Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మరణ శాసనం
#43
Part - 16

ఆ మరుసటి రోజు ఉదయం 10.00 గంటలకు గోవింద రావు సత్యనారాయణ రావు ఇద్దరు రఘునాధ రెడ్డి నుండి డ్రైవర్ పురుషోత్తంతో కలిసి మారేడుమిల్లి కి బయలుదేరారు..

దాదాపు ఏడు గంటల ప్రయాణం తరువాత
మారేడుమిల్లి చేరుకున్నారు. అప్పటికి సమయం సాయంత్రం ఐదు గంటలయింది..

అది ఒక టూరిస్ట్ ప్లేస్ కావడం చేత, రఘునాథరెడ్డి ముందుగానే వారికి అక్కడ ఒక రూం బుక్ చేయించాడు.. డ్రైవర్ కి కూడా మరొక రూమ్ బుక్ చేశాడు.

డ్రైవర్ పురుషోత్తం రుద్ర గురించి తెలుసుకోవడానికి అక్కడ దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఆఫీస్ కి వెళ్ళాడు ఒక అరగంట తర్వాత గోవింద రావు ఉంటున్న గదికి వచ్చాడు.

అప్పటికి గదిలో గోవింద రావు సత్యనారాయణ రావు మాట్లాడుకుంటూ ఉన్నారు.

గది లోపలికి వచ్చిన పురుషోత్తంతో గోవింద రావు " రుద్ర గురించి ఏమైనా తెలిసిందా.? "
అని అడిగారు..

" తెలిసింది స్వామి..! ప్రస్తుతం వారు ఒక పులిని పట్టుకోవడానికి టైగర్ జోన్ లో ఉన్నారంట..!! ఫారెస్ట్ లో ఉండే ఆయన ఆఫీసులో దొరుకుతారని చెప్పారు..!!"అని చెప్పాడు..

" సరే అయితే నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో నాయనా..!! రేపు ఉదయాన్నే కలిసి వెళ్దాం." అని పురుషోత్తం తో చెప్పారు..

సరేనంటూ పురుషోత్తం వెళ్ళిపోయాడు..

మళ్లీ ఇద్దరూ మాటల్లో పడ్డారు...


ఆ మరుసటి రోజు ఉదయం...!!

సమయం 7:00...

పురుషోత్తం గోవింద రావు సత్యనారాయణ రావు ముగ్గురు రుద్ర ని కలవడానికి బయలుదేరారు..

ముగ్గురు ఒక జీపులో బయలుదేరారు..

వారితో పాటు ఒక గైడ్ కూడా ఉన్నాడు..
అతని పేరు రవి.. మారేడుమిల్లి ఫారెస్ట్ అంతా అతనికి బాగా తెలుసు..

జీపు బయలుదేరింది...

సత్యనారాయణ రావు మాట్లాడుతూ...
" మనం ఇప్పుడు జీపులో వెళ్ళవలసిన అవసరం ఏముంది. పురుషోత్తం..?? మన కారు ఉంది కదా..!!" అని అడగగా..

ఆ మాటలకి పురుషోత్తం సమాధానం చెప్పబోతుండగా మధ్యలో రవి మాట్లాడుతూ..!
" ఇక్కడ నుంచి రోడ్డు కొంత వరకు బాగానే ఉంటుంది సార్..!! కానీ మనం వెళ్ళేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రుద్ర గారిని కలవడానికి..!! ఆయన ఆఫీసు ప్రస్తుతం అడవి మధ్యలో ఉంది..! మనం వెళ్ళాలి అంటే కచ్చితంగా ఈ దారి లో వెళ్లాలి ఈ దారికి కార్లు పనిచేయవు. జీపులో మాత్రమే వెళ్లగలం. ఎందుకంటే రోడ్లు అస్సలు బాగోవు..." అని చెప్పాడు..

" అయినా ఆ అబ్బాయి ఆఫీసు అడవి మధ్యలో ఎందుకు ఉంది..?" అని గోవింద రావు రవిని అడిగారు..

"ఇది వరకు ఉండే ఆఫీసర్ అందరిలాగే అడవి బయటే ఉండేవారు. పెద్దగా ఎవరినీ పట్టించుకునేవారు కాదు. ఇక్కడ పులుల సంచారం కూడా ఎక్కువ. వాటి బారిన పడి చాలా మంది
చని పోతూ ఉండేవారు. అడవిలో బ్రతికే వారే కాకుండా టూరిస్టులు వచ్చే వారు కూడా చని పోతూ ఉండేవారు. కానీ రుద్ర సార్ వచ్చిన తరువాత వాటి సంచారం బాగా తగ్గింది.. పులి బారినపడి ఎవరూ చనిపోకుండా అందరి మంచి కోసం తన ఆఫీస్ ని అడవి మధ్యలో మార్పించుకున్నారు.."

