22-02-2026, 08:32 AM
Part - 108
అవని కారు దిగి ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూఉంటుంది. విక్రమ్ అవిని దగ్గరికి వచ్చి కం అని చేయి అందిస్తాడు. చేతిలో చెయ్యవేసి ముందుకి నడుస్తుంది.
ఓపెన్ ఏరియా లాగా ఉన్న ప్లేస్ చూసి ఎక్కడికి వచ్చాము. చిన్న సర్ప్రైజ్ అని చిటిక వేస్తాడు.. మెల్లిగా ఒక్కొక్క లైట్ వెలుగుతూ ఉంటుంది.
చీకట్లు మధ్యలో వెన్నెల కురిసినట్టేగా ఆ ప్రదేశం అంతా లైట్లతో నిండిపోతుంది. ఇద్దరి కోసము అక్కడ డిన్నర్ అరేంజ్ చేసి ఉంటుంది.
ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశారు. సర్ప్రైజ్ అన్నాను కదా.. ఫోన్ లో మ్యూజిక్ ఆన్ చేస్తాడు. అవని తన ముందుకు తిప్పుకొని మెల్లిగా స్టెప్స్ వేపిస్తూ ఉంటాడు.
ఆ చల్లటి గాలిలో మెల్లిగా వస్తున్న రొమాంటిక్ మ్యూజిక్ లో విక్రమ్ తో కలిసి డాన్స్ చేస్తూ ఉంటే తనని తాను మరిచిపోతుంది.
అవని మూడ్ పూర్తిగా మారింది అని అర్థమైన తర్వాత తీసుకువెళ్లి చైర్ లో కూర్చోబెట్టి తనే స్వయంగా తినిపిస్తాడు.
విక్రమ్ ప్రేమకి అవని ఎప్పుడూ కరిగిపోతూనే ఉంటుంది. ఫుడ్డు తినిపించిన తరువాత అక్కడ లాన్లోనే కింద కూర్చుంటారు.
అవని ఎమోషనల్ అవుతూ విక్రమ్ ఒడిలో కూర్చుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. భార్య చుట్టూ చేతులు వేసి దగ్గరగా హత్తుకుని ఏమైందిరా అంటాడు.
ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. కానీ ఆ కౌగిలి నుంచి మాత్రం బయటికి రాదు. ఇంకా దగ్గరగా హత్తుకుని నాతో కూడా చెప్పవా.
మీకు కాక ఇంకెవరికి చెబుతాను అని విడి.. విక్రమ్ ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది. అబ్బో ఇప్పుడు మా శ్రీమతికి ఎందుకు ఇంత ప్రేమ పొంగి కొచ్చింది.
ఎంత పొంగి కొచ్చినా మా శ్రీవారి ప్రేమ ముందు అది చిన్నదే అంటుంది. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ నా శ్రీమతి ప్రేమకి కరిగిపోయాను కాబట్టే నా ప్రేమ నీకు కనిపిస్తుంది.
అవని కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్లు తుడిచి ఇవి నీ కళ్ళల్లో నేను చూడలేను బంగారం. నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆ విషయం నాకు తెలుసు అండి.
మీ భార్యగా మారిన తర్వాతే అదృష్టం కూడా నా వైపుకు వచ్చింది. అప్పుడు దాకా నా జీవితం ఏమిటా అని ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉండేదాన్ని.
అలాంటిది ఈరోజు ఆ మనిషి తన వారసురాలుగా నన్ను ప్రకటించి నా ఉనికిని ప్రపంచానికి చూపించాడు. నన్ను అనాధ అని గెలిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నోరు మూసుకుంటారు.
ఎవరినైనా కామెంట్ చేయాలి అంటే ఆలోచిస్తారు. ఇదంతా మీ వల్లే కదా... మీరు నా జీవితంలోనికి రాకపోయే ఉండి ఉంటే ఎప్పటికి నేను ఒక అనాధ లాగానే ఉండేదాన్నేమో.. లేకపోతే వాళ్ళ అరాచకాలకి బలైపోయి ఈ ప్రాణం ...
నెక్స్ట్ మాట వచ్చే లోపు విక్రమ్ అవని పెదాలు మూసేస్తాడు. ఆ ముద్దులో ప్రేమ కోపం బాధ అన్నీ కనపడుతూ ఉంటాయి.
అవని మాత్రం ఆపదు. వెచ్చటి కన్నీళ్లు బుగ్గ పైనుంచి కారుతూ విక్రమ్.. ని కూడా తడిపేస్తాయి. ఆ కన్నీళ్ళకి కోపాన్ని వదిలి మెల్లిగా ముద్దు పెట్టి చూడు శ్రీమతి.. ఎప్పుడు నీ నోటి నుంచి ఆ మాట రానివ్వకు .
నీ ప్రాణం నా ప్రాణం వేరువేరు కాదు. ఎప్పుడైతే నీ చేతిని పట్టుకుని పాణిగ్రహణం చేశానో ఆ రోజే రెండు శరీరాలు ఒకే ఆత్మగా మారిపోయాము.
