ చేస్తారు.
అందరూ ముందే ఆఫీస్ కి వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంప్లాయిస్ అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు.
రాఘవేంద్ర గారు ఇంకా రాదేంటిరా అమ్మాయి అంటే తాతయ్య మనకి తెలిసింది కదా అని చెప్పి తను వస్తదా, తన టైంకి తను వస్తది అని చెప్పి రాఘవేంద్ర గారిని శాంతింప చేస్తూ ఉంటారు.
దేవేంద్ర మాత్రం ఎంట్రన్స్ దగ్గరే ఉంటాడు. ఎప్పుడెప్పుడు తన కూతుర్ని చూస్తానా అని.
అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి నివాస్, గౌతమ్, మిత్ర, శాంభవి దిగుతారు.
శాంభవి, సాయంత్రం మీకోసం ఇంకొక కారు వస్తుంది. డ్రైవర్ కూడా వస్తాడు. బట్ నాకు కాల్ చేసి చెప్పిన తర్వాత మాత్రమే మీరు బయలుదేరండి అని చెప్పి జాగ్రత్త శాంభవి అని ఒకటికి పది జాగ్రత్తలు చెప్తాడు.
బావ నేను జాగ్రత్తగా ఉంటాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పి లోపలికి వస్తుంది. మిత్ర, శాంభవి కలిసి వస్తూ ఉంటారు.
వాళ్ళని అలా చూసిన దేవేంద్ర గారికి వెంటనే వెళ్లి కూతురిని గుండెలకి హత్తుకోవాలి అని అనిపిస్తుంది. అలా చేస్తే తన కూతురికి ప్రమాదం అని ఆయన చాలా కంట్రోల్లో ఉంటారు.
దేవేంద్రని అలా చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నా కొడుకుకి భగవంతుడు ఎంత పరీక్ష పెట్టాడో చూడు జితేంద్ర.
కూతురు కళ్ళు ఎదుట ఉన్నా సరే దగ్గరికి తీసుకోలేని నిస్సహాయ స్థితి. ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నాయి. కూతురి ప్రేమ కోసం అల్లాడిపోతున్నా ఒక బికారి లాగా నా కొడుకు నుంచున్నాడు అని రాఘవేంద్ర బాధపడతాడు.
నాన్న ఏంటా మాటలు అని చారులత దగ్గరికి వస్తుంది. నిజమే కదా అమ్మ అని బాధగా అంటారు. ఆ మాటలకు అందరికీ గుండెలు బరువెక్కుతాయి.
శాంభవి, మిత్ర అమ్మవారి ముందు నుంచుంటారు. వాళ్ళు వెనకాల దేవేంద్ర నిలబడి చూస్తూ ఉంటాడు.
ఒకసారి ఆలోచించు శాంభవి మనకెందుకే ఇవన్నీ, వాళ్ళు ఏ పర్పస్ మీద ఇక్కడ దీపం పెట్టలేదు తెలియదు కదా అంటే..
సరే అయితే ఒకసారి మనం పర్మిషన్ అడుగుదాము ఇస్తే అప్పుడు దీపం పెడదామని చెప్పి, ఎవరైనా ఉన్నారా అని వెనక్కి తిరిగి చూస్తుంది.
అక్కడ దేవేంద్ర గారు కనిపిస్తారు. సార్ అని పిలుస్తుంది. చెప్పమ్మా అనగానే..
ఇక్కడ ఎందుకు దీపం పెట్టడం లేదో నాకు తెలియదు. కానీ దీపం లేకుండా అమ్మవారి విగ్రహం ఉంటే ఎందుకో వెలితిగా ఉంది.
మీకు ఇబ్బంది లేదు అనుకుంటే.. దీపం పెట్టమంటారా అని అడుగుతుంది. దానికి దేవేంద్ర గారు సంతోషంగా వెలిగించి తల్లి అని చెబుతారు.
ఇదంతా సీసీలో చూస్తున్న రాఘవేంద్ర గారు నేను కూడా కిందకి వెళుతున్నాను. ఎవరైనా రావాలి అనుకుంటే రండి లేదు అంటే పైనే ఉండండి అని చెప్పి రాఘవేంద్ర గారు కిందకు వస్తారు.
రుద్ర మాత్రం చాలా ఫోకస్ గా శాంభవి ని చూస్తూ ఉంటాడు. ఆరోజు శాంభవి మెరున్ కలర్ చుడీదార్ వేసుకుంటుంది.
శాంభవి నీ నే చూస్తున్నా రుద్ర గుండె చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు నా హార్ట్ ఇంత రైస్ అవుతుంది అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు. కానీ శాంభవిని చూస్తూనే ఇలా అవుతుంది అని మాత్రం అర్థం అవ్వదు.
శాంభవి అమ్మవారు ముందు అన్ని అలంకరణ చేసి దీపం వెలిగించి. అమ్మవారి అష్టోత్తరం చదువుతుంది..ఆ గాత్రం వినగానే దేవేంద్ర కి పాత స్మృతుల గుర్తుకు వస్తాయి.
రాఘవేంద్ర కి కూడా దీపం వెలగగానే ఎంతో సంతోషం వస్తుంది. ఇన్నాళ్లకు మమ్మల్ని కరుణించావా తల్లి అని నమస్కారం చేసుకుంటారు.
