Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరణ శాసనం
#74
Part - 25

ఆశ్చర్యంతో ముగ్గురూ అలా చూస్తూ ఉండిపోయారు....

ఎందుకంటే వాళ్ల ఎదురుగా ఉన్నది ఒక అద్భుతమైన పూల వనం...

అది ఎంత అద్భుతంగా ఉంది అంటే...!!

మాటల్లో వర్ణించడానికి వీలైనంత సుందరంగా ఉంది..

రంగురంగుల పూలతో, ఎంతో మనోహరంగా ఉంది ఆ దృశ్యం.......!

ఆ పూల వనం పై రకరకాల రంగు రంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి..

ముగ్గురు ఆశ్చర్యంతో కొన్ని నిమిషాల పాటు, రెప్పవాల్చకుండా అలా చూస్తూనే ఉండిపోయారు...

ఇంతలో ఏదో మాయ చేసినట్లుగా, ముగ్గురు మెల్లగా వాళ్ళకి తెలియకుండానే ముందుకు నడవడం మొదలుపెట్టారు..

అలా మెల్లగా ఆ వనం దగ్గరికి చేరుకున్నారు..

ఇంతలో రుద్ర కి "ఆగు..!!ముందుకు వెళ్ళకు..!" అనే పిలుపు వినబడడంతో తెలివి వచ్చింది..

ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు..

ఎవరు పిలిచింది.. అన్నట్లుగా చుట్టూ చూశాడు.
కానీ ఎవరూ కనిపించలేదు..

కానీ ఆదిత్య అశ్వంత్ మెల్లగా ముందుకు వెళ్ళిపోతున్నారు..

ఎదురుగా ఉన్న పూల వనం చూసిన రుద్రకి
అనుమానం వచ్చి, తీక్షణంగా ఆ మొక్కల వైపే చూడసాగాడు...

అతని కళ్ళకి కనిపించిన దృశ్యం చూడగానే బుర్ర తిరిగిపోయింది...

"ఆదిత్య,అశ్వంత్ ఆగండి..!!" అంటూ గట్టిగా అరిచాడు..

అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు..

వేగంగా వెళ్లి,వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని, ఆపాలని చూశాడు..

కానీ వాళ్లు ఆగటంలేదు....!!!

ఇక రుద్రకి ఓపిక నశించి, గట్టిగా వాళ్ల మెడలు  పట్టుకుని, వెనక్కి నెట్టాడు..

వాళ్లు కింద పడిపోయిన వెంటనే..
వాళ్ళిద్దరి చెంపలపై ఎడాపెడా గట్టిగా కొట్టాడు..

ఆ దెబ్బలకు వాళ్లకి తెలివి వచ్చింది..

ఇద్దరూ ఏదో అప్పుడే నిద్ర లేచినట్టు,బుగ్గలు  రుద్దుకుంటూ పైకి లేచారు..

"మాకు ఏమైంది..?" అని విచిత్రంగా రుద్ర వంక చూస్తూ అడిగారు..

"మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు. చాలా ప్రమాదం. ఆ అమ్మాయిలను వెతికి పట్టుకుని, వెంటనే వెళ్లిపోవాలి.."అని కంగారుగా అన్నాడు.

అశ్వంత్ కి, ఆదిత్యకి,అసలు రుద్ర ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు...!!

"అసలు ఏం మాట్లాడుతున్నావ్ రుద్ర...? ఇప్పుడు ఇక్కడ అంత ప్రమాదం ఏముంది.?? ఎందుకు అంత కంగారు పడుతున్నావ్...?"అని కొంచెం చిరాకుగా అడిగాడు అశ్వంత్...

ఆదిత్య కూడా అశ్వంత్ ని సపోర్ట్ చేస్తున్నట్లుగా.
" నీ భయంలో అర్థం లేదు రుద్ర..!! ఇక్కడ ఏం ప్రమాదం నీకు కనిపిస్తోంది.??" అని అన్నాడు..

వాళ్లు అడిగిన ప్రశ్నలకు రుద్ర సమాధానంగా..
నేల మీద ఉన్న ఒక రాయిని చేతిలోకి తీసుకుని, అక్కడ పెద్దగా ఉన్న ఒక పూలమొక్క మీదికి విసిరాడు..

