12-03-2026, 07:10 AM
Part - 143
ఇందిరా గారు అవని దగ్గరికి వచ్చి ఎప్పుడు ఏడవకూడదు. నవ్వుతూ ఉండాలి. మీ ఆయనకి వెన్నుముకలాగా ఉండి ధైర్యాన్ని ఇవ్వాలి. అంతే నువ్వు చేయాల్సింది.
తప్పకుండా చేస్తా అమ్మమ్మ గారు అని కౌగిలించుకుంటుంది. అంతా ఎమోషనల్ గా ఉండేటప్పటికీ వినయ్ వచ్చి అబ్బబ్బ ఎమోషనల్ ఎక్కువైపోయింది గాని కొంచెం ఫన్ లోకి వద్దామా..
పార్ధు వెంటనే ఆ ఫన్ క్రియేట్ చేయాలి అంటే మీ ముద్దుల బావగారే ఉండాలి. ఐస్ క్రీమ్ తింటున్నా రాజ్ ఏమిటి నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు..
పార్ధు వెంటనే చెప్పనా... మీ బావ ఎక్కడున్నా ఫన్ క్రియేట్ చేస్తాడు అని అంటే.. ఫన్ నేను క్రియేట్ చేయడం ఏంటి..
ఏమీ లేదు రాజ్ మీరు అయితే ఇంకా బాగా సర్ప్రైజ్ చేస్తారు అని మావయ్య గారు చెబుతున్నారు. దేనికి సర్ప్రైజ్.
ఇప్పటికిస్తున్న సర్ప్రైజ్ లకే నా తల మీద జుట్టు ఊడిపోతుంది. మళ్ళీ కొత్త సర్ప్రైజ్లు నావల్ల కాదు. అలా అంటే ఎలా రా..
నీ ఫ్రెండ్ చూడు భార్యకు ఎలాంటి సర్ప్రైజ్లు ఇచ్చాడో.. వాడు విక్రమ్.. నువ్వు రాజ్ వి కదా... బాబు నన్ను వదిలేయండి.
మీ మామ కోడలు ఇద్దరు ఒక చోట చేరితే నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. చూడు నివి సర్ప్రైజ్లు ఇవ్వలేను గాని నీకు ఎలా కావాలో ముందే చెప్పు. ప్లాన్ చేస్తాను.
ఈమాత్రం దానికి మీరే చేయాలా అని మూతి తిప్పుతుంది. అందరూ సరదాగా నవ్వుకుంటూ భోజనాలు చేస్తారు. అవనికి మాత్రం విక్రమ్ తినిపిస్తాడు.
అందరూ చూస్తున్నారని ఇబ్బంది పడుతుఉంటే... సరే ఒక్క నిమిషం ఉండు అని హాలో జెంట్స్ అని పిలుస్తాడు. ఏంటి విక్కి.. ఈరోజు సరదాగా చిన్న పని చేద్దాము.
ఏంట్రా.. ఈరోజు లేడీస్ అందరూ వరుసగా కూర్చుంటారు. ఎవరి పార్టనర్ కి వాళ్లే కలిపి తినిపించండి. మరి పార్ట్నర్స్ పక్కనలేని వాళ్ళు.. మీ భోజనం మీరే తినాలి అని అర్థం.
ఓకే మేము తర్వాత తింటాము. మీరు తినిపిస్తూ ఉండండి. మేము వడ్డిస్తూ ఉంటాము అని సర్వెంట్స్ అక్కడ నుంచి పంపించేసి వినయ్ భరత్ బౌల్స్ తీసుకుంటారు.
విక్రమ్.. అవనినీ చూసి ఇప్పుడు హ్యాపీ నా అంటే చిన్నగా నవ్వుతుంది. ఈ నవ్వు చాలు లైఫ్ అంత హ్యాపీగా గెంటేయడానికే అని తినిపిస్తూ ఉంటాడు.
