Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరణ శాసనం
#66
Part - 23

ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగా, గోవింద రావు అతని వెనకే నుంచుని ఉన్నారు..

" గురువుగారు మీరా...?" అంటూ లేవబోతుండగా అతన్ని కూర్చోమని చెప్పి, ఆయన కూడా అతని ముందు ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నారు..

" ఇంత రాత్రివేళ పడుకోకుండా ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావ్ నాయనా..?"

"అదేం లేదు గురువుగారు..! కొత్త ప్రదేశం కదా నిద్ర పట్టలేదు అంతే...!" అంటూ మాట దాట వేశాడు.

" నీకు అబద్దం ఆడడం చేతకాదని, నీ మాటలే చెబుతున్నాయి. నా దగ్గర నువ్వు  ఏది దాచవలసిన అవసరం లేదు. నాకు చెప్పకూడని విషయమైతే చెప్పనవసరం లేదు.."అని నవ్వుతూ అన్నారు..

" అదేం లేదు గురువుగారు..!! ఆదిత్య గురించే ఆలోచిస్తున్నాను..!!"

" ఆదిత్య గురించా..??"
అంటూ ఆశ్చర్యంగా అడిగారు గోవింద రావు.

"గురువుగారు..! ఈరోజు మనం ఎదుర్కొన్న దుష్ట శక్తుల గురించి మీరేమనుకుంటున్నారు..?"

" ముందే చెప్పాను కదా..!! అవి కావలి శక్తులు.!
పైగా శక్తివంతమైనవి..!! "అని అన్నారు గోవింద రావు

" అవి కావలి శక్తులు కావని నా అభిప్రాయం గురువు గారు..!!"

" అంటే..??"అని అనుమానంగా అడిగారు.. గోవింద రావు

" అవి అనుచర గణాలేమొనని అనుమానంగా ఉంది.. గురువు గారు..??"

" అనుచర గణాలా..?? " అంటే..?? "

"ఒకసారి ఇది చూడండి...!!" అంటూ తన పక్కన ఉన్న ఒక గ్రంథాన్ని చూపించాడు..

అది పురాతన కాలం నాటి గ్రంధం..

దానిపై ఎర్రటి వర్ణంలో పెద్ద పెద్ద అక్షరాలతో ఏదో రాసి ఉంది..

"ఇది ఏంటి..!!" అని అడిగాడు గోవింద రావు..

"గురువు గారు..ఇది తాంత్రికులకు సంబందించిన పురాతన గ్రంధం.. దీని పేరు కౌమూదిక..

తాంత్రికులు శక్తి సాధన కోసం, దీనిని ఒక వేద గ్రంథంగా భావిస్తారు.తంత్ర విద్యలలో ఆరి తేరిన కౌమూదికుడు దీనిని రచించారు.. ఆయన పేరు మీద దీనికి ఆ పేరు వచ్చింది..

దీనిని మా నాన్న గారికి ఆయన గురువు గారు ఇచ్చారు...
ఈ గ్రంధంలో మంత్ర విద్య సాధన గురించి, తాంత్రిక శాస్త్రంలో పూజింపబడే దుష్ట శక్తుల గురించి పూర్తిగా వివరించబడింది.!! ఒకసారి ఇక్కడ చూడండి.."అంటూ ఆ గ్రంధాన్ని తీసి,కొన్ని పేజీలు తీసిన తరువాత ఒక పేజీని ఆయనకు చూపించాడు..

ఆ పేజీలో ఒక చిత్రం కింద ప్రత్యేకమైన లిపి లో ఏదో రాసి ఉంది..

గోవింద రావు కి ఏమీ అర్థం కాక " ఇది అసలు ఏమి భాష...? ఇంత విచిత్రంగా ఉంది..??అసలు ఇప్పటివరకు ఇటువంటి రాతలను నేను ఎక్కడ చూడలేదు..?"అని అడిగాడు..

"ఇది తాంత్రిక భాష...!!ఈ భాష తాంత్రికులకు మాత్రమే అర్థమవుతుంది.. ఈ చిత్రాన్ని ఒకసారి చూడండి.." అంటూ ఆయనకు ఒక చిత్రాన్ని చూపించాడు..

ఆ చిత్రాన్ని చూడగానే గోవింద రావు గారి నొసలు ముడుచుకున్నాయి.. వెంటనే రుద్ర వైపు చూసి,
" ఈ చిత్రం అచ్చం మనం ఎదుర్కొన్న దుష్ట రాకాసిలా ఉంది  కదా...!!"అని అన్నారు..

" అవును గురువుగారు.. కానీ ఇది కావలి శక్తి కాదు.
ఇది ఒక భయంకరమైన దుష్ట తాంత్రిక దేవత యొక్క అనుచరగణంలో ఒకటి.."

" అసలు నువ్వేం మాట్లాడుతున్నావో.. నాకు అర్థం కావడం లేదు రుద్ర...!???"

