Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
మహేష్ తో మాట్లాడుతున్న లాస్య తల్లి రావటం చూసి ఖంగారేమీ పడలేదు. రమ్య చేతికి ఫోన్ ఇచ్చింది. మహేష్, "హాయ్ చిన్నత్తా! ఫోన్ తీసుకుని నువ్వు పెద్దవాళ్ళ దగ్గరకు రా" అన్నాడు. మహేష్ వీడియో కాల్ లో మాట్లడటం అందరికీ కనపడేటట్లు గా అక్కడ టేబిల్ మీద పెట్టింది రమ్య. 



అందరూ ఆశ్చర్యంగా, సందేహంగా రకరకాల ఆలోచనలతో వింటున్నారు. 



పండగ పలకరింపులు అయ్యాక మహేష్ చాలా కూల్ గా తాతయ్య రామారావు గారిని, అందర్నీ ఉద్దేశించి, 
అసలు మేనరికాల వలన జరిగే ఎన్నో జెనిటికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పి, చిన్నప్పట్నుంచీ ఒక్క చోట చాలా రోజులు కలిసి ఆడుకున్న తమ పిల్లలందరి మధ్యనా స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పాడు ముందుగా. తరవాత అదే స్నేహం లాస్యకి, తనకీ చాలా ఎక్కువ అని చెప్తూ, లాస్య తనతో పంచుకున్న తన ప్రేమ కథ గురించి చెప్పాడు. వింటున్న వాళ్ళు విస్తుపోయారు! 



పండగ వాతావరణం చాలా సీరియస్ గా అయిపోయింది. అసలు తమకు చెప్పకుండా మహేష్ కి చెప్పడం ఏమిటి, అని ముందుగా గింజుకున్నారు. మహేష్ ఓపికగా నచ్చచెప్పాడు, లాస్య అన్నలు రవి, పార్థులకు కూడా తెలుసని, వాళ్ళు తన లాగా ధైర్యం చెయ్యలేకపోతున్నారనీ చెప్పి, అసలు లాస్య, అబ్బాయి పరస్పరం ఇష్టపడిన వెంటనే తమ ముగ్గురికీ చెప్పారని, అప్పట్నుంచీ తాము వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నామని, ముఖ్యంగా ఆబ్బాయి గురించి అన్ని విషయాలు విచారించామని. ఇంతకీ అబ్బాయి పెద్ద వాళ్లకు తెలియని వాడు ఏమీ కాదంటూ, ఎవరో చెప్పారు. రామారావు గారు సంబంధం వివరాలు వింటూనే తాడెత్తున లేచారు!
***



చిన్నప్పట్నుంచీ ఒక కంచం, ఒక మంచంగా పెరిగి, అక్కచెల్లెళ్ళని పెళ్లి చేసుకున్న స్నేహితులు, తోడల్లుళ్లు రామారావు, పరాందామయ్య. ఒకానొక భూమి విషయంలో వచ్చిన స్పర్థల వలన ఈనాటికి గర్భ శత్రువులయ్యారు!



పరందామయ్య కూతురు అనుపమ కొడుకు మురళి, లాస్య కాలేజీలో స్నేహితులయ్యారు, సన్నిహితులేనని తెలుసుకున్నారు. కాలక్రమంలో ప్రేమ అంకురించింది వాళ్ళ మధ్యన. కానీ కుటుంబాల పాత పగలు తమ ప్రేమకి అవరోధమవుతాయని, ముందుగానే అన్నలకి, చిన్ననాటి చెలికాడికి చెప్పి లాస్య, మురళిని కూడా కలిపించింది. ఇపుడు లాస్య, మురళి ఎంబీఏ చేసి ఒకటే కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి చెప్పాలంటే భయపడి ఇంక ఇప్పుడు తెరతీశారు. రవి, పార్థు కూడా తాతయ్య, తల్లిదండ్రులతో ఎదురు కుండా నిలబడి అన్ని విషయాలూ పూస గ్రుచ్చినట్లు చెప్పారు. 



