Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 101


వసుంధర వాళ్ళని కాపాడిన అభీర్ ని తన కాళ్లతో పట్టుకుని అడవి దగ్గరికి తీసుకు వెళుతూ కింద కార్లో రాహుల్ కనిపించడంతో కారు ఎదురుగా అభీర్ ని నిలబెట్టాడు సింబా.

************

కార్ లో ఫాస్ట్గా వెళుతూ ఎదురుగా రక్తంతో తడిసి కత్తి పట్టుకుని నుంచున్న అభీర్ కనిపించడంతో సడన్ బ్రేక్ వేసి కంగారుగా చూస్తూ తన పక్కన ఉన్న మనిషిని వైపు చూసి "వాడిని చంపేయ్!" అని చెప్పాడు రాహుల్.

ఆ మాట విని కారు దిగి కత్తి పట్టుకుని అభీర్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ వ్యక్తి.

రాహుల్ వైపు కోపంగా చూస్తూ తన మీదకు వస్తున్న వాడిని ఒక్క చేత్తో ఎత్తి నేలకేసి కొట్టి దూరంగా గిరాటు వేసి ఒక్క అడుగు ముందుకు వేశాడు అభీర్.

అది చూసి భయంతో కారు దిగి బ్యాక్ సీట్ లో ఉన్న నీలమ్, రోషిణి కట్లు విప్పి అభీర్ వైపు చూసి "నన్ను వదిలేయ్ కనిపించకుండా పారిపోతాను." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు రాహుల్.

కార్ దిగి ఎదురుగా అభీర్ కనిపించడంతో రోషిణి ని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా పట్టుకుని "అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు?" అని ఏడుస్తూ అడిగింది నీలమ్.

నీలమ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి "ఏడవకు అందరూ బానే ఉన్నారు . పాపని ఒకసారి అటువైపు తిప్పు!" అని చెప్పి అక్కడి నుంచి పరుగెడుతున్న రాహుల్ ని చూసి పరుగున వెళ్లి తల నరికేశాడు అభీర్.

రాహుల్ తల ఎగిరి వచ్చి తన కాళ్ల దగ్గర పడడంతో ఆవేశంగా చూస్తూ కన్నీళ్లు తుడుచుకుని వెళ్లి కార్ లో కూర్చుంది నీలమ్.

కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లోకి ఎక్కుతూ సింబా వైపు చూసి "అడవిలో ప్రతి జీవిని యుద్ధానికి సిద్ధం చెయ్ 12 ఏళ్ల పగ తీరబోతుంది." అని చెప్పి కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా వెళ్ళాడు అభీర్.

*************

అడవిలో సెక్యూరిటీతో వస్తున్న ముకుల్ వాళ్ళని చూసి "తాతయ్య వాళ్ళు వచ్చేసారు." అని సంతోషంగా దగ్గరికి వెళ్లాడు ప్రమోద్.

తన కొడుకుని చూసి "బానే ఉన్నావు కదా!" అని ఊపిరి పీల్చుకున్నాడు సుభాష్.

అక్కడికి వస్తు అడవిలో "జంతువుల్ని దాటుకుని స్పీడ్ గానే వచ్చేసారు." అని అడిగాడు నిర్మల్.

"మీరు కూడా ఈ వాచెస్ పెట్టుకోండి జంతువులు మీ దగ్గరికి కూడా రావు." అని చెప్పింది అర్ణ.

"అవును! ఈ టెక్నిక్ నా కూతురే కనిపెట్టింది. మేము నడిచి వస్తుంటే పెద్దపులి కనిపించింది. కానీ దాని దారిన అది పోయింది మా దగ్గరికి రాలేదు." అని సంతోషంగా చెప్పాడు రఘురామ్.

"సరే! ఇప్పుడు  మాట్లాడుకునే టైం కాదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి." అని కంగారుగా చుట్టూ చూస్తూ చెప్పాడు మోహిత్.

"టెన్షన్ పడకు అభీర్ మనుషులు మన హ్యాండ్ ఓవర్  లోనే ఉన్నారు." అని కట్టేసి ఉన్న సోము వాళ్ళని చూపించాడు నిర్మల్.

"ఇక్కడ గట్టిగా ఉంటే పదిమంది లేరు. నేను చూసినప్పుడు ఆ గుహలో నుంచి చాలామంది అడివిలోకి వచ్చారు." అని చెప్పాడు విష్ణు.