ఈ జన్మకి కాదు. ఎన్ని జన్మలకైనా మన బంధం ఇదే.. నువ్వే నేను. నేనే నువ్వు. అర్థమయిందా అంటాడు.
ఆ మాటకి నవ్వుతూ విక్రమ్ వైపు చూసి అర్థమయింది... ఇంతకన్నా నాకు కావాల్సిందేముంది అంటుంది. అరే అలాంటి ఎలా కుదురుతుంది.
ఇంకా చాలా కావాలి కదా అంటాడు.. ఇంకేం కావాలి అంటే.. ఇంకేం కావాలా అసలు ఈ ప్రశ్న నువ్వెలా అడగగలుగుతున్నావ్ భార్యామణి అని నడుము పైన వేలుతో రాస్తూ ఉంటాడు.
ఆ చక్కెలగింతలకి నవ్వుతూ ఏం చేస్తున్నారు మీరు.. మరి ఇంకేం కావాలి అని అడుగుతున్నావు కదా.. తెలుసుకోవాలి కదా నువ్వు.
తెలుసుకుంటాను ప్లీజ్ ఆపండి. సరే తెలుసుకో అంటాడు. చెప్పండి.. మీకు ఇంకేం కావాలి అని గెడ్డం పట్టుకుని అడుగుతుంది.
ఇలా అడిగితే వర్కౌట్ అవ్వదు భార్యమణి అంటాడు. మరి ఇంకా ఎలా అడిగితే వర్కౌట్ అవుతుందండి. భగవంతుడా నా పెళ్ళానికి అందమైన రూపం ఇచ్చావు గాని ఆ బుర్రలో కొంచెం గుజ్జు ఇచ్చి ఉంటే నేను ఎంత అదృష్టవంతుడిని అయ్యేవాడినో అంటాడు.
ఆ మాటకి కోపంగా చూస్తూ అంటే నా బుర్రలో గుజ్జు లేదా... గుజ్జు ఉంటే ఈపాటికి నీకు అర్థం కావాలి కదా...
ఇంకా ఏమై ఉంటుందా అని బుగ్గ పైన వేలు పెట్టి ఆలోచిస్తుంది.
అప్పుడు బల్బు వెలిగి సిగ్గుతో తలకిందకి దించేస్తుంది. ఏదో మా మేడంకి బల్బ్ ఎలిగినట్టుందే అంటాడు. ఆ వెలిగితే మాత్రం చెబుతానా అంటుంది.
చెబితేనే కదా అది అవునా కాదా నేను చెప్పగలను. సమయం వచ్చినప్పుడు చెబుతానులే గాని ఇంకా ఇంటికి వెళదామా అంటుంది.
అవని నీ తన లోకంలోనికి తీసుకువచ్చి ఇంటికి తీసుకువెళతాడు.
శిల్ప ని ఇంటి దగ్గర వదిలేసి వ్యాన్ మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంది. శిల్ప కోపంగా చూస్తూ ఉంటే వాచ్మెన్ గేట్ తీసి లోపలికి వెళ్ళండి అని చెబుతాడు.
ఏమీ చేయలేక లోపలికి వెళ్లి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంటుంది. డాడీ రాగానే అడగాలి ఇలా ఎందుకు చేశారో కనుక్కోవాలి అని గుంజుకుంటూ ఉంటుంది.
ధనుంజయ్ వచ్చేలోపు ఆ మేకప్ అంతా తీసేసి ఒక డ్రెస్ వేసుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది. బిందు శిల్పను చూసి ఇక్కడే కూర్చున్నావ్ ఏంటి.. నిద్ర రావడం లేదా...
నేను డాడీతో మాట్లాడి వస్తాను. ఏమైంది అని అడిగితే.. ఈరోజు ఫంక్షన్ లో ఏం జరిగిందో తెలుసా అత్తయ్య.. నేను రాలేదు కదా నాకు తెలియదు అంటుంది.
అయ్యో అత్తయ్య నువ్వు అంత విరక్తిగా మాట్లాడితే....
ఇక్కడ నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ ఉంటారు.
సరే చెప్పు అంటుంది.
శిల్పను తీసుకువెళ్లిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా జరిగింది మొత్తం చెబుతుంది. అవునా అంటుంది. అదేంటి అత్తయ్య.. జరిగింది అంతా చెబితే నువ్వు అంత సింపుల్ గా అవునా అంటున్నావు.
ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది. అన్నయ్య ముందే చెప్పారు కదా నువ్వు ఎక్కడ నాన్న అని పిలవడానికి వీలు లేదు అని.
పిలవద్దు అంటే ఏదో కోపంలో అన్నారు అనుకున్నాను కానీ.. అసలు ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా చేశారు.
ఇలా అయితే మరి నేను ఎవరిని.. నా ఐడెంటిటీ ఏది అని కోపంగా అడుగుతుంది. మీ ఐడెంటిటీ మీ అమ్మని అడుగు అన్నా వాయిస్ వినపడుతుంది.
