13-03-2026, 07:24 AM
Part - 145
భార్గవి ఉన్న గదిలోనికి వెళ్లి శిల్ప అమ్మ అని పిలుస్తుంది. ఆ పిలుపుకి భార్గవి తలెత్తి చూస్తుంది. ఎదురుగా కూతురు తక్కువరకం చీరలో.. మెడలో పసుపుతాడు చేతికి మట్టి గాజులతో కనపడుతుంది.
అలా చూడగానే భార్గవికి ఏడుపు తన్నుకొస్తుంది. అమ్మ శిల్ప ఏంటే ఇలాగున్నావు అని వచ్చి పట్టుకోపోతుంటే దూరంగా జరుగుతుంది.
ఏమైందే దూరం జరుగుతున్నావు..నువ్వు నన్ను తాకడం నాకిష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావ్ శిల్పా నువ్వు. నిజమే చెబుతున్నాను.
నీలాంటి వాళ్ళ నీడ నామీద పడడం నాకు ఇష్టం లేదు. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి..నీ వైభోగం ఎలా ఉందో చూపించడానికి.. నేనెంత వైభోగం అనుభవిస్తున్నాను చూడడానికా...
అవును నా వైభోగం చూపించి నీ వైభోగాన్ని చూడడానికే వచ్చాను. ఎలా ఉన్నావు. చూస్తున్నావు కదా ఇలా ఉన్నాను.
చేసుకున్నదానికి అనుభవించాలి కదా.. నువ్వు కూడా మీ నాన్న లాగానే మాట్లాడుతున్నావా... క్షమించు... నాకు నాన్న లేరు.
శిల్ప అని ఒక అడుగు వెనక్కివేస్తుంది. నిజమే చెబుతున్నాను. నాకు తండ్రి లేరు. పిచ్చిపిచ్చిగా వాగుతున్నావా..
తండ్రి లేకుండా ఎలా పుడతావు. అది నీకే తెలియాలి. నువ్వు నా వ్యక్తిత్వాన్ని అవమానిస్తున్నావు. నీకు ఒక వ్యక్తిత్వం ఉంది అని నువ్వు అనుకుంటున్నావా...
నువ్వేనా శిల్పా ఇలా మాట్లాడేది. అసలు ఏమైందే నీకు. మెడలో ఈ పలుపుతాడు కట్టి ఆ పొలాల్లో వదిలేసేటప్పటికీ దయ్యం ఏమైనా పట్టిందా.... పైత్యపు వాగుడు వాగుతున్నావు.
ఇన్ని రోజులు పట్టిన దయ్యం వదిలేసింది. అందుకే నా మాటలు నీకు నచ్చడంలేదు. ఇది పలుపుతాడు కాదు పసుపుతాడు.
నా జీవితానికి సరైన దారి చూపించే తాడు. మరి నీ మెడలో ఉన్న తాళికి అర్థం ఏమిటి... నేను నలుగురిలో ధైర్యంగా నా భర్త ని చూపించగలను. నువ్వు చూపించగలవా...
శిల్ప మాట్లాడుతున్న విధానానికి భార్గవికి తల తిరిగిపోతూఉంటుంది. తల పట్టుకుని అసలు ఏం మాట్లాడుతున్నావు శిల్ప..
నాకూతురివేనా నువ్వు.. అదే నా దౌర్భాగ్యం. నీ కడుపున పుట్టకపోయి ఉండి ఉంటే.. నేను కూడా ఒక మంచి జీవితాన్ని మొదలుపెట్టేదాన్ని.
అవనిలాగ సంతోషంగా ఉండేదాన్ని.. ఇప్పడుకూడా సంతోషంగా ఉన్నాను అనుకో.. అవని.. అవని అని ఎందుకు జపం చేస్తున్నావు.
మీ నాన్న అంటే కన్న కూతురు కాబట్టి ఉంటుంది. మరి నీకేమయింది.. నాకు అక్క కదా ... నువ్వు సరిగ్గా ఉండి ఉంటే మేము అక్కచెల్లెళ్ళాగ పెరిగేవాళ్ళము.
