10-03-2026, 06:44 AM
Part - 140
రాజ్ చెప్పిన దానికి భరత్ నవ్వుతూ నా పిల్లతో నాకు ఎటువంటి భయం లేదు. నేను గట్టిగా మాట్లాడితేనే భయపడిపోతుంది.
అవనియే చాలా బెటర్. కాబట్టి నేను టెన్షన్ ఫ్రీ అంటాడు. వినయ్ మాత్రం ఆలోచిస్తూ బావ అని రాగం అందుకుంటాడు. ఏంట్రా బామ్మర్ది ఫ్యూచర్ కనపడిందా..
బాగా... నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా.. టిప్స్ చెప్పవా.. ఇందులో టిప్స్ చెప్పడం ఏమి ఉండదు రా అలా వెళ్ళిపోవడం అంతే.
వీళ్ళ ముగ్గురు సంభాషణకి అందరూ నవ్వుతూ ఉంటారు. విక్రమ్ వాళ్ళతో పెళ్లి అంటేనే ఒక నమ్మకం.ఆ నమ్మకాన్ని మీరు బలంగా ఇచ్చారు అంటే ఎటువంటి ప్రాబ్లం రాదు రా.
నీకేం బాబు బానే చెబుతావు. మా చెల్లి ఉత్తిఅమాయకరాలు కాబట్టి నువ్వు ఆడింది అట.. పాడింది పాట. మా పరిస్థితి అలా కాదు కదా..
ఎందుకు బావ నీకు ఇంత నోటి దురద. నివి ఇంట్లోనే ఉంది కదా... ఏమోరా బామ్మర్ది ఎంత ట్రై చేస్తున్నా సరే నోటి దురద మాత్రం తగ్గడం లేదు. ఏదైనా దీనికి టిప్ ఉంటే చెప్పండి రా అంటాడు..
ఒక్కటే ఐడియా బావ. నువ్వు ఇంట్లో తక్కువ.ఆఫీసులో ఎక్కువగా ఉండు. సరిపోతుంది. అలా కూడా ట్రై చేశాను రా.. బట్ నివికి దొరికిపోతూనే ఉన్నాను.
ఇంక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని దాని అర్థం. ఎంజాయ్. రేయ్ వినయ్ నీకు కూడా నా పరిస్థితి రావాలి. ఒక భార్యా బాధితుడిగా నిన్ను బ్లెస్ చేస్తున్నాను.
బావ ఇది అన్యాయం. లేకపోతే నా బాధ నీకు కామెడీ అయిపోయింది కదా.. రేపటి నుంచి నువ్వు కూడా ఇలాగే బాధలుపడుతూ ఉండు.
ఇందిరా గారు నవ్వుతూ సరే ఇంకా ఆపండి మీ గోల. విక్రమ్ అవనికి శ్రీమంతం చేయాలి. హ.. గ్రానీ... అమ్మ చెప్పింది.
ప్లాన్ చేస్తున్నాను. ఈ విషయం అవనికి తెలియనివ్వద్దు. సర్ప్రైజా బావ అని రాజ్ అంటే.. ఒక రకంగా అలాంటిదే..
అవని లైఫ్ లో ఇప్పటిదాకా ఏది సంతోషంగా జరగలేదు. అందుకే ఇది చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాను. భరత్, రాజ్ వెంటనే పుట్టింటి తరుపు నుంచి అన్నీ మేము చేస్తాము.
ఏమేం కావాలో చెప్పండి అంటే.. మాధవి ఒరేయ్ అవన్నీ ఆల్రెడీ మేము ప్లాన్ చేసేసాము. నేను,కరుణ, సురభి ముగ్గురం కలిసి పుట్టింటి సారే తీసుకొస్తున్నాము.
అమ్మ నువ్వు మరీ ఫాస్ట్ గా ఉన్నావు. మీ ముందు జనరేషన్ కదరా.. మీలాగా స్లో కాదు. ఛాన్స్ దొరికితే వదలరే.... కౌంటర్ వేయడానికి రెడీగా ఉంటారు.
