22-02-2026, 08:34 AM
ఎపిసోడ్ 89
మనం కలసి పనిచేయడానికి ఏం చేయాలో చెప్పండి అని వరదరాజులని అడిగాడు రఘురామ్.
ఆ అగస్త్య గాడిని లెఫ్ట్ లెగ్ తో తన్నండి మనకి అభీర్ కి మధ్య జరిగే డిల్ లో మూడో వ్యక్తి ఉండకూడదు అని చెప్పాడు వరదరాజులు.
*************
ఆ మాటకి మోహిత్ వైపు తిరిగి ఆలోచిస్తూ "నువ్వు ఏమంటావు?" అని అడిగాడు రఘురామ్.
"ఆ అగస్త్య గాడిని ఏ కాలితో తన్నిన నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే వాడు నీకు పరిచయం నాకు కాదు." అని చెప్పాడు మోహిత్.
"సరే! వాడి సంగతి నేను చూసుకుంటాను మీరు అభీర్ తో మాట్లాడి ఒక మీటింగ్ సెట్ చేయండి." అని చెప్పాడు రఘురామ్.
"ఒక్క నిమిషం ఇప్పుడే కాల్ చేస్తాను." అని చెప్పి అభీర్ కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు వరదరాజులు.
నీలమ్ మిత్ర వాళ్లతో మాట్లాడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "వరదరాజులు ఏమిటి విషయం?" అని అడిగాడు అభీర్.
"హ బాబు! నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను, నువ్విచ్చిన స్ట్రోక్ కి మిథున్ బుల్లెట్ ప్రూఫ్ రూమ్ లో దాక్కున్నాడు మరి జాగ్రత్తగా ప్లాన్ చేసుకో!" అని చెప్పాడు వరదరాజులు.
"ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్స్! మనం ఒకసారి కలుసుకుందాము." అని చెప్పాడు అభీర్.
"సరే బాబు! నీతో బేరా అడవిలో కొండల గురించి ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను." అని చెప్పడు వరదరాజులు.
"నా మనిషి బైరి మీకు ఫోన్ చేస్తాడు మాట్లాడండి." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు అభీర్.
ఫోన్ కట్ అవడంతో రఘురామ్ వైపు చూసి నవ్వుతూ "చూసావా? ఇప్పుడు డైరెక్ట్ గా అభీర్ మనిషి మనతో కాంటాక్ట్ లోకి వస్తాడు." అని నవ్వుతూ చెప్పాడు వరదరాజులు.
"నువ్వు గోడ మీద పిల్లివి కాదు జిత్తుల మారి నక్కవి!" అని నవ్వుతూ అన్నాడు రఘురామ్.
"సరే కానీ! ఆ కొండలు మనం తవ్వుకోవడానికి అభీర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడని మీరు అనుకుంటున్నారు." అని అడిగాడు మోహిత్.
"ఏది అడిగినా నలుగురివి సమానమైన షేర్స్, పెట్టుబడి అయిన లాభమైన!" అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
"డన్!" అని చెప్పి టేబుల్ మీద ఉన్న మందు గ్లాసు తీసుకుని చీర్స్ చెప్పాడు రఘురామ్.
**************
వసుంధర ఇంటి దగ్గరికి వచ్చిన బైరి వైపు చూసి "ఏమైంది? జైల్లో ఖైదీలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా?" అని అడిగాడు అభీర్.
"ఎస్! మిధునతో ఐఎస్ఐ వాళ్ళు టచ్ లో ఉన్నారు జైల్లో ఉన్న టెర్రరిస్ట్ లని తప్పించడానికి ప్లాన్ చేశారు డీటెయిల్స్ మొత్తం RAW కి పంపించాను ఇంకా వాళ్ళు చూసుకుంటారు." అని చెప్పాడు బైరి.
"గుడ్! వరదరాజుల ఆ కొండలు చూడాలని మోజు పడుతున్నాడు ఒక్కసారి మాట్లాడు." అని చెప్పాడు బైరి.