ఆ ప్లేట్లోనే కలిపి విక్రమ్ కి ముద్ద పెడుతుంది. అది చూసి మిగిలిన ఆడవాళ్లు కూడా అలాగే తినిపిస్తూ ఉంటారు. ఇందిరాగారు సంతోషంగా కుటుంబాన్ని చూస్తూ ఉంటారు.
సత్యవతి గారు దగ్గరికి వచ్చి మీరు చాలా అదృష్టవంతులండి. చక్కటి కుటుంబం ఏర్పడింది. అంత మన చేతుల్లోనే ఉంటుంది.
పెద్దవాళ్లగా మనం ఎలా నడిస్తే మన పిల్లలు అలాగే నడుస్తారు. అది మాత్రం నిజం. కానీ ఏం చేస్తాము మా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
బాధపడకండి వదిన.. తప్పకుండా మీ పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఏది ఎలా ఉన్నా సరే ధనుంజయ్, అవని కలిస్తే చాలు.
ఎప్పుడు అవని నాన్న అని పిలుస్తుందా అని నా కొడుకు చకోరి పక్షిలాగా ఎదురు చూస్తున్నాడు. కాలమే కొన్ని సమస్యలకు సమాధానం చెబుతుంది.
ఇప్పుడిప్పుడే కదా అవని సంతోషంగా ఉంటుంది. కచ్చితంగా ఒప్పుకుంటుంది. మీరు బాధపడకండి. ఆ రోజు కోసమే చూస్తూ ఉన్నాము వదినగారు. ఇంక మేము బయలుదేరతాము సెలవు అని ఇంటికి వెళ్ళిపోతారు.
సత్యవతి శేషగిరి ఇంటికి వెళ్లేటప్పటికీ ధనుంజయ్ అవని సీమంతాన్ని చూస్తూ ఉంటాడు. పక్కన కూర్చుని ఏరా నీ కూతుర్ని చూసుకుంటున్నావా..
రజితని చూసినట్టే ఉంది అమ్మ. అవునురా నాకు అలాగే అనిపించింది. ఎంత కన్నుల పండుగగా జరిగిందనుకుంటున్నావు.
అసలు నీ అల్లుడే దగ్గరుండి మరీ రెడీ చేశాడు. కాలు కందనివ్వడం లేదనుకో.. ఇక ఇంట్లో వాళ్లయితే కన్నీరు రెప్పని దాటనివ్వడం లేదు.
అంత అపురూపంగా చూసుకుంటున్నారు. నిజమేనమ్మా.. నా కూతురు అదృష్టవంతురాలు... కానీ నేనే దురదృష్టవంతుణ్ణి.
ఏంట్రా మాటలు అవును అమ్మ.. నాన్న అన్న పిలుపుకు దూరంగా ఉంటున్నాను అంటే నా అంత దురదృష్టవంతుడు ఎవరు ఉంటారు.
రేపు మనవళ్ళు వచ్చే టైం కైనా సరే నన్ను అవని నాన్న అని పిలుస్తుందా... పుట్టేవాళ్ళతో తాత అని పిలవనిస్తుందా..
తప్పకుండా అన్ని పనులు జరుగుతాయి రా.. నువ్వు బాధపడకు. అలసిపోయి ఉంటారు వెళ్లి రెస్ట్ తీసుకోండి నాకు కొంచెం పని ఉంది అని బయటికి వెళతాడు.
ధనుంజయ్ సరాసరి భార్గవి దగ్గరికి వెళతాడు. భార్గవి భార్గవి అని సంతోషంగా పిలుస్తూ ఉంటే... ఎక్కడో నూతిలో నుంచి వాయిస్ వినపడుతూ ఉంటుంది.
దగ్గరికి వెళ్లి ఏంటి భార్గవి ఇలా చిక్కిపోయావు. అసలు ఎముకలగూడికి బట్టలు వేసినట్టుగా ఉన్నావు. ఇలా ఉంటే ఎలాగ...
