23-02-2026, 10:10 AM
ఎపిసోడ్ 92
ఆఫీసర్ తో పాటు రాహుల్ వచ్చి చెప్పింది విని కంగారుగా బుల్లెట్ ప్రూఫ్ రూమ్ లోకి వెళ్లి చూసి షాక్ అయ్యి "వాడు బ్యాగ్ లో పట్టుకు వెళ్ళింది డబ్బులు కాదు మిధున్ తల అని గట్టిగా అరిచింది అర్ణ.
************
ఆ మాట విని టెన్షన్ గా వీల్ చైర్ లో నుంచి కింద పడ్డ అభిజిత్ ని విష్ణు తో కలిసి పట్టుకుని పైకి లేపి కూర్చోబెట్టి కళ్ళలో భయం, బాధ చూసి సంతోష పడింది రియా.
"నా కొడుకుని చంపింనా వాడు బతికి ఉండడానికి వీలు లేదు సీసీ కెమెరాలలో చూసి ఎవరో తెలుసుకోండి." అని కోపంగా చూస్తూ చెప్పాడు అభిజిత్.
"సార్! ఆ వీరభద్రం లోపలికి వచ్చినప్పుడు మొబైల్స్ పనిచేయకుండా జామర్స్ ఆన్ చేశాడు కదా దాంతోనే సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేశాడు అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చింది కుడా రికార్డు అవ్వలేదు." అని చెప్పాడు మిస్సైల్.
"టెర్రరిస్ట్ లా నుంచి త్రెడ్ కాల్ వచ్చిందని చెప్పారు జాగ్రత్తగా ఉండాలి కదా! కంప్లైంట్ రాసి ఇవ్వండి ఇక్కడికి వచ్చింది ఎవరో ఎంక్వయిరీ చేస్తాము." అని చెప్పాడు ఆఫీసర్.
ఆ మాట విని రాహుల్ వైపు చూసి "ఆఫీసర్ గారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్లు కంప్లైంట్ ఇవ్వాలో లేదో మేము ఆలోచించుకుని చెప్తాము అప్పటివరకు మీరు సైలెంట్ గా ఉండండి." అని చెప్పాడు ముకుల్.
"సరే మీ ఇష్టం!" అని రాహుల్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆఫీసర్.
రూమ్ లో నుంచి బయటకు వస్తూ "ఆ అభీర్ మన వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు మనం ఇంకా చూస్తూ ఉండకూడదు వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలి." అని కోపంగా చూస్తూ చెప్పింది అర్ణ.
"ఆ అభీర్ వీక్నెస్ ఆ బేరా కొండలు అక్కడ ఉన్న తన మనుషులు ఆ ఒక్క విషయంలోనే మనకి లొంగుతాడు." అని చెప్పాడు విష్ణు.
"ఎవరు ఆవేశపడకండి." అని రియా వైపు చూసి "నీకు అభీర్ షూటింగ్ అడవికి వెళుతున్నారని ఎలా తెలిసింది?" అని అడిగాడు ముకుల్.
"ఆ చానల్లో నాకు తెలిసిన ఒక మనిషి ఉన్నాడు అతని ద్వారా తెలుసుకున్నాను." అని చెప్పింది రియా.
"సరే! ఈరోజు నుంచి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టండి నా వారసులు నా స్నేహితులు ప్రాణాలతో ఉండడమే నాకు కావాలి." అని చెప్పి రియా వైపు చూసి "నువ్వు కూడా ఇక్కడి నుంచి వేళ్ళు మావల్ల నీకు ఎటువంటి ప్రమాదం రాకూడదు." అని చెప్పాడు ముకుల్.
"ఏంటి తాతయ్య నువ్వు మాట్లాడేది? జరిగిందంతా మర్చిపోయి వెళ్లి అభీర్ గాడిని క్షమించమని అడుగుదామా?" అని ఆవేశంగా అడిగాడు విష్ణు.
"అవును! మనం ఎక్కడైతే తప్పు చేశామో అక్కడికి వెళ్లి క్షమించమని అడుగుదాము అవసరమైతే నా ప్రాణాలు తీసుకోమని చెబుతాను ఇకనుంచి నా మాటకి ఎవరు ఎదురు మాట్లాడకూడదు." అని ఆవేశంగా చెప్పాడు ముకుల్.
"సరే సార్! ఇంక నేను వెళ్తాను." అని విష్ణు వైపు చూసి "బాయ్!" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లింది రియా.
సంతోషంగా ముకుల్ దగ్గరికి వచ్చి "తాతయ్య! ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నావు మనం అభీర్ తో డీల్ చేసుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు." అని చెప్పింది ఆశ.
"కరెక్ట్! నేను ఫస్ట్ లోనే ఈ డిసిషన్ తీసుకోవాల్సింది మీరు లోపలికి వెళ్ళండి అన్ని విషయాలు నేను చూసుకుంటాను." అని చెప్పాడు ముకుల్.
"ఓకే!" అని తల్లిని పిన్నిని తీసుకుని లోపలికి వెళ్ళింది ఆశ.
