14-03-2026, 06:44 AM
Part - 18
గోవింద రావు కి, రుద్ర తల్లి కి, మారేడుమిల్లి లో ఉన్న మెడికల్ క్యాంపు లో ప్రథమ చికిత్స చేసి, అక్కడినుంచి అంబులెన్స్లో రాజమండ్రి లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు..
మారేడుమిల్లి లో బయలుదేరుతుండగానే పురుషోత్తం, రఘునాథ రెడ్డి కి ఫోన్ లో జరిగినదంతా చెప్పాడు. ఆయన వెంటనే వాళ్లు రాజమండ్రి చేరుకునేసరికి అన్ని ఏర్పాట్లు చేశారు..
గోవింద రావు ని, రుద్ర తల్లిని వెంటనే ఐసీయూలో పెట్టి చికిత్స చేయడం ప్రారంభించారు..
ప్రత్యేకమైన కేర్ తీసుకోవడం వల్ల, గోవింద రావు మూడు రోజులకే ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.... కానీ బాగా బలహీనంగా ఉండడం వల్ల, రుద్ర తల్లి కి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది..
గోవింద రావు సృహ లోకి వచ్చాక, రఘునాథ రెడ్డి ఆయనను హాస్పిటల్లో కలుసుకున్నాడు..
"బాగున్నారా స్వామి..? ఇప్పుడు తమరికి ఎలా ఉంది?"
"అంతా ఆ దుర్గ మాత దయ..!! ఇప్పుడు బాగానే ఉన్నాను..!! మీరు ఎప్పుడు వచ్చారు..?"
" తమరికి సృహా వచ్చిందని తెలిసి, ఈరోజు ఉదయాన్నే వచ్చాను.."
" అన్నట్లు అడగడం మర్చిపోయాను..? రుద్ర తల్లి గారికి ఎలా ఉంది.?"
"ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. కానీ బాగా బలహీనంగా ఉండటం వల్ల, కోలుకోవడానికి ఇంకో వారం పది రోజులు పడుతుందని చెప్పారు.."
"మంచిది..!! ఆ దేవుడి దయ వల్ల ఆమె పరిస్థితి ఇప్పుడు బాగుపడింది."
" నిజంగా ఆ గొప్పతనం అంతా తమరిదే స్వామి..! ఆమె ఈ రోజున ఇలా ఉన్నదంటే తమరు చేసిన సాయమే...!!"
ఇలా మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ గారు పిలుస్తున్నారు అని నర్స్ చెప్పగా రఘునాథరెడ్డి బయటకు వెళ్లాడు..
ఇంతలో కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్న గోవింద రావు కి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చి "రావు...!"అని గట్టిగా పిలిచారు..
ఆ పిలుపుకి బయట నుంచొని పురుషోత్తం తో మాట్లాడుతున్న సత్యనారాయణ రావు వేగంగా
ఆ గదిలోకి వచ్చాడు...
" ఏమైంది చిన్నాన్న.? ఏదైనా సమస్య..!!??"
"అమావాస్యకి ఇంకా ఎన్నిరోజులు ఉంది..?"
" ఈరోజు అష్టమి చిన్నాన్న..!! ఇంకా ఆరు రోజులు ఉంది..!!"
గోవింద రావు ఆందోళనగా...!!
" మనం వెంటనే శ్రీశైలం బయలుదేరాలి.. అమావాస్య ఘడియలు దగ్గర పడ్డాయి..
ఈ సమయంలో ఆదిత్య కి దగ్గరగా ఉండాలి..
లేదంటే వాడి ప్రాణానికే ప్రమాదం..!"
" కానీ చిన్నాన్న..!! ఇంకా మీరు పూర్తిగా కోలుకోలేదు..!"
" రేయ్ రావు...! వాడి పరిస్థితి తెలిసుండి, నువ్వే ఇలా మాట్లాడగలుగుతున్నావా..!? అసలు మనం ఇక్కడికి వచ్చింది వాడి ప్రాణాలు కాపాడటం కోసమే కదా..!! కానీ ఇప్పుడు నా ప్రాణాలు కోసం నేను పాకులాడలేను..!! వెంటనే బయలుదేరి వెళ్దాం పద..!! రుద్ర ని కూడా మనతో వస్తాడేమో అడుగు.. రాలేకపోయినా పర్వాలేదు..!! ఎందుకంటే అతని తల్లి ఆరోగ్య పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మనం బలవంత పెట్టడం సమంజసం కాదు..!! వెంటనే రెడీ అవ్వు..!?" అంటూ మంచం మీద నుంచి లేవబోతు ఉండగా తొలి ముందుకి పడిపోబోయారు గోవింద రావు..
