04-03-2026, 07:27 AM
Part - 128
అవని, లోపల బేబీ హెల్త్ అంతా బాగుంది. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏదైనా ప్రాబ్లమా అని కంగారు పడతాడు.
ప్రాబ్లం ఏమీ లేదు. లేత నెలలు కదా.. కొంచెం టెన్షన్ పడకుండా హెల్త్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాలి. ప్రొపెర్ డైట్ తీసుకోవాలి.
అవని.. నువ్వు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉండు. వాకింగ్ కంపల్సరీ చేయి. అలాగే ఒక యోగా ట్రయనర్ ని అరేంజ్ చెయ్ విక్రమ్.
తనతో రోజు యోగా చేయిపిస్తే డెలివరీ టైం లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే థాంక్యూ ఆంటీ అంటాడు. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ.. విక్రమ్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
చెప్పండి అంటీ.. నువ్వు ఎక్కువ కంగారు పడకు. నువ్వు కంగారుపడి అవని నీ టెన్షన్ పెట్టకు అర్థం అయిందా అంటుంది.
ఆంటీ అని చిరుకోపంగా పిలిస్తే...నిజమే చెబుతున్నాను విక్రమ్..ఆడవాళ్ళ బాడీలో జరిగే మార్పులు మీకు అర్థం కాక... నువ్వు కంగారు పడుతున్నావు.
బట్ అవని బాగుంది. ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇంట్లో ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లు చూసుకుంటారు.
నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే.. అవని టైం టు టైం ప్రాపర్ డైట్ తీసుకోవడం ప్లస్ మార్నింగ్ యోగా చేయడం. ఇవి రెండు మాత్రం కంపల్సరీ చేపించు అర్థమైందా...
ఓకే థాంక్యూ అని చెప్పి వెళదామా అంటాడు.. సరే అని థాంక్స్ చెప్పి అవని కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందా శ్రీవారు వాకింగ్ ఎంత ఇంపార్టెంటో..
ఆంటీ చెప్పాక నీకు ఛాన్స్ ఇస్తున్నాను లేకపోతే అసలు ఇచ్చేవాడిని కాదు. విక్రమ్ చేతిని తన చేతితో చుట్టేసి ఎందుకండీ అంత భయం.. నేను బాగానే ఉన్నాను.
ఏం బాగుండడమో ఏమో.. నిన్న ఎంత టెన్షన్ పడ్డామో.. ఇప్పటికి ఆ విషయం గుర్తుకు వస్తే చెమటలు పట్టేస్తున్నాయి.
ద గ్రేట్ బిజినెస్ టైకోన్ విక్రమ్ జై సింహ గారు ఇంత భయపడుతున్నారా... నేను ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ అయినా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటప్పటికి వీక్ అయిపోతాను. ముఖ్యంగా నీ విషయంలో...
విక్రమ్ ని డైవర్ట్ చేయడానికి పొట్ట మీద చేతులు వేసి ఆకలి అంటుంది..అవునా చాలాసేపు అయింది కదా బయలుదేరి రా అని కార్ లో కూర్చోబెట్టి లలిత ఇచ్చిన జ్యూస్ బాటిల్ ఇస్తాడు.
నాకు కారం కారంగా తినాలని ఉంది. నో ఫస్ట్ నువ్వు జ్యూస్ తాగు. ఇంటికి వెళ్ళాక చేయిపిస్తాను. అయ్యో శ్రీవారు మనం ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది కదా...
ఎందుకు... ఎందుకు అంటారు ఏమిటి.. మనం వెళ్ళేది 30 లో.. ఆ స్పీడ్ లో వెళ్ళేటప్పటికి లోపల బేబీ ఆకలితో కేర్ కేర్ అంటుందేమో...
బాగానే టీస్ చేస్తున్నావే.. ఆంటీ చెప్పారు కదా పరవాలేదు. ఎంతవరకు మాక్సిమం స్పీడ్ లో వెళ్ళాలో అంతవరకు వెళతాను అని కార్ స్టార్ చేస్తాడు.
ఇద్దరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. లోపలికి రాగానే అవనినీ చుట్టుముట్టి డాక్టర్ ఏమన్నారు అంతా బాగానే ఉందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూఉంటారు.
విక్రమ్ లోపలికి వచ్చి అరే ముందు కూర్చొనివ్వండి అని అందరినీ జరిపి సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు అడగండి. అవని విక్రమ్ ని చూస్తూ ఆంటీ ఏం చెప్పారో కూడా మీరే చెప్పండి.
అందరూ విక్రమ్ వైపు చూస్తే... సురభి చెప్పిన జాగ్రత్తలు అన్నీ చెబితే.. లలిత మాధవి ఇద్దరు భుజాల మీద వేసుకొని మేము చూసుకుంటాము.
నువ్వు టెన్షన్ పడకుండా ఆఫీసుకు వెళ్ళిపో.. ఎవ్రీ మినిట్ నీకు అప్డేట్స్ ఇస్తాము. లేదమ్మా ముఖ్యమైన వర్కు ఉన్నప్పుడు వెళతాను.