" గురువు గారు కొంచెం నేను చెప్పేది పూర్తిగా వినండి..!! తాంత్రికులు పూజించే దేవతలలో, దుష్ట దేవతలు కూడా ఉంటాయి.. వాటిని అదుపు చేయలేము కానీ, వాటిని వశపరచుకో గలిగితే ఏదైనా సాధించవచ్చు.. ఎవరి ప్రాణాలైన తీయవచ్చు.."

"అంటే..??" అని పూర్తిగా అర్థంకాక అడిగారు గోవింద రావు..

" మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి..
తాంత్రికులు పూజించే దుష్ట దేవతలలో కర్ణ పిశాచి ఒకటి.. దీనిని మనం వశపరచుకోగలిగితే, భూత భవిష్యత్ వర్తమానాలను మనకి చెవిలో చెప్తూ ఉంటుంది.. మన కంటికి మాత్రం కనిపించదు.. దీనిని ఆవాహన చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది..

అవి ఏమిటంటే.......

ఇంట్లో దేవతలని పూజించకూడదు. గుడికి వెళ్ళకూడదు.. దైవస్మరణ చేయకూడదు... ఒకవేళ ఈ షరతులను ఎవరైనా మీరితే వాళ్లంతట వాళ్లే చనిపోయేలా ప్రేరేపిస్తుంది...!!"

" అంటే..? మన ఆదిత్యని పట్టుకున్నది కూడా ఇటువంటిదేనా...!!??" అని అడిగారు గోవింద రావు..

" కాదు గురువు గారు..! క్షుద్ర దేవతలలో శక్తివంతమైన, భయంకరమైన క్షుద్ర దేవత..దాని పేరు పంచవక్రి..

అంటే వికారమైన ఐదు ముఖములు కలది అని అర్థం.

దీని అనుచరగణం లో మూడు దుష్ట పిశాచ శక్తులు ఉంటాయి...

వాటి పేర్లు:విర్కొర,కరోముఖి,విస్కర్ష,...

వీటిలో విర్కొర,విస్కర్ష అనేవి పంచవక్రి ని ఎవరైనా ఎదిరించాలని గాని, వ్యతిరేక శక్తి ప్రయోగాలు చేయాలని గాని,చూస్తే చంపేస్తాయి..

కరోముఖి మాత్రం పంచవక్రీ కి, రక్షణగా ఎప్పుడు ఆమె చుట్టే ఉంటుంది...

ఇది పూర్తిగా శత్రువుని ఏమారుస్తుంది...

మాయలను సృష్టించి, శత్రువుని అంతం చేస్తుంది..

పంచవక్రీ ఎవరినైతే చంపాలో, వారిని మాత్రమే చంపుతుంది.. తన అయిదు తలలతో అతని శరీరంలో పంచేంద్రియాల నుండి పూర్తిగా
జీవ శక్తిని పీల్చి, నరకం చూపించి చంపుతుంది...

కానీ దాని కావలి శక్తులు మాత్రం మిగతా
శత్రు నాశనం చేస్తాయి...

తాంత్రిక విద్యలో శక్తివంతమైన శత్రువుని చంపడానికి,ఈ క్షుద్ర దేవతను ప్రయోగిస్తారు...

దీనిని ఎవరి మీదైతే ప్రయోగిస్తారో.....

వారికి ఐదు అమావాస్యల లోపు ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది....

ఒక్కొక్క అమావాస్య గడిచే కొద్దీ వీరికి ప్రాణాపాయం మరింత ఎక్కువవుతుంది..

దీనిని ఒక్కసారి ప్రయోగించిన పిదప వెనక్కి తీయడం ఎవరి వల్ల కాదు..

ఒకసారి ప్రయోగించబడిన వ్యక్తి ఎక్కడ ఉన్నాసరే దాని బారి నుంచి తప్పించుకోలేడు...

ఆ మనిషి మరణం పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆ క్షుద్ర దేవత శాంతీస్తుంది.. ఇప్పటివరకు ఈ క్షుద్ర దేవత ప్రయోగింపబడిన వ్యక్తి బ్రతికినట్టు చరిత్రలో లేదు....

రుద్ర చెప్పిన మాటలు విన్న తరువాత నీరసంగా కుర్చీలో కూలబడి పోయారు గోవింద రావు..

" ఏమైంది గురువుగారు..??" అంటూ మోకాళ్ళపై కూర్చుని ఆయన చెయ్యి పట్టుకుని కంగారుగా అడిగాడు రుద్ర..

"మరి దీనికి పరిష్కారం మార్గమే లేదా రుద్ర.?" అని నీరసంగా అడిగారు గోవింద రావు..

"నేను చదివిన దాని బట్టి, పరిష్కార మార్గం ఏమీ లేదు గురువుగారు...!!" అని బాధగా తలవంచుకుని చెప్పాడు..

ఆ మాటలు విన్న గోవింద రావు గారు తలవంచుకుని కన్నీళ్లు పెట్టుకోసాగారు..

ఆయన బాధ చూసి రుద్ర మనసు కూడా ద్రవించి పోయింది..

