Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరణ శాసనం
#59
Part - 21

అది మంజునాథ రావు గారి ఇల్లు...!

సమయం రాత్రి 9;15 నిమిషాలు అయింది..

మంజునాథ రావు గారు కార్లో ఇంటికి చేరుకున్నారు..

కారు దిగుతూ చీకటిగా ఉన్న ఇంటి వైపు చూసి
" ఈ కరెంటు ఇప్పుడే పోవాలా..!??"అని అనుకుంటూ ఉండగా..

సరిగ్గా అప్పుడే బైక్ పై వచ్చాడు సత్యం..

బైక్ దిగుతున్న సత్యాన్ని చూసి," ఇప్పుడు వాళ్లకు ఎలా ఉంది సత్యం..??"అని అడిగారు.

" గోవింద రావు గారు, ఆ కారు డ్రైవర్ ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఇంకా సృహ లోకి రాలేదు.. సత్యనారాయణ రావు గారి పరిస్థితి మాత్రం అస్సలు బాగోలేదు సార్..! ఇంకో 12 గంటలు గడవాలి అంటున్నారు..."అంటూ బాధతో నిట్టూర్చాడు..

"మరైతే...?" అంటూ మంజునాథ రావు గారు ఏదో మాట్లాడబోతుండగా...

ఇంటిలో నుంచి భాను కేక చాలా గట్టిగా వినిపించింది...

ఇద్దరు ఉలిక్కి పడి వేగంగా ఇంట్లోకి పరిగెత్తారు..

వాళ్ళు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా లైట్లు వెలిగాయి...

ఇద్దరు " భాను..! భాను...!" అని అరుస్తూ అరుపు వినిపించిన వైపు పరిగెత్తారు...

అలా వెళ్తున్న వారికి హాలు దాటిన తర్వాత, రెండు గదుల అవతల, నేలపై సృహ లేకుండా పడి ఉన్న భాను కనిపించింది...

భాను ని అలా చూసిన వెంటనే "అమ్మా భాను..!" అంటూ ఆమె దగ్గరికి మంజునాథ రావు  పరుగు పెట్టారు..

సత్యం నీళ్ల కోసం కిచెన్ వైపు పరిగెత్తాడు...

మంజునాథ రావు భాను తలని వళ్ళో పడుకోబెట్టుకుని, బుగ్గల తడుతూ తెలివి తెప్పించడానికి ప్రయత్నించారు...

ఇంతలో గ్లాస్ నీళ్లతో, సత్యం వేగంగా అక్కడకు వచ్చి, భాను ముఖంపై నీళ్లు చిలకరించాడు.

భాను కి సృహ వచ్చింది..

కళ్ళు తెరవగానే ఎదురుగుండా తాతయ్య సత్యం కనిపించారు...

" ఏమైందమ్మా ఇలా నేలపై పడి ఉన్నావు..??"అని అడిగారు మంజునాథ రావు.

"తాతయ్య అక్కడ ఏదో పెద్ద ఆకారం కనిపించింది...? " అంటూ తన ఇంటి దొడ్డి వైపు ఉన్న ఖాళీ స్థలం వైపు చూపించసాగింది..

ఆమె చూపించిన వైపు ఇద్దరూ చూశారు కానీ అక్కడ ఏమి కనిపించలేదు అదే విషయాన్ని ఆమెతో చెప్పారు..

"కానీ భాను మాత్రం ఏడుస్తూ నిజంగా అక్కడ ఏదో ఉంది తాతయ్య...!!" అని అంది.

" అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మేడం..?" అని అడిగాడు సత్యం.

"నేను ఆదిత్య గారి కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను..!" అంటూ జరిగింది చెప్పింది..

" అయితే ఇప్పుడు ఆదిత్య గారు ఎక్కడ..??"
అని అడిగాడు సత్యం..

" నాకు కూడా తెలియదు. ఆయన కోసం వెతుక్కుంటూ వస్తే, ఏదో కనిపించి, భయపడి కళ్ళు తిరిగి పడిపోయాను.."

