23-02-2026, 10:12 AM
Part - 109
శిల్ప కి చీర కట్టి మెడలో సింపుల్ గా ఉన్న ఒక చైన్ వేస్తుంది. అద్దం లేదా అత్తయ్య.. మనం ఉన్నది ఎక్కడ అని ఎటువంటి భావం లేకుండా అడుగుతుంది.
ఏం మాట్లాడినా అత్తయ్య కౌంటర్స్ వేస్తుంది అని సైలెంట్ అయిపోతుంది. రెడీ చేసి పదా అని బయటికి తీసుకు వస్తుంది.
ఇప్పుడైనా చెప్పొచ్చు కదా.. ఎన్నిసార్లు అడుగుతావు శిల్ప. నాకు తెలియదు అని చెబుతున్నాను కదా.
ఒకసారి చెబితే అర్థం చేసుకోవడం నేర్చుకో అని విసుగ్గా అంటుంది.
మా మమ్మీ లేకపోయేటప్పటికి అందరికీ కొమ్ములు వస్తున్నాయి చ అని మనసులో అనుకుంటూ వెళ్లి గుమ్మం ముందు నిలబడుతుంది.
ఏమిటో నా ఇంట్లోకి నేను వెళ్లడానికి కూడా పర్మిషన్ కావాల్సి వస్తుంది. బిచ్చగత్తె లాగా నన్ను గుమ్మం ముందు నిలబెట్టారు.
ఇదంతా ఇడియట్ అవని వల్లే వచ్చింది అని కోపంగా పళ్ళు నూరుతూ ఉంటుంది.
ధనుంజయ్ తన తల్లిదండ్రులను తీసుకుని బయటకు వచ్చి వెళదామా అంటాడు. అన్నయ్య ఒక్కసారి ఆలోచించొచ్చు కదా అని బిందు అంటే..
నీకు ఏమన్నా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పు నాకేమీ పర్వాలేదు. తర్వాత జరిగే వాటికి నాకు ఎటువంటి సంబంధం ఉండదు అని కోపంగా చెబుతారు.
ఆ మాటకి బిందు సైలెంట్ అయిపోతుంది. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక శిల్పా పిచ్చ చూపులు చూస్తూ ఉంటుంది.
ఇంకా వెళదామా అంటే హా సరే అని అందరూ ఒక్క కారులోనే బయలుదేరుతారు. శిల్ప ఇబ్బందిగా కూర్చుంటూ. ఇంతమంది ఒక కారులో అంటే ఎలా కుదురుతుంది.
రెండు కార్లు తీసుకుంటే సరిపోతుంది కదా మనసులో అనుకుంటుంది కానీ ధైర్యంగా పైకి అనలేక ఎక్కడికి డాడీ అంటుంది.
ఇడియట్ నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను డాడీ అని పిలవద్దు అని...
ఆ మాటకి శిల్పా చిన్నబుచ్చుకొని తలదించుకుంటుంది. బిందు మెల్లిగా చెవిలో నీకు ఎన్నిసార్లు చెప్పాను. మీ నాన్నని విసిగించొద్దు అని.
సైలెంట్ గా కూర్చోలేవా అని కసురుకుంటుంది. మీకు అందరికీ తెలుసు కదా మనం ఎక్కడికి వెళుతున్నామో.. హ తెలుసు అంటుంది.
మరి ఎందుకు చెప్పడంలేదు అంతే మెల్లిగా అడుగుతుంది. చెప్పినా నువ్వు ఏమీ చేయలేవు. జరిగింది చూడడం తప్ప.
ఉన్నా ఈ కాస్త సంతోషాన్ని నీకు దూరం చేయడం నాకు ఇష్టం లేదు అంటుంది. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది అత్తయ్య అని భయంగా అడుగుతుంది.
నువ్వు ఎందుకు భయపడడం నేను కదా భయపడాలి అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావ్ అత్తయ్య. మీరు మాట్లాడేది ఒక్కటి కూడా నాకు ఏమీ అర్థం కావడం లేదు.
ఏదో కొరియన్ మూవీ మలయాళీ టైటిల్స్ తో చూసినట్టు ఉంది. ప్రస్తుతానికి అలాగే అనుకో.
కారు మాత్రం సిటీ అవుట్ కట్స్ దాటేస్తుంది. ఇంకా రెండు గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఒక మారుమూల గ్రామం వస్తుంది. ఒక గుడి ముందు కారు ఆపుతారు.
దిగండి అని ధనుంజయ్ కారు దిగుతాడు. అందరూ దిగి నిలబడతారు. ఇదేంటి గుడికి వచ్చాము అని మనసులో అనుకుంటుంది.
వీళ్ళు వెళ్లేటప్పటికీ సునీల్, ఉదయ్ అక్కడే ఉంటారు. భర్తను చూడగానే ఏవండి అని పరిగెత్తుకుంటూ వెళ్లి భర్త చేతులు పట్టుకొని ఏడుస్తుంది.
ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదు. నవ్వుతూ ఉండు. ఇంకా ఎక్కడ నవ్వండి. ఆ రాక్షసి కి నా కొడుకుని బలి చేస్తుంటే.. పక్కనున్న ఉదయ్ పట్టుకుని ఎలా ఉన్నావురా అంటుంది.
విరక్తిగా నవ్వుతూ ఇలా ఉన్నాను అంటాడు. కొడుకుని పైనుండి కిందకి చూస్తూ ఉంటే అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంటాడు.
ఎప్పుడు దొరబాబు లాగా హీరోలాగా టిప్ టాప్ గా రెడీ అయ్యి కార్లలో తిరిగేవాడు. అలాంటిది పుల్లకి బట్టలు వేసినట్టుగా ప్రాణం ఉండాలి కాబట్టి ఉంది అన్నట్టుగా ఉన్నాడు.
ఇలా అయిపోయావ్ ఏంట్రా అంటే మనం చేసిన పాపాలకి శిక్ష అమ్మ అంటాడు.. మమ్మల్ని క్షమించరా అని బాధపడుతుంది.
మిమ్మల్ని ఎందుకమ్మా క్షమించడం. మీరు చెబితే గంగిరెద్దులాగా నేను కూడా అదే తప్పు చేయడానికి సిద్ధపడ్డాను.
నాలో కూడా ఉంది కదా అంటాడు. ఈలోపు ధనుంజయ్ అక్కడికి వచ్చి మీ మాటలు అయిపోయాయా అంటాడు. బాగున్నారా మావయ్య అని ఉదయ్ అడిగితే చాలా అసహ్యంగా చూసి పదండి అంటాడు.
ఆచూపు కి ఉదయ్ కి చాలా బాధగా అనిపిస్తుంది. ఎప్పుడూ దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా మాట్లాడే మావయ్య ఈరోజు ఒక పురుగును చూసినట్టు చూస్తూ ఉంటే చాలా రంపపు కోతలాగా అనిపిస్తుంది.
వెనకాల వస్తున్న శిల్ప ని చూసి ఒక నిట్టూర్పు విడిచి చేసిన పాపాలకి కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలిలే అని ధనుంజయ్ వెనకాలే వెళతాడు.
ఇక శిల్ప ఆగలేక నానమ్మ మనము ఎక్కడికి వచ్చాము. దేనికోసం వచ్చాము. తినబోయే ముందు రుచి ఎందుకు చూడు.
ప్లీజ్ నానమ్మ ఇప్పటికే టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చెప్పండి. నీ పెళ్లి అని చెప్పి అడుగు ముందుకేస్తుంది. వాట్ అని అరుస్తూ అక్కడే ఆగిపోతుంది.
ఎందుకు అరుస్తున్నావు. ఇది అన్యాయం నానమ్మ. నా పెళ్ళి నాకు తెలియకుండా ఫిక్స్ చేయడమేమిటి. అసలు అబ్బాయి ఎవరో నాకు తెలియదు.
నా రేంజ్ కి సూట్ అవుతాడో లేదో చూసుకోవాలి కదా...
అయినా పెళ్ళంటే ఇలాంటి చోట చేసుకునేది. ఎవరూ లేని అనాధలు కూడా ఇలాగ చేసుకోరు.
అలాంటిది గ్రేట్ ధనుంజయ్ ముద్దుల కూతురు పెళ్లి అంటే ఇంకెలా ఉండాలి అంటుంది.. ఆ మాటకి శిల్పను చూస్తూ ఇంకా ఆపు అన్నట్టుగా చెయ్యి పెట్టి నువ్వు ఇంకా పగటి కలలు కంటూ ఉంటే ఎవరు ఏమీ చేయలేరు.
నువ్వు మైండ్ లో బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ధనుంజయ్ కూతురివి కాదు. నిన్న అనౌన్స్ చేసిన సరే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. అనాధ అంటున్నావు చూడు అంతకన్నా హీనం నువ్వు.
ఆ మాటకి శిల్ప ఆశ్చర్యంగా చూస్తూ నానమ్మ నువ్వేనా ఇలా అనేది. ఎప్పుడూ నన్ను ముద్దు చేస్తూ గారాబంగా చూసే నువ్వు ఈరోజు ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు.
మీ ప్రవర్తలను బట్టి. ఇన్ని రోజులు నా కొడుకే తన కూతురు విషయంలో సరిగ్గా లేడు అనుకుని బాధపడేదాన్ని. కానీ నా కొడుకుని తప్పుదారి పట్టించి మీ అమ్మ కూతుళ్లు వేసిన వేషాలకి మీ మొఖాలు చూడాలి అన్నా కంపరంగా ఉంది .
ఏమి మాట్లాడలేక శిల్ప మౌనంగా నడుస్తుంది. ఈ పెళ్లి ఆపాలంటే ఒక్క నాన్న వల్ల అవుతుంది అని స్పీడ్ గా ధనుంజయ్ దగ్గరికి వెళ్లి ప్లీజ్ నాన్న నాకు ఈ పెళ్లి వద్దు అంటుంది. ఎందుకు వద్దు అని అంతే కోపంగా అడుగుతారు.