కోపంతో మండి పడుతున్న రామారావుగారిని, నీలవేణి, శేషాద్రి శాంతపరిచారు. నీలవేణి, "నాన్నగారూ! ఎప్పుడో మీకు, పరం బాబాయికి వచ్చిన గొడవలు వలన, లాస్యని బాధ పెడతారా?" అంటుంటే, శేషాద్రి, "అది అయోగ్యుణ్ణి ప్రేమించలేదు. మన మధ్యలో పెరిగిన మన కుటుంబాల్లో పిల్లవాణ్ణి ఎంచుకున్నది. నాన్నగారూ! మీరు ఎన్నిసార్లు పరం బాబాయితో ఉన్న ఫోటోలు చూసుకుంటూ బాధపడటం నేను చూశానో. ఇంక ఇలా కలుపుకోవటంతో మీ పగలకి తెర వేసేయండి నాన్నగారు. " అని ఎన్నో విధాలా చెప్పారు. ఎన్నడూ దేనికీ మాట్లాడని భార్య రాజేశ్వరి కూడా, "అనుని నేనే పెంచానండీ. అది పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గిర పాలు లేకపోతే నేనిచ్చాను. అప్పుడు శేషు పసివాడు. వద్దండీ ఇంక గొడవలు" అని బ్రతిమాలింది. అందరి వేడికోళ్లకి కరిగిపోయారు రామారావుగారు. 



అంత తొందరగా అహం వదులుకోలేని రామారావుగారు, " వాడు ఎన్నేసి మాటలన్నాడురా, వెధవ భూమి కోసం!"
శేషాద్రి నవ్వుకున్నాడు, 'ఈయన తక్కువ మాటలన్నాడా?' అని. 



"కోపం అంటూ వచ్చాక ఎవరేమి మాట్లాడుతున్నారో ఎవరు మాత్రం గ్రహించుకుని మాట్లాడతారు నాన్నగారూ?
అన్యాపదేశంగా కొడుకు ఎత్తి చూపుతున్నది తననే అని అర్థమయింది ఆయనకి. 
ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు. 



రాజేశ్వరి ఊరుకోలేక, " ఇలాగే మీరిద్దరూ పంతాలు పట్టి కూర్చోండి. పిల్లలు చెప్పా పెట్టకుండా దండలతో వాకిట్లో నిలబడతారు. అప్పుడు ఇద్దరు పెద్దమనుషుల పరువు గంగలో కలుస్తుందో ఆలోచించుకోండి. మంచి పిల్లలు కనక, పెద్దవాళ్లకి గౌరవం ఇచ్చి ఇలా ముందుగానే చెప్తున్నారు" గట్టిగా నాలుగూ ఝాడించింది. 



నీలవేణి, " అవునండీ నాన్నగారూ! ఎన్ని రకాలు వింటున్నాము పిల్లలు ప్రేమ పేరుతో చేసే పైశాచికమైన పనులు... నా మాట విని మీరు పెద్ద మనసు చేసుకుని బాబాయికి ఫోన్ చెయ్యండి. ఆయన కాదంటే అప్పుడే చూడచ్చు" అన్నది. 



" నామాట కాదంటాడూ... " అంటూనే, ఊళ్ళోనే ఉంటున్న స్నేహితుడికి ఫోన్ చేశారు రామారావుగారు. అంతా నీలవేణిని ప్రశంసాత్మకంగా చూసారు. 



 అక్కడ పరందామయ్యగారి ఇంట్లో కూడా ఇదే ప్రహసనం నడిచింది. మురళి తండ్రి రఘు, అనుపమ తండ్రికి నచ్చచెప్పారు. 



వాళ్ల కుటుంబమంతా తమ తోటలో కాసినవి, పూసినవీ తీసుకుని రామారావు కుటుంబాన్ని కలవడానికొచ్చారు. 



రామారావు చాపిన కౌగిట్లోకి పరందామయ్య ఒదిగిపోయాడు!
ఉగాది సంబరాలు అంబరానంటాయి ఇంట... పిల్లలు విజ్ఞతతో చెప్పిన తీర్పుతో!
***
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - బతుకు భయం - by k3vv3 - 18-03-2026, 02:52 PM



Users browsing this thread: 1 Guest(s)