బాధగా ఏదో ఆలోచిస్తున్న రుద్ర ఒక్కసారిగా ఏదో తట్టినట్టు.."గురువుగారు నాదొక చిన్న సలహా..!!" అని చెప్పాడు రుద్ర..

" చెప్పు రుద్ర..!!" అని అన్నారు గోవింద రావు..

"నాకు తెలిసిన ఒక మహా తాంత్రికుడు ఉన్నారు.
ఆయన పేరు సిద్ద భైరవ.. ఆయనను కలిస్తే,తప్పకుండా మనం సమస్యకు పరిష్కారం ఉంటుంది.. గురుదేవా...!!"

" అవునా..!! ఆయన ఎక్కడ ఉంటారు..!" కుతూహలంగా అడిగాడు గోవింద రావు.

"నాకు కూడా పూర్తిగా తెలియదు. కానీ మా నాన్న గారు చెప్పగా తెలిసింది.. కర్ణాటక లోని హళేబీడు లో ప్రముఖ హొయసలేశ్వర ఆలయం ఉంది..ఆలయానికి కొద్ది దూరంలో ఒక మారుమూల గ్రామం ఉంది. ఆ గ్రామంలో తాంత్రికులు ఆరాధ్య దేవత అయిన ప్రత్యంగిరా దేవి మాత ఆలయం ఉంది.ఆయన అక్కడ ఉంటారని, ఆయన దగ్గరే శిష్యరికం చేశాను అని మా నాన్నగారు చెప్పారు.."

"సరే..!!రేపే బయలుదేరదాం.. అమావాస్య ఘడియలు వచ్చేలోపు తిరిగి మనం ఇక్కడ ఉండాలి..!" అన్నారు గోవింద రావు..

"కానీ గురువుగారు..! మీరు ఇంకా యాక్సిడెంట్ లో తగిలిన దెబ్బల నుండి పూర్తిగా కోలుకోలేదు..ఈ పరిస్థితుల్లో అంత దూరం ప్రయాణం మీకు మంచిది కాదు. నేనొక్కడినే వెళ్లి వస్తాను.."అని అన్నాడు రుద్ర..

" నా ఆరోగ్యం గురించి నాకు ఎటువంటి భయం లేదు నాయనా..!! నా దిగులంతా వాడి గురించే..! నా ఆరోగ్యం కోసం చూసుకుని, వాడిని ఈ పరిస్థితుల్లో వదిలేయలేను.. నాకేం పర్వాలేదు రేపే బయలుదేరాలి...!!"

" రుద్ర చెప్పేది నిజమే..!ఈ పరిస్థితుల్లో నువ్వు బయలుదేరడం అవసరమా.. తాతయ్య??" అని ఆదిత్య మాటలు వెనకనుండి వినిపించాయి..

ఇద్దరు వెంటనే వెనక్కి తిరిగి చూశారు...

వాళ్ళ వెనకాల ఆదిత్య నుంచుని ఉన్నాడు..

" నువ్వు ఎప్పుడొచ్చావ్ బాబు..??" అని అడిగారు గోవింద రావు..

" మీరు మేడపైకి వస్తున్నప్పుడు నీ వెనకాల నేను వచ్చాను.. కానీ రుద్ర తో మీరు మాట్లాడుతూ ఉండటం చూసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా కిందకి వెళ్లి పోదామనుకున్నా, కానీ
నా గురించి సంభాషణ వచ్చేసరికి మాట్లాడకుండా మొత్తం విన్నాను.. "అని చెప్పాడు ఆదిత్య...

గోవింద రావు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు...

ఆదిత్య ఆయన దగ్గరకు వచ్చి," మీరేమి నా గురించి భయపడకండి తాతయ్య..!! నేను రుద్ర ఇద్దరం కలిసి వెళ్లి ఆయనను కలుస్తాం.."అని చెప్పగానే..

" వద్దురా... ఈ పరిస్థితుల్లో ఇల్లు దాటి బయటకి వెళ్ళడం, నీకు చాలా ప్రమాదం.. నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను.." అని కన్నీళ్లు పెట్టుకో సాగారు గోవింద రావు..

ఆదిత్య ఆయన భుజంపై చేయి వేసి " తాతయ్య ఎప్పుడో వచ్చే చావు గురించి నేను భయపడి చేతకాని వాడిలా ఇక్కడ కూర్చోలేను.నా గురించి మీరు అందరూ ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు.. జరగబోయే ప్రమాదాన్ని నేను ధైర్యంగా ఎదుర్కోగలను అనే నమ్మకం నాకుంది.
కాబట్టి నా మీద నమ్మకం ఉంచి నన్ను బయలుదేరనివ్వండి.." అని ఆదిత్య అనగానే..

అయిష్టంగానే ఒప్పుకొని..." జాగ్రత్త ఆదిత్య..!! ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు.. ఆ జగన్మాత ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి.."అంటూ ఆశీర్వదించారు..