"చిన్నాన్న...!!??" అంటూ గోవింద రావు ని పట్టుకున్నాడు సత్యనారాయణ రావు..
అరుపు విని అక్కడే బయట మాట్లాడుకుంటున్న డాక్టర్, రఘునాథరెడ్డి ఇద్దరు వేగంగా లోపలికి వచ్చారు..
గోవింద రావు నీ మంచం మీద పడుకోబెట్టడానికి రఘునాథరెడ్డి కూడా సహాయం చేశారు..
" ఏమైంది...? ఎందుకు ఇలా పడిపోయారు..??"అని డాక్టర్ అడుగగా..
జరిగినదంతా వివరించాడు సత్యనారాయణ రావు...
ఆ మాటలకి డాక్టర్ చిన్నగా గోవింద రావు గారి మీద కోప్పడుతూ...
" చూడండి సార్..!! మీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు.. మీ శరీరం నుంచి రక్తం చాలా పోయింది.. మీరు బాగా నీరసంగా ఉన్నారు.. కనీసం ఐదు రోజులైనా సరే మీరు మంచం దిగకూడదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలే సమస్య లేదు.."అని చెప్పి బయటకు వెళ్లిపోయారు...
అక్కడే ఉన్న రఘునాథరెడ్డి కూడా డాక్టర్ ని సపోర్ట్ చేస్తూ...!!
" స్వామి..!! దయచేసి ఈ ఒక్క అయిదు రోజుల పాటు మంచం దిగకుండా ఉంటే మీరు కోలుకుంటారు.. మీరు కోలుకున్న వెంటనే శ్రీశైలం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను... దయచేసి అర్థం చేసుకోండి."
అని గోవింద రావు తో చెప్పి,
"ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి.." అని సత్యనారాయణ రావు తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు..
రఘునాథ రెడ్డి వెళ్ళిపోయిన కొద్ది నిమిషాల పాటు, గోవింద రావు ఏమీ చేయలేక మౌనంగా ఆలోచిస్తూ ఉండి పోయారు..
ఆలోచిస్తు ఏదో గుర్తొచ్చి, సత్యనారాయణ రావు తో " ఆదిత్య ఏమైనా ఫోన్ చేశాడా...?? " అని అడిగారు.
"మనం రుద్ర ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేశాడు..
తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదు..
నేను కూడా ఏమి పట్టించుకోలేదు...
నీకు ఇలా ఉందని తెలిస్తే వాడి బాధ పడతాడని నేను కూడా వాడికి ఫోన్ చేయలేదు.."
"సరే...!! ఒకసారి వాడికి ఫోన్ చెయ్ మాట్లాడాలని ఉంది.."అని చెప్పగానే సత్యనారాయణ రావు ఆదిత్య కి ఫోన్ చేసి గోవింద రావు కి ఇచ్చాడు.
ఫోన్ ఎత్తగానే "ఆదిత్య ఎలా ఉన్నావు రా.?" అని అడిగాడు గోవింద రావు...
"ఆ తాతగారు నేనండీ భానుని..!! ఎలా ఉన్నారు..? బాగున్నారా..?? ఆదిత్య గారు ఫోను మర్చిపోయి బయటికి వెళ్లారు..!ఏదైనాఅర్జెంట్ ఆ...?? వచ్చాక చెప్పమంటారా..??"అంటూ భాను మాట్లాడింది..
" ఆ వద్దులే తల్లి..!! మామూలుగా కాల్ చేశాను..!
వాడు ఎలా ఉన్నాడు..? బాగానే ఉన్నాడా..అమ్మా..?"
" ఆ బాగానే ఉన్నారు. తాతగారు...!!"
" మంచిది తల్లి..! వస్తే అడిగానని చెప్పు..!! వీలుంటే ఫోన్ చేయమని చెప్పు..!! ఉంటాను.."
" అలాగే తాతగారు చెప్తాను.."అంటు ఫోన్ కట్ చేసింది...
"ఏమైంది చిన్నాన్న..? ఎలా ఉన్నాడు వాడు..?"
" ప్రస్తుతానికి వాడు బాగానే ఉన్నాడు రా...!!
