Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరణ శాసనం
#78
Part - 27

"పంచవక్రి ని ఎదిరించడం సాధారణమైన విషయం కాదు...బంధించడం దాదాపు అసాధ్యం...కానీ ఒక దారి ఉంది..కానీ అది చాలా ప్రమాదకరమైనది..
ఈ పనిలో ఒక చిన్న తప్పు జరిగినా అతనితోపాటు చుట్టూ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు.."అని చెప్పారు సిద్ధ భైరవులు

"ఏం పని స్వామి..?" అని అడిగారు ఇద్దరు.

"పంచవక్రి చుట్టూ దాని 3 అనుచర గణాలు ఉంటాయి. వాటి శక్తి చాలా భయంకరమైనది.."

" అవును స్వామి..!! మేము వాటిని ఎదిరించడానికి మేము చాలా కష్టపడ్డాం..!!"

" కానీ మీరు ఎదుర్కొన్నది రెండింటిని మాత్రమే..!! అసలైనది కరోముఖి..!! దానికి ఈ రెండిటికి మించిన శక్తి ఉంటుంది. విర్కొర,విస్కర్ష శత్రు నాశనం చేస్తాయి..
కరోముఖి మాత్రం ఎవరైనా పంచవక్రిని అడ్డుకోవాలని చూస్తే తన మాయతో శత్రువుని ఏమార్చి భయంకరంగా చంపేస్తుంది.. కాబట్టి మొదట వీటిని బంధిచగలిగితే,పంచవక్రిని ఎదిరించవచ్చు." అని చెప్పారు సిద్ధ భైరవులు..

" స్వామి నాకు ఒక చిన్న సందేహం..
దాని అనుచర శక్తులను బంధిస్తే పంచవక్రిని సులభంగా ఎదిరించవచ్చా..??"అని అడిగాడు ఆదిత్య...

నా మాటలకి సిద్ధ భైరవులు పగలబడి నవ్వారు...

ఆయన అలా నవ్వుతుంటే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు..

"పంచవక్రీ అనుచరగణలు చాలా శక్తివంతమైనవి..
వాటిని బంధించాలి అంటే సామాన్యమైన తాంత్రికుడు వల్ల కాదు.."

"వీటితో పోలిస్తే పంచవక్రి శక్తులు అసామాన్యమైనవి..
పంచవక్రిని నేరుగా ఎదిరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ ఎదిరించాలి వస్తే తాంత్రిక శక్తి తో పాటు దైవానుగ్రహం కూడా మనకి ఉండాలి.. దాని శక్తి గురించి చెప్పాలి అంటే .ఒక శక్తివంతమైన అస్త్రం లాంటిది..
నిర్దిష్ట గమ్యం లేకుండా ప్రయోగిస్తే భయంకర వినాశనం జరుగుతుంది. ఇప్పుడు దానికి గమ్యం నువ్వే..!! నిన్ను తప్ప వేరే ఎవ్వరిని చంపదు.!! కానీ....!!"అంటూ మధ్యలో ఆపేశారు సిద్ధ భైరవులు..

" ఏం స్వామి..! మధ్యలో ఆపేశారే..?"అని అడిగాడు ఆదిత్య..

"కానీ నిన్ను మాత్రం చాలా హింసించి, హింసించి చంపుతుంది.. ఆ బాధ మాటల్లో చెప్పలేనిది ఆదిత్య..! ఇంతటి భయంకరమైన శక్తిని నీ మీద ఎందుకు ప్రయోగించారో నాకు అర్థం కావడం లేదు."అని బాధపడ్డారు సిద్ధ భైరవులు..

ఆ మాటలు విన్న ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు..

"స్వామి అది..!! ఇందాక ఒక మార్గం ఉంది అన్నారు కదా.. అది ఏమిటి..?"అని అడిగాడు రుద్ర...

"అవును.. ఒక మార్గం ఉంది కానీ..,
అది చాలా ప్రమాదకరమైనది. కష్టతరమైనది.."

"దయచేసి ఏమిటో చెప్పండి స్వామీ..!!"

