14-03-2026, 06:58 AM
Part - 148
నువ్వు అంటే అన్నయ్యకి అంత ప్రేమ. సరిగ్గా చెప్పావు. మీ ఫ్రెండ్ కే నా ప్రేమ అర్ధం కావడం లేదు. సురభి వచ్చి అరే అమ్మాయిని ఇక్కడే నిలబట్టే మాట్లాడుతున్నారు.
రా.. రా.. తల్లి. లోపలికి తీసుకువెళ్లి బీపీ చెక్ చేస్తుంది. ఒకసారి బేబీ మూమెంట్ చూద్దామా అని అడిగితే.... అవని మెరిసే కళ్ళతో చూద్దాం అమ్మ అంటుంది.
రా విక్రమ్ ఒకసారి బేబీ మూమెంట్స్ చూడు అని తీసుకు వెళ్లి స్కాన్ తీస్తారు. బేబీ కదలికలు చాలా స్పీడ్ గా ఉంటాయి.
అవని కడుపులో ఉన్న బేబీ విక్రమ్ కన్నా స్పీడ్ గా ఉన్నాడు అని మోటివేట్ చేస్తూ ఉంటుంది. బేబీ కదిలికలు చూస్తూ అన్ని మరిచిపోయి.. అది మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
విక్రమ్ సురభి వైపు చూస్తే కళ్లు అర్పి నర్స్ ని హెల్ప్ చేయమని... విక్రమ్ పదా.. అని తీసుకువెళుతుంది. ఎలా ఉంది ఆంటీ.. అంతా బాగుంది. డెలివరీ టైం కూడా దగ్గరకి వచ్చేసింది.
జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే అని.. అవని వస్తే కూర్చోబెడతారు. ఎలా ఉంది అమ్మ.. పర్ఫెక్ట్ లీ అల్ రైట్.
చూశారా.. అమ్మ కూడా చెప్పింది.
ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా.. అవని ఇంకొన్ని టెస్టులు ఉన్నాయి. ఇంకా టెస్టులు ఏమిటమ్మా.. అదే డెలివరీ టైం దగ్గరికి వచ్చేసింది కదా..
అందుకే నీకు రూమ్ అలవాటు చేయాలి అని ఏదో చెబుతూ ఉంటుంది. రూమ్ అలవాటు చేయడం ఏమిటమ్మా..
అబ్బా ప్రతిదీ ప్రశ్నలతో విసగిస్తావెందుకు. కాసేపు వచ్చి పడుకో అని విక్రమ్ తీసుకువెళతాడు. అవని అయోమయంగా చూస్తూనే విక్రమ్ వెనకాల వెళుతుంది.
సురభి ఉఫ్... అనుకుని చెమటలు తుడుచుకుంటుంది. వాసు వచ్చి ఏంటి సురభి అబద్దం చెప్పడం కష్టంగా ఉందా...
చాలా.. అందులో అవనికి. ఇప్పుడు ఇంకా విక్రమ్ చేతిలోనే ఉంది. ఆపరేషన్ థియేటర్ అన్నీ రెడీచేసి ఉంచారా వాసు.
అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. నువ్వు టెన్షన్ తీసుకోకు. ఏమో అవనినీ చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఆ భార్గవి ఏం వాగుతుందో.. నిజంగా రియలైజ్ అయిందో.. లేదో ఏమి అర్థం కావడంలేదు.
అవనినీ మంచం మీద పడుకోబెట్టి విక్రమ్ పక్కనే కూర్చుని చేతిని పట్టుకుంటాడు. ఏమైందండీ... అందరూ చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నారు.
నిజం చెప్పండి. చెప్పేది జాగ్రత్తగా విను. టెన్షన్ తీసుకోకు. మీరు చెబుతుంటేనే టెన్షన్ వస్తుంది. అందుకే చెప్తున్నాను. టెన్షన్ పడకు.
నీ పక్కన ఎప్పుడూ నేను ఉన్నాను. మన కుటుంబం అంతా నీతో ఉంది. నువ్వు టెన్షన్ పడితే లోపల ఉన్న మన కన్నా కి మంచిది కాదు.
సరే ఇంతకీ విషయం ఏమిటి.. ఒక్క నిమిషం గట్టిగా శ్వాస తీసుకుని వదిలి భార్గవి హాస్పిటల్ లో ఉంది. అవని విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది.
నీకు చాలా విషయాలు తెలియాలి అని ధనుంజయ్ భార్గవి శిల్ప విషయంలో చేసింది మొత్తము చెబుతాడు. భార్గవిని శిల్ప కూడా ఛీ కొట్టింది అని తెలిసి ఆశ్చర్యపోతుంది.
భార్గవి ఆఖరి నిమిషంలో ఉంది. నీతో మాట్లాడాలి అని కలవరిస్తుంది . నాతోనా స్లోగా ఉంటుంది. హ.. నీతోనే మాట్లాడాలిఅంట.