" అంటే పులులు కనిపిస్తే చంపేస్తారా..??"అని ఆశ్చర్యంగా అడిగాడు పురుషోత్తం..

" లేదు సార్...!! అలా చంపరు...!! చంపకూడదు కూడా...!! ఎందుకంటే ఈ అడవి అందరిదీ..! ఒకవేళ వాటివల్ల ప్రమాదం ఏర్పడితే బోను పెట్టి వాటిని బంధించి, అడవికి దూరంగా మనుషుల సంచారం లేని చోట వదిలేస్తారు.. ఇప్పుడు కూడా మొన్న గిరిజనుల జాతర ఒకటి అడవిలో జరిగింది. మామూలుగా అటువంటి జాతర జరిగితే ఫారెస్ట్ ఆఫీసర్ కి ముందస్తు సమాచారం ఇవ్వాలి. కానీ
ఆ గిరిజనులు మాటలు లక్ష్యపెట్టలేదు. నిన్న రాత్రి
 జాతర జరుగుతున్నప్పుడు ఒక పులి జాతర పై దాడి చేసింది. ఇప్పుడు దాన్ని పట్టుకునే పనిలో ఆయన ఉన్నారు.. మీరు చాలా దూరం నుంచి వస్తున్నారని మిమ్మల్ని కలుస్తున్నారు.."అని చెప్పాడు.

రవి చెప్పింది పూర్తిగా విన్న తర్వాత ఎవరు ఇంకా ఏమీ మాట్లాడలేదు..

జీపు అడవిలో నెమ్మదిగా కదులుతోంది..
అప్పటికి సమయం ఉదయం 10 గంటలు దాటింది..

సూర్యుడి నేలమీద పడకుండా చెట్లు చాలా దట్టంగా ఉన్నాయి..

అలా బయలు దేరుతున్న జీపు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్దగా కుదుపులకు లోనై ఆగిపోయింది...

అందరూ జీపు నుంచి కిందకు దిగారు..

జీప్ వెనకాల చక్రం చిన్న గోతిలో దిగిపోయింది..

అందరూ కలిసి జీపును ముందుకు తోసారు కానీ ఎంత ప్రయత్నించినా చక్రం గోతిలో నుండి బయటకు రాలేదు..

"ఇప్పుడెలా బాబు..?" అని రవిని అడిగాడు గోవింద రావు..

"మన వల్ల అవ్వట్లేదు సార్...!! ఇంకొంతమంది తోడు కావాలి.. సార్ ఆఫీస్ కి ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళాలి.. అక్కడికి వెళితే అక్కడ ఉండే వాళ్ళ సాయం తీసుకుని మనం తిరిగి వెళ్ళిపోవచ్చు .."అని చెప్పాడు..

ఇక అందరూ సరేనని నడక మొదలు పెట్టారు...

రవి దారి చూపిస్తూ అందరికంటే ముందుగా నడుస్తున్నాడు.. అతని వెనకాలే పురుషోత్తం కూడా వస్తున్నాడు..

సత్యనారాయణ రావు గోవింద రావు వాళ్ళకి అడవిలో నడక అలవాటు లేక మెల్లగా నడుస్తూ వస్తున్నారు..

కొంత దూరం వెళ్ళిన తరువాత రవి నడుస్తున్న వాడు ఒక్కసారిగా
ఆగిపోయాడు..

పురుషోత్తం రవి అలా సడన్గా ఆగి పోయే సరికి "ఏమైంది రవి అలా ఆగిపోయావ్..??" అని అనుమానంగా అడిగాడు...

రవి చుట్టూ చూస్తూ " సార్..!! అందరూ ఒకసారి ఆగండి." అని తన వెనకాల వాళ్లతో అన్నాడు..

గోవింద రావు, సత్యనారాయణ రావు ఇద్దరు ఆగిపోయారు..

"ఏమైంది రవి..??" అని మళ్ళీ కంగారుపడుతూ అడిగాడు పురుషోత్తం..

గోవింద రావు సత్యనారాయణ రావు కూడా కంగారు పడుతూ రవి దగ్గరకు వచ్చారు...

రవి దూరంగా ఒక చెట్టు వైపు చూపించాడు.
అక్కడ ఒక మేక కట్టివేయబడి ఉంది.