"నువ్వేమంటావ్ రుద్ర...?!" అని ఆదిత్య అడగగానే..

రుద్ర నవ్వుతూ ఆదిత్య భుజంపై చేయి వేసి," వెరీగుడ్ ఆదిత్య..!! నీలో ఈ ధైర్యం చూస్తుంటే మనం సాధించగలం అనిపిస్తుంది.. రేపే మనం బయలుదేరుతున్నాం.."

"మంచిది నాయనా..!!" జాగ్రత్తగా వెళ్లండి..! పొద్దున 10 గంటలకి శుభ ఘడియలు మొదలవుతాయి. అప్పుడు బయలుదేరండి. అంతా శుభం జరుగుతుంది..!" అని అన్నారు గోవింద రావు..

సరే అని చెప్పి అందరూ ఎవరి గదుల్లొకి వారు వెళ్ళీ నిద్ర పోయారు..

ఆ మర్నాడు ఉదయం 9 గంటలకే ఆదిత్య రుద్ర లేచి రెడీ అయ్యారు..

పొద్దున్నే నిద్ర మత్తుతో లేచి, ఆదిత్య ఏం చేస్తున్నాడని చూడడానికి అతని గదికి వెళ్ళింది భాను..

అప్పటికే ఆదిత్య రెడీ అయ్యి, లగేజ్ సర్దుకున్నాడు..

భాను కి ఆదిత్య ఎక్కడికి వెళుతున్నారో అర్థం కాక.." ఎక్కడికి సార్ ఇంత పొద్దున్నే..?? లగేజ్ కూడా సర్దుకుంటున్నారు ఎందుకు..??" అంటూ కొంచెం ఆతృతగా అడిగింది..

"హాయ్ భాను లేచావా.? సారీ..!! చెప్పడం మర్చిపోయాను.. పని మీద ఊరెళ్తున్నాను.."అని చెప్పగానే భాను మొఖం కళావిహీనం అయింది..

" అవునా ఎన్ని రోజుల్లో వస్తారు..??" అని ముభావంగా అడిగింది..

" చెప్పలేను..! ఒక పది, పదిహేను రోజులు పట్టొచ్చు. అంతకంటే ఎక్కువ కూడా అవ్వచ్చు..." అంటూ అటువైపు తిరిగి బట్టలు సర్దుకోసాగాడు.

ఆ మాటల విన్న భాను ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది..

ఆమె ఏడుపు శబ్దం విని వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ లేదు.. ఏమైందో అని ఖంగారు పడుతూ భాను రూం కి వెళ్ళాడు..

అక్కడ మంచంపై పడుకుని ఏడుస్తూ ఉంది..

ఆదిత్య ఆమె మంచం దగ్గరికి వెళ్ళి, "ఏమైంది భాను...?"అని అడిగాడు..

తను మాత్రం సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది..

ఆదిత్య కి తన ఎందుకు ఏడుస్తుందో అర్థం కావడం లేదు.

అందుకే ఆమె దగ్గరగా వెళ్లి మంచం పై ఉన్న ఆమె భుజంపై చేయి వేశాడు..

ఆదిత్య ఆమె భుజంపై చేయి వేయగానే, హఠాత్తుగా లేచి ఆదిత్యని గట్టిగా వాటేసుకుని
ఏడవసాగింది..

ఈ హఠాత్పరిణామానికి ఆదిత్య ఆశ్చర్యపోయాడు.. భాను అలా గట్టిగా కౌగిలించుకోవడంతో, మొదటిసారి స్త్రీ స్పర్శ తగ్గడం వల్ల, శరీరంలో ఏదేదో జరగసాగింది..

ఆదిత్య మాత్రం ఉక్కిరిబిక్కిరవుతూ..!!
" భాను ఏంటిది..? ప్లీజ్ ఎవరైనా చూస్తే బాగోదు..?" అని అంటూ ఆమె కౌగిలి నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నాడే కానీ ఆమె పట్టు నుంచి బయటికి రాలేకపోతున్నాడు..

కానీ భాను మాత్రం. " ప్లీజ్..!! నన్ను వదిలి వెళ్ళకండి... మీరంటే నాకిష్టం.. ఐ లవ్ యు..!!" అంటూ ఏడవసాగింది..

ఆ మాటలు విన్న ఆదిత్య ఆశ్చర్యపోయాడు.

కానీ తనకు ఇష్టం లేదన్న మాట మాత్రం తన నోటి నుండి రావడం లేదు.. ఎందుకంటే తనకి తెలియకుండానే తను కూడా భానుని ఇష్టపడుతున్నాడు అన్న సంగతి తనకు తెలుసు..

"ప్లీజ్ బాను వదులు..!! ఎవరైనా చూస్తే బాగోదు."

" లేదు..!! మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారో, లేదో చెప్తేగాని వదలను..!!"అంటూ తన గుండెలపై తలపెట్టి ఏడవసాగింది..

