Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 97


అభీర్ ఫోన్లో చెప్పింది విని వసుంధర దగ్గరికి వచ్చి మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్లాలి మేడం అని చెప్పేలోపు వదిన అర్ణ ఇచ్చిన స్వీట్ బాక్స్ లో నుంచి పొగ వస్తుంది అని  స్పృహ తప్పి పడిపోయింది నీలమ్ అంతలో  బుల్లెట్ వచ్చి పక్కనే ఉన్న జాజి తలలో దిగడంతో షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది వసుంధర.

**************

జాజి తలలో బుల్లెట్ దిగడం చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచింది వసుంధర.

బాక్స్ లో నుంచి వస్తున్న పొగకి సందీప్ రావు, రోషిని స్పృహ తప్పి పడిపోవడం చూసి "మేడం! మనం మోసపోయాము." అని చెప్పి గ్యాస్ మాస్కులు  పెట్టుకుని లోపలకి వస్తున్న మనుషులను చూసి వసుంధర కి ఎదురుగా వెళ్లి నిలబడింది మల్లి.

స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని చూసి "నారప్ప! ఆ పొగ పిల్చకూడదు." అని అక్కడ ఉన్న టవల్ మొహానికి కట్టుకున్నాడు శంకర్.

లోపలికి వచ్చిన మనుషులు రాముని షూట్ చేయడంతో టవల్ మొహానికి కట్టుకుని వాళ్ళకి మీదకి వెళ్లారు శంకర్ నారప్పలు.

ఆ పొగలో "నాదల్ ఎవిడెన్స్ బ్యాగ్ ఎక్కడ ఉందో చూడు." అని మాట వినిపించడంతో  రూమ్ లో ఉన్న ఎవిడెన్స్ బ్యాగ్ తీసుకుని డాబా మీదకి వెళ్లి వాటర్ ట్యాంక్ లో దూకేడు చాక్లెట్.

అప్పటికే పొగ పిల్చడంతో మత్తులో ఉన్న నారప్ప, శంకర్, మల్లి లను చంపి వసుంధర ఫ్యామిలీని టేబుల్ మీద ఉన్న స్వీట్ ప్యాకెట్స్ ని  తీసుకుని అక్కడి నుంచి కార్ లో వెళ్లిపోయారు మాస్క్ వేసుకున్న మనుషులు.

***********

కాసేపటికి అక్కడికి చేరుకుని ఇంటి లోపలకు వెళ్లి నారప్ప వాళ్ళు చనిపోయి ఉండడం చూసి బాధపడుతూ ఉన్నారు రాజన్ వాళ్ళు.

చనిపోయిన నారప్ప శంకర్ ల వైపు చూస్తూ "వీళ్ళు మొహానికి టవల్స్ ఎందుకు కట్టుకున్నారు?" అని అడిగింది మిత్ర.

చనిపోయిన నలుగురు వైపు చూస్తూ "ఇక్కడ మత్తు మందు ప్రయోగించి ఎటాక్ చేశారు లేకపోతే వీళ్ళ నలుగురిని ఎవరు అంత తేలికగా పడగొట్టలేరు, పిరికినా కొడుకులు దొంగ దెబ్బ తీసి చంపారు." అని బాధగా చెప్పాడు బైరి.

ఇంటి లోపల మొత్తం చూసి వచ్చి "నాయుకుడా! వసుంధర మేడం ఫ్యామిలీలో ఎవరు కనిపించడం లేదు." అని కంగారుగా చెప్పింది రియా.

తన వాళ్ళ వైపు బాధగా చూస్తూ ఆవేశంతో ఇల్లు దద్దరిల్లిపోయేలాగా గట్టిగా అరిచాడు అభీర్.

"ఈ పని కచ్చితంగా తెలిసిన వాళ్ళు చేసారు వసుంధర మేడం ఫ్యామిలీని కిడ్నాప్ చేసి మన వాళ్ళందరిని చంపేశారు." అని బాధపడుతూ చెప్పాడు రాజన్.

"మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ కోసమే ఇదంతా చేశారు." అని చెప్పాడు అగస్త్య.

ఆ మాట విని "చాక్లెట్ కూడా ఇక్కడే ఉన్నాడు ఎవిడెన్స్ లు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లే వరకు ఆ బ్యాగ్ కి నేను బామ్మా గారు కాపలాగా ఉంటాము అన్నాడు." అని కంగారు గదిలోకి వెళ్లి మంచం మీద చనిపోయి ఉన్న బామ్మ ని చూసి "ఇక్కడ ఎవిడెన్స్ బ్యాగ్ లేదు." అని చెప్పింది మిత్ర.

మంచం మీద  ఉన్న బామ్మ శరీరం దగ్గరికి వెళ్లి బాధగా చూస్తూ నోటి నుంచి నురగ రావడం చూసి "మత్తు మందు వల్లే ఈవిడ చనిపోయారు." అని చెప్పాడు అభీర్.

అంతలో అక్కడికి వచ్చి చనిపోయిన వాళ్ళ వైపు చూసి ఫోన్ తీసి దయా కి కాల్ చేసి "ఐదు నిమిషాల్లో ఇక్కడ డాగ్ స్క్వాడ్  ఉండాలి." అని చెప్పాడు శ్రీకర్.

బైరి వాళ్ళ వైపు చూసి "నంద గెస్ట్ హౌస్ దగ్గరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు అని వరదరాజులు ఫోన్ చేసి చెప్పాడు, నాకు తెలిసి వాళ్లే ఎవిడెన్స్ ల కోసం ఇక్కడికి వచ్చి ఉంటారు, ఆ గెస్ట్ హౌస్ నుంచి ఒక్కడు కూడా బయటికి వెళ్ళకూడదు." అని ఆవేశం గా చెప్పాడు అభీర్.

"ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవిడెన్స్ లు దొరికితే వసుంధర మేడం వాళ్ళని కిడ్నాప్ చేయరు చంపేసేవారు ఖచ్చితంగా వాళ్ల చేతికి ఎవిడెన్స్ లు వెళ్లలేదు.

ఈ టైంలో ఆవేశపడితే వాళ్ల ప్రాణాలకి కుడా ప్రమాదం నంద గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లి చెక్ చేసి రమ్మని ఆఫీసర్స్ ని పంపిస్తాను." అని చెప్పాడు శ్రీకర్.

"మీరు చెప్పింది కూడా నిజమే ఎవిడెన్స్ లు వాళ్ళ చేతికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాయి." అని ఇంటి లోపల వెతుకుతూ ఉన్నారు అభీర్ వాళ్ళు.

అంతలో డాగ్ స్క్వేడ్ తో దయ అక్కడికి రావడంతో ఇల్లు మొత్తం వాసన చూసి డాబా మీదకి పరిగెత్తాయి కుక్కలు.

***************

ఆదే సమయం లో నందా గెస్ట్ హౌస్ దగ్గరికి స్పృహలో లేని వసుంధర వాళ్ళని తీసుకుని వరదరాజుల వాళ్ళతో పాటు వచ్చి "ఇకనుంచి వీళ్ళ బాధ్యత మాది అభీర్ కి మీ మీద ఎటువంటి అనుమానం రాదు, ఈ గెస్ట్ హౌస్ కూడా మీదే అని ముకుల్ గారు చెప్పమన్నారు." అని కీస్ ఇచ్చాడు నాదల్.

ఆ మాటకి సంతోషంగా తాళాలు తీసుకుని తన మనుషులతో కలిసి  గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిన వరదరాజులు వాళ్ళని చూసి "సాధు! మనం ఇంకా ఇక్కడ ఉండకూడదు." అని చెప్పాడు ధీరాజ్.

