Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 98


బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ లో అవిడెన్స్ బ్యాగ్ తో పాటు దొరికిన చాక్లెట్ కి ప్రాణం ఉందని మిత్ర చెప్పడంతో తన చేతుల్లోకి తీసుకొని శ్రీకర్ చెప్పేది వినకుండా ఆకాశం వైపు చూపించి కళ్ళు మూసుకున్నాడు అభీర్.

************

చాక్లెట్ ని తన చేతుల్లోకి తీసుకున్న అభీర్ వైపు చూస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి పక్కకు వెళ్లి లిఫ్ట్ చేసి "హలో ఎవరు మాట్లాడేది?" అని అడిగాడు శ్రీకర్.

"హలో ఆఫీసర్ నా పేరు ముజాఫిర్! మీరు చనిపోయిన వాళ్ళ గురించి బాధపడడమే తప్ప బతికి ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలో ఆలోచించరా..?" అని నవ్వుతూ అడిగాడు.

ఆ మాట విని "ముజాఫిర్ నువ్వు ఏ గ్రూప్ కి చెందిన వాడివి? నీకు ఏం కావాలి?" అని అడిగాడు శ్రీకర్.

"సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ గా అడిగావు, తీహార్ జైల్లో ఉన్న మా 12 మంది తీవ్రవాదుల్ని రిలీజ్ చేసి అభీర్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ లు వాళ్లకి ఇచ్చి పంపించాలి.

మీకు కరెక్ట్ గా ఆఫెన్ అవర్ టైమ్, మీ డిసిషన్ చెప్పకపోతే  సిన్సియర్ జైలర్ ఫ్యామిలీ మీకు కనిపిస్తారు కానీ తలలు మా దగ్గరే ఉంటాయి, నేను మళ్ళీ  కాల్ చేస్తాను ఈ లోపు మీరు ట్రైనింగ్ లో నేర్చుకున్నది మాకు చూపించడానికి ట్రై చేయకండి." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముజాఫిర్.

అతను చెప్పింది విని మాట్లాడడానికి "హలో హలో!" అంటూ ఫోన్ కట్ అవ్వడంతో దయ వైపు చూసి "కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రైస్ చేయండి." అని చెప్పి బైరి వైపు చూసి "ముజాఫిర్ అంట కాల్ చేసాడు తెలుసా?" అని అడిగాడు  శ్రీకర్.

"ముజాఫిర్ పంజాబ్ బేస్ గా యాక్టివిటీస్ చేసేవాడు త్రీ మంత్స్ బ్యాక్  చనిపోయాడు మళ్లీ తిరిగి ఎలా వచ్చాడు?" అని డౌట్ గా అడిగాడు బైరి.

"మేడం వాళ్ళు అతని  కస్టడీలోనే ఉన్నారు తీహార్ జైల్లో ఉన్న 12 మంది టెర్రరిస్టులు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ లు కావాలి అని అడుగుతున్నాడు లేకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు." అని చెప్పాడు శ్రీకర్.

"అవునా?" అని అభీర్ చేతిలో ఉన్న చాక్లెట్ కదలడం సంతోషంగా చూస్తూ అటువైపు తిరిగాడు బైరి.

చాక్లెట్ కళ్ళు తెరవడంతో కింద నుంచో పెట్టి "ఇప్పుడు ఎలా ఉంది?" అని అడిగాడు అభీర్.

ఆ మాట విని చుట్టూ చూస్తూ "నేను నీళ్లలో ఉండాలి కదా నా చేతిలో ఎవిడెన్స్ బ్యాగ్ ఏమైపోయింది?" అని కంగారుగా అడిగాడు చాక్లెట్.

"ఆ బ్యాగ్ మా దగ్గర సేఫ్ గానే ఉంది అసలు ఏం జరిగింది? ఇక్కడికి వచ్చింది ఎవరు?" అని అడిగాడు అభీర్.

"నేను బామ్మ గారితో పాటు గదిలో ఉన్నాను అరుపులు వినిపించి బయటకు వెళ్లాను అక్కడ జాజి అంకుల్  బుల్లెట్ తగిలి కింద పడిపోయి ఉన్నాడు హాల్ మొత్తం పొగతో నిండిపోయింది.

చాలామంది గ్యాస్ మాస్కులు పెట్టుకుని గన్స్ తో లోపలికి వచ్చారు వాళ్లలో ఒకడు నాదల్ ఎవిడెన్స్ బ్యాగ్ ఎక్కడ ఉందో చూడు అని చెప్పాడు, ఆ మాట వినిపించి బ్యాగ్ తో పైకి వెళ్లి వాటర్ ట్యాంక్ లో దూకేశాను." అని చెప్పాడు చాక్లెట్.

ఆ మాట విని బైరి వైపు చూసి "నాదేల్ ఎవరు? అని అడిగాడు అభీర్.

"సందీప్ సార్ వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్లలో ఒకడై ఉంటాడు ఇప్పుడే మూజాఫిర్ అనే తీవ్రవాది కాల్ చేశాడు తీహార్ జైల్లో ఉన్న 12 మంది తీవ్రవాదులు ఎవిడెన్స్ బ్యాగ్ అరగంటలో పంపించాలి లేకపోతే తన దగ్గర ఉన్న అందర్నీ చంపేస్తాను అని బెదిరించుతున్నాడు." అని చెప్పాడు శ్రీకర్.

చాక్లెట్ వైపు చూస్తూ "నువ్వు ఆ ఒక్క మాట విన్నావా? ఇంకా ఏమైనా వినిపించాయా?" అని అడిగాడు అభీర్.

"నేను ఆ ఒక్క మాట మాత్రమే విన్నాను తర్వాత బామ్మ గారి రూమ్ తలుపులు దగ్గరికి వేసి పైకి వెళ్ళిపోయాను తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు." అని చెప్పాడు చాక్లెట్.

అక్కడికి వచ్చి "సార్! మీ మొబైల్ కి వచ్చిన కాల్ ట్రేస్ అవడం లేదు , ఆది కాకుండా ఇక్కడ స్పోక్ బాంబు యూస్ చేసినట్లు కనిపించడం లేదు." అని చెప్పాడు దయా.

ఆ మాట విని ఆలోచిస్తున్న అభీర్ దగ్గరికి వెళ్లి "నాయకుడా! మన లెక్కలో ముజాఫిర్ చనిపోయాడు కానీ మళ్ళీ బతికి వచ్చాడు నాకెందుకో అనుమానంగా ఉంది." అని చెప్పాడు బైరి.

"గెస్ట్ హౌస్ బ్లాస్ట్ అయిందని చెప్పారు కదా లోపల చనిపోయిన వాళ్ల గురించి ఏమైనా తెలిసిందా?" అని అడిగాడు అభీర్.

"చాలామంది చనిపోయారు గుర్తుపట్టలేనంతగా బాడీస్ పీస్ పీస్ అయిపోయాయి." అని చెప్పాడు దయ.

శ్రీకర్ మొబైల్ కి వచ్చిన కాల్ రికార్డింగ్ వింటూ "కన్ఫర్మ్ గా ఇది ముజాఫిర్ వాయిస్ కాదు." అని చెప్పాడు ఆగస్త్య.

"అవునా? మరి చనిపోయిన వ్యక్తి పేరు మీద మనల్ని ట్రాప్ ఎందుకు చేస్తున్నారు." అని డౌట్ గా అడిగాడు శ్రీకర్.

"మనల్ని రాంగ్ ట్రాక్ పట్టించడానికి!" అని రియావైపు చూసి " అడవిలో ఉన్న అరుల్ కి మెసేజ్ పంపించు." అని చెప్పాడు అభీర్.

"ఓకే!" అని ఫోన్ తీసి అరుల్ కి మెసేజ్ పంపించింది రియా.

అంతలో అక్కడకు వచ్చి చనిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తూ "ఆఫీస్ కి వెళ్లడానికి పికప్ చేసుకోవడానికి వస్తున్నానని నీలమ్ కాల్ చేసింది నేను వెయిట్ చేస్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది." అని చెప్పింది సుమతి.

ఆ మాట విని నీలమ్ రూమ్ లోకి వెళ్లి చూసి "అభీర్! ఇక్కడ నీలమ్ కంపెనీ ఐడి టాగ్ లేదు అది తన మెడలోనే ఉండి ఉంటుంది. వీళ్ళ సేఫ్టీ కోసం నేను దాంట్లో ట్రాకర్ ఫిక్స్ చేశాను." అని చెప్పింది మిత్ర.

ఆ మాట విని దయ వైపు చూసి "క్విక్ ఐడి కార్డులో ఉన్న ట్రాకర్ ని ట్రేస్ చేయండి." అని చెప్పాడు శ్రీకర్.

"సార్! అలాగే మిథున్ పిఏ రాహుల్ నెంబర్ కూడా ట్రేస్ చేయండి." అని చెప్పాడు అభీర్.

అంతలో ఫోన్ రింగ్ అవడంతో చూసి "అరుణ్ కాల్ చేస్తున్నాడు." అని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి "నాయకుడు మాట్లాడుతున్నాడు." అని చెప్పింది రియా.

ఆ మాట విని "జై భవాని!" అని చెప్పాడు అరుల్.

"జై భవాని అరుల్! అక్కడ పరిస్థితి ఏమిటి?" అని అడిగాడు అభీర్.

రాతి కొండమీద నుంచొని సింబా తో కలిసి కిందకి చూస్తూ "నాయకుడా! ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉంది. వాసుకి వాళ్ళ నిధికి వెళ్లే దారి కోసం వెతుకుతున్నారు, నంద ఫ్యామిలీ మనకి క్షమాపణలు చెప్పడానికి ఇక్కడికి వస్తారు అని నిర్మల్ అంటున్నాడు." అని చెప్పాడు అరుల్.

"అక్కడ అనుమానంగా ఏమైనా జరిగిందా?" అని అడిగాడు అభీర్.