అలా రవి మేకని చూపించేసరికి అందులో ప్రమాదం ఏముంది అన్నట్టుగా ముగ్గురు అతని వైపు చూశారు..

"చూడండి సార్...!! ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పులి కోసం ఇక్కడ ఎరను పెట్టారు. దానికోసమే ఆ మేక ని ఇక్కడ కట్టేశారు. ఒకసారి పైకి చూడండి..!!" అని ఆ మేకను కట్టేసి ఉన్న చెట్టు పైకి చూపించాడు.
అక్కడ ఒక వల కనిపిస్తోంది."ఆ వలని చూశారు కదా..! ఆ మేక కోసం ఆ పులి వచ్చిన మరుక్షణం ఆ వలలో చిక్కుకుపోతుంది.. కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి..!!" అని అంటూ వెనక్కి జరగబోతుండగా వారికి పెద్దగా పులి గాండ్రింపు వినిపించింది...

అందరూ అరుపు వినగానే ఒక్కసారిగా ఆగిపోయారు..

అందరూ భయంతో చుట్టూ చూసారు.. వారికి ఎక్కడా పులి కనిపించలేదు..

అలా చుట్టూ చూస్తున్న వారి ముందు కి దూరంగా ఒక పెద్ద చెట్టు చాటు నుండి
ఒక పులి వారి ముందుకు నడుచుకుంటూ వచ్చింది.

అది పెద్ద పులి...!!

దాన్ని చూడగానే అందరూ భయంతో బిగుసుకుపోయారు..

పరిగెడదాం అని బుర్ర చెబుతున్నా..!!
కాళ్లు సహకరించడం లేదు...!!

ఆ పెద్దపులి గట్టిగా వారిని చూస్తూ గాండ్రించింది..!!

అప్పుడు వచ్చింది అందరి శరీరాల్లోకి చలనం .. భయంతో ఒక్కసారిగా పరుగు అందుకున్నారు..

గోవింద రావు తప్ప మిగిలిన ముగ్గురు వేగంగా పరిగెత్తసాగారు..

పెద్దపులి వారిని వెంబడించసాగింది..

ఇంతలో గోవింద రావు కాలికి రాయి తగలడం వల్ల కిందపడిపోయారు..

ఆ పులి వేగంగా గోవింద రావు వైపు రాసాగింది..

గోవింద రావు పడిపోవడం చూసి ముగ్గురు ఆగిపోయి కంగారుగా ఆయనవైపు రాబోయారు...

కానీ ఆ పులిని చూసి భయపడి ఆగిపోయారు..

అది వేగంగా ఆయన వైపు వస్తోంది..

గోవింద రావు ఆ కనక దుర్గ దేవి ని కాపాడమని ప్రార్థించ సాగారు..

వేగంగా వస్తున్న ఆ పులి ఒక్కసారిగా తన వేగాన్ని తగ్గించింది...

అప్పటివరకు పరిగెత్తుకుని వస్తున్నది కాస్తా ఉన్నట్టుండి మెల్లగా నడుచుకుంటూ రావడం మొదలు పెట్టింది.

గోవింద రావు కి మిగిలిన వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు..

అలా మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి గోవింద రావు దగ్గర కుప్పకూలిపోయింది..

గోవింద రావు మిగిలిన వారు ఆశ్చర్యపోయారు..

ఏం జరిగిందని ముగ్గురు గోవింద రావు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఆయనను పైకి లేపారు..

నలుగురు ఆ పులి దగ్గరకు వచ్చి చూశారు.

దాని నడుం పై రెండు సూదులు గుచ్చుకుని ఉన్నాయి..

వాటిని చూసిన రవి నవ్వుతూ
ఇది రుద్ర సార్ పని అని చుట్టూ చూడసాగాడు..

దూరంగా ఒక గుట్టపై గన్ పట్టుకొని నుంచుని ఉన్న రుద్ర అతనికి కనిపించాడు.

ఆయన్ని చూసి నవ్వుతూ అదిగో సార్ అక్కడే ఉన్నారు.. అని అన్నాడు..

అందరూ ఆ వైపు చూశారు..

చేతిలో ఒక గన్ పట్టుకొని నవ్వుతూ వారి వైపు వస్తున్నాడు రుద్ర...

వారు కూడా అతని వైపు వెళ్ళసాగారు..

అతని వెనక కొంత మంది కొండ జాతి వారు కూడా ఉన్నారు..

వారు వేగంగా వచ్చి పులి ని ఎత్తుకొని వెళ్ళి, అక్కడ ఉన్న బోను లో పెట్టారు..


రవిని చూసి పలకరింపుగా నవ్వాడు రుద్ర.