"దాని 3 అనుచర గణాలను, ఏకకాలంలో
చక్ర బంధనం చేసి,కట్టడి చేస్తే,పంచవక్రి నుండి ఆదిత్యని కాపాడడం మనకి సులభమవుతుంది."

"మరి పంచవక్రి ని ఎదిరించడం ఎలా స్వామి..?"అని అడిగాడు ఆదిత్య..

"ఇది సమాధానం లేని ప్రశ్న నాయనా..!! ఇప్పటివరకు దాని నుండి తప్పించుకోవడం, ఎదిరించడం ఎవరి తరమూ కాలేదు.. దాని శక్తి ముందు ఎంత పెద్ద తాంత్రికుడు  అయినా సరే నాశనం కావాల్సిందే.."అంటూ బాధపడ్డారు..

" కానీ స్వామి..!! ఎవరు ప్రయోగించారో తెలుసుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందా...??"అని అడిగాడు రుద్ర.

" కొంతమేర ఫలితం ఉండొచ్చు.. ఎందుకంటే కారణం తెలిస్తే దానికి తగ్గ పరిష్కార మార్గం ఆలోచించవచ్చు..!?"

" అదే ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు స్వామి..!!" అని విచారంగా అన్నాడు రుద్ర..

" ఈ సమస్య మొదలైన చోటే వెతుకుదాం.
ఏదైనా ఆధారం దొరికే అవకాశం ఉంది."
అన్నాడు ఆదిత్య...

"సరే అయితే, రేపే బయలుదేరుదాం.." అన్నాడు రుద్ర...

"మంచిది..!నాయన వెళ్లి రండి...!"అన్నారు సిద్ధ భైరవులు..

"మరి మీరు మాతో రా..రా స్వామి..??" అని అడిగాడు రుద్ర..

" నేనా ఎక్కడికి..? ఇదే నా నివాసం..!"

" స్వామి..!మీ కోసం గ్రామంలో అందరూ ఎదురుచూస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వారందరూ ఎంతో బాధ పడుతున్నారు.దయచేసి మీరు తిరిగి గ్రామానికి వెళ్ళండి. వాళ్ల పరిస్థితి అస్సలు బాగోలేదు చాలా బాధపడుతున్నారు.. మేము స్వయంగా మా కళ్ళతో చూసాము.దయచేసి మీరు కూడా మాతో పాటు వస్తే మేము చాలా సంతోషిస్తాము..." అన్నాడు ఆదిత్య..

" అవును స్వామి..!! మీరు ఒక్కరే ఇక్కడ ఉండడంలో అర్థం లేదు.. వాళ్ళు తప్పు చేశారు కాదనడం లేదు. కానీ మీరు తండ్రి స్థానంలో ఉండి ఆలోచించండి. బిడ్డలు తప్పు చేస్తే తండ్రి దండిస్తాడు తప్ప, వాళ్లని దూరం చేసుకోడు కదా..!! దయచేసి రండి స్వామి..!! " అని బ్రతిమాలాడు రుద్ర..

వాళ్ల మాటలకు సిద్ధ భైరవులు లేచి నుంచున్నారు..

వాళ్ళని చూసి నవ్వుతూ..
" మంచి మనసులు నాయనా మీవి..!
మీకోసం వస్తున్నా పదండి..!"అంటూ వాళ్ళతో కలిసి బయలుదేరారు...

ముగ్గురు గుహ నుంచి బయటకు వచ్చారు.

అప్పుడే తెలతెలవారబోతోంది...

వాతావరణం మొత్తం ప్రశాంతంగా ఉంది..

ఆ ప్రశాంత వాతావరణాన్ని చూసి ముగ్గురు ఆనందించారు...

" ఒకప్పుడు ఈ అడవి శపించబడింది..
రాత్రి మీరు చేసిన పోరాటం వల్ల, ఆ దుష్ట శక్తులన్నీ అడవిని వదిలి వెళ్ళిపోయాయి..ఇప్పుడు ఈ అడవి పూర్తిగా సురక్షితం.. ఒకప్పుడు వాటితో పోరాడుతూ ఉండగానే నన్ను బంధించాయి..! మీరే నన్ను కాపాడారు.."అంటూ ముగ్గురు ముందుకు వెళ్లబోతుండగా...