అది వేగంగా వెళ్లి ఒక పూల మొక్కను తాకగానే,
అది అకస్మాత్తుగా రాకాసి మొక్కగా మారిపోయింది.. దాని పువ్వు మధ్య స్థానంలో కోరలతో ఉన్న పళ్ళు బయటపడ్డాయి..

అది ఉన్న చోట నుంచి కదలకుండా పొడవైన నాలుకను బయటకు ఆడిస్తూ వాళ్ళ వైపు కోపంగా చూస్తోంది....

ఆ మొక్కలను చూసిన అశ్వంత్ కి మూర్చపోయినంత పని అయ్యింది..

ఎందుకంటే..తను చిన్న చిన్న పురుగులు తినే మాంసాహార మొక్కలు గురించి విన్నాడు. కాని ఎప్పుడూ ఇటువంటి భయంకరమైన రాకాసి మొక్కని గురించి వినలేదు, చూడలేదు..తను ఇటువంటి మొక్కని చూడడం ఇదే మొదటి సారి..

భయంతో తనకి తెలియకుండానే రెండడుగులు వెనక్కి వేశాడు..

ఆదిత్య కూడా బుర్ర తిరిగినంత పనయ్యింది..

రుద్ర తమను ఎందుకు బలవంతంగా ఆపాడో అర్థమయింది..!!

" అసలు ఇవి ఏ మొక్కలు...??
ఇంత భయంకరంగా ఉన్నాయి..!!"అని భయంతో కూడిన గొంతుతో అడిగాడు అశ్వంత్..


"ఇవి సాధారణమైన మొక్కలు కాదు..
వీటి పేరు విస్రుగందికా పుష్పాలు.....
ఇవి పాతాళ జాతికి చెందిన మొక్కలు..
నరకంలో మాత్రమే పెరుగుతాయి..

ఇవి సుగంధ పరిమళమైన వాసనలు వెదజల్లుతూ, చూడడానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్థాయి.. వాటికి ఆకర్షించబడి,ఏ జీవి గాని, మనిషి గాని చిక్కినా, మూడు రోజుల్లోనే దాని శరీరంలో ఉన్న జీవశక్తి మొత్తాన్ని పీల్చేసి, ఎముకల గూడుగా మార్చేస్తాయి..

అందుకే ఇప్పటివరకు మనకి ఒక పక్షి గాని,జంతువు గాని,కనిపించలేదు.."అని వాటి గురించి వివరించాడు రుద్ర..

"అసలు ఇక్కడికి ఎలా వచ్చాయి..??"అని ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య..

"ఇవి వాటంతట అవి రాలేదు..తాంత్రిక మాయతో సృష్టించబడ్డాయి.. ఎవరో వీటిని సృష్టించారు..!!"అని చెప్పాడు రుద్ర..

"మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం..??"అని అడిగాడు అశ్వంత్..

"మనం ఎలాగైనా చీకటి పడే లోపు
ఆ అమ్మాయిలని కనిపెట్టాలి.. లేకపోతే వీటి వల్ల చాలా ప్రమాదంలో పడతాం.."అని చెప్పాడు రుద్ర..

" చాలా ప్రమాదం అంటే...??"అని ఒకేసారి అడిగారు ఇద్దరు..

" ఈ మొక్కలని తక్కువ అంచనా వేయొద్దు.. ఇవి పగటి పూట మాత్రమే నెలల్లో వేళ్ళు నూరుకొని ఉంటాయి.. చీకటైతే ఆ వేళ్ళు బయటకు వచ్చి, ఇవి వేగంగా కదులుతాయి.. వీటి శక్తి కూడా చాలా పెరిగిపోతుంది.. వాటి చేతికి ఒక్కసారి చిక్కితే తప్పించుకోవడం చాలా కష్టం.. ప్రాణాల మీద ఆశ వదిలేయాల్సిందే..!!"అని చెప్పాడు రుద్ర...

ఆ మాటలు వినగానే అశ్వంత్ భయంతో వణికిపోయాడు..