మంచి చెడు విచక్షణ అక్క నాకు చెప్పేది. కానీ నువ్వు చేసిన పాపాలు నా మెడకి చుట్టుకున్నాయి. నేను ఇక్కడికి వచ్చిన విషయం చెబుతాను జాగ్రత్తగా విను. దయచేసి నేను నీ కూతురిని అని ఎక్కడా చెప్పద్దు.
సమాజంలో నాకంటూ ఒక గౌరవం ఏర్పడింది. నీ కూతురిని అని తెలిస్తే ఆ గౌరవం పోతుంది. ఆఖరికి నీకు తులసినీళ్లు పోసే టైం లో కూడా నన్ను చూడాలి... కలవాలి అని మాత్రం అడగద్దు.
ఇది నా రిక్వెస్ట్ అనుకో... ఈ విషయం చెబుదామనే సార్ ని బ్రతిమాలి ఇక్కడికి వచ్చాను. నేను వెళుతున్న అని వెనక్కి తిరుగుతుంది.
శిల్పా అంటే.. చెప్పమ్మా.. అమ్మ అని విరక్తిగా నవ్వుతూ అమ్మ అని పిలుస్తున్నావు కానీ వద్దు అంటున్నావు. ఇంత కఠిన హృదయం ఎలా వచ్చిందే..
ఎంతైనా నీ కన్నకూతురిని కదా.. నీ హృదయమే నాకు వచ్చింది. మరి నీ కలలు... వాటిని వదిలేస్తున్నావా... కలలు....
అవి కావాలి అని కోరుకోవడం కోరిక కానీ ప్రయత్నించే విధానం సరిగ్గా లేనప్పుడు అత్యాశ అవుతుంది. నేను సరిగ్గా ప్రయత్నించలేదు. తల్లిగా సరైన దారి నువ్వు చూపించలేదు.
కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవడం అన్నది అనవసరం. ఇప్పుడు నేను బ్రతుకుతున్న జీవితం ఉంది చూడు.. చాలా ప్రశాంతంగా ఉంది.
ఎటువంటి మోసాలు, ఆర్టిఫిషియల్ జీవితం అక్కడ లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాను. నీలో నిజంగా మార్పు వచ్చి ఆఖరి రోజుల్లో మనిషిగా బ్రతకాలి అని అనిపిస్తే...
నా దగ్గరికి రా. నేను తినే దాంట్లోనే నీకు కొద్దిగా పెడతాను. లేదు ఇలాగే కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుతాను అంటే నీకు ఒక కూతురు ఉందన్న సంగతి పూర్తిగా మర్చిపో... చెప్పాల్సింది చెప్పి శిల్ప అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తూ మొదలకి నరికిన చెట్టులాగా కూలబడిపోతుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా రావడం లేదు. ఒక శూన్యం కనపడుతూఉంటుంది.
మాట రాకుండా.. చుట్టూ తెలియని నిశ్శబ్దం ఆవహించినట్టుగా ఒక భయంలోనికి వెళ్ళిపోతుంది. ధనుంజయ్ అది చూసి ఏమైంది భార్గవి..
ఏదో ఊహించుకుని ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావు.. చివరికి ఏ కూతురునైతే రాణిని చెయ్యాలి అనుకున్నావో.. ఆ కూతురే నిన్ను ఛీ కొట్టింది. ఇది నీ జీవితం .
ఉదయ్ మాత్రం ఆశ్చర్యంగా శిల్పని చూస్తూఉంటాడు. ఇంత మార్పా.. మనిషిని ఒంటరిగా వదిలేస్తే అవుతే మహాత్ముడు అవుతాడు లేదా సైకో అవుతాడు అంటారు.
మనిషిగా మారింది ఇది చాలు అనుకుని ఉదయ్ కూడా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఒంటరిగా గదిలో భార్గవి మిగిలిపోతుంది.
పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. ఎవరుతోను ఏమీ మాట్లాడకుండా ఒక మూలకి కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉండిపోతుంది.
