09-03-2026, 07:44 AM
Part - 138
విద్య భయంగా భరత్ దగ్గరకు వచ్చే సార్ అంటుంది. హ అని ట్రాన్సలోనే విద్యకి సమాధానం చెబుతాడు. ఎలా ఉన్నారు సార్. బాబు బొమ్మ స్వర్గం నుంచి నాకోసం నడిచినట్టుగా ఉంది అంత అద్భుతంగా ఉన్నావు.
భరత్ ఇచ్చిన కాంప్లిమెంట్ కి సిగ్గుపడుతూ థాంక్యూ సార్ అంటుంది. ఏంటి నీకు సిగ్గుపడడం అనే ఎమోషన్ కూడా ఉందా.. సార్ అంటుంది.
సరే సరే అని లోపలకి తీసుకువెళుతూ వెయిట్ అని వినయ్ వైపుచూస్తాడు. వినయ్ సొల్లు కార్చుతూ ఉంటాడు.
ఇదేంటి మరి ఇంత దారుణంగా ఉన్నాడు అని చూస్తూ ఉంటే.. పూజిత తిప్పుకుంటూ వచ్చి ఎలా ఉన్నాను అబ్బాయ్.
ఎలా ఉన్నావంటే ఏం చెప్పాలి అమ్మాయ్.. ఇప్పుడే ఇక్కడే తాళి కట్టి ఇలాగే ఫస్ట్ నైట్ చేసేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.
అనిపిస్తుంది అనిపిస్తుంది ముందు ఆ నోరుముయ్యి. ఈగలు దూరాయి అనుకో చికెన్ అనుకుని తినేస్తావు. నిన్ను తింటున్నాను కదా ఇంక ఏది తినబుద్ది అవ్వద్దు అమ్మాయ్..
దగ్గరగా జరిగే అంత తినేసేటట్టుగా ఉన్నానా అబ్బాయ్.. చేతల్లో చూపించమంటావా.. వద్దులే చీర నలిగిపోతుంది. నలగకుండా చూపిస్తాను. కొంచెం కోపరేట్ చేయవే.. పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను.
భరత్.. వినయ్ కి వినబడేటట్టుగా దగ్గుతాడు. వినయ్ తేరుకని ఏమిటిక్కడే నిలబడ్డావు. లోపలికి పదా.. ఒరేయ్ నీ ఓవరాక్షన్ ఆపు.
హాయ్ పూజిత అంటే హాయ్ సార్ అంటుంది. చిన్నగా నవ్వుతు.. మీరందరూ వినయ్ కి చాలా ఫ్రీడం ఇచ్చేశారు.
ఎందుకనిపించింది... లేకపోతే మీ దగ్గర వర్క్ చేసేవాడు మిమ్మల్ని అందరిని రిలేషన్స్ తో పిలుస్తున్నాడు అంటే మీరు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిండాలి.
ఆ మాటకి భరత్ వినయ్ వైపు చూస్తే వినయ్ కన్ను కొడతాడు. అవునవునమ్మా చాలా ఫ్రీడమ్ ఇచ్చేసాము. అందుకే నిన్ను ఇచ్చి పెళ్లి చేసి ఆ ఫ్రీడమ్ నీ చేతిలో పెడదాం అనుకుంటున్నాము. తప్పకుండా సార్.
సార్ వద్దమ్మా.. అన్నయ్య అని పిలువు. నేనా అంటే... పర్వాలేదు. వీడు బావ అని పిలిచినప్పుడు నీకు నేను అన్నయ్యనే అవుతాను కదా.
విద్య, పూజిత కి ఒకరిని ఒకరు పరిచయం చేసి మీరిద్దరూ కలిసి లోపలికి వెళ్ళండి. వెనకాలే వస్తాము అని పంపిస్తారు.
వాళ్ళిద్దరూ వెళ్లిన తరువాత భరత్, వినయ్ ని వెనక్కి లాగి ఒరేయ్ ఏం చెప్పావురా.. నా రౌడీ బేబీకి నేను ఇక్కడ ఎంప్లాయ్ అని చెప్పాను. అందుకే అది ఇలా ఫిక్స్ అయిపోయింది.