లగేజ్ దగ్గర ఉన్న కేశవ్ వాళ్ళని చూసి "ఈ అడవి లోపల దారి తెలిసిన ప్రతి ఒక్కడు అభీర్ మనిషే. మనవాళ్లని తప్పితే ఎవరిని నమ్మకూడదు." అని చెప్పాడు అభిజిత్.

"మీరు టెన్షన్ పడకండి సాబ్!" అని తన మనుషులని పిలిచి కేశవ్ వాళ్ళ వైపు చూపించి "వాళ్ళని కుడా కాళ్ళు, చేతులు కూడా కట్టి ఒక పక్కన పడేయండి ఎగస్ట్రాలు చేస్తే కాల్చిపడేయండి." అని చెప్పాడు సలీమ్.

కోపంగా చూస్తున్న కేశవ్ వైపు చూసి 'సైలెంట్ గా ఉండండి.' అని సైగ చేశాడు అరుల్.

అక్కడ ఉన్న వాళ్ళందరినీ కట్టిన తర్వాత తన చేతిలో ఉన్న గన్ ని గాలిలోకి షూట్ చేస్తూ "అభీర్ మనుషులు ఎవరు ఉన్నారో రెండు నిమిషాలలో రావాలి లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు." అని చెప్పాడు ఖాదీర్.

అంతలో ఆకాశంలో సింబా అరుపు వినిపించి గుడ్డు తో కలిసి అక్కడికి వస్తూ "తొందరపడకండి దొర జంతువులు బెదిరిపోతాయి." అని చెప్పాడు లింగు.

"ఓరి బాబోయ్.. వీడు మళ్ళీ వచ్చాడు." అని కంగారుగా చూస్తూ చెప్పాడు ఫరూక్.

అక్కడికి వస్తూ "మేము అడవిలో బతికే వాళ్ళుము దొర! ఈ గొడవలు గురించి తెలియదు. టీవీ వాళ్ళు వచ్చి నన్ను పట్నానికి తీసుకు పోయారు మళ్ళీ తీసుకొచ్చి ఈడ దిగబెట్టారు దానికే మావాళ్ళని చంపుతానంటే ఎట్టాగా..?" అని చెప్పాడు లింగు.

"ఆ గుడ్డి వాడి మాటలు నమ్మకండి ముందు వాడిని చంపేయండి." అని కోపంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.

"ఎందుకు దొర మిమ్మల్ని క్షేమంగా నవగ్రహాల కొండల దగ్గరికి తీసుకొచ్చినందుకా? మీ మీద కోపం ఉంటే ఎప్పుడో చంపేసే వాడిని కదా! మీకు నా మీద నమ్మకం రావాలి అంటే ఏం చేయాలో చెప్పండి." అని అడిగాడు లింగు.

"అభీర్ పూర్వీకులు దాచిన నిధి ఎక్కడ ఉందో మాకు చూపించు మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాము." అని చెప్పాడు నిర్మల్.

"మనకిప్పుడు ఆ నిధి అవసరమా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము." అని చెప్పాడు సుభాష్.

"ఇక్కడ మనకి సెక్యూరిటీగా చాలామంది ఉన్నారు. నేను వేసిన ప్లాన్ కి అభీర్ చచ్చిపోయే ఉంటాడు వాడి మనుషులు కూడా మన దగ్గర బందీగా ఉన్నారు మిగతా వాళ్ళు వస్తే ఇక్కడ చస్తారు నాన్న చివరి కోరిక కూడా తీర్చుదాము." అని చెప్పింది అర్ణ.

"అవును! ఎలాగూ కాసేపట్లో ఇక్కడి నుంచి వెళ్లిపోతాము ఆ నిధి ఎక్కడ ఉందో చూపిస్తాను అని చెప్తున్నాడు కదా దాన్ని కుడా తీసుకుని పోదాము." అని ఆశగా చూస్తూ చెప్పాడు రఘురామ్.

"సాబ్! మీరు భయపడకండి మనవాళ్ళు ఇంకా ఇక్కడికి వస్తూన్నారు. మిలిటరీ వచ్చిన ఏమీ చేయలేరు మిమ్మల్ని క్షేమంగా బోర్డర్ దాటించి పంపించే బాధ్యత మాది." అని చెప్పాడు సలీమ్.

