26-02-2026, 07:52 AM
Part - 115
విక్రమ్ పరాచకానికి ధనుంజయ్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు. ఏంటి నా మొఖంలో ఏమైనా కోతులు డాన్స్ చేస్తున్నాయా.. అలా చూస్తున్నావ్.
విక్రమ్ బాబు కొంచెం క్లియర్ గా చెప్పు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు.
నా కూతురిని వాళ్ళు అని.. ఆ మాట అనలేక కళ్ళు మూసుకుంటాడు. ఓ... చిన్న కూతురుకి సంబరాలు చేయడంలో మునిగిపోయి అసలు పెద్ద కూతురు తిందా.. మంచి బట్ట కట్టిందా.. ఎక్కడ చదువుకుంటుంది..
ఆఖరికి. ఇంట్లో తన పరిస్థితి ఏమిటో కూడా పట్టించుకోలేనంత బిజినెస్ మాన్వి కదా.. నాకు తెలియక అడుగుతాను ఇంత సంపాదించి ఏం చేద్దాం అని...
నీ ముద్దుల భార్యకి బంగారుపు తొడుగు చేయించి.. నీ ముద్దుల కూతురికి బంగారు సింహాసనం ఇద్దాం అనుకున్నావా...
ధనుంజయ్ మోకాళ్ళ మీద కిందకి జారి.. ప్లీజ్ మీ మాటలతో నన్ను కుళ్ళపోడవద్దు. నిజంగా నాకు ఏమీ తెలియదు. మీరు అన్నట్టుగానే నేను దద్దినే...
అసలు ఏం జరిగిందో చెప్పండి అని కాళ్లు పట్టుకున్నంత పని చేస్తాడు.. ధనుంజయ్ స్టెప్ తెలిసి విక్రమ్ వెనక్కి అడుగు వేసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకుంటాడు.
అవని చెప్పిందంతా పూర్తిగా చెప్పి మీ ఇంట్లో ఉన్న సర్వెంట్స్ కి కూడా అవని ఎలా బ్రతుకుతుందో తెలుసు. ఇంటి యజమానికి కూతురు అంటే పంచప్రాణాలు.
కానీ ఆ కూతురు ఎలా బ్రతుకుతుందో తెలియదు. నీలాంటి గొప్ప తండ్రి ప్రపంచంలో ఎవరికీ ఉండరు అనుకుంటా.. నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు.
ఏంటి అన్నట్టుగా చూస్తే... ఫ్యూచర్లో నా పిల్లల దగ్గరికి వచ్చి నేనే మీ తాతని.. మీ అమ్మంటే నాకు అంత ఇష్టం. ఇంత ఇష్టం అన్న పిచ్చ డైలాగ్ లు మాత్రం చెప్పకు అంటాడు.
ఆ మాటకి ప్రాణం చచ్చిపోయినట్టుగా అయిపోయి అలాగే కూలబడిపోతాడు. ఏమయ్యింది మిస్టర్ ధనంజయ్... ఈ మాటకే నీకే ప్రాణం పోతున్నట్టు ఉందా..
మరి నువ్వు ఆరోజు అడిగిన దానికి నా భార్య పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది. తల్లి లేని ఆడపిల్లకి తండ్రి అన్ని అయి చూసుకోవాలి.
ఏ రోజైనా దగ్గరికి తీసుకున్నావా.. నీ ముద్దుల భార్య ఏది చెబితే అదే నిజమనుకొని దూరంగా నిలబడ్డావు. అదే దూరం ఇప్పుడు నా భార్య పెడుతూ ఉంటే మాత్రం నువ్వు తట్టుకోలేకపోతున్నావు.
ఇదే కర్మ అంటే... మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది మిస్టర్. ధనుంజయ్ ఏమి మాట్లాడాలేక మౌనంగా ఉండిపోతాడు.
ఇద్దరి మధ్యన మౌనం చాలాసేపు రాజ్యమేలుతుంది. విక్రమ్ కి ధనంజయని చూడాలి అన్న చాలా చిరాకుగా అనిపిస్తుంది.
మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని పిలిపించాను అంటాడు. మాటలు రాని ధనుంజయ్ మౌనంగా అల్లుడు వైపు చూస్తూ ఉంటే..
నీ భార్యని పూర్తిగా నా హ్యాండ్ఓవర్ చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు జైల్లో పెట్టి మెంటల్ టార్చర్ చేస్తే చాలు అని నా యాంగిల్ లో ట్రీట్మెంట్ ఇచ్చాను.
బట్ ఇప్పుడు అది సరిపోదు. నేను ఇచ్చే ట్రీట్మెంట్ కి పిచ్చిదై రోడ్డు మీదకి రావాల్సిందే...చేసిన తప్పుకి అనుక్షణం కుంగికుశించి పోవాలి అంటాడు.
ధనుంజయ్ కళ్ళు తుడుచుకుని ఆ శ్రమ మీకెందుకు అల్లుడుగారు... సోరి విక్రమ్ బాబు..
దాని సంగతి పూర్తిగా నేను చూసుకుంటాను. మీరు నా కూతురిని జాగ్రత్తగా చూసుకోండి. తండ్రిగా నేను పూర్తిగా ఓడిపోయాను అని అర్థమవుతుంది.
భర్తగా మీరు ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నారు. మీలాంటి వ్యక్తి నా కూతురు జీవితంలో ఉండడం నిజంగా నా అదృష్టం.
మీరు అవునన్నా కాదన్నా అవని ఎప్పటికీ నా బంగారు తల్లె.. మీరు నా అల్లుడే అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతున్న ధనుంజయ్ ని చూస్తూ.. సెక్యూరిటీకి కాల్ చేసి ఇద్దరు పర్సన్స్ ని ధనుంజయని ఫాలో అవమని చెబుతాడు.
ధనుంజయ్ మెల్లిగా బయటకు వచ్చి రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. డ్రైవర్ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. ఎంత దూరం అని తెలియకుండా చాలా దూరం వెళ్ళిపోతాడు.
నడిచి... నడిచి కాళ్లు లాగేటప్పటికీ దగ్గరలో ఉన్న బెంచ్ పైన కూర్చుని చూస్తూ ఉంటాడు. ఆకాశం మబ్బులు పట్టి ఉంటుంది.
వర్షం పడే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. డ్రైవర్ కంగారుగా వచ్చి సార్ వర్షం పడేటట్టు ఉంది. హ అని మళ్ళీ చూస్తూనే ఉంటాడు.
వర్షం మొదలవుతుంది. చినుకు చినుకు పెరిగి పెద్దది అవుతూ ఉంటుంది.
ఒక తండ్రి బైక్ మీద తని ఇద్దరు పిల్లల్ని కూర్చోపెట్టుకొని వాళ్ళిద్దరూ తడవకుండా రైన్ కోట్ వేసి... తండ్రి తడుస్తున్న సరే మెల్లిగా తీసుకు వెళుతూ ఉంటాడు.
స్పీడుగా బైక్ నడిపితే ఎక్కడ బండి జారుతుందో.. పిల్లలు ఇబ్బంది పడతారేమో అని జాగ్రత్తగా తీసుకు వెళుతూ ఉంటాడు.
అది చూస్తున్న ధనుంజయ్ కి గుండె మెలిపెట్టినట్టు అవుతుంది. ఏ రోజు కూడా అవని నీ బండిమీద కాదు కదా.. కారులో కూడా ఎక్కడికి తీసుకువెళ్ళలేదు.
తన చేతులతో ఒక చాక్లెట్ నోట్లో పెట్టలేదు. ఆఖరికి సినిమాకి వెళ్లిన.. ట్రిప్ కి వెళ్ళినా.. ఎక్కడికి వెళ్లినా తన తల్లిదండ్రులను కూడా తీసుకు వెళ్ళాడు కానీ అవని నీ తీసుకువెళ్లలేదు.
రాను అంటే వదిలేశాడు కానీ... బ్రతిమాలి.... ఎందుకు రాదు కనుక్కుని నచ్చజెప్పి ఏనాడు తీసుకు వెళ్ళలేదు. ఈరోజు ఆ తప్పులే గుణపాలై గుండెల్లో దిగుతూ ఉంటే ఎవరికీ చెప్పుకోలేని బాధ.
ఈరోజు క్షమించు అని ఒక చిన్న మాట చెబితే అవని ఎలా క్షమిస్తుంది. ఏది చేసినా స్వార్థమే అనుకుంటుంది కదా.. అని ఏడుస్తూ ఉంటాడు.
ఆ వర్షంలోనే ధనుంజయ్ కన్నీళ్లు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. దారినపోయే వాళ్ళకి ధనుంజయ్ ని చూస్తూ ఉంటే ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు.
డ్రైవర్ కి భయం వేసి ఇంటికి ఫోన్ చేసే విషయం చెబుతాడు. వెంటనే మరొక కారులో సత్యవతి, శేషగిరి గారు వచ్చి కొడుకుని అలా చూసి విలవిల్లాడిపోతారు.
శేషగిరి పరిగెత్తుకుంటూ వెళ్లి గొడుగు పట్టుకుని ఏంట్రా ఇది అని అడిగితే.. నాన్న అని చుట్టూ చేతులు వేసి బోరుమంటాడు.
కొడుకు బాధ చూడలేక ముసలి ప్రాణాలు రెండు విలువల్లాడిపోతాయి. సత్యవతి పేగు మెలిపడినట్టు అయ్యి..
ముందు ఇంటికి వెళదాం పద ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం అని కొడుకుని బలవంతంగా లేపి కారులో కూర్చోబెడతారు.
ధనుంజయ్ దుఃఖాన్ని ఆపకోలేకపోతుంటాడు. ఇది అని చెప్పలేక నలిగిపోతూ ఉంటాడు. టవలతో కొడుకు తల తుడుస్తూ ఏమైందిరా ఇంత వర్షం పడుతున్న సరే అలాగే ఉండిపోయావు.
చేసిన తప్పు ఇది అని తల్లికి చెప్పలేక ఒడిలో పడుకుని నాలాంటి తండ్రి ఎవరికి వద్దమ్మా అని మనసులోనే రోదిస్తూ ఉంటాడు.
ఇంటికి వెళ్లే దాకా మౌనంగానే ఉంటారు. కారు దిగి ఆ తడి బట్టలతోనే మెల్లిగా అడుగులు వేస్తూ లోపలికి వెళతాడు హాల్లో ఉన్న రజిత ఫోటో చూసి తప్పు చేసిన వాడిలాగా తలదించుకుంటాడు.
మెల్లిగా ఫోటో దగ్గరికి వెళ్లి తడుముతు నన్ను క్షమించు రజిత. నాలాంటి వాడు నీ జీవితంలోకి రాకపోయి ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండేదానివి.
ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండేదానివి. ప్రేమా ప్రేమా అని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాను.
నిన్ను కాపాడుకోలేకపోయాను. మన ప్రేమకి గుర్తు అయిన మన బిడ్డ ఈ ఇంటిలోనే నరకం అనుభవిస్తూ ఉంటే తెలుసుకోలేని గుడ్డివాడినయ్యాను.
సత్యవతి కి శేషగిరి కి కొడుకుని అలా చూసి చాలా భయంవేస్తుంది. వీడేమిటి ఏదేదో వాగుతున్నాడు. ఇలాగే ఉంటే కష్టమని దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి ఏమైందిరా ఎందుకు ఇలాగ అయిపోతున్నావు.
తల్లి పాదాలు పట్టుకుని క్షమించలేని తప్పు చేశానమ్మ.. నా కూతురు జీవితంలో నా మొఖం చూడదు అని విక్రమ్ మాటలు తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూఉంటాడు.
సత్యవతికి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. ఇలాగే ఉంటే కష్టమని మెల్లిగా లేపి గదిలోకి తీసుకువెళ్లి ముందు స్నానం చేసిరా.. బలవంతంగా వాష్ రూమ్ కి పంపిస్తుంది.
సర్వెంట్ ని పిలిచి వేడివేడిగా సూప్ చేయమని చెబుతుంది. స్నానం చేసి వచ్చి ప్రాణం లేని బొమ్మలాగా అలాగే కూర్చుండిపోతాడు. సర్వెంట్ తెచ్చిన సూప్ ని సత్యవతి మెల్లిగా తాగిస్తుంది .
సూప్ తాగి కొంచెం కుదుటపడ్డాడు అనుకున్నాక ఇప్పుడు చెప్పరా ఏమయింది అని అడుగుతుంది. ఏమని చెప్పాలి అమ్మ.
భార్గవి మాటలు విని అవని విషయంలో ఏ తండ్రి చేయకూడని తప్పే చేశాను అంటాడు. ఆ మాటకి భయంగా కొడుకు వైపు చూస్తూ.. ఏమంటున్నావురా అవనికి ఏమైంది..
జరిగింది మొత్తం చెబుతాడు. వినగానే సత్యవతి కూడా నోటి మాట రాకుండా అయిపోతుంది. నాకు కూడా ఈ విషయం తెలియదు రా..
అవని కూడా చెప్పలేదు. ఏమని చెబుతుంది అమ్మ. నీ కొడుకు ఇంత నికృష్టుడు అని నీకు చెప్పగలుగుతుందా... అది బంగారు తల్లి.
అందుకనే నీ కొడుకు ఎంత ఎదవైనా నీకు చెప్పలేక మౌనంగా తనలో తానే ఏడ్చింది. ఇందులో నీ తప్పేముంది రా...
నీకు తెలిసి జరగలేదు కదా.. తెలిస్తే నువ్వు ఒప్పుకుంటావా.. నీ ప్రాణాలు అడ్డుపెట్టి నీ కూతురిని కాపాడుకోవా..
విరక్తిగా నవ్వుతూ కాపాడుకోవడం.. ఏ రోజు కాపాడాను అమ్మ. ప్రతిసారి తనకోసం తనే ఫైట్ చేసింది. పెళ్లయ్యాక భర్తగా విక్రమ్ ఫైట్ చేశాడు.
తండ్రిగా ఏ రోజు నేను నిలబడ్డాను. రజిత దూరమైనప్పటినుంచి దిక్కులేని దానిలాగానే బ్రతికింది. ఇన్ని కోట్లు ఆస్తి ఉంది. ఎవరికోసం సంపాదించాను. దేనికోసం సంపాదించాను.
బిజినెస్ చేస్తున్నారు. ఎదుట ఉన్నవాళ్లు.. ఎలాంటి వాళ్ళు ఏమిటో అన్నది ఒక్క మాటలోనే తెలిసిపోతుంది కదా... అలాంటిది మీ ఇంటిలో జరిగేది మీకు తెలియదు అంటే నమ్మాలా అని ఆరోజు అడిగింది.
అవని విషయంలో నా తప్పేమీలేదు అని ప్రూఫ్ చేసి నా కూతురికి దగ్గర అవ్వాలి అనుకున్నాను. ఈ నీచమైన పని ఆ రాక్షసి చేసి శాశ్వతంగా నా కూతురు దృష్టిలో నన్ను ఒక నీచుడి కింద నిలబెట్టింది.
ఈ తండ్రి బాధ తీరేనా ??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)