గుడ్ మార్నింగ్ సార్..!! మీ గురించి విజయవాడ నుంచి వచ్చారు." అని వాళ్ళను పరిచయం చేశాడు..

రుద్ర వైపు చూసి " నమస్తే..!! నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది. మా డ్రైవర్ మిమ్మల్ని మా క్వార్టర్స్ దగ్గర దిగపెడతాడు. అక్కడ మీరు కొంత సేపు వేచి ఉండండి. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను.."చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు..

యూనిఫాం లో ఉన్న ఒక డ్రైవర్ ఒక జీపుని తీసుకువచ్చి వాళ్ళందర్నీ నన్ను ఎక్కించుకుని రుద్ర ఉండే క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళాడు. అడవిలో ఒక అరగంట ప్రయాణం తర్వాత అతని ఇంటికి చేరుకున్నారు..

అది అడవిలో ఉండే ఒక చెక్క గృహం..

ఒక చిన్న భవంతిలా ఉంది..

అటువంటి గృహాలు ఫారెస్ట్ లో పనిచేసే ఆఫీసర్లకు ఇస్తారు.

ఆ డ్రైవర్ వాళ్లందరినీ ఆ ఇంటికి దగ్గర దించి వెళ్ళిపోయాడు..

లోపలి నుంచి పని వాడు వచ్చి వారందరిని లోపలికి తీసుకువెళ్లాడు..

వాళ్లందరినీ హాల్లో కూర్చో పెట్టి లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఆ పనివాడు వాళ్లందరికీ టీ తీసుకొని వచ్చాడు..

అందరూ మా ఇంటికి గమనించసాగారు..

చెక్కతో చేసినదైనా చాలా అద్భుతంగా ఉంది.. ఎటు చూసిన అందమైన కళాకృతులు ఆ ఇంటి నిండా ఉన్నాయి..

పనివాడు ఇచ్చిన టీ తాగుతూ నలుగురు మాట్లాడుకుంటున్నారు..

అలా మాట్లాడుకుంటూ ఉండగా రుద్ర వచ్చాడు.. యూనిఫామ్ లో ఉన్నాడు.
అతన్ని చూడగానే అందరూ లేచి నుంచున్నారు..

వారిని చూసిన రుద్ర "దయచేసి కూర్చోండి ఒక పది నిమిషాల్లో వస్తాను..!" అంటూ 
పై అంతస్తుకు వెళ్ళాడు..

అందరూ కూర్చున్నారు చెప్పినట్లుగానే పదినిమిషాల్లో ఫార్మల్ డ్రెస్లో తిరిగి వచ్చాడు రుద్ర..

మనిషి ఆరడుగుల పైనే ఉంటాడు. నలుపు రంగు అయినా సరే ముఖంలో తేజస్సు వెలిగిపోతూ ఉంది.

కిందికి రాగానే నేరుగా వచ్చి గోవింద రావు పాదాలకు నమస్కరించాడు..

గోవింద రావు వెంటనే లేచి నుంచుని "దీర్ఘాయుష్మాన్ భవ..!" అని దీవించి రుద్ర ని పైకి లేపారు...

సార్ ఈయన పేరు రవి చెప్పబోతుండగా .

" గోవింద రావు గారు " అని రుద్ర చెప్పాడు

రుద్ర అలా చెప్పగానే గోవింద రావు తో సహా అందరూ ఆశ్చర్యపోయారు..

"ఈయన గోవింద రావు గారిని మీకెలా తెలుసు..?" అని అడిగాడు సత్యనారాయణ రావు..

"నాన్నగారు నా చిన్నతనంలో ఆయన గురించి చెప్పారు..ఈయనను పాతకాలం నాటి ఒక ఫోటోలో నేను చూశాను. అందువల్ల పోల్చుకోగలిగాను."అని చిరునవ్వుతో చెప్పాడు రుద్ర.

"అందరూ నుంచొని ఉన్నారు. కూర్చోండి.." అని ఆన్నాడు రుద్ర..

అందరూ కూర్చున్నారు..

రుద్ర గోవింద రావు వైపు చూసి "నాన్నగారు నా చిన్నతనంలో మీ గురించి చాలా చెప్పారు. మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోసం వెతుక్కుంటూ రావడం కూడా ఆశ్చర్యంగా ఉంది.. మీకేం అభ్యంతరం లేకపోతే మీరు వచ్చిన కారణం ఏమిటో తెలుసుకోవచ్చా..??" అని అడిగాడు.