కానీ అమావాస్య ఘడియలు దగ్గర పడుతున్నాయి.. నేను కోలుకున్న వెంటనే వీలైనంత తొందరగా మనం శ్రీశైలం చేరుకోవాలి.."
" అలాగే చిన్నాన్న..!! మీరు రెస్ట్ తీసుకోండి నేను బయటికి వెళ్లి చిన్న పని చూసుకుని వస్తాను..."
అంటూ హాస్పిటల్ గది నుంచి బయటకు వచ్చాడు...
వేగంగా అక్కడినుంచి హాస్పిటల్ బయటకు వచ్చి హాస్పిటల్ వెనక ఉన్న ఒక చెట్టు కింద కుర్చీలో కూర్చున్నాడు... కంగారుగా తన జేబులో ఉన్న మొబైల్ తీసి, ఫోన్ చేశాడు...
ఆ ఫోన్ ఎవరితో కాదు ఆదిత్య కి....
రింగ్ అయిన మొదటి క్షణాల్లోనే అవతలివైపు ఫోన్ ఎత్తారు...
అవతల మాట్లాడేది భాను...
" అమ్మ భాను..!! ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉందమ్మా..??" అంటూ కంగారుగా అడిగాడు..
" పరిస్థితి ఏమీ బాగోలేదు అంకుల్..!! మీరిద్దరూ వెంటనే వస్తే మంచిదని తాతగారు అంటున్నారు.. ఆయన పరిస్థితి చూస్తే నాకు చాలా భయంగా ఉంది.."అంటూ ఏడవసాగింది.
" భయపడకు బాను.. ఇక్కడ చిన్నాన్న పరిస్థితి కూడా అస్సలు బాగోలేదు.. ఈ పరిస్థితుల్లో ఆదిత్య గురించి తెలిస్తే ఆయన ఆరోగ్యం మరింతగా పాడవుతుంది.. మేము ఇంకో నాలుగు ఐదు రోజుల్లో అక్కడికి వచ్చేస్తాము..
అప్పటివరకు వాడిని జాగ్రత్తగా చూసుకోండి.."
" అలాగే అంకుల్..!! తాతయ్యగారు జాగ్రత్త...!" అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది..
" ఆదిత్య గారికి ఏమైంది సార్...??" అన్న పిలుపుకి సత్యనారాయణ రావు ఉలిక్కిపడ్డాడు..
వెనక్కి తిరిగి చూడగా అతని వెనకాల పురుషోత్తం ఉన్నాడు...
"ఏమైంది సార్ ఆదిత్య గారికి...?" అని మళ్లీ అడిగాడు పురుషోత్తం..
ఏమి సమాధానం చెప్పకుండా తన పక్కన ఉన్న కూర్చుని చూపిస్తూ కూర్చోమన్నట్టు సైగ చేసాడు సత్యనారాయణ రావు...
కూర్చున్న తర్వాత పురుషోత్తం మళ్ళీ అడిగాడు "చెప్పండి సార్ అసలు ఏమైంది..??"
" ఆదిత్య పరిస్థితి అసలు బాగాలేదు పురుషోత్తం..!"
" సార్....! దయచేసి పూర్తిగా చెప్పండి.
నేను టెన్షన్ తట్టుకోలేక పోతున్నాను.."
" నీకు గుర్తుంది కదా మనం విజయవాడ నుంచి మారేడుమిల్లి ఉదయం బయలుదేరే ముందు భాను నుంచి గోవింద రావు గారికి ఫోన్ వచ్చింది..!!"
" ఏమని వచ్చింది సార్...??"
" అప్పుడు చిన్నాన్న స్నానం చేస్తూ ఉన్నారు..
ఫోన్ నేను ఎత్తి మాట్లాడాను..!"
"ఆ తర్వాత ఏమని చెప్పారు సార్...!!"
జరిగిందంతా చెప్తాను విను...
భాను : అంకుల్ నేను తాతగారితో అర్జెంటుగా మాట్లాడాలి..( కంగారు పడుతూ.)
సత్యనారాయణ రావు: ఏమైందమ్మా..? తాతగారు స్నానం చేస్తూ ఉన్నారు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే చెప్పు....!!
నేను ఆయనతో చెప్తాను..
