21-03-2026, 07:38 AM
Part - 26
ఇక రుద్ర తన ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాడు...
ఆ కుక్కలు రుద్ర మీద పడి, ఇష్టానుసారం కొరకసాగాయి..
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...
కుక్కలు కోరుకుతున్నాయి కానీ,రుద్ర కి ఏమి కావటం లేదు..
ఎందుకంటే అవి కొరుకుతున్నది.. రుద్ర శరీరాన్ని కాదు..
అతన్ని బంధించి ఉంచిన వేళ్ళని......
అవి వేగంగా కొరుకుతూ అతన్ని ఆ వేళ్ళ నుంచి బయటపడేసాయి...
వాటి బంధనాల నుంచి బయట పడిన వెంటనే, రుద్ర ఆదిత్య కోసం చూశాడు..
ఆ కుక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆలోచించే స్థితిలో లేడు.. తన ఆలోచనంతా ఇప్పుడు ఆదిత్యని కాపాడాలని మాత్రమే ఉంది..
అప్పటికే అది ఆదిత్యని సగానికి పైగా మింగేసింది..
వెంటనే తన దగ్గర ఉన్న కత్తిని బయటకు తీశాడు.
వేగంగా ఆ రాకాసి మొక్క ఒక దగ్గరికి వెళ్ళాడు..
వేగంగా దానిమీద దాడి చేయడం మొదలుపెట్టాడు..
ఆ రాకాసి మొక్క రుద్ర ని దూరంగా విసిరి కొట్టింది...
వేగంగా మరలా దానిమీదకి వెళ్ళాడు...
ఈసారి కూడా రుద్ర ని విసిరికొట్టగానే,ఎగురుకుంటూ వెళ్లి
ఆ కుక్కల దగ్గర పడ్డాడు.
తన చేతిలో ఉన్న కత్తి దూరంగా ఎగిరిపడింది..
అలా ఎంత ప్రయత్నించినా రుద్ర దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతున్నాడు.
ఆ కుక్కలు పడిపోయిన రుద్ర దగ్గరికి వెళ్లి,పైకి లెగు అన్నట్టుగా ప్రేమగా అమాయకంగా తమ ముఖంతో తోయసాగాయి.. ఇంకో కుక్క దూరంగా పడిన కత్తిని తీసుకు వచ్చి, అతని ముందు పెట్టింది..
వాటి ప్రవర్తన రుద్ర కి చాలా విచిత్రంగా అనిపించింది..
ఆదిత్య ని కాపాడాలని పైకి లేచాడు..
చుట్టూ ఉన్న కుక్కలు రుద్ర వంక అమాయకంగా చూడసాగాయి..
అవి ఏమీ చేయకుండా అలా సైలెంట్ గా ఉండడం చూసి రుద్రకీ చిరాకు పుట్టి,వాటిని చూస్తూ "నా ముఖంలో ఏముంది చూడడానికి...?? వెళ్లి దానిని నాశనం చేయండి..??" అన్నాడు..
ఇక ఆ మాట విన్న వెంటనే.. అప్పటిదాకా సైలెంట్గా బుద్ధిగా ఉన్న ఆ కుక్కలన్నీ వేగంగా దాని మీదకు వెళ్లి దాడి చేయడం మొదలు పెట్టాయి...
అమ్మయ్య సాయం దొరికింది అని మనసులో అనుకున్నాడు రుద్ర..
ఆ కుక్కలన్ని కలిసి,ఆ రాకాసి మొక్క పై పడి ఇష్టానుసారం కొరకసాగాయి...
రుద్ర కూడా తన కత్తితో తనకి అడ్డం వస్తున్న వాటి వేళ్ళు నరికేయసాగాడు..
అలా అన్నివైపుల నుంచి దాడి జరగడంతో,
ఆ మొక్క ఉక్కిరిబిక్కిరి అయ్యింది...
ఇంతలో రుద్ర కి తన కాళ్ల దగ్గర తన గన్ దొరికింది..
వెంటనే ఆ గన్ తీసుకొని, దాని రాకాసి నోటి కింద షూట్ చేశాడు...