ధనుంజయ్ కి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది.. శిల్పలో ఏ మార్పు అయితే తండ్రిగా కోరుకున్నాడో ఆ మార్పు కనిపిస్తూ ఉంటుంది.
వినయ్, భరత్ ల కళ్యాణ ఘడియలు కూడా దగ్గరికి వచ్చేస్తాయి. నేహా, అవని కూర్చునే పనులు పురమాయిస్తూ ఉంటారు.
నివి షాపింగ్ కి తిరుగుతూ కొత్త కొత్త కలెక్షన్ అన్ని తీస్తూ ఉంటుంది. రాజ్ నివికి దొరకకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ అది సాధ్యమయ్యే పని కాదు అని పనులన్నీ పూర్తయ్యేటప్పటికి అర్థమవుతుంది.
ఓకే మండపంలో రెండు పెళ్లిళ్లకి ముహూర్తం ఖాయమవుతుంది. మేలు ముసుగులో వచ్చిన అమ్మాయిలు ఇద్దరు పెళ్లి కొడుకుల పక్కన కూర్చుని వివాహ వేడుకని మొదలుపెడతారు.
అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరుగుతాయి. రెండు జంటలని కుడికాలు లోపలపెట్టి రమ్మని చెబుతారు. నివి గా స్పీడ్ గా వచ్చి ఆగండి ఆగండి ముందు పేర్లు చెప్పి ఆడపడుచు కట్నం ఇచ్చి అప్పుడు రండి.
వదిన మీరు రండి. మీ అన్నయ్యకి హారతి పళ్లెం నువ్వే పట్టాలి. వస్తున్న అని నిండు గర్భిణీగా ఉన్న అవని ముందుకు వస్తుంది.
పక్కనే లలిత,మాధవి సాయం చేస్తూ ఉంటే హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలకి రండి అన్నయ్య. అదేంటి వదిన గిఫ్ట్ తీసుకోవా..
అందరికీ నీలాగా గిఫ్ట్ లు ఇంట్రెస్ట్ ఉండదు కదా నివి.. మీరు ఆపుతారా... లేదు లేదు వదిన నువ్వు గిఫ్ట్ తీసుకోవాలి.
సరే నేను మా అన్నయ్యని అడుగుతాను అని భరత్ ని చూస్తుంది. చెప్పరా నీకు ఏం కావాలి. ఏదైనా సరే ఇస్తాను. మనిద్దరి మధ్య ఎటువంటి రక్తసంబంధం లేకపోయినా జీవితాంతం నాకు పుట్టిల్లుగా నిలబడతావా...
రేపు నాకు పుట్టబోయే బిడ్డకు మేనమామ వరసలన్నీ చేస్తావా అన్నయ్య. ఆ మాటకి అందరి కళ్ళు చెమ్మర్చుతాయి.
భరత్ వెంటనే నువ్వు అవునన్నా కాదన్నా ఎప్పటికీ నువ్వు నాకు చెల్లివే. రమేష్ మాధవి ఇద్దరూ అవని చుట్టూ చేతులు వేసి నిన్ను దత్తత తీసుకుంది రక్త సంబంధంగా మారడానికి.
మన మధ్యన బ్లడ్ రిలేషన్ లేకపోవచ్చు.. నువ్వు బయాలజికల్ గా నా కూతురువి కాకపోవచ్చు కానీ ఎప్పటికీ నువ్వు భగవంతుడిచ్చిన బంగారు తల్లివి.
రేపు నీకు మీ అన్నయ్య కి మధ్యన ఏదైనా విషయం వస్తే నీ వైపే నిలబడతాము. నాన్న నేను కూడా నా చెల్లి వైపే.. ఏం విద్యా. అవును వదిన గారు అంటుంది.
వదిన గారు అవసరం లేదు విద్య.. వదినా చాలు. సరే అని భయంగా తల ఊపుతుంది. ఉఫ్.. నా పెళ్ళానికి భయం పోయేటప్పటికి నేను ముసలివాడిని అయిపోతానేమో అనుకుంటాడు.