"అమ్మాయిల సంగతి ఏమో గానీ.. ముందు మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోవాలి.. కావాలంటే మళ్ళీ వద్దాం.. రండి వెళ్ళిపోదాం.." అని అన్నాడు అశ్వంత్..

"తప్పు అశ్వంత్..! పాపం ఆడపిల్లలు..!
మన సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ఎలాగైనా వాళ్లని కాపాడి మనతోపాటు తీసుకువెళ్ళిపోదాం.." అన్నాడు ఆదిత్య..

"సరే ఇప్పుడు టైమ్ ఎంత..?" అని అడిగాడు రుద్ర..

"రెండు గంటలయ్యింది..."అని అశ్వంత్ చెప్పాడు..


"సరే..! చీకటి పడడానికి ఇంకా మనకి సాయంత్రం
5 గంటల వరకు టైముంది.. ఈలోపు ఎలాగైనా మనం ఆ అమ్మాయిల వెతికి తీసుకెళ్దాం.."అని చెప్పాడు ఆదిత్య..

ముగ్గురు సరైన అనుకుని అమ్మాయిలను వెతకడం మొదలుపెట్టారు..

అడవి అంత గట్టిగా పిలుస్తూ..చాలా సేపు తిరిగారు.. కానీ వాళ్ల జాడ తెలియలేదు..

చివరికి చేసేదేమీ లేక ముగ్గురు సాయంత్రం 4:30 కి అదే చోటుకు వచ్చారు..

" ఎంత వెతికినా ప్రయోజనం లేదు.." అంటూ బాధగా నిట్టూర్చాడు అశ్వంత్...

" నిజమే...!! ఇంకా ఎక్కువ సేపు ఉంటే మనం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది...! రేపు మళ్ళీ వచ్చి వెతుకుదాం పదండి వెళ్ళిపోదాం"
అన్నాడు ఆదిత్య..

ఇక రుద్ర కూడా సరేనంటూ ముందుకు కదిలాడు..

అలా వాళ్ళ బయలుదేరబోతుండగా...!!
రుద్ర కి ఏదో శబ్దం వినిపించింది..

అది ఒక మూలుగు శబ్దం...

నడుస్తున్న వాడు కాస్త టక్కున ఆగిపోయాడు..

ముందు నడుస్తున్న ఆదిత్య, అశ్వంత్, అక్కడే నిలబడిపోయి ఉన్న రుద్ర ని చూసి వెనక్కి వచ్చారు.

'"ఏమైంది రుద్ర..? ఆగిపోయావే...??" అని అడిగాడు ఆదిత్య..

"ష్..!! ఏం మాట్లాడకు..!! ఒకసారి ఆ శబ్దం వినండి...!!" అని మెల్లగా అన్నాడు...

ఆదిత్య,అశ్వంత్ లు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు..

ఆ శబ్దం వాళ్ళకి కూడా వినిపించింది...

రుద్ర చెప్పినట్లుగా ఎక్కడినుంచో మూలుగు శబ్దం వస్తోంది..

"ఒకసారి చుట్టూ వెతకండి..! వెంటనే..!!"అంటూ వారితో కలిసి తను కూడా ఆ చుట్టుపక్కల శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో వెదకసాగాడు..

ఆ శబ్దం..!! రాకాసి మొక్కలు ఉన్న వైపు నుండి వస్తోంది...

రుద్ర వెంటనే ఆ మొక్కలు ఉన్న దగ్గర ఒక ఎత్తైన గుట్ట ఉంది.. వెంటనే ఆ గుట్ట పైకి ఎక్కాడు.

అక్కడ ఆ మొక్కల మధ్యలో జరుగుతున్న సంఘటన చూసి, రుద్ర కి బుర్ర తిరిగిపోయింది..

"ఆదిత్య, అశ్వంత్ వెంటనే రండి."అంటూ గట్టిగా అరిచాడు...

వాళ్ళిద్దరూ ఆ గుట్ట పైకి వచ్చారు..

"ఏమైంది అలా అరిచావ్..??" అని కంగారుగా అడిగాడు ఆదిత్య..

"ఒకసారి అటు చూడండి.."అన్నాడు రుద్ర..

