Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 91


ఇర్ఫాన్ దగ్గర దొరికిన ఫోన్ లో డీటెయిల్స్ ఎంక్వయిరీ చేస్తున్న ఆఫీసర్ గురించి తెలుసుకో అని రాహుల్ కి చెప్పింది అర్ణ.

కేశవ తో వచ్చిన మనుషులతో కలిసి అడవిలోకి బయలుదేరారు వాసుకి వాళ్ళు.

ఉదయం అడవిలో లేచి చూసేసరికి వాళ్ళ మనుషులు ఎవరో కనపడకపోవడంతో కంగారుపడుతున్నారు నిర్మల్ వాళ్లు

************

తన మనుషుల గురించి అడిగిన చీలి వైపు చూస్తూ "నాకు కనపడదు కదా దొర! వాళ్ళు ఏమైపోయారో నాకెలా తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా జంతువుల లాక్కెళ్ళిన మా తమ్ముడు గుడ్డుకి వినబడదు." అని చెప్పాడు లింగు.

ఆ మాటకి రెండు చెంపలు వాయించుకుంట "నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ!" అని చెప్పి వెనక్కి తిరిగి "బాస్! ఇక్కడ నుంచి ఎవరో ఈడ్చుకుని వెళ్లినట్లు మార్క్స్ ఉన్నాయి కచ్చితంగా ఇక్కడ ఎవరో మనకి కనిపించకుండా మనుషులు ఉన్నారు." అని చెప్పాడు చీలి.

"ఆ కొండమీద చనిపోయిన జారువా తెగ ఆత్మలు తప్పితే ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు దొర!" అని చెప్పాడు లింగు.

"మనమైన మిగిలాము ఇక్కడ ఉండడం కన్నా ఆ కొండల దగ్గరికి వెళ్లడం బెటర్ వాసుకి వాళ్లు కూడా కచ్చితంగా అక్కడికి వస్తారు." అని చెప్పాడు నిర్మల్.

"సార్! మరి మన వాళ్ళు ఏమైపోయారో తెలుసుకోవడం ఎలాగా?" అని కంగారుగా అడిగాడు ధన.

"వాళ్ల గురించి తెలుసుకోవాలి అంటే ముందు మనం బతికి ఉండాలి కదా!" అని లింగు వైపు చూసి "వాడిని తీసుకురండి." అని చెప్పాడు నిర్మల్.

"మనం వెనక్కి వెళ్లిపోవడం బెటర్!  నిజంగా ఇక్కడ ఆత్మలు ఉన్నాయేమో! జరిగేదంతా చూస్తుంటే కొంచెం కంగారుగా ఉంది."  అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ప్రమోద్.

"మనం ఒక్కసారి అడుగు వెనక్కి వేస్తే మళ్లీ ముందుకి రాలేము ఆ కొండల దగ్గరికి వెళ్ళితే సిగ్నల్ రావచ్చు  అప్పుడు నా మనుషుల్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేస్తాను." అని చెప్పాడు ఫరూక్.

"దొర! మరి ఇంక బయలుదేరుదామా? మీకోసమే ఈ పళ్ళు తీసుకొచ్చాను ఇవి తింటే దాహం తగ్గి నడవడానికి  కాస్తా ఓపిక వస్తుంది." అని ఇచ్చాడు లింగు.

"సరే!" అని పళ్ళు తీసుకుని తింటూ లింగు వెనకాల వెళుతు నాకెందుకో వీడి మీద అనుమానంగా ఉంది. " అని చెప్పాడు ధన.

"మన మనుషుల్లో ఒక్కడైనా కనపడని అప్పుడు వీడి సంగతి చెబుతాను." అని కోపంగా చూస్తూ వెనకాలే వెళ్ళాడు చీలి.

*************

ప్రతాప్ మిశ్ర, రఘురామ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి "ఏదో విఐపి నెంబర్ లాగా ఉంది." అని ఫోన్ లిఫ్ట్ చేసి "హలో ఎవరు?" అని ఆత్రుతగా అడిగాడు వరదరాజులు.

"నా పేరు బైరి! మా నాయకుడు మీతో మాట్లాడమని చెప్పాడు ఏంటి విషయం?" అని అడిగాడు బైరి.

"మనం ఒకసారి పర్సనల్గా కలుసుకుని ఒక డీల్ మాట్లాడుకుందాము మీకు మాకు హెల్ప్ అవుతుంది." అని చెప్పాడు వరదరాజులు.

"సరే!ఎక్కడ కలుసుకుందాము లొకేషన్ పంపించండి ఒక గంటలో అక్కడ ఉంటాను." అని చెప్పాడు బైరి.

"నా గెస్ట్ హౌస్ లొకేషన్ పంపిస్తున్నాను అక్కడ అయితే మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు త్వరగా వచ్చేయండి." అని చెప్పి ఫోన్ పెట్టేసి లొకేషన్ సెండ్ చేసి రఘురాం వాళ్ళ వైపు చూసి "మనం బయలుదేరాలి." అని చెప్పాడు వరదరాజులు.

"మనం సైలెంట్ గా ఇక్కడి నుంచి జారుకోవాలి లేకపోతే అర్ణకి అనుమానం వస్తుంది." అని చెప్పాడు రఘురామ్.

అక్కడికి వస్తు "మీరు వెళ్లి డీల్ చేసుకోండి ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను మీ మీద ఎవరికి అనుమానం రాదు." అని చెప్పింది ఆశ.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి? నా కూతురేనా ఇలా మాట్లాడుతుంది?" అని అడిగాడు రఘురామ్.

"ఎస్! ఏ పనైనా మనం బిజినెస్ లానే చేయాలి పగ ప్రతికరాలతో కాదు వెళ్లి అభీర్ తో డీల్ కుదుర్చుకోండి. ఏది ఏమైనా సరే ఆ కొండలు మన హ్యాండ్ ఓవర్ అవ్వాలి." అని చెప్పింది ఆశ.

"ఇప్పుడు నాకు కొండంత బలం వచ్చింది." అని సంతోషంగా వరదరాజులు వాళ్ళతో పాటు అక్కడి నుంచి బయలుదేరాడు రఘురామ్.

కాసేపాటకి అక్కడికి వచ్చిన ఆశ వైపు చూసి "మామయ్య వాళ్ళు ఎవరు కనబడడం లేదు ఎక్కడికి వెళ్లారు?" అని అడిగింది అర్ణ.

"మీరెవరు చేయలేని పని చేయడానికి వెళ్లారు ఇంక ఈ ఆటకి పులిస్టాప్ పడుతుంది." అని చెప్పింది ఆశ.

"ఏంటి నువ్వు చెప్పేది? ఆ అభీర్ తో మాట్లాడడానికి వెళ్లారా?" అని అనుమానంగా అడిగాడు ముకుల్.

"అవును ఈ డీల్ ఓకే అయితే మన ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్లే మన అందరి కోరిక కూడా తీరుతుంది." అని చెప్పింది ఆశ.

"నో! అభీర్ ట్రాప్ చేశాడు మనం అతని ఉచ్చులో పడకూడదు అక్కడ ఎలాంటి డీల్ కుదురుచుకోవాలి అన్న ముందు తాతయ్యతో ఒక మాట చెప్పమను, మన కోరిక తీరడం కాదు అతని కోరిక తీరుతుంది." అని కంగారుగా చెప్పింది అర్ణ.

"అసలు ఈ పెంటకి కారణం నువ్వు! అందరూ ప్రశాంతంగా ఉన్నాము ఈ ఇండియా ప్రాపర్టీ గురించి బయటికి తీసుకువచ్చి అందరినీ ఇక్కడికి వచ్చేలాగా చేసావు ఇప్పుడు సవ్యంగా జరుగుతున్న డీల్ ని కూడా చెడగొట్టాలి అనుకుంటున్నావా?" అని కోపంగా చూస్తూ అడిగింది ముకుల్ పెద్ద కూతురు ఝాన్సీ.

"అవును!ఇక్కడే ఉంటే వీళ్ళతో పాటు మనం కూడా చస్తాము పదండి ఆ డీల్ ఓకే అయితే లండన్ వెళ్ళిపోదాము." అని చెప్పింది నళిని.

అంతలో లోపలికి గవర్నమెంట్ వెహికల్స్ రావడం అక్కడకి వస్తున్నా మిస్సైల్  వైపు చూసి "ఎవరు వచ్చింది?" అని అడిగాడు ముకుల్.

"సార్! యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్!  మిధున్ గాని ఎంక్వయిరీ చేయడానికి వచ్చారంట! ఎంత చెప్పినా వినకుండా లోపలికి వచ్చేసారు వాళ్ల దగ్గర కోర్టు ఆర్డర్ కూడా ఉంది." అని చెప్పాడు మిస్సైల్.

"అవునా?" అని కాల్ చేయడానికి ఫోన్ తీసి "సిగ్నల్ లేదు ఏంటి?" అని కంగారుగా అడిగాడు ముకుల్.

కారు దిగి అక్కడికి వస్తూ "సారీ సార్! మా ఎంక్వయిరీ కంప్లీట్ అయ్యేవరకు ఇక్కడ ఫోన్స్ పని చేయవు జామర్స్ ఆన్ చేసాము.

మర్చిపోయాను నేను ఎవరో చెప్పలేదు కాదు ఐ యాం వీరభద్రం ATF,  జస్ట్ టెన్ మినిట్స్ కోపరేట్ చేయండి మిధున్ గారిని పిలిపించారు అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగి వెంటనే వెళ్ళిపోతాము." అని ఐడి కార్డ్ చూపించాడు వీరభద్రం.

"మిథున్ కి టెర్రరిస్టుల నుంచి త్రెడ్ కాల్ కొచ్చింది అందుకే సేఫ్టీ రూమ్ లో ఉన్నాడు కావాలి అంటే అక్కడికి వెళ్లి మీరు తెలుసుకోవాల్సింది తెలుసుకొని రావచ్చు కానీ ఒక్కరు మాత్రమే వెళ్లాలి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం! నేను బయటకి వచ్చేవరకు ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళకూడదు." అని ఆశ వాళ్ళ వైపు చూసి లోపలికి వెళ్ళాడు వీరభద్రం.

అభిజిత్ వైపు చూసి "ఇండియాలో ఆఫీసర్స్ ఇంత ఫాస్ట్ గా ఉన్నారా? ఇన్సిడెంట్ జరిగిన సిక్స్ అవర్స్ లో ఎంక్వైరీ కి వచ్చేసారు." అని అడిగింది అర్ణ.

"టెర్రరిస్ట్ మేటర్ కదా కాస్త ఫాస్ట్ గానే ఉంటారు అయ్యినా ఎంక్వయిరీనే కదా ప్రాబ్లం ఏమి ఉండదు." అని చెప్పాడు అభిజిత్.

ఆశ వాళ్ళ వైపు చూసి "మీరు కాసేపు వెయిట్ చేయండి మనం తర్వాత మాట్లాడుకుందాము, అందరు క్షేమంగా ఉండాలని నేను కూడా చూస్తున్నాను." అని చెప్పాడు ముకుల్.

అంతలో ఒక కారు వచ్చి ఆగి రియాతో పాటు కిందకి దిగిన విష్ణు ని చూసి దగ్గరికి వెళ్లి "ఎలా ఉన్నావు?" అని అడిగింది అర్ణ.

ఆ మాటకి కోపంగా చూస్తూ "ఆ అభీర్ గాడిని చంపేశారా?" అని అడిగాడు విష్ణు.

"ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాము ముందు నువ్వు లోపలికి వేళ్ళు!" అని చెప్పాడు ముకుల్.

"ఆ అభీర్ మనుషులు కొంతమంది ఆ కొండ దగ్గరికి ఒక గుహలో నుంచి రావడం నేను చూశాను మనం ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు మనవాళ్ళతో అక్కడికి వెళ్లి జరిగింది మళ్ళీ రిపీట్ చేయాలి." అని ఆవేశంగా చెప్పాడు విష్ణు.

"అంటే! అడవిలోకి వెళ్లిన వాళ్లందరూ అభీర్ మనుషుల చేతిలో ఇరుక్కున్నారా..?" అని కంగారుగా అడిగాడు సుభాష్.

"మనం ఏలెర్ట్  గా లేకపోతే కచ్చితంగా ఇరుక్కుంటారు అభీర్ కూడా షూటింగ్ నిమిత్తం బేరా కొండల దగ్గరికి వెళుతున్నాడని తెలిసింది." అని చెప్పింది రియా.

"తాతయ్య! మనం ఇక్కడ ఉండడం కన్నా వాడి ప్లేస్ లోకి వెళ్లి మనమేమిటో చూపిద్దాము." అని చెప్పింది అర్ణ.

"ఆ అభీర్ అందరిని అడవికి రప్పించడానికి ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది ఈ ఎంక్వయిరీ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ప్రశాంతంగా ఆలోచిద్దాము." అని చెప్పాడు ముకుల్.

"సరే! త్వరగా ఏదో ఒకటి ఆలోచించండి అడవిలోకి వెళ్లిన వాళ్ళు సేఫ్ గా ఉన్నారో లేదో!" అని కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు సుభాష్.

అంతలో లోపల నుంచి బ్యాగ్ తీసుకుని బయటికి వస్తూ "సారీ ఫర్ ద డిస్టబెన్స్! మిథున్ గారితో మాట్లాడి అన్ని సెటిల్ చేసుకున్నాను." అని బ్యాగ్ వైపు చూసి నవ్వుతూ కారు దగ్గరికి వెళ్ళాడు వీరభద్రం.

"నా కొడుకు ఎటువంటి వాళ్లనైనా కొనగలడు వాడికి ఆ  టాలెంట్ ఉంది." అని నవ్వుతూ చెప్పాడు అభిజిత్.

ఆఫీసర్స్ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఆశ వైపు చూసి "అభీర్ తో ఏ డీల్ కుదుర్చుకోవడానికి వెళ్లారు." అని అడిగాడు ముకుల్.

అంతలో మరో కారు వచ్చి ఆగడంతో "మళ్లీ ఎవరు వచ్చారు?" అని విసుగ్గా అడిగాడు ముకుల్.

కారులో నుంచి ఒక వ్యక్తిని తీసుకుని అక్కడికి వస్తు "మేడం! ఇర్ఫాన్ కేస్ డిల్ చేస్తున్న ఆఫీసర్ గారు అన్ని విషయాలు మిథున్ సార్ డైరెక్టుగా ఫోన్లో మాట్లాడేసారు ఒక్కసారి మీట్ అవ్వాలి అంటే తీసుకువచ్చాను." అని చెప్పాడు రాహుల్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "మరి ఇప్పుడు వచ్చిన ఆఫీసర్స్ ఎవరు?" అని కంగారుగా అడిగింది అర్ణ.

"ఎవరు వచ్చారు మేడం! ఈ కేసు ఇంకా ఫైలే అవ్వలేదు నేను హాఫ్ ఆన్ అవర్ బ్యాక్ మిధున సార్ తో ఫోన్లో మాట్లాడి ఆఫీసర్స్ దగ్గర ఉన్న ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను." అని చెప్పాడు రాహుల్.

"అవునా?" అని బుల్లెట్ ప్రూఫ్ రూమ్ దగ్గరికి పరిగెత్తి  మిథున్ స్టైల్ గా నుంచుని ఉండడం చూసి లోపలికి వెళ్లి  "నో! ఆ వీరభద్రం బ్యాగ్ లో తీసుకెళ్ళింది డబ్బు కాదు మిధున్ తల!" అని గట్టిగా అరిచింది అర్ణ.

ఆ ఆరుపు విని టెన్షన్ గా వీల్ చైర్ లో నుంచి కింద పడ్డాడు అభిజిత్.
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 23-02-2026, 10:08 AM



Users browsing this thread: 1 Guest(s)