" బాబు నీకు ఏమీ అభ్యంతరం లేకపోతే మనం కాస్త ఒంటరిగా మాట్లాడుకోవచ్చా..?" అని అడిగారు గోవింద రావు..

" అయ్యో తప్పకుండా సార్..!! నాతోపాటు రండి.." అంటూ ఇంటి బయటకు తీసుకు వెళ్ళాడు...

అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది.. కింద ఒక బల్ల ఉంది. దాని మీద ఇద్దరు కూర్చున్నారు..

"చెప్పండి రావు గారు..!! మీరు నా కోసం వెతుక్కుంటూ రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా..??" అని అడిగాడు రుద్ర.

"నువ్వు మాత్రమే చేయగలిగే సాయం ఉంది నువ్వు నాకు సహాయం చేయగలవా..??"
అని అడిగాడు గోవింద రావు..

"నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. అదేమిటో చెప్పండి." అని అడిగాడు రుద్ర..

గోవింద రావు ఆదిత్య గురించి పూర్తిగా చెప్పాడు. ప్రస్తుతం అతను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి కూడా పూర్తిగా చెప్పాడు... ఆదిత్య గురించి పూర్తిగా వివరించేసరికి దాదాపుగా అరగంట పైనే పట్టింది గోవింద రావు కి..

చెప్పింది అంతా నిశ్శబ్దంగా ఓపిగ్గా విన్నాడు రుద్ర..

గోవింద రావు ఆదిత్య గురించి చెప్పడం పూర్తి చేశారు.." ఇది బాబు జరిగింది.. ఇప్పుడు ఆదిత్యను కాపాడడానికి నాకున్న ఏకైక మార్గం నువ్వు మాత్రమే.. దయచేసి నాకు సహాయం చేయి.." అని అడిగారు గోవింద రావు..

ఆయన చెప్పడం పూర్తి చేసిన తర్వాత లేచి నుంచున్నాడు రుద్ర..

ఏమైందోనని గోవింద రావు కూడా లేచి నుంచుని " ఏమైంది బాబు.?" అని అడిగారు.

" నన్ను క్షమించండి నేను మీకు
ఈ సహాయం చెయ్యలేను..! ఈ పని కోసమే నా కోసం ఇంత దూరం వస్తే నన్ను క్షమించండి దయచేసి తిరిగి వెళ్ళిపొండి."
అని అక్కడనుంచి విసురుగా లేచి తన ఇంట్లోకి వెళ్లి పోయాడు...

గోవింద రావు కూడా మౌనంగా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు..

రుద్ర లోపలికి వెళ్ళిన మరుక్షణం మిగిలిన వాళ్ళు బయటికి వచ్చేశారు..

చెట్టుకింద నిలబడి ఉన్న గోవింద రావు దగ్గరకు వచ్చి "ఏమైంది చిన్నాన్న..?" అని అడిగాడు సత్యనారాయణ రావు..

"మనకు సహాయం చేయలేనని చెప్పి వెళ్ళిపోయాడురా రావు..! నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచటంలేదు.." అంటూ బాధపడ్డారు గోవింద రావు..

ఆ మాటలకి సత్యనారాయణ రావు పురుషోత్తం ఇద్దరు బాధపడ్డారు.

"సరే చిన్నాన్న..! ఇంకా ఎందుకు ఇక్కడ ఉండడం..? వెళ్ళిపోదాం రండి..!"అంటూ బయలుదేరుచుండగా...

హటాత్తుగా ఆ ఇంట్లో నుంచి ఎవరో ఒక స్త్రీ గట్టిగా అరుస్తున్న అరుపులు వినిపించాయి..

ఒక్క గోవింద రావు తప్ప మిగిలిన ముగ్గురు  వేగంగా ఆ ఇంటిలోకి పరుగులు తీశారు.. అరుపులు మొదటి అంతస్తు నుండి వినిపించసాగాయి..

ముగ్గురూ వేగంగా పైకి వెళ్లారు...

లోపల ఎవరో ఒక స్త్రీ మంచం మీద ఉంది.
చేతులు కాళ్లు వంకర్లు తిరిగి ఉన్నాయి..
రుద్ర దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఆమె విదిలించి కొడుతోంది..

ఆమె చుట్టూ ఇద్దరు ఆడ పనివాళ్ళు ఉన్నారు.. వాళ్ళు ఆమె చేతులు కాళ్ళు గట్టిగా పుచ్చుకున్నారు..

రుద్ర ఆ పరిస్థితులలో ఆమెను చూడలేక కళ్ళు తుడుచుకుంటూ గది బయటకు వచ్చాడు.