రుద్ర చూపించిన వైపు చూశారు ఇద్దరు..

"ఓ మై గాడ్..!!!!" అని అరిచాడు అశ్వంత్..

అసలు అక్కడ వాళ్లు చూసింది ఏమిటంటే...

వాళ్లు వెతుకుతున్న  ఇద్దరమ్మాయిలు ఆ మొక్కల మధ్య బంధింపబడి ఉన్నారు.. కొన్ని రాకాసి మొక్కలు వారి శరీరాన్ని తమ వేళ్ళతో చుట్టి బంధించి, వాళ్ళ శరీరం నుండి జీవశక్తిని పీల్చేస్తున్నాయి.. వాళ్ల నోళ్లు కూడా వేళ్ళతో కట్టేసి ఉన్నాయి.. వాళ్లు అరవడానికి ప్రయత్నిస్తున్నా,నీరసంతో ఆ శబ్దం మూలుగులా వస్తుంది..

వాళ్లని ఆ పరిస్థితుల్లో చూసిన ముగ్గురికీ ఏం చేయాలో అర్థం కాలేదు... పోనీ వాళ్ల దగ్గరికి వెళదాం అంటే వాళ్లకి అడ్డుగా చాలా రాకాసి మొక్కలు ఉన్నాయి... వాటి దాటుకొని ముందుకు వెళ్లడం దాదాపు అసాధ్యం...

"మనం ఎలాగైనా వాళ్ళని కాపాడాలి...!!
లేకపోతే వాళ్ళు చనిపోతారు...!!"అన్నాడు రుద్ర.

ఇంతలో ఏదో ఒకటి చెయ్యాలని చుట్టూ చూస్తున్న ఆదిత్య కి ఒక ఐడియా వచ్చింది..

అక్కడ ఆ రాకాసి మొక్కల పైన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది.

దాని ఊడలు కిందకి వేలాడుతున్నాయి..

వాటిని చూపిస్తూ.." నేను మెల్లగా వాటిని పట్టుకుని కిందకి దిగుతాను.. అందులో ఉన్న ఒక అమ్మాయికి తాడు కట్టి, మెల్లగా పైకి లాగుతాను.. ఆ తర్వాత ఇంకొ అమ్మాయికి కూడా అలాగే తాడు కట్టి పైకి లాగుదాము.."సలహా చెప్పాడు..

"కానీ అవి అమ్మాయిలను వదలకపోతే..?" అని డౌట్ అడిగాడు అశ్వంత్...

తన దగ్గర ఉన్న ఒక పెద్ద పొడుగాటి కత్తిని చూపిస్తూ... "ఇంకా చీకటి పడలేదు కాబట్టి అవి కదలలేవు. అందుకే ఈ కత్తితో వాటి వేళ్లను కోసేస్తాను.ఆ తర్వాత పైకి లాగుదాము..
ఆ అమ్మాయిల దగ్గర కొన్ని మొక్కలు మాత్రమే ఉన్నాయి.. కాబట్టి ప్రమాదం కూడా తక్కువ...!!" ఆదిత్య ఐడియా చెప్పగానే ఇద్దరూ ఒప్పుకున్నారు..

ఆదిత్య వెంటనే తమ దగ్గరున్న ఒక తాడు తీసుకుని, వేగంగా ఆ చెట్టు పైకి ఎక్కాడు..

మెల్లగా ఒక ఊడ పట్టుకుని,కిందికి దిగాడు..

ఆ మొక్కల దగ్గరికి వెళ్ళగానే,అవి కోపంతో ఆదిత్య మీద దాడి చెయ్యబోయాయి..

వెంటనే తన దగ్గరున్న కత్తి తో వాటిని మధ్యగా నరికేశాడు.. వాటిని నరికేయగానే
ఆ అమ్మాయిలకు చుట్టుకుని ఉన్న వేళ్ళు కూడా వాళ్ళని వదిలేశాయి.. వెంటనే ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్లాడు.. వాళ్లు చాలా నీరసంగా కనిపించారు... ఇద్దరు సృహలో ఉన్న సరే మాట్లాడలేకపోతున్నారు.. ఆదిత్య వెంటనే అందులో ఒక అమ్మాయి కి తాడుతో కట్టి పైకి లాగారు..

