Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరణ శాసనం
#71
Part - 24

జరిగినదేమిటో సిద్ధప్ప కన్నడలో చెప్పుతుండగా.
రుద్ర ఆదిత్య కి తెలుగులో అర్థం చెప్తున్నాడు..

"ఎవరు అలా చేసింది.??" అని ఒక్కసారిగా ఇద్దరు సిద్దప్పను అడిగారు...

అలా చేసింది రఘురాజ్ కొడుకు..!!

అతను బెంగుళూరు ఉంటాడు.. తన తండ్రి కోసం చేస్తున్న క్రతువు,అతని కూతురుకు నచ్చకపోవడంతో,వెంటనే
తన అన్నకు ఫోన్ చేసి చెప్పింది.. అతను వెంటనే ఇక్కడకు చేరుకుని,ఆ క్రతువు ఆపేశాడు..

ఆ క్రతువు ఆగిపోయిన వెంటనే రఘురాజ్ శరీరంలో చలనం కూడా ఆగిపోయింది.

చుట్టు ఉన్న వారు అలా తీసుకు వెళ్ళొద్దని, చెప్తున్నా సరే, వినకుండా అందర్నీ తిడుతూ, తన తండ్రిని, బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకుపోయాడు..

అతని సిటీలో ఉన్న హాస్పిటల్కి తీసుకు వెళ్ళాడు.
అక్కడ ఎన్ని పరీక్షలు చేసినా అతనికి వచ్చిన రోగం ఏంటో తెలుసుకోలేక పోయారు..

చివరగా రెండు రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడుతూ రఘు రాజ్ కన్నుమూసాడు..

తన తండ్రి చావుకి సిద్ధ భైరవులే కారణం అంటూ, సెక్యూరిటీ అధికారి స్టేషన్లో కంప్లైంట్ చేసి, ఆయనను అరెస్టు చేయించాడు..

ఆ సమయంలో ఊర్లో వాళ్లు కూడా వాళ్ళని ఆపలేకపోయారు.. చివరికి రఘు రాజ్ భార్య
సిద్ధ భైరవులను సపోర్ట్ చేయడంతో వారం రోజుల పాటు జైల్లో ఉంచిన తర్వాత, సాక్ష్యాధారాలు లేకపోయేసరికి, ఆయనను విడిచి పెట్టారు...

ఆ సంఘటన వల్ల ఆయన మనసు చాలా గాయపడింది..

సిద్ధ భైరవులు చాలా శాంత స్వభావం కలిగినవారు.. ఎవరి నుంచి ధనం ఆశించే వారు కాదు. గుడి ద్వారా వచ్చిన ఆదాయంలో ఆయనకు కొంత భాగం చేరేది.. అది చాలా తక్కువ.. నిస్వార్ధంగా సేవ చేసే వారు.. ఊరు బాగు కోసం ఎంతో సేవ చేసేవారు.. రైతులు పంటలు పండించాలి అన్నా,  ఎవరి ఇంట్లోనైనా శుభకార్యానికి ముహూర్తాలు చూడాలి అన్నా, ఆయనను సంప్రదించే వారు..

అటువంటి మనిషి కి కష్టం వస్తే ఊర్లో వాళ్లు ఎవరు తోడు రాకపోయేసరికి, ఆయన మనసు గాయపడింది...

జైలు నుంచి విడుదలైన మరుక్షణం,ఆయన ఆ అడవిలోకి వెళ్ళిపోయారు..

ఆయన వెళ్లిన తర్వాత ఊర్లో పరిస్థితులు తారుమారు అయిపోయాయి.. పంటలు సరిగా పండటం లేదు. ఎటు చూసిన చెడు శకునాలు కనిపిస్తూ ఉన్నాయి.. ఎవరికి మంచి చెప్పే దిక్కు లేకుండా పోయింది.."అని జరిగిన సంఘటన వివరించారు సిద్దప్ప..

"అయితే ఆయన మళ్ళీ తిరిగి రాలేదా...??" అని అడిగాడు రుద్ర..

"లేదు బాబు.! " అని బాధగా సమాధానమిచ్చాడు.. సిద్ధప్ప

"అయితే ఇప్పుడు ఏం చేద్దాం..??"అని అడిగాడు ఆదిత్య.

"చేసేదేముంది..! మనం కూడా ఆయన కోసం వెళ్దాం..!"అని అన్నాడు.రుద్ర..

