10-03-2026, 06:32 AM
Part - 139
ఎప్పటికీ వినలేను అనుకున్నా మాట మీ వల్ల విన్నాను మావయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది. కళ్యాణ్, రమేష్ తల పట్టుకుంటారు.
నివి కోపంగా ఏమిటి నీ ఉద్దేశం.. నేను గయ్యాళిని. తప్పు చేసిన నాదే పైన ఉండాలి అనే మెంటాలిటీ నా..అలా నేను ఎప్పుడు అన్నాను తల గోక్కుంటాడు.
ఇప్పుడు నువ్వు అన్న మాటకు అర్థం అదే.. చూసారా నాన్న నేను రియలైజ్ అయ్యి సోరి చెప్తే రాజ్ ఎలా ఫీలవుతున్నాడో.
అందుకే సోరి చెప్పను. ఇప్పుడిప్పుడే కదమ్మా అనుభవం లోకి వస్తున్నాడు. మెల్లిగా అర్థం చేసుకుంటాడులే...
అందరి సరదాలు నవ్వుల మధ్యన కళ్యాణ ఘడియలు దగ్గరకి వస్తాయి. నివి అంగీకారంతో రాజ్ పాణిగ్రహణం చేసి మెడలో తాళి కడతాడు.
పెళ్లి సందడి ముగిసి అప్పగింతలప్పుడు కళ్యాణ్ రాజ్ చేతులు పట్టుకుని అల్లుడు జాగ్రత్త. మీరు టెన్షన్ పడకండి మావయ్య. నివిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
వినయ్ వెంటనే నాన్న చెప్పింది నివి గురించి కాదు బావ. నీ గురించి. పార్ధు నివి పక్కన నిలబడి నా కోడలు అమాయకరాలు. నోట్లో నాలుక లేదు.
వేలు పెట్టిన కొరకలేదని చెప్పండి మీ కోడలు అని రాజ్ పళ్ళు నూరుతాడు. ఒరేయ్ ఎక్కువగా నూరకరా... పళ్ళు పౌడర్ అయిపోయినాయి అనుకో రేపటి నుంచి ఏ అరటిపండో తినిపించాల్సి వస్తుంది.
ఎందుకు చెప్పు నీకు. మీరు నాకు తండ్రా లేకపోతే ఎనిమి నా అంటే నీకు బెస్ట్ ఫ్రెండ్ అని రా. ఫ్రెండ్ లాగా లేరు శాడిస్ట్ లాగా ఉన్నారు.
నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అని ప్రతిసారి నిన్ను మోటివేట్ చేస్తున్నాను. అది నీకు అర్థం కావడం లేదు. చూడమ్మా నీవల్ల నాన్న ఇబ్బంది పడుతున్నారంట.
వింటున్నా వింటున్న ఇంటికి వెళ్ళాక చెబుతాను. జస్ట్ జోక్ చేశాను కరుణ. నీ పేరులో ఉన్న కరుణ రసం అంత నీలోనే ఉంటుంది కదా...
అది వాడికి అర్థం కాక ఏదో మాట్లాడుతున్నాడు. సరే రా అందరూ పొద్దున్నే తొందరగా వచ్చేయండి. నోములు ఉన్నాయి కదా అని చెప్పి కొత్తజంటని తీసుకుని పార్ధు జంట బయలుదేరుతారు.
మెల్లిగా నెలలు ముందుకి జరుగుతూ ఉంటాయి. విద్యలో భయం తగ్గి భరత్ కి కొద్దిగా దగ్గరవుతూ ఉంటుంది. అల్లరి జంట ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు.
ఆదివారం ఉదయం పూజిత బద్ధకంగా లేచి హాల్లో కూర్చుని అమ్మా.. ఈ రోజు చికెన్ బిర్యాని చేసి మటన్ కర్రీ చేయమ్మా.. తిని చాలా రోజులైంది.
పూజిత మదర్ కోపంగా ఆడపిల్లలాగా ఉంటున్నావా రౌడీ లాగా తిరుగుతున్నావు. అమ్మ ఏదైనా అను.. ఆ రౌడీ అన్నమాట అంటే ఊరుకోను.
అట్లకాడ తీసుకుని వచ్చి రౌడీ కాక ఇంకా ఏమిటి.. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి... అమ్మ అని గారాలు పోతూ ఉంటే కాలింగ్ బెల్ సౌండ్ వినపడుతుంది.
ఇంత పొద్దుట ఎవరు అని వెళ్లి తలుపు తీయగానే గుమ్మం ముందు కళ్యాణ్ రమేష్ జంటలు ఉంటారు. మీరు...
నా పేరు కళ్యాణ్ అండి. నా భార్య లలిత. మా బావ రమేష్ చెల్లెలు మాధవి అని పరిచయం చేస్తే నమస్తే రండి అని లోపలకి తీసుకువెళ్తారు.