ఆ బుల్లెట్ తగలగానే అది వికృతంగా అరిచింది.
ఆ దెబ్బకి గాయపడి, అది ఆదిత్య ని వదిలేసింది..
కింద పడిపోయిన ఆదిత్యని దూరంగా తీసుకెళ్లాడు రుద్ర.
అప్పటిదాకా అరుస్తూ ఉండడంతో దగ్గుతున్నాడు ఆదిత్య...
"ఇప్పుడు ఎలా ఉంది..?"అని అడిగాడు రుద్ర..
"థాంక్స్ రుద్ర..ఇప్పుడు బానే ఉంది.."అన్నాడు ఆదిత్య.
"దెబ్బలు ఏమైనా తగిలాయా..?"
" అదేం లేదు బాగానే ఉన్నాను..!!"
అంటూ అక్కడ రాకాసి మొక్కతో పోరాడుతున్న కుక్కలని చూస్తూ... "ఇవి ఎక్కడినుంచి వచ్చాయి రుద్ర..?"
" నిజం చెప్పాలంటే నాక్కూడా తెలియదు.
కానీ అవి ఇప్పుడు మనల్ని కాపాడాయి.."
ఈలోపు ఆ రాకాసి మొక్క కుక్కలని ఇష్టం వచ్చినట్టు విసిరేయసాగింది.. దానికి సాయంగా చాలా రాకాసి మొక్కలు అక్కడికి చేరుకున్నాయి...
అది చూసిన ఆదిత్య "పదా..!! వాటిని కాపాడదాం..!" అని అన్నాడు..
ఆదిత్య షూటింగ్ లో ఎక్స్పర్ట్... అందుకని రుద్ర దగ్గర గన్ తీసుకొని, అతనికి బ్యాకప్ గా నిలబడ్డాడు..
రుద్ర తన కత్తితో అడ్డు వచ్చిన ప్రతి రాకాసి మొక్కని నరికేయసాగాడు..
అతనిమీద దాడి చేయబోతున్న రాకాసి మొక్కలని ఆదిత్య గన్ తో షూట్ చేయసాగాడు..
చివరగా అవన్నీ చనిపోగా.. ఆ పెద్ద రాకాసి మొక్కని ఇద్దరూ కలిసి, కుక్కల సాయంతో చంపేశారు....
ఆ యుద్దం పూర్తయిన వెంటనే ఆ కుక్కలన్నీ అడవిలో
ఓ దిక్కు వైపు పరిగెత్తడం ప్రారంభించాయి....
అవి అలా వెళ్తుంటే వాళ్ళిద్దరూ అవి ఎక్కడికి వెళ్తున్నాయో అని చూస్తూ ఉండిపోయారు..
ఆ కుక్కల గుంపులోని చివరికి కుక్క వెనక్కి వచ్చి, రుద్ర వైపు చూసి రమ్మన్నట్టుగా చిన్నగా మొరిగి తిరిగి పరిగెత్తడం ప్రారంభించింది.
దాని చేష్టలకి రుద్ర ఆదిత్య ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు..
ఇక వాళ్ళిద్దరికీ కూడా అర్థమైంది...
వెంటనే వాటి వెనకాలే పరుగు ప్రారంభించారు...
అవి కొంత దూరం పరుగెత్తిన తర్వాత,
ఒక గుహ ముందు ఆగిపోయాయి...
వాటిని అనుసరిస్తూ పరిగెత్తుకొని, ఆ గుహ వద్దకు వచ్చారు ఇద్దరు....
అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు...
ఎందుకంటే, ఆ గుహ చుట్టూ చాలా రాకాసి మొక్కలు కాపలాగా ఉన్నాయి..
ఆ కుక్కలన్నీ లోపలికి వెళ్లడానికి ఎంత ప్రయత్నిస్తున్నా,
ఆ రాకాసి మొక్కలు వాటిని లోపలికి రాకుండా అడ్డుకుంటున్నాయి...
ఆ గుహద్వారం మొత్తం, పిచ్చి పిచ్చి అడవి తీగలతో అడ్డుగోడలా మారిపోయింది...