తెలుగులో మాట్లాడుకుంటున్న వారిని, చూస్తూ ఏంటని అడిగాడు...

" మేము ఆయన కోసం అడవిలోకి వెళ్లబోతున్నాం..!!" అని చెప్పాడు..

ఆ మాటలు విన్న సిద్ధప్ప ఒక్కసారిగా లేచి నుంచుని..
" ఏంటి..? ఆ అడవిలో కి వెళ్తారా..??"
అంటూ ఆశ్చర్యంగా అడిగాడు..

సిద్ధప్ప అలా ఒక్కసారిగా లేచి నుంచునేసరికి, వారిద్దరు కూడా కంగారుగా  లేచి నుంచున్నారు..

"ఏమైంది సిద్దప్ప గారు...??"అని అడిగాడు
రుద్ర...

" ఆ అడవికి వెళ్ళద్దు బాబు..!! చాలా ప్రమాదం....! అడవికి వెళ్ళిన వారు చాలా మంది చనిపోయారు... మిగిలిన వారు పిచ్చివాళ్లైపోయారు..!!" అని బెదిరిపోతూ, సమాధానమిచ్చాడు..

ఆదిత్య కి సిద్ధప్ప మాట్లాడుతుంది ఏమిటో అర్థంకాక ఏమైందని రుద్రని అడిగాడు..

రుద్రకి సిద్ధప్ప చెప్పింది.
ఆదిత్యకి చెప్పాడు...

ఆ మాటలకి ఆదిత్య కూడా ఆశ్చర్యపోయాడు..

"అసలు అలా ఎందుకు జరుగుతోంది..? ఏమైంది..?"అని సిద్దప్పని అడిగాడు రుద్ర..

"దీనివెనుక చాలా పెద్ద కథే ఉంది బాబు..!! పూర్వం ఈ ప్రాంతమంతా పెద్ద అడవి.. ప్రస్తుతం ఉన్న ఊరు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆ అడవిలోనే ఉండేవి..
ఈ అడవిలోనే చాలామంది తాంత్రికులు క్షుద్రోపాసన చేసేవారు.జంతు బలులు, నరబలులు కూడా ఇచ్చేవారు."

"వారు చేసే క్షుద్ర ఉపాసనల వల్ల,ఈ ప్రాంతమంతా భయంకరమైన ప్రేతాత్మలు, పిశాచాలు, తిరుగుతూ ఉండేది.. ఎంతోమంది అమాయకులు వాటిబారిన పడి బాధలు పడేవారు.. "

"ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు ఈ ప్రాంతానికి మంచ్రేకరుడు అనే తాంత్రికుడు వచ్చారు.ఆయన ప్రత్యంగిరాదేవి ఉపాసకుడు...మహా శక్తి వంతుడు.."

"ఆయన దేశ సంచారం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారు.. ఇక్కడ దుష్ట శక్తులు చేస్తున్న చూసి ఆయన ఆశ్చర్యపోయాడు.. దానికి కారణం అక్కడ ఉన్న తాంత్రికులు అని తెలుసుకొని, వాళ్ల దగ్గరికి వెళ్లి ఇటువంటి పనులు మానమని హెచ్చరించారు.."

"ఆయన అలా హెచ్చరించడంతో వాళ్లకి చాలా కోపం వచ్చింది.. ఆయనను అంతం చేయడానికి,తమ అదుపులో ఉన్న దుష్టశక్తులను ఆయన మీదకి పంపించారు.."

"ఆయన మహా శక్తిమంతుడు.. ప్రత్యంగిరా దేవి అనుగ్రహం కలిగినవాడు.. "

"ఆయనకు వాటిని ఎలా అదుపు చేయాలో తెలుసు...వెంటనే తన మీదకి పంపిన దుష్ట శక్తులన్నిటినీ వారి మీదకే తిప్పి పంపాడు... అవి ఆ తాంత్రికులందరిని చంపేశాయి.."

"అవన్నీ తిరిగి గ్రామాలలోకి రాకుండా, తన మంత్ర శక్తితో వాటిని అడవిలోనే బంధించాడు.. గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం గ్రామంలో ప్రత్యంగిరా దేవి గుడి కట్టించారు."