"అవునా? నిర్మల్ వాళ్లకి దారి చూపించడానికి లింగుని, గుడ్డుని పంపించినట్లు వీళ్ళకి హెల్ప్ చేయడానికి మరో ఇద్దరిని పంపిస్తాను." అని నవ్వుతూ చెప్పాడు బైరి.
"మిధున్ తల తీసుకురావడానికి ఒక మంచి పాశుపతాస్త్రం వదలాలి భద్రని సిద్ధం అవ్వమను ఏం చేయాలో నేను చెప్తాను." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా! ఉదయానికి భద్ర ఇక్కడ ఉంటాడు." అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు బైరి.
వసుంధర వైపు చూసి "మేడం! మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజు నేను ఇక్కడే ఉంటాను." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని "ఒక్కరోజు ఏం కర్మ! జీవితాంతం ఉండిపోయినా మాకు అభ్యంతరం లేదు." అని సంతోషంగా చూస్తూ చెప్పింది నీలమ్.
ఆదివిని నవ్వుతూ లోపలికి వెళ్ళాడు అభీర్.
నీలమ్ వైపు అనుమానంగా చూస్తూ "అభీర్ విషయంలో నువ్వు కొంచెం ఎక్కువ ఎగ్జాట్ మెంట్ అవుతున్నట్లు అనిపిస్తుంది జాగ్రత్త!
అతని మనసులో అగ్నిపర్వతంలా రగిలిపోతున్న పగ ఉంది అది చల్లారే వరకు ప్రేమ అనే పన్నీరు ఎంత చల్లినా ఆవిరి అయిపోతుంది తర్వాత నువ్వు బాధపడతావు." అని చెప్పింది వసుంధర.
ఆ మాటకి స్మైల్ ఇస్తూ "తెలుసు వదిన! ఆ పగ తన వాళ్ళ మీద ఉన్న ప్రేమ నుంచి పుట్టుకు వచ్చిందే అది చల్లారే వరకు వెయిట్ చేస్తాను." అని చెప్పింది నీలమ్.
"యుద్ధం ముగిసిన తర్వాత సంతోషం మాత్రమే కాదు బాధ కూడా ఉంటుంది ఆ విషయం మైండ్ లో ఉంచుకుని వెయిట్ చెయ్!" అని చెప్పి లోపలికి వెళ్ళింది వసుంధర.
******************
తల్వార్ వాళ్లతో కలిసి గొర్వర్ గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకుని "చీకటి పడుతుంది కదా నైట్ ఇక్కడ స్టే చేసి ఉదయం లోపలికి వెళదాము." అని చెప్పింది వాసుకి.
అంతలో అక్కడికి వచ్చి "నమస్తే దొర! నా పేరు కేశవ! మీరు వస్తారు ఏర్పాట్లు దగ్గర ఉండి చూసుకోమని మా నాయకుడు చెప్పాడు." అన్నాడు కేశవ.
"అవునా మీరు ఈ అడవిలోనే ఉంటారా? ఏ తెగకు చెందినవాళ్లు? మీ నాయకుడు ఎక్కడ?" అని అడిగాడు తల్వర్.
"మేము చిర్రీ తెగా కు చెందిన వాళ్ళము దొర! ఈ పొద్దు ఇక్కడకి వచ్చిన దొరలతో కలిసి నవగ్రహాల కొండలు చూపించడానికి మా నాయకుడు అడవిలోకి వెళ్ళాడు మీరు కూడా అక్కడికే వెళ్లాలా?" అని అడిగాడు కేశవ.
"అక్కడికి కాదులే కానీ నీకు బేరా అడవి మొత్తం తెలుసా? అక్కడ ఉండే జారువ తెగ వాళ్ళతో పరిచయం ఉందా?" అని అడిగాడు తల్వార్.