వాళ్ళ వెనకాల ఒక కుక్క అరుపు వినిపించింది..

వెనక్కి తిరిగి చూడగా ఆ నల్లటి కుక్క వాళ్ళ వెనుక వస్తుంది..

దాన్ని చూసిన స్వామి నవ్వుతూ.. దాని దగ్గరికి వెళ్లి ముద్దు చేయసాగారు..

" ఇది ఎవరి కుక్క స్వామి..!!?? రాత్రి మాయమై పోయింది.మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమయింది..!" అని అడిగాడు ఆదిత్య..

"దీని పేరు భైరవ..!! ఈ అడవిలో చిక్కుకొన్న మంచి వాళ్ళ కోసం మంచ్రేకరుడు దీనిని సృష్టించి,ఈ అడవిలోకి వదిలారు.. అందుకే ఇది మీకు సహాయం చేసింది.. ఇది ఒకేసారి ఎన్ని కుక్కలగానైనా మారగలదు.. దుష్టశక్తులను ఎదిరించి పోరాడగలదు. దీనిని నాశనం చేయడం అసాధ్యం...!" దాని గురించి వివరించారు..

" మరి ఆ అమ్మాయిలను కాపాడడానికి ఇది ఎందుకు రాలేదు..??"అని అడిగాడు ఆదిత్య..

"చెప్పాను కదా..!! మంచి వాళ్ళ కోసమే వస్తుందని..!
మీ ప్రాణాలకు తెగించి, ఆ అమ్మాయిలను కాపాడదామని వచ్చారు.. వాళ్లని కాపాడారు. వారిని కాపాడే ప్రయత్నంలో మీ ప్రాణాలను పణంగా పెట్టారు. అందుకే మిమ్మల్ని కాపాడడానికి ఇది వచ్చింది...!"అంటూ దాని తలపై రాస్తూ చెప్పారు సిద్ధ భైరవులు.

అలా మాట్లాడుకుంటూ ముగ్గురు అడవి నుంచి బయటపడ్డారు..

వాళ్లు అడవి నుంచి బయటకు వచ్చేసరికి సెక్యూరిటీ ఆఫీసర్లు,గ్రామస్తులందరూ అక్కడే వారి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు..

సిద్ధ భైరవులు తిరిగి రావడంతో, వారి ఆనందానికి అవధులు లేవు.. అందరూ సామూహికంగా వచ్చి ఆయనకు క్షమాపణ చెప్పుకున్నారు..

ఆదిత్య రుద్ర కాపాడిన అమ్మాయిలు కూడా వారి దగ్గరకు వచ్చి థాంక్స్ చెప్పారు...

వారిద్దరు సిద్ధ భైరవుల తో సహా తిరిగి వచ్చినందుకు అశ్వంత్ చాలా సంతోషించాడు..

అలా అందరికీ వీడ్కోలు చెప్పి తిరిగి ప్రయాణం అయ్యారు...

అలా వాళ్ళు శ్రీశైలం వచ్చేసరికి, చీకటి పడింది..

ఇద్దరూ మంజునాథ రావు గారి ఇంటికి చేరుకున్నారు.. ఇద్దరూ ఇంటికి వస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పలేదు..

ఇద్దరూ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి గోవింద రావు గారు, మంజునాథ రావుగారు,అప్పుడు హాల్ లోనే ఉన్నారు..

ఇద్దరూ అలా సడన్ గా వచ్చేసరికి  ఆశ్చర్యపోయారు.. వెంటనే పైకి లేచి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చారు.

"మీరు రావడానికి చాలా రోజులు పడుతుందని ఇప్పుడే అనుకుంటున్నాం.. ఇంతలోనే మీరు వచ్చారు..!! నూరేళ్లు మీకు..!!"అని అన్నారు గోవింద రావు..

