Yesterday, 06:44 AM
Part - 19
మధ్యాహ్నం రెండు గంటలకి వారి ప్రయాణం మొదలైంది...
ఆదిత్య పరిస్థితి బాగోలేదనే కంగారులో రుద్ర కి చెప్పకుండానే బయలుదేరారు...
"పురుషోత్తం..! మనం ఎంత సేపట్లో శ్రీశైలం చేరుకోగలం...?"అని అడిగారు గోవింద రావు.
"స్వామి..! ఇక్కడ నుంచి శ్రీశైలం నాలుగు వందల కిలోమీటర్ల పైనే ఉంది.. మనం ఎంత వేగంగా వెళ్ళిన, రోడ్డు బాగుంటే
9 గంటల పైనే ప్రయాణం ఉంటుంది.."
అలా పురుషోత్తం సమాధానం చెప్పగానే ఇంకేమీ మాట్లాడలేదు గోవింద రావు...
అలా ఒక 5 గంటల ప్రయాణం తరువాత వినుకొండ చేరుకున్నారు....
భోజనం చేయకుండానే బయలుదేరిన అందువల్ల ప్రయాణ అలసట తీర్చుకోవడానికి అక్కడ భోజనం చేసి ఒక గంట సేపు ఆగారు..
తిరిగి ప్రయాణం మొదలు పెట్టే సరికి రాత్రి 8 గంటలు దాటింది....
అలా బయలుదేరిన మరో మూడు గంటల తర్వాత........!!!
కారు శ్రీశైలం వైపు వేగంగా పరుగులు తీస్తోంది..
కారు లో గోవింద రావు, సత్యనారాయణ రావు నిద్రపోతున్నారు...
పురుషోత్తం మాత్రం అలా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు...
అమావాస్య ముందు రోజులు కావడంచేత రోడ్డు అంతా చీకటిగా ఉంది...
ఎప్పుడో కానీ ఒక వాహనం రోడ్డుమీద కనిపించడం లేదు....
రోడ్డు కి రెండువైపులా లైట్ పోల్స్ ఉండడం వల్ల రోడ్డు క్లియర్ గా కనిపిస్తోంది...
అలా కారు వెళుతూ ఉండగా....
కార్లో పడుకొని ఉన్న గోవింద రావు గారు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచి, డ్రైవింగ్ చేస్తున్న పురుషోత్తం భుజంపై చేయి వేసి కారు ఆపు అని అరిచారు....
గోవింద రావు గారు చెయ్యి వేసినప్పుడే పురుషోత్తం ఉలిక్కిపడ్డాడు ఆయన అరిచేసరికి సడన్ బ్రేక్ తో రోడ్డు పక్కకి కార్ ని ఆపేశాడు...
కారు అలా సడన్గా ఆగడంతో పడుకుని ఉన్న సత్యనారాయణ రావు ఒక్కసారిగా ముందుకి పడిపోయాడు....
అలా పడిపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి "ఏమైంది పురుషోత్తం....??" అంటూ అరిచాడు...
" నేను కావాలని ఆపలేదు సార్..!
స్వామి ఆపమన్నారు....."
పక్కనే రోడ్డు వైపు చూస్తూ మాట్లాడకుండా ఉన్న గోవింద రావు తో "ఏమైంది చిన్నాన్న..?" అని అడిగాడు..
గోవింద రావు మాత్రం ఏమీ మాట్లాడకుండా కారు దిగారు..
ఆయనతో పాటే ఇద్దరూ కార్ నుంచి దిగారు.
సత్యనారాయణ రావు గోవింద రావు పక్కకు వచ్చి కంగారుగా "ఏమైంది చిన్నాన్న..? ఏమి మాట్లాడరే..? ఏదైనా సమస్య..??" అని అడిగాడు.
" అది మన కోసం ఎదురుచూస్తోంది..! "
" అది అంటే..? ఏది చిన్నాన్న..??"
" అదే...! ఆదిత్యని పట్టి పీడిస్తున్న రాకాసి.
మనం వస్తున్నామని మన కోసం ఎదురుచూస్తోంది"
ఆ మాటల విన్న పురుషోత్తం కి, సత్యనారాయణ రావు కి, బుర్ర తిరిగినంత పనయ్యింది..
"పక్కనే ఉన్న తుమ్మలబైలు మూడు కిలోమీటర్లు అన్న సైన్ బోర్డు సత్యనారాయణ రావుకి కనిపించింది.."
" నువ్వు చెప్పింది నిజమే చిన్నాన్న..
మనం ఆ ప్రదేశానికి దగ్గరలోనే ఉన్నాము.
ఇప్పుడు ఎలా మనం దానిని దాటుకుని వెళ్ళేది..??"