"సార్! ఇక్కడ కచ్చితంగా నిధి ఉంది. మనకి సిగ్నల్ కూడా చూపిస్తుంది అది ఎక్కడ ఉందో చూపించే మనిషి కూడా ఉన్నాడు నా అంచనా ప్రకారం దాని విలువ మీ ఆస్తి కంటే 10 రెట్లు ఉంటుంది." అని చెప్పింది వాసుకి.

"సరే! రెండు గంటలు టైమ్. ఈ లోపు నిధికి మార్గం దొరికిందా సరే లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము." అని చెప్పాడు ముకుల్.

ఆ మాట విని సంతోషంగా చూస్తూ లింగు దగ్గరికి వెళ్లి "త్వరగా పదరా.. ఆ నిధికి వెళ్లే రూట్ ఎక్కడ ఉందో చూపించు." అని ఆత్రుతగా అడిగాడు రఘురామ్.

"కంగారు పడకండి దొర నాకు కనపడదు నా తమ్ముడికి గుడ్డుకి వినపడదు నా వెనకాలే రండి." అని చెప్పాడు లింగు.

"నిర్మల్! వీడు మళ్ళీ సేమ్ డైలాగ్ వాడుతున్నాడు నాకెందుకో డౌట్ గా ఉంది." అని కంగారుగా చూస్తూ చెప్పాడు ఫరూక్.

"వాచ్ పెట్టుకున్నావు కదా నీ దగ్గరికి ఇంకా ఏ జంతువురాదు మన చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంది వీళ్ళని దాటి ఎవడు టచ్ కూడా చేయలేడు." అని చెప్పాడు నిర్మల్.

"సరే! అని తన మనుషుల వైపు చూసి ఒరేయ్ మీరు ఆ రాళ్ల దగ్గరే ఉండండి నిధి దొరికితే సరి లేకపోతే వాటినైనా అమ్ముకోవచ్చు!" అని చెప్పి నిర్మల్ వెనకాలే వెళ్ళాడు ఫరూక్.

పాట పాడుకుంటూ తాపీగా నడుచుకుంటూ వెళుతున్న లింగు తలకి గన్ పెట్టి "ఇంకా ఎంత దూరం వెళ్లాలి రా..!" అని కోపంగా అడిగాడు సలీమ్.

"వచ్చేసాము దొర! అక్కడ కొండ కనిపిస్తుంది కదా దానిని తవ్వండి లోపలికి వెళ్లే మార్గం ఉంటుంది." అని చెప్పాడు లింగు.

లింగు చూపించిన ప్లేసులో తవ్వడం మొదలుపెట్టారు టెర్రరిస్టులు.

"ఈ ప్లేస్ ని చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి  ఆ కొండ మీదే చాలామంది చచ్చిపోయారు. ఇక్కడే  జంతువుల్ని సరదాగా హంటింగ్ చేస్తూ చంపాము." అని చెప్పాడు ముకుల్.

అర్ణ దగ్గరకు వెళ్లి "నిధి ని తవ్వుతున్న సరే అభీర్ మనుషుల మొహంలో కూడా కసి కోపం లేవు, ఒక్క జంతువు కూడా ఎటాక్ చేయడానికి ట్రై చేయడం లేదు మనల్ని కావాలని ట్రాప్ చేస్తున్నారని అనిపిస్తుంది ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు."  అని కంగారుగా చెప్పింది ఆశ.

"నాకు ఇంకొక విధంగా అనిపిస్తుంది. అక్కడ అభీర్ చచ్చి ఉంటాడు ఆ న్యూస్ వీళ్ళకి వచ్చి ఉంటుంది అందుకే కుక్కిన పేనులు లాగా పడి ఉన్నారు, నువ్వేం కంగారు పడకు ఈసారి టైం మనవైపు ఉంది." అని కాన్ఫిడెంట్గా చెప్పింది అర్ణ.

అంతలో అక్కడికి వస్తున్న టెర్రరిస్ట్ లని చూసి "మేడం! మా బ్యాచ్ ఇంకొకటి వచ్చింది కాసేపట్లో ఇంకొక రెండు బ్యాచ్ లు వస్తాయి." అని చెప్పాడు సలీమ్.

ఆ మాటకి సంతోషంగా చూస్తూ "ఆశ! నువ్వు :కాసేపు సైలెంట్ గా ఉండు. ఎవరు వచ్చిన ఇప్పుడు మనల్ని ఏమీ చేయలేరు అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి." అని చెప్పింది ఝాన్సీ.