" ప్రయాణం బాగా జరిగిందా..?వెళ్లిన పని సుఖంగా జరిగిందా బాబు...?"అని అడిగారు మంజునాథ రావు..

" బాగానే జరిగింది గురువుగారు..!"అన్నాడు రుద్ర..

ఆదిత్య మాత్రం సమాధానం చెప్పకుండా అటు ఇటు చూడసాగాడు..

ఆదిత్య చూపులు పసిగట్టారు మంజునాథ రావు.

"భాను ఇప్పుడే బయటికి వెళ్ళింది. పదినిమిషాల్లో వస్తుంది బాబు...!" అన్నారు చిన్నగా నవ్వుతూ మంజునాథ రావుగారు..

ఆ మాటలకి ఆదిత్య సిగ్గుపడుతూ..
" అదేంలేదు తాతగారు.. మంచినీళ్ళు అడగడానికి ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాను..!!" అన్నాడు..

"ఒరేయ్ రావు..! వీడికి కూడా నీ సిగ్గే వచ్చిందిరా..!
నీకు తగ్గ మనవడు..!" అంటూ నవ్వుకున్నారు.

"చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా.. ముందు వెళ్లి స్నానం చేసి విశ్రాంతి తీసుకోండి.తర్వాత మాట్లాడుకుందాం." అన్నారు గోవింద రావు...

సరేనని ఇద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్లారు.

కొద్దిసేపటికి రుద్ర స్నానం చేసి,హాలులోకి వచ్చాడు.


ఇంతలో భాను అక్కడికి వచ్చింది..

రుద్ర చూసి ఆశ్చర్యపోయి..
" అప్పుడే వచ్చేసారా..!? ఆదిత్య గారు ఏరి..?"అని రుద్ర ని అడిగింది...

రుద్ర సమాధానం చెప్పబోతుండగా, మంజునాథ రావు కలగజేసుకుని " రుద్ర ఒక్కడే వచ్చాడు తల్లి. హళేబీడులోని శివాలయంలో ఆదిత్య చేత ఏవో పూజలు చేయిస్తున్నారు.. ఆదిత్య కి సంబంధించిన సామానుల కోసం రుద్ర ఒక్కడే వచ్చాడు. ఆదిత్య రాలేదు.." అని అన్నారు..

ఆ మాటలు విన్న భాను ముఖం మాడిపోయింది.

ఎవరితో మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది..

అది గమనించిన రుద్ర " అదేమిటండీ.? అలా చెప్పారు.? పాపం చూశారా..! ఎలా బాధపడుతూ వెళ్ళిపోయిందో..?" అంటూ నోచుకున్నాడు రుద్ర..

రుద్ర మాటలను సమర్థించాడు గోవింద రావు..
" ఎందుకురా.. ఆ పిల్లని అలా బాధ పెట్టావు..నువ్వు కుదురుగా ఉండవు కదరా..!!?"అంటూ మంజునాథ రావు ని తిట్టారు..

ఆ మాటలకి పగలబడి నవ్వుతూ...!!
"రేయ్ రావు..! మీకు తెలియంది కాదు కదరా..!!
ఎదురు చూపుల్లోనే ప్రేమ బలపడుతుంది..!
అయినా ప్రవరాక్యుడు లాగా అమ్మాయిలకు దూరంగా ఉండేవాడివి.. ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి..??"అన్నారు మంజునాథ రావు..

ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆదిత్య అక్కడికి వచ్చాడు...

" ఏదో మాట్లాడుకుంటున్నారు..??"అని ఆదిత్య అడగగానే, అప్పటి వరకు జరిగిందంతా చెప్పేసాడు రుద్ర..

" పాపం తాతయ్య గారు..! ఎందుకలా తనని ఏడిపించారు..?" అంటూ భాను గదికి పరిగెట్టాడు..

"ఇప్పుడు వీడు పరిగెట్టాడు..!"అంటూ నవ్వడం మొదలు పెట్టారు గోవింద రావు..ఆయన నవ్వుతూ శృతి కలిపారు ఇద్దరు..