పూజిత గబగబా లేచి సార్ మీరు ఇక్కడ.. మీ నాన్నగారు లేరమ్మా... ఒక్క నిమిషం అని వెళ్లి పూజిత వాళ్ళ నాన్నగారిని తీసుకుని వస్తుంది.
పూజిత ఫాదర్ కంగారుపడుతూ మీలాంటి పెద్ద వాళ్ళు మా ఇంటికి వచ్చారు అంటే కంగారుగా ఉంది. ఏదైనా విషయం ఉంటే కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా..
మీరంతా కంగారు పడవలసినది ఏమీ లేదు. పెళ్లి మాటలు మాట్లాడదామని వచ్చాము. పెళ్లి అని అయోమయంగా చూస్తూ ఉంటారు.
అవునండి మీ అమ్మాయిని మా అబ్బాయికి అడుగుదామని వచ్చాము. అంత పెద్ద వాళ్ళు తన కూతురు కోసం వచ్చారు అనేటప్పటికీ నోటిమాట రాకుండా టెన్షన్ గా చూస్తూ ఉంటారు.
పూజిత మదర్ తెరుకొని ఒక్క నిమిషం అండి అని పూజితని లోపలికి తీసుకువెళ్ళి తొందరగా స్నానం చేశారా..
అమ్మ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అంతటి పెద్దవాళ్లు మన ఇంటికి వచ్చినప్పుడు మనం కొంచెం పద్ధతిగా ఉండాలి.
కంగారు పెట్టి స్నానం చేపించి చీర కట్టి బయటికి తీసుకు వస్తారు. అయ్యో అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టారు ఎలా ఉన్నా మహాలక్ష్మి లాగానే ఉంటుంది రామ్మా అని లలిత గారు అంటారు.
మౌనంగా వెళ్లి లలిత మాధవి దగ్గర కూర్చుంటుంది. నువ్వు ఇలా సైలెంట్ గా ఉండే దానికన్నా అల్లరి పిల్లలాగా ఉంటేనే బాగుంటావు.
మా అబ్బాయికి కూడా నీలో నచ్చింది ఆ అల్లరే. ఏం మాట్లాడాలేక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది .
మీరు మా అబ్బాయిని చూశారు అనుకుంటా కదా..
మీ అందరికీ అంగీకారం అయితే ముహూర్తాలు పెట్టేసుకుందామని లలిత చెబుతూ ఉంటే క్షమించండి మేడం అంటుంది.
దేనికమ్మ.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ మాటకి పూజిత పేరెంట్స్ భయంగా చూస్తే.. ఈ రెండు జంటలు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఎందుకు ఇష్టం లేదు.
మా అబ్బాయి లో ఏమైనా లోపమా. క్షమించండి. మీ అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటి అన్నది నాకు అనవసరం. నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని ప్రేమించాను.
పూజిత మదర్ కంగారుగా ఏమిటే నువ్వు అనేది. అవును అమ్మ. సమయం చూసి చెబుదామనుకున్నాను కానీ ఇంతలోనే...
సరేలే అమ్మ. నువ్వు ఎవరిని ప్రేమిస్తే ఏమయింది. ఆ అబ్బాయిని ప్రేమించు. మా అబ్బాయిని పెళ్లి చేసుకో మేడం మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా..
ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమేమిటి. ఎవరిని ప్రేమించావు. మా అబ్బాయి కన్నా అన్ని విధాల గొప్పవాడా అని కొంచెం కోపంగా నటిస్తూ అడుగుతారు.
అవన్నీ నాకు తెలియదు. నాకు అతను నచ్చాడు. ఇద్దరం ప్రేమించుకున్నాము. ఇంతకీ ఎవరో తెలుసుకోవచ్చా.. మీ దగ్గరే జాబ్ చేస్తున్నాడు.
వాట్ మా దగ్గర వర్క్ చేసే వాడి కోసం మా ఇంటికోడలు అవ్వడాన్ని వదిలేసుకుంటున్నావా...
హోదా కన్నా మనసు ముఖ్యం. మనసు లేని మనువు నరకంతో సమానం మేడం. వినయ్ లోపలికి వచ్చి మా అన్ని అయిపోయినాయా అంటూ ఉండగానే..
గబగబా పూజిత దగ్గరికి వెళ్లి నేను ప్రేమిస్తుంది ఈ అబ్బాయినే అంటుంది. పూజిత ఫాదర్ కి అర్థం కాకుండా ఉంటుంది.
ఈ అబ్బాయి నా అని మాధవి లలిత ఒకేసారి అంటారు. అవును మేడం.. ఏరా నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావా..
అది అమ్మ అంటుంటే.. ఎందుకు వినయ్ అంత భయపడుతున్నావు. నిజం చెప్పు. అవును మా అంటాడు.
మేము వద్దంటే అనే కోపంగా అడుగుతారు.
మీరు అవునన్నా కాదన్నా నా రౌడీ బేబీ చెయ్యి వదలను. అందరూ నవ్వుతారు. ఎందుకు మీరు నవ్వుతున్నారు అని పూజిత అడిగితే...