"సామాన్యుల ఎవరు ఆ అడవిలోకి వెళ్ళకూడదని ఆనాడే శాసనం చేయబడింది.. అందుకే సిద్ధ భైరవులు గారు వెళుతున్నా సరే, ఆయనతో పాటు మేము వెళ్ళే ధైర్యం చేయలేకపోయాము.." అంటూ ఆ అడవి గురించి వివరించారు సిద్దప్ప..

సిద్ధప్ప చెప్పినదంతా విన్నారు...

"అయితే ఇప్పుడు ఏం చేద్దాం??" అని అడిగాడు ఆదిత్య..

"నాకు అదే అర్థం కావడం లేదు..!!"అని అన్నాడు రుద్ర..

వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా గుడి బయట ఒక్కసారిగా కలకలం చెలరేగింది...!!

ఏమైందో అని ఖంగారు పడుతూ ముగ్గురు గుడి బయటకు పరుగులు తీశారు...

కొంత మంది గ్రామస్తులు గ్రామంలోకి పరుగులు పెడుతున్నారు..

సిద్ధప్ప వేగంగా వెళ్లి, వారిలో ఒక గ్రామస్తుడిని ఏమైందని అడిగాడు..

అతను చెప్పింది విన్న తర్వాత, తిరిగి ఆదిత్య రుద్ర వద్దకు వచ్చాడు..

" ఏమైంది స్వామి..?" అని ఆందోళనగా అడిగాడు రుద్ర..

"హొయసలేశ్వర స్వామివారిని దర్శించుకునే కొంత మంది టూరిస్టులు, ఈ అమ్మవారిని కూడా దర్శించుకోవడం మామూలే.."

"నిన్న కూడా 10 మంది కాలేజీ పిల్లలు
ఈ గ్రామానికి వచ్చారు.. ఈ అడవి గురించి ఇక్కడకు వచ్చే యాత్రికులకు మేము అడవిలోకి వెళ్లద్దొని చెప్తునే ఉంటాము.."

"కానీ...!! నిన్న సాయంత్రం వాళ్లలో ఇద్దరమ్మాయిలు
ఆ అడవిలోకి వెళ్లి, ఇప్పటి వరకు తిరిగి రాలేదట..మిగిలిన వాళ్ళు కంగారుపడుతున్నారు.." అని చెప్పాడు సిద్ధప్ప..

అదే విషయాన్ని ఆదిత్య కి చెప్పాడు రుద్ర..

వెంటనే వాళ్ళిద్దరూ కూడా గ్రామస్తులు వెళుతున్న వైపు పరుగులు తీశారు...

వాళ్లు వెళ్లేసరికి కాలేజీ బస్సు దగ్గర కొంతమంది స్టూడెంట్స్ తో సెక్యూరిటీ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు.

" అడవిలోకి ఎంతమంది వెళ్లారు..??" అని అడిగాడు
ఎస్ ఐ, స్టూడెంట్స్ ని..

" ఇద్దరు సార్...??"అంటూ ఏడుస్తూ చెప్పింది.ఒక అమ్మాయి

" పేర్లేంటి..!??"

" కృతిక, అలైక్య..సార్...!! "

"అసలు ఆ అడవిలోకి వెళ్తే ప్రమాదమని తెలిసి,ఎందుకు వెళ్లారు...??" అంటూ కోప్పడ్డాడు ఎస్ ఐ...

"నిన్న మేము ఇక్కడకు వచ్చినప్పుడు,ఇక్కడి వాళ్ళు వెళ్ళొద్దని చెప్పారు..!! కానీ మా వాళ్ళు అవి కట్టుకధలని, వెళ్దామని అంటే,మేము వెళ్ళొద్దని చెప్పాము సార్..!కానీ మాకు చెప్పకుండా నిన్న సాయంత్రం వెళ్లారు...!! వాళ్ళ ఫోన్స్ కూడా వర్క్ చెయ్యడం లేదు..! మాకు చాలా కంగారుగా ఉంది.." అంటూ ఏడవసాగింది..!!

వాళ్ల సంభాషణ మొత్తం విన్నాడు రుద్ర...

ఏమైందని అడిగాడు ఆదిత్య...తను విన్నది మొత్తం చెప్పాడు..

ఈలోపు ఎస్ ఐ వాళ్ల దగ్గర నుండి తన జీప్ దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ దగ్గరకు వచ్చాడు..

ఏం చేయాలో తెలియక బుర్ర పట్టుకున్నాడు
ఎస్ ఐ

"ఇప్పుడు ఏం చేద్దాం సార్..!??" అని అడిగాడు కానిస్టేబుల్ ఒకడు..