మరి నిజం తెలిస్తే నిన్ను కుమ్మేస్తదేమో.. అంత సీన్ లేదులే గాని పద బావ. మళ్ళీ అన్నయ్య చూసాడు అంటే మనిద్దరిని కలిపి కుమ్ముతాడు.
సంగీత్ మొదలవుతుంది. జంటలు అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. అవని ఇబ్బంది పడకుండా ఎంజాయ్ చేసేటట్టుగా విక్రమ్ చిన్న చిన్న స్టెప్స్ వేపిస్తూ ఉంటాడు.
అవని డాన్స్ చేస్తూ నా వల్ల మీరు స్లో అయిపోయారు కదా.. ఎందుకు అనిపిస్తుంది అని ముంగురులు సవరిస్తూ అడుగుతాడు.
మెల్లిగా కాళ్లు కదుపుతూనే నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్లే కదా మీరు స్లోగా డాన్స్ చేస్తున్నారు. లేదు అంటే అందరికీ మంచి పోటీ ఇచ్చేవారు.
ఆ మాటకి నవ్వుతూ స్పీడ్ గా డాన్స్ చేయడం చెయ్యకపోవడం ఇంపార్టెంట్ కాదు బంగారం. మన లైఫ్ పార్ట్నర్ తో కలిసి ఎంత ఎంజాయ్ చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్.
నేనయితే నా భార్య నా బేబీ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కాబట్టి నువ్వు ఫీల్ అవ్వకు..ఎంజాయ్ దిస్ మూమెంట్ అంటాడు.
ఆ మాటకి నవ్వుతూ మీరు బంగారం అండి . అందుకే కదా ఎప్పుడూ నీ ఒంటి మీద ఉంటాను అంటున్న. బట్ నువ్వే వినిపించుకోవడం లేదు.
అబ్బో చాలా కోరిక ఉంది అయ్యగారికి. చాలా చాలా ఉన్నాయి కానీ మా మేడం కానికరించడం లేదు. కనికరిస్తే ఏం చేస్తారు ఏమిటి.
ఇంకా దగ్గరికి లాక్కుని మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకుందామాని.. అవ్వ సిగ్గు లేకపోతే సరి.. ఇందులో సిగ్గు ఏముంది. మనకు పెళ్లయి ఏమన్నా సంవత్సరాలు అయ్యిందా ఏమిటి? ఇంకా ఫస్ట్ యానివర్సరీనే రాలేదు.
ఇంకెంత రెండు నెలల్లో వచ్చేస్తుంది కదా.. మన యానివర్సరీ కి నీకు సర్ప్రైజ్. ఏమిటో చెప్పొచ్చు కదా.. చెప్పను. చూపిస్తా..
సరే మీ ఇష్టం. నవ్వుతూ డాన్స్ చేస్తున్న ఇద్దరినీ దూరం నుంచి చూస్తున్న ధనుంజయ్ కళ్ళు ఆనందంతో మెరిసిపోతూ ఉంటాయి.
కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఏమిటి ధనుంజయ్ గారు మంచి ఆనందంగా ఉన్నట్టున్నారు. నా కూతురు సంతోషం చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది.
ఇదంతా మీ వల్లే అని నమస్కారం చేస్తాడు. ఆ చేతుల మీద కళ్యాణ్ చేతులు వేసి ఏమిటి మీరు చేస్తుంది. అవని నా కూతురే.
అవును మీ కూతురులాగానే చూసుకుంటున్నారు. నేనే అని బాధపడతాడు. జరిగిపోయిన వాటి గురించి ఎందుకండీ..
జరగాల్సింది ఆలోచించండి. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఆస్తులు పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించవచ్చు కానీ నమ్మకం పోతే సంపాదించడం చాలా కష్టం కదా..
నా కూతురు పైన నాకు కొండంత ప్రేమ ఉంది కాని చూపించలేకపోతున్నాను. చూపించిన అదంతా నటనే అని నా కూతురు అనుకుంటుంది.
ఇలాంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదు కదా. బాధపడకండి. పశ్చాతాపనికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. తప్పకుండా అవని అర్థం చేసుకుంటుంది.
ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. భగవంతుడు నన్ను తీసుకు వెళ్లే ఒక్క నిమిషం ముందు అయినా సరే అవని నన్ను తండ్రిగా ఒప్పుకుని.. నాన్న అని పిలిస్తే చాలు.