మీ ఇద్దరిని అవని మాయ చేసేస్తుంది. డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఆంటీ పర్వాలేదు అని చెప్పిన తర్వాత అప్పుడు వెళతాను.
విక్రమ్ ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే మార్చాడు అని అందరికీ తెలుసు. అందుకే అందరూ సరే నీ ఇష్టం అంటారు.
ధనుంజయ్ కూతురు కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. సత్యవతి వచ్చి ఒరేయ్ మేము చేస్తాము నువ్వు తప్పుకో అంటే లేదమ్మా నా కూతురు కోసం నేనే ప్రిపేర్ చేస్తాను అని మొత్తం అన్ని నీట్ గా చేసి ప్యాక్ చేస్తాడు.
అవనికి ఇంకా ఏమి ఇష్టము అని అడిగితే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. ఆ నవ్వుకి అర్థం తెలిసిన ధనుంజయ్ ఒక నిమిషం సైలెంట్ అయిపోయి అప్పుడు తెలియకపోతే ఏమైంది లే అమ్మ.
ఇప్పుడు వెళతాము కదా అన్ని తెలుసుకుని చేసి పంపిద్దాము. నీ కూతురు తీసుకుంటుందనేనా.. నా ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత భగవంతుడు దయ అని మొత్తం చేసి బయలుదేరదామా అంటాడు.
ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యిరా.. ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని రూమ్ కి వెళ్లి తొందరగా రెడీ అయి వస్తాడు.
వెళదామా అంటే శేషగిరి కొడుకుని చూసి నవ్వుతూ కూతురి దగ్గరికి వెళ్లడానికి ఎంత తొందరగా ఉన్నావు రా.. మరి ఉండదా ఏమిటి? అసలే కడుపుతో ఉంది.
ఈరోజు హాస్పిటల్ కి కూడా వెళ్లి ఉంటారు. డాక్టర్ ఏం చెప్పారు ఏమిటో తెలియదు కదా.. సరే సరే పదండి అని ముగ్గురు విక్రమ్ ఇంటికి వెళతారు.
వీళ్ళ ముగ్గురు వెళ్లేటప్పటికి అందరూ అవనినీ చుట్టుముట్టి హాస్పిటల్ విషయాలు అడుగుతూ ఉంటారు. విక్రమ్ చెప్పింది ప్రతిదీ ధనుంజయ్ వింటాడు.
వెంటనే బెస్ట్ యోగ ట్రైనర్ ఎవరున్నారో వెతకాలి అని పిఏ కి మెసేజ్ చేస్తాడు. సత్యవతి మనవరాల దగ్గరికి వచ్చి బాగున్నావా అమ్మ అంటుంది.
లలిత.. పెద్దమ్మ రండి అని లేచి అవని పక్కన ప్లేసు చూపిస్తారు. సత్యవతి కూర్చుని ఇందిరా గారికి నమస్కారం చేస్తారు.
ఇందిరా కూడా నమస్కారం చేసి చిన్న నవ్వు నవ్వుతారు. అందరి ముఖాలలో వెలుగు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది.
చెయ్యి పట్టుకుని డాక్టర్ ఏమన్నారమ్మా అంటే అంతా బాగుందన్నారు అని సింపుల్గా చెబుతుంది. కూతురు తన వైపు చూస్తుందేమో అన్న ఆశతో ధనుంజయ్ అవని వైపే చూస్తూ ఉంటాడు.
కళ్యాణ్ ధనుంజయ్ ని కదిపి ఇంకేంటి విశేషాలు అని అడిగితే.. ఏమన్నాయండి మామూలే అని బలవంతంగా నవ్వుతాడు.
సత్యవతి వెంటనే డ్రై ఫ్రూట్స్ బాక్స్ తీసుకుని నోరు తీపి చేసుకోమ్మ అని నోటి దగ్గర పెడుతుంది. ఇవి... అని సత్యవైపు వైపు చూస్తుంది.
ఇవా మీ నాన్న స్వయంగా తన చేతులతో చేశాడు. ఎప్పుడు కిచెన్ లోకి రాని నా కొడుకుకు తన కూతురు కడుపుతో ఉందని ఎంతో ప్రేమతో చేశాడు తినమ్మా అని నోటి దగ్గరకి పెడుతుంది.
అవని వెంటనే సత్యవతి గారి చేతిని పట్టుకొని ఆపేస్తుంది. ఏమైందమ్మా.. క్షమించండి నానమ్మ అని తలదించుకుంటుంది.
ఆ మాటకి ధనుంజయ్ కి నీరసం వస్తుంది. మనవరాలని ఎలాగైనా ఒప్పించాలని అదేంటమ్మా అలా అంటావు మొట్టమొదటిసారి పుట్టింటి నుంచి స్వీట్ తీసుకుని వస్తే తినకపోతే ఎలా..