" పురుషోత్తం టైమ్ ఎంత అవుతుంది..??"
పురుషోత్తం తన తన సెల్ఫోన్లో చూసి,
"11.45 అయ్యింది స్వామి..!!"
" సరే.....!! మనం ఎలాగైనా ఆదిత్యని చేరుకోవాలి. పురుషోత్తం నేను చెప్పినట్టు విను..!!"
" చెప్పండి స్వామి..!!"
"ఎలాగైనా 15 నిమిషాలు లోపు మనం తుమ్మలబైలు దాటాలి.. ఎందుకంటే అమావాస్య ఘడియలు దగ్గర పడే కొద్దీ దాని శక్తి పెరిగి పోతూనే ఉంటుంది.. కాబట్టి మనం ఈ ప్రదేశాన్ని ఆ సమయంలో లోపే దాటాలి. కారు కూడా వేగంగా నడపొద్దు.. అలాగని ఏది అడ్డు వచ్చినా, ఏం జరిగినా సరే కారు ఆపొద్దు.. చుట్టుపక్కల ఏమి కనిపించినా సరే భయపడకు...! సరేనా...!"
నా మాటలు విన్న పురుషోత్తం భయంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు..
" ఏం పురుషోత్తం మాట్లాడవే...??"
" ఏమీ లేదు స్వామి.. కొంచెం భయంగా ఉంది.."
ఆ మాటలకి గోవింద రావు చిన్న చిరునవ్వు నవ్వి.."నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. అది నిన్ను ఏమీ చేయలేదు. కేవలం భయపెడుతుంది.
అంతే...!!"
ఆ మాటలకి కొంత ధైర్యం తెచ్చుకున్నాడు పురుషోత్తం.."సరే స్వామీ...మీరు చెప్పినట్లే వింటాను. ఇక బయలుదేరుదాం." అంటూ కార్ ఎక్కాడు...
మొదట గోవింద రావు కారు ఎక్కారు.
ఆ తర్వాత సత్యనారాయణ రావు కార్ ఎక్కాడు...
కార్ బయలుదేరింది..
గోవింద రావు చెప్పిన మాటలు మనసులో ఉంచుకున్నాడు పురుషోత్తం..
కార్ ని మాత్రం స్పీడ్ గా తోలటం లేదు..
కారు రోడ్డుపై మెల్లగా వెళ్తోంది....
కారు బయలుదేరిన పదినిమిషాల తర్వాత తుమ్మలబైలు ప్రాంతానికి కారు చేరుకుంది..
ఉన్నట్టుండి హఠాత్తుగా పెద్దగా వాన మొదలైంది....
ఉన్నట్టుండి వర్షం ఏంటో పురుషోత్తం కి అర్థం కాలేదు..
కానీ ఇది దాని పనేనని అంతకుముందు అనుభవం వల్ల గోవింద రావు కి, సత్యనారాయణ రావుకు అర్థం అయింది..
అలా కారులో వెళుతుండగా ఒక్కసారిగా రోడ్డు కి రెండువైపులా దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్ పోల్స్ హఠాత్తుగా ఆరిపోయాయి....
ఉన్నట్టుండి వర్షం కూడా పెద్దగా పెరిగిపోయింది....
అంత పెద్ద వర్షం వల్ల రోడ్డు కూడా సరిగా కనిపించడం లేదు...
సడన్ గా కారు ఆపాడు పురుషోత్తం....
"పురుషోత్తం జాగ్రత్త..!" అని అతని భుజంపై చేయివేసి అన్నాడు సత్యనారాయణ రావు..
" పరవాలేదు సార్..!!" అంటూ చిన్నగా నవ్వి, స్టీరింగ్ పక్కనే ఉన్న ఒక స్విచ్ ఆన్ చేశాడు..
ఒక్కసారిగా కారు ముందున్న లైట్లు మరింత ప్రకాశవంతంగా వెలిగాయి...
అలా లైట్లు ప్రకాశవంతంగా వెళ్లడంతో రోడ్డు మొత్తం చాలా దూరం వరకు స్పష్టంగా కనిపించసాగింది..
అది చూసిన సత్యనారాయణ రావు నవ్వి,
" మరి ఇందాక నుంచి ఎందుకు లైట్లు ఆన్ చేయలేదు..?"
" ఇవి ఎమర్జెన్సీ లైట్లు సార్...!! రఘునాథ రెడ్డి సార్ స్పెషల్ గా డిజైన్ చేయించారు. ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాల్సి వస్తే, రాత్రులు కారు స్పీడ్ గా వెళ్లేటప్పుడు, రోడ్డు క్లియర్ గా కనిపించడం కోసం,ఈ హైఫోకస్ ఎల్ఈడి లైట్లు వేయించాము."అని చెప్పాడు..
