Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరణ శాసనం
#57
Part - 20

కారు డ్యామేజ్ అయినా సరే..దాని లైట్ లు మాత్రం వెలుగుతూనే ఉన్నాయి..

ఆ లైట్ల కాంతిలో చుట్టూ ప్రాంతం మొత్తం కనిపిస్తూనే ఉంది..

మరో పక్క విపరీతంగా వర్షం కురుస్తూనే ఉంది...ఏ మాత్రం తగ్గడం లేదు..


అటువంటి పరిస్థితుల్లో ఆ రాకాసి అక్కడ ప్రత్యక్షమయ్యే సరికి, సత్యనారాయణ రావు కి మతిపోయింది..

గోవింద రావు కూడా సృహ లో లేరు...

ఇక తమందరి పని అయిపోయిందని డిసైడ్ అయిపోయాడు సత్యనారాయణ రావు...

ఏం చేయాలో అర్థం కాక సత్యనారాయణ రావు ఆలోచిస్తుండగా.. ఒక్కసారిగా అది మాయమైపోయింది...

ఇక సత్యనారాయణ రావు వెంటనే కష్టపడి కార్ నుంచి బయటకు వచ్చాడు..


కార్లో సృహ లేకుండా పడి ఉన్న గోవింద రావు ని పురుషోత్తం ని, తనకి ఓపిక లేకపోయినా సరే చాలా కష్టపడి,రోడ్డు పక్కగా కార్ కి కొంచెం దూరంగా ఒక బండరాయి దగ్గర పడుకోబెట్టాడు..

ఇద్దరికీ దెబ్బలు గట్టిగానే తగిలాయి...
సృహా లో లేరు..

ఇంతలో తన సెల్ఫోన్ రింగ్ ఐన శబ్దం వచ్చింది...

ఎక్కడ ఉందా అని చుట్టూ వెతకసాగాడు..

ఆ శబ్దం కార్ నుండి వస్తోంది...

వేగంగా కారు వద్దకు వెళ్ళబోతుండగా....

సరిగ్గా అతని ముందు ప్రత్యక్షమయింది...

అలా హఠాత్తుగా అది ప్రత్యక్షమయ్యే సరికి కారు దగ్గరికి వెళ్లబోతున్న వాడు కాస్తా అదుపుతప్పి క్రింద పడిపోయాడు...

గోవింద రావుతో కలిసి,ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్న వాడు కూడా దాన్ని చూసి భయపడకుండా ఉండలేకపోయాడు...

అంత భయంకరంగా ఉంది దాని రూపం...

మర్రిఊడల్లాంటి తెల్లని జడలతో, చూడగానే జడుచుకునేంత వికృతమైన ముఖంతో, కొరల్లాంటి పదునైన పళ్ళతో,అది మీదకు వస్తూ ఉంటే సత్యనారాయణ రావు కి అప్పటి వరకు ఉన్న నీరసం, ప్రాణభయంతో ఎగిరిపోయింది..

కింద పడ్డ వాడు కాస్త వెంటనే లేచి గోవింద రావు వైపు పరిగెట్టాడు. కానీ వాళ్ల దగ్గరికి చేరుకునేలోపే, మరుక్షణం అతని ముందు ప్రత్యక్షమై, అతని గొంతు పట్టుకుంది..

బలమైన దాని పట్టు నుంచి, విడిపించుకొలేక గింజుకోసాగాడు..

అలా పట్టుకున్న సత్యనారాయణ రావు ని, కారు మీదకు విసిరి కొట్టింది...

వేగంగా ఎగురుకుంటూ వెళ్లి, కారు డోర్ కి గుద్దుకొని కిందపడిపోయాడు..

కింద పడినప్పుడు గాయాలు గట్టిగా తగలడం వల్ల,
అతని నోట్లో నుంచి రక్తం కారసాగింది..

అంత గాయాలలోనూ తల ఎత్తి దాని వైపు చూసాడు..

