22-02-2026, 08:35 AM
ఎపిసోడ్ 90
అడవిలో లింగు చేసిన సౌండ్ విని బలి అవ్వడానికి మేకలు వస్తున్నాయి సిద్ధంగా ఉండండి తన మనుషులకి చెప్పాడు సోము.
***************
సోము చెప్పింది విని తన టీమ్ లో ఉన్న 25 మందిలో కొంతమంది చెట్ల మీదకి, కొంతమంది చెరువులో నీళ్లలో మునిగి లోపల ఉండి అక్కడికి వచ్చే వాళ్లకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.
ధన చెప్పడంతో చేరువు కోసం వెతుక్కుంటూ అడవిలో వెళుతూ "మనిషన్నవాడు ఎవడు ఇంత అర్ధరాత్రి ఈ అడవిలో తిరగడు." అని భయంగా చుట్టూ చూస్తూ చెప్పాడు నలుగురిలో ఒకడు.
అడవిలో వస్తున్న సౌండ్స్ విని "అవి పక్షుల అరుపులో మనుషుల అరుపులో కూడా అర్థం కావడం లేదు, నేను ఇందాక ఆ లింగు గాడిని తిట్టాను అది మనసులో పెట్టుకుని వాడు మ్యాప్ వేయలేదు కదా!" అని కంగారుగా అడిగాడు నలుగురిలో మరొకడు.
"ఒరేయ్! ఆ కళ్ళు లేని వాడికి అంత సీన్ లేదు కొండలు కనిపించగానే ఫస్ట్ చచ్చేది వాడే!" అని దూరంగా మెరుస్తున్న కళ్ళు కనిపించడంతో "దెయ్యం!" అని భయంగా చెప్పాడు మరొకడు.
"ఒరేయ్! అది జింక చెరువులో నీళ్లు తాగుతుంది. మన అడుగుల చప్పుడు విని ఇటు చూసింది దాని కళ్ళు చూసి నువ్వు భయపడ్డావు పద నీళ్లు తెచ్చుకుందాము." అని సంతోషంగా ముందుకు పరిగెత్తాడు నలుగురిలో మరొకడు.
చెరువు దగ్గరికి వస్తున్న నలుగురిని చెట్టు మీద నుంచి చూస్తూ "సౌండ్ కూడా రాకూడదు చచ్చిన తర్వాత బాడీ కనపడకూడదు." అని చెప్పాడు సోము.
"సరే!" అని చెప్పి చెట్టు మీద నుంచి వేగంగా దూకి అక్కడికి వచ్చిన నలుగురి గొంతులో పొడిచి చెరువులోకి తోసి లోపల ఉన్న వాళ్ళ వైపు చూసి
"శవాలు పైకి తేలకూడదు పాతి పెట్టండి." అని చెప్పి అక్కడి నుంచి చెట్ల మీదకి వెళ్ళిపోయారు సోము టీమ్ లో నలుగురు.
నీళ్ల అడుగున ఉన్న సోము మనుషులు చెరువులోకి పడ్డ ధన మనుషులుని పైకి తేలనివ్వకుండా అడుగున పాతిపెట్టిన కర్రలకి కట్టేరు.
నీళ్ల కోసం వెళ్ళిన నలుగురు ఎంతసేపటికి రాకపోవడంతో "వీళ్ళకి చెరువు ఇంకా కనబడలేదా ఏంటి? బాగా దాహం వేస్తుంది." అని విసుగ్గా చూస్తూ అన్నాడు నిర్మల్.
ఆ మాట విని "దొర! నన్ను వెళ్లి చూసి రమ్మంటారా? మీ మనుషులు ఏమైనా దారి తప్పేరేమో అనుమానంగా ఉంది." అని చెప్పి బయలుదేరాడు లింగు.