మాకు ఎవరికీ ఇష్టం లేదు కానీ ఆఖరి శ్వాసలో ఉన్న మనిషి కోరిక తీర్చడం కనీస ధర్మం అని ఒప్పుకున్నాను .
అందుకేనా హాస్పిటల్ కి తీసుకువచ్చింది.
అవును.. నువ్వు ఏదన్నా ఎమోషనల్ అవుతావేమో అని భయం వేసింది. అందుకే అందరం వచ్చాము. ఒక నిమిషం కళ్ళు మూసుకుని తెరిచి సరే మాట్లాడతాను అంటుంది.
నువ్వు టెన్షన్ పడవు కదా.. భయపడవుకదా అని ఒకటికి పది సార్లు అడుగుతాడు. బయట వాళ్ల గురించి నేను ఎందుకు టెన్షన్ పడడం.
అదే మాట మీద ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటే నాకు కొండంత బలం అని వీడియో కాల్ చేస్తాడు. ఈ హాస్పిటల్ కాదా.. కాదు.
విక్రమ్ నుంచి వస్తున్న కాల్ చూసి ధనుంజయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పక్కనే నిండుగా కనిపిస్తున్న కూతురుని తనివితీరా చూసుకుంటాడు.
అవని మాత్రం ఒక్కసారి ధనుంజయ్ ని చూసి తల పక్కకి తిప్పేసుకుంటుంది. ఆమాత్రమైన చూసింది అని తృప్తి పడతాడు.
చెప్పండి అల్లుడుగారు.. కాల్ మీ విక్రమ్.. ఒకసారి ఆ మనిషి దగ్గరికి ఫోన్ తీసుకు వెళ్ళండి. అవని మాట్లాడతానందా.. అవును.
శిల్పా పరిగెత్తుకుంటూ వచ్చి సార్ అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే అవని ఫోన్ వైపు చూస్తుంది. అమ్మకి ఎలా ఉంది.
ఇంకా హోప్స్ వదిలేసుకోవడమే. ఒకసారి చూడొచ్చా.. రా అని భార్గవి ఉన్న రూముల్లోకి తీసుకువెళ్తాడు. ఫోన్ ఎదురకుండా పెట్టి... నా కూతురు లైన్ లో ఉంది.
ఏదో మాట్లాడతాను అన్నావు కదా మాట్లాడు.. కష్టంగా మాట్లాడుతూ క్షమించు అవని. నేను చేసిన పాపాలకి క్షమాపణ ఉండదు అని నాకు తెలుసు.
మనిషి అత్యాశపరుడు కదా.. నువ్వు క్షమిస్తే నరకానికి దారి దొరుకుతుందేమో అని చిన్న ఆశ.
ఇప్పుడు అంత పెద్ద మాటలు ఎందుకులెండి. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. నాకు తెలుసు నువ్వు క్షమించలేవు అని.
ఈ పరిస్థితుల్లో కూడా నీ సంస్కారాన్ని వదల్లేదు. మీ నాన్నది ఎటువంటి తప్పు లేదు. ప్రతి నిమిషం నీ గురించే ఆలోచించేవారు.
నేనే లేనిపోనివన్నీ చెప్పి మీ ఇద్దరి మధ్య దూరం పెంచాను. నీ దగ్గరికి రావాలి... నీతో మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకాన్ని కలిపించేదాన్ని.
నేను చేసిన పాపాలకి శిక్ష నా కూతురు అనుభవిస్తుంది. ఎలా అయితే నీకు గుర్తింపు లేకుండా చేయాలి అనుకున్నానో.. అదే పరిస్థితిలో ఇప్పుడు శిల్ప ఉంది.
మాటలు రాక ఆయాస పడుతూ ఉంటుంది. అవని కంగారుగా మీరు ఎక్కువ మాట్లాడకండి. ఆయాసం వస్తుంది.
ఒకే ఒక్క మాట చెప్పు అవని. క్షమించాను అని. ఆఖరి నిమిషంలో కాస్త తృప్తిగా ఉంటుంది.
ఆ భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దరిదాపుల్లో పుట్టించవద్దు అని.
అవని సమాధానం కోసం ఆశగా చూస్తుంది. విక్రమ్ అవని చేతిని నొక్కుతాడు. అవని విక్రమ్ వైపు చూస్తే తల ఊపుతాడు.
అవని ఫోన్ వైపు చూసి క్షమించాను అంటుంది. ఈ మాట చాలు అని రెండు చేతులతో నమస్కారం చేయడానికి ప్రయత్నించి అది వీలుకాక అలాగే ప్రాణం విడుస్తుంది. అది చూసి అవనీ కళ్ళు మూసుకుంటుంది.