భాను ఏడుస్తూ: ఇక్కడ ఆదిత్య గారి పరిస్థితి అస్సలు బాలేదు. అంకుల్... తాతయ్య గారు కంగారుపడుతున్నారు. నిన్నటి నుంచి మీ ఫోన్ కోసం ప్రయత్నిస్తున్నాను.. కానీ ఇప్పటికీ కలిసింది..
సత్యనారాయణ రావు కంగారు పడుతూ:
అసలు ఏమైంది అమ్మ..? నాతో చెప్పు!!
భాను: ఆ రోజు మీరు ఊరికి బయలుదేరేటప్పుడు సాయంత్రం
నా పుట్టినరోజు పార్టీ జరిగింది.. ఆ రోజు రాత్రి పార్టీ అయిపోయిన తర్వాత నేను ఆదిత్య గారి కోసం ఆయన గదికి పాలు తీసుకు వెళ్ళాను.. కానీ ఆయన గదిలో లేరు. నేను మొత్తం వెతికి చూడగా మేడపైన ఒంటరిగా కూర్చుని ఉన్నారు..
" ఏంటి సార్..! ఒంటరిగా మేడపైన ఏం చేస్తున్నారు.? అని అడిగాను.కానీ ఆయన సమాధానం చెప్పకుండా రోడ్డు వైపు చూడసాగారు.. ఆయన అలా పలకక పోయేసరికి, నేను ఆయన పక్కగా వెళ్లి
"ఏంటి సార్...? అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు..?" అని అడిగాను..
అయినా సరే ఆయన మాట్లాడకుండా అటు వైపే చూడసాగారు.. "అసలు అక్కడ ఏముంది..?" అని నేను ఆయన చూస్తున్న వైపు చూశాను..
అక్కడ..?? అక్కడ...??" అంటూ చెప్పడం ఆపేసింది...
సత్యనారాయణ రావు:"అక్కడ ఏముంది..?
చెప్పమ్మా భాను...??"
భాను: అంకుల్...!! చెప్తే నమ్మరు...! అక్కడ
ఒక పెద్ద నల్లటి ఆకారంలో ఒక పిశాచి వంటిది.
మా ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ కనిపించింది.. అది ఎటువైపు తిరుగుతుంటే ఆదిత్య గారు అటువైపే చూడసాగారు..
నాకు మాత్రం భయంతో ఒళ్ళంతా చమటలు పట్టేసాయి.. నేను భయంతో అక్కడ నుంచి వేగంగా పరుగెత్తుకొని వెళ్లి, మా తాతయ్య గారిని తీసుకు వచ్చాను. ఆయన కూడా ఆ ఆకారాన్ని చూశారు.. తాతయ్య గారు వెంటనే ఆదిత్య గారిని గది లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా ఆయన అక్కడ నుంచి కదలడం లేదు. దాని వైపే చూస్తూ ఉన్నారు... ఇంకా తాతగారు చేసేదేమీ లేక, వెంటనే పూజ గది లోకి వెళ్లి,
ఒక మంత్రించిన రక్ష తీసుకువచ్చి, ఆయన చేతికి కట్టారు... అది కట్టిన వెంటనే మొదలు నరికిన చెట్టులాగా ఆదిత్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు.. మేము వెంటనే ఆయన్ని గదిలోకి పడుకోబెట్టి, వచ్చేసాము.. ఆ తర్వాత రోజు నుంచి ఆయన అసలు మంచం మీద నుంచి లేవలేదు.. ఏమీ తినలేదు,తాగలేదు. ఒక రోజు రాత్రి మేమందరం పడుకుని ఉండగా అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళి పోతూ ఉండగా.. మా పని వాళ్ళు ఆయనని అడ్డగించి ఆపారు... లేకపోతే బయటికి వెళ్లి పోయే వారే..!!
ఇప్పుడు అయితే పరిస్థితి మరీ ఘోరంగా మారింది...నిన్నటి నుంచి " నన్ను ఎవరో పిలుస్తున్నారు.. నన్ను వదలండి..! నన్ను ఆపడానికి మీరెవ్వరూ....??" అంటూ గొడవ చేస్తున్నారు.. ఆయన పరిస్థితి చూస్తుంటే చాలా బెంగగా ఉంది అంటూ ఏడవసాగింది...
సత్యనారాయణ రావు : చూడు తల్లి...!
