Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 99


నీలమ్ కంపెనీ ట్యాగ్ ట్రాకింగ్ రాహుల్ మొబైల్ సిగ్నల్ ఓకే చోట ఉందని ఆ ఏరియా కి వెళ్లడం డేంజర్ అక్కడ అంత కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉంటారు అని దయా చెప్పడంతో, ఫోర్స్ తీసుకుని రండి నేను అభీర్ తో పాటు వెళుతున్నాము అని కార్ దగ్గరికి వెళ్ళాడు శ్రీకర్.

***************

అభీర్ తో ఫోన్లో మాట్లాడి కొండ దిగి టెంట్స్ దగ్గరికి వస్తున్న అరుల్ ని చూసి "నువ్వు బతికే ఉన్నావా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ప్రమోద్.

అరుల్ వైపు అనుమానంగా చూస్తూ " అవును! ఇప్పటీ దాకా ఎక్కడికి వెళ్ళిపోయావు?" అని అడిగాడు నిర్మల్.

"రాత్రి చీలి వాళ్ళు వేసిన చలిమంటలో ఏవో వేర్లు పడినట్లు ఉన్నాయి దానివల్ల మత్తు గా పడుకున్నాను.ఉదయం లేచి చూసేసరికి ఆ కనిపించే కొండ దగ్గర ఉన్నాను ఏ జంతువుల లాక్కెళ్ళినట్లు ఉంది  దారి వెతుక్కుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది." అని చెప్పాడు అరుల్.

"అవునా? నువ్వు చెప్పేది కాస్త తేడాగా ఉంది అందరూ చనిపోతే నువ్వు ఎలా బతికున్నావు?" అని రాళ్ల ముఠా పట్టుకుని వస్తూ అడిగాడు ఫరూక్.

"నేను మాత్రమేనా మీరు బతికే ఉన్నారు కదా! నాకు ఆ కొండ కింద ఏదో రూట్ ఉన్నట్టు అనిపించింది. వాసుకి చెప్పినట్లు నిజంగానే ఆ నిధి అమ్మవారి పాదాల కింద ఉందేమో!" అని డౌట్ గా చెప్పాడు అరుణ్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు నిజంగానే చెబుతున్నావా?" అని అడిగాడు నిర్మల్.

"ఎస్! కావాలంటే నాతో రండి చూపిస్తాను." అని కేశవ్ వైపు చూసి సైగ చేశాడు అరుల్.

"ఆవును దొర! అమ్మవారికి పాదాల కింద ఉన్న కొండ లోపల నిధి ఉంది అంటారు కానీ మనవాళ్ళు నా మాట వినడం లేదు ఇక్కడే వెతుకుతున్నారు." అని చెప్పాడు కేశవ.

ఆ మాట విని కొండల దగ్గర మిషన్స్ తో  వెతుకుతున్న వాసుకి వాళ్ళ వైపు చూసి "ఇటు రండి నిధికి దారి దొరికింది." అని గట్టిగా అరిచాడు నిర్మల్.

అంతలో సోము వాళ్ళ చేతులు తాళ్లతో కట్టేసి చేతిలో గన్స్ పట్టుకుని అక్కడికి వస్తున్న టెర్రరిస్టులను చూసి "ఎవరు వాళ్ళు?" అని డౌట్ గా అడిగాడు ఫరూక్.

"మన ఫ్రెండ్స్ ఏ కంగారు పడకు." అని నవ్వుతూ దగ్గరికి వెళ్లి "సల్మాన్ బాయ్!" అని కౌగిలించుకున్నాడు నిర్మల్.

"మాకు ఈ కొండలలో నుంచి రూటు ఉంది అని తెలిస్తే ఈపాటికి భారత్ లో తీష్ట వేసేవాళ్ళము." అని నవ్వుతూ చెప్పాడు సల్మాన్.

చేతులు కట్టేసి ఉన్న సోము వాళ్ళ వైపు చూసి "ఇంతకీ వీళ్ళు ఎవరు?" అని డౌట్ గా అడిగాడు ప్రమోద్.

"మేము వచ్చే రూట్ ని రాళ్లతో మూసేయడానికి చూస్తున్నారు అడవిలో ఉండే గిరిజనులు అనుకుంటా   మిలటరీ వస్తే తప్పించుకోడానికి ఉంటారులే అని నా తమ్ముడు ఖాదిర్ వాళ్ళని చంపకుండా బంధించాడు." అని చెప్పాడు సల్మాన్.

"అవునా? చాలా మంచి పని చేశారు ఇంతకీ మీరు ఎంతమంది వచ్చారు?" అని అడిగాడు నిర్మల్.

ఆ మాటకి నవ్వుతూ "వస్తూనే ఉంటారు మిమ్మల్ని ఇక్కడి  సేఫ్ గా పంపిస్తాము కానీ మా వాళ్ళు ఇక్కడే ఉంటారు." అని చెప్పాడు ఖాదిర్.