శిల్పా అమ్మ అని గట్టిగా అరుస్తూ భార్గవి మీద పడుతుంది. వెంటనే విక్రమ్ ఫోన్ ఆఫ్ చేసేస్తాడు .
అవని ఏమి మాట్లాడకుండా మౌనంగా కళ్ళు మూసుకుని పడుకునిఉంటుంది.
విక్రమ్ కూడా ఏమీ మాట్లాడాడు. కొంచెం సేపటికి సర్దుకుని కళ్ళు తెరిచి వెళదామా అంటుంది. నువ్వు బాగానే ఉన్నావా అని అనుమానంగా అడుగుతాడు.
చూస్తుంటే తెలియడం లేదా.. ఎవరి గురించో ఆలోచించి నాకన్నాని ఇబ్బంది పెట్టలేను. మిమ్మల్ని భయపెట్టలేను. నా గురించి నా కుటుంబం ఉంది.
ఇంతమంది నా గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు ఎటువంటి సంబంధం లేని మనిషి గురించి నేను ఎందుకు టెన్షన్ తీసుకుంటాను.
అవని అంత ధైర్యంగా ఉండేటప్పటికీ విక్రమ్ చాలా సంతోషపడతాడు. రా అని బయటికి తీసుకువెళతాడు. అవనీ విక్రమ్ ల గురించి ఫ్యామిలీ మొత్తం టెన్షన్ గా చూస్తూ ఉంటే...
అవని ఇందిరాగారి దగ్గరికి వెళ్లి అమ్మమ్మ నేను బాగానే ఉన్నాను. మీరు టెన్షన్ పడకండి. ఇందిర విక్రమ్ వైపు చూస్తే అంతా ఓకే అని వేలు పైకి పెట్టి చూపిస్తాడు.
భార్గవి బాడీని హాస్పిటల్ కి డొనేట్ చేసి ధనుంజయ్ బయటికి వస్తాడు. శిల్ప ఏడుస్తూ ఉంటే ఉదయ్ వెనకాలే వచ్చి మావయ్య మేము బయలుదేరుతున్నాము. సరే అని చెబుతాడు.
సునీల్ ధనుంజయ్ దగ్గరకు వచ్చి బావ అని పిలిస్తే.. చురుగ్గా చూస్తే.. సోరి.. సార్ మీకు అభ్యంతరం లేకపోతే మేము మా కొడుకు దగ్గర ఉండవచ్చా..
సరే అని చెప్పి ధనుంజయ్ తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళిపోతాడు. కొడుకు కోడలతో బిందు సునీల్ గ్రామానికి చేరుకుంటారు.
కొన్ని రోజులకి అంతా నార్మల్ అవుతుంది. అవని మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంది. విక్రమ్ అవనినీ అబ్జర్వ్ చేస్తూ తన పని చేసుకుంటూ ఉంటాడు.
ఎవరూ వదలకుండా ఎప్పుడు ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు అవని విక్రమ్ తో ఒక్కసారి నేను ఆ సార్ తో మాట్లాడాలి. ఇంటికి పిలిపించండి.
ఎందుకు.. పిలిపించండి. మీ ముందే మాట్లాడుతాను సరే అని ధనుంజయ్ కి కాల్ చేసి చెబుతాడు. కూతురు మాట్లాడాలి అన్న విషయం తెలియగానే ధనుంజయ్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు.
తల్లితండ్రులకి విషయం చెప్పి కూతురు కోసం రకరకాల స్వీట్స్, ఫ్రూట్స్ కొని తీసుకుని వెళ్తాడు. ధనుంజయ్ వెళ్లేటప్పటికి అవని హాల్లో కూర్చొని ఉంటుంది.
లలిత తినిపిస్తూ ఉంటే ఇంకా చాలా అత్తయ్య. నావల్ల కాదు. కొద్దిగా తిను బంగారం. తర్వాత పత్యం ఉంటుంది. అప్పుడు కష్టం అని చెప్పి మెల్లిగా తినిపిస్తూ ఉంటారు. కాళ్ళు నీరు పట్టి ఉబ్బిపోయి ఉంటాయి.
కాళ్ళు టేబుల్ పై పెట్టి పూజిత కాళ్ళకి నూనెతో మర్దన చేస్తూ ఉంటుంది. ఆ దృశ్యం చూడగానే ధనుంజయ్ కళ్ళు చెమర్చుతాయి.
కూతురు అత్తారింట్లో ఎలా ఉండాలి అనుకున్నాడో ఆ విధంగా కనిపిస్తూ ఉంటే ఒక తండ్రి గుండె ఆనందంతో కొట్టుకుంటూ ఉంటుంది.
ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉంటే కళ్యాణ్ వచ్చి రండి ధనుంజయ్. హా బావగారు అని వస్తాడు.
అవని ఏం మాట్లాడబోతుంది...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)