మీకు అంతకు ముందు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. నాకు పుట్టిల్లు అంటూ ఏమీ లేదు. నాకు పుట్టినిల్లు అయినా మెట్టినిల్లు అయినా అంతా ఈ ఇల్లే..
సరే అలాగే.. నువ్వు అనుకున్నట్టుగానే.. ఏదో ఇంటికి వచ్చిన చుట్టాలు నీకోసం తెచ్చారు అనుకోని తిను తల్లి అంటుంది.
ఈ టైంలో బయట వాళ్ళని ఎవరిని నమ్మలేను . ఆ మాటకి సత్యవతి మాట తడబడుతూ ఏమంటున్నావు అవని.
మీరు నన్ను ఎలాగ అనుకున్నా పరవాలేదు. నాకు ఇప్పుడు నా కడుపులోని బిడ్డ చాలా ముఖ్యం. ఇందులో ఏమీ కలిపారో ఏమిటో తెలియదు కదా..
తిని బిడ్డకు ఏదైనా హాని జరిగితే.. సత్యవతి చేతిలో ఉన్న లడ్డు జారిపోతుంది. ధనుంజయ్ మాటరాని వాడిలాగా కూతురు వైపే చూస్తూ ఉంటాడు.
ఈ నిమిషమే ప్రాణం పోతే బాగుండును అనిపిస్తుంది. కన్నీళ్ళతో కూతురినే చూస్తూ ఉంటాడు. శేషగిరి కి కూడా బాధగా అనిపించి ఎందుకు అలా చేస్తాడమ్మా.
వాడు నీకు తండ్రి. తెలియక తప్పు చేశాడు. దానికి పశ్చాత్తాపంతో రోజు కుమిలిపోతున్నాడు. మీ అబ్బాయి కనుక ఏది జరిగిన కడుపులో పెట్టుకోగలుగుతున్నారు.
అలాగే రేపు పుట్టబోయే బిడ్డ గురించి కూడా నేను జాగ్రత్తగా ఉండాలి కదా అంతేగాని మిమ్మల్ని ఎవ్వరిని నేను తప్పు పట్టడం లేదు.
నీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి తాతయ్య అంటుంది ఆ మాటకి ఏమి మాట్లాడలేకపోతారు. ఆఖరి ప్రయత్నంగా సత్యవతి అది కాదమ్మా.. ఇవి ఆరోగ్యానికి మంచిది బలం.
పోనీ నేను తిని చూపించనా అని నోటి దగ్గర పెట్టుకుంటుంది. వెంటనే ఆ చేతిని పట్టుకుని ఆపేసి ప్లీజ్ నానమ్మ ఇలాంటి టైంలో ఎవరు ప్రయోగాలు చేయవద్దు.
మీకు ఏదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నీకు ఎందుకు తల్లి అంత భయం. ఆ సార్, మేడం గురించి నాకు బాగా తెలుసు.
భార్య, కూతుర్ని రక్షించుకోవడానికి.. వాళ్ల కోసం ఎంతవరకు అయినా చేయగలరు. ఏమైనా చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకో నానమ్మ.
సత్యవతి కూడా ఇంకా కామ్ అయిపోతుంది. వాతావరణమంతా వేడివేడిగా ఉంది అని వినయ్ తేలిక చేయడానికి...
అమ్మ అని పిలుస్తాడు. ఏంట్రా అని విసుగ్గా అంటే.. మనకి వేడిగా అనిపిస్తే.. ఫ్యాన్స్ వేసుకుంటాం ఏసీలు వేసుకుంటాం.
మరి లోపల బేబీ ఏం చేస్తుందమ్మా వేడిగా అనిపిస్తే ఎలా..
ఆ మాటకి అందరూ వినయ్ వైపు చూస్తారు. అదేం ప్రశ్న రా అని కళ్యాణ్ అడిగితే..
ఏం నాన్న డౌట్లు రాకూడదా? చిన్నపిల్లోడిని అడుగుతున్నాను తీర్చాలి కదా... నివి వినయ్ దగ్గరకు వచ్చి ఒరేయ్ చిన్నన్నయ్య.. ఇలాంటి గొప్ప గొప్ప డౌట్ లన్ని రాజ్ కి రావాలి.
అలాంటిది నీకు వచ్చింది ఏంట్రా.. సావాస దోషమా.. రాజ్ కోపంగా ఏది జరిగిన వచ్చి నా దగ్గర ఆగితే గాని నీకు ప్రశాంతంగా ఉండదా.
అయ్యో ఇప్పుడు నేను ఏమన్నానండి. మీలాంటి మహానుభావులకే కదా ఇంత తెలివైన డౌట్స్ వస్తాయి. అలాంటిది అన్నయ్యకు వచ్చేటప్పటికి అడిగాను అది కూడా నా తప్ప అండి అని అమాయకంగా ఫేస్ పెడితే..
వెంటనే పార్ధు లేదమ్మా నీది అసలు తప్పే కాదు. అది అర్థం చేసుకోలేని నా కొడుకుది తప్పు.
ఏంటి రాజ్ నీ పరిస్థితి ??
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)