మాట కూడా రావడం లేదు సరిగ్గా తినడం లేదా.. మీరు నాకు వేసిన శిక్ష చాలు. నన్ను క్షమించండి నేను ఇలా ఉండలేకపోతున్నాను..
అయ్యో భార్గవి ఎంత సంతోషకరమైన విషయం చెబుదామని వస్తే నువ్వు ఇలాగ కన్నీళ్లతో ఎదురువస్తే ఎలా చెప్పు...
అవని విషయమా అని నీరసంగా అంటుంది. అరే ఎలా కనిపెట్టేసావు.. అందుకే భార్గవి ఎంత తెలివి అయిందో అంటాను.
ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ.. మీ జీవితంలో సంతోషకరమైన విషయం అంటే అది అవనికి సంబంధించిందే కదా..
అందుకే భార్గవి నువ్వంటే నాకు అంత... అంతా అని జీవం లేని కళ్ళల్లోకి మెరుపు తెచ్చుకుని అడుగుతుంది. అంత రెస్పెక్ట్ అని చెబుతున్న.
ఆ మాటకి ఇది రెస్పెక్ట్ ఆ... ఈ విధమైన ట్రీట్మెంట్ ని ఎవరైనా రెస్పెక్ట్ అంటారా.. అయ్యో మా ఊళ్లో ఇలాగే రెస్పెక్ట్ ఇస్తారు.
మీ ఊళ్లో తప్పు చేసిన వాళ్ళకి ఇంకొకలాగా ఇస్తారా.. ఎలా ఇస్తారో చెప్పు అదే ఫాలో అవుతాను. అవసరం లేదులే గాని ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చారు కదా... చెప్పి బయలుదేరండి.
అదేంటి భార్గవి అలా అంటావు.. అంతకుముందు ఉండండి ఉండండి నా దగ్గర అనేదానివి కదా... ఇప్పుడు మాత్రం వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు.
నువ్వు ఇలా మాట్లాడితే నేను అలుగుతాను. హర్ట్ అవుతాను అబ్బా అంటాడు. ధనుంజయ్ లో కనబడుతున్న కొత్త వేరియేషన్ కి భార్గవి కి నిజంగా భయం మొదలవుతుంది.
మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నాకు భయంగా ఉంది. అయ్యో భార్గవి నిన్ను అసలు ఏమీ చేయను.నీకు ఒక విషయం చెప్పి స్వీట్ తినిపించాలని వచ్చాను.
అది కూడా నీకు ఇష్టమైన కాజు బర్ఫీ తెచ్చాను తిను అని ఇస్తాడు. ఆ స్వీట్ బాక్స్ వంక, ధనుంజయ్ వైపు చూస్తూ ఉంటుంది.
ఎందుకంత భయపడుతున్నావు ఇందులో ఏమైనా కలిపాను అనా.. నాది మరీ అంత కృయల్ మైండ్ కాదు. నేను చాలా మంచి వాడిని .
అవును మీ మంచి ఏమిటో ఈమధ్య కాలంలో నాకు బాగా తెలుస్తుంది లేండి. చూసావా నీకు కూడా తెలిసిపోయింది. తిను భార్గవి.
ముందు విషయం చెప్పండి అంటుంది. చెప్పడం ఎందుకు చూపిస్తాను అని అవని సీమంత వేడుకలు మొత్తం చూపిస్తూ భార్గవిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.
భార్గవి ఫేసులో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఎలా ఉంది నా కూతురు. రజిత గుర్తుకు వస్తుంది అని ఫ్లోలో అంటుంది.
ఆ మాటకి ధనుంజయ్ నువ్వు చేసిన పాపం కూడా కనపడుతుందా... తలదించుకుంటుంది. అరే నువ్వు తలదించుకోవడమేమిటి..
