Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
కళ్ళలో నీరు చేరగా "సూర్యం" అంటూ ఇంకా మాట్లాడలేక ముగబోయింది సావిత్రమ్మ.
కన్నీరు తుడిచి, "బామ్మ ఎందుకు కన్నీళ్లు . నీకు ఎవరు లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు.నీకు నీ బిడ్డ లాంటి మా అమ్మ,నేను ఉన్నాం ఒకప్పుడు నువ్వు మమ్మల్ని ఆదుకున్నావు.ఇప్పుడు నీ పరిస్తితి బాగలేకపోతే మేము నిన్ను చూస్కోలేమా. నువ్వు మా అమ్మకి జీతాలు ఇవ్వనక్కర్లేదు.నీకు ఇష్టం ఉండదని ఇన్నాళ్లు తీసుకుంది కానీ,తనకి నీ దగ్గర రూపాయి తీసుకోవడం కూడా ఇష్టం లేదు. మా అమ్మ నీ దగ్గరనుండి తీసుకున్న ప్రతి రూపాయి మా దేవుడి మందిరంలో శ్రీనివాసుడు పాదాల దగ్గర భద్రంగా ఉంది."అని తనతో తెచ్చిన డబ్బుని తీసి రంగి చేతికి ఇచ్చాడు. డబ్బుని తీసుకొని కళ్ళకి అద్దుకుంది రంగి.
"బామ్మ నువ్వు ఎలాంటి మోహమాటనికి పోకు. మా అమ్మని నా బిడ్డ అనుకుంటా అని నాతో చాలాసార్లు అన్నావు గుర్తుందా!?" అవునన్నట్టు తెలుపిన సావిత్రమ్మ ని చూసి నవ్వి..
"హుమ్.. అందుకే నీ బిడ్డ, నీకు ముదిమి వయసులో నీకు సాయంగా వచ్చింది.కాదనకు.మా అమ్మ అవసరం నీకు ఇప్పుడే కావాలి. ఇలాంటి స్థితిలో నిన్ను వదిలి వెళితే మాకంటే స్వార్ధపరులు లోకంలోనే వుండరు.మా అమ్మ ఇక ఇక్కడే ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది.నీకు ఇష్టం లేకపోయినా సరే " అన్నాడు.
అతని మాటలకి ఇంకా ఆలోచనతోనే ఉన్న సావిత్రమ్మ ని చూసి,"మా అమ్మని నువ్వేం ఊరికే ఉంచుకోవద్దులే పెద్దామే!" అని నవ్వి తన జేబులో నుండి ఒక కాగితం తీసి సావిత్రమ్మ చేతిలో పెట్టి "ఇది నీ పెన్షన్ కాగితం బామ్మ రేపు పంచాయితీ గుమ్మస్థ వస్తాడు ఇవ్వు. రేపు నెల నుండి నీకు పేన్షన్ వస్తుంది అప్పటిదాక డబ్బు వాడుకోండి.మీకు సమయంలో అవసరం వచ్చిన నాకు ఒక్క ఫోన్ చెయ్యండి నేను మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను".అని చెప్పాడు.
చేతిలో ఉన్న కాగితాన్ని చూసుకుంటూ...ఎప్పుడో చేసిన మాట సాయానికి ఇంత మూల్యమా!! అని ఇద్దరి వైపు ఆరాధనగా చూసింది సావిత్రమ్మ ఏమి మాట్లాడలేక,మాటలు కూడా రాక.
"సరే బామ్మ,అమ్మ నేను వెళ్ళొస్తాను నాకు బస్ టైం అయింది."
ప్రేమగా సూర్యం తల నిమిరి "మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీ కడుపునే పుడతానురా సూర్యం" అని ప్రేమగా సూర్యాన్ని హత్తుకుంది.ఆవిడ చుట్టూ చేతులేస్తూ.."సూర్యం కాదు పెద్దామే బుల్లబ్బాయి." అని జీరాబోయిన గొంతుతో అన్నాడు సూర్యం.
వాళ్ళిద్దరిని కళ్ళార్పకుండా చూస్తూనే, కొడుకు మంచి మనసుకి మనసులోనే మురిసిపోయింది రంగి.
సావిత్రమ్మ ని వదిలి "ఇంకోవారం లో నీ బిడ్డలు,మనవళ్ళు,మునివనవళ్ళు అంతా నీ ముందు వుంటారు.ఇక దిగులు పెట్టుకోకు "
"వద్దురా...నా కోసం వాళ్ళ దగ్గర నువ్వు తగ్గడం నాకు ఇష్టం లేదు సూర్యం.నాకు మీరు ,మీ ఆత్మేయత చాలు.పేరుకు తగ్గట్టు పది మందికి ఇలానే మంచి చేస్తూ వుండు నాన్న. మంచే నిన్ను చల్లగా ఉండేలా చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా.."అని చెప్పింది.
సరే అని తలుపి తల్లికి కూడా చెప్పి వెళ్ళిపోయాడు సూర్యం. కొడుకు వెళ్లిన వైపే చూస్తూ నిలబడ్డ రంగి ని చూసి "ఏంటే రంగి తుమ్మమొద్దులా అలా నిలబడ్డావు వెళ్లి పెరట్లో చెట్లకి నీళ్లు పొయ్యి పో" అని గేదిమింది సావిత్రమ్మ.
సావిత్రమ్మ మాటకి వెనక్కి తిరిగి "ఇదిగో పెద్దమ్మ గారో ఏంటి నోరు పెంచుతున్నారు..ఇలా అంటే నేను పని మానేసి పోత ఏమనుకున్నారో" అని ఇంకా గట్టిగా రెట్టించింది రంగి.
"ఏంటే నన్నే బెదిరిస్తున్నావు నా మనవడికి ఒక్క ఫోన్ చేసాను అంటే నీ ఉద్యోగం ఉడిపోద్ది ఏమనుకున్నావో" అని ఇంకా గట్టిగా అరిచింది సావిత్రమ్మ.
"ఏది చెయ్యండి నేను చూస్తా..." అంటూ మీదకి పోతున్న రంగి, "ఏమే మీ గోల ఎన్నాళ్ళకి అగుద్ది రోజున ఇదే తగువు నలభై ఏళ్ల నుండి చూసి చూసి విసుగుపుడుతుంది" అని గోడ దగ్గర నిలబడి అరుస్తున్న పక్కింటి కాంతమ్మ మాటలకి ఆగి "మధ్యలో మీకేం నొప్పి అమ్మ మాకు మాకు వందుంటాయి మీకెందుకు? మీరెల్లి పక్కింటి కామాక్షి అమ్మతో ముచ్చట్లు పెట్టుకో పొండి" అని అరిచి చెప్పి కోపంగా తన వైపే చూస్తున్న సావిత్రమ్మ ని చూసి..చెవి వెనుక గీక్కుంటు హీ..హీ..హీ...అంటూ పిచ్చి నవ్వు నవ్వింది రంగి.
రంగి హావభావాలు చూసి కోపం నటించలేక పెద్దగా నవ్వింది సావిత్రమ్మ.ఆమె నవ్వుని చూసి ,తన నవ్వుని కూడా జత కలిపింది రంగి.
ఎంత సాయం అన్నది కాదు, మంచి మనసు ముఖ్యం దేనికైనా!.
                        ★★★★★★
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - అపార్థం - by k3vv3 - 27-02-2026, 05:13 PM



Users browsing this thread: 1 Guest(s)