" ఇక చేసేదేముంది అడవిలోకి వెళ్ళి వెతకాలి..!!" అన్నాడు ఎస్ ఐ..

" ఆ  అడవిలోకా...?? " అన్నారు కానిస్టేబుల్స్..

" మనకి వేరే దారి లేదు.. ఎలాగైనా వాళ్ళని వెతికి తీరవలసిందే..!!" అన్నాడు ఎస్ ఐ..

"మేము రాలేము సార్...!!" అన్నారు కానిస్టేబుల్స్ అందరూ. భయంతో.

"మీరందరూ రానంటే ఎలాగ....?? అంటే నేనొక్కడినే వెళ్ళాలా..??" అంటూ కొప్పడ్డాడు ఎస్ ఐ..

వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా...
అక్కడికి రుద్ర, ఆదిత్య వచ్చారు...

"మీరు ఎవరు..?"అని వాళ్ళని చూసి అడిగాడు
ఎస్ ఐ...

"హలో సార్..!! నా పేరు రుద్ర..!! ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నా,తన పేరు ఆదిత్య,ఎస్ ఐ గా వర్క్ చేస్తున్నాడు..!!"అంటూ తమ ఐడీ కాడ్స్ చూపించి పరిచయం చేసుకున్నారు..

"ఓహ్ అలాగా..!! నాకు కూడా తెలుగు వచ్చు..
మా ఫ్యామిలీది ఆంధ్రనే..!! ఊరు కాకినాడ..!!
25 ఏళ్ళ క్రితం అక్కడ నుంచి వలస వచ్చి, బెంగళూర్ లో సెటిల్ అయ్యాం.నా పేరు అశ్వంత్..!! నేను ఇక్కడ ఎస్ ఐ నీ,...!!"తనని కూడా పరిచయం చేసుకున్నాడు..

ఒక తెలుగువాడు దొరికినందుకు వారిద్దరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు..

" ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి సార్...!!"అని అడిగాడు రుద్ర

" వాళ్లు ఆ అడవిలోకి వెళ్ళి చాలా తప్పు చేశారు.. అది చాలా ప్రమాదకరమైన అడవి..ఇలాగే కిందటి సంవత్సరం కొంత మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చారు.. వాళ్లలో ఒక బాబు తెలియక రాత్రిపూట ఆడుకుంటూ,ఆ అడవిలోకి వెళ్లిపోయాడు.. తర్వాత రోజు పొద్దున్న మేము చాలా ఫోర్స్ తో వెళ్లి వెతకగా.. రక్తంతో తడిసిన ఆ అబ్బాయి బట్టలు మాత్రమే దొరికాయి.. బాడీ ఇప్పటివరకు దొరకలేదు.."
అని చెప్పాడు అశ్వంత్..

" రాత్రి కనిపించకుండా ఉంటే, పగటి పూట వరకు ఆ బాబుని వెతకడానికి ఎందుకు వెళ్ళలేదు..??"

"చూడు ఆదిత్య..! డిపార్ట్మెంట్లో రూల్స్ నీకు తెలియనివి కాదు.. కానీ ఈ అడవి చాలా ప్రమాదకరమైనది.. పగలు
ఈ అడవిలో కాలు పెట్టాలంటెనే, ధైర్యం సరిపోదు. అంత ప్రమాదకరమైన అడవి ఇది.. అడవిలో దుష్ట శక్తులు తిరుగుతూ ఉన్నాయో లేవో కానీ.. ప్రమాదకరమైన జంతువులు, విష సర్పాలు, క్రిమికీటకాలు తిరుగుతూ ఉంటాయి.. అందువల్లే రాత్రిపూట కంటే పగటిపూట
ఈ అడవిలోకి వెళ్లడానికి ఆస్కారం ఉంది..."

"మరి ఇప్పుడు అమ్మాయిలని వెతకడానికి బయలుదేరుతారా...??"అని అడిగాడు రుద్ర.

" లేదు బ్రదర్..!! ఇప్పటికే సాయంత్రం అయిపోయింది.. అడవిలో వాళ్ళు ఎంత దూరం, ఎటువైపు  వెళ్లారో, తెలియకుండా వెతకడం చాలా కష్టం.!!! ఇక రేపు పొద్దున్నే వెతకడానికి  బయలుదేరాలి.." అంటూ  ఉండగా మీడియా అక్కడికి వచ్చింది...