అక్కడ నుంచి కార్లు వెళ్లిపోవడం చూసి "అసలు ఈ గోలకి మనకి ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ ఇక్కడికి అభీర్ వస్తే మనం ఫోన్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.

ఇక్కడికి వచ్చిన గుర్తు తెలియని మనుషులు నంద ఫ్యామిలీని అభిజిత్ ని తీసుకు వెళ్లిపోయారు అని చెప్పండి. ఈరోజు నుంచి ఇండియాలో ఉన్న ఇద్దరి ఆస్తులు మనమే!" అని సంతోషంగా చెప్పాడు వరదరాజులు.

"డాడ్! ఆస్తులు మాత్రమే కాదు రాజకీయాలలో కూడా ఇంక మనకి ఎదురు లేదు." అని చెప్పాడు తంబియార్.

"అది సరే! నందా ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్లినట్లు అసలు మనతో ఇదంతా ఎందుకు చేయించారు? నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది." అని కంగారుగా చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"ఎటువంటి డౌటు లేదు మనం అనుకున్నదే జరిగింది వాళ్లు వాళ్లు కొట్టుకు చస్తారు మనం హ్యాపీగా ఉందాము." అని చెప్పాడు వరదరాజులు.

"మీరు ఒక్క విషయం ఆలోచించడం లేదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నందని బెదిరిస్తున్నారు అంటే అభీర్ ఎందుకు అలెర్ట్ అవుతాడు ఆది కాకుండా వసుంధర ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ నాదెల్ గాడు ధీరజ్ గాడు దేనికోసమో వెతికారు.

ఏంటి అని అడిగితే ఏమీ లేదు ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూస్తున్నాము అని చెప్పాడు నాకెందుకో కావాలని మనల్ని ఇరికించినట్లు అనిపిస్తుంది." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.

"డాడ్! నువ్వేమీ కంగారు పడకు అటువంటిదేమీ ఉండదు." అని చెప్పాడు సుజిత్.

అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "ముకుల్ ఫోన్ చేస్తున్నాడు." అని లిఫ్ట్ చేసి "అయ్యా! మీరు చెప్పింది చెప్పినట్లు చేశాము వసుంధర ఫ్యామిలీని మీ వాళ్ళకి అప్ప చెప్పాము మీరు సేఫ్ గా లండన్ బయలుదేరారు కదా!" అని అడిగాడు వరదరాజులు.

"ఎస్! మేము సేఫ్ గా బయలుదేరాము మీరు ఎలాగైనా ఇది సాధించి గెస్ట్ హౌస్ కి వస్తారని నాకు తెలుసు అందుకే మీ కోసం ఫ్రిజ్లో ఓల్డ్ వైన్ బాటిల్ ఉంచాను నా ఆస్తితో పాటు దానిని కూడా తీసుకుని ఎంజాయ్ చేయండి." అని చెప్పాడు ముకుల్.

"సరే అయ్యా!" అని సంతోషంగా వెళ్లి ఫ్రీజ్ డోర్ తీశాడు వరదరాజులు.

వ్యాన్ లో వెళుతూ ఫోన్ కట్ అవడంతో అర్ణ వైపు చూసి నవ్వుతూ "వరదరాజులు గిఫ్ట్ తీసుకున్నాడు." అని చెప్పాడు ముకుల్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఈ ముక్కోడు వరదరాజులు వాళ్లకి ఏం గిఫ్ట్ ఇచ్చాడబ్బా..?" అని ఆలోచిస్తూ ఉన్నాడు రఘురామ్.

"తాతయ్య! అడవిలో ఆల్రెడీ అభీర్ మనుషులు ఉన్నారు మనం వెళ్లగానే ఈ విషయం వాడికి తెలిసిపోతుంది." అని చెప్పాడు విష్ణు.

