05-03-2026, 08:48 AM
Part - 130
విక్రమ్ అవని వైపు చూస్తూ ఏం తినాలి అనిపిస్తుంది. చెప్పాక మాత్రం కోప్పడకూడదు. సరేలే చెప్పు.
వాక్కాయలు కావాలి.
ఏం కాయలు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు. వాక్కాయలు అండి అని ఏడుపు ముఖంతో అంటుంది. అవి ఎంత పుల్లగా వగరుగా ఉంటాయో తెలుసా.. తెలుసు నాకు అదే కావాలి అంటుంది.
ఒరేయ్ మనవడా ఈ టైంలో ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుంది. తినాలనిపించింది కొంచెం అయినా సరే తినాలి లేకపోతే పుట్టబోయే బిడ్డ అలుగుతాడు.
ఏంటి నానమ్మ మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా ఆడదాన్నే కదా... అపర్ణ వాటి సంగతి ఏమిటో చూడు ఆల్రెడీ చెప్పడం అయిపోయింది అత్తయ్య. వచ్చేస్తున్నాయి అంటుంది.
ఎప్పుడు పురనాయించేసావమ్మా అంటే మాధవి తో చెబుతున్నప్పుడే ఉంటుంది. సర్వెంట్ బుట్టతో తెచ్చి అక్కడ పెట్టగానే అత్తయ్య ఇన్న అంటే...
నీకు ఎన్ని తినాలనిపిస్తే అన్ని తిను. మిగిలిన వాటితో ఏదో ఒకటి చేద్దాంలే అంటుంది. ఎక్కువ తినొద్దు ఒక నాలుగు కాయలు తిను చాలు అని విక్రమ్ అంటాడు.
నాలుగు కాయలు ఏమూలకి వస్తాయండి. ఒక్కొక్క పంటికి ఒక్కొక్క కాయ వేసుకున్న 32 కాయలు కావాలి అంటుంది.
మాధవి ఉప్పు కారం కలిపి ప్లేటు తెచ్చి పెడుతుంది. శుభ్రంగా కాయలన్నీ కడిగి ఇంకొక ప్లేట్లో పెడతారు. వాటిని చూడగానే అవనికి నోట్లో లాలాజలం ఊరిపోతూ ఉంటుంది.
గబగబా తీసుకొని తింటూ ఉంటుంది. ఒక పక్కన తింటూనే అబ్బా పుల్లగా ఉంది అని కళ్ళుమూస్తూ ఉంటుంది.
అవని తినే విధానం చూసే అందరూ టెంప్ట్ అయ్యి దగ్గరకు వచ్చి తీసుకుంటారు. విక్రమ్ ఒక కాయ నోట్లో వేసుకుని బాబోయ్ ఇంత పుల్లగా ఉంటే ఎలా తినగలుగుతున్నావు నీకు నోరుపులుపు రావడం లేదా...
లేదండి ఇలా తినండి ఇంకా బాగుంటది అంటే ఒక నమస్కారం చేసి నువ్వు తిను. నావల్ల కాదు కడుపుతో ఉంటే ఇన్ని వేరియేషన్సా..
అప్పుడే ఏం చూసావు.. ముందు ముందు ఇంకా ఉంటాయి అని కళ్యాణ్ అంటే.. ఎక్స్పీరియన్సా.. చాలా.
మీరు ముగ్గురు.. మా చెల్లికి ఒక్కడు.
మొత్తం నలుగురు. మేము ఎంత ఎంజాయ్ చేసాము అనుకుంటున్నావు. ఎందుకులే బావ విక్రమ్ కి చెప్పడం. మనం అంటే ఫుడీస్ కాబట్టి వాళ్లతో పాటు ఎంజాయ్ చేసాము.