కేశవ్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకుంటూ "ఎవరు ఎదురు తిరగకండి నాయకుడి ఆజ్ఞ!" అని నెమ్మదిగా చెప్పి "మరి ఇంకా నిధి దగ్గరికి వెళదామా?" అని అడిగాడు అరుల్.

ఆ మాట విని "ఏంటి? మాకు ఉండడానికి స్థలంతో పాటు నిధి కూడా ఉంచినట్లు ఉన్నారు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సల్మాన్.

"సరే కానీ నీ మనుషుల్ని ఎలర్ట్ గా ఉండమను ఇక్కడ జంతువులతో పాటు మనుషులు కూడా ప్రమాదమే!" అని సోము వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.

"బాయ్! నా మనుషుల చేతిలో గన్స్ చూసావా ఒక్క రౌండ్ కి 100 బుల్లెట్లు బయటికి వస్తాయి వీటి దాటికి ఎవ్వడు ఆగలేడు." అని చెప్పాడు సల్మాన్.

"సరే!" అని అక్కడ నుంచి తల్వార్ వాళ్లతో కలిసి అరుణ్ చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళాడు నిర్మల్.

*************

బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ లో అడవి దగ్గరికి చేరుకుని రాహుల్ కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి "ఎంతవరకు వచ్చింది?" అని అడిగాడు అభిజిత్.

"సార్! నేను కూడా నాదల్ వాళ్లతో పాటే ఉన్నాను వీళ్ళు వసుంధర ఫ్యామిలీ ని కిడ్నాప్ చేశారు కానీ ఎవిడెన్స్ బ్యాగ్ దొరకలేదు అందుకే మన ప్లాన్ ప్రకారం జైల్లో ఉన్న తీవ్రవాదులతో పాటు ఎవిడెన్స్ బ్యాగ్ పంపించమని బ్లాక్ మెయిల్ చేశాము.

మా డిమాండ్స్ కి గవర్నమెంట్ ఒప్పుకుంది కచ్చితంగా అరగంటలో బ్యాగ్ మా చేతికి వస్తుంది  రాగానే వీళ్ళని చంపేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాము." అని చెప్పాడు రాహుల్.

ఫోన్లో రాహుల్ చెప్పింది విని కాసేపు ఆలోచించి "గవర్నమెంట్ అంత స్పీడుగా డెసిషన్ తీసుకోదు అభీర్ ఎంటర్ అయ్యి ఉంటాడు ఒకవేళ నువ్వు అక్కడ కనపడితే కచ్చితంగా మన మీద అనుమానం వస్తుంది.

వసుంధర కూతురిని, నీలమ్ ని తీసుకుని మా దగ్గరికి వచ్చాయ్! ఒకసారి నాదల్ కి ఫోన్ ఇవ్వు!" అని చెప్పింది అర్ణ.

ఫోన్ తీసుకుని "గుడ్ ఈవెనింగ్ మేడం! ఇక్కడ అంతా బానే ఉంది ఈ ఏరియాలోకి ఎవరు ఎంటర్ అవ్వలేరు ఒకవేళ వచ్చిన ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు." అని చెప్పాడు నాదేల్.

"గుడ్! ఎవిడెన్స్ బ్యాగ్ తీసుకుని కచ్చితంగా అభీర్ అక్కడికి వస్తాడు నేను చెప్పిన ప్లాన్ రెడీ చేశారు కదా!" అని అడిగింది అర్ణ.

"ఎస్ మేడం! అంతా మీరు చెప్పినట్లే జరుగుతుంది." అని చెప్పాడు నాదేల్.

"ఓకే! రాహుల్ ని అక్కడి నుంచి త్వరగా పంపించండి." అని చెప్పి ఫోన్ పెట్టేసి ముకుల్ వైపు చూసి "తాతయ్య! నేను అనుకున్న ప్లాన్ కరెక్ట్ గా జరుగుతుంది." అని స్మైల్ ఇచ్చింది అర్ణ.

నీలమ్, రోషినిల కాళ్లు చేతులు కట్టేసి కారులో ఎక్కించి ఒక మనిషిని తోడుగా తీసుకుని అక్కడనుంచి బయలుదేరాడు రాహుల్

వ్యాన్లో ఉన్న ఆర్మ దగ్గరికి వస్తూ "అంతా ఓకే కాని మళ్లీ ఆ ఇద్దరిని తీసుకుని రాహుల్ ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు?" అని డౌట్ గా అడిగాడు విష్ణు.

"నలుగురిని కిడ్నాప్ చేసి జైలు నుంచి తీవ్రవాదులు విడిచిపెట్టమంటే ఇండియన్ గవర్నమెంట్ చూస్తూ కూర్చోదు కాసేపటికైనా బోర్డర్ దాటి టెర్రరిస్టులు అడవిలోకి ఎంటర్ అయ్యారని తెలుసుకుంటుంది.