అది ఈసారి సత్యనారాయణ రావు ను వదిలిపెట్టి,
గోవింద రావు వైపు వెళ్ళసాగింది..

గోవింద రావును ఎలాగైనా కాపాడాలని,అంత గాయాలలోనూ మెల్లగా పైకి లేచి, పక్కనే పడి ఉన్న ఒక కర్ర తీసుకుని, అది గోవింద రావు ని సమీపించే లోపే వెనక గా వెళ్లి,దాని తలపై గట్టిగా కొట్టాడు..

సత్యనారాయణ రావు అలా కొట్టగానే, ఒక్కసారిగా కోపంతో అతని వైపు తిరిగింది.. వికృతంగా అరుస్తూ తన అరచేతితో అతని గుండెలపై చరిచింది..

దూరంగా ఎగిరి పడ్డాడు సత్యనారాయణ రావు....!!

తీవ్రగాయాలతో శరీరమంతా రక్తసిక్తమైపోయింది...

అయినా సరే  కోపం తగ్గకపోయేసరికి, అతనివైపు వెళ్ళసాగింది...

సరిగ్గా సత్యనారాయణ రావు ని సమీపిస్తుండగా...

దానికి సమీపంలో ఒక పెద్ద బండి హార్న్ వినిపించింది..

ఆ రాకాసి హార్న్ వినిపించిన వైపు తిరిగింది..

అంత పెద్ద వర్షం లో, ఒక జీపు హార్న్ కొడుతూ
చాలా వేగంతో దూసుకుంటూ వచ్చి, దానిని ఢీకొట్టింది...

ఆ జీపు గుద్దిన వేగానికి అది కూడా దానితోపాటే వెళ్ళిపోయింది...

ఒక్కసారిగా ఆ జీపులో నుంచి ఒక వ్యక్తి బయటకు దూకి
ఆ జీపుని వదిలేశాడు....!!

ఆ వ్యక్తి ఎవరో కాదు సత్యం......!!

జీపు వేగంగా వెళ్లి, అక్కడ ఉన్న ఒక చెట్టుకి గుద్దుకొని పేలిపోయింది....


కింద పడ్డ సత్యం, వేగంగా పైకి లేచి, గాయాలతో పడి ఉన్న సత్యనారాయణ రావు దగ్గరకు వెళ్ళాడు...

తీవ్రగాయాలతో నేలపై పడి ఉన్న సత్యనారాయణ రావు ను, ఒడిలోకి తీసుకుని" సార్ లేవండి.. పైకి లేవండి..నేను సత్యం ని వచ్చాను. హాస్పిటల్ కి వెళ్దాం..!!" అంటూ అతని బుగ్గల్ని రుద్దుతూ తెలివి తెప్పించసాగాడు..

అలా బుగ్గల్ని తడుతూ ఉండగా..

హఠాత్తుగా కాలుతున్న జీపు దగ్గర నుంచి పెద్దగా అరుపు వినిపించింది...

ఆ మంటలో నుంచి ఆ రాకాసి బయటకు వచ్చింది..

భీకరంగా కురుస్తున్న వర్షం వల్ల దాన్ని సరిగ్గా చూడలేకపోతున్నాడు..

కానీ ఏదో ప్రమాదం జరగబోతుందని గ్రహించి...

ఇక ఆలస్యం చేయకుండా సత్యనారాయణ రావు ని,వేగంగా గోవింద రావు వైపు ఈడ్చుకుంటూ వెళ్ళసాగాడు....

ముగ్గురిని ఒక చోట చేర్చి, వారందరినీ దగ్గరికి తీసుకున్నాడు...

అది ఆవేశంగా వాళ్ళ మీదకి రాబోతుండగా
తన మెడలో ఉన్న రుద్రాక్ష మాలను తీసి,
ముగ్గురు చేతులు పట్టుకుని, తన చేతిని కూడా కలిపి రుద్రాక్షమాలను ఉంచి, కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేయసాగాడు..