మన విక్కీ బాబు డైట్ డైట్ అంటాడు కదా.. అని రమేష్ అనగానే.. మావయ్య అంటాడు. ప్రెగ్నెంట్ లేడీస్ ఫుడ్ బలే వెరైటీగా ఉంటుంది ఎంజాయ్ చేయి అని చెప్పి నవ్వుతారు.
అందరి నవ్వులు సరదాలు మధ్యన అవని తేలిక పడుతుంది. మరునాడు ఉదయం అవని నిద్రలేచేటప్పటికి యోగా ట్రైనర్ రెడీగా ఉంటుంది.
అప్పుడే అరేంజ్ చేసేసారా.. చెప్పాను కదా నీ విషయంలో ఏది లేట్ చెయ్యను అని.. మరీ ఇంత తొందరగానా నాకు బద్ధకంగా ఉంది.
ఆ బద్దకాన్ని వదిలించడానికే ఈ మేడం వచ్చారు వేకప్ అని చెబుతాడు. కష్టంగా లేచి బయటకి వస్తుంది.
అవని తో పాటు నివి కూడా స్టార్ట్ చేస్తుంది.
నీకెందుకు నివి అంటే ఫిట్నెస్ కోసం వదిన. పెళ్లి దగ్గరలో ఉంది కదా.. నివి నువ్వు చాలా గ్రేట్. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉంటావు. థాంక్యూ.. థాంక్యూ.. వదిన.
ఇంతకీ మా అన్నయ్య ఎక్కడ.. హో రాజ్ గురించా.. ఆయనకు ఒళ్ళంతా బద్ధకమే. అప్పుడే ఎందుకు లెగుస్తారు.
అలా అనకు.. రాజ్ అన్నయ్య చాలా యాక్టివ్. నేను బెంగళూరులో ఉండగా చూశాను కదా.. అప్పుడు ఎంత డ్రామా ప్లే చేశారు అనుకుంటున్నావు.
నవ్వుతూ మేము అలా ప్లే చేసాం కాబట్టే నువ్వు ఓపెన్ అయ్యావు లేకపోతే ఇంకా సాగదిద్దువు కదా అని విక్రమ్ అంటాడు.
ఓ మీరు కూడా ఇక్కడే ఉన్నారా.. నీ వెనకాల లేకపోతే ఇలాగే కబుర్లు చెబుతూ టైంపాస్ చేస్తావు. అందుకే నేను నీ యోగ అయ్యేదాకా ఇక్కడే ఉంటాను.
ఇది చీటింగ్ నేనొప్పుకోను అంటుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పదు బంగారం కానీ కానీ అంటాడు. కష్టంగా యోగ మొదలు పెడుతుంది.
వన్ అవర్ చేయిపించిన తర్వాత ఈరోజుకి చాలు మేడం. రేపు ఇంకా కొన్ని యాడ్ చేద్దాం..వన్ అవర్ చాలా అని నోరు వదిలేస్తుంది.
హెల్త్ ఇంపార్టెంట్ కదా తప్పదు. ఈవినింగ్ వాకింగ్ చేయండి అని చెప్పి ట్రైనర్ వెళ్ళిపోతారు. ట్రైనర్ వెళ్లగానే హమ్మయ్య అనుకుని రిలాక్స్ అవుతుంది.
వెంటనే క్యారేట్, బీట్రూట్ జ్యూస్ రెడీ అవుతుంది. అది చూసి అత్తయ్య అని బిక్కమొహం వేస్తుంది. తప్పదు బంగారం తాగేసి వెళ్లి స్నానం చేసి రా..
అప్పుడు వేడివేడిగా బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తాము అని గ్లాస్ చేతిలో పెడుతుంది. నేను తాగుతాను మీరు వెళ్ళండి అత్తయ్య.
నీ హెల్త్ డైట్ విషయంలో ఎవ్వరం నెగ్లెట్ చేయము. నువ్వు తాగేసి గ్లాస్ ఇస్తే నేను వెళ్తాను అంటుంది. సర్వెంట్స్ ఉన్నారు కదా అత్తయ్య వాళ్ళకి ఇస్తాను.
