Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరణ శాసనం
#62
Part - 22

సరిగ్గా అప్పుడే ఒక విచిత్రం జరిగింది ....

ఆదిత్య మరో మూడు అడుగులు వేస్తే గేటు దాటుతాడు అనగా....

ఆ రాకాసి వెనకనుంచి ఒక బైక్ వేగంగా ఇంటి ఆవరణలోకి దూసుకు వచ్చింది...

ఆ బైక్ మీద వెనకాల కూర్చున్న ఒక యువకుడు చేతిలో త్రిశూలం తో వేగంగా కిందికి దూకి, ఆదిత్య మెడపై చేయివేసి వెనక్కి తోసాడు...

ఆ ధాటికి ఎగిరి,దూరంగా ఉన్న పెద్దగా పెరిగి ఉన్న గుబురు మొక్కలపై పడ్డాడు ఆదిత్య..

ఆ హఠాత్పరిణామానికి ఆ రాకాసి కోపంగా అరిచింది.....

ఆ యువకుడు వెంటనే ఆ రాకాసి వైపు వెళ్లి,
తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని గాలిలోకి చూపించి.."హర హర మహాదేవ శంభోశంకర" అని అరుస్తూ దానిముందు గుచ్చాడు...

అంతే.....!!!

ఆకాశంలో పెద్దగా మెరుపులు మెరుస్తాయి...

ఎక్కడో పిడుగులు పడిన శబ్దం వచ్చింది..

అప్పటి వరకు యాగశాలలో బీభత్సం సృష్టిస్తున్న భీకరమైన సుడిగాలి చిటికెలో మాయమైపోయింది..

అప్పటివరకు భయంకరంగా వీస్తున్న, పెనుగాలి కూడా వీచడం ఆగిపోయింది..

సరిగ్గా అప్పుడే ఒక కారు కూడా వేగంగా ఆ ఇంటి లోపలికి ప్రవేశించింది....

ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కరెంటు వచ్చి, వెలుగు పరుచుకుంది...

ఆ వెలుగులో నల్లటి దుస్తుల్లో ఉన్న
ఆ యువకుడు అందరికీ కనిపించాడు..

ఆ యువకుడు మరెవరో కాదు " రుద్ర..."

అతనిని బైక్ పైన తీసుకువచ్చింది సత్యం..



అసలు అంతకు ముందు ఏం జరిగిందంటే...!!



అర్జెంట్ గా, ఫోన్ రావడంతో మంజునాథ రావు గారి ఇంటి నుంచి  బయలుదేరిన తర్వాత,  సత్యం సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు చేరుకున్నాడు..

ఆ స్టేషన్ లో కొత్తగా చేరిన కానిస్టేబుల్ కిషోర్ అతనికి ఎదురు వచ్చాడు.. అతనే సత్యం కు ఫోన్ చేసింది..

కిషోర్ ని చూడగానే సత్యం విసుక్కుంటూ..
" ఇప్పుడు అంత అర్జెంట్ గా నన్ను పిలవాల్సిన అవసరం ఏముంది కిషోర్..? నేను ముందే చెప్పాను కదా..! ఈరోజు నేను ముఖ్యమైన పనుల్లో ఉంటానని..!!"

" సారీ సార్...!! ఒకతను మన ఆదిత్య సార్ కోసం రాజమండ్రి నుంచి వచ్చానని చెప్పారు..
ఆయన లీవ్ లో ఉన్నారని చెప్తే ఆయన తాతగారైన గోవింద రావు గురించి అడుగుతున్నారు.. ఆదిత్య సార్ తాతగారు ఎవరో మాకు తెలియదు.. మీకు తెలుసేమోనని, మీకు ఫోన్ చేశాను సార్...!!"అని చెప్పాడు..

"ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు..??"

" అదిగో అక్కడే ఉన్నాడు సార్..!" అని కుర్చీలో కూర్చున్న, నల్లటి దుస్తుల్లో ఉన్న
ఒక యువకుడిని చూపించాడు.

అతని దగ్గరికి వెళ్లాడు సత్యం...

సత్యం ని చూడగానే లేచి నుంచున్నాడు
ఆ యువకుడు..

" మీరు..??"అని సత్యం అడిగే లోపు.

" హలో సార్...!!నా పేరు రుద్ర...! మారేడుమిల్లి లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమైన పనిమీద ఆదిత్య గారిని కలవడానికి వచ్చాను. ఆయన ఫోన్ నెంబర్ నాకు తెలియదు..ఆయన తాత గారికి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అందుకనేఈ స్టేషన్ లో పని చేస్తారని తెలిసి,ఆయన అడ్రస్ తెలుసుకుందామని వచ్చాను..."అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు...

