Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - నియోగ ధర్మం
ఉలూకుడు
[Image: U.jpg]

                                               
రచన: Ch. ప్రతాప్ 
మహాభారతం కేవలం ఒక యుద్ధకథ కాదు; అది మానవ హృదయాలలో నిత్యం సాగుతున్న ధర్మఅధర్మ సంగ్రామానికి ప్రతిరూపం. మహాగ్రంథంలో మహావీరుల మధ్య మెరిసిన తేజస్సు ఎంత గొప్పదో, నీడల్లో నడిచిన చిన్న పాత్రల సందేశం కూడా అంతే లోతైనది. అటువంటి పాత్రల్లో ఒకడు ఉలూకుడు.



ఉలూకుడుగాంధార రాజు శకుని కుమారుడు. శకుని ఎవరు? అసూయ, పగ, కుతంత్రం, అహంకారం నాలుగు విషబీజాలు గుండెల్లో నాటుకున్న అధర్మమూర్తి. అలాంటి తండ్రి గర్భంలో పుట్టిన ఉలూకుడు కూడా అదే మార్గంలో నడవడం విధివశంగా మారింది. ఇక్కడే ఒక సూక్ష్మ సత్యం వెల్లడవుతుందితండ్రి సంస్కారం సంతానంలో ఎలా ప్రతిఫలిస్తుందో మహాభారతం ఉలూకుడి ద్వారా మనకు చూపిస్తుంది.



పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిశాక, ధర్మరాజు ధర్మమార్గం విడిచి యుద్ధానికెళ్లకూడదనే ఉద్దేశంతో శ్రీకృష్ణుణ్ణి దుర్యోధనుని వద్దకు పంపాడు. శాంతి మార్గమే ధర్మ మార్గమని కృష్ణుడు ప్రపంచానికి చూపించ దలచుకున్నాడు. కానీ దుర్యోధనుడి అహంకారం శాంతి సందేశాన్ని తాకి చెదరగొట్టింది. సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్న వాక్యం, అహంకారానికి పరాకాష్ట.



అహంకారాన్ని పాండవుల వద్దకు చాటిచెప్పేందుకు ఉలూకుడిని దుర్యోధనుడు రాయబారిగా పంపాడు. ఉలూకుడు పాండవ శిబిరానికి చేరి, ధర్మరాజు, భీమార్జునులు, ద్రౌపది, శ్రీకృష్ణుని సమక్షంలో అవమానపు మాటలతో కూడిన సందేశాన్ని వినిపించాడు. ఘట్టం మనకు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుందిఅధర్మపు వ్యక్తి నోటి నుంచి ధర్మవాక్యం రాదు; అతని మాటల్లో విషమే పులుముకుని ఉంటుంది.



ఉలూకుడి మాటలు పాండవుల గుండెల్లో అగ్నిపర్వతంలా పేలాయి. అయితే, అక్కడే శ్రీకృష్ణుడి తత్త్వదర్శనం వెలుగులోకి వచ్చింది. ఆగ్రహంతో కాదు, ఆత్మజ్ఞానంతో ఆయన ప్రతివాక్యం వెలువడింది. అహంకారమే పతనానికి మూలం; దురాశే విధ్వంసానికి ద్వారం అన్న అంతర్లీన సందేశం శ్రీకృష్ణుని వాక్యాల్లో మెరిసింది. భీముడు ప్రతీకార ప్రతిజ్ఞ చేసాడు; కానీ ప్రతిజ్ఞ కూడా ధర్మ పరిరక్షణ కోసమే అన్న భావన ఇక్కడ స్పష్టమవుతుంది.



ఉలూకుడు తిరిగి వెళ్లి సమాధానాన్ని దుర్యోధనునికి తెలియజేశాడు. అప్పుడు మూసివేయబడినది కేవలం రాయబార ద్వారం కాదు శాంతి మార్గానికి కూడా తెరపడింది. అక్కడినుంచి ధర్మచక్రం యుద్ధయంత్రంగా మారింది. ఇది మనకు చెప్పేది ఏమిటంటే శాంతికి అవకాశమిచ్చిన ప్రతిసారి దాన్ని త్రోసిపుచ్చినవాడు తన విధ్వంసాన్ని తానే ఆహ్వానించుకున్నట్టే.



కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉలూకుడు కూడా ఆయుధం ధరించాడు. శకుని కుమారుడిగా కౌరవ పక్షాన నిలబడి పోరాడాడు. నకులుని కుమారుడైన శతానీకుడితో అతడు ఘోరంగా యుద్ధం చేశాడు. వీరత్వం ప్రదర్శించినప్పటికీ, అధర్మ పక్షాన నిలిచిన శక్తి ఎంత గొప్పదైనా, చివరికి పతనం తప్పదన్న నిత్యసత్యం ప్రకారం ఉలూకుడికీ విషాదాంతమే ఎదురైంది.



ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక బోధ దాగి ఉంది. ఉలూకుడు దుష్టుడిగా పుట్టలేదేమో; కానీ దుష్టత్వాన్ని ఆదర్శంగా తీసుకున్న వాతావరణంలో పెరిగాడు. తండ్రి శకుని మార్గమే తన మార్గమని నమ్మాడు. ఫలితంగా, తన స్వంత విచక్షణను వినియోగించుకోలేకపోయాడు. మన జీవితాల్లోనూ ఇది ఒక హెచ్చరిక పెద్దల మార్గం పేరుతో అధర్మాన్ని అనుసరించటం కూడా పాపమే.



మహాభారతం ఉలూకుడి ద్వారా మనకు ఒక నిగూఢ సందేశాన్ని అందిస్తుంది ధర్మం పక్షాన నిలబడటం ఒక ఎంపిక; అధర్మం పక్షాన నిలబడటం కూడా ఒక ఎంపికే. అయితే రెండు మార్గాల ఫలితాలు మాత్రం ఒక్కటే కావు. ఉలూకుడు అధర్మాన్ని ఎన్నుకున్నాడు; అందుకే అతని పేరు యోధుడిగా కాదు, అధర్మపు సందేశ వాహకుడిగా చరిత్రలో నిలిచిపోయింది.



మనందరిలోనూ ఒక ఉలూకుడు ఉన్నాడు. ఎవరి మాటనో గుడ్డిగా అనుసరించి, సత్యఅసత్య విచక్షణను విస్మరించే మనసే ఉలూకుడు. ఉలూకుడిని జయించిన రోజే మనలో కృష్ణతత్త్వం జాగృతమవుతుంది. అదే మహాభారతం ఇచ్చిన పరమార్థం. 
సమాప్తం
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - గోదాదేవి - by k3vv3 - 03-03-2026, 05:44 PM



Users browsing this thread: 1 Guest(s)