అమ్మాయి పైకి వచ్చిన వెంటనే మరో తాడుతో తమవైపు లాక్కొన్నారు రుద్ర అశ్వంత్ లు..

ఆమెను జాగ్రత్తగా ఒక పక్కన పడుకోబెట్టాడు అశ్వంత్.

ఇంకొక అమ్మాయిని కూడా పైకి తీసుకు వెళ్ళడానికి ఆదిత్య తాడును కట్టసాగాడు...

ఇంతలో మెల్లగా సూర్యకాంతి తగ్గిపోవడం ప్రారంభించింది.. అది గమనించిన రుద్ర.." ఆదిత్య త్వరగా కానీ.. చీకటి పడిపోతుంది.." అంటూ హెచ్చరించాడు..

ఆ హెచ్చరిక నిజమే అన్నట్లుగా ఆ మొక్కలు కూడా తమ రూపాన్ని మెల్లగా మార్చుకోవడం మొదలుపెట్టాయి..

ఆదిత్య వెంటనే వేగంగా ఆ అమ్మాయి నడుముకి తాడు చుట్టాడు.. రుద్రా అశ్వంత్ లు వేగంగా ఆ అమ్మాయిని కూడా గుట్టపైకి చేర్చారు..

ఇంతలో మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి..

ఆదిత్య వేగంగా మర్రిఊడ సాయంతో చెట్టుపైకి ఎక్కాడు..

రాకాసి మొక్కలు తమ ఆకారాన్ని పెద్దగా పెంచుకోవడం మొదలుపెట్టాయి.. వాటి వేళ్ళు భూమిలో నుండి పైకి వచ్చి,అవి నడవటం మొదలు పెట్టాయి...

అవి గుట్టపై ఉన్న వారిపై వేగంగా వెళ్ళసాగాయి..

ఇది గమనించిన ఆదిత్య.."అశ్వంత్,రుద్ర,ఆ అమ్మాయిలను తీసుకొని పారిపోండి.. లేదంటే చాలా ప్రమాదం.. నా గురించి ఆలోచించకండి.." అంటూ అనగానే..

ఇద్దరు ఆ అమ్మాయిల చేతుల్నీ గట్టిగా పట్టుకుని, వేగంగా పరుగెత్తసాగారు..

ఆదిత్య కూడా చెట్టుపైనుండి,గుట్ట మీదకి దూకి, వేగంగా వారి వైపు పరిగెట్టసాగాడు...

ఆ రాకాసి మొక్కలు వాళ్ళని వెంబడించసాగాయి..

బాగా చీకటి పడడంతో జీప్ ఎక్కడ ఉందో అశ్వంత్ కి అర్థం కాలేదు.. వెంటనే తన దగ్గర ఉన్న రిమోట్ తీసి బటన్ నొక్కాడు...

వారికి కొద్ది దూరంలోనే శబ్దం చేస్తూ, కారు లైట్ వెలిగింది.. అందరూ వేగంగా ఆ కారు వైపు వెళ్లబోతుండగా... హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పెద్ద రాకాసి మొక్క ఒక అమ్మాయిని గట్టిగా పట్టుకుంది...

అది తన వేళ్లతో ఆ అమ్మాయిని లాక్కుని వెళ్ళసాగింది.. వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్న ఆదిత్య అది గమనించి ఆ మొక్క వైపు పరిగెత్తాడు... లాక్కుని వెళ్తున్న ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుని, ఆ అమ్మాయి ని పట్టుకుని ఉన్న వేళ్ళని నరికేశాడు... ఆ మొక్క కోపంతో గట్టిగా అరిచింది.

ఈ సారి ఆ అమ్మాయి ని వదిలేసి ఆదిత్య ని గట్టిగా పట్టుకుని, ఈడ్చుకుంటూ వెళ్లిపోసాగింది.

అది గమనించిన రుద్ర వాళ్లందరినీ జీప్ ఎక్కించాడు...