వాడి పరిస్థితి తెలిసే మీ ఇంట్లో ఉంచడం జరిగింది. వాడు కనుక మీ ఇంట్లో లేకపోతే వాడి ప్రాణానికి చాలా ప్రమాదం. దయచేసి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కదలకుండా చూడండి.. మేము రుద్ర ని కలవడానికి వెళ్తున్నాము.. తాతయ్య గారి పరిస్థితి కూడా బాలేదు.. ఇప్పుడు
ఈ విషయం తెలిసింది అంటే రుద్రని వెతకడం మానేసి వెంటనే అక్కడికి వచ్చేస్తారు.. అదే కనుక జరిగితే ఆదిత్య ని కాపాడే ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.. కాబట్టి మీరే ఏదో విధంగా మేము వచ్చేవరకు వాడిని కాపాడండి. వచ్చే అమావాస్య లోగా శ్రీశైలం వచ్చేస్తాము...
భాను : అలాగే అంకుల్..! ఈ విషయాన్ని నేను తాతయ్య గారి తో చెప్తాను.. మీరు వీలైనంత త్వరగా వచ్చేయండి... అంటూ ఫోన్ పెట్టేసింది..
ఇది జరిగింది పురుషోత్తం.." అంటూ సత్యనారాయణ రావు జరిగిందంతా చెప్పాడు...
" మరి ఇప్పుడు ఎలాగా సార్..? ఇక్కడ తాతయ్య గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. అక్కడ ఆదిత్య గారి పరిస్థితి బాలేదు. రుద్ర గారు కూడా తల్లిని వదిలేసి వచ్చే పరిస్థితుల్లో లేరు."అంటూ బాధపడసాగాడు..
" నాకు అదే అర్థం కావట్లేదు పురుషోత్తం..!!
ఆ దేవుడే మాకు ఒక దారి చూపాలి..!" అంటూ బాధపడసాగాడు సత్యనారాయణ రావు..
" సార్..!! గోవింద రావు గారికి చెప్పకుండా,
రుద్ర గారికి ఆదిత్య గారి పరిస్థితి గురించి చెప్పి ఊరు తీసుకు వెళ్తే మంచిదేమో అని నాకనిపిస్తోంది..!!"
" వద్దు పురుషోత్తం..!! రుద్ర తల్లి గారికి ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకోలేదు.. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు.. చిన్నాన్న గారి ని వదిలి వెళ్ళడం కూడా కుదరదు.. ఎందుకంటే ఆయన లేకుండా
రుద్ర ఒక్కడే ఆదిత్యని కాపాడగలడు అని నేను అనుకోవడం లేదు..!! ఇక ఏది జరిగితే అదే జరుగుతుంది..!! చిన్నాన్నగారు లేకుండా నేనొక్కడినే శ్రీశైలం వెళ్లడం జరగదు.."
ఆ మాటలు విన్న పురుషోత్తంకి కూడా సత్యనారాయణ చెప్పిందే సమంజసమని అనిపించింది..!!
అలా ఒక నాలుగు రోజులు గడిచాయి....!!
అనగా అమావాస్య కి రెండు రోజులు ముందు..!
హాస్పిటల్లో...!!
గోవింద రావు గారి గది లో....!
డాక్టర్ గారు గోవింద రావు గారిని పరీక్షిస్తున్నారు..
కొంతసేపటికి పరీక్షలన్నీ పూర్తయ్యాయి..
"గోవింద రావు గారు రేపు సాయంత్రం మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాను.. ఇప్పుడు మీరు పూర్తిగా కోలుకున్నారు..."
" డాక్టర్ గారు నాకు అర్జెంటు పని ఉంది.
నేను ఈ రోజు సాయంత్రానికి బయలుదేరాలి అనుకుంటున్నాను.."
" అయ్యో..!! ఇంకొక టెస్ట్ మిగిలిపోయి ఉంది అదొక్కటి చేసిన తర్వాత కావాలంటే రేపు మధ్యాహ్నం నుంచి బయలుదేరవచ్చు.."అని చెప్పి డాక్టర్ అక్కడనుంచి వెళ్ళిపోయాడు..
ఇప్పుడు గదిలో సత్యనారాయణ రావు గోవింద రావు మాత్రమే ఉన్నారు...
"ఇప్పుడే వస్తాను చిన్నాన్న...!" అంటూ సత్యనారాయణ రావు బయటికి వెళ్లాడు.
సత్యనారాయణ రావు అలా వెళ్లడంతో..
మంచం మీద కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉండగా.. టేబుల్ పైన ఫోన్ మోగింది..