అలా సత్యం ప్రార్ధన చేస్తుండగా, హఠాత్తుగా ఆ రుద్రాక్ష మాల నుండి వెలుగులు రావడం మొదలయ్యాయి...

ఆ వెలుగులు చూసి భయపడి,వేగంగా వాళ్ళ మీదకి వస్తున్నది కాస్త, ఆగిపోయి కోపంతో దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది... అయినా సరే సత్యం ఏమాత్రం జంకకుండా అలాగే ఉండిపోయాడు...

కానీ ఆ రాకాసి ఒక చోట మాయమై, మరోచోట ప్రత్యక్షమవుతూ, శతవిధాలా వారిని చేరుకోవడానికి ప్రయత్నించింది..

కానీ ఆ రుద్రాక్ష మాల శక్తి ముందు దాని శక్తులు పనిచేయలేదు..

కొంతసేపు శతవిధాల ప్రయత్నించి, దాని వల్ల కాక,ఏమీ చేయలేక, కోపంగా వారి వైపు చూస్తూ మాయమైపోయింది...

అది మాయమైపోయిన వెంటనే.. అప్పటి వరకు భీకరంగా పడుతున్న వర్షం కాస్తా.., మంత్రం వేసినట్టు ఆగిపోయింది..

అయినా సరే సత్యం వారిని వదలకుండా,వెంటనే అక్కడ
ఆ ప్రాంతం దగ్గరలోనే ముందు జాగ్రత్తగా తను సిద్ధం చేసిన అంబులెన్స్ కి ఫోన్ చేసాడు...

ఐదు నిమిషాల్లోనే అది అక్కడికి వచ్చింది..

వెంటనే వారిని అందులో ఎక్కించి, శ్రీశైలంకి తీసుకు వెళ్లారు...

శ్రీశైలంలో అది ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పటల్....

సరిగ్గా 01:00 కి అంబులెన్స్ ఆ హాస్పిటల్ కి చేరుకుంది..

గాయాలతో ఉన్న ముగ్గురిని ట్రీట్మెంట్ కోసం వేగంగా లోపలికి తీసుకు వెళ్లారు..

వారిలో సత్యనారాయణ రావు కి దెబ్బలు మరింత ఎక్కువగా తగలడం వల్ల, ఐసీయూ కి మార్చారు..

అక్కడ ట్రీట్మెంట్ జరుగుతోంది....!!

సత్యం మాత్రం హాస్పిటల్ లోనే ఉండి, వారి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు..

ఇంతలో సత్యం కి మంజునాథ రావు గారి నుండి ఫోన్ వచ్చింది...ఫోన్ ఎత్తాడు..

" సత్యం..! వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది..?"

" గోవింద రావు గారు, డ్రైవర్ ఇద్దరి పరిస్థితి బాగానే ఉంది సార్..!! కానీ....???"

"కానీ ఏంటి...???"

" సత్యనారాయణ రావు గారి పరిస్థితి బాగోలేదు సార్...!! దెబ్బలు చాలా గట్టిగా తగిలాయి..! రక్తం కూడా చాలా పోయిందంట సార్...! ప్రస్తుతం ఆయనను ఐసీయూలో పెట్టారు..! 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని చెప్పారు..!"

" ఇదెక్కడి క్లిష్ట పరిస్థితి సత్యం..?? ఇక్కడ ఆదిత్య పరిస్థితి కూడా బాగోలేదని నీకు తెలుసు..!! ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే అయింది..!! ఇప్పుడు ఆదిత్య ని ఎలా కాపాడాలో తెలియటం లేదు..!"

" మీరేమీ బయపడకండి సార్..!!
మన ప్రయత్నం మనం చేద్దాం..!! ఇక్కడ వేరే కానిస్టేబుల్ ని పెట్టి, నేను వెంటనే అక్కడికి వస్తున్నాను...!!"

" సరే రా..! ఇక్కడికి వచ్చాక ఆలోచిద్దాం..!"
అంటూ ఫోన్ పెట్టేశారు మంజునాథ రావు..