నీ పనులు మొత్తం మేమే చేస్తాం తల్లి కానీ అంటుంది. ఆ జ్యూస్ తాగి ఇప్పుడు హ్యాపీ నా.. నువ్వు బంగారానివే అని చెప్పి మెటికలు విరిచి వెళతారు.
తాగితే బంగారం.. తాగకపోతే తాగేదాకా వదలరు. ఏమిటో అనుకుని రూమ్లోకి వెళుతుంది. రూమ్ చూసి ఏంటి ఇలా మారిపోయింది. నేను మా గదిలోకే వచ్చానా అని చుట్టూ చూస్తూ ఉంటుంది.
నచ్చిందా అని అడుగుతాడు. అదేంటి. కర్టన్ కలర్స్ అన్ని మార్చేశారు. రూమ్ లో కూడా డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఏం చేశారు.
కర్టెన్స్ అన్ని లైట్ కలర్స్ కి మార్చాను బంగారం. నీ కళ్ళకి ప్రజెంట్ గా కనపడాలి కదా.. అలాగే స్మెల్ కూడా బాగుంటే నువ్వు రిలాక్స్డ్ అవుతావని.
అత్తింటి వారు చూపిస్తున్న ప్రేమకి ఫిదా అవుతూ విక్రమ్ ని గట్టిగా కౌగిలించుకొని నా విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారండి.
ఇప్పుడే అత్తమ్మ జ్యూస్ ఇచ్చారు. మీరేమో నా మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలని ప్రతి నిమిషం ఆరాటపడుతున్నారు.
థాంక్యూ.. థాంక్యూ.. గట్టిగా ముద్దు పెడుతుంది. బంగారం నువ్వు ఇలా టెంప్ట్ చేసావంటే చాలా కష్టం.. అసలు నీకు లేత నెలలు.
ఆంటీ కొన్ని రోజులు దూరంగా ఉండమన్నారు. నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు అని చుట్టూ చేతులు వేస్తాడు. నవ్వుతూ అయితే మీకు ఇంకొక గట్టి పరీక్ష అంటుంది
నాకేనా నీకు కాదా అని ముక్కు పట్టుకుని లాగుతాడు. నవ్వుతూ నాదారి వేరులే.. ఏదైనా ఒకటే.. ఎవరి బాడీలో అయినా హార్మోన్స్ అలాగే మారుతూ ఉంటాయి.
కాకపోతే మగవాళ్ళం బయట పడతాము. మీ ఆడవాళ్లు బయటపడరు అంతే అంటాడు. అబ్బో మా ఆడవాళ్ళ గురించి బాగా రీసెర్చ్ చేసినట్టున్నారే..
బయట లేడీస్ మీద ఎందుకు... రీసెర్చ్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా.. నాకు తెలియదా ఏమిటి అంటాడు.
వెళ్లి స్నానం చేసిరా మళ్ళీ టిఫిన్ లేట్ అవుతుంది అని వాష్ రూమ్లోకి పంపిస్తాడు. నీళ్లు కూడా సెట్ చేస్తాడు. ఇంతకుమించి వేడి చేయకు. అలాగే చన్నీళ్లు చేయకు అని సెట్ చేసి వస్తాడు.
స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి లైట్ వెయిట్ సారీ తీసి ఉంచుతాడు. నేను తీసుకుంటాను కదా.. ఏంటి తీసుకునేది..
నువ్వు కట్టే చీరలు వెయిట్ ఎక్కువ అయిపోతున్నాయి. అందుకే ఈ లైట్ వెయిట్ సారీస్ కట్టుకో అంటాడు. ఇవి ఇప్పుడు తెప్పించారు.