" మంచిది నాయన..!! జాగ్రత్తగా పోనీ...!" అన్నారు వెనక కూర్చొని ఉన్న గోవింద రావు..
"అలాగే స్వామి..!!" అంటూ కార్ ని ముందుకి పోనిచ్చాడు.
వర్షం మరింత జోరుగా కురవసాగింది...
పురుషోత్తం కారుని డ్రైవ్ చేస్తూనే, రోడ్డుమీద జాగ్రత్తగా పరిశీలించసాగాడు..
అలా డ్రైవ్ చేస్తూనే " స్వామి...!!" అంటూ అరిచి కార్ ఒక్కసారిగా ఆపేశాడు...
ఏమైందని అడిగాడు అతని పక్కనే కూర్చుని ఉన్న సత్యనారాయణ రావు..
మాట్లాడకుండా రోడ్డు వైపు చెయ్యి చూపించాడు..
అక్కడ రోడ్డుకి అడ్డంగా నల్లటీ భారీ శరీరంతో,
మర్రి ఊడల లాంటి తెల్లని జుట్టు గల ఒక ఆకారం రోడ్డు మధ్యగా నిల్చుని ఉంది...
దాన్ని చూసిన ముగ్గురు ఆశ్చర్యపోయారు..
కారు లైట్ల కాంతిలో దాని ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది...
అలా ఒక్క నిమిషం పాటు దానివైపే చూస్తూ ఉండిపోయారు..
కొద్దిసేపటికి అది మెల్లగా కార్ వైపు కదలసాగింది..
దాన్ని అలా చూసిన పురుషోత్తం కి, కాలు చేయి ఆడటం లేదు.. శరీరమంతా భయంతో చెమటతో తడిసిపోయింది...
" వెంటనే కారు పోనీ పురుషోత్తం....!!"అని చెప్పారు గోవింద రావు
కానీ దాన్ని చూసిన షాక్ లో పురుషోత్తం కి
ఏమీ వినిపించటం లేదు.
అతని పరిస్థితి గమనించిన సత్యనారాయణ రావు పురుషోత్తం భుజాన్ని పట్టుకుని గట్టిగా కుదిపాడు...
వెంటనే సృహ లోకి వచ్చాడు పురుషోత్తం..
" వెంటనే కారు పోనీ..!"అంటూ అరిచాడు సత్యనారాయణ రావు..
ఇక క్షణం ఆలస్యం చేయకుండా కార్ ని ముందుకు పోనిచ్చాడు పురుషోత్తం..
అయినా సరే అది కారు మీదకి వస్తూనే ఉంది..
"ఏం జరిగినా సరే...! కారు ఆపకు నాయనా..!
అది మనల్ని ఏమీ చేయలేదు..." అంటూ వెనకాల నుంచి గోవింద రావు ధైర్యం చెప్పసాగారు..
అలా గోవింద రావు చెప్పడంతో, కార్ ని ధైర్యంగా దాని మీదికి పోనిచ్చాడు.. కారు సరిగ్గా దానిమీద కి వెళ్ళగానే అది మాయమైపోయింది...
అది అలా మాయమైపోగానే అది ఏమైపోయిందో నని వెనక్కి తిరిగి చూడబోతున్న పురుషోత్తంని వద్దని గోవింద రావు వారించారు..
అలా తన ప్రయత్నం కూడా మానుకున్నాడు పురుషోత్తం..
అలా కారు వర్షంలో ముందుకు వెళుతూనే ఉంది..
కార్ డ్రైవింగ్ చేస్తున్న పురుషోత్తం కి ఉన్నట్టుండి వెకిలి నవ్వులు వినిపించసాగాయి..
ఆ నవ్వులు ఏంటని తల అటూ ఇటూ తిప్పి చూడసాగాడు..
అలా అటూ ఇటూ చూస్తున్న పురుషోత్తం ని ఏమైందని అడిగాడు సత్యనారాయణ రావు..
"నాకు ఏవో నవ్వులు వినిపిస్తున్నాయి సార్.."
అంటూ అటూ ఇటూ చూడసాగాడు..
ఇంతలో రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ అడ్డు వచ్చింది..
ఇంతలో అది చూసిన సత్యనారాయణ రావు
" ఏయ్ చూసుకో...!!" గట్టిగా అరుస్తూ స్టీరింగ్ పట్టుకొని కుడి వైపు తిప్పాడు...
ఒక్కసారిగా కారు ఆ చెట్టు కొమ్మకి తప్పించబడి పక్కకి వెళ్ళింది..