ఏదైనా చాన్స్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి కదరా..
విక్రమ్ అవని దగ్గరికి వెళతాడు. ప్రశాంతంగా నిద్రపోతూఉంటుంది. నెలలు నిండుతున్నందుకు గుర్తుగా పొట్ట కొద్దిగా పైకి వస్తుంది. మనిషి కూడా కొద్దిగా ఒళ్ళు చేసి నిండుగా కనిపిస్తూ ఉంటుంది.
అవని కి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా పక్కన కూర్చుని పొట్ట మీద చేయి వేసి నాన్న రెస్ట్ తీసుకో. ఎక్కువగా అల్లరి చెయ్యకు.
అమ్మ ఇబ్బంది పడుతుంది. నీకు ఏమైనా కావాలి అంటే నాకు చెప్పు అని కడుపులో ఉన్న బేబీ తో కబుర్లు చెబుతూ ఉంటాడు.
విక్రమ్ పక్కన కూర్చున్నప్పుడే మెలకువ వచ్చిన అవని విక్రమ్ చెప్పే విధానానికి నవ్వుతూ.. అవును కన్నా నువ్వు పొట్టలో నుంచే నాన్నతో మాట్లాడేసియ్.
పుట్టగానే పరుగులు కూడా పెట్టేయొచ్చు కదా శ్రీవారు.. నీకు ఈ మధ్యన వెటకారాలు ఎక్కువైపోయాయి. కాదు మీకు కేరింగ్ ఎక్కువ అయిపోయింది.
లేకపోతే పొట్టలో ఉన్న బేబీ ఎలా మాట్లాడుతారు అండి. అదంతా నీకెందుకు.. మా ఇద్దరికీ ఒక సీక్రెట్ లాంగ్వేజ్ ఉందిలే అంటాడు. అబ్బో సీక్రెట్ లాంగ్వేజ్ అప్పుడే..
కావాలంటే చూస్తావా .. సరే చూపించండి. సరే నువ్వు సైలెంట్ గా కళ్ళు మూసుకుని పడుకో.. అవని నీ సరిగ్గా పడుకోబెట్టి పొట్ట దగ్గర తప్పిస్తాడు.
ఏం చేస్తున్నారు అని కంగారుపడుతుంది. సైలెంట్ గా ఉండమన్నానా అని పొట్ట మీద మెల్లిగా చేయి వేసి.. సాపు చేస్తూ..
కన్నా.. బంగారం.. ఏం చేస్తున్నావ్ అమ్మ... బొజ్జున్నావా? ఏమన్నా కావాల.. బొమ్మలు కొన్న.. ఆమ్ తింటావా అని మాట్లాడుతూ ఉంటే లోపల బేబీ మెల్లిగా కదులుతూ ఉంటుంది.
బేబీ కదిలికకి విక్రమ్ చెయ్యి మెల్లిగా వణుకుతుంది. అవని బాడీలో జరిగిన మార్పుకి ఒళ్ళు జలదరించినట్టుగా కళ్ళు తెరుస్తుంది.
ఇద్దరూ ఒకేసారి బేబీ కదిలింది అని అంటారు. ఒక్క నిమిషం ఇద్దరికీ ఆనందం. ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తూ విక్రమ్ ని గట్టిగా పట్టుకుని బేబీ కదులుతున్నాడు.
నువ్వు ఇప్పుడే అబ్సర్వ్ చేసావేమో నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మరి నాకు చెప్పలేదు అంటుంది.
అప్పుడు నువ్వు నిద్రలో ఉంటున్నావు. ఆ టైంలో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం లే అంటాడు. నాకు మెల్లిగా తెలుస్తుంది కానీ ఈసారి బాగా తెలిసిందండి.