విక్రమ్ వచ్చి తల మీద కొట్టి మనసులో అనుకున్నది చాలు. నా చెల్లెలు బంగారం. శ్రీ వచ్చి అవునవును నీ చెల్లెళ్లు ముగ్గురు బంగారాలు.
మేమే ఇత్తడి,రాగి అంతే కదా... అవునా రాజ్ అంటే నన్ను ఇన్వాల్వ్ చేయకు బ్రో.. నా పెళ్ళాం ఇక్కడే ఉంది. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వితే..
ఇందిరగారు వచ్చి ఎంత బంగారం అయినా సరే రాగి కలపకపోతే వస్తువు తయారవ్వదు. భార్యాభర్తలయినా అంతే.
ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రెండు కలిస్తేనే అందమైన వస్తువు ఏర్పడినట్టుగా భార్యా భర్తల అన్యోన్యతే చక్కటి కుటుంబం ఏర్పడుతుంది.
కరెక్ట్ చెప్పావు నానమ్మ అని విక్రమ్ ఇందిర గారిని హగ్ చేసుకుంటాడు. వినయ్... నాకు కాళ్లు లాగుతున్నాయి మేమింకా ఎంతసేపు..
ఒరేయ్ నీ సంగతి మర్చిపోయామురా లోపలికి రండి.. హమ్మయ్య అంటాడు. వెంటనే నివి పేర్లు చెప్పి రండి..
వినయ్ అనే నేను నా రౌడీ బేబీ తో కలిసి వచ్చాను అంటాడు. వెంటనే అందరూ అదేం చెప్పడం రా.. చిరాగ్గా.
పూజిత అని బంగారం లాంటి పేరు ఉంటే..
ఏ పేరైనా సరే ఇది ఎప్పటికీ నాకు రౌడీ బేబీ నే అంటాడు. ఆ మాటకి కోపంగా వినయ్ వైపు చూస్తే పెద్ద వాళ్ళందరూ చూస్తున్నారని సిగ్గుపడుతూ తల దించేసుకుంటుంది.
నివి పూజిత దగ్గరికి వచ్చి నువ్వు అసలు ఏమీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనమందరం ఒకటే పార్టీ. అవునమ్మా నా భార్యతో కలిసావు అంటే...
వినయ్ కూడా నా పక్కనే వచ్చే కూర్చుంటాడు. నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది.
బావ అని వినయ్ రాగం తీస్తే... తప్పదు రా బామ్మర్ది. నువ్వు కూడా భార్య బాధితుల సంఘం లో చేరాల్సిందే... అప్పుడే కదా నాకు మనశ్శాంతి.
అందరూ వీళ్ళ మాటలకి నవ్వుకుంటూ సరే రండి లోపలికి... విద్య, పూజిత ని తీసుకువెళ్లి దేవుడి గదిలో దీపం పెట్టేస్తారు.
అందరూ రెస్ట్ తీసుకోండి అని విక్రమ్ అవనినీ గదిలోకి తీసుకువెళతాడు. బరువుగా ఉన్న చీర నగలు అన్ని తీసి అలసిపోయావా... కొంచెం అలసటగానే ఉంది.
ఫ్రీగా ఉండే మాక్సి వేసి టబ్లో సాల్ట్ వాటర్ కలిపి తెచ్చి కాళ్లు పెట్టుకో అంటాడు. ఇప్పుడు నాకు ఓపిక లేదు. కూర్చో అని చెప్పి సోఫాలో కూర్చోబెట్టి.. కాళ్ళు వాటర్లో పెడతాడు.
కాసేపటికి చాలా రిలాక్స్డ్ గా ఉంది అండి అంటుంది. అందుకే బద్దకంగా ఉన్న కొన్ని కొన్ని పనులు చేసుకోవాలి. నువ్వే ఇంత బద్ధకంగా ఉంటే.. రేపు నాకన్నా ఎలా ఎక్టివ్ గా ఉంటాడు.
అవని??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)