"పశ్చిమం వైపు ఉన్న కొండల దగ్గర పేలుడు శబ్దాలు వినిపించాయి ఏం జరిగిందో చూడడానికి మన వాళ్ళు కొంతమంది వెళ్లారు." అని చెప్పాడు అభీర్.

"పశ్చిమ వైపు ఆ..!" అని కాసేపు ఆలోచించి "పశ్చిమం వైపు వెళ్లిన మనవాళ్ళని వెనక్కి రప్పించి, సింబా ని నా దగ్గరికి పంపించు,  అలాగే వాసుకి వాళ్ళకి నిధికి వెళ్లే మార్గం చూపించండి."  అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని "నాయకుడా నిధికి వెళ్లే మార్గం వాళ్ళకి మనమే చూపిద్దామా?" అని డౌట్ గా అడిగాడు అరుల్.

"నేను చెప్పినట్లు చెయ్! అక్కడ ఏం జరిగినా సరే బైరి వాళ్ళు అక్కడకి వచ్చే వరకు ఎదురు దాడి చేయకండి. ఒకవేళ ముకుల్ ఫ్యామిలీ వచ్చారు అంటే నాకు తెలియాలి." అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా?" అని ఫోన్ పెట్టేసి సింబా వైపు చూసి "పశ్చిమానికి వెళ్ళిన సోము వాళ్ళని వెనక్కి పంపించి నువ్వు నాయకుడి దగ్గరికి వేళ్ళు!" అని చెప్పి కొండ దిగి నిర్మల్ వాళ్ళ దగ్గరికి బయలుదేరాడు అరుల్.

"ఫోన్ మాట్లాడి పెట్టేసిన  అభీర్ వైపు చూసి "నాయకుడా! ఏం జరుగుతుంది? వాళ్ళకి నిధికి దారి చూపించడం ఎందుకు?" అని కంగారుగా అడిగింది రియా.

"ఒక జంతువు మన దగ్గర నుంచి కదలకుండా ఉండాలి అంటే  తిండి పెట్టి మచ్చిక చేసుకోవాలి, ఆదే మనిషి కదలకుండా ఉండాలి అంటే ఆశ చూపించాలి తను ఉన్న చోట తనకి బలం ఉంది అనిపించేలాగా చేయాలి." అని చెప్పి శ్రీకర్ వైపు చూసి

"ముజాఫిర్ కాల్ చేస్తే మరొక అరగంట టైం పడుతుంది 12 మందిని రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది వాళ్లతో పాటు ఆ బ్యాగ్ ఇచ్చి పంపిస్తాము ఎక్కడికి రావాలో అడగండి." అని చెప్పాడు అభీర్.

"ఈ విషయంలో ఇంకా గవర్నమెంట్ తో ఏమి మాట్లాడలేదు అయినా 12 మందిని రిలీజ్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అరగంటలో అవ్వదు." అని చెప్పాడు శ్రీకర్.

"నాకు అరగంట చాలు ఆఫీసర్!" అని చెప్పి బైరి వైపు చూసి "మీరు చనిపోయిన మన వాళ్ళని తీసుకుని అడవికి బయలుదేరండి. అక్కడికి చేరుకున్న మన వాళ్ళతో కలిసి సిద్ధంగా ఉండండి ఐదవ వేదంలో ఆఖరి పేజీ చదివే సమయం వచ్చింది." అని చెప్పాడు అభీర్.

ఆ మాట విని కసిగా చూస్తూ "జై భవాని!" అని చెప్పి రియా, రాజన్ వాళ్ళతో కలిసి చనిపోయిన వాళ్ళ శరీరాలు తీసుకుని అక్కడి నుంచి కార్ లో  అడవికి బయలుదేరాడు బైరి.

అంతలో అక్కడికి వచ్చి "సార్! లొకేషన్ ట్రేస్ అయింది. ఐడి లొకేషన్ తో పాటు రాహుల్  ఫోన్ లొకేషన్ కూడా అక్కడే ఉంది. కానీ ఆ ఏరియాకి వెళ్లడం చాలా డేంజర్!

అక్కడ అంతా కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉంటారు డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనకడరు మనం ఫోర్సుని తీసుకుని వెళ్లడం బెటర్!" అని చెప్పాడు దయా.

"ఆ లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వండి నేను వెళతాను మీరు వెనకాల ఫోర్సును తీసుకుని రండి." అని చెప్పాడు అభీర్.

"నో అభీర్! ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు ఆ ఏరియాలోకి సింగిల్ గా వెళ్లడం చాలా డేంజర్!" అని చెప్పాడు దయా.

"లొకేషన్ డీటెయిల్స్!" అని గంభీరమైన గొంతుతో అడిగిన అభీర్ ని చూసి "దయా! నేను కుడా వెళుతున్నాను ఫోర్స్ తీసుకుని త్వరగా రండి." అని చెప్పి వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు శ్రీకర్.
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 26-02-2026, 07:44 AM



Users browsing this thread: 1 Guest(s)