అది మంజునాథ రావు గారి ఇల్లు...

అమావాస్య ముందు రోజు..

సమయం ఉదయం 7.00

ఆదిత్యకి గదిలో ట్రీట్మెంట్ జరుగుతోంది..

మంచం మీద నిద్రపోతున్నాడు..

డాక్టర్ అతని బీపీ చెక్ చేస్తున్నారు..

బలంగా ఉండే ఆదిత్య కొద్ది రోజులకే చిక్కిపోయాడు..

అతనికి ట్రీట్మెంట్ చేయడం పూర్తి అయిన తర్వాత డాక్టర్ అతని గది నుండి బయటకు వచ్చాడు..

గది బయట మంజునాథ రావు గారు, భాను, సత్యం ఉన్నారు..

" ఆదిత్య సార్ కి ఎలా ఉంది డాక్టర్.?" అని అడిగాడు సత్యం.

" బిపి షుగర్ నార్మల్ గానే ఉన్నాయి.. రిపోర్ట్స్ కూడా అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. కానీ.... ఆయనకొచ్చిన వ్యాధి ఏంటో తెలియడం లేదు.. నాకైతే ఇక్కడ ఉంచి ట్రీట్మెంట్ చేయడం కంటే హాస్పిటల్ లో ఉంచితే మంచిదనిపిస్తోంది...!!"

" వద్దు డాక్టర్..!! ఆయన ఇక్కడ ఉండటమే చాలా మంచిది..! మీరే ఎలాగైనా ఇక్కడే వైద్యం చేయాలి.."అని అన్నాడు సత్యం..

" సరే....!! జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను.." అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు..

డాక్టర్ మాటలు విన్న భాను ఏడుస్తూ మంజునాథ రావు తో.." తాతయ్య..! ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం.. లేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం అంటున్నారు కదా..!!" అంటూ ఏడవసాగింది..

"అతని పరిస్థితి నీకు అర్థం కావడం లేదు అమ్మ...! అతను ఇంటి నుంచి బయటకి ఎప్పుడు అడుగు పెడతాడా అని ఆ దుష్టశక్తి ఎదురుచూస్తోంది...! ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని బయటకు తీసుకు వెళ్లడం అంటే చేతులారా అతని ప్రాణం మనమే తీసినట్లు అవుతుంది..తల్లి..!!"

" మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్.!
రేపు అమావాస్య..! ఆదిత్య సార్ ప్రాణానికి ప్రమాదం ఉందని గోవింద రావు గారు చెప్పారు..! రుద్ర గారితో వస్తారు అని అనుకున్నాను. కానీ ఆయన రాలేదు..ఇప్పుడు ఆయనా, సత్యనారాయణ రావు గారు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు.. ఇక మనమే ఏదో విధంగా ఆదిత్య గారిని ఈ అమావాస్య గండం నుండి  కాపాడుకోవాలి.."

" నువ్వు చెప్పేది నిజమే సత్యం.. నేను
ఈ రోజు మధ్యాహ్నం దేవస్థానంలో ఉండే పండితులతో కలిసి మాట్లాడి, ఏదో ఒక పరిష్కార మార్గం వెతుకుతాను.. మీరేమీ బయపడకండి. ఆదిత్య కి ఏమీ కాదు.."అని చెప్పి దేవస్థానానికి బయలుదేరారు..

"సత్యం నీకేమైనా రుద్ర గారి ఫోన్ నెంబర్ తెలుసా..??"

" సారీ మేడం తెలియదు..!!"

" గోవింద రావు గారి మొబైల్ లో ఉంటుందేమో చెక్ చేయలేకపోయావా...??"

" నేను ఆల్రెడీ ఆ ప్రయత్నం చేశాను.. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు వర్షం విపరీతంగా కురవడం వల్ల, ముగ్గురు ఫోన్.లు తడిచిపోయాయి.. పనిచెయ్యడం లేదు.
ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాము."
అని చెప్పాడు సత్యం..