అది సత్యనారాయణ రావు ది...!!
మరిచిపోయి బయటకు వెళ్లిపోయారు...!!
ఎవరా అని చెప్పి ఫోను స్క్రీన్ మీద పేరు చూడగా ఆదిత్య అని వచ్చింది...
ఆనందంతో ఫోన్ ఎత్తారు గోవింద రావు..
హలో అంటూ అనబోయి లోపు.. అటువైపు నుంచి భాను ఏడుపు వినిపించసాగింది...
" హలో అంకుల్..!! ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అంకుల్ మీరు రావడానికి...?? త్వరగా వచ్చేయండి..
ఇక్కడ ఆదిత్య గారి పరిస్థితి అస్సలు బాగోలేదు.. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. ఎలాగైనా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు..
అందుకని వేరే దారిలేక అయినను మంచానికి కట్టివేసాం....
దయచేసి మీరు వెంటనే బయలుదేరండి.." అంటూ మాట్లాడుతూ ఉండగా వెనకనుంచి ఏవో అరుపులు వినిపించసాగాయి.." అంకుల్..! నేను మీకు మళ్ళీ చేస్తాను...!!" అంటూ కంగారుగా ఫోన్ పెట్టేసింది..
గోవింద రావు గారికి ఒక క్షణం మతి పోయింది...
అప్పుడే సత్యనారాయణ రావు గది లోపలికి వచ్చారు...
" రేయ్ రావు...!! ఆదిత్య ఏమైనా ఫోన్ చేశాడా..?" అని సత్యనారాయణ రావు అని అడిగారు..
సత్యనారాయణ రావు కొద్దిగా తడబడుతూ..
" హా.. చేశాడు చిన్నాన్న.. ఇవాళ పొద్దున్నే చేశాడు..
మీ గురించి అడిగాడు. నేను పని మీద బయటకు వచ్చాను అని చెప్పడంతో తర్వాత చేస్తాను అని చెప్పాడు.."
ఆ మాటలు విన్న గోవింద రావు కి కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి..
" ఏరా రావు..!! నువ్వు కూడా నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావా..??" అని అడగడంతో సత్యనారాయణ రావు కి ఒక్కసారిగా దడ మొదలైంది..
" అదేంటి చిన్నాన్న..!! ఇప్పుడు ఏమైందని..??"
" ఇప్పుడే భాను ఫోన్ చేసింది రా...!! నువ్వు అనుకుని అక్కడ ఆదిత్య పరిస్థితి గురించి నాతో పూర్తిగా చెప్పింది..!!"
సత్యనారాయణ రావు గబగబా గోవింద రావు దగ్గరకు వచ్చి ఆయన చేతులు పట్టుకొని
" నన్ను క్షమించు చిన్నాన్న..!! వాడి గురించి తెలిస్తే నువ్వు ఏమైపోతానో అని భయపడి చెప్పలేదు.ఎలాగైనా రుద్ర సహాయం తీసుకుని వాడిని కాపాడదామని అనుకున్నాను.."
" నీ గురించి నాకు తెలుసు రా..!! కానీ ఇప్పుడు వాడు పరిస్థితులు బాగో లేదని ఆ పిల్ల ఏడుస్తూ చెబుతోంది.. ఇక మనం ఎట్టి పరిస్థితులలోనూ ఆగడానికి వీలులేదు.. వెంటనే బయలుదేరాలి." అంటూ చాలా దృఢంగా చెప్పారు..
సత్యనారాయణ రావుకు తన చిన్నాన్న గురించి తెలుసు.. ఏదైనా దృఢంగా అనుకున్నారంటే ఎట్టిపరిస్థితులలోనూ ఆగరు.. అందుకనే తన కూడా ఏమీ అడ్డుచెప్పకుండా వెంటనే అక్కడి నుంచి బయల్దేరడానికి ఏర్పాట్లు చేయసాగారు...
రఘునాథ రెడ్డి కి ఫోన్ లో జరిగిందంతా చెప్పాడు సత్యనారాయణ రావు..
ఆయన కూడా సరేనని ఇప్పుడు బస్సులో వెళితే మీద త్వరగా చేరుకోలేరని, అందుకే పురుషోత్తముని కార్లో తీసుకెళ్ళమని చెప్పారు..
ఆరోజు మధ్యాహ్నమే పురుషోత్తం తో కలిసి ముగ్గురు శ్రీశైలం బయలుదేరారు....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)