"ఒరేయ్ నువ్వు ఆగరా నాయనా! అయ్యినా అటు వెళుతున్నావు ఏమిటి? మనవాళ్లు వెళ్ళింది ఇటువైపు కదా!" అని డౌట్ గా అడిగాడు ఫరూక్.
"దొర! మా గుడ్డు గాడికి దిక్కులు సరిగ్గా తెలియదు ఇందాక అటు తిరిగి నుంచున్నాడు కదా అందుకునే తూర్పు ఇటువైపు అనుకుని ఉంటాడు, మంచినీళ్ళ చెరువు ఇటువైపు ఉంది." అని చెప్పాడు లింగు.
"అవునా? మరి అటువైపు వెళితే ఏమొస్తుంది?" అని కంగారుగా అడిగాడు ధన.
"మనకి మంచే జరిగింది దొర! అటువైపు సింహాలు ఉంటాయి మీరు వాళ్ళు వెళ్లారు కదా వాటికీ ఆకలి తీరిపోయి ఉంటుంది ఇంకా మన వైపు రావు." అని సంతోషంగా చెప్పాడు లింగు.
"అంటే! నా మనుషులు సింహాలకి ఆహారం అయిపోయారంటావా?" అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగాడు ధన.
"దొర! సింహ లకి మాత్రమే కాదు అవి తిన్న తర్వాత నక్కలు కూడా తింటాయి మనకి వాటి బెడద కూడా తప్పినట్లే!" అని చెప్పాడు లింగు.
"మనం ఈ అడవిలో ఉన్న జంతువులకి ఆకలి తీర్చడానికి వచ్చినట్లు ఉంది. నిజంగా ఇటువైపు చెరువు ఉంటుందా?" అని టెన్షన్ గా చూస్తూ అడిగాడు చీలి.
"ఇటువైపు వెళితే కచ్చితంగా నీళ్లు దొరుకుతాయి." అని చెప్పి చీలి దగ్గరికి వెళ్లి మొహం మీద చేతులు పెట్టి తడుముతు
"దొర! మనం జంతువుల్ని తిన్నప్పుడు సంతోషంగా ఉంటావు కదా, కానీ ఆ జంతువులే మనల్ని తింటే ఎందుకు బాధపడతారు సంతోషంగా ఉండండి." అని చెప్పాడు లింగు.
ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక తన మనుషులు నలుగురిని లింగు చూపించిన వైపు పంపించి "నీళ్లు కనపడితే సిగ్నల్ ఇవ్వండిరా.. అందరం వస్తాము." అని చెప్పాడు చీలి.
కాసేపటికి మొదటిసారి వెళ్లిన నలుగురు వైపు నుంచి సౌండ్ వినపడడంతో "ఏంటిది అంత గట్టిగా అరుస్తుంది?" అని డౌట్ గా అడిగాడు నిర్మల్.
"అది అరుపు కాదు దొర! సింహం తేన్పు కడుపునిండా తిన్న తరువాత అలాగే సొండ్ చేస్తుంది." అని చెప్పాడు లింగు.
మరి కాసేపటికి చీలి మనుషులు వెళ్లిన వైపు నుంచి కేకలు వినపడడంతో "మనవాళ్లు ఎందుకు అరుస్తున్నారు ఏదైనా ఎటాక్ చేసిందా?" అని కంగారుగా అడిగాడు ఫరూక్.
"నీళ్ల చెరువు కనిపించిందేమో దొర! సిగ్నల్ ఇస్తున్నారు వెళదామా?" అని అడిగాడు లింగు.
"ఎవరు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి. నీళ్లు దొరికితే వాళ్లే వెనక్కి వస్తారు ఆ జంతువుల బారిన పడి చచ్చే కన్నా దాహంతో చావడమే మంచిది." అని భయంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.
"సరే దొర! అయితే నాకు నిద్ర వస్తుంది ఉదయం బయలుదేరి కొండల దగ్గరికి వెళదాము." అని చెప్పి గుడ్డుతో కలిసి అక్కడే పడుకున్నాడు లింగు.