ఆదిత్య భాను గది కి వెళ్ళేసరికి బోర్లా పడుకొని ఉంది..

మెల్లగా తన దగ్గరకు వెళ్లి తలపై చెయ్యి వేసాడు.

"నాకు ఆకలిగా లేదు.. మీరు వెళ్లి తినండి.. తాతయ్య..!!" అని అంది..

" నువ్వు తినకపోతే నేను కూడా తినను..!!" అన్నాడు ఆదిత్య..

ఆదిత్య గొంతు వినగానే వెంటనే తల తిప్పి చూసింది..

ఎదురుగా ఆదిత్య కనిపించగానే ఆనందంతో గట్టిగా కౌగిలించుకుని,ముఖం పై ముద్దులతో
ముంచెత్తింది...

"అబ్బో..!! నన్ను చాలా మిస్ అయినట్టున్నావ్..?" అని నవ్వుతూ అడిగాడు.. ఆదిత్య..

" మరి అవ్వనా..?? మీరు వెళ్ళాక చాలా బాధపడ్డాను.. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చెయ్యాలో అని అనుకున్నాను. కానీ లక్కీగా మీరు తిరిగి వచ్చారు.." అని చెప్పింది.

"సరే పద.. ఇంకా ఎక్కువ సేపు ఇక్కడే ఉంటే,ఇక మనల్ని అందరూ ఆడేసుకుంటున్నారు." అని ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు..

"ఏరా బుజ్జగింపులు అయిపోయాయా..?"
అని నవ్వుతూ అడిగాడు గోవింద రావు..

" మా భాను ముఖం చూడు.ఆదిత్య రాగానే వెలిగిపోతోంది.." అంటూ నవ్వారు మంజునాథ రావు..

ఆ మాటలకి అందరూ నవ్వుకున్నారు..

"సరే గాని, ఇంటికి వెళ్లిన పని ఏమైంది..?"
అని అడిగారు గోవింద రావు..

ఇద్దరూ కలిసి హలేబీడు లోని జరిగిన సంగతులన్నీ వాళ్ళతో చెప్పారు. జరిగిందంతా విని అందరూ సంతోషించారు..

భోజనం టైం అవడంతో అందరూ భోజనాలు పూర్తి చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి పోయారు.

ఆ తర్వాత ఆదిత్య రుద్ర తమ తమ గదుల్లోకి వెళ్లిపోయారు..

అందరూ పడుకుండిపోయారు..

అదేరోజు రాత్రి....

సమయం 2 గంటలు కావస్తోంది.

రుద్ర కి మెలకువ వచ్చింది..

మెల్లగా పైకి లేచి, అక్కడ అంతకు ముందు సిద్ధం చేసుకున్న బ్యాగ్ తీసుకొని, మెల్లగా తన గది నుండి బయటకు వచ్చాడు..

అక్కడే ఉన్న కార్ కీస్ తీసుకొని, గది బయటకు వచ్చాడు..

ఇంటి గుమ్మం దాటి బయటికి వెళ్లబోతుండగా...

అప్పుడే మంచినీళ్ల కోసం బయటకు వచ్చిన గోవింద రావు రుద్ర ని చూశారు...

కార్ డోర్ తీసుకుని రుద్ర వెళ్లబోతుండగా...

"ఏమైంది రుద్ర..? ఇంత రాత్రివేళ ఎక్కడికి బయలుదేరావ్..??"అని కంగారుగా అడిగారు గోవింద రావు.

" అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది గురువుగారు..!! రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను...! ఆదిత్యతో చెప్పండి.."చెప్పి బయలుదేరుతుండగా..

"ఇంత రాత్రివేళ ఒక్కడివే ఏం వెళ్తావ్..! ఆదిత్యని కూడా తీసుకెళ్ళు..!! ఒక నిమిషం ఆగు..!
ఆదిత్య ని పిలుస్తాను..!" అంటూ పిలవబోతుండగా..

"వద్దు గురువుగారు..! నేను ఒక్కడినే వెళ్తాను..!"
అంటూ ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండా కంగారుగా వేగంగా కారు ఎక్కి వెళ్ళిపోయాడు..