"అశ్వంత్...! ఈ అమ్మాయిలని ఎలాగైనా ఈ అడవి నుంచి బయటపడెయ్.. మా గురించి ఆలోచించొద్దు..!!"అంటూ ఒక గన్ కత్తి జీపులో నుండి తీసుకుని, ఆదిత్యని లాక్కొని వెళ్ళిన వైపు పరిగెత్తాడు..

అశ్వంత్ వద్దని చెబుదామనుకునేసరికి, చాలా రాకాసి మొక్కలు వారి జీపు మీదికి దూసుకు వస్తున్నాయి..

ఇక వేరే దారిలేక జీపు ని వేగంగా అడవి బయటకి పోనిచ్చాడు.....

మరోవైపు ఆదిత్య ని వెతుక్కుంటూ రుద్ర వేగంగా పరిగెత్తసాగాడు...

చాలా రాకాసి మొక్కలు, అతనికి అడ్డుగా రాసాగాయి.. అయినా సరే ఏమాత్రం లెక్కచేయకుండా వాటిని నరుక్కుంటూ ముందుకు వెళ్లసాగాడు...

క్రమ క్రమంగా వాటి సంఖ్య పెరిగిపోసాగింది..

కొంతసేపు వాటితో పోరాడాడు.. కానీ వాటి సంఖ్య ఎక్కువైపోయింది.. చివరికి అవి ఒక విధమైన మత్తు మందును అతని మీద చిలకరించాయి.. నీకు ఏమీ చేయలేక సృహ తప్పి వాటికి బందీ అయిపోయాడు...

రుద్ర ని అవి బంధించి ఈడ్చుకుని వెళ్ళిపోయాయి.....




కొద్దిసేపటి తర్వాత రుద్ర కి సృహా వచ్చింది..

ఆకాశంలో మబ్బులు ఎక్కువగా ఉండటం వల్ల, వెన్నెల కాంతి అక్కడ పడటం లేదు.

చుట్టూ చీకటి గా ఉంది..

ఏమి కనిపించటంలేదు.

కీచురాళ్ళ శబ్దం మాత్రమే వినిపిస్తుంది...

తను బంధించబడి ఉన్నాడు..అది ఆ రాకాసి మొక్కల పని అని అర్దం అయింది.. విడిపించు కోవడానికి ఎంత ప్రయతించినా వీలు పడటం లేదు..

ఇంతలో "వదులు..! నన్ను వదులు..!" అన్న మాటలు వినిపించాయి..

ఆ గొంతు ఆదిత్య ది..

ఆదిత్య ఏదో ప్రమాదంలో ఉన్నాడని రుద్ర కి అర్థమైంది.. కానీ చుట్టూ చీకటిగా వుండడం వల్ల తనకి ఏమీ కనిపించడం లేదు..

ఆదిత్య ఎక్కడున్నావ్ అని గట్టిగా అరిచాడు..

"రుద్ర కాపాడు.  నన్ను ఏదో నన్ను లాక్కెళ్తూ ఉంది...!!"
అంటూ అరిచాడు ఆదిత్య..

ఆ వేళ్ళను తెంపుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు..రుద్ర..

కానీ తన వల్ల కాలేదు....

ఇంతలో ఆకాశంలో మబ్బులు తొలగిపోయాయి..

చంద్రుడు బయటకి వచ్చాడు..

అర్థ చంద్రాకారంలో మెరిసిపోతున్నాడు..

ఆ వెలుగులో రుద్ర ఆదిత్య ని చూసాడు...

ఆదిత్య పరిస్థితి చూసి, తల్లో నరాలు చిట్టి పోతాయేమో అన్నంతగా బుర్ర వేడెక్కిపోయింది.. ఏం చేయాలో అర్థం కాలేదు..

ఎందుకంటే ఒక పెద్ద రాకాసి మొక్క ఆదిత్యని తన వేళ్ళతో పైకి ఎత్తి,మింగసాగింది...

ఆదిత్య భయంతో అరవసాగాడు...

అది ఆదిత్య ని సగం పైగా మింగేసింది....

మరోవైపు రుద్ర జరుగుతున్న దారుణాన్ని చూస్తూ.. ఉండలేకపోతున్నాడు...తన కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి...

"ఆదిత్య...!!!ఆదిత్య...!!!" అంటూ భాదతో గట్టిగా అరుస్తున్నాడు..