లేదా నువ్వే చెప్పావు కదా అడవిలో అభీర్ మనుషులు ఉన్నారని వాళ్లైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కచ్చితంగా ఇక్కడికి మిలిటరీ వస్తుంది. ఒకవేళ ప్రాణాలతో బయటపడితే అభీర్ కూడా వస్తాడు మనం సేఫ్ గా ఉండాలి అంటే వాళ్లు మన దగ్గర ఉండాలి."  అని చెప్పింది అర్ణ.

"ఒకవేళ ఎవ్వరు రాకపోయినా అభీర్ మనుషులు ఎలా ఉన్నారో చూసావు కదా వాళ్ళ నుంచి మనం సేఫ్ గా బయటపడాలి అన్న మన చేతిలో ఏదో ఒక ఆయుధం ఉండాలి." అని చెప్పాడు ముకుల్.

అంతలో వ్యాన్ దగ్గరికి వచ్చి "సార్! ఫారెస్ట్ లోపలికి వచ్చాము ఇక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలి." అని చెప్పాడు మిస్సైల్.

"ఓకే!" అని వ్యాన్ దిగి చుట్టూ గన్స్ తో మిసైల్, నెల్సన్ మనుషులు ఉండగా మధ్యలో ఉండి నడుచుకుంటూ లోపలికి బయలుదేరారు అందరు.

**************

కారులో అభీర్, మిత్ర, చాక్లెట్ లని లోకేషన్ లో ఉన్న ఏరియా దగ్గరికి తీసుకువచ్చాడు శ్రీకర్.

కార్ దిగుతున్న అభీర్ వైపు చూసి "ఈ ఏరియాలో అందరూ నాకు పరిచయమే ఇన్ఫర్మేషన్ కోసం చాక్లెట్ నేను చాలా సార్లు వచ్చము లోపలికి వెళ్లడానికి ఈ రూట్ కాకుండా వేరే రూటు ఉంది నువ్వు  శ్రీకర్ గారు అటువైపు నుంచి రండి మేము ఈ దారి నుంచి లోపలికి వెళ్ళతాము." అని చెప్పింది మిత్ర.

"సరే!" అని శ్రీకర్ తో కలిసి మిత్ర చూపించిన వేరే రూట్ నుంచి లోపలికి బయలుదేరాడు అభీర్.

కారు దిగి చాక్లెట్ తో కలిసి లోపలికి వెళ్ళిన మిత్ర ని అపి "నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రేపు రా.. ఈ రోజు లోపలికి ఎంట్రన్స్ లేదు." అని చెప్పాడు ఒక వ్యక్తి.

"నేను ఇన్ఫర్మేషన్ కోసం రాలేదు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను నన్ను నజీర్ దగ్గరికి తీసుకువెళ్తే చెబుతాను మీరందరూ ప్రాణాలతో ఉంటారు." అని చెప్పింది మిత్ర.

ఆ మాటకి కాసేపు ఆలోచించి "ఒక్క నిమిషం ఉండు." అని ఫోన్ తీసి మాట్లాడి ఇద్దరిని చెక్ చేసి "నా వెనకాల రండి." అని చెప్పాడు ఆ వ్యక్తి.

మిత్రతో కలిసి లోపలికి వెళుతూ అక్కడ ఉన్న మనుషుల్ని చూసి "అక్క! ఎప్పుడు ఇక్కడికి వచ్చిన భయం వేయలేదు ఈసారి ఏంటి కాస్త భయంగా ఉంది." అని అడిగాడు చాక్లెట్.

"ఒరేయ్! నువ్వు చచ్చి బతికిన వాడివి నీకు భయమేంటి ధైర్యంగా ఉండు." అని చెప్పిన మిత్ర.

కాసేపటికి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి "సలాం మలేకుం నజీర్ బాయ్! ఎప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కదా ఆ అభిమానంతో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను." అని చెప్పింది మిత్ర.

"అవునా? ఏంటి ఆ ఇన్ఫర్మేషన్?" అని నవ్వుతూ అడిగాడు నజీర్.

"జైలర్ ఫ్యామిలీ ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చి దాచారు అని తెలిసింది వెంటనే వాళ్ళని వదిలేయండి లేకపోతే అందరు చచ్చిపోతారు." అని చెప్పింది మిత్ర.

ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ "ఇక్కడ ఉన్న విషయం నీకు ఎలా తెలిసింది? అయ్యినా ఇక్కడికి రావడానికి ఏ పోలీసోడికి ధైర్యం ఉంది." అని అడిగాడు నజీర్.

అంతలో అక్కడికి వస్తున్న అభీర్ చూపించి "సెక్యూరిటీ ఆఫీసర్లకి కాదు వాడికి ధైర్యం ఉంది." అని చెప్పింది మిత్ర.

అంతలో అక్కడికి వచ్చి చేతిలో ఉన్న బ్యాగు కింద పెట్టి "నాదల్!" అని గట్టిగా అరిచాడు అభీర్.
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 27-02-2026, 06:29 AM



Users browsing this thread: 1 Guest(s)