రుద్ర ప్రవర్తన గోవింద రావు గారికి విచిత్రంగా తోచింది.. అతని ముఖంలో కంగారుని గమనించారు..

వెంటనే ఆదిత్య గది దగ్గరికి వెళ్ళారు..

ఆదిత్య నిద్రపోతున్నాడు. పడుకున్నవాడిని లేపారు..

నిద్రలేచిన ఆదిత్య తన గదిలో ఉన్న గోవింద రావు ని చూసి " ఏమైంది తాతయ్య.? ఇంత రాత్రి వేళ నా గదిలోకి వచ్చారు.? ఏదైనా సమస్య..??" అని కొంచెం కంగారుగా అడిగాడు..

"రుద్ర సడన్గా వాళ్ల ఇంటికి వెళ్లాడు. దేనికి అని అడిగితే వాళ్ళ అమ్మగారు నుండి ఫోన్ వచ్చిందని చెప్పి కంగారుగా వెళ్ళాడు.."అని అడిగారు.

ఆ మాటలు విన్న ఆదిత్య కి నిద్ర మత్తు వదిలిపోయింది "ఇంత రాత్రి వేళ వెళ్లాడా..?? నాకు కూడా ఏమీ చెప్పలేదు.?"

" ఏమో.? కంగారుగా వెళ్ళిపోయాడు.."అని చెప్పారు గోవింద రావు.

ఆదిత్య వెంటనే రుద్ర మొబైల్ కి కాల్ చేశాడు..

రింగవుతున్నది గాని అటువైపు నుండి ఎటువంటి సమాధానం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా రుద్ర ఫోన్ అటెండ్ చేయడం లేదు..

ఆదిత్య కి ఏం చేయాలో అర్థం కాలేదు.. "తనకి కూడా చెప్పకుండా ఎంత అర్ధరాత్రివేళ ఒక్కడే ఎందుకు బయల్దేరాడు..?" అని ఆలోచించసాగాడు..

మరోపక్క.........!!

ఇంటి నుంచి బయలుదేరిన రుద్ర వేగంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు...

అంతకంటే వేగంగా అతని ఆలోచనలు ముందుకు సాగుతున్నాయి..

తన బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఆదిత్య నుండి ఫోన్లు రాసాగాయి.. ఫోన్ ఎత్తకుండా సైలెంట్ మోడ్ లో పెట్టాడు..

మెల్లగా అతని ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి..

గుహ నుండి బయటకు వచ్చేటప్పుడు, సిద్ధ భైరవులు ఆదిత్య తెలియకుండా కొన్ని విషయాలను రుద్రతో చెప్పారు..

" చూడు రుద్ర..! ఇది నీ మనసులో పెట్టుకో.. ఆదిత్యకి తెలియనివ్వద్దు.. మీరు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత, ఈ సమస్యలన్నిటికీ మూలం మీరు చెప్పిన చోటే ఉందని నాకనిపిస్తుంది.. కానీ ఆదిత్య ని ఆ ప్రదేశానికి దూరంగా ఉంచు.ఎందుకంటే వాటిని ప్రేరేపించిన స్థలం అదే అయి ఉంటుందని నాకనిపిస్తుంది. అటువంటి స్థలానికి ఆదిత్య వెళితే,  మీ చేతిలో ఓటమి చవి చూశాయి కనుక, తిరిగి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.. అతని ప్రాణానికి ముప్పు రావచ్చు.. కాబట్టి ఆ ప్రదేశానికి ఆదిత్యని దూరంగా ఉంచు. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించు.."అని సలహా ఇచ్చారు..

" సరే గురువుగారు..!! " అన్నాడు రుద్ర..

అలా గత ఆలోచనల నుంచి బయట పడ్డాడు..

ఇంతలో వేగంగా వెళ్తున్న వాడు కాస్త, ఒక్కసారిగా రోడ్డు పక్కన కార్ ని ఆపాడు..

కార్ నుంచి బయటికి దిగాడు..