ఆదిత్య నవ్వుతూ " నాక్కూడా నువ్వంటే చాలా ఇష్టం..
కానీ చెప్పటం కుదరలేదు.." అని అనగానే

ఆదిత్య కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ " నిజంగా నేనంటే మీకిష్టమేనా అని అడిగింది..??"

ఆదిత్య ఆమె ముఖాన్ని తన రెండు చేతులలోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి "ఐ లవ్ యు" అన్నాడు..

ఆదిత్య ఐ లవ్ యు చెప్పగానే ఆనందంతో అతని ముఖం మీద ముద్దులు కురిపించింది భాను..

ఆదిత్య కూడా ఆనందంతో ఆమె పెదాలపై గాఢంగా ముద్దు పెట్టాడు..

ఇద్దరూ అలా, చాలా సేపు ఉండి పోయారు..

ఇంతలో బయలుదేరే సమయం కావడంతో, రుద్ర ఆదిత్య కోసం అతని గదికి బయలుదేరాడు..

ఆదిత్య గదికి వెళ్లే దారిలోనే ఉంది భాను గది.

భాను గది కిటికీ లోంచి ఆదిత్య కనిపించగానే,
గదిలోకి వెళ్ళబోయాడు..

సరిగ్గా ఆ గదిలోకి వెళ్లబోతుండగానే...
ఆదిత్య భానుని ముద్దు పెట్టుకుంటున్నాడు..

ఒక్కసారిగా లోపలికి వెళ్ళేవాడు కాస్త...వెంటనే గోడకి కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు..

"అబ్బో...! వీళ్లిద్దరి మధ్య ఈ మేటర్ ఎప్పటి నుండి నడుస్తుంది...??? ఇప్పుడు ఎలా పిలిచేది.?" అంటూ గది బయట కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరగసాగాడు...

ఇంతలో అటువైపుగా మంజునాథ రావుగారు,
గోవింద రావు మాట్లాడుకుంటూ వస్తున్నారు..

భాను గది బయట అటు ఇటు తిరుగుతున్న రుద్ర ని చూశారు..

"ఏం రుద్ర..? ఇక్కడ ఏం చేస్తున్నావ్..?ఆదిత్య ఎక్కడ..?" అని అడగడంతో సిగ్గుతో ఏం చెప్పాలో రుద్ర కి అర్థం కాలేదు..

"అదేంటంటే గురువుగారు..?? అది..? అది...?"
అంటు నసగడంతో...

ఇద్దరూ అనుమానంతో గదిలోకి చూశారు...

గదిలో ఆ స్థితిలో ఉన్న వారిద్దరిని చూడగానే..
మంజునాథ రావు, గోవింద రావు ఒక్క క్షణం షాక్ అయి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు.

మరుక్షణం..!! " చూడు రుద్ర..!! వాళ్లని వెంటనే మమ్మల్ని కలవమని చెప్పు..!"అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు...


రుద్ర మళ్ళా గది లోకి చూసాడు..

ఇద్దరూ ఇంకా ఆ స్థితిలోనే ఉన్నారు..

రుద్ర కి ఏం చేయాలో అర్థం కాక, తలుపు గట్టిగా కొట్టి, ముందుకు వెళ్ళాడు...

తలుపు శబ్దం రావడంతో ఇద్దరూ కంగారుగా, దూరం జరిగి బయటకు వచ్చారు..

బయట రుద్ర ఉండడంతో, "నువ్వెప్పుడు వచ్చావ్ రుద్రా..??"అది కొంచెం సిగ్గుపడుతూ అడిగాడు..

" చూడు బ్రదర్...!!నేను వచ్చి చాలా సేపు అయింది.జస్ట్ ఇంతకుముందే మీ తాతగారు, భాను తాత గారు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్లారు.. మిమ్మల్ని వచ్చి కలవమన్నారు..
ఇక పదండి..!!" అంటూ వెళ్ళిపోయాడు.

వాళ్లు చూశారు అని తెలియగానే..
వీళ్ళిద్దరికీ కంగారు మొదలయ్యింది...

ఇద్దరూ కొంచెం జంకుతూ హాల్ లోకి వెళ్లారు..

అక్కడ మంజునాథ రావు, గోవింద రావు ఉన్నారు.

" ఏరా..? ఎన్ని రోజులనుంచి జరుగుతోంది.
మీ వ్యవహారం..??" అని అడిగారు గోవింద రావు.

"ఎన్నో రోజుల నుంచి కాదు తాతయ్య.. జస్ట్ ఇప్పుడే..."అంటూ నసిగాడు ఆదిత్య..

"మరి నువ్వు తల్లి...??"అంటూ భాను అని అడిగాడు మంజునాథ రావు..

" నాకు ఆదిత్య గారు అంటే ఇష్టం తాతయ్య...!!"అంటూ భయపడుతూ చెప్పింది..

"మరి నీ విషయం..??"అని అడిగాడు గోవింద రావు..

" నాక్కూడా తనంటే చాలా ఇష్టం తాతయ్య..!"అని చెప్పాడు ఆదిత్య..

