28-02-2026, 08:06 AM
Part - 120
శిల్ప పెళ్లయిపోయింది అన్న వార్త వినగానే భార్గవి బిగుసుకుపోతుంది. చలనం లేని బొమ్మలాగా చూస్తూ ఉండిపోతుంది. భార్గవి.. భార్గవి అని పిలిచిన పలకదు.
కళ్ళ ముందు చిటికెలు వేసిన స్పృహలోకి రాదు. ధనుంజయ్ కి విసుగు వచ్చి వాటర్ బాటిల్ లోని వాటర్ తీసుకొని తలపై నుంచి పోస్తాడు.
వర్షం.. వర్షం... అని అరుస్తుంది. ఇప్పుడు స్పృహలోకి వచ్చావా.. అది వర్షం కాదులే. ఎవరైనా నీళ్ళు ఇలా పోస్తారా అని కోపంగా అరుస్తుంది.
నా ముందు నోరు లేచింది అంటే మాట్లాడటానికి నాలిక లేకుండా కట్ చేసేస్తాను. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోతే నిన్ను ఇంకా ఎలా పిలవాలి.
చెయ్యి పట్టుకుని కదపవచ్చు. చి చి నీలాంటి ఆడదాన్ని తాకాలి అంటే అసహ్యంగా ఉంటుంది. ఇలాంటి ఆడదానితో ఎలా కాపురం చేసారో.. నువ్వు సూర్పణక అని తెలియక..
మిమ్మల్ని అంటే... ఇంకా ఆపేయ్ నీతో మాట్లాడటమే ఇష్టం లేదు అంటే మళ్ళీ గొడవ పడడమా ఇంపాసిబుల్ అంటాడు.
శిల్ప కి ఎవరితో పెళ్లి అయిందో తెలుసుకోవా... గొడవలో నుంచి బయటకు వచ్చి ఎవరితో అన్ని టెన్షన్ గా అడుగుతుంది.
నీకు బాగా ఇష్టమైన వాళ్లతోనే. నాకు ఇష్టమైన వాళ్ళ అని ఆలోచిస్తుంది. ఏంటి నీ పదునైన బుర్రకి తట్టలేదా... నిజంగానే తట్టడం లేదండి. ఎవరు చెప్పండి ప్లీజ్..
స్వీట్ తిను చెబుతాను. స్వీట్ తింటే గాని చెప్పాడు అని అర్థమయ్యి కష్టంగా స్వీటు తింటుంది. ఇప్పుడు చెప్పండి అంటే వాటర్ తాగుతావా అంటాడు.
నాకు వాటర్ అవసరం లేదు చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకెవరు మీ ముద్దుల మేనల్లుడు ఉదయ్ తో అంటాడు.
ఉదయ్ తో అనగానే చాలా కోపం వచ్చేస్తుంది. మీకు అంతకన్నా గొప్పవాడు దొరకలేదా.. వాడే ఒక వేస్ట్ గాడు. అలాంటి వాడితో నా బంగారు తల్లి పెళ్లి చేస్తారా.
అసలు మీకు మనసు ఎలా వచ్చింది. కన్న తండ్రి అయ్యి మీరు అని చొక్కా పట్టుకోపోతుంది. ఏయ్ దూరంగా ఉండు నన్ను టచ్ చేసావంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు.
ఇంకేం మర్యాద. నన్ను జైల్లో పెట్టించారు. నా కూతురి జీవితాన్ని నాశనం చేశారు. ఇంకా మీకు మర్యాద ఇవ్వాలా.. మరి నువ్వు అవని విషయంలో చేసింది ఏమిటి..
అవని అంటే నాకు సవతి కూతురు కాబట్టి నేను సాధించవచ్చు కానీ మీకు శిల్ప కన్న కూతురే కదా.. మీరు ఎలా చెయ్యగలిగారు.
సవతి కూతురు అని విరక్తిగా నవ్వి.. నీకు సవతి కూతురేమో గానీ నాకు కాదు కదా అంటాడు. అదే నేను చెబుతున్నాను.