అంతలో కొండ దగ్గర రాయి జరగడం సంతోషంగా చూస్తు "నిధికి మార్గం బయటపడింది." అని గట్టిగా అరిచాడు గఫర్ ఖాన్.

ఆ మాటకి సంతోషంగా చూస్తూ "అడ్డంగా ఉన్న రాళ్ళని బాంబులతో బ్లాస్ట్ చేయండి ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు!" అని చెప్పాడు రఘురామ్.

"ఆ బాంబులు దాటికి కొండ చేరియాలు విరిగిపడ్డాయి అంటే మనమందరం ఇక్కడ చస్తాము అడ్డంగా ఉన్న రాయిని జాగ్రత్తగా బయటకి తీయండి." అని చెప్పాడు అరుల్.

"అవును అతను చెప్పింది నిజమే! నిధి తలుపులు తెరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి తప్పు చేయకూడదు ఈ నిధిని దాచింది సిలేదార్ లు చాలా భద్రంగా ఉంచుతారు." అని చెప్పాడు గఫర్ ఖాన్.

తన వాళ్ళ వైపు చూసి "అందరూ వెళ్ళండి ఆ రాయిని బలంగా పక్కకు జరుపండి." అని చెప్పాడు సలీమ్.

లింగు దగ్గరికి వెళ్లి "ఆ రాయిని జరిపితే నిధి దగ్గరికి వెళ్లి పోతామా.?" అని ఆశగా అడిగాడు రఘురామ్.

"ఏమో దొర నాకు కనపడదు." అని చెప్పాడు లింగు.

ఆ మాట విని "ఏంటి? వీడు తేడాగా ఉన్నాడు." అనుకున్నాడు రఘూరామ్.

***************

గొర్వర్ లో వెయిట్ చేస్తున్న  వాళ్ళ మనుషుల దగ్గరికి చేరుకుని "మన వాళ్ళ చావుకి ప్రతికరం తీర్చుకునే రోజు వచ్చింది దేశానికి సహాయంచేసే అవకాశం కూడా దక్కింది అందరూ సిద్ధం అవ్వండి." అని చెప్పాడు బైరి.

ఆ మాట విని కసిగా చూస్తు "నాయకుడు ఎక్కడ?" అని అడిగాడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తి.

"కాసేపటిలో మన దగ్గరికి చేరుకుంటాడు ఈరోజు మనం చేయబోయే యుద్ధం ఎలా ఉండాలి అంటే ఈ నేల మీద అడుగు పెట్టడానికి పరాయి దేశం వాడు భయపడాలి." అని చెప్పాడు రాజన్.

మ్యాప్ తీసి అక్కడ ఉన్న వాళ్ళకి చూపిస్తూ "ఈ గుహల నుంచే టెర్రరిస్టు  అడవి లోకి వచ్చారు మనలో కొంతమంది అక్కడికి వెళ్లి ఆ రూట్ ని క్లోజ్ చేయాలి." అని చెప్పాడు ఆగస్త్య.

అంతలో అక్కడికి మిలటరీ వ్యాన్ రావడం చూసి దగ్గరకు వెళ్లి లోపల ఉన్న మేజర్ ని చూసి సెల్యూట్ చేసి "సార్ ఏజెంట్ కోడ్ అభీర్ సేన!" అని చెప్పాడు బైరి.

ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసి "అభీర్ సేన గురించి విన్నాను. కానీ ఇంతమంది ఉంటారు అనుకోలేదు  బోర్డర్ దాటి సుమారు 600 మంది టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది.

ఇది చాలా పెద్ద రిస్క్యూ  ఆపరేషన్ తొందరపడి లోపలికి వెళ్ళకూడదు  అది కాకుండా వాళ్ళ చేతిలో హోస్టేజ్స్ గా గిరిజనులు ఉన్నారని తెలిసింది." అని చెప్పాడు మేజర్.

"అక్కడ హోస్టేజ్ గా ఉన్న వాళ్ళందరూ మా వాళ్లే సార్!" అని చెప్పాడు బైరి.

"అవునా? నాతో పాటు 30 మంది ఆఫీసర్స్ మాత్రమే వచ్చారు ఉదయానికి నాలుగు బెటాలియన్స్ వస్తాయి అప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాము." అని చెప్పాడు మేజర్.

