25-02-2026, 09:21 AM
Part - 113
ఎంగేజ్మెంట్ గురించి తెలిసి కూడా అడుగుతున్నారా.
అయ్యో బంగారం నాకు తెలియదు అని చెప్పలేదు కదా.. నీకేమి తెలుసు అని అడిగాను అంతే.
మాటలతో బురిడీ కొట్టించమంటే మీ తర్వాతే అని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. అవని ప్రశాంతంగా ఉంది అని అర్థమయ్యక విక్రమ్ అవని నుదుటన ముద్దు పెట్టుకుని భార్గవి కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలా అని ఆలోచిస్తాడు.
ఆలోచనలు అన్ని ఒక పాయింట్ దగ్గరికి వచ్చి చేరిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోతాడు.
అందరికీ ఉదయం చాలా ఫ్రెష్ గా ఎనర్జిటిక్ గా స్టార్ట్ అవుతే.. శిల్పకి మాత్రం బాధగా మొదలవుతుంది.
ఉదయమే నాలుగింటికి ఆ పెద్దవాళ్లు వచ్చి ఆ గుడిసె ముందు నిలబడి గట్టిగా పిలుస్తారు. ఉదయ్ కి మెలుకువచ్చి లేచి వెళ్లి తలుపు తీసి రండి అమ్మ..
ఇంకా మీరు లెగలేదా అని అడుగుతారు. ఆ మాటకి చిన్నగా నవ్వి... నాకు గత కొన్ని రోజులగా అలవాటయింది కాబట్టి నాకు మెలకువ వచ్చేసింది. శిల్ప కి ఈరోజు మొదలు కదా మెల్లిగా అలవాటు అవుతుందిలే..
వెళ్లి నీ భార్యని లేపు అంటే మీరే లేపండి అమ్మ అని ఇంతకీ మీ ఇద్దరి పేర్లు తెలుసుకోవచ్చా... నిన్నటి నుండి తెలియక ఏమని పిలవాలో అర్థం కావడం లేదు అంటాడు.
ఆ మాటకి నవ్వుతు ఆ పెద్దావిడ నా పేరు పంకజం అని చెబుతుంది. మరి తాత గారి పేరు అంటే అయ్యో పెనిమిటి పేరు ఎవరైనా చెబుతారా అంటుంది.
ఆ మాటకి ఆ పెద్దాయన మీసం మేలేస్తూ నా భార్య రుసరుసలాడుతూ మాట్లాడుతుంది కానీ నా విషయం వచ్చేటప్పటికి చచ్చేంత సిగ్గు.
మీరే చెప్పండి తాతగారు. నా పేరు కాంతారావు అంటాడు. కాంతారావు, పంకజం బానే ఉన్నాయి కానీ నేను మిమ్మల్ని బామ్మ, తాతగారు అనే పిలుస్తాను.
నువ్వు ఎలా పిలిచినా పలుకుతామ్ అబ్బాయి... పద ముందు నీ పెళ్ళాన్ని లేపాలి అని పంకజం ముందుకు కదులుతుంది.
రాత్రంతా నిద్ర లేక ఎప్పుడో పడుకున్న శిల్పకి ఇంత గొడవ ఉన్న సరే మెలకువ రాదు. పంకజం దగ్గరికి వెళ్లి ఇదిగో అమ్మయ్ అని పిలుస్తుంది.
అయినా స్ప్రుహ లేకుండా పడుకుంటే ఇక లాభం లేదు అని వీపు మీద ఒక్క దరువు వేస్తుంది. ఆ దెబ్బకి బాబోయ్ అని అరుస్తూ ఉలిక్కిపడి లెగుస్తుంది.
లాంతరువేలుగు చాలా తక్కువగా ఉండి వీళ్ళ ముగ్గురు కదులుతూ ఉంటే నీడల్లాగా కనిపించి దయ్యం దయ్యం అని అరుస్తుంది.
ఎవరే దయ్యం అని పంకజం గట్టిగా అంటే... ఈ మాట ఎక్కడో విన్నట్టు ఉన్నానే అనుకుని కళ్ళ మీద నుంచి చేతులు తీసి ఎవరు అని మెల్లిగా అడుగుతుంది.
ఎవరు అంటావు ఏమిటి నిన్న వచ్చిన వాళ్ళమే ఇంకా నిద్రమత్తు వదలలేదా లెగు లెగు అని గట్టిగా అంటారు.
చుట్టూ చూస్తూ చాలా చీకటిగా ఉంది ఇప్పుడు లేచి ఎక్కడికి వెళ్లాలి . చీకటి ఏంటి.. ఉదయం నాలుగు దాటితే. నాలుగింటికి లేచి ఏమి చేయాలి.
జైల్లో కూడా ఈ టైంకి లేపలేదు అంటుంది. ఏంటి నువ్వు జైలుకు వెళ్లావా అని పంకజం బుగ్గలు నొక్కుకుంటుంది. శిల్ప తల కొట్టుకుంటూ అయ్యో వీళ్ళకి తెలియని విషయాలు అన్ని నేనే చెబుతున్నానా అని..