తప్పకుండా జరుగుతుంది. వచ్చే మన వారసులే అది నిలబెడతారు. మీ నోటివాక్కు అలాగే జరగాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
భరత్ విద్యని మాధవికి, లలితకి పరిచయం చేస్తాడు. మాధవి ఏంట్రా అన్నట్టు చుస్తే.. రిక్వెస్టింగ్ గా చూస్తాడు. పోరా అంటే.. ప్లీజ్ అని బ్రతిమాలుతూ ఉంటాడు.
విద్యకి ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటే లలిత చిన్నగా నవ్వుకుంటూ రామ్మా అని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. మేడం నేను మీ పక్కన...
ఇదేమన్నా ఆఫీసా.. నువ్వు ఎంప్లాయి.. నేను మేడం అనుకోవడానికి. ఇది మన ఫ్యామిలీ ఫంక్షన్. ఎంజాయ్ చెయ్యి.
ఆ మాటకి నవ్వుతూ మీరు చాలా మంచివాళ్ళు మేడం. అందరూ మంచివాళ్లే. పరిస్థితులను బట్టి మనుషులు మారుతూఉంటారు.
భరత్ అమ్మ ఇంకా నువ్వు ఒప్పుకోకపోతే అని గట్టిగా అంటే.. ఆ ఒప్పుకోకపోతే... నీ కాళ్లు పట్టుకుంటానమ్మ. ప్లీజ్ ఒప్పుకోవే.
రమేష్ అది చూసి ఏంట్రా మీ అమ్మని తెగ కాక పడుతున్నావు. మీకు నేను పెద్ద శ్రమ తగ్గిస్తే అమ్మ అర్థం చేసుకోకుండా నామీద అలుగుతుంది.
ఎంతవరకు న్యాయం నాన్న. మాకు శ్రమ తగ్గించావా... ఏ విషయంలో రా.. చాలా పెద్ద విషయంలో నాన్న లేకపోతే మీరు ఎంత కష్టపడేవారో..
అవునా అంతా పెద్ద కష్టం ఏం తప్పించావు రా... మీకు కోడలు వెతికే పని మీ సుపుత్రుడు తగ్గించాడు అంటుంది
అవునా ఎక్కడ రా నా కోడలు పిల్ల..
అదిగో అక్కడ అత్తయ్య పక్కన కూర్చుందే ఆ అమ్మాయి. లక్షణంగా ఉందిరా.. అచ్చు మీ అమ్మలాగానే కుదురు అయినది అంటాడు.
ఆ మాటకి మాధవి ముఖం వెలిగిపోతుంది. రమేష్ కొడుకు భుజాన్ని మెల్లిగా తడుతూ క్యారీ ఆన్ అంటాడు. అవును నాన్న...
అందుకే అమ్మాయి నచ్చింది. అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు అమ్మే గుర్తుకు వస్తుంది. అందుకనే మీకు అందరికీ పరిచయం చేసి మీ ఆశీర్వాదం తీసుకుందామని నా తాపత్రయం అంతా.. అమ్మేమో అర్థం చేసుకోవడం లేదు.
మాధవి పైట సరి చేసుకుంటు సర్లే ఇంక నువ్వు ప్రేమించాను అన్నాక మేమేం మాత్రం కాదంటామా.. వెళ్లి అమ్మ ఆశీర్వాదం తీసుకోండి.
నువ్వు ఒప్పుకున్నట్టే కదా.. నీకోసం ఒప్పుకోక ఏం చేస్తానులే అని విద్య దగ్గరికి వెళుతుంది. థాంక్స్ నాన్న.. లేడీస్ ని హ్యాండిల్ చేయడం కూడా రావాలి రా ప్రేమించాను అంటే సరిపోదు.
ఇప్పటినుంచి మిమ్మల్ని ఫాలో అవుతాను. తధాస్తు బ్లెస్ చేస్తున్న ఫోజ్ పెడతారు. ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు మంచి హుషారు మీద ఉన్నారు అని కళ్యాణ్ అడిగితే...