"రుద్ర అంటే విజయవాడలో ఉండే శివుడు గారి కొడుకే కదా.. గోవింద రావు గారు వచ్చింది
మీ కోసమే కదా...!!"అంటూ కుతూహలంగా అడిగాడు..

నవ్వుతూ తల వూపాడు రుద్ర...

సత్యం వెంటనే రుద్ర చేతులు పట్టుకుని..
"దేవుడి లాగ వచ్చారు సార్...!! మీరు ఎప్పుడొస్తారా అని తలుచుకోని క్షణం లేదు..!
సరిగ్గా సమయానికి వచ్చారు..! రండి సార్..!! ఆదిత్య గారి దగ్గరికి తీసుకు వెళతాను.."అని అన్నాడు..

" మీ పేరు..??"

" నా పేరు సత్యం సార్...!!"

" చూడండి సత్యం గారు..! నేను మొదట గోవింద రావు గారి ని చూడాలనుకుంటున్నాను.
ఆయన కూడా అక్కడే ఉన్నారా...??"

ఆ మాటకి సత్యం కొంచెం దిగాలుగా ముఖం పెట్టి,
" లేదు సార్..! ఆయనకి యాక్సిడెంట్ అయింది..
హాస్పిటల్ లో ఉన్నారు.."

"ఇప్పుడు ఎలా ఉన్నారు..?"అని కంగారు పడ్డాడు రుద్ర..

"ఆయనకేం పరవాలేదు సార్..!
కానీ సత్యనారాయణ రావు గారికి మాత్రం దెబ్బలు చాలా గట్టిగా తగిలాయ్..! ఐసీయూలో ఉన్నారు.."

" మరి పురుషోత్తం కి ఎలా ఉంది..?? "

" పురుషోత్తం అంటే ఆ కార్ డ్రైవర్ ఆ సార్..!!?? అతని పేరు తెలియక ఇన్నిరోజులు బుర్రలు బద్దలు కొట్టుకున్నాం..!! అతను కూడా ఇప్పుడు బాగానే ఉన్నాడు.."

" సరే..!! ముందు వెంటనే నేను గోవింద రావు గారిని చూడాలి.. దయచేసి నన్ను అక్కడికి తీసుకు వెళ్ళండి..."

"అలాగే సార్ రండి.! నేను తీసుకెళ్తాను..! " అంటూ ఇద్దరు బైక్ మీద హాస్పిటల్ కి బయలుదేరారు... వారిని అనుసరిస్తూ రుద్ర వచ్చిన కారు బయలుదేరింది..

కొద్ది నిమిషాల ప్రయాణం తర్వాత హాస్పిటల్కి చేరుకున్నారు..

మొదట సత్యనారాయణ రావు గారు ఉంచిన ఐసియు దగ్గరికి తీసుకెళ్లాడు సత్యం..

సరిగ్గా అప్పుడే ఐసియు నుంచి డాక్టర్ గారు బయటకు వచ్చారు..

సత్యం నే చూస్తూనే.." ఆ కరెక్ట్ టైం కి వచ్చారు మీకే కబురు చేద్దాం అనుకుంటున్నాను.."

" ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్..?"

" గుడ్ న్యూస్..! ఆయనకి ప్రాణాపాయం తప్పింది.ఇంకో వారం రోజుల్లో లేచి తిరుగుతారు.."అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు..

" మీరు వచ్చిన వేళా విశేషము సార్..!! నిన్నటి వరకు 24 గంటలు గడిస్తే గాని ఏమి చెప్పలేమన్నారు.. ఇప్పుడు ప్రాణాపాయానికి ఏం ప్రమాదం లేదన్నారు.. ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ సార్..!!"

" ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. గోవింద రావు గారి దగ్గరికి కూడా తీసుకు వెళ్ళండి..!!"

" ఇక్కడే సార్.. ఈ పక్కనే రండి..!" అంటూ ఆయనను ఉంచిన గదికి తీసుకువెళ్లాడు...

గదిలోకి వెళ్ళగానే నర్స్ మందులు ఇస్తుంటే వేసుకుంటున్నారు గోవింద రావు...

ఆ పక్కన మరో బెడ్ పై పురుషోత్తం నిద్ర లో ఉన్నాడు..

రుద్ర నేరుగా వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించాడు...

" ఎప్పుడొచ్చావ్ నాయనా..!??" అంటూ ఆనందంతో గోవింద రావు లేవబోతుండగా..

" లేవద్దు గురువు గారు..!!"అంటూ ఆయన పక్కనే కుర్చీలో కూర్చున్నాడు..

" మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది..!??"

" అంతా తమరి దయ గురువుగారు..!!
మీ ప్రాణాలను అడ్డేసి మరీ.. నా తల్లిని కాపాడారు..మీరు ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను...!!" అంటూ గోవింద రావు చేతులు పట్టుకున్నాడు...