"ఆ తెగ వాళ్ళు అక్కడ ఉన్న కొండమీద ఉండే వారు దొర ఏదో ప్రమాదం జరిగి అందరూ చనిపోయారు, ఇప్పుడు ఎవరు అక్కడ ఉండడం లేదు.
ఇంక బేరా అడవి గురించి అంటారా..! నాకు కొట్టినపిండి మిమ్మల్ని ఎక్కడకి కావాలిఅంతే అక్కడకి తీసుకువెళతాను మీ సామాన్లు మోయడానికి మనుషుల్ని కూడా పురమాయిస్తాను." అని చెప్పాడు కేశవ.
"ఈ అడవిలో భూమి అడుగునా ఒక పెద్ద గుహ ఉందంట దాని గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా?" అని అడిగాడు గఫార్ ఖాన్.
"చాలాసార్లు విన్నాను దొర! ఆ గుహకు వెళ్లడానికి మార్గం కోసం బ్రిటిష్ వాళ్లు కూడా వెతికారని మా తాత చెప్పేవాడు కానీ ఇప్పటివరకు అది ఎవరికి కనపడలేదు అసలు అది ఉందో లేదో కూడా తెలియదు." అని చెప్పాడు కేశవ.
"ఆ ప్లేస్ కచ్చితంగా ఉంది మేము వెతికి పట్టుకుంటాము ఉదయం నీ మనుషుల్ని తీసుకురా.. అడవిలోకి వెళ్ళేటప్పుడు మా సామాన్లు మోయాలి." అని చెప్పాడు గఫర్ ఖాన్.
"సరే దొర తీసుకు వస్తాను, కానీ ఆ అడవిలోకి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం కాబట్టి కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది." అని చెప్పాడు కేశవా.
"మేము ఏ పని చెబితే ఆ పని చేయాలి మనిషికి గంటకి ₹1000 ఇస్తాం సరేనా!" అని చెప్పింది వాసుకి.
"సరే! ఉదయం నా మనుషులతో ఇక్కడ ఉంటాను, మీరు ఆఖరిసారి శుభ్రంగా తిని పడుకోండి." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కేశవా.
"మనిషికి ఆశ చూపిస్తే ప్రాణాలు కూడా లెక్క చేయడు." అని నవ్వుతూ చెప్పింది వాసుకి.
"అతను ఆఖరిసారి శుభ్రంగా తిని పడుకోమన్నాడు." అని అనుమానంగా అడిగాడు గఫార్ ఖాన్.
"అతను చెప్పింది ఆఖరిసారి కాదు ఆకలితో ఉన్నారు కదా తిని పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు పదండి లోపలికి వెళదాము." అని చెప్పాడు తల్వర్.
***********
బేరా అడవిలో గుడ్డు చెయ్యి పట్టుకుని నడుస్తూ తన వెనుక ఉన్న నిర్మల్ వాళ్ళ వైపు చూసి "దొర! చీకటి పడిందా? మిడతల అరుపులు వినిపిస్తున్నాయి." అని అడిగాడు లింగు.
"మీడతల అరుపులు ఏమి కర్మ రకరకాల అరుపులు వినిపిస్తున్నాయి ఎప్పుడో చీకటి పడింది." అని కంగారుగా చూస్తూ చెప్పాడు ఫరూక్.
"నాకు కనపడదు కదా దొర! అందుకే ఆగలేదు మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం కొండల దగ్గరికి పోదాము ఇంక ముందుకు వెళితే నక్కలు మీద పడతాయి." అని చెప్పాడు లింగు.
"అవునా? నాకు నక్కలు అంటే చచ్చే భయం ఇక్కడికి ఏ జంతువులు రావు కదా!" అని అడిగాడు నిర్మల్.
ఆ మాట విని నేల మీద చెయ్యితో తడుముతూ "ఇక్కడ సింహం పంజా గుర్తులు ఉన్నాయి దొర ఆకలి వేసినప్పుడు వస్తాయనుకుంట!" అని చెప్పాడు లింగు.