పెళ్ళికొడుకు ఎవరో తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను అంటుంది. అవునా మరి అవనికి ఎలా చేశారు మీ అమ్మ కూతుళ్లు.
అమ్మ చేసినట్టుగా నాకు తెలియదు కదా నాన్న అని అమాయకంగా ముఖం పెడితే.. మీ ముసలి కన్నీళ్లు చూసి కరిగిపోవడానికి నేను ఒకప్పటి ధనుంజయ్ ని కాదు. వెళ్లి పీటల మీద కూర్చో.
నాకు పెళ్లి కొడుకు ఎవరో తెలియదు కదా అని మళ్ళీ రెట్టిస్తుంది. నీకు ఇప్పుడు పెళ్లి కొడుకు తెలియాలి అంతే కదా అని పెళ్ళికొడుకుని పీటల మీద కూర్చోబెట్టండి అని చెబుతాడు.
పీటల మీద కూర్చున్న వ్యక్తిని చూసి ఉదయ్ అని గట్టిగా అరుస్తుంది. ఉదయ్ తోనే నీ పెళ్లి. నాన్న మీకు కోపం ఉంటే ఇంకొకలాగా తీర్చుకోండి..
పైసా కి పనికిరాని వాడిని పెళ్లి చేసుకుని నా లైఫ్ అంత నాశనం చేసుకోవాలా... బిందు కోపంగా ఎవరే పైసాకే పనికి రానివాడు.
నిన్ను చేసుకోవడం నా కొడుకు దౌర్భాగ్యం కానీ తప్పక తలవంచాల్సి వచ్చింది అంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అంత కష్టంగా ఎవరు తలవంచమన్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి చేసుకోను అంటుంది.
నీకు ఆప్షన్ లేదు శిల్పా అని ధనుంజయ్ అంటే.. నా పెళ్లి నా అంగీకారంతో జరగాలి అంతేగాని.. మీరందరూ బలవంతం చేస్తే చేసుకోవడానికి నేనేమి చిన్న పిల్లని కాదు. పైగా అవనినీ అంతకన్నా కాదు అంటుంది.
ఆ మాటకి నవ్వుతూ అవునా... ఈ పేపర్స్ చూసి కూడా ఆ మాట చెప్పు అని చేతికి ఇస్తాడు. అందులో మ్యాటర్ చూసి.. లేదు ఈ సంతకం నేను చేయలేదు.
బాగా గుర్తు చేసుకో. అది నీ సంతకమే. జైలు నుంచి బయటికి తీసుకురావాలి అంటే సంతకం చేయమన్నాను కదా అప్పుడు చేసిందే.
మీరు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు డాడీ అంటుంది. జస్ట్ షట్ అప్.. మీ మోసాలతో పోల్చుకుంటే నేను చేసింది ఏమీ పెద్ద మోసమేమీ కాదు.
అయినా నీలాంటి దానికి ఉదయ్ యే ఎక్కువ. వెళ్లి కూర్చో అన్ని గట్టిగా చెబుతాడు. తనకి తెలియకుండానే తన పెళ్లి రిజిస్ట్రేషన్ అవ్వడం. అందులో ఇద్దరి సంతకాలు ఉండడం చూసి డైజెస్ట్ చేసుకోలేకపోతుంది.
ఏమీ చేయలేక మౌనంగా వెళ్లి పీటల మీద కూర్చుంటుంది. పెళ్లి సింపుల్గా జరిపించి.. పదండి అని ముందుకి నడుస్తాడు.
శిల్ప.. నా చేతుల్లో నా జీవితం లేదా అని ఆలోచిస్తూ... ఈ పెళ్లి బయట ఎవరికీ తెలియదు కదా... మెల్లిగా వీళ్ళ నుంచి ఎస్కేపై వెళ్ళిపోతే సరిపోతుంది అని ఇంకా కుళ్ళి ప్లాన్లు వేస్తూనేఉంటుంది.
వీళ్ళని నలుగురుని సెపరేట్గా ఒక ఆటోలో ఎక్కమని ముందు కారులో ధనుంజయ్ తల్లిదండ్రులు తీసుకుని బయలుదేరుతాడు.
ఆటోలో కూర్చున్న శిల్ప ఎండ మండిపోతుంది అని విసుగ్గా అంటుంది. ఆ మాటకి బిందు సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. సునీల్ కూడా ఏమీ మాట్లాడడు.
పెళ్లి కొడుకు కళ లేని కొడుకుని చూస్తూ ఉంటే సునీల్ కి బిందుకి చాలా బాధగా అనిపిస్తుంది.
కారు ఆటో ఒక ఏరియా దగ్గర ఆగుతాయి. అందరూ దిగి చూస్తూ ఉంటే ఒక పెద్ద జంట అక్కడికి వచ్చి నమస్కారం అయ్యా అని చెబుతారు.
నమస్తే అన్ని ఏర్పాట్లు అయిపోయినాయా అంటే అన్ని అయిపోయినాయి అని తల ఊపుతారు.
ఏర్పాట్లు???

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)