మంజునాథ రావు భానుని పైకి లేవదీసి " ఆదిత్య కోసం ఇల్లంతా పూర్తిగా వెతకండి. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి పరిసరాలు దాటి బయటకు వెళ్ళడానికి వీలు లేదు.. వెళితే అతని ప్రాణానికే ప్రమాదం.."అని చెప్తూ ఉండగానే..

"అయ్యగారు..!! భానమ్మ గారు..!! వెంటనే రండి." అంటూ ఇంటి వెనక పెరడు వైపునుండి పనివాళ్ళ కేకలు వినిపించాయి..

అరుపులు విన్న మరుక్షణం ముగ్గురు ఇంటి వెనుక వైపు పరిగెత్తారు..

మంజునాథ రావు ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంది.. మామూలుగా వాటిని ఎక్కి, దిగడం చాలా కష్టం.. పైగా గోడమీద మొత్తం గాజు పెంకులు ఉంటాయి.. బట్టి మామూలుగా ఎక్కి దిగడం దాదాపుగా అసాధ్యం..

కానీ ఆ ఇంటి వెనక ఒక పెద్ద వేప చెట్టు ఉంది ఆ చెట్టు ఎక్కితే అవతల వైపు దిగి పోవచ్చు...

ఇప్పుడు పని వాళ్లు కూడా ఆ చెట్టు దగ్గరే ఉన్నారు..

వాళ్లు ఏం చేస్తున్నారో అని చూడగా..
చెట్టు పై ఉన్న ఒక వ్యక్తిని కిందకి లాగుతున్నారు..

ఆ వ్యక్తి ఎవరో కాదు ఆదిత్య..

ఆ ఇంటి నుంచి బయట పడటం కోసం చెట్టు ఎక్కాడు. కానీ సరిగ్గా అదే టైములో అక్కడ ఉన్న పని వారు చూడడంతో అతన్ని పూర్తిగా ఎక్కనివ్వకుండ  మధ్యలోనే గట్టిగా పట్టుకున్నారు..

కానీ కిందికి లాగుదామని ఎంత ప్రయత్నించినా ఆదిత్య ఆ చెట్టుని పట్టుకుని వదలడం లేదు పైగా "నన్ను వదలండి.!నేను వెళ్ళాలి...!"అంటూ గట్టిగా అరవసాగాడు...

ఇక వారికి చేతకాక గట్టిగా సహాయం కోసం పిలిచారు...

ఆ పని వాళ్ళ పట్టు నుంచి విడిపించు బోతుండగా సరిగ్గా అప్పుడే మంజునాథ రావు భాను ఆదిత్య ని గట్టిగా పట్టుకున్నారు..

నలుగురు కలిసి ఎంత లాగినా ఆదిత్య కిందకు రావడం లేదు..

పైగా పట్టుకున్న నలుగురు చెట్టు పైకి వెళ్ళిపోతారు ఏమో అన్న అంత బలంగా ఆదిత్య పైకి లాగుతున్నాడు.. అతని బలం ముందు నలుగురి శక్తి ఏ మాత్రం సరిపోవడం లేదు..

కొంచెం దూరంగా నుంచుని చూస్తున్న సత్యాన్ని చూసి.." ఏదో ఒకటి చెయ్.." అన్నట్లుగా చూశారు మంజునాథ రావు..

ఆయన మనోగతం అర్థమైనట్టుగా సత్యం వెంటనే చెట్టు దగ్గరికి వచ్చి మెల్లగా చెట్టుపైకి ఎక్కాడు..

ఆదిత్య దగ్గరకు వెళ్లి అతని చేతులను చెట్టు నుండి ఎంత విడిపిద్దాం అన్నా.!! ఆదిత్య పట్టుకు వదలడం లేదు "నన్ను వదలండి,నన్ను వదలండి" అని అరుస్తున్నాడు..

సత్యం వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు తన జేబులో ఉన్న రుద్రాక్ష మాలను తీసి ఆదిత్య మెడలో వేశాడు...

అంతే...

అది వేయగానే వెంటనే తన పట్టుని వదిలేశాడు ఆదిత్య...

ఆదిత్య తో పాటు నలుగురు కింద పడ్డారు..

వెంటనే పైకి లేచి పనివాళ్ల సాయంతో ఆదిత్యని అతని గదిలో పడుకోబెట్టారు..