కారు దిగి అక్కడికి వస్తూ "అక్కడ 600 మంది టెర్రరిస్టులతో పాటు 100 మంది దేశద్రోహులు కూడా ఉన్నారు ఈ ఆపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టాలి లేకపోతే దేశం దాటి వెళ్ళిపోతారు." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని అభీర్ వైపు డౌట్ గా చూస్తు "ఎవరు మీరు?" అని అడిగాడు మేజర్.

"మా అభీర్ సేన నాయకుడు ఆయన పిలుపు చాలు ఈ అడవిలో ఉన్న ప్రతి జీవి యుద్ధానికి సిద్ధమవుతుంది." అని చెప్పాడు బైరి.

"మీరు చెప్పేది కరెక్టే అవ్వచ్చు కానీ టెర్రరిస్టు దగ్గర లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయి మీ వాళ్ళ దగ్గర వేపన్స్ కుడా లేవు అనవసరంగా అందరూ ప్రాణాలు కోల్పోతారు." అని చెప్పాడు మేజర్.

"మేజర్ గారు! మా చేతులే మా వెపన్స్! ఈ అడవిలో పుట్టి అడవిలో పెరిగాము. ఇక్కడ గాలి కూడా మా మాట వింటుంది. ఇంకా వాళ్ళ చేతిలో ఉన్న వెపన్స్ అంటారా వాళ్ళు వాటిని ఉపయోగించే లోపు మేము వాళ్ళని చంపేస్తాము.

ఒకవేళ మీరు చెప్పినట్లు ఈ ఆపరేషన్ లో మేము చనిపోతే ఒక్క సెల్యూట్ కొట్టండి చాలు!" అని తన మనుషుల వైపు చూసి "అందరూ సిద్ధంగా ఉన్నారా..?" అని అడిగాడు అభీర్.

"సిద్ధం నాయకుడా..!" అని గట్టిగా అరిచారు అందరూ.

"ఇక్కడ ఉన్న 200 మంది నాలుగు గ్రూపులుగా విడిపోయి  అడవిలోకి నాలుగు వైపుల నుంచి  ఎంటర్ అవ్వండి. పశ్చిమదిశగా వెళ్లిన వాళ్ళు ఆ కొండ దగ్గర ఉన్న మార్గాన్ని మూసేయండి.

మిగిలిన మూడు  మార్గాలలో వెళ్లే వారు శత్రువులకు అనుమానం రాకుండా అడవిలో ఉన్న చెట్లలో కలిసిపోండి వాళ్ళ కంటికి ఒక్క మనిషి కూడా కనిపించకూడదు.

నా పిలుపు వినిపించాగానే మూడు వైపుల నుంచి ఒకేసారి దాడి చేయండి. గన్ పట్టుకునే అవకాశం లేకుండా చేతులు నరికేయండి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతోనే వాళ్లని చంపండి." అని చెప్పాడు అభీర్.

అక్కడికి వచ్చి "మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మీతో పాటు మేము కూడా నాలుగు గ్రూపులుగా విడిపోయి లోపలికి వస్తాము అవసరమైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాము." అని చెప్పాడు మేజర్.

"ఒక్క ప్రాణం కూడా పోనివ్వను." అని నీలమ్ వైపు చూసి "వీరభద్రం నిన్ను సేఫ్ ఇంటికి చేరుస్తాడు. యుద్ధం మనం అనుకున్నట్లు జరగదు ఒకవేళ నేను తిరిగి రాకపోతే నువ్వు ఎప్పటిలాగా సంతోషంగా ఉండాలి." అని చెప్పాడు అభీర్.

"నువ్వు పద్మవ్యూహంలోకి వెళుతున్న అభిమన్యుడువి కాదు అర్జునుడివి నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను." అని చెప్పింది నీలమ్.

ఆ మాట విని సంతోషంగా  తన వాళ్ళ వైపు చూసి కత్తిని పైకి ఎత్తి "పార్వతీ పతయే హర హర హర మహాదేవ!" అని అడవి దద్దరిల్లిపోయేటట్లు గట్టిగా చెప్పాడు అభీర్.

"హర హర మహాదేవ!" అనుకుంటూ నాలుగు గ్రూపులుగా విడిపోయి అడవిలోకి పరిగెత్తారు అభీర్ సేన.
[+] 5 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 28-02-2026, 07:57 AM



Users browsing this thread: