Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
కృతజ్ఞత
[Image: k.jpg]

స్వాతి సూర్యదేవర
 
"మీరు తినేదాంట్లోనే ఒక ముద్ద పెట్టండమ్మ చాలు" అన్నది రంగి.
"అధికాదే రంగి ,ఇప్పడు నాకే కటకటగా ఉంది ఇక నిన్నెం పోషించగలను . జీతం ఎం ఇవ్వగలను నువ్వే చెప్పు" అని వాపోయారు డెబ్భై ఐదేళ్ల సావిత్రమ్మ.
"మీరు అనేది సబబే అమ్మ.కానీ నాకు మిమ్మల్ని వదిలి వెళ్లడం ఇష్టం లేదు అమ్మ."
"ఇష్టం లేదంటే ఎలాగే!పాపం వాడు గంట నుండి నీకోసం ఎదురుచూస్తున్నాడు.పట్నానికి బస్ కి కూడా యేళవుతుంది వేళ్ళు నువ్వు ముందు."
"మీరేన్నయిన సెప్పండి అమ్మగారు.నేను వెల్లనంటే వెళ్ళను" అని మొండికేసింది రంగి
"అక్కడ నీ కొడుకు నీకు రోజు పంచభక్ష్య పరమన్నాలు పెడతా అంటుంటే నాతో పాటు గంజితాగుతా అంటావెంటే" అని ఒక రకమైన భాధ విసుగు కలిపి అన్నారు సావిత్రమ్మ.
"ఆడు ఏట్టే పరమాన్నాలు నాకొద్దు ఇక మీరేం మాట్లాడకండి నేను ఇక్కడే ఉంటా పిలగాన్ని ఎల్లమని సెప్పోత్త ఆగండి " అని ఇంటికి వెళ్లాడానికని వెనక్కి తిరిగింది.
"రంగి ఆగు..నీకు నా మాటంటే లెక్క లేదా ఏమే!?" అని కోపంగా అరిచారు సావిత్రమ్మ.
మాటకి వెనక్కితిరిగి కళ్ళెంట నీళ్లు తిప్పుకొని "నేను పుస్తె కట్టించుకొని ఊరికోచ్చినకాన్నుంచి నాకు అమ్మైనారు.పేరుకి పనిదాన్నే అయిన సొంతబిడ్డ మాదిరి సేరదీసినారు.తాగుబోతు మొగుడితో పడలేక సావబోతున్న నన్ను కాపాడి నా బిడ్డకి సధువు సెప్పించారు.కట్టం అన్న పేతిసారి నేనున్నా అన్నారు.నా మొగుడికి బుద్ధి సెప్పి నా కాపురం సక్కబెట్టారు.ఇయ్యాల నా బిడ్డ పట్నంలో అంత పెద్ద ఉద్యోగం సేత్తన్నడన్నా,ఇయ్యాల నన్ను సూసుకుంటాను అంటన్న అదంతా మీ సలవే అమ్మా.. మరి నాకింత సేసిన మీ మాట కాక ఇంకెవరు మాట ఇంటా అమ్మ" అని కన్నీరు పెట్టుకుంది రంగి.
కర్రపోటుతో రెండడుగులు ముందుకేసి "నేనేం చేసిన అది సాయం మాత్రమే నే రంగి, కానీ ఇలా నీకు అడ్డంకి కావడానికి కాదు" అని కన్నీరు పెట్టుకున్నారు సావిత్రమ్మ. రంగి కూడా ఏడుస్తూ సావిత్రమ్మ ని కావాటేసుకొని "మీ కన్నీళ్లు నేను సూడలేను అమ్మగారు. అలా అని వయసులో మిమ్మల్ని ఇట్టా అనాధలా వదిలేసి వెళ్లలేను నా మాట ఇనండి అమ్మా." అని బతిమిలాడింది