అలా పడుకోబెట్టిన ఆదిత్య మాత్రం
"నన్ను వదలండి. నేను వెళ్ళాలి.. నన్ను పిలుస్తున్నారు..." అంటూ కలవరించసాగాడు..

"అసలు ఆదిత్య అక్కడికి ఎలా వెళ్ళాడు..?" అని పనివాళ్ళని అడిగాడు మంజునాథ రావు..

"అయ్యా...! నేను వంట గదిలో మీకు భోజనం సిద్ధం చేస్తున్నాను.. సరిగ్గా అప్పుడే ఆదిత్య బాబు గారు పెరటి వైపు వెళ్ళడం గమనించాను.. నేను వెంటనే ఆగండి బాబు అంటూ ఆయన వెనక పరిగెత్తాను.నేను ఆయన వెళ్లకుండా చేతిని గట్టిగా పట్టుకోగా, నన్ను విదిలించి కొట్టారు. నేను వెంటనే రంగయ్యని పిలిచాను.. మేము ఇద్దరం వెళ్లేసరికి ఆయన చెట్టు ఎక్కుతున్నారు.. మా ఇద్దరికీ చెట్లు ఎక్కడం రాదు. అందువల్ల ఆయన కాళ్ళని గట్టిగా పుచ్చుకొని మీ కోసం కేకలు వేశాము.." అంటూ జరిగినదంతా పూర్తిగా వివరించింది ఎల్లమ్మ..

"మంచి పని చేశారు..! ఇక మీ పని మీరు చూసుకోండి...!" అంటూ వారిని పంపించేశారు మంజునాథ రావు..

ఇంతలో సత్యం ఆదిత్య బెడ్ పక్కన ఉన్న తాళ్లు తీసుకుని అతని చేతులు కట్టి వేయసాగాడు...

ఆదిత్య చేతులు మంచానికి కట్టివేస్తుండగా భాను అడ్డుకోబోయింది...

ఆమెను వారించారు మంజునాథ రావు..

" వద్దు తల్లి..! ఇప్పుడు అతని పరిస్థితి అస్సలు బాగోలేదు. రేపు ఉదయాన్నే రుద్రహోమం జరిపిస్తున్నాము.. కాబట్టి
ఈ రాత్రి అతను క్షేమంగా ఉండడం కోసం ఈ పని చేయక తప్పదు" అని చెప్పగానే భాను ఏమీ మాట్లాడలేకపోయింది..

ముందస్తు జాగ్రత్తగా ఆదిత్య ఉన్న గదులన్నీ గట్టిగా గడియలు వేసి తాళం పెట్టారు..

సత్యం ఎందుకైనా మంచిదని ఇద్దరు కానిస్టేబుళ్లను తీసుకువచ్చి, గది బయట కాపలా ఉంచారు..

మంజునాథ రావు గారు భానుని భోంచేసి పడుకోమని చెప్పి, సత్యం కి రేపు జరగబోయే రుద్రహోమం గురించి వివరించారు..

ఆయన మాటలు విన్న సత్యం " చాలా సంతోషంగా ఉంది సార్.. ఈ విధంగానైనా ఆదిత్య సార్ ని కాపాడుకోగలిగితే అదే చాలు.." అని అన్నాడు...

" రేపు తెల్లవారు ఝామున నాలుగు గంటలకి హోమం మొదలవుతుంది.. రాత్రి రెండు గంటలకు అమావాస్య ఘడియలు వెళ్లిపోయిన తర్వాత హోమం పూర్తవుతుంది. నువ్వు తప్పకుండా రావాలి" అని చెప్పి సత్యాన్ని ఇంటికి పంపించి వేశారు..


మరుసటి రోజు ఉదయం....


తెల్లవారుజామున మూడు గంటలు అయింది..

ఆదిత్య ని లేపి బయటకు తీసుకు వచ్చారు..

రాత్రి లా కాకుండా మామూలుగానే ఉన్నాడు..

అతనికి రుద్ర హోమం గురించి వివరించి,
మంగళ స్నానాలు చేయించారు..