ఎవరండీ అని పురుషోత్తం రుద్ర అని అడిగాడు..

ఆ ప్రశ్నకు రుద్ర సమాధానం చెప్పకుండా మౌనంగా కింద ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయాడు.

అప్పుడే గోవింద రావు మెల్లగా ఆ ఇంటి లోపలికి వచ్చారు..

ముగ్గురు మేడపైన ఉండడం చూసిన గోవింద రావు మెల్లగా పైకి వెళ్లారు..

అప్పటికే ఆ స్త్రీ అరవడం మానేసి నిద్ర పోతోంది..

గోవింద రావు పైకి వచ్చారు..

గదిలో ఉన్న స్త్రీ వైపు చూడసాగారు..

ఇంతకీ ఆవిడ ఎవరు అని పక్కన ఉన్న రవిని అడిగాడు పురుషోత్తం...

రుద్ర సార్ వాళ్ళ అమ్మగారు.. అని చెప్పాడు రవి..

అందరూ ఆశ్చర్యపోయారు...

ఆవిడ శరీరం కుచించుకుపోయి ఉంది..

ఆమె బెడ్ దగ్గర సాయంగా ఉన్న ఆడవాళ్ళు ఆమెకు సపర్యలు చేయసాగారు...

ఇంకా అక్కడ ఉండడం బాగోదు అనిపించి ముగ్గురు కిందికి వచ్చేసారు....

గోవింద రావు మాత్రం ఆమె వైపు తీక్షణంగా చూడసాగాడు....

ఇది గమనించిన సత్యనారాయణ రావు ఆయన దగ్గరకు వచ్చి "ఏమైంది చిన్నాన్న.?" అని అడిగాడు.

" ఏమీ లేదు..!!" అని కిందికి వచ్చేశారు...

గోవింద రావు నేరుగా రుద్ర గదివైపు వెళ్ళారు.

మిగిలిన వారిని బయటకు కూర్చోమని చెప్పారు.

రుద్ర గదిలోకి వెళ్లారు. గోవింద రావు..

లోపల కుర్చీలో కూర్చొని బాధ పడుతున్నాడు రుద్ర..

గోవింద రావు రావడంతో లేచినుంచున్నాడు..

"బాధపడకు బాబు..!" అన్నారు గోవింద రావు.

"బాధ పడకుండా ఎలా ఉండమంటారు సార్..??. తండ్రి చనిపోయారు. అమ్మ పరిస్థితి ఇలాగ అయిపోయింది. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మని బాగా చూసుకుందామని అనుకున్నాను. నాకు అంత అదృష్టం లేదు.." అంటూ బాధపడ సాగాడు.

"మరి మీ అమ్మగారి ఆరోగ్యం బాగు చేయాలని నువ్వు ప్రయత్నించలేదా...??"

" ఎందుకు ప్రయత్నించ లేదు సార్...!!
అన్ని రకాల వైద్యాలు చేయించాను . ఇంగ్లీష్ మందులు వాడినా, ఆయుర్వేద వైద్యం చేయించినా, ఈ అడవిలో చేసే నాటు వైద్యం కూడా ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకపోయింది.. పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించిన కూడా ఆమెకు ఉన్న జబ్బు ఏంటో తెలుసుకోలేకపోయారు.."

"నిన్ను ఒక మాట అడగవచ్చా..??"

" ఏమిటండి అది..??"

" నీ తండ్రి నీకు నేర్పించిన తాంత్రిక విద్యలు నీకు గుర్తున్నాయా..??"

గోవింద రావు తిరిగి తన విద్యల గురించి అడిగేసరికి రుద్ర కి చాలా కోపం వచ్చింది..

తన తల్లి పరిస్థితి గురించి మాట్లాడుతున్నప్పుడు తన విద్య గురించి అడగడం చాలా కోపం తెప్పించింది..

వెంటనే కోపంతో " మీరేందుకు అడుగుతున్నారో నాకు అర్థమయ్యింది..!!
మీరు ఎన్నిసార్లు అడిగినా సరే నేను సహాయం చేయను. ఈ విద్యలు ఉపయోగించే నలుగురు మంచి కోరుకునే నా తండ్రి చనిపోయాడు. చీమకు కూడా అపకారం చేయని నా తల్లి ఈ విధంగా బాధపడుతుంది... దయచేసి మీరు వెళ్లిపోండి.." అన్నాడు.

ఆ మాటలకి గోవింద రావు ఏమి కోపం తెచ్చుకోలేదు.

" రుద్ర ఒకసారి నాతో పాటు రా...!!" అంటూ అతని చెయ్యి పుచ్చుకుని వేగంగా ఆ గది బయటకు వచ్చాడు..