జితేంద్ర విహాన్ వంక చూస్తూ శాంభవికి ఫుల్ సెక్యూరిటీ పెట్టండి. ఈ విషయం మయూరి వాళ్ళకి తెలిస్తే ఏదో విధంగా అటాక్ చేయడానికి చూస్తారు.
దానికి ధీరజ్ ఆల్రెడీ మేము పెట్టేసాము అంకుల్ అని చెబుతాడు. చాలా స్పీడ్ గానే ఉన్నారు అంటే...ఎప్పుడో అని.
ఇంకా మీకు చాలా విషయాలు తెలియాలి అంటాడు. రుద్ర వెంటనే అవన్నీ ఇప్పుడు కాదు...సైలెంట్ గా ఉండని చెబుతాడు.
దీపం వెలిగించిన తర్వాత తను తీసుకొచ్చిన హల్వా కూడా అక్కడ పెట్టి దండం పెట్టుకుంటుంది. పూజ పూర్తి చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే దేవేంద్ర, రాఘవేంద్ర గారి అక్కడే నిలబడి చూస్తుంటారు.
శాంభవి ఇబ్బందిగా చూస్తూ నిలబడి ఉంటుంది. ఎందుకమ్మా అంత ఇబ్బంది పడుతున్నావు. ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు అని రాఘవేంద్ర గారు వచ్చి తల మీద చేయి వేస్తారు.
చిన్న చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది. నైవేద్యం కూడా ఏదో చేసుకుని వచ్చినట్టున్నావు అని అడుగుతారు.
దానికి శాంభవి నిన్న అద్వైత్ సార్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సార్ కి థాంక్స్ చెప్పి ఇద్దామని స్వీట్ చేసుకొచ్చాను అని చెబుతోంది.
రాఘవేంద్ర గారు ఆ బాక్స్ తీసుకొని నేను ఇస్తాను లేమా అని అంటారు.
థాంక్యూ సార్ అంటే.. సార్ వద్దు తాతయ్య అని పిలువు అంటారు. మీరు ఈ కంపెనీ చైర్మన్ సర్.
మిమ్మల్ని ఎలా పిలిచేది అంటే.. మీ తాతగారి వయసే కదా! పర్వాలేదు పిలువమ్మా అని చెబుతారు సరే తాతగారు అని చెప్పి, శాంభవి, మిత్ర, గౌతమ్ తో కలిసి లోపలికి వెళ్ళిపోతుంది.
ఆ బాక్స్ దేవేంద్ర చేతికిచ్చి నీ కూతురి చేతి వంట ముందు నువ్వే టెస్ట్ చూడు దేవేంద్ర అనే క్యాబిన్లోనికి తీసుకువెళ్తారు.
చారులత ధీరజ్ ని పిలిచి ఎలాగైనా ఈ స్వీటు మా చేతులతో మేమే శాంభవికి తినిపించాలి.
అరేంజ్మెంట్స్ ఏమైనా చేయగలవా అంటే... అత్త మీకు ఆనందం వచ్చిన, ఆవేశం వచ్చిన తట్టుకోలేము. అలా వెళ్లి ఎలాగా చేయగలము అని అడుగుతాడు.
ఏదో ఒకటి చేయండి రా! ఇంత వరకు వచ్చాక ఆగాలంటే చాలా కష్టంగా ఉంది అంటే...
సాయంత్రంలోపు ఏదో ఒకటి చేద్దాం. మీరు ఆవేశపడకండి అని ఆపుతాడు.
రాఘవేంద్ర దేవేంద్ర లోపలికి వస్తారు. దేవేంద్ర చేతులోని బాక్స్ చూసి..ఏమిటి అది అని అడుగుతారు.
నా కూతురు చేతి వంట చారు అని చెప్పి బాక్స్ ఓపెన్ చేస్తాడు. అన్నయ్య నీకు ఇష్టమైన స్వీట్ నీ కూతురు చేసుకుని వచ్చింది.
అద్వైత కోసం తెచ్చిందంట అని చెప్పి నవ్వుతారు. ముందు నువ్వే టెస్ట్ చూడు అన్నయ్య అని ఒక స్పూన్ తీసుకోని నోట్లో పెడుతుంది.
దేవేంద్ర కు ఆనందంతో కళ్ళలోంచి నీళ్లు కారుతాయి. అందరూ శాంభవి వంట రుచి చూడాలి అని ఒక్కొక్క స్పూన్ నోట్లో పెట్టుకుని టేస్ట్ చూస్తారు.
ధీరజ్ ఒక స్పూన్ తో దుద్ర దగ్గరికి వెళ్లి బావ ఈరోజు నీ డైట్ పక్కనపెట్టి నీ మరదలు చేతి వంట టేస్ట్ చూడు అంటే...
అది నాకు తెలుసులే గాని నువ్వు ముయ్యి అని చెప్పి ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు.
పర్వాలేదు మరదలు వంట బానే ఉంది అనుకుంటాడు. అందరూ అద్వైత్ కి థాంక్స్ చెప్పాలని ధీరజ్ అంటే... దేనికి అంటాడు.
నీ గురించే స్వీట్ చేసుకోవచ్చింది . అందరం టేస్ట్ చేసాము కదా అని అంటే.. అందరూ నవ్వుతారు.
చాలా రోజుల తర్వాత అందరూ చాలా మనస్ఫూర్తిగా నవ్వుతారు..
ఈ నవ్వులు ఇలాగే ఉంటాయా??
G. B యూత్ ఆ నవ్వులకి కాపలాగా ఉండగలుగుతారా??
కథ కొనసాగుతుంది.....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)