సరిగ్గా నాలుగు గంటలకు.... అమావాస్య ఘడియలు రాకముందే, అమృత ఘడియలలో మంజునాథ రావు గారి ఇంటి ఆవరణలో రుద్రహోమం మొదలైంది...


వేద పండితుల మంత్రోచ్చారణతో.. హోమగుండంలో వేసే మూలికలు, సమిధలు ఆవునెయ్యితో వచ్చే ధూపంతో ఆ ప్రాంతమంతా పవిత్రత సంతరించుకుంది...రుద్ర హోమం గురించి తెలియడంతో చుట్టుపక్కల వారందరూ మంజునాథ రావు గారి ఇంటికి చేరుకున్నారు..

వారి కోసం హోమగుండం దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు సత్యం..

హోమగుండం దగ్గర ఆదిత్య కూర్చుని, మంజునాథ రావు గారి చెప్పినట్టే ఒక్కొక్కటిగా సమిధలు,నెయ్యి,మూలికలు హోమ గుండానికి సమర్పించసాగారు...

భాను అతని పక్కనే కూర్చుని సాయం చేయసాగింది...

గత కొన్ని రోజులుగా సరైన తిండి లేకపోయినా సరే ఆదిత్య ముఖంలో ఏదో తేజస్సు మంజునాథ రావు గారికి  కనిపించసాగింది.. ఆదిత్య, భానుని పక్కపక్కనే చూసి జంట చాలా బాగుంది అని మనసులో అనుకున్నారు...


సత్యం అక్కడ జరుగుతున్న హోమానికి కావలసిన వస్తువులను అందించసాగాడు...

అలా హోమం నిర్విఘ్నంగా జరగసాగింది..

చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది..

హోమం చూడడానికి వచ్చిన జనం చాలా వరకూ వెళ్ళిపోయారు.. కేవలం కొద్దిమంది మాత్రమే ప్రాంగణంలో ఉన్నారు.. వేదమంత్రాల నడుమ రుద్ర హోమం జరుగుతూనే ఉంది..

అక్కడ హోమం దగ్గర సహాయం చేస్తున్న సత్యంకి ఫోన్ వచ్చింది.

" హలో ఎవరు..?? చెప్పండి..! ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను రాలేను..? అవునా ..!!? సరే...!!వెంటనే బయలుదేరుతున్నా...!!." అంటూ గబగబా మంజునాథ రావు గారికి అర్జెంటు పని ఉంది అని చెప్పి బైక్ పై బయటకు వెళ్ళాడు...

నిర్విఘ్నంగా రుద్ర హోమం జరుగుతోంది...

దాన్ని జరిపిస్తున్న మంజునాథ రావుగారు చేతికున్న వాచీలో టైమ్ చూసుకున్నారు..

అప్పటికి సమయం 10:00 అయింది..

"ఇంకొక నాలుగు గంటలు హోమం నిర్విఘ్నంగా జరిగితే ఆదిత్యని ఈ గండం నుంచి కాపాడవచ్చు" అని మనసులో అనుకున్నారు...


అంతే....!!

ఉన్నట్టుండి.....!!!

అకస్మాత్తుగా ఆకాశమంత మేఘావృతమైంది..

దట్టమైన కారుమబ్బులు కమ్ముకున్నాయి..

గాలి వేగంగా వీయడం మొదలైంది..

మంజునాథ రావు గారి మనసు ఏదో కీడు శంకించింది...

కొద్ది క్షణాలలోనే హోరున వర్షం కురవడం మొదలైంది...

అలా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయే సరికి, హోమగుండం దగ్గర మంత్రాలు చదువుతున్న
వేద పండితులు కూడా ఆశ్చర్యపోయారు...

గాలి ప్రభావం యాగశాల వద్ద చాలా ఎక్కువగా ఉంది.. అయినా సరే వేదపండితులు ఎవ్వరు బెదరకుండా హోమం జరిపించసాగారు.. అది సాధారణ వాతావరణ మార్పు కాదని దుష్ట శక్తి ప్రభావం అని వారికి అర్థమైంది..

ఆదిత్య కూడా ఏమాత్రం బెదరకుండా హోమాన్ని జరిపిస్తున్నాడు...