ఆ కుక్కలన్నీ అంతగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి అంటే లోపల ఏదో ఉందని వాళ్ళిద్దరికీ అర్ధం అయ్యింది....
ఇక ఆలస్యం చేయకుండా ఇద్దరు ఆ రాకాసి మొక్కల పై దాడి ప్రారంభించారు..
కొద్దిసేపటికే ఆ మొక్కలన్నీ వాళ్ళ చేతుల్లో నాశనమయ్యాయి..
ఇద్దరు ఆ గుహద్వారం ముందుకు వచ్చారు..
దారికి అడ్డంగా పిచ్చి,పిచ్చి తీగలన్ని ఉన్నాయి..
రుద్ర తన చేతిలో ఉన్న కత్తితో వాటిని నరికి పారేశాడు..
గుహ లోపలి భాగం మొత్తం చీకటిగా ఉంది..
వాళ్ళిద్దరూ అడుగుపెట్టగానే గుహ లోపల గోడలకి పెట్టి ఉన్న కాగడాలన్ని ఒక్కసారిగా వెలిగాయి..
మెల్లగా ఇద్దరూ లోపలికి ప్రవేశించారు...
లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచించసాగారు...
వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే కుక్కలన్ని ఒక్కసారిగా లోపలికి పరుగెత్తాయి..
అన్నిటికంటే చివరగా లోపలికి వెళుతున్న కుక్క ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి రుద్ర,ఆదిత్యల వంక చూసింది...
అక్కడ నుంచుని చూస్తున్న వాళ్ల దగ్గరికి వెళ్లి,
రుద్ర ఫ్యాంట్ నోట పుచ్చుకుని, లోపలికి రమ్మన్నట్టుగా లాగడం మొదలు పెట్టింది..
దాని సైగలు అర్థం చేసుకున్న ఇద్దరు లోపలికి వెళ్ళసాగారు...
అలా గుహ లోపలికి కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక విశాలమైన ప్రాంతం కనిపించింది.
కుక్కలన్నీ అక్కడే ఉన్నాయి..
చుట్టూ చూసారు.. కానీ ఏమీ కనిపించలేదు..
"అసలు ఈ కుక్కలు మనల్ని లోపలికి ఎందుకు తీసుకు వచ్చాయి..??" అని అనుమానంగా అడిగాడు ఆదిత్య...
కానీ రుద్ర సమాధానం చెప్పకుండా పైకి చూస్తున్నాడు...
"పైన ఏముంది...?"అంటూ పైకి చూశాడు..
పైన కనిపించిన దృశ్యం చూడగానే ఆదిత్యకి మతిపోయింది..
ఎందుకంటే పైన సిద్ధ భైరవ స్వామి గారి శరీరం
పెద్ద పెద్ద అడవి తీగల మధ్య చిక్కుకొని ఉంది...
కానీ అవి ఆయన శరీరాన్ని తాకలేకపోతున్నాయి.
ఎందుకంటే ఆయన శరీరం చుట్టూ తెల్లని వెలుగు రక్షణ కవచంలా ఉంది...
ఆ కాంతి చుట్టూ మాత్రమే ఆ అడవి తీగలు అల్లుకొని ఉన్నాయి....
"ఆయన ఎవరై ఉంటారు రుద్రా...??" అని పైకి చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య..
"ఆయన ఖచ్చితంగా మన వెతుకుతున్న
సిద్ధ భైరవులు గారే అయ్యుంటారు.." అని చెప్పాడు రుద్ర...
" అయితే మనం ఆయన్ని ఎలాగైనా కాపాడాలి...!" అంటూ గన్ తీసి, పైన ఆయనను బంధించిన ఒక అడవి తీగ మీదకి షూట్ చేశాడు..
ఆ బుల్లెట్టు తగిలి ఆ తీగ తెగిపోయింది.. కానీ చూస్తూ ఉండగానే మరుక్షణం ఆయనను తిరిగి అల్లుకుపోయింది..
అది చూసిన రుద్ర తన చేతిలో ఉన్న కత్తిని విసిరాడు...
మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది...