వాళ్లకి సమాధానం చెప్పడం కోసం,అశ్వంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు...!

"వాళ్ల సంగతి సరే.. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి.?" అని అడిగాడు ఆదిత్య..

" నాకు ఒక ఐడియా ఉంది..!!!"

"ఏంటది..??"

" అమ్మాయిలను వెతకడానికి ఎలాగో రేపు అశ్వంత్ వెళ్తాడు.. తనతోపాటే మనం కూడా బయలుదేరితే మంచిది.. ఎందుకంటే ఈ అడవి గురించి మనకి పూర్తిగా తెలియదు.. తనతో పాటు వెళితే ఆ అమ్మాయిలకి కూడా సహాయం చేసినట్లు ఉంటుంది. సిద్ధ భైరవ గారిని వెదికినట్టు ఉంటుంది.. ఏమంటావ్..?"అని చెప్పాడు రుద్ర..

" గుడ్ ఐడియా...!! అయితే మాట్లాడదాం.." అన్నాడు ఆదిత్య...

వీళ్లిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మీడియా వాళ్లు వెళ్ళిపోవడంతో వారి దగ్గరికి వచ్చాడు అశ్వంత్..

" ఏంటి బాస్...?? ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు..??"అని అడిగాడు అశ్వంత్..

"నథింగ్ బ్రదర్...! ఆ అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందో అని మాట్లాడుకుంటున్నాం..! మరి రేపు ఆ అమ్మాయిలను వెదకడానికి మీరు వెళ్తున్నారు కదా..! మీ వాళ్లు రెడీగా ఉన్నారా..??"అని అడిగాడు ఆదిత్య..

" దాని గురించే ఆలోచిస్తున్నాను.. మా వాళ్ళు ఆ అడవిలోకి రావడానికి భయపడుతున్నారు.. నాకు ఎవరిని తీసుకు వెళ్లాలో అర్థం కావడం లేదు.. పోనీ స్పెషల్ ఫోర్స్ హెల్ప్ తీసుకుందామన్నా..!! పర్మిషన్ తీసుకోవడానికి,వాళ్లు రావడానికి రెండు రోజులైనా పడుతుంది..!! ఈలోపు వాళ్ళకి ఏదైనా జరగొచ్చు..!! ఏం చేయాలో అర్థం కాక బుర్ర బద్దలు అవుతోంది...!! " అంటూ తన ప్రాబ్లం చెప్పుకున్నాడు అశ్వంత్..

"నీకేమి అభ్యంతరం లేకపోతే, నీకు తోడుగా మేమిద్దరం వస్తాం..!!"అన్నాడు రుద్ర..

" వ్వాట్..!!? మీరిద్దరా..??" అంటూ ఆశ్చర్యపోయాడు అశ్వంత్.

" నీకు హెల్ప్ చేద్దామని అనుకున్నాం..!! నీకు అభ్యంతరం ఉంటే, నో ప్రాబ్లం. ఆగిపోతాం..!!" అన్నాడు..

నిజానికి అశ్వంత్ కి ఆ పరిస్థితుల్లో నో చెప్పే ఛాన్స్ లేదు.. ఎందుకంటే అతను ఒక్కడే ఆ అడవిలోకి వెళ్ళలేడు.. పైగా వీళ్లిద్దరు డిపార్ట్మెంట్ వాళ్లే కావడంతో, తనకి పర్మిషన్ తీసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది.. రుద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి అతని ఎక్స్పీరియన్స్ తనకి యూస్ అవుతుంది...అందువల్ల వాళ్లకి నో చెప్పలేదు...

" నిజంగా ఈ టైంలో మీ ఇద్దరి హెల్ప్ నాకు చాలా అవసరం.. థాంక్యూ సో మచ్.. రేపు ఉదయం ఐదు గంటలకి మనం అడవిలోకి వెళ్లబోతున్నాం.. మీరిద్దరూ ఆ టైంకి ఇక్కడికి వచ్చేసేయండి.. నేను అడవిలోకి వెళ్ళడానికి మనకి అవసరమైన సామాన్లు తీసుకు వస్తాను..." అంటూ వాళ్లకి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..

ఆదిత్య రుద్ర కూడా వాళ్ల ప్లాన్ వర్కవుట్ అయినందుకు ఆనందంగా వాళ్ళు ఉంటున్న హోటల్ కి వెళ్ళిపోయారు...