వినయ్ భయంగా పూజిత వైపు చూస్తాడు. నువ్వు ప్రేమలో నెగ్గవు. అలాగే మా టెస్టులో కూడా..
టెస్ట్ ఏంటి మేడం.. మేడం కాదు అత్తయ్య.. వీడెవడో కాదు. మా అబ్బాయి. అది మీరిస్తున్న ఫ్రీడమ్ మేడం. ఫ్రీడమా.. ఇంకేమన్నానా...
వాడు మా చిన్నోడు. విక్రమ్ తర్వాత వీడు. నిన్ను ఏదో సరదాగా ఏడిపించినట్టు ఉన్నాడు. కోపంగా చూస్తుంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అన్నట్టుగా చూస్తే...
పూజిత గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ మీరు పెళ్లి మాటలు మాట్లాడుకోండి. నా రౌడీ బేబీ ని కూల్ చేసి వస్తాను అని పూజిత వెనకాల లోపలకి వెళతాడు.
గదిలోకి వెళ్లి బేబీ రౌడీ అని పిలుస్తూ ఉంటే ఎక్కడా కనిపించదు. అమ్మాయ్ అనుకుంటు ఇంకా ముందుకు వెళతాడు.
వెనక గాజుల శబ్దం వినపడి నా రౌడీ బేబీ వెనకాల నిలబడిందా అని వెనక్కి తిరుగుతాడు. అక్కడ కర్ర పట్టుకుని నిలబడి ఉన్నా పూజితను చూసి చూడు బేబీ ఏదైనా మాటలతో ఉండాలి గాని చేతల్లోకి వెళ్ళకూడదు.
వెళితే వేరేలాగా వెళ్లాలి. ఏంట్రా వెళ్ళేది. నేను వాళ్ళ అబ్బాయిని చేసుకుంటాను లేదా అని టెస్ట్ చేశారా.. నా క్యారెక్టర్ ని డిసైడ్ చేయడానికి వచ్చారా మీరు.
ఛి ఛి బంగారం అలాంటిదేమీ లేదు రా.. మరి ఏమనుకోవాలి.. వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ పక్కకి తిరుగుతుంది.
వినయ్ కి కూడా కొంచెం గిల్టీ గా అనిపించి పూజితన్ని కూర్చోబెట్టి కింద కూర్చుంటాడు. పూజిత మోకాళ్ళ మీద చేతులు పెట్టి ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకున్నాను కానీ నువ్వు ఇంత ఫీల్ అవుతావని అనుకోలేదు.
ప్రామిస్ ఇప్పుడు నుంచి ఎప్పుడు ఇలాంటి ఫ్రాంక్స్ చేయను. నన్ను నమ్ము. ప్లీజ్ బంగారం. నీ అలక పోవాలంటే ఏం చేయాలో చెప్పు.
పెళ్లి అయ్యాక ఆరు నెలలు నీకు అన్నీ కట్ చేస్తాను. బేబీ ఆ పని మాత్రం చేయకే... ఇప్పటికే వయసు వచ్చి అల్లాడిపోతున్నాను.
అల్లాడిపో నాకేంటి నువ్వు చేసిన దానికి ఇంతకి ఇంత పనిష్మెంట్ ఇవ్వకపోతే... నా రౌడీ బేబీ కాదు అంతే కదా అని నీరసంగా అంటాడు. అంతే కదా అని బయటికి నడుస్తుంది.
వినయ్ జంటకి, భరత్ జంటకి ఒకే మండపంలో పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయిపోతారు. మాధవి వెళుతూ పూజిత దగ్గరికి వచ్చి నా కొడుకుకి నువ్వంటే చాలా ఇష్టం.
అల్లరి చేస్తాడు కానీ బాధ్యత కూడా ఉంది. అర్థం చేసుకో అమ్మ. ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. ఈ నవ్వు చాలు వెన్నెల కురిసినట్టుగాఉంది.
నా కోడళ్లు ఇద్దరు బంగారాలు.
ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి విషయాలు అన్నీ చెబుతారు. వినయ్, భరత్ మొఖాలు వెలుగిపోతూ ఉంటే... రాజ్.. ఎందుకురా నన్ను చూసి కూడా మీరు పెళ్లి చేసుకుంటున్నారు.. సుఖపడాలని లేదా..
మేము నీలాగా కాదు పెళ్ళాల్ని మస్తు కంట్రోల్ లో పెడతాం అని సినిమా డైలాగ్ రేంజ్ లో చెబితే రాజ్ వెంటనే నవ్వుతాడు.
ఎందుకు బావ నవ్వుతున్నావ్ అని వినయ్ అడిగితే... సేమ్ ఇలాంటి డైలాగే శ్రీ ఎంగేజ్మెంట్ అప్పుడు నేను చెప్పాను అది గుర్తొచ్చిందిలే...
వినయ్, భరత్ ??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)