ఇంతలో అకస్మాత్తుగా నక్కల ఊళలు
ఆ ప్రాంతంలో వినిపించసాగాయి..

నక్కల ఊళలు విన్న భాను బెదిరిపోయింది.
భయంతో ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకుంది..

" ఏంటి భయమేసిందా..??" అని భాను ని అడిగాడు ఆదిత్య.

" అవునండి..!!" అంటూ బెదురు చూపులు చూసింది.

ఆ మాటలకి ఆదిత్య నవ్వుతూ "ఏం పర్లేదు భయపడకు...!" అంటూ హోమాన్ని జరిపించసాగాడు.

ఇంతలో ఆ ప్రాంతమంతా ఉన్నట్టుండి కరెంటు పోయింది..

అసలే అమావాస్య....

పైగా ఆకాశమంత కారుమబ్బులు కమ్ముకున్నాయి.

పైగా భయంకర వర్షం....

మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి..

ఒక్క యాగశాల వద్ద తప్పించి, చుట్టుపక్కల ప్రాంతం మొత్తం చిమ్మచీకట్లో ఉంది...

అలా హోమం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల నుంచి విచిత్రమైన అరుపులు వినిపించసాగాయి...

హోమం చూడడానికి వచ్చిన జనం, ఆ నక్కల ఊళలకి, వాతావరణ మార్పులకి, ఇప్పుడు ఏం జరగబోతుందా అని బెదిరిపోసాగారు..

ఇప్పుడు విచిత్రమైన అరుపులు కూడా వినిపించేసరికి భయంతో పారిపోయారు..

ఇప్పుడు కేవలం యాగశాలలో హోమం జరిపిస్తున్న
వేద పండితులు ఆదిత్య, భాను, మాత్రమే మిగిలారు..

ఇలా అక్కడ బీభత్సమైన వాతావరణం నెలకొన్నప్పుడు, ఒక పెద్ద సుడిగాలి పైకి లేచింది.

అది చూస్తూ ఉండగానే యాగశాల మీదకు వచ్చింది.. ఆ సుడి గాలి ప్రభావం వల్ల, యాగశాలకు రక్షణగా ఏర్పాటుచేసిన మండపం గాలికి ఎగిరి పోయింది..ఆ గాలి వేగానికి హోమం జరిపిస్తున్న వేదపండితుల అందరూ మంజునాథ రావుతో సహా దూరంగా జరిగిపోయారు..
కానీ ఎంత వర్షం పడుతున్నా సరే హోమగుండం ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది...

ఆదిత్య, భాను మాత్రమే స్థిరంగా అక్కడ కూర్చుని ఉన్నారు...

ఇంతలో ఒక వికృతమైన పొలికేక ఇంటి ఆవరణ వెలుపల నుండి వినిపించింది.

ఆ పిలుపు వినిపించిన వెంటనే కూర్చున్న ఆదిత్య  ఏదో మైకం కమ్మిన వాడిలాగా లేచి నుంచున్నాడు... ఒక్కసారిగా తన మెడలో ఉన్న రుద్రాక్షమాలను తీసి దూరంగా విసిరేసి, "వస్తున్నా...! నేను వస్తున్నా..!" అంటూ ముందుకు వెళ్లసాగాడు...

"ఆగండి...!! వెళ్ళకండి...!!"అంటూ ఆదిత్య కాళ్ళు పట్టుకుంది భాను...

అవేమీ పట్టించుకోకుండా గాలి తీవ్రంగా వీస్తున్నా సరే ముందుకు వెళ్లి పోతున్నాడు.. భానుని కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు...

ఆదిత్య ఉన్న చోటు నుంచి కొద్ది దూరంలో మెయిన్ గేటు ఉంది. అప్పటివరకు ఆ గేటు గాలి ప్రభావానికి మూసుకొని పోయి ఉంది.. ఆదిత్య బయటకు వెళ్లడానికి ఆ గేటు వైపు నడవసాగాడు.. ఆదిత్య ఆ గేటుకి కొద్ది దూరంలో ఉండగానే గేటు తెరుచుకుంది..

అప్పుడు ఆ గేటు తెరుచుకున్న వెంటనే అవతల భారీ నల్లటి ఆకారం ప్రత్యక్షమయ్యింది...