ఇప్పుడు నుంచే వాడు నాన్న కుచీ అయిపోతే మరి నేను అని బిక్కమొహం వేస్తుంది. నువ్వా అని ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి మా ఇద్దరికీ బుల్లి కూచివి అంటాడు.
నేనేమీ చిన్నపిల్లనే కాదు కదా.. వాడు అమ్మతోనే ఉండాలి కదా. ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ అర్థమయ్యి ఫస్ట్ నీతోనే ఉంటాడు. అన్ని నీకే చెబుతాడు. నీ తర్వాతే నేను.
అలాగ వద్దు. ఇద్దరమూ సమానమే. ఇద్దరితోనూ ఉండాలి. అమ్మగా నేను గారం చేసిన తండ్రిగా మీరు గైడెన్స్ ఇవ్వాలి .
పుట్టేవాడు మరో విక్రమ్ లాగా ఉండాలి. అబ్బో నీ మొగుడు ఏమన్నా సూపరా.. సూపర్ కాదు బంగారం వజ్రం అని మెటికలు విరుస్తుంది.
భార్య ప్రేమకు నవ్వుకుంటూ... ఇప్పుడు అలాగే అంటావు గాని రేపు బేబీ వచ్చాక నన్ను పక్కన పెట్టేస్తావు చూస్తూ ఉండు.
అలా ఎప్పటికీ కాదు మీ తర్వాతే నాకు ఎవరైనా అని ఏడుపు ముఖంతో చెబుతుంది. సరే.. సరే..నా తర్వాత ఎవరైనా..
నువ్వు డల్ అవ్వద్దు. నుదుట్టిన ముద్దు పెట్టుకొని బయటకి వస్తావా. కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది. పదండి అని మంచం దిగుతుంది.
మెల్లిగా నడిపిస్తూ కిందకి తీసుకు వస్తాడు. అవనినీ చూసి లలిత ఏరా కిందకి వచ్చావు. ఏమైనా కావాలా.. గదిలో ఉండి ఉండి విసుగు వస్తుంది అత్తయ్య.
సరే కూర్చో.. తాగడానికి ఏమైనా తెస్తాను. ఇప్పుడు ఏమీ వద్దు. అత్తయ్య అంటే.. ఏంట్రా... సరదాగా బయటికి వెళదామా... ఇంట్లో ఉండి ఉండి విసుగు వస్తుంది.
బయటకా.. విక్రమ్ ఏమంటాడో.. ప్లీజ్ అత్తయ్య మీరు ఒప్పించండి. ఒక్క నిమిషం అని రేయ్ విక్రమ్.. చెప్పమ్మా.. షాపింగ్ కి వెళ్దామా అంటుంది.
ఇప్పుడు షాపింగ్ ఏమిటి.. ఏమైనా కావాలంటే చెప్పండి. ఇంటికే వస్తాయి. అబ్బా అలా కాదురా.. అవనికి ఇంట్లో బోర్ కొడుతుంది. కాస్త బయటకు వెళితే బాగుంటుంది రా అర్థం చేసుకో. సరే నేను ప్లాన్ చేస్తాను.
అందరూ రెడీఅయ్యి బయటికి బయలుదేరుతారు. ఇందిర నేను రాలేను. మీరు వెళ్ళండి అని ఇంట్లోనే ఉండి పోతారు. నివి అవనితో ఈరోజు నీతో బెస్ట్ షాపింగ్ చేయిపిస్తాను.
ఎందుకు నివి.. అవని అసలే అలసిపోతోంది. ఇప్పుడు నీతో షాపింగ్ అంటే లోపల ఉన్న నీ మేనల్లుడు కూడా కంగారుపడతాడు. వాడు కంగారుపడతాడా లేక మీరు కంగారుపడుతున్నారా..
అయినా మీరేంటి మేనల్లుడు అని ఫిక్స్ అయిపోయారు. అమ్మాయి పుడితే.. ఎందుకు నివి.. నీలాంటి అద్భుతాలు కుటుంబానికి ఒక్కళ్ళే ఉండాలి.