ధన, చీలి వైపు చూసి "మంట వెలిగించండి ఒకరి తర్వాత ఒకరు కాపలాగా ఉండండి మిగతా వాళ్ళు పడుకోండి. ఉదయం ఈ గుడ్డి నా కొడుకు కొండలు చూపించకపోవాలి అప్పుడు చెబుతాను." అని పడుకున్న లింగు వైపు కోపంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.
"సరే సర్!" అని అక్కడ ఉన్న పుల్లలు ఏరి మంట వెలిగించి కాసేపటికి నిద్రలోకి జారుకున్నారు అందరు.
************
ఉదయం నంద గెస్ట్ హౌస్ లోకి హడావిడిగా వచ్చి వీల్ చైర్ లో కూర్చుని ముకుల్ తో మాట్లాడుతున్న అభిజిత్ దగ్గరకు వెళ్లి
"సార్! మనం డేంజర్ లో పడ్డాము జైల్లో ఎటాక్ ప్లాన్ చేయడానికి మిథున్ సార్ ఇర్ఫాన్ అనే ఐ ఎస్ ఐ ఏజెంట్ తో మాట్లాడారు, వాడిని రాత్రి పంజాబ్ బోర్డర్లో మిలటరీ వాళ్ళు లేపేసారు. ఇర్ఫాన్ దగ్గర దొరికిన ఫోన్లో చాలా డీటెయిల్స్ దొరికాయి అని తెలిసింది." అని కంగారుగా చెప్పాడు మిథున్ పిఏ రాహుల్.
"అవునా? వీడికి చాలా సార్లు చెప్పాను ఎన్ని తప్పులు అయినా చేయొచ్చు కానీ టెర్రరిస్టులతో లింకులు పెట్టుకోకూడదు." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు అభిజిత్.
"సార్! ఎందుకైనా మంచిది మిథున్ సార్ ని ఇక్కడి నుంచి కొన్ని రోజులు లండన్ పంపించేస్తే బెటర్!" అని చెప్పాడు రాహుల్.
అక్కడికి వస్తూ "అప్పుడు తప్పు చేసినట్లు మనమే ఒప్పుకున్నట్లు అవుతుంది. ఆఫీసర్స్ వస్తే రానివ్వండి ఎంక్వయిరీ నే కదా చేసేది కరెక్ట్ ఎవిడెన్స్ ఉండాలి కదా!
ఒకవేళ ఆఫీసర్స్ ఎవిడెన్స్ ఏదైనా చూపించినా ఇది రాజకీయంగా ఎదుర్కోలేక ఎగైనెస్ట్ పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని చెబుదాము, అప్పుడు అరెస్టు చేయడానికి ఎవరికి ధైర్యం సరిపోదు తరువాత డబ్బుతో ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు!" అని నవ్వుతూ చెప్పింది అర్ణ.
ఆ మాటకి సంతోషంగా చూస్తూ "నువ్వు లండన్ లో ఉన్న ఇక్కడ రాజకీయాలు బానే వంట పట్టించుకున్నావు కరెక్ట్ గా చెప్పావు, డబ్బు అధికారం ఉంటే ఎవరు ఏమి చేయలేరు." అని చెప్పాడు అభిజిత్.
రాహుల్ వైపు చూసి "ఈ కేస్ ఎంక్వయిరీ చేస్తున్న ఆఫీసర్ ఎవరో తెలుసుకో వాళ్లని ఎలా మేనేజ్ చేయాలో నేను చూసుకుంటాను." అని చెప్పింది అర్ణ.
"ఓకే మేడం!"అని అక్కడ నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాడు రాహుల్.
**********
ఉదయం గొర్వర్ గెస్ట్ హౌస్ దగ్గరకి తన మనుషుల్ని ఒక పది మంది తీసుకుని వచ్చి "దొర మేము సిద్ధం అడవిలోకి బయలుదేరుదామా?" అని అడిగాడు కేశవ.