ఇద్దరూ మీ కూతుర్లే కదా ఎందుకంత పక్షపాతం. పక్షపాతం చూపించింది నేను కాదు.. నువ్వు చూపించి నీ కూతురి జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు.
నేను సరైన దారిలో పెడుతున్నాను అంటాడు. ఏమిటి ఆ పోరంబోకుడికి ఇచ్చి పెళ్లి చేయడమా సరైన దారిలో పెట్టడం.
మరి నీ పెంపకంలో పెరిగిన నీ కూతురు ఏమిటి అది ఇంకా పెద్ద పోరంబోకు కాదా అంటాడు. ఏవండీ అని గట్టిగా అరుస్తుంది.
నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి. ఇంతకీ నీ బంగారు తల్లి సంసారాన్ని చూస్తావా అంటాడు. ఆ మాటకి ఇంకా ఏమి చేశారు.
చూడు.. చూస్తే నీకే తెలుస్తుంది కదా అని ఫోన్లో వీడియో ఆన్ చేసి చూపిస్తాడు. అందులో పొద్దుటే లెగడం దగ్గర నుంచి పొలం పనులు చేయడం. చేతులు మంటపెట్టడం రుద్దుకోవడం.
ఉదయ్ దగ్గరుండి అన్నం తినిపించడం అన్ని చూసి కంటతడి పెట్టుకుంటుంది. నా చిట్టి తల్లికి ఎన్ని కష్టాలు వచ్చాయి.
మీ వల్లనే అది జైలుకు వెళ్ళింది. ఇప్పుడు ఆ ఎదమని పెళ్లి చేసుకుంది. మరి ఆ ఎదవకే నా బంగారు తల్లిని బలి చేయాలి అనుకున్నావు. అప్పుడు గుర్తుకు రాలేదా వాడొక పోరంబోకు. వేస్ట్ గాడు అని.
అందుకని మీరు ఇప్పుడు శిల్ప జీవితంతో ఆడుకుంటున్నారా.. ఎవరు ఎవరితో ఆడుకున్నారు. ఆ మాట అంటానికైనా కొంచెం అయినా మనస్సాక్షి అన్నది ఉండాలి.
నీ కూతురికి పెళ్లి అవుతుందనే నువ్వు అనుకుంటున్నావా... పోనీ భవిష్యత్తు అంటూ ఉందని అనుకుంటున్నావా..
మీరు శిల్పని జైల్లో పెట్టించకుండా.. విక్రమ్ కి దూరం చేయకుండా ఉండి ఉంటే అది మహారాణి లాగా ఉండేది. మీ కూతురు సంతోషం కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు.
నేను కాదే నువ్వే నాశనం చేసావు. ఆరోజు పెళ్లి పెట్టుకుని కూడా అది బయటకు వెళితే కవర్ చేసావు కానీ ఇలా వెళ్ళింది అన్న ఒక్క మాట చెప్పావా.
చెప్పి ఉంటే ఏమో ఏమి జరిగేదో అంటాడు. ఏం జరిగేది వెళ్లి దాన్ని తీసుకొద్దురా.. తీసుకువచ్చే వాడినేమో.. రెండు పీకి అయినా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టే వాడిని ఏమో...
తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించే వాడిని ఏమో అంటాడు. తండ్రిగా అని వెటకారంగా నవ్వి.... ఎంత బాగా నిర్వర్తించావో చూస్తానే ఉన్నాను కదా..
అప్పుడు అవనినీ పట్టించుకోలేదు. అల్లుడు డబ్బున్న వాడు.. సమాజంలో మంచి పలుకుబడి ఉన్నవాడు అని అర్థమై.. ఇప్పుడు అవని నా కూతురు.. నా ప్రాణం అని చెబుతున్నావు.
శిల్పాలో నీకు ఇప్పుడు తప్పు కనిపించేటప్పటికి.