"ఆ విషయం నాకు తెలుసు అడవికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా తెలుసు! అక్కడికి వీళ్ళతో సమఉజ్జీలు అయిన వాళ్లే వస్తున్నారు." అని చెప్పాడు ముకుల్.

***********

ఇంటి పైకి వెళ్ళిన డాగ్స్ ని చూసి వాటి వెనకాలే పైకి వెళ్లి వాటర్ ట్యాంక్ లో చెయ్యి కనపడడంతో అభీర్ గట్టిగా అరిచింది మిత్ర.

ఆ అరుపు విని ఇంటి పైకి వెళ్లి ట్యాంక్ లో నుంచి చాక్లెట్ ని బ్యాగ్ ని తీస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్లను చూస్తూ ఉండిపోయాడు అభీర్.

దగ్గరికి వెళ్లి చాక్లెట్ గట్టిగా పట్టుకుని "ఎవిడెన్స్ లకి కాపలా ఉంటాను అని చెప్పిన మాటకి ప్రాణాలు వదిలేసావా?" అని ఏడుస్తూ ఉంది మిత్ర.

అంతలో ఇంటి పైకి వచ్చి "అభీర్! నంద గెస్ట్ హౌస్ బ్లాస్ట్ అయింది లోపల ఉన్న వాళ్ళు ఎవరు బతికే ఛాన్స్ లేదు అక్కడికి వెళ్లిన ఆఫీసర్స్ కాల్ చేశారు." అని చెప్పాడు శ్రీకర్.

అక్కడికి వస్తు "సార్! మురళి జోషి ఫ్యామిలీ సేఫ్ గా ఉన్నారు దీనిని బట్టి ఈ ఎటాక్ చేసింది నంద ఫ్యామిలీ కాదు." అని చెప్పాడు దయ.

ఆ మాట విని ఫోన్లు తీసి నంద ఫ్యామిలీ మెంబర్స్ కి వరదరాజులకి  కాల్ చేస్తూ అభీర్ వైపు చూసి "ఎవ్వరి ఫోన్స్ పనిచేయడం లేదు." అని టెన్షన్ గా చెప్పాడు బైరి.

ఆ మాట విని ఆకాశం వైపు చూస్తూ "భగవంతుడా! నా వాళ్ళు ఎవరు చనిపోకూడదు అనుకుని నా గుండెల్లో అగ్నిపర్వతంలా పేలుతున్న పగని కూడా చంపేశాను, కానీ మళ్ళీ నాకు పరీక్ష పెట్టావు ఇదంతా చేస్తుంది ఎవరు?" అని గట్టిగా అరిచాడు అభీర్.

అంతలో చాక్లెట్ చెయ్యి కదలడం చూసి "అభీర్! చాక్లెట్  కి ఇంకా ఊపిరి ఉంది." అని ఏడుస్తూ చెప్పింది మిత్ర.

ఆ మాట విని "ఆఫీసర్స్!  బాబుని హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలి కార్ తీయండి." అని గట్టిగా అరిచాడు శ్రీకర్.

"ఆ భగవంతుడు నా పిలుపు విన్నాడు." అని చాక్లెట్ ని తన చేతుల్లోకి తీసుకొని ఆకాశం వైపు చూపిస్తూ కళ్ళు మూసుకున్నాడు అభీర్.

అది చూసి అభీర్ దగ్గరికి వెళ్లి "ఈ సమయంలో ఇటువంటివి పనికిరావు ఈ ఇన్సిడెంట్ మొత్తానికి ఎవిడెన్స్ చాక్లెట్ మాత్రమే! తనని ఎలాగైనా బతికించాలి నా మాట విని హాస్పిటల్ కి తీసుకువెళదాంము." అని చెప్పాడు శ్రీకర్.

ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా కళ్ళు మూసుకున్న అభీర్ ని చూసి ఏమి జరుగుతుందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వారందరూ.
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 26-02-2026, 07:43 AM



Users browsing this thread: 1 Guest(s)