"ఏమైంది? ఒక్కసారిగా ఇలా మారిపోయారు నా కొడుకు చావుని చూసేసరికి మీకు భయం వేసిందా?" అని అడిగాడు అభిజిత్.
"అవును! నేను రాంగ్ రూట్లో వెళుతున్నారని అర్థమైంది అభీర్ కి ఆ బేరా కొండలు తన మనుషులు మాత్రమే వీక్నెస్ కాదు మరొక వీక్నెస్ మంచితనం దాని గురించి మనం మర్చిపోయాము." అని చెప్పాడు ముకుల్.
"మీరు చెబుతుంది ఏమిటో నాకు అర్థం కాలేదు." అని డౌట్ గా చూస్తూ అడిగింది అర్ణ.
"ఇది శకుని పాచికిలాట నీకు అర్థం కాదు లాయర్ వసుందరకి శాంతి సందేశం పంపించండి. ఈ ప్లాన్ ఎవరికి తెలియకూడదు అందుకే రియా ని కూడా ఇక్కడి నుంచి పంపించాను మనం అనుకున్నది పూర్తయ్యేంతవరకు ఎవరిని నమ్మకూడదు." అని కసిగా చూస్తూ చెప్పాడు ముకుల్.
ఆ మాటకి కసిగా చూస్తూ "సరే తాతయ్య! మిధున్ దహన సంస్కారాలు అయిన వెంటనే శాంతి సందేశం పంపిస్తాను." అని చెప్పింది అర్ణ.
*****************
బేర అడవిలో నిర్మల్ వాళ్ళని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లి "దొర! మీకు కనిపిస్తున్నవే నవగ్రహాల కొండలు." అని చూపించాడు లింగు.
ఆ మాటవిని నీరసంగా చూస్తూ "ఇవేనా ఆ కొండలు? వాటి దగ్గరికి వెళ్లడానికి కూడా ఓపిక లేదు ముందు తినడానికి ఏమైనా కావాలి." అని అడిగాడు ఫరూక్.
"దొర! ఇంతకీ ఈ కొండల గురించి మీరు ఎందుకు వెతుకుతున్నారు?" అని అడిగాడు లింగు.
"ఈ కొండల దగ్గర చాలా విలువైన రాళ్లు దొరుకుతాయి అని తెలిసింది వాటి కోసం వచ్చాము." అని నీరసంగా చెప్పాడు నిర్మల్.
"సరే దొర! వెళ్లి ఆ విలువైన రాళ్లు తీసుకుని ఇక్కడ ఎవరికైనా ఇచ్చి తినడానికి ఏమైనా అడగండి." అని చెప్పాడు లింగు.
"ఆ రాళ్లు తీసుకుని ఇక్కడ ఎవరు తిండి పెడతారు?" అని అడిగాడు ప్రమోద్.
"అవునా? అయితే ఆ మట్టిని తినండి విలువైనది కదా ఆకలి తీరుతుంది." అని చెప్పాడు లింగు.
ఆ కొండల దగ్గరికి వెళ్లి మెరుస్తున్న రాళ్ళను చూసి "సార్! ఇవి నిజంగానే దగా దగా మెరిసిపోతున్నాయి." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు చీలి.
"అవునా?" అని సంతోషంగా కొండల దగ్గరికి వెళ్లి రాళ్లని చూస్తూ "ఆ గుడ్డోడిని ముగోడిని చంపేయండి ఇక్కడికి మళ్ళీ ఎవరిని తీసుకురాకూడదు." అని చెప్పాడు నిర్మల్.
"సరే సార్!" అని అక్కడి నుంచి బయటికి వచ్చి చూసి "ఇక్కడ వాళ్ళిద్దరూ లేరు వెళ్లిపోయారు." అని గట్టిగా అరుస్తూ చెప్పాడు ధన.
అక్కడికి వస్తు "ఇప్పటి దాకా ఇక్కడే ఉన్నారు కదా అంతలో ఎక్కడికి పోయారు." అని చుట్టూ చూస్తూ ఉన్నాడు చీలి.
"సార్! మీరు చెప్పిన మాట విని భయపడి పారిపోయినట్లు ఉన్నారు." అని చెప్పాడు ధన.
"మేము ఎక్కడికి పారిపోలేదు దొర! ఇక్కడే ఉన్నాము సహాయం చేసిన వాడికి మీరు ఎంత మేలు చేస్తారో తెలుసుకుందామని కాస్త పక్కకి వెళ్లాము." అని చెప్పాడు లింగు.
అక్కడికి వస్తున్న లింగు వైపు చూసి "ఒరేయ్! మీ ఇద్దరిని చూస్తుంటే చంపాలి అనిపించడం లేదు కానీ తప్పదు వచ్చే జన్మలోనైనా మాలాంటి వాళ్ళకి సహాయం చేయకండి." అని కత్తి బయటికి తీసాడు చీలి.
"సరే దొర! మొదట నా తమ్ముడు గుడ్డుని చంపండి. నాకు కనపడదు కాబట్టి బాధపడను అదే నన్ను చంపితే వాడికి కనపడుతుంది కదా బాధపడతాడు." అని చెప్పాడు లింగు.