" అదంతా నీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం నాయనా..!! వారు చేసిన మంచే, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతోంది...! అయినా అమ్మను వదిలేసి ఇలా వచ్చావ్ ఏమిటి..??"

" అమ్మకి ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు గురువుగారు.. రఘునాథ్ రెడ్డి గారి ఇంట్లో ఉంది.

అసలు అమ్మే.. నన్ను ఇక్కడికి మీ దగ్గరికి పంపించింది..అమ్మగారి బాధ్యత రఘునాథ రెడ్డి గారు చూసుకుంటాం అన్నారు.. అందుకనే నేను రఘునాథ రెడ్డి గారు పంపిన కార్లో ఇక్కడికి వచ్చాను...!! ఆదిత్య పరిస్థితి ఎలా ఉంది గురువుగారు..??"

ఆదిత్య పేరు ఎత్తగానే ఒక క్షణం ఉలిక్కిపడ్డారు .
గోవింద రావు..

కంగారుగా సత్యం వైపు చూడగా.. సత్యం ఆయన కంగారు అర్థం చేసుకొని.." ఆదిత్య గారికి
ఏ ప్రమాదం లేదు గురువుగారు..!! ప్రస్తుతం మంజునాథ రావు గారి ఇంట్లో ఆయన క్షేమంగా ఉన్నారు.ఆయన కోసం రుద్ర హోమం జరిపిస్తున్నారు..!! "అని చెప్పగానే..

సత్యం చెప్పిన మాట వినగానే ఒక్కసారిగా రుద్ర,గోవింద రావు ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూస్తున్నారు..

"గురువుగారు ఈరోజు అమావాస్య కదా..!!
దాని శక్తులు ఉచ్చ స్థితిలో ఉంటాయి..!!
మరి దాన్ని ఆపడానికి రుద్రహోమం జరిపిస్తే,
అది ఊరుకుంటుందా..!?? అది చాలా ప్రమాదం కదా...?"అని రుద్ర సందేహం వెలిబుచ్చగానే..

" రుద్రా..!!మనం వెంటనే బయలుదేరాలి.. అమావాస్య ఘడియలు వెళ్లడానికి ఇంకా ఎంత సమయం ఉంది..??"

రుద్ర వెంటనే వాచ్ లో టైం చూసుకుని క్వాలిక్యులేషన్స్ వేసి, " ఇంకో మూడు గంటలు గడిస్తే అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయి గురువుగారు...!!"

"సరే వెంటనే బయలుదేరండి..!!"అనగానే తన వచ్చిన కారులో గోవింద రావు గారిని కూర్చోబెట్టి,
ఆయనకి రక్షణగా కారు ముందు బైక్ మీద సత్యం రుద్ర బయలుదేరారు..

అలా బయలుదేరుతూ ఉండగా దారిలో రుద్ర కి ఒక శివాలయం కనిపించింది..

వెంటనే బైక్ ఆపి ఆ గుడి లోపలికి వెళ్ళాడు..
గోవింద రావు సత్యం కూడా అతనితో పాటే గుడిలోకి వచ్చారు..

స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లబోతుండగా,
గోవింద రావు అక్కడ చెట్టు కింద పాతిపెట్టి ఉన్న ఒక త్రిశూలాన్ని తీసి రుద్ర చేతికి ఇచ్చారు .

దాన్ని చూసి "ఇది దేనికి గురువుగారు..??" అని అడిగాడు..

"రుద్రుని చేతిలో త్రిశూలమే అందం మరియు ఆయుధం.. ఇది నీ చేతిలోనే ఉంచు.."ఆయన నవ్వుతూ చెప్పారు...

ఇక వెంటనే ముగ్గురు బయలుదేరారు..

ఈసారి సత్యం డ్రైవ్ చేస్తుంటే, రుద్ర వెనకాల కూర్చున్నాడు...

ఆ ప్రాంతం మొత్తం నిర్మానుష్యం గా ఉంది..

ఎవరూ బయటకు రావడం లేదు...

మంజునాథ రావు ఇంటి దగ్గరికి చేరుకోగానే వాతావరణం భీకరంగా మారిపోవడంతో పరిస్థితి అర్థమైంది..

బైక్ డ్రైవ్ చేస్తున్న సత్యం మంజునాథ రావు ఇంటికి దగ్గరలోనే బైక్ ఆపేశాడు..

" ఏమైంది సత్యం..??"  అని రుద్ర అడగగా...

" సార్..!! అక్కడ చూశారా...??" అంటూ మంజునాథ రావు ఇంటి ముందు నుంచుని ఉన్న భయంకర రాకాసి వైపు చూపించాడు..

రుద్ర, సత్యం చూపించిన వైపు చూడగానే అక్కడ సత్యం చెప్పినట్లుగానే ఒక భయంకరమైన రాక్షసి ఉంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఆదిత్య వచ్చాడు..

"ఆయనే సార్..! ఆదిత్య గారు..!! " అని సత్యం చెప్పగానే, జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టాడు.రుద్ర..

" బైక్ ఆదిత్య దగ్గరకి పోనీ..!!!" అంటు గట్టిగా అరిచాడు..

సత్యం కూడా క్షణం ఆలస్యం చేయకుండా వేగంగా బైక్ ఆదిత్య వైపు పోనిచ్చాడు...

ఆ విధంగా రుద్ర ఆదిత్య ని కాపాడాడు...

ప్రస్తుతం.....!!!!

గాలి ప్రభావం తగ్గిపోవడంతో మంజునాథ రావు తో సహా మిగిలిన వేద పండితులు అందరూ యాగశాల వద్దకు చేరుకున్నారు..

ఎవరికీ ఎటువంటి గాయాలు తగలలేదు..
అందరూ క్షేమంగా ఉన్నారు .

అందరూ చూస్తుండగా కార్లోంచి గాయాలకి కట్టిన కట్లతో, గోవింద రావు దిగారు..

వారిని చూడగానే ఆనందంతో మంజునాథ రావు వేగంగా ఆయన దగ్గరకు చేరుకున్నారు..

"ఏరా...? ఇప్పుడు ఎలా ఉన్నావ్..!??"అని అడిగారు మంజునాథ రావు..

" తర్వాత మాట్లాడుకుందాం.!! ముందు హోమం నిర్విఘ్నంగా జరిపించాలి పదా..!! లేదంటే చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలి..!!"అంటూ తొందరపెట్టాడు గోవింద రావు..

ఈ లోపు కిందపడిపోయిన ఆదిత్యని పైకి లేపాడు సత్యం..

"సత్యం అసలు ఏం జరిగింది..? నేను ఇక్కడ ఎలా ఉన్నాను?" అని అడిగాడు ఆదిత్య సత్యంతో..

"సార్..! ఇప్పుడు మాట్లాడే టైం లేదు.. వెంటనే రండి...!!"అంటూ ఆదిత్యని హోమగుండం వైపు తీసుకెళ్ళిపోయాడు...

యాగశాల వైపు వెళ్తున్న గోవింద రావు,, దూరంగా ఉన్న రుద్ర వైపు చూసి "దాన్ని ఆపే బాధ్యత నీదే నాయన..!" అని అరుస్తూ యాగశాల వైపు వెళ్ళిపోయారు..

రుద్ర చుట్టూ చూడగా అతనికి దూరంగా పడిఉన్న, ఆదిత్య విసిరేసిన రుద్రాక్షమాల కనిపించింది.. దానిని తీసి తన చేతికి చుట్టుకున్నాడు..

వేదపండితులు, మంజునాథ రావు గోవింద రావు అందరూ కలిసి తిరిగి రుద్ర హోమం ని ప్రారంభించారు..

అలా హోమం ప్రారంభించడం చూసేసరికి..
దానికి కోపం విపరీతంగా పెరిగిపోయింది..

దాని కోపానికి సూచనగా వాతావరణం మరలా తిరిగి బీభత్సంగా మారిపోయింది...

కానీ దాని ప్రభావం యాగశాల చూపలేకపోయింది...

రుద్ర వెంటనే తను వచ్చిన కార్ లో డిక్కీ ఓపెన్ చేశాడు.. అందులో నల్లటి సంచి ఒక దానిని తీసుకుని, అందులో నుంచి కొన్ని రకాలైన పూజ సామాగ్రి బయటికి తీశాడు.. అందులో ఒక చెక్క బొమ్మ కూడా ఉంది..

వెంటనే తన ముందు విభూదితో ఒక చక్రం గీసి, దాని మధ్యలో ఆ బొమ్మను ఉంచాడు.
కళ్ళు మూసుకుని మంత్రాలు చదవసాగాడు..

రుద్ర మంత్రాలు చదవడం మొదలు పెట్టిన,కొంతసేపటికి ఆ చక్రం నుంచి మంటలు రావడం మొదలుపెట్టాయి..

అలా మంటలు రావడంతో రాకాసి చుట్టూ కూడా మంటలు రేగాయి.. అలా మంటలు రావడంతో అది వికృతంగా అరిచింది.. ఆ మంటల నుంచి బయటపడడానికి తీవ్రంగా ప్రయత్నించింది.కానీ దాని వల్ల కాలేదు.. గట్టిగా అరవసాగింది..

కానీ...!! అది అలా అరుస్తున్నప్పుడే, హోమగుండం దగ్గర కూర్చుని ఉన్న, ఆదిత్య గుండె పై చేయి వేసి బాధతో గిలగిలా కొట్టుకోసాగాడు..

"ఆదిత్య ఏమైంది...??" అంటూ గోవింద రావు మంజునాథ రావు,భాను కంగారు పడడంతో,హోమగుండం దగ్గర కలకలం చెలరేగింది.

వేద పండితులు కూడా తమ మంత్రోచ్చారణ ఆపేయడంతో, " ఇక్కడ ఏం జరిగినా సరే..!హోమం ఆపడానికి వీలు లేదు..!! మీరు కానివ్వండి..!!"  అంటూ వారితో చెప్పాడు గోవింద రావు..

గోవింద రావు అలా చెప్పడంతో వారు తిరిగి  మంత్రోచ్ఛారణ చేయడం మొదలుపెట్టారు.

సత్యం ఆదిత్య పరిస్థితి చూసి వేగంగా గేటు దగ్గర ఉన్న రుద్ర దగ్గరికి వెళ్లి, ఆదిత్య పరిస్థితి చెప్పాడు..

రుద్ర వెంటనే లేచి ఆదిత్య దగ్గరికి వెళ్ళాడు..

ఆదిత్య గుండెనొప్పితో విలవిలలాడసాగాడు.

ఆదిత్య చేసి పక్కకు తీసి చూశాడు..

అతని ఛాతి పై నల్లటి గోళ్ళ గుర్తులు ఉన్నాయి.

దూరంగా ఉన్న రాకాసి వైపు చూశాడు..

అది ఆదిత్య వైపు చేతిని చూపిస్తూ అరుస్తోంది..

అప్పుడు రుద్ర కి పూర్తిగా అర్థం అయ్యింది. ఇది దాని పనే అని...

బాధతో విలవిలలాడుతూ ఉన్న ఆదిత్య చెవి దగ్గరకు వచ్చి," దయచేసి కొంత సేపు తట్టుకో ఆదిత్య..!! నీవల్ల అవుతుంది..!" అంటూ సత్యాన్ని తీసుకుని పక్కకు వెళ్ళాడు..

సత్యం చెవిలో ఏదో చెప్పాడు..

సత్యం సరేనని ఇంటి లోపలికి పరిగెత్తాడు..

మరోవైపు రుద్ర తన సంచిలో మరో బొమ్మ తీసుకొని, దానికి ఆదిత్య వేలి నుంచి కొంత రక్తం తీసి, దానికి అద్దాడు...

ఇప్పుడు చక్రం ముందు కూర్చుని, ఒక నల్లటి దారం తీసి, మొదట చక్రం లో ఉంచిన బొమ్మని చేతిలోకి తీసుకుని,
మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ ధారాన్ని ఆ బొమ్మకి చుట్ట సాగాడు.

అలా చూస్తూ ఉండగానే రాకాసి చుట్టూ మెరుపులతో కూడిన ఒక వలయం ఏర్పడి,
ఆ వలయంలో అది బంధించబడింది...

అది బంధించబడటం పూర్తవగానే..
సత్యం ఇంక మొదలు పెట్టు అని గట్టిగా అరిచాడు...

అప్పటి వరకు దాని వెనకాల చీకట్లో దాక్కుని ఉన్న సత్యం వేగంగా దానిని సమీపించి ఒక కత్తెరతో కత్తిరించాడు...

దాని జుట్టు కత్తిరించడం తో అది కోపంగా సత్యం వైపు చూసి అరిచింది..

సత్యం జడుచుకుని వెనక్కి తూలి, పడిపోయాడు..

దాని గోళ్ళు కూడా కత్తిరించాలి.. కానీ దాని దగ్గరకు వెళ్లడానికి ధైర్యం సరిపోవడం లేదు.

దూరం నుంచి అది గమనించిన రుద్ర
" సత్యం వెంటనే పని కానివ్వు..! లేదంటే చాలా ప్రమాదం..!"అని అరిచాడు..

సత్యం ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని కత్తిరించడానికి ప్రయత్నించాడు కానీ అవి చాలా గట్టిగా ఉన్నాయి.. అదే విషయాన్ని రుద్ర తో చెప్పాడు..

రుద్ర వెంటనే తన సంచిలో ఉన్న ఒక కత్తి లాంటి దాన్ని తీసుకొని అతని మీదకు విసిరాడు..

అది అందుకున్న సత్యం వెంటనే గోరు మీద ఒక్క దెబ్బ వేసాడు.. దెబ్బ పక్కకు జరిగి, దాని వేలు తో సహా తెగిపోయింది..

ఆ బాధతో అది మరింత గట్టిగా అరిచింది..

సత్యం వెంటనే అవి తీసుకుని రుద్ర వైపు పరిగెత్తాడు...

రుద్ర వెంటనే వాటిని తీసుకొని, జుట్టు ని మొదట బొమ్మ కి, రెండు బొమ్మకి కట్టాడు వాటి మధ్యన ఒక తాడు లాగా ఏర్పరిచాడు.

ఆ గోరు చివర కారుతున్న రక్తాన్ని తాడుపై రాశాడు...

అలా ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే..
ఆ గొరుకి గుడ్డ చుట్టి, ఒక నూనెలో ముంచి దానికి నిప్పంటించాడు..

ఇప్పుడు ఆ మంట తో ఆ జుట్టుకి నిప్పంటించాడు...

నిప్పు తగిలిన మరుక్షణం ఆ జుట్టు భగ్గున కాలి, మాడిపోయింది..

అది జరిగిన మరుక్షణం ఆదిత్య మామూలు స్థితికి వచ్చాడు.. రుద్ర ఆదిత్య దగ్గరకు వెళ్లగానే ఆదిత్య మామూలుగా లేచి కూర్చున్నాడు. ఆదిత్య ఛాతి మీద పరీక్షించగా, అంతకు ముందు కనిపించిన నల్లటి గొర్ల గుర్తులు ఇప్పుడు లేవు...

ఆనందంగా గోవింద రావు వైపు చూసి నవ్వాడు రుద్ర...

" ఆదిత్య ప్రమాదం నుంచి బయటపడ్డాడు గురువుగారు.."అని చెప్పగానే..

" శభాష్ రుద్ర.. మంత్రవాది శివుడి కొడుకు అనిపించుకున్నావ్..!!"అని మెచ్చుకున్నారు గోవింద రావు..

"మీరు హోమం పూర్తి చేయండి.. ఇంకా అమావాస్య ఘడియలు వెళ్లడానికి ఇంకా గంట సమయం ఉంది.. దాని సంగతి నేను చూసుకుంటాను..!" అంటూ తిరిగి వెళ్ళిపోయాడు..

తిరిగి యథాప్రకారంగా హోమం లో కూర్చున్నాడు ఆదిత్య...

రుద్ర తిరిగి వచ్చి,ఆ చక్రం దగ్గర కూర్చుని,
దానిని బంధించి ఉంచడానికి మంత్రాలు చదువుతూ దానిని చక్రంలోనే బందీగా ఉంచాడు...

అలా గంటల 45 నిమిషాలకు గడిచిపోయాయి..

మరి కొద్ది నిమిషాలలో హోమం పూర్తవక బోతుండగా..

ఆ రాకాసి ఏడుస్తున్నట్టుగా పైకి చూస్తూ కర్ణకఠోరంగా ఒక అరుపు అరిచింది...

అంతే.....!!!

ఒక్కసారిగా ఆ ప్రాంతం భూకంపం వచ్చినట్టుగా కంపించింది..

చక్రంలో ఉన్న బొమ్మ చుట్టూ కట్టిన బంధనాలు ఒక్కొక్కటిగా తెగిపోవడం మొదలెట్టాయి...

రుద్ర కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు...

రుద్ర చూస్తూ ఉండగానే ఆ బొమ్మ గాల్లోకి ఎగిరి, బంధనాలు తెంచుకొని గేటు దగ్గర ఉన్న రాకాసి శరీరంలో కలిసి పోయింది..

దాని బంధనాలు కూడా పూర్తిగా తెగిపోయాయి....

రుద్ర ఒక్కసారిగా లేచి నుంచున్నాడు...
అసలు ఏం జరగబోతోందో అర్థం కావడం లేదు..

"గురుదేవా..!? వెంటనే రండి..!"అంటూ గోవింద రావు ని పిలిచాడు.

మంజునాథ రావుతో "ఎవ్వరు హోమం దగ్గరనుండి కదలద్దు..!!" అని చెప్పి,వేగంగా అక్కడికి వచ్చాడు గోవింద రావు..

" ఏమైంది నాయనా..!!??" అని గోవింద రావు అడగగా..

గేటు దగ్గర ఉన్న నల్లటి భయంకర రాకాసి పక్కన, తెల్లటి ఆకారంలో పొడుగైన జడలతో మరొక రాకాసి ప్రత్యక్షమయింది...

వాటిని చూడగానే ఇద్దరికీ మతిపోయింది..

"ఇదేంటి గురుదేవా...? ఒకటే అనుకొన్నాను..
ఇది ఎక్కడి నుంచి వచ్చింది..??" అని ఆశ్చర్యపోతూ అడిగాడు..

"ఇవి కావలి శక్తులు...!! ఒక దానిని బందించాలని చూస్తే, మరొకటి తోడు వస్తుంది.. వీటి శక్తి సామాన్యమైనది కాదు.. బంధించడం,తరిమికొట్టడం తప్ప,నాశనం చేయడం అసాధ్యం.. మా యాక్సిడెంట్ కి కారణం తెల్లగా కనిపిస్తుంది కదా..!! అదే..!! "

" మరి ఇప్పుడు ఏం చేద్దాం గురుదేవా...!??నాకైతే ఏం చేయాలో అర్థం కావడంలేదు..!!"

అంటూ వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే,
వాతావరణం భీకరంగా మారిపోయింది..

ఆకాశం మొత్తం ఉరుములు,మెరుపులు,పిడుగు శబ్దాలతో భయంకరంగా ఉంది.

నేల భూకంపం వచ్చినట్టు అదరసాగింది...!!

పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించారు ఇద్దరు..

" గురుదేవ...! మీరే ఏదో ఒకటి చేయాలి..! కొద్ది నిమిషాలలో అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయి.. అప్పటి వరకు వీటిని ఆపగలిగితే చాలు.. హోమం కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది.....!"

ఇలా మాట్లాడుకుంటూ ఉండగా..

మూసివున్న ప్రహరీ గేటు పెద్ద శబ్దంతో పేలి పోయింది..

ఆ రెండు రాకాసులు లోపలికి రావడానికి తమ శక్తినంతా ఉపయోగిస్తున్నాయి..

రుద్ర అడ్డుగా ఉంచిన త్రిశూలం ఎగిరి,
అతని ముందు పడింది...

అవి లోపలకి రాబోతుండగా...

ఏం చేయాలో తెలీక అటూ ఇటూ చూస్తున్న గోవింద రావు గారి కళ్ళకి రుద్ర చేతికున్న రుద్రాక్ష మాల కనిపించింది...

రుద్ర చేయి పట్టుకుని "ఇది నీకు ఎక్కడిది??"
అని అడిగారు..

"ఈ రుద్రాక్ష మాల నాకు ఇక్కడే నేలపై దొరికింది. అందుకే తీసి చేతికి కట్టుకున్నాను.."

"వెంటనే నాకు దాన్ని తీసి ఇవ్వు.."అనగానే దాన్ని తీసి గోవింద రావు గారి చేతికిచ్చారు...

"ఇప్పుడు చూడు ఏం జరగబోతోందో...!!" అని కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని జపించి,
ఆ రుద్రాక్ష మాలని వాటిమీదకీ విసిరారు..

అది ఎగురుకుంటూ వెళ్లి వాటి ముందు పడింది...

కిందపడిన మరుక్షణం వెలుగు రేఖలు చిమ్ముతూ, భయంకరమైన తెల్లటి సర్పం గా మారిపోయింది..

దాన్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు...

అంతకుముందు అడవిలో వాటిలో ఒక దాని నుంచి ఆదిత్యని కాపాడింది ఈ సర్పమే....

ఆ సర్పం కోపంతో బుసలు కొడుతూ, వాటి మీదకి కోపంగా వెళ్ళసాగింది....

ఆ సర్పాన్ని చూసిన ఆ దుష్ట రాకాసులు, కోపంతో గట్టిగా అరిచాయి.. కానీ దానిని ఎదిరించే ధైర్యం చేయలేకపోయాయి...

రాకాసుల ను చూసిన ఆ శ్వేత సర్పం కోపంతో వాటిపై నోరు తెరిచి అగ్ని వర్షం కురిపించింది...

ఆ దాటికి తట్టుకోలేక అవి గట్టిగా అరుస్తూ తప్పించుకోబోతుండగా.. ఆ రెండింటిని తన తోకతో గట్టిగా చుట్టి, ఎక్కడికీ పారిపోనివ్వకుండా
బంధించింది...

ఈలోపు అమావాస్య ఘడియలు ముగిసిపోయాయి...

అమావాస్య ఘడియలు ముగిసిపోయిన వెంటనే
ఆ రెండు రాకాసులు గట్టిగా అరుస్తూ మాయమైపోయాయి....

ఆ సర్పం వెనుదిరిగి వేగంగా అక్కడ నుంచి ఉన్న
గోవింద రావు,రుద్రల దగ్గరకు వచ్చింది..

అది దగ్గరకు వచ్చిన వెంటనే ఇద్దరు దాని ముందు సాష్టాంగ పడి నమస్కరించారు...

మరుక్షణం ఆ సర్పం ఒక కాంతి పుంజంగా మారి,
ఆ కాంతి పుంజం రెండుగా విడిపోయి, వారి ముందు నేల పై పడింది..

అలా నేలపై పడిన కాంతి పుంజాలు,
చూస్తూ ఉండగానే రెండు రుద్రాక్ష మాలలు గా మారిపోయాయి...

ఆ సన్నివేశం చూసిన అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు...

ఆ దైవ సర్పానికి సాష్టాంగ పడిన ఇద్దరు పైకి లేచేసరికి, వారి ముందు రెండు రుద్రాక్ష మాలలు కనిపించాయి...

గోవింద రావు గారు ఆ రుద్రాక్షమాలలను తీసుకుని, ఆనందంతో ఒకటి రుద్ర మెడలో, మరొకటి ఆదిత్య మెడలో వేసారు..

రుద్ర హోమం నిర్విఘ్నంగా పూర్తయింది..!!

హోమం పూర్తయిన తరువాత జరగవలసిన మిగతా పనులన్నీ జరిపించారు..

రుద్ర హోమం నిర్విఘ్నంగా జరిపించిన,
వేద పండితుల అందరికి ఘనంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించారు. మంజునాథ రావు గారు..

సమయం : తెల్లవారుజాము 3:00 అవుతోంది..

హోమం నిర్విఘ్నంగా పూర్తవడంతో, అందరూ వెళ్ళిపోయారు. చుట్టుపక్కల అసల మనుషుల జాడే లేదు...

ఆకాశం మొత్తం మబ్బులు చెదిరి పోవడంతో, నిర్మలంగా ఉంది.. అమావాస్య కావడంతో నక్షత్రాలు తప్ప, చంద్రుడు కనిపించడం లేదు.

చుట్టూ కీచురాళ్ళ శబ్దం తప్ప, మరేమీ వినిపించడం లేదు..

రుద్ర ఒక్కడే మేడపై ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు.. ఏదో ఆలోచన అతని మెదడును తొలి చేస్తూ ఉంది..

ఆ ఆలోచనల వల్ల అతనికి నిద్ర పట్టడం లేదు..

"ఏం ఆలోచిస్తున్నావ్ రుద్ర..!?" అని పిలుపుతో ఉలిక్కిపడ్డాడు...



ఇంకా ఉంది....!!!
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
మరణ శాసనం - by SivaSai - 01-03-2026, 09:31 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 02-03-2026, 10:52 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 02-03-2026, 12:24 PM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:50 AM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:52 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 03-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 03-03-2026, 08:33 AM
RE: మరణ శాసనం - by sri012015 - 03-03-2026, 11:32 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:16 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 04-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 04-03-2026, 10:06 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:45 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 05-03-2026, 09:10 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 05-03-2026, 09:35 AM
RE: మరణ శాసనం - by sri012015 - 05-03-2026, 12:59 PM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:03 AM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 06-03-2026, 07:47 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 06-03-2026, 08:52 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:22 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 07-03-2026, 09:04 AM
RE: మరణ శాసనం - by SivaSai - 08-03-2026, 09:02 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 08-03-2026, 10:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 08-03-2026, 01:25 PM
RE: మరణ శాసనం - by SivaSai - 09-03-2026, 07:40 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 09-03-2026, 09:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 09-03-2026, 11:56 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:10 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:11 AM
RE: మరణ శాసనం - by masalakiss - 10-03-2026, 08:48 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 08:57 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 11:20 PM
RE: మరణ శాసనం - by masalakiss - 11-03-2026, 08:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 10:04 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 10-03-2026, 10:45 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 01:04 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 11-03-2026, 02:20 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 11-03-2026, 08:51 PM
RE: మరణ శాసనం - by SivaSai - 12-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 12-03-2026, 07:33 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 12-03-2026, 08:47 AM
RE: మరణ శాసనం - by SivaSai - 13-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by masalakiss - 13-03-2026, 07:55 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 13-03-2026, 08:07 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 13-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 14-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 14-03-2026, 08:29 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 09:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 15-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 15-03-2026, 06:55 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 15-03-2026, 09:49 AM
RE: మరణ శాసనం - by SivaSai - 16-03-2026, 03:53 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 16-03-2026, 06:24 AM
RE: మరణ శాసనం - by SivaSai - 17-03-2026, 07:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 17-03-2026, 08:34 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 17-03-2026, 05:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 18-03-2026, 08:32 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 18-03-2026, 02:34 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 05:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 19-03-2026, 12:56 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 19-03-2026, 02:09 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 19-03-2026, 03:01 PM
RE: మరణ శాసనం - by Reddy 211993 - 20-03-2026, 11:29 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 20-03-2026, 11:38 AM
RE: మరణ శాసనం - by SivaSai - 20-03-2026, 11:57 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 20-03-2026, 12:16 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 04:57 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:30 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 21-03-2026, 09:37 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 10:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 22-03-2026, 06:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 22-03-2026, 09:07 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 22-03-2026, 09:23 AM
RE: మరణ శాసనం - by SivaSai - 23-03-2026, 07:31 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 23-03-2026, 08:18 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 23-03-2026, 10:19 AM
RE: మరణ శాసనం - by SivaSai - 24-03-2026, 07:20 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 24-03-2026, 09:12 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 24-03-2026, 03:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 25-03-2026, 10:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 25-03-2026, 01:31 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 25-03-2026, 01:33 PM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 07:09 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 08:17 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 08:56 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 26-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:36 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 26-03-2026, 09:16 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 12:07 PM



Users browsing this thread: 1 Guest(s)