ఈసారి ఇద్దరూ కలిసి ప్రయత్నించారు..
కానీ వాటిని ఎంత నాశనం చేద్దామని ప్రయత్నించిన అవి తిరిగి వస్తూనే ఉన్నాయి..
ఇంక ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు..
"ఇపుడు ఏం చేద్దాం రుద్ర...??" అని అడిగాడు. ఆదిత్య...
" మానవ ప్రయత్నం ఫలించనప్పుడు,మంత్ర ప్రయోగమే సరైనది. ఆదిత్యా..!!" అంటూనేలపై యోగాసనం వేసుకుని కూర్చున్నాడు..
కొద్దిసేపు మంత్రాలు పఠించిన తరువాత, కళ్ళు తెరిచి గట్టిగా అరుస్తూ అరచేతితో నేలపై గట్టిగా కొట్టాడు...
ఒక్కసారిగా నేల ఏదో భూకంపం వచ్చినట్టు అదిరింది...
రుద్ర కొట్టిన చోట నేల పెద్ద పెద్ద బీటలు వారింది...
ఆ బీటలు వారిన చోటు నుండి బిలబిలమంటూ వందలాది ఎలుకలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి...
అవి వచ్చిన వెంటనే గోడల మీద నుండి పాకుతూ వెళ్లి, సిద్ధ భైరవులను బంధించిన తీగలను కొరికి వేయడం మొదలు పెట్టాయి..
ఆ తీగలన్నిటిని ఎలుకలు కొరికి వేయగానే,
రుద్ర భైరవుల శరీరం చుట్టూ ఉన్న తీగలన్ని మాయమైపోయాయి.. అప్పటి వరకు అక్కడ ఉన్న ఆ నల్ల కుక్కలు అన్నీ కూడా మాయమైపోయాయి...
ఆ కుక్కలు అలా మాయమైపోవడంతో ఇద్దరూ ఆశ్చర్యపోయారు..
ఆ తరువాత మెల్లగా ఆయన శరీరం ఎగురుకుంటూ నేల మీదకి వచ్చింది...
ఆయన శరీరం నేల మీదకి రాగానే ఆయన చుట్టూ ఉన్న కాంతి వలయం ఒక్కసారిగా మాయమైపోయింది...
ఇద్దరు చూస్తూ ఉండగానే,ఆయన శరీరం సాధారణ స్థితికి వచ్చింది...
ఆ తర్వాత ఇద్దరూ కలిసి,ఆయనను అక్కడ ఉన్న ఒక రాతి బండ మీద పడుకోబెట్టారు..
కొద్దిసేపటి తర్వాత ఆయన మెల్లగా కళ్ళు తెరిచారు...
మెల్లగా లేచి కూర్చుని, ఇద్దరి వంక చిరునవ్వుతో చూశారు...
" నన్ను కాపాడినందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు...!"అన్నారు ఆయన..
"స్వామి..!తమరు సిద్ధ భైరవులే కదా..??" అని అడిగాడు రుద్ర..
దానికి సమాధానంగా నవ్వుతూ తల ఊపారు...
ఇద్దరు వెంటనే ఆయన పాదాలకు నమస్కరించారు...
" ఆ తల్లి ప్రత్యంగిరా మాత ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి.. పైకి లేవండి." అన్నారు..
ఇద్దరూ పైకి లేచి వినయంగా ఆయనకు నమస్కరిస్తూ నుంచున్నారు...
" ఇంతకీ మీరు ఎవరు..?? ఈ అడవికి ఎందుకు వచ్చారు..!?" అని అడిగారు సిద్ధ భైరవులు..
" నమస్కారం స్వామి..నా పేరు రుద్ర.. నేను మీ శిష్యుడు శివుడు పుత్రుడను.ఇతని పేరు ఆదిత్య. ఇతని విషయంలో తమరి సహాయం కోరి,మీ కోసం వెతుక్కుంటూ ఈ అడవికి వచ్చాము."అంటూ ఆయనకు తమ పరిస్థితి వివరించాడు...
" ఏమిటి సమస్య చెప్పండి..?"