ఆ వాయిస్ విని భయంగా వెనక్కి తిరిగి డాడీ అంటుంది. జస్ట్ షట్ అప్. ఎన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దు అని..
మీరు చేసింది ఏమైనా బాగుందా డాడీ అని కన్నీళ్లతో అడుగుతుంది. నాకు బాగుంది కాబట్టి చేశాను.
అవని నీ మీ కూతురుగా ఎనౌన్స్ చేశారు. అవని మదర్ మాత్రమే మీ వైఫ్ గా అందరికీ చెప్పారు. మరి నేనెవరిని.. మా మమ్మీ ఎవరు అని అడుగుతుంది.
ఆ మాటకి నవ్వుతూ అవని అంటున్నావు గాని అక్క అన్నమాట నీ నోటి నుంచి రావడం లేదు. ఏమన్నావు అవని మదర్ని మాత్రమే నా వైఫ్ గా చెప్పాను అనా,...
మరి మీ అమ్మ ఏం చేసేది. నువ్వేం చేసే దానివి.. ఆ మాటకి శిల్ప ఏమి మాట్లాడలేక మౌనంగా చూస్తుంది. ఏం మాట్లాడవేమిటి శిల్ప.
ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మ ఒక్కతే నా భార్య. నువ్వు ఒక్క దానివే నాకు కూతురు అని చెప్పేవారు కదా.. అప్పుడు నీకు అవని గుర్తుకు రాలేదా...
అవని కూడా నా కూతురే కదా.. మీరిద్దరూ కలిసి పెరిగి ఉంటే నాకు ఇద్దరు కూతుళ్లు అని గర్వంగా చెప్పుకునేవాడిని కానీ అవకాశం ఇవ్వకుండా మీ అమ్మే చేసింది.
అమ్మ తప్పు చేస్తే శిక్ష నాకా అని అడుగుతుంది. ఇంకా ఆపు.. అసలు నువ్వు ఏమీ తప్పు చేయనట్టుగా మాట్లాడుతున్నావు.
ఈరోజు నీ పరిస్థితికి ముమ్మాటికి నువ్వే కారణం. అవని ఎంతటి హీనస్థితిలో ఉన్న సరే తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. కానీ నువ్వేం చేసావు.
నువ్వు అనుకున్న గోల్ ని రీచ్ అవ్వడానికి కష్టపడడం మానేసి తప్పుడు దారి వెతుకున్నావు. అంతే కాకుండా అక్క భర్తని అని కోపంగా కళ్ళు మూసుకుంటారు.
ధనుంజయ్ కోపం చూసి శిల్ప భయంగా బిందు చేతిని పట్టుకుంటుంది. ఇంతకు మించి నీతో మాట్లాడడం నావల్ల కాదు.
బిందు వైపు చూసి రేపొద్దున్న ఇద్దరు రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ధనుంజయ్ లోపలికి వెళ్ళగానే శిల్పా హమ్మయ్య అనే గుండెల పైన చేయి వేసుకుంటుంది.
ఎక్కడికి అత్తయ్య రేపు వెళ్ళేది. రేపు తెలుస్తుంది కదా.. ఇప్పుడు నుంచే తెలుసుకుని ఏమి చేస్తావు.. చెప్పొచ్చు కదా..
నాకు ఏమీ తెలియదు రెడీ అయి ఉండమన్నారు. రెడీ అయి ఉండడమే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎలాగైనా క్రిష్ ని కలవాలి అనుకుంటే అవ్వలేదు.
రేపైనా ట్రై చేయాలి అని అప్పటివరకు తండ్రి తిట్టిన తిట్లు అన్ని గాలికి వదిలేసి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది.
అలసిపోయి ఉన్న దేహంతో మత్తుగా నిద్రపోతుంది. ఉదయమే బిందు కొట్టి... కొట్టి లేపుతుంది. ఎందుకు అత్తయ్య నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు.
ముందు లెగు. రెడీ అవ్వమన్నారు కదా. ఎక్కడికో చెప్పలేదు. ఏం డ్రెస్ వేసుకోవాలి. అవును నువ్వు ఒక ఎలిజిబెత్ క్వీన్ అని నీకు డ్రెస్సులు ఆర్డర్ మీద తెప్పిస్తున్నారు అంటుంది.
ఈ అత్తయ్య కి ప్రతిదీ వెటకారమే... వెళ్ళి స్నానం చేసి వస్తుంది. డ్రెస్ వేసుకుంటూ ఉంటే ముందే చీర కట్టుకో అంటుంది.
చీర దేనికి అత్తయ్య... నాకు తెలియదు అని చెప్పాను కదా.. నాకు కట్టుకోవడం రాదు. నా కర్మ.. తప్పుతుందా అని ఆ చీర బిందునే కడుతుంది.
శిల్ప ప్రయాణం ??
కథ కొనసాగుతుంది..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)