అప్పటివరకు నెలవంక తో వెలిగిన ఆకాశం
ఒక్కసారిగా మేఘావృతమై, మబ్బులు పట్టి,
ఏ క్షణానైన కుండపోత కురిసేలా ఉంది..

ఆ రోడ్డు పక్కనే ఒక నేమ్ బోర్డు ఉంది.. చీకటిగా వుండడం వల్ల ఏమీ కనిపించడం లేదు..


ఇంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద మెరుపు మెరిసింది


ఆ మెరుపు వెలుగులో  ఆ నేమ్ బోర్డ్ ని చూశాడు..


దానిపై తుమ్మలబైలు అని ఉంది...


రుద్ర వెళ్తుంది ఇంటికి కాదు..!!



ఆ అడవిలోకి......!!


ఇంకా ఉంది....!!!
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
మరణ శాసనం - by SivaSai - 01-03-2026, 09:31 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 02-03-2026, 10:52 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 02-03-2026, 12:24 PM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:50 AM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:52 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 03-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 03-03-2026, 08:33 AM
RE: మరణ శాసనం - by sri012015 - 03-03-2026, 11:32 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:16 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 04-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 04-03-2026, 10:06 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:45 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 05-03-2026, 09:10 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 05-03-2026, 09:35 AM
RE: మరణ శాసనం - by sri012015 - 05-03-2026, 12:59 PM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:03 AM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 06-03-2026, 07:47 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 06-03-2026, 08:52 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:22 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 07-03-2026, 09:04 AM
RE: మరణ శాసనం - by SivaSai - 08-03-2026, 09:02 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 08-03-2026, 10:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 08-03-2026, 01:25 PM
RE: మరణ శాసనం - by SivaSai - 09-03-2026, 07:40 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 09-03-2026, 09:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 09-03-2026, 11:56 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:10 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:11 AM
RE: మరణ శాసనం - by masalakiss - 10-03-2026, 08:48 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 08:57 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 11:20 PM
RE: మరణ శాసనం - by masalakiss - 11-03-2026, 08:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 10:04 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 10-03-2026, 10:45 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 01:04 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 11-03-2026, 02:20 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 11-03-2026, 08:51 PM
RE: మరణ శాసనం - by SivaSai - 12-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 12-03-2026, 07:33 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 12-03-2026, 08:47 AM
RE: మరణ శాసనం - by SivaSai - 13-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by masalakiss - 13-03-2026, 07:55 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 13-03-2026, 08:07 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 13-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 14-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 14-03-2026, 08:29 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 09:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 15-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 15-03-2026, 06:55 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 15-03-2026, 09:49 AM
RE: మరణ శాసనం - by SivaSai - 16-03-2026, 03:53 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 16-03-2026, 06:24 AM
RE: మరణ శాసనం - by SivaSai - 17-03-2026, 07:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 17-03-2026, 08:34 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 17-03-2026, 05:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 18-03-2026, 08:32 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 18-03-2026, 02:34 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 05:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 19-03-2026, 12:56 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 19-03-2026, 02:09 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 19-03-2026, 03:01 PM
RE: మరణ శాసనం - by Reddy 211993 - 20-03-2026, 11:29 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 20-03-2026, 11:38 AM
RE: మరణ శాసనం - by SivaSai - 20-03-2026, 11:57 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 20-03-2026, 12:16 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 04:57 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:30 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 21-03-2026, 09:37 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 10:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 22-03-2026, 06:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 22-03-2026, 09:07 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 22-03-2026, 09:23 AM
RE: మరణ శాసనం - by SivaSai - 23-03-2026, 07:31 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 23-03-2026, 08:18 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 23-03-2026, 10:19 AM
RE: మరణ శాసనం - by SivaSai - 24-03-2026, 07:20 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 24-03-2026, 09:12 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 24-03-2026, 03:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 25-03-2026, 10:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 25-03-2026, 01:31 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 25-03-2026, 01:33 PM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 07:09 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 08:17 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 08:56 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 26-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:36 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 26-03-2026, 09:16 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 12:07 PM



Users browsing this thread: 2 Guest(s)