నా కొడుకు నన్ను ఒక పెద్ద గండం నుంచి తప్పించాడు బావ. ఏమిటో ఆ గండం.. కోడలు పిల్లని వెతికే పని.. అవునా నా కూతుర్ని చూసేసావా ఎక్కడరా..
మావయ్య చూడకుండానే అలా ఎలా ఫిక్స్ అయిపోతున్నారు. అమ్మాయి నీకు నచ్చాలి కదా... నీకు నచ్చింది కదరా...
పెళ్లి చేసుకునేది మీరు.. కలిసి జీవితాంతం ఉండాల్సింది మీరు. కానీ మన కుటుంబంలోకి వచ్చే అమ్మాయి అందరికీ నచ్చాలి కదా.
తప్పకుండా నచ్చుతుంది ఇంతకీ ఎక్కడ. అదుగో అమ్మ అత్తయ్య మధ్యన కూర్చుంది. ఆల్రెడీ వాళ్ళిద్దరూ మీటింగ్ వేసేసారా అయితే నీ పెళ్లి ఖాయం అయిపోయినట్టే.
వినయ్ కి, నీకు ఒకేసారి చేసేద్దాం ఏమంటావు బావ. తప్పకుండా వాడు కూడా సెట్ చేసుకున్నాడు కదా...
ఏదైనా అవని వచ్చిన వేళ్ళ విశేషం.. మన ఇంట్లో ఒక సంతోషం వెనకాల మరొక సంతోషం వస్తుంది. అందరి గురించే బానేఉంది కానీ పాపం రాజ్ ని తలుచుకుంటేనే జాలేస్తుంది బావ.
నా ఫీలింగ్ కూడా అదే. మరీ కూతురు గురించే చెప్పలేను కదా. అది నిజమే..
పెళ్లి జంట ఏం చేస్తున్నారో.. పదండి వెళదామని భార్యల దగ్గరికి వెళ్లి.. జంట ఏరి అంటే... అక్కడ అని చూపిస్తారు. అక్కడ నివి అలిగి ఉంటే రాజ్ బ్రతిమాలతూఉంటాడు.
ఏమైంది వీళ్లిద్దరికి.. దగ్గరికి వెళ్లి ఏమైందిరా.. చూడండి మావయ్య. ఇందాక నుంచి బ్రతిమాలుతున్నాను. అయినా అలాగే కూర్చుంది .
ఏమైంది నీకు అంటే చూడండి నాన్న. డాన్స్ వేయమంటే ఇక నావల్ల కాదు అంటున్నారు. ఇది ఎవరి సంగీత్.. మాదే కదా..
మేము ఎంజాయ్ చేయకపోతే ఎలా. డాన్స్ చాలా వరకు చేశాను. నావల్ల అవ్వదు అంటే వినాలి కదా.. కళ్యాణ్ నవ్వుతూ నివి పక్కన కూర్చుని..
ప్రతిసారి మనదే నెగ్గాలి అని ఉండకూడదు. నీకోసం రాజ్ తనకి కుదిరినంత వరకు ట్రై చేశాడు. అది అప్రిషియేట్ చెయ్.
అంతేగాని ఇంకా కావాలి ఇంకా కావాలి అని అలిగావు అనుకో... విసుగువచ్చి మొదటికే మోసం వస్తుంది. ఇది మీ పెళ్లి. మీ సంగీత్.
ఇద్దరు నవ్వుతూ ఉంటే మా అందరికీ బాగుంటుంది. చూసేవాళ్ళు ముందు నువ్వు ఇలా అలిగి.. రాజ్ బ్రతిమాలుతూ ఉంటే అసలు బాగోదు.
రాజ్ పేరెంట్స్ కి కూడా కష్టంగానే ఉంటుంది. గదిలో మీరిద్దరూ ఎలా ఉన్నా పరవాలేదు కానీ బయటకి వచ్చేటప్పుడు భర్త మాట పైన ఉంటే చూడడానికి అందంగా ఉంటుంది.
అర్థమైంది అనుకుంటా.. హా అన్న అని సారీ రాజ్ అంటుంది. ఆ మాటకి రాజు కళ్ళు మెరుస్తూ థాంక్స్ మామయ్య.. నేను వినలేను అనుకున్నా మాట మీ వల్ల విన్నాను.
రాజు ఎందుకు నీకు అంత నోటి దురద ?♀️?♀️
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)