ఏం జరగబోతుందో అని ఉత్కంఠతో చూస్తున్నాడు రుద్ర..

మంజునాథ రావు, గోవింద రావు ఇద్దరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు..

"మంచిదిరా...!! మేమే మీ పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాము. ఇద్దరు ప్రేమించుకొని మంచి పని చేశారు.." అని అనడంతో ఆదిత్య, భాను చాలా సంతోషించారు.

రుద్ర కూడా తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు..

"ఏరా రావు..? మరి పెళ్లి ఎప్పుడు చేద్దాం.??" అని అడిగారు మంజునాథ రావు...

" తాతగారు కొద్ది రోజులు ఆగండి.. నేను ఈ గండం నుంచి బయట పడ్డాక నా పెళ్లి జరుగుతుంది..!!"అని ఆదిత్య అనడంతో అందరూ సరే అన్నారు..

సమయం పది గంటలు అయింది..

పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుని, అక్కడ నుంచి బయలుదేరారు.

డ్రైవింగ్ డ్యూటీ రుద్ర తీసుకున్నాడు..

శ్రీశైలం నుంచి హళేబీడు 600 కిలోమీటర్ల పైనే దూరం ఉంటుంది.. మంచి మధ్యలో కొంచెం సేపు ఆగుతూ,16 గంటలు జర్నీ తర్వాత వాళ్లు కర్ణాటక చేరుకున్నారు..

హలేబీడు చేరుకునే సరికి బాగా రాత్రి అయిపోయింది. ఆ రాత్రికి అక్కడే ఒక హోటల్లో రూం తీసుకుని, మరుసటిరోజు ఉదయాన్నే హొయసలేశ్వర ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుని, ఆ తర్వాత సిద్ధ భైరవుల ను కలవడానికి ఆయన ఉంటున్న గ్రామానికి బయలుదేరారు..

వారు వెళ్ళవలసిన గ్రామం వారు బయలుదేరిన ప్రదేశం నుండి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది..

ఒక్క గంట ప్రయాణం తర్వాత ఆలయానికి చేరుకున్నారు..

ఆలయం లోపలికి ప్రవేశించారు..

లోపల కొంత మంది భక్తులు పూజారి ఉన్నారు.
ఆయన వయస్సు 60 సంవత్సరాలు పైనే ఉంటుంది..

రుద్ర, ఆదిత్య ఆయన దగ్గరికి వెళ్లారు..

రుద్ర ఆయనతో కన్నడలో ఏదో మాట్లాడసాగాడు..
రుద్ర బెంగళూరులో చదువుకున్నాడు...

అందువల్ల అతనికి కన్నడ భాష తెలుసు...

అయితే ఒక నిమిషం మాట్లాడిన తర్వాత తిరిగి ఆదిత్య దగ్గరికి వచ్చాడు..

" ఆయన గురించి ఏమైనా చెప్పారా..??"అని అడిగాడు ఆదిత్య..

" అడిగాను..! ఒక్క నిమిషం మనల్ని కూర్చోమన్నారు..!!" అని చెప్పాడు రుద్ర..

సరే అని చెప్పి ఆలయ ప్రాంగణం లోనే కూర్చున్నారు.

అమ్మవారి కేసి చూస్తూ ఉన్నాడు ఆదిత్య..
తను చాలా దేవతా విగ్రహాలను చూశాడు..
కానీ ముఖం సింహం రూపంలో ఉన్న ప్రత్యంగిరాదేవిని చూసి, ఆ తల్లి గురించి తెలుసుకోవాలని కుతూహలం తో రుద్ర అని అడిగాడు..

" రుద్రా..!! నేను నా దేవత విగ్రహాలను చూశాను కానీ
ఈ రూపంలో ఉన్న అమ్మవారిని ఇదే మొదటిసారి చూడడం..!! ఇంతకుముందు నేను ఈ అమ్మవారి పేరు వినడం కానీ, చూడడం గానీ జరగలేదు.. నాకు ఈ అమ్మవారి కథ తెలుసుకోవాలని ఉంది..!!" అని అడిగాడు...

" ఈ అమ్మవారు శక్తి స్వరూపిణి....!! పరమేశ్వరి అవతారం..!! దుష్ట శక్తులకు అమ్మవారంటే హడల్..!!
ఈ అమ్మవారికి నారసింహిని అనే పేరు కూడా ఉంది..!! మావంటి తాంత్రికులకు ఆరాధ్య దైవం..!! ఎటువంటి దుష్ట పీడలైన అమ్మవారి పేరు స్మరిస్తే పారిపోతాయి..!!" అంటూ అమ్మవారి గురించి రుద్ర వివరిస్తూ ఉండగా పూజారి వారి వద్దకు వచ్చారు..

పూజారి చూసి పైకి లేవబోతు ఉండగా, అయినా వాళ్ళకి కూర్చోమని చెప్పి వాళ్ల దగ్గర కూర్చున్నారు..