సత్యనారాయణ రావు కల్పించుకోవడంతో
పెద్ద ప్రమాదం తప్పింది..
" జాగ్రత్త నాయనా..!!" అంటూ అన్నారు వెనకాలనుంచి గోవింద రావు
" నీకు చిన్నాన్న ముందుగానే చెప్తున్నారు..
అయినా సరే నువ్వు జాగ్రత్త గా ఉండటం లేదు.
ఇప్పటికైనా జాగ్రత్తగా డ్రైవ్ చెయ్..!!"అంటూ కోప్పడ్డాడు సత్యనారాయణ రావు..
" క్షమించండి సార్..!" అని అన్నాడు పురుషోత్తం.
" అలా కోప్పడకు రావు..!! అతనికి ఇటువంటి పరిస్థితులు పూర్తిగా కొత్త..! మనమే అతనికి సహాయం చేయాలి.." అని గోవింద రావు చెప్పగానే "సరే చిన్నాన్న..! క్షమించండి..!" అన్నాడు సత్యనారాయణ రావు..
సమయం రాత్రి 12 గంటలు దాటింది..
అలా కొద్దిసేపటి ప్రయాణం తర్వాత తుమ్మలబైలు ప్రాంతాన్ని దాటిపోయారు..
వారు ఆ ప్రదేశాన్ని దాటిపోయారు అనడానికి సూచనగా అప్పటిదాకా భీకరంగా కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది..
ఇక ప్రదేశాన్ని దాటిపోయారు అని గ్రహించిన గోవింద రావు " ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రదేశాన్ని దాటిపోయాము.. కారు ని వేగంగా పోనీయ్ పురుషోత్తం.." అని గోవింద రావు చెప్పగానే...
కారుని వేగంగా ముందుకి పోనిచ్చాడు పురుషోత్తం...
కార్ శ్రీశైలం వైపు వేగంగా పరుగులు తీస్తోంది...
కొద్ది నిమిషాలు గడిచిన తర్వాత...
ఇంతలో అకస్మాత్తుగా మళ్లీ పెద్ద వర్షం మొదలైంది..
చాలా పెద్దగా వర్షం మొదలవడంతో సత్యనారాయణ రావు అనుమానంగా వెనక ఉన్న గోవింద రావు వైపు అనుమానంగా చూశాడు..
గోవింద రావు ముఖంలో కూడా ఏదో అనుమానం పొడచూపింది..
ఇదేమీ పట్టించుకోని పురుషోత్తం కారుని వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు..
ఇంతలో.....!!
అలా వేగంగా వెళుతున్న కారు టైర్ అకస్మాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయి, కారు అదుపు తప్పింది..
పురుషోత్తం ఎంత ప్రయత్నించినా సరే, దానిని అదుపు చేయలేకపోయాడు..
ఆ కారు పల్టీలు కొట్టి,వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టింది..
ఆ బండరాయి ఢీకొట్టిన కొద్ది నిమిషాలకి సత్యనారాయణ రావు కి తెలివి వచ్చింది..
కళ్ళు తెరిచి చూశాడు..
తన పక్కనే పురుషోత్తం తలకి గాయం తో స్టీరింగ్ మీద పడి ఉన్నాడు..
వెనకకు చూసాడు.. సత్యనారాయణ రావు.
గోవింద రావు కూడా గాయాలతో సీటులో పడి ఉన్నాడు...
తనకి కూడా శరీరం మీద గాయాలు తగిలాయి..
కళ్ళు కూడా తిరుగుతున్నాయి...
ఇక వెంటనే ఫోన్ తీసి సత్యం కి ఫోన్ చేశాడు..
చేసిన వెంటనే ఫోన్ ఎత్తాడు సత్యం...
"సార్...!! ఎక్కడ ఉన్నారు సార్...!?? ఇక్కడ ఆదిత్య సార్ పరిస్థితి..!!" అని ఏదో చెప్పబోతూ ఉండగా " సత్యం, మా కార్ కి యాక్సిడెంట్ అయింది నువ్వు వెంటనే రా..!!" అని చెప్పి అతను ఏదో చెప్తున్నా వినకుండా ఫోన్ కట్ చేశాడు..
తనకి కూడా కళ్ళు తిరిగి తెలివి తప్పిపోతుండగా...
అప్పుడు ప్రత్యక్షమయింది అతని కారు ముందు..
ఆ తెల్లని జుట్టు కల రాకాసి....
దాన్ని చూడగానే సత్యనారాయణ రావు కి మతిపోయింది...!! ఏం చేయాలో అర్థం కాలేదు...!!!
ఇంకా ఉంది......!!!!

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)