Thread Rating:
  • 6 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చాక్లెట్ (short story)
#20
గంట తర్వాత అతను గబ గబ రెడీ అవుతుంటే"ఇదేమిటి లీవ్ కదా"అంది ప్రియ.

‎ "మీటింగ్ ఉంది ,ఫోన్ చేశారు"అన్నాడు వెళ్తూ.

‎ అతను వెళ్ళేసరికి sp office లో మీటింగ్ మొదలు అయ్యింది.
‎ "మన జిల్లా లోకి డ్రగ్స్ కలిపిన వస్తువులు వస్తున్నాయి.ఏమి చేస్తున్నారు మీరు"అంది sp.

‎ ఆమె కొత్తగా వచ్చింది.
‎ కొందరు ఇన్స్పెక్టర్ లు"అలాంటిది ఏమి లేదు,మేడమ్"అన్నారు.

‎ "నిన్న delhi లో మీటింగ్ జరిగింది.కొన్ని జిల్లాల్లో డ్రగ్స్ పెరుగుతున్నాయి అని రిపోర్ట్ చేశారు.ఈ జిల్లా పేరు కూడా ఉంది"అంది.

‎ తీసుకోవాల్సిన జాగ్రత్తలు,చెకింగ్ పాయింట్ లు పెంచడం గురించి మాట్లాడారు.

‎  అందరూ వెళ్ళాక గోపి టీమ్ తో మాట్లాడింది sp.
‎ "మీ డిపార్ట్మెంట్ ఐడియా ఏమిటి"అంది.

‎ "మేడమ్ ఈ మధ్య బోర్డర్స్ లో,డ్రగ్స్ దొరికాయి.చూడటానికి బిస్కట్ ,చాక్లెట్ ల లాగా ఉంటున్నాయి"అంటూ వివరాలు చెప్పాడు.

‎ ఆమె విని"ఇంత నెట్వర్క్ ఉంది అంటే ఈ జిల్లా లో ,అమ్మి పెట్టే సెల్లర్స్ ఉంటారు"అంది.

‎ గోపి సాయంత్రం ఇంటికి వచ్చాక ముగ్గురు మూవీ కి వెళ్ళారు.

‎ "ఏమిటో ఆదివారం కూడా బిజీ"అంది
‎ ఇంటర్వెల్ టైమ్ లో ఏదో తింటూ బాల్కనీ వద్ద నిలబడ్డారు.
‎ అతను చెప్పేది వింటూ కిందకి చూసింది.
‎ అక్కడ జహీరా ఎవరితోనో మాట్లాడుతూ వాడు ఇచిన బ్యాగ్ తీసుకుంది.

‎ ఇంటికి వెళ్తూ"నేను రేపు delhi వెళ్ళాలి"అన్నాడు దారిలో గోపి.

‎ ప్రియ వింతగా చూసి"మీరు చేసే ఉద్యోగానికి ఈ టూర్ లు ఏమిటి.పైగా ఒక్కోసారి రెండు , మూడు రోజులు ఆఫీస్ లోనే ఉంటున్నారు"అంది.
‎ "సెక్షన్ మార్చారు.అందుకే ఇలా"అన్నాడు.

‎ తెల్లారక అతను ఎయిర్పోర్ట్ కి వెళ్ళేసరికి,ఆఫీసర్ కూడా ఉన్నాడు.
‎ ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు,రెండు గంటల్లో.

‎ నార్కోటిక్స్ వాళ్ళతో కలిపి జాయింట్ మీటింగ్ పెట్టాడు హోమ్ మినిస్టర్.

‎ దాదాపు మూడు గంటలు నడిచింది మీటింగ్.

‎ హోటల్ రూమ్ కి వెళ్తున్నపుడు"నన్ను ఇందులోకి బదిలీ చేస్తుంటే జీతం ఎక్కువ అని ఒప్పుకున్నాను.
‎ కానీ ఇదంతా చూస్తుంటే భయం గా ఉంది సర్"అన్నాడు గోపి.
‎ ఆయన కూడా"నేను ఎవరికి చెప్పుకోవాలి.ఈ డిపార్ట్మెంట్ లో ఖాళీలు ఎక్కువ అని,మన అందరిని తెచి పడేసారు.
‎ ఎవరైనా గ్యాంగ్ వాళ్ళకి మన గురించి తెలిస్తే,డేంజర్"అన్నాడు.

‎ తెల్లారక మళ్ళీ ఫ్లైట్ లో వెనక్కి వచ్చేశారు.
‎ అతను ఇంటికి వెళ్ళేసరికి ప్రియ లేదు,ఆఫీస్ కి వెళ్ళిపోయింది.
[+] 7 users Like mister11's post
Like Reply


Messages In This Thread
RE: చాక్లెట్ - by Uday - 16-03-2026, 06:28 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 22-03-2026, 10:39 AM



Users browsing this thread: 1 Guest(s)