బాధతో నీరసంగా నిట్టూర్చింది భాను..

ఆదిత్య గురించి తనకు చాలా బెంగ పట్టుకుంది..

ఆమె బాధ పడుతోందని గ్రహించి "మీరేమి బాధపడకండి మేడం..! ఆదిత్య గారికి ఏమి కాదు నేను ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి వస్తాను...!"అని చెప్పి అక్కడ నుండి బయలు దేరాడు..

భాను ఆదిత్య ని చూసుకోవడానికి అతని గదిలోకి వెళ్ళింది...

మరోపక్క కానిస్టేబుల్ సత్యం హాస్పిటల్ కి తిరిగి బయలుదేరాడు...


ఆ రోజు మధ్యాహ్నం అయింది మంజునాథ రావుగారు ఆలయంలో ఉన్న మండపంలో కొంత మంది వేద పండితులతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి, ఆదిత్య పరిస్థితిని వివరించారు.

పండితులంతా మంజునాథ రావు గారు చెప్పింది అంతా విన్నారు..

" ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను.. ఆదిత్య ఈ ప్రమాదం నుంచి బయట పడటానికి ఏదైనా మార్గం ఉందేమో దయచేసి చెప్పండి.."

వారిలో ఒక పండితుడు మాట్లాడుతూ..!!
"రావు గారు..!! మీరు మా అందరికీ గురుతుల్యులు..!!మాకు ఏదైనా సందేహం వస్తే మిమ్మల్ని అడుగుతాము.. కానీ మీకు సలహా ఇచ్చేంత జ్ఞానం, తెలివితేటలు మాకు లేదు. కాబట్టి మీరే ఏదైనా పరిష్కారమార్గం ఆలోచించండి.
ఆ పనికి మా అందరి సహాయ సహకారాలు ఉంటాయి" అని అన్నాడు.

అతని మాటల్నే మిగతావారు కూడా ఆమోదించారు..

" నేను కూడా ఈ విషయం మీద చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఇటువంటి కార్యాలలో నాకు అనుభవం కూడా లేదు..నా మిత్రుడు గోవింద రావు ఇటువంటి దుష్టశక్తులను వదిలించడంలో దిట్ట..కానీ ప్రస్తుతం అతను కూడా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు.. కాబట్టి ఏం చేసినా నేను మాత్రమే చేయాలి...??"అంటూ ఆలోచనలో మునిగిపోయారు..

" గురువుగారు..నాదొక ఆలోచన..." అన్నాడోక యువ పండితుడు..

మంజునాథ రావు తో సహా అందరూ ఆశ్చర్యం గా అతని వైపు చూశారు..

" చెప్పు నాయనా..!"అన్నారు మంజునాథ రావు గారు...

" మీ మాటలను బట్టి అమావాస్య వెళ్లేంత వరకు ఆ దుష్ట శక్తి బారినుండి ఆదిత్యని కాపాడాలి,అంతేనా గురువుగారు...!!"

" అంతే నాయనా....! సరిగ్గా చెప్పావు...!! "

"అయితే రుద్ర హోమం జరిపిస్తే మంచిదని,
నా అభిప్రాయం గురుదేవ..!!"

"రుద్ర హోమమా...?? "అని పండితులు అందరూ ముక్తకంఠంతో ఆశ్చర్యపోయారు..

" అమావాస్య ముందు రుద్రహోమం సరైనది అంటారా...??" అని సందేహం వెలిబుచ్చారు ఒక పండితుడు..

" స్వామి..! ఈ పరిస్థితుల్లో ఆదిత్యని కాపాడడానికి మనకి వేరే దారి లేదు.. భారమంతా ఆ పరమేశ్వరుని పై వేసి, మనం హోమం మొదలుపెడదాం...!!"అంటూ వివరించాడు ఆ యువ పండితుడు..