"నీ మనుషులు వచ్చారా..?" అని బయటకు వచ్చి కండలు తిరిగి బాడీ బిల్డర్స్ లాగా ఉన్న పదిమందిని చూసి గుటకలు మింగుతూ "కాస్త బలమైన వాళ్ళని తీసుకొచ్చినట్లు ఉన్నావు." అని కంగారుగా అడిగింది వాసుకి.
"మీ సామాన్లు మొత్తం మోయాలి కదా దొరసాని! ఆది కాకుండా అక్కడ కష్టమైన పని ఏదైనా ఉన్న చేయాలి అందుకే ఉన్న వాళ్ళలో కాస్త బలమైన వాళ్ళని తీసుకువచ్చాను." అని చెప్పాడు కేశవ.
ఆ పదిమందిని చూసి "మంచి దిట్టంగా ఉన్నారు మనకి కరెక్ట్ గా సరిపోతారు ఒకవేళ నిధి దొరికిన అక్కడి నుంచి ఇక్కడికి మోసుకురావాలి కదా!" అని చెప్పాడు తల్వర్.
"దొర! వాళ్ళకి పైసలు గురించి చెప్పకండి మొత్తం సొమ్ము నాకు ఇవ్వండి నేను వాళ్లకి పంచి పెడతాను." అని తల గోక్కుంటూ చెప్పాడు కేశవ.
"సరే సరే! మేము చెప్పినట్లు అన్ని పనులు వాళ్లతో చేయించు నీకు వచ్చే కమిషన్ కాకుండా ఇంకా ఎగస్ట్రా అమౌంట్ కూడా ఇస్తాను." అని చెప్పింది వాసుకి.
"మీరే చూస్తారు కదా మా వాళ్ళ పనితనం మళ్లీ ఎక్కడ పని ఉన్న ఇక్కడికి వచ్చి నా మనుషుల్ని తీసుకువెళ్లాలి." అని నవ్వుతో చెప్పాడు కేశవ.
"సరే! ఆ సామాన్లు తీసుకోండి ఇంకా బయలుదేరుదాము." అని గఫర్ ఖాన్ చేతిలో ఉన్న మ్యాప్ తీసుకుని రూట్ చూస్తూ ఉన్నాడు తల్వర్.
*************
ఉదయం అడవి లోపల మోహన సూర్యకిరణాలు పడడంతో నిద్రలేచి "బాస్ బాస్!" అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు చీలి.
ఆరుపులకి కంగారు పడి లేచి చూస్తూ "ఏమైంది?" అని టెన్షన్ గా చుట్టూ చూస్తూ అడిగాడు నిర్మల్.
"బాస్! మన మనుషులు ఎవరూ లేరు ఇక్కడ నుంచి ఈడ్చుకుపోయినట్లు ఆనమాలు ఉన్నాయి." అని భయంగా చూస్తూ చెప్పాడు ధన.
"అవునా?" అని కంగారుగా చూస్తూ "అక్కడ లింగు, గుడ్డు కూడా లేరు వీళ్ళని కూడా జంతువులు పట్టుకుపోయాయా?" అని టెన్షన్ గా చూస్తూ అడిగాడు ఫరూక్.
అంతలో పాట పాడుకుంటూ వస్తున్న లింగు వాళ్ళని చూసి "వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు." అని చూపించడు ప్రమోద్.
అక్కడికి వస్తున్న ఇద్దరికీ వైపు చూసి "ఒరేయ్! మా మనుషులందరూ ఏమైపోయారు?" అని కోపంగా చూస్తూ అడిగాడు ధన.
ఆ మాటకి ఆలోచిస్తూ "ఏమో దొర! నాకు కనపడదు నా తమ్ముడికి వినపడదు వాళ్లు ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో మాకు ఎలా తెలుస్తుంది." అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పాడు లింగు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)