"ఏంటి? ఆకలి వేసినప్పుడు సింహాలు వస్తాయా? అంత తేలిగ్గా చెబుతున్నవేమిటి మన దగ్గర వెపాన్స్ కుడా లేవు వెనక్కి వెళ్ళిపోదాము పదండి." అని చెప్పాడు ప్రమోద్.
"రాత్రి సమయంలో వెళ్లడం ప్రమాదం దొర! అడుగుల చప్పుడు వినపడితే పెద్ద పులులు దాడి చేస్తాయి." అని చెప్పాడు లింగు.
"ముందుకు వెళితే గొయ్యి వెనక్కి వెళితే నూయ్యి ఇక్కడ ఉండడమే బెటర్! సింహాలకి ఆకలి వేస్తేనే కదా వచ్చేది లేకపోతే రావు కదా!" అని టెంక్షన్ గా చూస్తూ చెప్పాడు ప్రమోద్.
ముత్యం వైపు చూసి "ముందుకు వెళితే తినడానికి పళ్ళ చెట్లు ఉంటాయని చెప్పావు? ఎక్కడ ఒక్కటి కూడా కనిపించడం లేదు." అని చుట్టూ చూస్తూ అడిగాడు చీలి.
"ఈ దారి చాలా కొత్తగా ఉంది మేము కూడా ఎప్పుడు ఇక్కడకి రాలేదు ఆకులు ఉన్న చెట్లే తప్పితే పళ్ళు ఉన్న చెట్టు ఒకటి కనపడటం లేదు." అని చెప్పాడు ముత్యం.
లింగు వైపు చూసి "ఇక్కడ కనీసం మంచినీళ్లు అయినా దొరుకుతాయా?" అని అడిగాడు నిర్మల్.
"అయ్యో పాపం దాహం వేస్తున్న దొర! మా గుడ్డు గాడిని అడుగుతా ఉండండి." అని సైగలు చేశాడు లింగు.
సైగలు చూసి "దొర! కాస్త పక్కకి వెళితే పులులు, సింహాలు నీళ్లు తాగే చెరువు ఉంటుంది కావాలంటే వెళ్ళండి. కానీ జాగ్రత్తగా ఉండాలి ఆ చెరువు నిండా ముసళ్లు ఉంటాయి." అని చెప్పాడు గుడ్డు.
"చెరువులో ఉండే ముసళ్ళు మనల్ని ఏమి చేస్తాయి." అని తన మనుషుల వైపు చూసి "నలుగురు వెళ్లి బాటల్స్ నిండా మంచి నీళ్లు పట్టుకురండి. అలాగే వచ్చేటప్పుడు పళ్ళ చెట్లు ఏమైనా కనపడితే చూడండి." అని చెప్పాడు ధన.
"సరే బాయ్!" అని చెప్పి అక్కడినుంచి వాళ్ళ మనుషులు వెళుతున్న అడుగుల చప్పుడు విని నోటి దగ్గర రెండు చేతులు పెట్టుకుని గట్టిగా ఒక వింత అరుపు అరిచాడు లింగు.
ఆ అరుపు విని ఉలిక్కిపడి చూస్తూ "ఎందుకు అలా అరుస్తున్నావు? భయపడి చచ్చిపోయాను." అని కంగారుగా చెప్పాడు ఫరూక్.
"అడవిలో నిద్రపోయేటప్పుడు ఇలా అరిస్తే పురుగు పుట్రా దగ్గరికి రావు దొర!" అని గుడ్డుతో కలిసి కింద కూర్చున్నాడు లింగు.
అడవిలో చెట్లు మీద ఉండి అరుపు విని "మన లింగు బలి ఇవ్వడానికి మేకల్ని పంపించాడు సిద్ధంగా ఉండండి." అని తన మనుషులకి చెప్పాడు సోము.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)