నా ఉద్దేశం జైల్లో కూడా ఈ టైంకి లేపరు అంటున్నాను అంతే అని లేచి నిలబడి ఇప్పుడు ఏం చేయాలి అంటుంది. వెళ్లి మొఖం కడుక్కుని రా అని బయటికి పంపిస్తుంది.
చాలా చీకటిగా ఉంది నాకు భయం వేస్తుంది. మీ ఆయన్ని తోడు తీసుకువెళ్ళు. ఇక తప్పక ఉదయ్ ని తీసుకుని వెళ్లి అక్కడ నిలబెట్టి ఫ్రెష్ అయి వస్తుంది.
ఇప్పుడేం చేయాలి. బయటికి రా అని వాకిలి వైపు తీసుకు వెళ్లి ఇదంతా ఊడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టు అని చెబుతారు.
అంత మట్టే కదా.. మట్టిలో ఏమి ఉడవాలి అంటే కర్మ రా బాబు అని ఇదిగో అమ్మాయి ఇలా పట్టుకొని ఊడువు అని నడుం మీద ఒక దెబ్బ వేసి ఒంగో పెడుతుంది.
నడుము మీద చేతతో రుద్దుకుంటూ ఊడ్చి విక్రమ్ ఇంట్లో ముగ్గుపెట్టిన అనుభవంతో తనకు వచ్చిన ముగ్గు ఏదో పెడుతుంది.
పరవాలేదు అమ్మాయ్ ముగ్గు బానే పెట్టావు అంటే... ఏడవలేక నవ్వలేక ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి తర్వాత ఇంకేమీ చేయాలి.
పనులు చేయడానికి మంచి ఉత్సాహం చూపిస్తున్నావే పదా పదా అని తీసుకు వెళుతుంది. కాంతారావు ఉదయ్ ని ఒక ఆవు దగ్గరకి తీసుకువెళ్ళి దాన్ని మొత్తం శుభ్రం చెయ్యాలి అని చెబుతాడు.
విక్రమ్ చేతిలో ఉన్నన్ని రోజులు ఉదయ్ అన్ని రకాల పనులు చేశాడు కానీ ఇలా ఆవుని శుభ్రం చేయడం అన్నది తెలియదు.
తాతగారు నాకు తెలియదు అంటే... తెలియకపోవడమేముంది అబ్బాయ్ నీళ్లు తీసుకువెళ్ళు. శుభ్రంగా కడుగు.
పొదుగు అంతా కడిగి పాలు పితుకు అంతే. మీరు సింపుల్గా చెప్పేస్తున్నారు గాని నాకు ఆ పాలు తీయడం ఏమిటో కూడా అర్థం కాలేదు.
ఇంకా ఏం తెలుసు అబ్బాయ్ . నీళ్లు తీసుకుని ఆవుని శుభ్రంగా ఎలా కడగాలో చూపించి చేయిపిస్తాడు. పాలు తీసేటప్పుడు మాత్రం భయపడుతూ ఉంటే ఎలా తీయాలో చూపించి రేపటి నుంచి మాత్రం నువ్వే తీసుకో అంటాడు. అలాగే తాతగారు అని పాలు తీసుకుని ఇద్దరు గుడిసె దగ్గరికి వెళతారు.
ఇదిగో అమ్మాయి అందరికీ పాలు కాచి కొంచెం బెల్లం వేసి ఇవ్వు. తాగేస్తే పనుల్లోకి వెళ్లాలి. పనులా.. ఏం పనులు. ఎందుకమ్మాయ్.. కంగారు అన్ని చెబుతాము. చూపిస్తాము.
తొందరగా వెళ్లి చెప్పిన పని చెయ్ అని పంకజం ఆర్డర్ వేస్తుంది. ఖర్మరా బాబు వీళ్ళతో చస్తున్నాను అని ఆ కట్టెల పోయ్యని కష్టంగా వెలిగించి... చేతులు కాల్చుకుంటూ పాలు కాచి అందరికీ ఇస్తుంది.
పర్వాలేదు అమ్మాయి ఒక్కరోజులోనే పోయ్యి వెలిగించడం నేర్చుకున్నావు. ఈ అని పళ్ళు అన్ని బయటపెడుతుంది. ఎక్కువ బయట పెట్టకు అమ్మయ్.. ఏదన్న పురుగు వెళ్లిందనుకో కష్టం అని పాలు ఊదుకుంటూ తాగుతారు..
ఈ ముసలావిడకి వెటకారాలు చాలా ఎక్కువ అని మనసులో తిట్టుకుంటూ ఆ పాలు తాగుతుంది.
అవని ఉదయమే లేచి రెడీ అయ్యి కిందకి వెళుతుంది. మాధవి,లలిత దేవుడి గది శుభ్రం చేసి పూజ మొదలు పెడుతూఉంటారు.
అవిని కూడా వాళ్లతో జాయిన్ అవుతుంది. తర్వాత కిచెన్ లోకి వెళ్లి అందరికీ కాఫీ టీలు ప్రోటీన్ షెక్స్ రెడీ చేసి ఎవరి తాగేది వాళ్ళ దగ్గరికి పంపించి బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటారు.