అలా గోవింద రావు రుద్ర చెయ్యి పుచ్చుకుని బయటకు రావడంతో ఏమైందోనని కంగారుపడ్డాడు సత్యనారాయణ రావు...

" ఏమైంది చిన్నాన్న..??" అంటూ అడగ బోతుండగా కూర్చో మంటూ చేతితో సైగ చేశాడు గోవింద రావు..

ఆయన మాత్రం ఆగకుండా రుద్ర చేయి పట్టుకొని వేగంగా మేడ పైన ఉన్న అతని తల్లి గది వద్దకు తీసుకువెళ్ళాడు..

అతని తల్లి గది ముందు నిలుచుని పెట్టాడు గోవింద రావు..

లోపల ఇద్దరు ఆడవాళ్ళు ఆమెకు సపర్యలు చేస్తున్నారు..

గోవింద రావు వాళ్ళ వైపు చూసి "అమ్మా..ఒక్క పదినిమిషాలు బయటకు వెళ్ళండి."అనగానే వెంటనే వాళ్ళు ఆ గది నుండి బయటకు వచ్చి కిందకి వెళ్లిపోయారు...

గోవింద రావు కింద ఉన్న వాళ్ళ వైపు చూసి "మీరందరూ ఒక్క పదినిమిషాలు బయటికి వెళ్లిపోండి..." అనగానే మారు మాట్లాడకుండా అందరూ బయటకు వెళ్లిపోయారు.

ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది గోవింద రావు, రుద్ర, వాళ్ళమ్మగారు మాత్రమే...

గోవింద రావు రుద్ర తో మాట్లాడుతూ...!!
"ఒకసారి నీ తల్లి వైపు చూడు..!!
ఆమె పరిస్థితి నీకు ఎలా అనిపిస్తుంది..??"
అని గోవింద రావు అడగగానే విచిత్రంగా ఆయన వైపు చూసి ఆయన చెప్పినట్టుగానే తన తల్లి వైపు చూశారు...

ఆమె మెడ ఒక పక్కకి తిరిగి పోయి ఉంది.
చేతులు కాళ్లు మెలి పెట్టినట్టు పక్కకి తిరిగి ఉన్నాయి.. రుద్ర తన తల్లిని ఎప్పుడు ఎలా చూస్తాడో.. ఆమె అలాగే ఉంది.. తనకి కొత్తగా ఏమీ అర్థం అవ్వలేదు..

అదే విషయాన్ని గోవింద రావు తో చెప్పాడు..

"సరే నాకు ఒక విషయాన్ని చెప్పు నీ తండ్రి నేర్పిన విద్యలు ఇప్పటికీ సాధన చేస్తున్నావా?? లేదా...??"అని అడిగాడు గోవింద రావు..

" లేదు సార్..!! మానేసాను.!!"అని చెప్పాడు రుద్ర..

" సరే నేను నిన్ను నా మనవడికి సహాయం చేయమని అడగను.. నాకోసం ఒక్కసారి మీ తండ్రి నీకు నేర్పిన శక్తి కవచ విద్య ఇప్పుడు ఉపయోగించగలవా..??"అని అడిగాడు గోవింద రావు..

" ఉపయోగించగలను. కానీ ఎందుకు..?"

" చూడు రుద్ర..!! నేను నిన్ను ఈ ఒక్క విద్య
ఉపయోగించమని అడుగుతున్నాను. ఒక్కసారి ఈ విద్యను ఉపయోగించు.. చూసిన తర్వాత నేను వెళ్ళిపోతాను..!!"
అని గోవింద రావు అడగడంతో తనకు ఇష్టం లేకపోయినా ఆ విద్యను ఉపయోగించడానికి పూనుకున్నాడు...

ఈ శక్తి కవచ విద్య తాంత్రికులకు ముఖ్యమైనది.. తాము ఎదుర్కొనే దుష్ట శక్తుల బారినుండి తమని తమ కుటుంబాన్ని కాపాడతాయి... ఈ విద్యని రోజుకి ఒక్కసారైనా కచ్చితంగా ఆచరించి తీరాలి. లేకపోతే తాంత్రికుడు చుట్టూ ఉండే శక్తి కవచం బలహీనపడి అతని మీద దుష్ట శక్తుల దాడి జరిగే అవకాశం ఉంది..

గోవింద రావు చెప్పినట్టు చేయసాగాడు రుద్ర..

శుభ్రంగా స్నానం చేసి, తన తండ్రి ధరించినటువంటి నల్లటి వస్త్రాలు ధరించాడు. మెడలో రుద్రాక్ష మాలలు వేసుకొని, గోవింద రావు దగ్గరకు వచ్చాడు..

రుద్ర ని అలా చూసినా రవి, పురుషోత్తం,
సత్యనారాయణ రావు ఆశ్చర్యపోయారు.

గోవింద రావు రుద్రని చూస్తూ " ఇప్పుడు శక్తి కవచ విద్యని ఇక్కడ ఉపయోగించు.." అని చెప్పారు..

రుద్ర నేలపై పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు.. కళ్ళు మూసుకొని
మంత్రాలు పఠించసాగాడు.. ఒక 10 నిమిషాలు పూర్తయిన తర్వాత లేచి నుంచున్నాడు..

గోవింద రావు వైపు చూసి " మీరు చెప్పినట్టే చేశాను సార్..!! ఇప్పుడు చెప్పండి దేనికి నన్ను ఈ విద్యను ఇప్పుడు ఉపయోగించమన్నారు..? " అని రుద్ర అడిగితే

" ఒకసారి మీ తల్లి గారి గదిలోకి వెళ్ళిరా..!"

ఆశ్చర్యంగా గోవింద రావు వైపు చూస్తూ ఆమె తల్లి గదిలోకి అడుగుపెట్టాడు..

ఆమె తల్లి వైపు చూశాడు...

"అమ్మా......!!!" అని గట్టిగా అరుస్తూ ఆశ్చర్యంతో వెనక్కి రెండు అడుగులు వేసి గది బయటకు వచ్చేసాడు రుద్ర......




ఇంకా ఉంది.....!!!
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
మరణ శాసనం - by SivaSai - 01-03-2026, 09:31 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 02-03-2026, 10:52 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 02-03-2026, 12:24 PM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:50 AM
RE: మరణ శాసనం - by SivaSai - 03-03-2026, 07:52 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 03-03-2026, 08:11 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 03-03-2026, 08:33 AM
RE: మరణ శాసనం - by sri012015 - 03-03-2026, 11:32 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by SivaSai - 04-03-2026, 07:16 AM
RE: మరణ శాసనం - by k3vv3 - 04-03-2026, 08:09 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 04-03-2026, 10:06 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 05-03-2026, 08:45 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 05-03-2026, 09:10 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 05-03-2026, 09:35 AM
RE: మరణ శాసనం - by sri012015 - 05-03-2026, 12:59 PM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:03 AM
RE: మరణ శాసనం - by SivaSai - 06-03-2026, 07:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 06-03-2026, 07:47 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 06-03-2026, 08:52 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 07-03-2026, 08:22 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 07-03-2026, 09:04 AM
RE: మరణ శాసనం - by SivaSai - 08-03-2026, 09:02 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 08-03-2026, 10:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 08-03-2026, 01:25 PM
RE: మరణ శాసనం - by SivaSai - 09-03-2026, 07:40 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 09-03-2026, 09:06 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 09-03-2026, 11:56 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:10 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 07:11 AM
RE: మరణ శాసనం - by masalakiss - 10-03-2026, 08:48 AM
RE: మరణ శాసనం - by SivaSai - 10-03-2026, 08:57 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 11:20 PM
RE: మరణ శాసనం - by masalakiss - 11-03-2026, 08:00 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 10-03-2026, 10:04 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 10-03-2026, 10:45 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 08:21 AM
RE: మరణ శాసనం - by SivaSai - 11-03-2026, 01:04 PM
RE: మరణ శాసనం - by Sachin@10 - 11-03-2026, 02:20 PM
RE: మరణ శాసనం - by ash.enigma - 11-03-2026, 08:51 PM
RE: మరణ శాసనం - by SivaSai - 12-03-2026, 07:05 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 12-03-2026, 07:33 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 12-03-2026, 08:47 AM
RE: మరణ శాసనం - by SivaSai - 13-03-2026, 07:14 AM
RE: మరణ శాసనం - by masalakiss - 13-03-2026, 07:55 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 13-03-2026, 08:07 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 13-03-2026, 08:44 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - 14-03-2026, 07:38 AM
RE: మరణ శాసనం - by ash.enigma - 14-03-2026, 08:29 AM
RE: మరణ శాసనం - by SivaSai - 14-03-2026, 09:57 PM
RE: మరణ శాసనం - by SivaSai - Yesterday, 06:44 AM
RE: మరణ శాసనం - by Sachin@10 - Yesterday, 06:55 AM
RE: మరణ శాసనం - by ash.enigma - Yesterday, 09:49 AM



Users browsing this thread: 1 Guest(s)