చంపడానికి ముందుకి వచ్చిన ధనని చూసి అరుస్తూ ఎగిరి భుజం మీద కూర్చుని తన మోచేత్తో తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు గుడ్డు.
ఆ దెబ్బకి చెవుల నుంచి ముక్కు నుంచి రక్తం వచ్చి కింద పడి కదలకుండా ఉన్న ధన ని చూసి "ఒరేయ్! నీ తమ్ముడు ఏమిట్రా అలా చంపేసాడు." అని కంగారుగా అడిగాడు చీలి.
"ఏమో దొర నాకు కనపడదు." అని చెప్పాడు లింగు.
ఆ మాటకి కోపంతో ఊగిపోతు నుంచుని చూస్తున్న గుడ్డుని చంపడానికి కత్తి పట్టుకుని మీదకి ఊరికాడు చీలి.
మీదికి వస్తున్న చీలి చేతిని తన చేతితో మెలి వేసి పైకి ఎత్తి ఏత్తి కర్రని విరిచినట్లు చేతిని విరిచి పక్కన పడేసేసి చేతిలో ఉన్న కత్తి తీసుకుని పీకని కోస్తూ నిర్మల్ వాళ్ళు ముగ్గురి వైపు చూసి "మా నాయకుడు మిమ్మల్ని చంపొద్దు ఇక్కడే వదలమన్నాడు." అని ఎర్రటి కళ్ళతో కోపంగా అరుస్తూ చెప్పాడు గుడ్డు.
"అంటే! మీరిద్దరూ అభీర్ మనుషుల?" అని భయంగా చూస్తూ అడిగాడు ప్రమోద్.
"నా తమ్ముడికి వినపడదు కదా దొర నేను చెబుతాను మేము అభిర్ మనుషులం కాదు, అభీర్ సేనలో సైన్యం!" అని చెప్పి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన సింబా కాళ్లు పట్టుకొని "మీరు బతికి ఉంటే మళ్ళీ కలుద్దాము దొర!" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు లింగు గుడ్డులు.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "అభీర్ సేనాలో ఒక గుడ్డివాడు మూగ వాడే ఇలా ఉంటే మిగతా వాళ్ళు ఎలా ఉంటారు?" అని కంగారుగా అడిగాడు ఫరూక్.
"మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము పదండి." అని కంగారుగా చెప్పాడు ప్రమోద్.
"ఎక్కడికి వెళ్ళేది ఒక్కసారి అటువైపు చూడు ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టామో ఆ పెద్ద పులి నోట్లో పడతాము." అని భయంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.
"ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి ఇక్కడే చచ్చిపోవాల?" అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగాడు ఫరూక్.
అంతలో ఆ కొండమీదకి వచ్చి శాటిలైట్ ఫోను వాళ్ళ మీదకి గిరాటు వేసి వెళ్ళిపోయింది కోతి.
ఆ ఫోన్ చూసి "నోరు లేకపోయినా ఈ శివుడు మంచి వాడిలాగా ఉన్నాడు ముందు వాసుకి ఫోన్ చేయాలి వాళ్ళు ఇక్కడే ఉన్నారు మనల్ని ఎలాగైనా కాపాడతారు." అని చెప్పాడు నిర్మల్.
"ఒక్క నిమిషం మనల్ని కాపాడమంటే వాళ్ళు ఇక్కడికి రారు నిధికి దారి దొరికింది అని చెబితే పరిగెత్తుకుంటూ వస్తారు." అని చెప్పాడు ప్రమోద్.
"సరే!" అని ఫోన్ తీసి వాసుకి నెంబర్ కి కాల్ చేశాడు నిర్మల్.
అడవిలో నడుస్తూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "హలో ఎవరు మాట్లాడేది." అని అడిగింది వాసుకి.
"నేను నిర్మల్ ని మాట్లాడుతున్నాను మాకు నవగ్రహాల కొండల దగ్గర నిధికి దారి దొరికింది కానీ లోపలికి ఎలా వెళ్లాలో మాకు అర్థం కావడం లేదు మీరు ఎక్కడ దాకా వచ్చారు." అని అడిగాడు నిర్మల్.
ఆ మాట విని తల్వార్ వైపు చూస్తూ "నిర్మల్ సార్ వాళ్లకి నిధికి దారి దొరికిందంట మనం వెంటనే నవగ్రహాల కొండల దగ్గరికి వెళ్ళాలి." అని సంతోషంగా చెప్పింది వాసుకి.
ఫోన్ తీసుకుని "నిర్మల్ గారు మీరు ఆ దారిని ఏమి ముట్టుకోకండి నేను వచ్చి తెరుస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసి కేశవ వైపు చూసి "మనం నవగ్రహాల కొండల వైపు వెళ్ళాలి." అని మ్యాప్ చూస్తూ రూట్ చెప్పాడు తల్వార్.
ఆ మాట విని ' లింగు పని పూర్తయింది అనుకుంటా మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు చచ్చి ఉంటారు.' అని నవ్వుకున్నాడు కేశవ.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)