" నమస్కారం..! నా పేరు సిద్ధప్ప...!! మీరు ఎక్కడి నుంచి వచ్చారు..??" అని అడిగారు పూజారి..

"నమస్కారం సిద్దప్ప గారు..!! నా పేరు రుద్ర ఇతని పేరు ఆదిత్య,మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాం..!! సిద్ధ భైరవ గారిని కలవడానికి వచ్చాము.. ఆయన ఎక్కడ ఉన్నారు చెప్పగలరా..!!??" అని అడిగాడు రుద్ర.

సిద్ధప్ప కొంచెం దిగాలుగా మొహం పెట్టి,
" ఆయన ప్రస్తుతం ఇక్కడ ఉండటం లేదు బాబు..!!
ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు..!!"అని నెమ్మదిగా చెప్పారు..

ఆయన మాట విన్న రుద్ర ఒక్క క్షణం షాక్ కి లోనయ్యాడు..

ఏమైందని ఆదిత్య అడగడంతో రుద్ర ఆయన చెప్పింది చెప్పాడు..

ఆదిత్య కి కూడా మతిపోయినంత పనైంది..

" ఎందుకు వెళ్లిపోయారు స్వామి..??" అని అడిగాడు రుద్ర..

" అదంతా మేము చేసుకున్న కర్మ బాబు..!! ఒకడు చేసిన తప్పు వల్ల ఆ మహానుభావుడు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు..!" అంటూ బాధ పడ సాగారు..

" అయ్యా తమరు కొంచెం పూర్తిగా మాకు అర్థమయ్యే విధంగా వివరించి చెప్పండి.. అసలు ఏం జరిగింది..?? అని అడిగాడు. రుద్ర

" సిద్ధ భైరవ స్వామి చాలా మంచివారు.. గ్రామంలో  ఎవరికి గాలి సోకినా, దుష్ట పీడలు సోకినా ఆయనే నయం చేసేవారు.. ఆయన ఇక్కడ దగ్గర్లో ఉన్న అడవి నుంచి మూలికలు తెచ్చి, ఇక్కడి ప్రజలకు వైద్యం చేసేవారు. ఆయనకి ఊళ్లో అందరూ చాలా మర్యాద ఇచ్చేవారు..
ఈ ఊరిలో విజయదశమి పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు.. చుట్టుపక్కల పది గ్రామాల నుండి ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు.
ఈ గ్రామస్తులు ఎవరైనా పక్క ఊళ్ళో పని చేసుకుంటున్నా, చదువుకుంటున్న సరే ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి కచ్చితంగా ఇక్కడికి వస్తారు..

అలా కిందటి సంవత్సరం విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి..

ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన వల్ల,
సిద్ద భైరవ గారు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు.

" ఆ సంఘటన ఏంటండీ..!!?" అని అడిగాడు రుద్ర..

" క్రితం సంవత్సరం అమ్మవారి విజయదశమి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి.. వాటిని మా ఊరి పెద్ద విజెంద్ర ఘనంగా జరిపించాడు.ఉత్సవాలకి తన బంధువులందరిని, తన కూతురు అత్తవారింటి వారందరినీ కూడా పిలిచాడు.. ఉత్సవాలు ఘనంగా పూర్తయ్యాయి.వారి బంధువులు అందరూ వాళ్ళ ఇళ్ళకు తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు అనుకోని ఒక సంఘటన జరిగింది..

ఆయన వియ్యంకుడు రఘురాజ్ అకస్మాత్తుగా విచిత్రంగా ప్రవర్తిస్తూ అనారోగ్యం పాలయ్యాడు..  ఇంటిలో ఆయన గురించి అందరూ బాధపడుతున్నప్పుడు, ఊరిలో ఒక పెద్దమనిషి ఇచ్చిన సలహాతో ఆయనను సిద్ధ భైరవ గారి దగ్గరికి తీసుకు వచ్చారు.. ఆయన అతన్ని పూర్తిగా పరిశీలించి, "ముందురోజు రాత్రి ఎక్కడికి వెళ్లి వచ్చారు.?"  అని అడగగా.. ఆయనకు ఈవెనింగ్ వాకింగ్ అలవాటని, నిన్న ఊరి పొలిమేరలు దాటి వెళ్ళారని అతని భార్య చెప్పగా..

అయినా విజేంద్ర వైపు చూసి.." మీరు ఊరి కట్టుబాట్ల గురించి, ఉత్సవాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వీరికి చెప్పలేదా...??" అని అడిగారు..

లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు.విజేంద్ర

నిబంధన ఏమిటని రఘురాజ్ భార్య అడిగింది.