అవని అని లలిత పిలిస్తే చెప్పండి అత్తయ్య అంటుంది. వెళ్లి నివిని లేపమ్మా.. బ్రాహ్మణులు వచ్చే టైం కి రెడీ అవ్వకపోతే బాగోదు కదా. అలాగే అత్తయ్య అని నివి గదిలోకి వెళుతుంది.
నివి మత్తుగా నిద్రపోతూ ఉంటే వెళ్లి బలవంతంగా లేపి వాష్ రూమ్ లోనికి పంపిస్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి ఎందుకు వదిన నన్ను అప్పుడే నిద్ర లేపావు.
కాసేపు పడుకుందును కదా... అయ్యో నివి ఈరోజు మీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తున్నారు. కొంచెం కూడా ఎక్సైట్మెంట్ లేకుండా నిద్ర ఏమిటి.
అన్నయ్య అన్ని అరేంజ్ చేసేస్తాడు కదా.. ఆ టైం చెప్తే సరిపోతుంది అంటుంది. అదేంటి నీకు షాపింగ్ చేయడానికి టైం సరిపోదు కదా..
ఎలాగా అన్నయ్య మినిమం 20 డేస్ టైం తీసుకుంటాడు. సో ఆ టైం నాకు సరిపోతుంది అని చెబుతోంది. ఒకవేళ వారంలో కుదిరిపోతే. అప్పుడైనా నా ప్లాన్స్ నాకు ఉన్నాయి వదిన.
సరే ముందు రెడీ అయ్యి రా.. అత్తయ్య నీకోసం వెయిట్ చేస్తున్నారు. మీ అత్తయ్య గారు కూడా ఉన్నారు కదా బాగోదు అని చెప్పి అవని వెళ్లిపోతుంది.
రాజ్ కి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసి బయటకి వస్తుంది. బ్రేక్ ఫాస్ట్ టైం కి అందరూ రెడీ అయ్యి వచ్చి టిఫిన్ కంప్లీట్ చేస్తారు.
ఈలోపు బ్రాహ్మలు కూడా వస్తే... ఇద్దరి జాతకాలు ఇచ్చి ముహూర్తాలు చూడమని చెబుతారు. ఇద్దరు జాతకాలు బాగా పరిశీలించి అయ్యా.. పిల్లలు ఇద్దరు లైఫ్ చాలా బాగుంటుంది.
మీకు ఎన్ని రోజుల్లో ముహూర్తం కావాలి అని అడుగుతారు. ముహూర్త బలం బాగున్నది చూసి చెప్పండి.
అది దగ్గరైనా, దూరమైన మేనేజ్ చేసుకోగలము. రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ కి చాలా బలమైన ముహూర్తం ఉంది. అది తప్పితే నెల రోజుల తర్వాత మాత్రమే ఉంది.
నివి నెల అనే లోపు రాజ్ వెంటనే లేచి నిలబడి రెండు రోజుల్లో ఉన్న ముహూర్తం ఖాయం చేయండి అని చెబుతాడు.
పార్ధుగారు వెంటనే ఒరేయ్ అంత ఆత్రం ఏంటి రా... పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాము కదా.. సైలెంట్ గా తండ్రి చెవి దగ్గరికి వెళ్లి ఏంటి మీరు మాట్లాడేది.
మీరు మీనవేషాలు లెక్కపెట్టేటప్పటికి అక్కడ మీ కోడలు నెల అని చెప్పుద్ది. ఇప్పుడు నెల తర్వాత అయితే ఏమైందిరా...
మీరు తిరగండి దానితో షాపింగ్ కి. వద్దులే రెండు రోజులకే ఖాయం చేయండి పంతులుగారు అని చెబుతారు. ఏమైంది తండ్రి కొడుకులు ఇద్దరకి.
అంతసేపు డిస్కస్ చేసుకుని మరీ రెండు రోజులకే ఫిక్స్ చేశారు. ఎంత తొందరగా నిశ్చితార్థమవుతే అంత మంచిది అని ఇద్దరు కోరస్ గా చెబుతారు.
మరి నా షాపింగ్ అని నివి బిక్క మొహం వేసుకుని అడిగితే... విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ పరవాలేదు నివి అన్నీ నేను అరేంజ్ చేపిస్తాను.
నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెబుతాడు. రాజ్ థాంక్స్ బావ అన్నట్టుగా చూస్తే.. మై హోనా అన్నట్టుగా విక్రమ్ కళ్లుర్పుతాడు.
వచ్చే నెలలో ముహూర్తం పెళ్ళికి బాగుంది అది పెట్టమంటారా అని బ్రాహ్మలు అడిగితే.. నెల రోజులు అంటే మనకు సరిపోతాయా అని కళ్యాణ్, పార్ధు ఆలోచిస్తారు.
ఎన్ని రోజులు ఉన్నా సరే పనులు అలాగే జరుగుతూ ఉంటాయి కాబట్టి చేసేద్దామని ఫిక్స్ అయ్యి ఆ ముహూర్తం కూడా ఖాయం చేసుకుంటారు.
నిశ్చితార్థం వేడుకలు??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)