26-02-2026, 07:53 AM
Part - 116
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ ధనుంజయ్.. భార్గవి కి సరైన గుణపాఠం చెబుతాను. నా ప్రాణాన్ని దూరం చేసి మొదటి తప్పు చేసింది.
నా పంచప్రాణాలు అనుకున్న నా బిడ్డని శాశ్వతంగా దూరం చేయడానికి చాలా నీచమైన పన్నాగాలు పన్నింది. అలాంటి దాన్ని ఊరికనే ఎందుకు వదిలేస్తాను.
విక్రమ్ చేతికి ఆ పాపం అంటకూడదు అనే భార్గవి విషయంలో నేనే నిర్ణయం తీసుకున్నాను స్థిరంగా చెబుతాడు.
ఏమి చేస్తావురా అంటే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఆ నవ్వులో ఏం అర్థం వెతుక్కోవాలో తెలియక సత్యవతి మౌనంగా ఉండిపోతుంది.
శిల్పా ఉదయ్ తో సాయంత్రం దాకా పొలం పనులు చేయిపిస్తారు. మిషన్స్ ఏమీ ఇవ్వకుండా అన్ని నాటు పద్ధతిలోనే చేయించుతారు.
ఉదయ్ తో నాగలి పట్టిస్తారు. శిల్ప చేతకి కొడవలి ఇచ్చి కలుపు మొక్కలు తీయమని పురమాయించుతారు. సాయంత్రం దాకా వంచిన నడుముని పైకి ఎత్తనివ్వరు.
సూర్యాస్తమయం సమయానికి మేము వెళుతున్నాము అబ్బాయ్.. ఇంకా మీరిద్దరూ ఇంకా ఏమైనా పడండి అని పంకజం, కాంతారావు వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్లిన వెంటనే మెల్లిగా శిల్ప పైకి లేచి అమ్మా.. నా నడుము పట్టేసింది అని నడుం మీద చేతులు వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది.
ఉదయ్ కూడా ఎద్దులు కట్టేసి నాగలి పక్కకు పెట్టి చెమటలు తుడుచుకుంటూ వచ్చి ఇంటికి వెళదామా అంటాడు.
ఆ వెళదాం. అది ఒక ఇల్లు.. మళ్ళీ అక్కడికి వెళ్లడం అని విసుకుంటూ వస్తుంది. మనకి ప్రస్తుతానికి అదైనా ఉంది. అందుకు సంతోషించు.
రోడ్డు మీద వదిలేసి ఉంటే ఏమి చేసేదానివి... వదిలి చూడాల్సింది శిల్ప అంటే ఏమిటో చూపించేదాన్ని... అసలు నా రేంజ్ ఏంటో అర్థం కాక తీసుకొచ్చి ఈ గుడిసెలోనూ ఈ మట్టిలోనూ వదిలేశారు అంటుంది.
ఆ మాటలకి.. శిల్ప వైపు చూసి నీ పొగరు తగ్గేదాకా మనుషులు కనిపించరు.. అనుకొని మాట్లాడకుండా ఇంటికి వెళతాడు.
గుడిసెకు వెళ్లగానే స్నానం చేస్తావా అని అడుగుతాడు. చాలా చిరాకుగా ఉంది. స్నానం చేద్దామంటే హీటర్ కూడా లేదు.
చన్నీళ్ళతో స్నానం చేయాలి అంటే వణుకు వచ్చేస్తుంది. సరే ఒక్క పది నిమిషాలు కూర్చో అని పోయ్యి రాజేసి వేడి నీళ్లు కాస్తాడు.
అవి స్నానాల గదిలో పెట్టి వెళ్లి స్నానం చేసి రా.. ఈ లోపు వంట చేస్తాను అంటాడు. ఆ మాటకి ఉదయ్ వైపు చూసి సరే అని స్నానం చేసి వస్తుంది.
శిల్ప స్నానం అయ్యాక ఉదయ్ కూడా స్నానం చేసి సిద్ధం చేసిన అన్నం కూరని వడ్డిస్తాడు. తినకుండా చూస్తున్న శిల్పతో తిను. ఎందుకు అలా చూస్తున్నావు.
ఏమీ మాట్లాడదు. నా వంట మరీ అంత భయంకరంగా ఏమి ఉండదు. తినగలవు. నా చెయ్యి బాగోలేదు. కొడవలి పట్టుకుని చెయ్యంతా రఫ్ అయిపోయింది అంటూ చూపిస్తుంది.
సరే నేను తినిపిస్తాను రా అని అన్నం కలిపి తినిపిస్తాడు. ఆకలి మీద ఉందో.. ఉదయ్ చేతి వంట బాగుందో కానీ మాట్లాడకుండా శుభ్రంగా తినేస్తుంది.
భోజనం చేశాక నిద్ర దేవి కళ్ళ మీదకి వస్తూ ఉంటే నేనింకా పడుకుంటాను. నావల్ల కాదు అంటుంది. సరే నువ్వు పడుకో.
ఇవన్నీ నేను కడిగేసి వస్తాను. మళ్ళీ పొద్దున్నే కష్టం కదా.. వెళ్లి ఆ గిన్నెలన్నీ కడిగి బోర్లించి వస్తాడు. ఉదయ్ పనుల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.
ఉదయ్ వచ్చి చాపపరుచుకుని మౌనంగా పడుకుంటే ఉదయ్ అని పిలుస్తుంది. చెప్పు అంటాడు. అసలు నువ్వేనా అంటుంది.
నీకు ఎందుకు అంత అనుమానం వచ్చింది. లేకపోతే ఒకప్పటి ఉదయ్ ఎలా ఉండేవాడు... పొగరుగా ఒక స్టైల్ మెయింటైన్ చేస్తూ రాయల్ గా ఉండేవాడివి.
ఇప్పుడేంటి ఇంత దారుణంగా అయిపోయావు.. ఆ మాటకి నవ్వుతూ ఆ పొగరు నాది కాదు... ఆ రాయాలిటీ నాది కాదు... ఒక రకంగా చెప్పాలి అంటే అది అవని బిక్ష అంటాడు.
అవని పేరు వినగానే శిల్పకి కోపం వచ్చేస్తుంది. ఎందుకు అవని పెట్టిన బిక్ష.. ఏముంది నీకు.. ఇవన్నీ ఇచ్చింది మా మమ్మీ.
మా మమ్మీ నీకు ప్రతి రూపాయి ఇచ్చి లగ్జరీ అలవాటు చేసింది. అలాంటిది మా మమ్మీని పొగడకుండా ఆఫ్ట్రాల్ ఆ పనిమనిషిని పొగుడుతావా అంటుంది.
పడుకున్నావాడు లేచి కూర్చుని చూడు శిల్పా నువ్వు తెలిసి మాట్లాడతావో.. తెలియక మాట్లాడతావో అర్థం కావడం లేదు.
ఇప్పుడు నీ పొజిషన్ ఏంటో నీకు తెలుసా.. నువ్వు అన్నావే పనిమనిషి అని తను ధనుంజయ్ ముద్దుల కూతురు.. పంచప్రాణాలు.
లేదు లేదు మా డాడీకి నేనంటేనే ఎక్కువ ఇష్టం అంటుంది. నువ్వంటే ఎక్కువ ఇష్టం కాదు. మీ మమ్మీ అలా క్రియేట్ చేసింది.
ప్రతి నిమిషం మీ నాన్న అవని కోసమే ఆలోచించేవారు. అవనికి తెచ్చిన ప్రతిదీ మీ అమ్మ నీకు ఇచ్చి నిన్ను ప్రిన్సెస్ చేసింది.
అవని స్థానంలో ఒక్కసారి నిన్ను నువ్వు ఊహించుకో. అలాంటి జీవితం లో ఒక్కరోజైనా ఉండగలవా.. అంతెందుకు జైలుకు వెళ్లావు.
ఆ మాట వినగానే శిల్ప కోపంగా చూస్తుంది. నువ్వు ఎంత కోపంగా చూసినా అదే నిజం. జైలుకు వెళ్లి వచ్చావు అయినా నీలో మార్పు లేదు.
యాన్యువల్ డే రోజున మీ డాడీ తన అసలైన వారసురాలు ఎవరో ప్రపంచానికి తెలియజేసి నువ్వు జీరో అని నీకే చూపించారు. అది విన్నా సరే నీలో చలనం లేదు.
ఇంకా అవనినీ నాశనం చేయాలి అనే ఆలోచనలో ఉన్నావు. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి అనే బంధం లో ఇద్దరముఉన్నాము.
ఏ రోజు కష్టపడితే ఆ రోజుకి మాత్రమే ఇక్కడ మనకి భోజనం ఉంటుంది. అయినా సరే నువ్వు ఒక ప్రిన్సెస్ లాగా ఫీల్ అవుతూ అవని పనిమనిషి అని చెబుతున్నావు.
ఏమిటి ఉదయ్ అంత జ్ఞానోదయం అయ్యిందా అవనీ జపం పట్టిస్తున్నావు అంటే నిజమే జ్ఞానోదయం అయ్యింది .
నీకు కావాలంటే విక్రమ్ కి చెప్పు. నాకన్నా బాగా జ్ఞానోదయం చేస్తాడు. ఆ మాటకి విక్రమ్ ని ఊహించుకోగానే చిన్నగా వణుకుతుంది.
ఏమైంది శిల్ప అంతలా వణుకుతున్నావు విక్రమ్ పేరు వినగానే... ఏమీ లేదులే అని కామ్ గా ఉంటుంది. నీ మంచి కోసమే చెబుతున్నాను .
అవని జోలికి వెళ్ళకు. ఇప్పటికే నువ్వు, మీ అమ్మ పాతాళని కన్నా ఇంకా అడ్డడుగుకి చేరిపోయారు. నీ సంగతేమో గాని మీ అమ్మ చేసిన ఆకృత్యానికి విక్రమ్ మామూలుగా వదలడు.
నేను చేయి వెయ్యబోయాను అని తెలిసే నాకు ఇంత నరకం చూపించాడు. అలాంటిది నువ్వు,మీ అమ్మ కలిసి చేసిన ఆ చండాలం సంగతి విక్రమ్ కి తెలిస్తే అంటాడు.
ఆ మాటకి గుండె దడ పెరిగిపోయి ఇంకా ఆపు ఉదయ్ అంటుంది. ఏమైంది శిల్పా... నాకు నిద్ర వస్తుంది అంటుంది .
విక్రమ్ ఇంటికి వెళ్ళేటప్పటికి... చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఏమైంది అని చుట్టూ చూస్తూ ఉంటాడు.
ఎవరు కనిపించకపోతే సర్వెంట్స్ ని అడుగుతాడు.
ఎవరు లేరు... ఎక్కడికి వెళ్లారు.. షాపింగ్కి వెళ్లారు. అవని మేమ్ ఒకరే ఉన్నారు. ఓకే అని... రూమ్ కి వెళతాడు.
రూమ్ ❤️❤️❤️
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)