రంగిని వదిలి నువ్వు "ఉన్న లేకున్నా నేను అనాథనేనే రంగి.కట్టుకున్న వాడు అర్ధాంతరంగా వదిలేసిపోయిన, కన్నబిడ్డల కోసం కడుపు కట్టుకొని , సంసారాన్ని లాక్కొచ్చాను.వాళ్ళకి సధువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసాను.రెక్కలొచ్చాయి, ఎగిరిపోయారు.వాళ్ళ బిడ్డల చదువులు,పెళ్లిళ్లు ,మనవళ్ళు అని వ్యాపాకంలో పడిపోయారు. ఇక్కడ ఒక అమ్మ ఉన్నదన్న సంగతే మర్చిపోయారు.కాలు, చెయ్యి కాస్తా ఆడుతుంది కాబట్టి వచ్చే పింఛను డబ్బులతో వెళ్ళదీస్తున్నాను.రెణ్ణెళ్ల నుండి అయ్యి కూడా లేవు.నాకే రేపటి రోజు ఎట్టా అని గుబులుగా ఉంది.ఇక నీకేం పెట్టేదే!? అందుకే నిన్ను పంపడం ఇష్టం లేకపోయినా వెల్లంటున్నాను" అని కళ్లు వత్తుకున్నారు సావిత్రమ్మ.
"అధికాదమ్మగారు..." అని ఏదో సెప్పబోయిన రంగి మాట మొదలవ్వకుండానే "అమ్మా" అన్న పిలుపు వినపడి గుమ్మం వైపు చూసారు.ఇద్దరూ...
లోపలికి వస్తున్న రంగి కొడుకుని చూసి ఆశ్చర్యపోయారు.వీల్లదగ్గరికి వచ్చిన రంగి కొడుకు,సావిత్రమ్మ కాళ్ళకి దండం పెట్టాడు. తల నిమురుతూ "చల్లగా వుండరా బుల్లబ్బాయి" అని దీవించింది సంతోషంగా.
పైకి లేచి నవ్వుతూ..."నా పేరు సూర్య పెద్దామే!...మర్చిపోఇనావా ఏంది?" అని పరిహాసం ఆడాడు సూర్య.
చిన్నగా తలపై మోడుతూ "మర్చిపోలేదులేరా బడుద్దాయి" అని నవ్వింది.ఎప్పుడు బుల్లాబ్బాయి అని పిలిచిన ఇలాగే అనే సూర్య మాట గుర్తుతెచ్చుకొని.
"ఏంది సూర్యం ఇట్టా వచ్చావు.నేనే వస్తా అన్నాను గా" అని కంగారుపడుతూ అన్నది రంగి.ఎక్కడ సావిత్రమ్మ గారిని వదిలి రమ్మంటాడో అన్న భయంతో.
"ఎం లేదులే అమ్మ..నాకు బస్ కి టైం అవుతుంది నేను ఇక బయలుదేరతాను అదే మీకు చెప్దామని" అంటూ తన చేతిలో ఉన్న ట్రంకు పెట్టే తల్లి చేతికి అందించాడు.
అది తీసుకుంటూ..వెళ్ళడానికి మనసొప్పక భాధగా ఉంటే అంతలోనే తను ఒక్కడే వెళ్ళాలి అనడం గుర్తొచ్చి టక్కున కొడుకుకేసి కళ్ళనిండా మెరుపుతో,అంతకంటే ఎక్కువ ఆనందం తో చూసింది.
తల్లి ఉద్దేశ్యం అర్ధమై అవును అన్నట్టు కళ్లార్పి, వాళ్లనే అయోమయంగా చూస్తున్న సావిత్రమ్మ వైపు తిరిగి,"ఇగో పెద్దామే! మా అమ్మని నీకు అప్పచెప్తున్న జాగ్రత్త.నేను మీ ఇద్దరిని చూడడానికి నెలకోసారి వస్తూనే ఉంటాను.జాగ్రత్త" అని చెప్పాడు.
ఆశ్చర్యంగా "అదేందిరా అలా అంటావు.మీ అమ్మని కూడా తీసుకుపోతా అన్నావుగా!? "
"ఇప్పుడు కాదులే పెద్దమే! ,మా అమ్మ బాధ్యత ఇక్కడ ఇంకా ఉంది అది నేనే గుర్తించలేదు" అని నొచ్చుకున్నాడు.
"మీ అమ్మ బాధ్యత! అదేంటి రా...!? మీ నాయనా లేడు,నీకా ఒక కుటుంభం చూపించింది ఇంకేం బాధ్యత ఉంది!?."
సావిత్రమ్మ భుజాలపై చేతులు వేసి "తన బాధ్యత ఇంకా ఉంది బామ్మ.అది ఇదిగో.." అంటూ కళ్ళతోనే నువ్వే అన్నట్టు సావిత్రమ్మ కి సైగ చేసాడు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - అపార్థం - by k3vv3 - 27-02-2026, 05:08 PM



Users browsing this thread: 1 Guest(s)