మరో పక్క ఆదిత్య ని కాపాడడానికి మంజునాథ రావు గారు,మిగిలిన వేద పండితులు పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నా, గాలి ప్రభావానికి కూర్చున్న వారు లేవలేక పోతున్నారు..

ఆదిత్య గేటు దగ్గరికి చేరుకున్నాడు..

ఆ నల్లటి ఆకారం ఒక భయంకరమైన రాకాసి లాగా రూపం సంతరించుకుంది ఎర్రటి కళ్ళతో, నల్లటి జుట్టుతో, పొడవైన పదునైన గోళ్లతో, వికారంగా వికృతంగా ఉంది..

మరో మూడు అడుగులు వేస్తే బయటకు వెళ్ళిపోతాడు అనగా....


సరిగ్గా అప్పుడే ఒక విచిత్రం జరిగింది.....


ఇంకా ఉంది....!!!
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
మరణ శాసనం - by SivaSai - 01-03-2026, 09:31 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 02-03-2026, 10:52 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 02-03-2026, 12:24 PM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:50 AM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:52 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 03-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 03-03-2026, 08:33 AM
RE: మరణ శాసనం - by sri012015 - 03-03-2026, 11:32 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:16 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 04-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 04-03-2026, 10:06 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:45 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 05-03-2026, 09:10 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 05-03-2026, 09:35 AM
RE: మరణ శాసనం - by sri012015 - 05-03-2026, 12:59 PM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:03 AM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 06-03-2026, 07:47 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 06-03-2026, 08:52 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:22 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 07-03-2026, 09:04 AM
RE: మరణ శాసనం - by SivaSai - 08-03-2026, 09:02 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 08-03-2026, 10:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 08-03-2026, 01:25 PM
RE: మరణ శాసనం - by SivaSai - 09-03-2026, 07:40 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 09-03-2026, 09:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 09-03-2026, 11:56 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:10 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:11 AM
RE: మరణ శాసనం - by masalakiss - 10-03-2026, 08:48 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 08:57 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 11:20 PM
RE: మరణ శాసనం - by masalakiss - 11-03-2026, 08:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 10:04 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 10-03-2026, 10:45 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 01:04 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 11-03-2026, 02:20 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 11-03-2026, 08:51 PM
RE: మరణ శాసనం - by SivaSai - 12-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 12-03-2026, 07:33 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 12-03-2026, 08:47 AM
RE: మరణ శాసనం - by SivaSai - 13-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by masalakiss - 13-03-2026, 07:55 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 13-03-2026, 08:07 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 13-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 14-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 14-03-2026, 08:29 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 09:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 15-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 15-03-2026, 06:55 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 15-03-2026, 09:49 AM
RE: మరణ శాసనం - by SivaSai - 16-03-2026, 03:53 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 16-03-2026, 06:24 AM
RE: మరణ శాసనం - by SivaSai - 17-03-2026, 07:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 17-03-2026, 08:34 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 17-03-2026, 05:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 18-03-2026, 08:32 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 18-03-2026, 02:34 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 05:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 19-03-2026, 12:56 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 19-03-2026, 02:09 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 19-03-2026, 03:01 PM
RE: మరణ శాసనం - by Reddy 211993 - 20-03-2026, 11:29 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 20-03-2026, 11:38 AM
RE: మరణ శాసనం - by SivaSai - 20-03-2026, 11:57 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 20-03-2026, 12:16 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 04:57 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:30 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 21-03-2026, 09:37 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 10:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 22-03-2026, 06:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 22-03-2026, 09:07 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 22-03-2026, 09:23 AM
RE: మరణ శాసనం - by SivaSai - 23-03-2026, 07:31 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 23-03-2026, 08:18 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 23-03-2026, 10:19 AM
RE: మరణ శాసనం - by SivaSai - 24-03-2026, 07:20 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 24-03-2026, 09:12 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 24-03-2026, 03:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 25-03-2026, 10:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 25-03-2026, 01:31 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 25-03-2026, 01:33 PM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 07:09 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 08:17 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 08:56 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 26-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:36 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 26-03-2026, 09:16 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 12:07 PM



Users browsing this thread: 1 Guest(s)