"మరి ఏ సమయంలో మొదలు పెడదాం..??" అని అడిగాడు మరో పండితుడు..

" రేపు అమావాస్య...!! కాబట్టి తెల్లవారుజామున అమావాస్య ఘడియలు రాకముందే,అమృత ఘడియలలో రుద్ర హోమం మొదలు పెట్టి, అమావాస్య ఘడియలు పూర్తయ్యేంతవరకు నిర్విఘ్నంగా జరిగితే,ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు గురువుగారు....!!"
అని వివరించాడు.

ఆ యువకుడి దూరదృష్టికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు మంజునాథ రావు..

ఆ యువకుడి దగ్గరకు వెళ్లి..," ఏం చేయాలో తెలియని
క్లిష్ట పరిస్థితుల్లో మంచి సలహా ఇచ్చావు.. చాలా సంతోషంగా ఉంది నాయనా.రేపు హోమం కూడా నీ చేతుల మీదగా జరిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది..."
అని అన్నాడు మంజునాథ రావు..

" తప్పకుండా గురువుగారు..!! నేను కచ్చితంగా వస్తాను...!!" అని అన్నాడు ఆ యువ పండితుడు..

ఇంతలో ఆలయ అధికారులు రావడంతో వారితో ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి వారితో వెళ్లారు మంజునాథ శాస్త్రీ...!!

మరోపక్క....

భాను ఆదిత్య గురించి బాధపడుతూ అతని మంచం పక్కన కుర్చీలో నిద్రపోయింది...

చీకటి పడింది...

చిన్నగా ఏదో అలికిడి అవ్వటంతో, ఉలిక్కిపడి నిద్రలేచింది భాను..

ఏమైందని చూడగా.....

ఆదిత్య మంచం మీద లేచి కూర్చుని
ఎటో చూస్తూ " వస్తున్నా.. నేను వస్తున్నా.." అంటూ కూర్చున్నవాడు కాస్తా లేచి ముందుకి వెళ్ళబోతుండగా...

అప్పటివరకు నిద్ర మైకంలో ఉన్న భానుకి ఒక్కసారిగా
ఆ మత్తు వదిలిపోయింది...

"ఆదిత్య గారు ఆగండి....!!" అని గట్టిగా అరుస్తూ..ముందుకి వెళ్లిపోతున్న ఆదిత్య ని ఎక్కడికి వెళ్ళిపోకుండా గట్టిగా వాటేసుకుంది..

ఆదిత్య ఎలాగైనా ముందుకు వెళ్లాలని ఆమె పట్టు నుంచి బయట పడాలని గింజుకోసాగాడు.

అయినా సరే భాను ఏ మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకోసాగింది..

అలా వారిద్దరి మధ్య ఓ పది నిమిషాల పాటు చిన్న కొట్లాట జరిగింది..

చివరికి ఎలాగోలా భాను పట్టుని విడిపించుకుని ఆమెను వెనక్కి తోసేశాడు..

భాను ఆ తోసిన వేగానికి మంచం మీద పడిపోయింది...

ఆదిత్య "వస్తున్నా.. నేను వస్తున్నా...!" అని అనుకుంటూ ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు..

భాను వెంటనే మంచం మీద నుండి లేచి, అతన్ని అనుసరించ బోతుండగా హఠాత్తుగా కరెంటు పోయింది...

అలా హఠాత్తుగా కరెంట్ పోవడంతో భాను వెంటనే తన సెల్ ఫోన్ ని వెతక సాగింది...

కొద్ది క్షణాల తర్వాత టేబుల్ పై తన సెల్ఫోన్ దొరికింది..

దాన్ని తీసుకొని వెంటనే టార్చ్ లైట్ ఆన్ చేసి,
కోసం బయలుదేరింది...

" రామయ్య...?? ఎల్లమ్మ....?? ఎక్కడున్నారు.?" అంటూ పని వాళ్ళని పిలవసాగింది..

కానీ ఎవరు పలకలేదు...