ఆ మరుసటి రోజు ఉదయం..

సమయం ఉదయం 4:30 నిమిషాలు అయింది..

అశ్వంత్ తన కానిస్టేబుల్స్ తో ఆ ప్రదేశానికి చేరుకున్నాడు..

కొద్ది నిమిషాల తర్వాత ఆదిత్య,రుద్ర అక్కడికి వచ్చారు..

తమకి అవసరమైన సామానులు తీసుకుని,
ఒక జీపులో అడవిలోకి బయలుదేరారు..

వాళ్ల ప్రయాణం మొదలైంది... అశ్వంత్ డ్రైవ్ చేస్తున్నాడు.. చేతికున్న వాచీ లో టైం చూసుకున్నాడు. 10:00 అయింది..

ఆ అడవి చాలా దట్టంగా ఉంది.. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు,పెద్ద పెద్ద పొదలు కనిపిస్తున్నాయి.. పగలైనా సరే, సూర్యకిరణాలు అడవిలో అక్కడక్కడ మాత్రమే పడుతున్నాయి..

కొంత దూరం వెళ్ళిన తరువాత అశ్వంత్ జీపుని ఆపేశాడు...

తను జీప్ దిగుతూ.." రోడ్డు అస్సలు బాగోలేదు.. అందుకని నడుచుకుంటూ వెళ్లడమే మంచిది." అనగానే ఆదిత్య రుద్ర ఇద్దరూ జీప్ దిగి,తన సామాను తీసుకుని నడక ప్రారంభించారు...

అశ్వంత్ మాత్రం ఒక ట్రాకర్ లాంటిది.
జీప్ కి అమర్చాడు.. "అది ఏంటి..?" అని అడిగాడు ఆదిత్య..

దానికి సమాధానంగా తన చేతిలో ఉన్న రిమోట్ చూపించి, "ఇది జీపీఎస్ ట్రాకర్, శాటిలైట్ సిగ్నల్ తో పని చేస్తుంది.. ఒకవేళ ఈ అడవిలో మనం తప్పి పోతే, దీని సహాయంతో మన జీప్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.. ఈ బటన్ నొక్కితే జీప్ లైట్లు వెలిగి, అలారం మోగుతుంది.." అంటూ దాని గురించి వాళ్ళకు వివరించాడు.

"గుడ్ ఐడియా బ్రదర్..!"అంటూ అభినందించాడు రుద్ర..

ముగ్గురు అడవిలో నడుస్తున్నారు..

రుద్ర కి ఆ అడవి విచిత్రంగా కనిపించసాగింది.. ఎందుకంటే పక్షుల అరుపులు లేవు..ఎటువంటి జంతువు అప్పటి వరకు వారికి ఎదురుపడలేదు.. రుద్ర మనసు ఎందుకో ఆందోళనగా ఉంది..

ఇంతలో ముందుగా నడుస్తున్న అశ్వంత్ ఒక్కసారిగా ఒక చెట్టు వైపు పరుగు తీశాడు..

తను అలా పరుగులు తీయడంతో, ఏమైందో అని అతని వెంటే వీళ్ళు కూడా పరిగెత్తారు..

అశ్వంత్ ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగి, నేలపై ఉన్న ఒక వస్తువును చేతిలోకి తీసుకున్నాడు..

అది ఒక సెల్ ఫోన్...

దాన్ని ఆన్ చేయడానికి ప్రయత్నించాడు.. కానీ సెల్ ఫోన్ ఆన్ అవ్వలేదు..

"ఈ ఫోన్ ఎవరిది అయి ఉంటుంది..??"అని అన్నాడు ఆదిత్య..

"ఈ ఫోన్ కృతిక ది....!!" అంటూ ఆ సెల్ ఫోన్ బ్యాక్ సైడ్ పౌచ్ మీద ఆమె ఫోటో చూపించాడు..

"తన ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వాళ్ళ ఇద్దరి ఫోటోలు చూపించారు.."

" అయితే వాళ్లు ఈ దారిలోనే వెళ్లుంటారు..!
మనం త్వరగా వెళ్లాలి..!" అంటూ ఆ ఫోన్ తీసుకొని ముగ్గురు వేగంగా నడక ప్రారంభించారు..

అలా ముందుకు వెళ్తూ ఉండగా...!!