" స్వామి...! ఎవరో ఇతని మీద పంచవక్రి ని ప్రయోగించారు. దాని బారి నుండి కాపాడడం ఎలాగో తెలియటం లేదు.. తమరి ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తారేమో అని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాము..!"అంటూ వినయంగా చెప్పాడు రుద్ర.
ఆ మాట చెప్పగానే సిద్ధ భైరవులు ఒక్కసారిగా లేచి నుంచున్నారు..
" పంచవక్రిని ఇతని మీద ప్రయోగించడమా..??
అసాధ్యం..!! అంతటి శక్తివంతమైన తాంత్రికుడు ఇప్పుడు నాకు తెలిసి ఎవరూ లేరు..! అయినా అది పంచవక్రి అని నీకు ఎలా తెలుసు..?"అని అడిగారు..
" నాకు కూడా దాని గురించి తెలియదు స్వామి..
మా తండ్రిగారికి తమరు ఇచ్చిన గ్రంథం నేను చదవడం వల్లనే నాకు తెలిసింది.. కొద్ది రోజుల క్రితం దానికి కావలి శక్తుల నుండి ఆదిత్యను కాపాడడం కోసం చాలా కష్టపడవలసి వచ్చింది.ఇప్పుడు ఇతని ప్రాణం చాలా అపాయంలో ఉంది. మున్ముందు రాబోయే అమావాస్యలలో ఇతడిని ఎలా కాపాడాలో తెలియటం లేదు.
దయచేసి మీరే ఏదో ఒక దారి చూపించండి.."
అంటూ రుద్ర అయిన కాళ్లపై పడ్డాడు..
" దయచేసి నన్ను కాపాడండి స్వామి..!!" అంటూ ఆ వ్యక్తి కూడా ఆయన కాళ్లపై పడ్డాడు..
సిద్ధ భైరవులు వారిద్దరినీ పైకిలేపి,
" బాధపడకండి నాయనలారా..!! పైకి లేవండి.. మీ ప్రాణాలకు తెగించి మరీ నా ప్రాణాలు కాపాడారు.. కచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను..కానీ పంచవక్రి ని ఎదుర్కోవడం అంటే సామాన్య విషయం కాదు.. మహా మహా తాంత్రికులే దాని శక్తి చూసి భయపడతారు..
ఒక్కసారి దేని మీదకైనా దానిని ప్రయోగిస్తే,
వాళ్ల చావు చూసిన తరువాతే అది శాంతిస్తుంది.
అతి ప్రమాదకరమైన దుష్టశక్తి అది.. అసలు
దాని చుట్టూ ఉండే కావలి శక్తులే చాలా ప్రమాదకరమైనవి.. మీకు ఆ విషయం ఇంతకు ముందే తెలిసి ఉంటుంది.."అని అన్నారు..
"అయితే నా సమస్యకి పరిష్కార మార్గం ఏది లేదా స్వామి..??" అని విచారంగా ముఖంపెట్టి అడిగాడు ఆదిత్య..
ఒక్క క్షణం అని చెప్పి పద్మాసనం వేసుకుని కూర్చున్నారు సిద్ధ భైరవులు..
కళ్ళు మూసుకుని మంత్రాలు చూపించగానే ఆయన ముందు నేలపై వెలుగు రేఖలు కదులుతూ ఒక నక్షత్రము వంటి ఆకారం లోకి మారిపోయాయి. అలా కొద్ది సేపు ఆ ఆకారం వెలుగుతూ, మూడు వేరు వేరు ఆకారములు కలిగిన చక్రములు గా మారిపోయింది..
సిద్ధ భైరవులు కళ్ళు తెరిచారు.. ఆయన ఎదురుగుండా ఉన్న మూడు చక్రాల ని చూడగానే.. ఆయన ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది..
ఎదురుగా నిలుచుని ఉన్న ఇద్దరి వంక చూసి...
"ఒక మార్గం ఉంది..!" అని అన్నారు...
"ఏంటి స్వామి..?" అని ఇద్దరు ఆత్రుతగా అడిగారు..
ఇంకా ఉంది....!!!

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)