అలా తన సెల్ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో ప్రతి గది లో ఆదిత్య వెతక సాగింది....

అలా వెతుకుతూ ఉండగా వెనక నుండి ఒక చేయి ఆమె భుజం పై పడింది...

వెనక్కి తిరిగి భయంతో కెవ్వున అరిచింది.....!!!



ఇంకా ఉంది.....!!!!
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
మరణ శాసనం - by SivaSai - 01-03-2026, 09:31 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 02-03-2026, 10:52 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 02-03-2026, 12:24 PM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:50 AM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:52 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 03-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 03-03-2026, 08:33 AM
RE: మరణ శాసనం - by sri012015 - 03-03-2026, 11:32 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:16 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 04-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 04-03-2026, 10:06 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:45 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 05-03-2026, 09:10 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 05-03-2026, 09:35 AM
RE: మరణ శాసనం - by sri012015 - 05-03-2026, 12:59 PM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:03 AM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 06-03-2026, 07:47 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 06-03-2026, 08:52 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:22 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 07-03-2026, 09:04 AM
RE: మరణ శాసనం - by SivaSai - 08-03-2026, 09:02 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 08-03-2026, 10:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 08-03-2026, 01:25 PM
RE: మరణ శాసనం - by SivaSai - 09-03-2026, 07:40 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 09-03-2026, 09:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 09-03-2026, 11:56 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:10 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:11 AM
RE: మరణ శాసనం - by masalakiss - 10-03-2026, 08:48 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 08:57 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 11:20 PM
RE: మరణ శాసనం - by masalakiss - 11-03-2026, 08:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 10:04 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 10-03-2026, 10:45 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 01:04 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 11-03-2026, 02:20 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 11-03-2026, 08:51 PM
RE: మరణ శాసనం - by SivaSai - 12-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 12-03-2026, 07:33 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 12-03-2026, 08:47 AM
RE: మరణ శాసనం - by SivaSai - 13-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by masalakiss - 13-03-2026, 07:55 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 13-03-2026, 08:07 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 13-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 14-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 14-03-2026, 08:29 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 09:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 15-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 15-03-2026, 06:55 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 15-03-2026, 09:49 AM
RE: మరణ శాసనం - by SivaSai - 16-03-2026, 03:53 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 16-03-2026, 06:24 AM
RE: మరణ శాసనం - by SivaSai - 17-03-2026, 07:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 17-03-2026, 08:34 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 17-03-2026, 05:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 18-03-2026, 08:32 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 18-03-2026, 02:34 PM
RE: మరణ శాసనం - by SivaSai - 18-03-2026, 05:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - 19-03-2026, 12:56 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 19-03-2026, 02:09 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 19-03-2026, 03:01 PM
RE: మరణ శాసనం - by Reddy 211993 - 20-03-2026, 11:29 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 20-03-2026, 11:38 AM
RE: మరణ శాసనం - by SivaSai - 20-03-2026, 11:57 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 20-03-2026, 12:16 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 04:57 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:30 AM
RE: మరణ శాసనం - by SivaSai - 21-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 21-03-2026, 09:37 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 21-03-2026, 10:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 22-03-2026, 06:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 22-03-2026, 09:07 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 22-03-2026, 09:23 AM
RE: మరణ శాసనం - by SivaSai - 23-03-2026, 07:31 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 23-03-2026, 08:18 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 23-03-2026, 10:19 AM
RE: మరణ శాసనం - by SivaSai - 24-03-2026, 07:20 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 24-03-2026, 09:12 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 24-03-2026, 03:09 PM
RE: మరణ శాసనం - by SivaSai - 25-03-2026, 10:49 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 25-03-2026, 01:31 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 25-03-2026, 01:33 PM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 07:09 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by SivaSai - 26-03-2026, 08:17 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 08:56 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 26-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by Ajayk - 26-03-2026, 08:36 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 26-03-2026, 09:16 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 26-03-2026, 12:07 PM



Users browsing this thread: 1 Guest(s)