"చూడండి తల్లి..అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ గ్రామస్తులు గాని ఇక్కడ నివసించే వారు ఎవరైనా సరే..ఈ ఊరి పొలిమేరలు దాటకూడదు.. ఎందుకంటే
ఆ సమయంలో దృష్టశక్తులు అమ్మవారి శక్తులకు భయపడి, ఊరి పొలిమేరలు అవతల తిరుగుతూ ఉంటాయి.. ఈయన ఊరి పొలిమేరలు దాటడం వల్ల, ఈయనను ఒక దుష్ట శక్తి ఆవహించింది.. ఇప్పుడు మనం వెంటనే దానిని వదిలించాలి. వెంటనే క్రతువు జరిపించాలి..లేకపోతే ఈయన ప్రాణానికి చాలా ప్రమాదం..." అని చెప్పారు..

రఘురాజ్ కూతురు అడ్డు చెప్పినా..ఆయన భార్య ఒప్పుకోవడంతో...!! ఈ గుడిలోనే ఆయనకు పట్టిన దుష్ట శక్తిని వదిలించేందుకు ఏర్పాట్లు చేశారు..

హోమగుండం వెలిగించి,క్రతువు ప్రారంభించారు.. సిద్ధ భైరవులు మంత్రాలు చదువుతూ ఉండగా...రఘురాజ్ శరీరంలోని దుష్ట శక్తి తీవ్రంగా ప్రతిఘటించసాగింది... ఆయన మంత్రశక్తి ముందు ఆ దుష్ట శక్తి నిలబడలేక పోతోంది..

అలా నిర్విఘ్నంగా జరుగుతున్న క్రతువు ఇంకో రెండు గంటల్లో ముగుస్తుంది అనగా....

ఒక్కసారిగా హోమగుండంలో నీళ్ళు పడ్డాయి...

భగ భగ మండుతున్న హోమగుండం ఆరిపోయింది...

సిద్ధ భైరవులు క్రతువును భగ్నం చేసింది ఎవరా అని కోపంగా తిరిగి చూశారు...


ఇంకా ఉంది......!!!!
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
మరణ శాసనం - by SivaSai - 01-03-2026, 09:31 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 02-03-2026, 10:52 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 02-03-2026, 12:24 PM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:50 AM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:52 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 03-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 03-03-2026, 08:33 AM
RE: మరణ శాసనం - by sri012015 - 03-03-2026, 11:32 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:16 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 04-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 04-03-2026, 10:06 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:45 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 05-03-2026, 09:10 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 05-03-2026, 09:35 AM
RE: మరణ శాసనం - by sri012015 - 05-03-2026, 12:59 PM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:03 AM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 06-03-2026, 07:47 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 06-03-2026, 08:52 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:22 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 07-03-2026, 09:04 AM
RE: మరణ శాసనం - by SivaSai - 08-03-2026, 09:02 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 08-03-2026, 10:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 08-03-2026, 01:25 PM
RE: మరణ శాసనం - by SivaSai - 09-03-2026, 07:40 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 09-03-2026, 09:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 09-03-2026, 11:56 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:10 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:11 AM
RE: మరణ శాసనం - by masalakiss - 10-03-2026, 08:48 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 08:57 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 11:20 PM
RE: మరణ శాసనం - by masalakiss - 11-03-2026, 08:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 10:04 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 10-03-2026, 10:45 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 01:04 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 11-03-2026, 02:20 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 11-03-2026, 08:51 PM
RE: మరణ శాసనం - by SivaSai - 12-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 12-03-2026, 07:33 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 12-03-2026, 08:47 AM
RE: మరణ శాసనం - by SivaSai - 13-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by masalakiss - 13-03-2026, 07:55 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 13-03-2026, 08:07 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 13-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 14-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 14-03-2026, 08:29 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 09:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 15-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 15-03-2026, 06:55 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 15-03-2026, 09:49 AM
RE: మరణ శాసనం - by SivaSai - 16-03-2026, 03:53 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 16-03-2026, 06:24 AM
RE: మరణ శాసనం - by SivaSai - 17-03-2026, 07:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 17-03-2026, 08:34 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 17-03-2026, 05:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 18-03-2026, 08:32 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 18-03-2026, 02:34 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 05:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 19-03-2026, 12:56 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 19-03-2026, 02:09 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 19-03-2026, 03:01 PM
RE: మరణ శాసనం - by Reddy 211993 - 20-03-2026, 11:29 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 20-03-2026, 11:38 AM
RE: మరణ శాసనం - by SivaSai - 20-03-2026, 11:57 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 20-03-2026, 12:16 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 04:57 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:30 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 21-03-2026, 09:37 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 10:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 22-03-2026, 06:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 22-03-2026, 09:07 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 22-03-2026, 09:23 AM
RE: మరణ శాసనం - by SivaSai - 23-03-2026, 07:31 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 23-03-2026, 08:18 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 23-03-2026, 10:19 AM
RE: మరణ శాసనం - by SivaSai - 24-03-2026, 07:20 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 24-03-2026, 09:12 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 24-03-2026, 03:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 25-03-2026, 10:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 25-03-2026, 01:31 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 25-03-2026, 01:33 PM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 07:09 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 08:17 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 08:56 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 26-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:36 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 26-03-2026, 09:16 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 12:07 PM



Users browsing this thread: 1 Guest(s)