నువ్వు ఏది చేసినా కరెక్టే కదా.. ఇప్పటికే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. ఇంకా నన్ను బాధ పెట్టకండి. నిన్ను ఎవరు పనగట్టుకుని బాధ పెట్టడంలేదు.నువ్వు చేసిన తప్పులే శాపాలై నిన్ను చుట్టుకున్నాయి.
అది అర్థమవుతుంది. నన్ను క్షమించండి. అవని పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ.. క్షమాపణ అడుగుతావా...
ఏమని అడుగుతావు. మీ అమ్మని చంపేశాను. మీ నాన్నకి పెళ్ళాం ముసుగులో కీప్ గా ఉన్నాను. నిన్ను రాచి రంపాన పెట్టాను.
కడుపునిండా తిండి పెట్టలేదు. ఆఖరికి నా మేనల్లుడికి బలి చెయ్యాలి అనుకున్నాను. నా కూతురు సంతోషం కోసం నీ జీవితం సర్వనాశనమైనా పరవాలేదు అనుకుని నిన్ను పావుగా వాడాను. నన్ను క్షమించు అని చెబుతావా...
చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే భార్గవి కళ్ళు మూసుకుంటుంది. ఏమైంది భార్గవి అంతా బాధపడుతున్నావు.
నిజంగా నేను చాలా పాపిష్టిదానిని. నాది కానీ దాని కోసం పాకులాడి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాను. ఆడపిల్ల అని కూడా చూడకుండా అవనినీ అష్ట కష్టాలు పాలు చేశాను.
తండ్రి ప్రేమకి దూరం చేశాను. తన ఉనికినే ప్రపంచానికి తెలియనివ్వకూడదు అనుకున్నాను. అందుకే భగవంతుడు ఆ శిక్ష మొత్తం నాకు వేశాడు.
నా ఉనికి ఏమిటి అన్నది ప్రపంచం లో ప్రశ్నర్ధకంగా మారింది. శిల్ప జీవితం అంతకన్నా దారుణంగా ఉంది. ఇప్పుడు నీలో వచ్చిన మార్పు మీ ఇద్దరి జీవితాల గురించా..
కాదు.. ఒంటరిగా కూర్చుని ఉంటే నా జీవితం మొత్తం కనపడుతుంది. అందులో నేను చేసిన పాపాలే ఎక్కువగా ఉన్నాయి.
అలసిపోయినా శరీరమైన సరే ప్రశాంతంగా పడుకోలేక పోతున్నాను. ఎంత ఆకలి వేసిన తినలేకపోతున్నాను. నిత్యం నరకం కనబడుతుంది.
చేసిన పాపాలకి ఎక్కడో శిక్షలు పడతాయి అంటారు కానీ బ్రతికి ఉండగానే శిక్షలు అనుభవిస్తామని తెలుసుకోలేకపోయాను.
నాకు ఒక చిన్న సహాయం చేస్తారా.. ఏమిటది.. ఒక్కసారి అవని తో మాట్లాడనిస్తారా... అవనినీ క్షమాపణ అడిగి ఆమె పాదాలు దగ్గర నా ప్రాణాలు విడుస్తాను.
నీ ప్రాణాలకు ఒక విలువ ఉందా నా కూతురి పాదాల మీద విడవడానికి.. ప్లీజ్ అండి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. నా పరిస్థితి నాకు అర్థం అవుతుంది.
నేను ఎక్కువ రోజులు బ్రతకలేను. ఏం.. బానే ఉన్నావుగా మానసిక బాధ పైకి కనపడకుండా లోపల తినేస్తుంది. ఇప్పుడు నేను ఆ బాధనే అనుభవిస్తున్నాను.
నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు అని నాకు తెలుసు కానీ అవని మనసు బంగారం. ఒక్కసారి క్షమించాను అంటే నాకు అంతకు మించిన మోక్షం లేదు.
ధనుంజయ్ ఒప్పుకుంటాడా....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)