దగ్గరికి తీసుకుంటే అల్లుడు ఎక్కడ అసహ్యించుకుంటాడో.. నీ పరువు ఎక్కడ పోతుందో అని శిల్ప ని దూరం పెడుతున్నావు.
నీ గురించి నాకు తెలవదా అంటుంది. భార్గవి అన్నమాటకి ధనుంజయ్ కు ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది. భార్గవి ఇలా మాట్లాడినప్పుడు అవని అనుకోవడంలో తప్పులేదు కదా అనుకుని...
అవునే నిజంగానే తండ్రిగా నా బాధ్యతని మరిచిపోయాను. అవని విషయంలో నేను ఫెయిల్ అయ్యాను ఏమోగానీ శిల్ప విషయంలో ఫెయిల్ అవ్వను.
గట్టిగా నవ్వుతూ ఫెయిల్ అవ్వకపోవడం ఏంటి ఎప్పుడో ఫెయిల్ అయ్యారు కదా అని కళ్ళు మూతలుపడుతూ ఉంటాయి.
ఇదేమిటి మగతగా ఉంది అంటే.. ఆ మాటకి ధనుంజయ్ నవ్వుతూ శిల్ప పెళ్లి విషయం తెలియగానే స్పృహ తప్పి పడిపోతావ్ అనుకున్నాను. పరవాలేదు ఇంతసేపు ఆగావంటే గడ్డిప్రాణానివే పదా అని కార్ స్టార్ట్ చేస్తాడు. ఏం కలిపారు మీరు అని మాట్లాడుతూనే పడుకుండిపోతుంది.
ధనుంజయ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు గానీ భార్గవి అన్న మాటే మెదులుతూ ఉంటుంది. విక్రమ్ స్టేటస్ చూసి అవనినీ నా కూతురు అనుకుంటున్నాను అని అవిని ఆలోచిస్తే.. అన్న ఊహ రాగానే గుండెల్లో సన్నగా నెప్పి మొదలవుతుంది.
నేను ఎంత మూర్ఖుడిని. అందరికన్నా ఎక్కువ ప్రాణం పెట్టుకున్న భార్య ఎలా చనిపోయిందో తెలియదు. ఆ భార్య ప్రతిరూపమైన నా కూతురు ఎలాంటి కష్టాలు పడిందో తెలియదు.
సంపాదించి ఏం చేసినట్టు నేను. పోనీ ఇది సరిగ్గా లేకపోయినా శిల్ప నడవడిక బాగున్న కొంతలో కొంతైనా మనశాంతి ఉండేది.
అది ఇంకా బరితెగించింది. ఎవరికోసం నేను బతుకుతున్నానో నాకే తెలియకుండా చేశారు. ఈ జన్మలో నాకు మనశ్శాంతి దొరుకుతుందా..
అవని నన్ను తండ్రిగా ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలకి అంత ఉండదు. కారే కన్నీరుకి ఆవిరి ఉండదు.
జైసింహ మాన్షన్...
షాపింగ్ కి వెళ్ళిన బ్యాచ్ అంతా ఇంటికి చేరుతారు. జెంట్స్ మొత్తం అలసిపోయి సోఫాలో కూలపడితే... లేడీస్ మాత్రం బూస్ట్ తాగినంత ఎనర్జీతో చిందులు తొక్కుకుంటూ వస్తారు.
లేడీస్ మొఖాలు వెలిగిపోతూ ఉంటాయి. వాళ్ల అలసట చూసి అవని అందరికీ స్నాక్స్ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. అవి చూడగానే అందరూ థాంక్స్ బంగారం అంటే చిన్న చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
జెంట్స్ బ్యాచ్ ని హాల్లోనే వదిలేసి లేడీస్ బ్యాచ్ అంతా గదిలోకి వెళ్ళుతూ అవనినీ లాక్కుని వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ కొన్నవన్నీ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తూ పెట్టుకొని మరీ మురిసిపోతూ ఉంటారు.
విక్రమ్, భరత్ ఆఫీస్ నుంచి వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని అయిపోయిందా షాపింగ్. అయ్యిందిరా అని నీరసంగా అంటారు.
ఏమైంది అంత నీరసంగా ఉన్నారు. ఒక్క లేడీని తీసుకుని షాపింగ్ కి వెళితేనే గంటలు గంటలు పడుతుంది. అలాంటిది వీళ్ళందర్నీ తీసుకునే వెళ్ళితే...
పాపం షాప్ అతని పరిస్థితి ఏమిటి.. ఏం జరిగిందేంటి అని విక్రమ్ నవ్వుతాడు. ఏం జరిగిందని అడుగుతావేంటి బావ. అసలు మీ చెల్లికి ఇంత షాపింగ్ పిచ్చేంటి..
ఆ డిజైన్ లో కూడా ఎన్ని వంకలు పెట్టిందో తెలుసా.. అయ్యబాబోయ్.. కష్టమైసేడ్ చేయించుకోవాలి. అది కూడా తన సెల్ఫ్ డ్రాయింగ్ వేసి .
విక్రమ్ వెంటనే అవునా.. మా చెల్లెలో అంత టాలెంట్ ఉందా... రేయ్.. భరత్.. రేపటి నుంచి నివితో జువెలరీ డిజైన్స్ డ్రా చేయించు.
మన జ్యువెలరీ మేకింగ్ దాంట్లో ఇంప్లిమెంట్ చేద్దాము. అలాగే బావ అంటాడు. ఒరేయ్ నేను ఇంత ఎమోషనల్ గా చెబితే అందులో మీ చెల్లి టాలెంట్ ని వెతుకుతున్నావా..
నువ్వే కదరా చెప్పింది... నా బాధ నీకు అర్థం కావడం లేదు కానీ నీ చెల్లి టాలెంట్ కి మురిసిపోతున్నావా.. దుర్మార్గుడా.. గట్టిగా నవ్వుతూ బాగా కాలినట్టు ఉంది కదా మా తమ్ముడికి అని భరత్ అంటాడు.
కాలడం కాదురా... అసలు ముందు మా నాన్నని అనాలి అంటాడు. ఆ మాటకి స్నాక్స్ తింటున్న పార్ధు గారు నేనేం చేశాను రా...
చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతారా? నిన్న మీరు ఏసినా నిప్పు ఈరోజు మంటయి నన్ను ఎంత తగులుకుందో మీకేం తెలుసు అనే బేర్ మంటాడు.
ఒరేయ్ ఆడపిల్లలాగా ఏడుస్తావ్ ఎందుకు.. వాళ్లెక్కడ ఏడుస్తున్నారు.. మనతో ఏడిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది బావ అని వినయ్ వచ్చి పక్కన కూర్చుని అడుగుతాడు.
ఇంకా నువ్వు రాలేదేంట అనుకున్నాను చిన్న బామ్మర్ది వచ్చావా...
జువెలరీ షాప్ లో రాజ్ పడిన ఇబ్బందులు గుర్తొచ్చి మిగిలిన జెంట్స్ అందరూ పొట్ట పట్టుకుని మరి నవ్వుతారు.
ఎందుకు నాన్న మీరు అలా నవ్వుతున్నారు అని వినయ్ అడిగితే.. నేను చెప్పలేను రా అది తలుచుకుంటుంటే ఇప్పటికి నవ్వు ఆగడం లేదు. చూడు కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి.
అబ్బా మీరు చెప్పిన నవ్వండి లేదా నవ్వైనా చెప్పండి అంతేకానీ చెప్పలేము అంటారు.. చెప్పమని అంటారు. ఇలాగైతే మాకు ఎలా తెలుస్తుంది నాన్న. అక్కడ ఏం జరిగిందో అని ఆత్రం ఆగలేక ముందుకు వంగుని మరి అడుగుతాడు.
రాజ్ పరిస్థితి??
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)