ముందు నడుస్తున్న అశ్వంత్ ఒక్కసారిగా కదలకుండా నిలుచుండిపోయాడు..అతని వెనక నడుస్తున్న ఆదిత్య రుద్ర. అనుకోకుండా అతని దాటి ముందుకు వెళ్ళిపోయారు..

"బ్రదర్స్..!! ఒక్క నిమిషం ఆగండి..!!" అన్న పిలుపు వాళ్ళ వెనక నుండి వినిపించడంతో ఇద్దరూ ఆగిపోయారు..

ఇద్దరూ వెనక్కి తిరిగారు....

"అక్కడే నిలబడిపోయావే.? ఏమైంది అశ్వంత్.?"
అని అడిగాడు రుద్ర..

"ఇద్దరూ ఒకసారి అక్కడ చూడండి..!" అంటూ తన చూస్తున్న వైపుకి చూపించాడు...

తను చూపించిన వైపు చూసారు ఇద్దరు....!!

ఆశ్చర్యంతో వాళ్ల కళ్ళు పెద్దవయ్యాయ్....!!



ఇంకా ఉంది....!!!
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
మరణ శాసనం - by SivaSai - 01-03-2026, 09:31 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 02-03-2026, 10:52 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 02-03-2026, 12:24 PM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:50 AM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:52 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 03-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 03-03-2026, 08:33 AM
RE: మరణ శాసనం - by sri012015 - 03-03-2026, 11:32 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:16 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 04-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 04-03-2026, 10:06 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:45 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 05-03-2026, 09:10 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 05-03-2026, 09:35 AM
RE: మరణ శాసనం - by sri012015 - 05-03-2026, 12:59 PM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:03 AM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 06-03-2026, 07:47 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 06-03-2026, 08:52 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:22 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 07-03-2026, 09:04 AM
RE: మరణ శాసనం - by SivaSai - 08-03-2026, 09:02 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 08-03-2026, 10:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 08-03-2026, 01:25 PM
RE: మరణ శాసనం - by SivaSai - 09-03-2026, 07:40 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 09-03-2026, 09:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 09-03-2026, 11:56 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:10 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:11 AM
RE: మరణ శాసనం - by masalakiss - 10-03-2026, 08:48 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 08:57 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 11:20 PM
RE: మరణ శాసనం - by masalakiss - 11-03-2026, 08:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 10:04 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 10-03-2026, 10:45 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 01:04 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 11-03-2026, 02:20 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 11-03-2026, 08:51 PM
RE: మరణ శాసనం - by SivaSai - 12-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 12-03-2026, 07:33 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 12-03-2026, 08:47 AM
RE: మరణ శాసనం - by SivaSai - 13-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by masalakiss - 13-03-2026, 07:55 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 13-03-2026, 08:07 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 13-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 14-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 14-03-2026, 08:29 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 09:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 15-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 15-03-2026, 06:55 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 15-03-2026, 09:49 AM
RE: మరణ శాసనం - by SivaSai - 16-03-2026, 03:53 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 16-03-2026, 06:24 AM
RE: మరణ శాసనం - by SivaSai - 17-03-2026, 07:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 17-03-2026, 08:34 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 17-03-2026, 05:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 18-03-2026, 08:32 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 18-03-2026, 02:34 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 05:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 19-03-2026, 12:56 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 19-03-2026, 02:09 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 19-03-2026, 03:01 PM
RE: మరణ శాసనం - by Reddy 211993 - 20-03-2026, 11:29 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 20-03-2026, 11:38 AM
RE: మరణ శాసనం - by SivaSai - 20-03-2026, 11:57 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 20-03-2026, 12:16 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 04:57 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:30 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 21-03-2026, 09:37 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 10:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 22-03-2026, 06:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 22-03-2026, 09:07 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 22-03-2026, 09:23 AM
RE: మరణ శాసనం - by SivaSai - 23-03-2026, 07:31 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 23-03-2026, 08:18 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 23-03-2026, 10:19 AM
RE: మరణ శాసనం - by SivaSai - 24-03-2026, 07:20 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 24-03-2026, 09:12 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 24-03-2026, 03:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 25-03-2026, 10:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 25-03-2026, 01:31 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 25-03-2026, 01:33 PM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 07:09 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 08:17 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 08:56 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 26-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:36 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 26-03-2026, 09:16 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 12:07 PM



Users browsing this thread: 1 Guest(s)