ఎక్కువ అద్భుతాలు ఉన్నాయనుకో చూడడానికి మాకు రెండు కళ్ళు కాదు కదా 10 ఉన్నా సరిపోవు. ఇప్పుడు మీరు పొగిడారా లేక... నిన్ను పొగిడాను బంగారం.అంతకు మించి నేను ఏమైనా చేయగలనా..
సరే పదండి అని ముందుకి నడుస్తుంది. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుని. మావయ్య నాకు పెళ్ళాన్ని పొగుడడం వచ్చేసింది.
ఎక్స్పీరియన్స్ ఏదైనా నేర్పిస్తుంది అల్లుడు. ఇంకా నేర్చుకుంటావు.
అందరూ మాల్ కి వెళతారు. మాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఎవరూ లేరు అని అవని అడిగితే... మాల్ మొత్తం ఈరోజు మనకే బుక్ చేశాను అంటాడు.
అలా ఎందుకు వాళ్లకి లాస్ వస్తుంది కదా. ఈ మాల్ మనదే కాబట్టి ప్రాబ్లం ఏమి లేదు. మనదైన సరే లాస్ ఏ కదా...
నీకన్న ఏది ఎక్కువ కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి. అందరితో ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది.
నీకు ఫ్రెష్ ఎయిర్ ఉండాలి కదా... పంజరంలో చిలకని చేసేస్తున్నారు. ఈ బంగారు బొమ్మపై ఎవరి కళ్ళు పడనివ్వకుండా చూసుకుంటున్న.
ఏదేమైనా మీ మాటే పైనుంటుంది కదా.. నా నోరు ఎలాగైనా మూయిస్తారు అని లోపలికి వెళుతుంది. ఇప్పుడు నా భార్యమణి అలిగిందా అని వెనకాలే వెళతాడు. అలిగితే మాత్రం ఏమైనా ఉపయోగం ఉందా...
ఎలాంటి ఉపయోగం కావాలో చెప్పు.. చెప్పిన ఉపయోగం ఉండదు లేండి. అరే చెబితేనే కదా ఉపయోగం ఉంటుందో లేదో తెలుస్తుంది.
మరి చెప్పాక కాదనకూడదు. ముందరకాళ్ళకి బంధం వేస్తున్నావా... నా చిన్న కోరిక తీర్చమంటున్న... ఇన్ని రోజులకి అడిగావు.
కాదని ఎలా అంటాను. సరే అయితే.. నైట్ కి మనిద్దరమే బైక్ మీద రైడింగ్ కి వెళదాం. ఏమిటి అని కొంచెం గట్టిగా అంటాడు.
లలిత వెనక్కి తిరిగి ఏమైందిరా... ఏమీ లేదు అమ్మ.. మీరు పదండి. స్లోగా అదేం కోరికే అంటాడు. ప్లీజ్ ప్లీజ్ లోపల ఉన్న మీ కన్నా కి నాన్నతో బైక్ రైడింగ్ కి వెళ్లాలని ఉందంట..
అందుకనే నన్ను చెప్పమంటున్నాడు.. వాడు ఇప్పుడు అమ్మ కూచినా.. కాదు మీ ఇద్దరికీ నేను కదా బుల్లి కూచిని.
ప్లీజ్ అని బ్రతిమాలుతూ ఉంటే... సరే నా బుల్లికూచి కోసం ఒప్పుకుంటున్నాను. థాంక్యూ అని ఎగరబోతుఉంటే..
హలో మేడం ఏమిటా గంతులు లోపల నాకన్నా ఏమైపోవాలి. సోరి.. సోరి.. మీరు బయటికి తీసుకువెళ్తాను అంటే ఆనందంలో ఏం చేస్తున్నానో తెలియడం లేదు.
సరే పద దగ్గరుండి షాపింగ్ చేయిస్తాడు.
బైక్ రైడింగ్ కి అందరూ రెడీనా ???♀️
కథ కొనసాగుతుంది..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)