ఇంతలో........!!!!!


ఒక్కసారిగా అక్కడ కుక్కల అరుపులు వినిపించసాగాయి....!!

చూస్తూ వుండగానే చాలా కుక్కలు అక్కడికి చేరుకున్నాయి....

అవన్నీ నల్లగా, బలిష్టంగా,భయంకరంగా ఉన్నాయి...

వాటి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి...

ఆ కుక్కలు కోపంగా నేలపై పడి ఉన్న రుద్ర దగ్గరికి వచ్చాయి..

కోపంగా చూస్తూ,తమ కోరలు బయటపెట్టి, ఒక్కసారిగా రుద్ర మీదకి దూకాయి...


రుద్ర గట్టిగా అరిచాడు.....!!!


అంతే......!!!!







ఇంకా ఉంది.......!!!!!
[+] 5 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
మరణ శాసనం - by SivaSai - 01-03-2026, 09:31 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 02-03-2026, 10:52 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 02-03-2026, 12:24 PM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:50 AM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:52 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 03-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 03-03-2026, 08:33 AM
RE: మరణ శాసనం - by sri012015 - 03-03-2026, 11:32 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:16 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 04-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 04-03-2026, 10:06 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:45 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 05-03-2026, 09:10 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 05-03-2026, 09:35 AM
RE: మరణ శాసనం - by sri012015 - 05-03-2026, 12:59 PM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:03 AM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 06-03-2026, 07:47 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 06-03-2026, 08:52 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:22 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 07-03-2026, 09:04 AM
RE: మరణ శాసనం - by SivaSai - 08-03-2026, 09:02 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 08-03-2026, 10:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 08-03-2026, 01:25 PM
RE: మరణ శాసనం - by SivaSai - 09-03-2026, 07:40 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 09-03-2026, 09:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 09-03-2026, 11:56 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:10 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:11 AM
RE: మరణ శాసనం - by masalakiss - 10-03-2026, 08:48 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 08:57 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 11:20 PM
RE: మరణ శాసనం - by masalakiss - 11-03-2026, 08:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 10:04 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 10-03-2026, 10:45 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 01:04 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 11-03-2026, 02:20 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 11-03-2026, 08:51 PM
RE: మరణ శాసనం - by SivaSai - 12-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 12-03-2026, 07:33 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 12-03-2026, 08:47 AM
RE: మరణ శాసనం - by SivaSai - 13-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by masalakiss - 13-03-2026, 07:55 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 13-03-2026, 08:07 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 13-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 14-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 14-03-2026, 08:29 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 09:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 15-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 15-03-2026, 06:55 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 15-03-2026, 09:49 AM
RE: మరణ శాసనం - by SivaSai - 16-03-2026, 03:53 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 16-03-2026, 06:24 AM
RE: మరణ శాసనం - by SivaSai - 17-03-2026, 07:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 17-03-2026, 08:34 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 17-03-2026, 05:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 18-03-2026, 08:32 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 18-03-2026, 02:34 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 05:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 19-03-2026, 12:56 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 19-03-2026, 02:09 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 19-03-2026, 03:01 PM
RE: మరణ శాసనం - by Reddy 211993 - 20-03-2026, 11:29 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 20-03-2026, 11:38 AM
RE: మరణ శాసనం - by SivaSai - 20-03-2026, 11:57 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 20-03-2026, 12:16 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 04:57 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:30 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 21-03-2026, 09:37 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 10:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 22-03-2026, 06:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 22-03-2026, 09:07 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 22-03-2026, 09:23 AM
RE: మరణ శాసనం - by SivaSai - 23-03-2026, 07:31 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 23-03-2026, 08:18 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 23-03-2026, 10:19 AM
RE: మరణ శాసనం - by SivaSai - 24-03-2026, 07:20 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 24-03-2026, 09:12 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 24-03-2026, 03:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 25-03-2026, 10:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 25-03-2026, 01:31 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 25-03-2026, 01:33 PM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 07:09 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 08:17 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 08:56 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 26-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:36 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 26-03-2026, 09:16 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 12:07 PM



Users browsing this thread: 1 Guest(s)