నా దగ్గర లేవు కదా.. నీ మొగుడు సో స్మార్ట్ బంగారం. అందుకే అన్నీ తెప్పించి రెడీగా పెట్టాడు. అబ్బో అని చుట్టూ మెటికలు విరిచి అయితే రేపు ఎవరు పుడతారో వాళ్లకి కూడా ఇప్పుడు నుంచే తెచ్చి పెడతారా..
ఆ విషయంలో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. బేబీ రూమ్ కూడా రెడీ అయిపోతుంది. చీర కట్టుకుంటూనే అమ్మో బేబీ ని సెపరేట్ రూమ్ లోన..
నేను పడుకోబెట్టను. నా పక్కనే పడుకుంటుంది. అయ్యో ఇండివిడ్యువాలిటీ అలవాటు అవ్వాలి బంగారం. సెపరేట్ బెడ్ ఉండాలి.
ఏమో అవన్నీ నాకు తెలియదు. బేబీ ఎప్పుడు నాతోనే ఉండాలి. నేను మా అమ్మ దగ్గర మిస్ అయిన ప్రతి ఫీలింగ్ ని కూడా నేను నా బేబీకి ఇవ్వాలి.
సరే సరే నీకు ఎలా నచ్చితే అలా చేద్దాం సరేనా.. నువ్వు మాత్రం ఎమోషనల్ అవ్వకు. అవని చీర కట్టుకున్న తరువాత విక్రమ్ జడ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు.
అబ్బా జడ మీ వల్ల కాదండి. ట్రై చేస్తున్నాను కదా ఎలా వచ్చినా వెయ్యినివి. ఒక ఫోర్ డేస్ వేసాను అనుకో.. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
ఇదేమన్నా నేర్చుకోలేనిదా.. ఎంతమంది హెయిర్ స్టైలిష్ లు అబ్బాయిలు ఉండడం లేదు అని కూర్చోబెట్టి మెల్లిగా చిక్కు తీసి వచ్చిన విధంగా జడ వేస్తాడు.
పాపిట్లో కుంకుమ పెట్టి పర్ఫెక్ట్ అంటాడు. సరే అని లేచి నిలబడుతుంటే.. వెయిట్ అని చెప్పి తలలో పువ్వులు కూడా పెడతాడు.
ఎందుకు నన్ను చీర లైట్ వెయిట్ కట్టుకోమన్నారు....
మీరు మాత్రం నన్ను హెవీగా రెడీ చేస్తున్నారు. నవ్వుతూ పువ్వులు ఎక్కువ కాదు బంగారం తక్కువే పెట్టుకో.
ఇలా రెడీ అవుతే కొంచెం ముద్దుగుమ్మ లాగా ఉంటావు. పద అని తీసుకువెళతాడు . అవని నార్మల్గా నడుస్తూ ఉంటే నువ్వు అంత స్పీడ్ గా ఎందుకు నడుస్తున్నావ్ మెల్లిగా నడువు అని కసురుకుంటాడు.
ఇప్పుడు నేను స్పీడ్ గా ఎక్కడ నడిచాను. రోజు నడిచినట్టే కదా.. ఆ స్పీడే తగ్గించమని.. ఆంటీ వాకింగ్ చేయమన్నారు గాని పరిగెత్తమనలేదు. స్లో అంటాడు.
విక్రమ్ ఏం చెప్పినా వినడు అని అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు.. మీరే కదా స్లోగా నడవమన్నారు.
ఇలా నడిస్తే సరిపోతుందా.. ఏమిటి వెటకారమా..కాదు మమకారం నచ్చిందా.. మరీ ఎక్కువ అవుతుంది కానీ కొంచెం స్పీడ్ పెంచు అని చెప్పి నాతోపాటు కలిసే అడుగులు వెయ్యి అని చేయి పట్టుకుంటాడు. సరే అని విక్రమ్ చేయి పట్టుకుని నడుస్తుంది.
విక్రమ్ ప్రేమ అవని పాట్లు??
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)