Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
 ఎపిసోడ్ 88


నితీష్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని మాట్లాడుతూ మిథున్ నా మాట విన్న తర్వాత నేనెవరో తెలిసి ఉంటుంది. నీ చావుకి నువ్వే తొందర పడ్డావు, నా మనుషులు రేపు నీ తల తీసుకువెళ్లి పోతారు నీ పాడికి నిప్పు పెట్టడానికి నీ తండ్రి చేతులు పనిచేయట్లేదు నీ అన్న దగ్గర లేడు మనిషిని అరేంజ్ చేసుకో అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేసాడు అభీర్.

****************

ఫోన్లో అభీర్ చెప్పింది విని టెన్షన్ గా ఉన్న మిథున్ వైపు చూసి "ఏంటి? వాడి బెదిరింపులకు భయపడిపోతున్నావా?" అని అడిగింది అర్ణ.

"నేను ఇలాంటి బెదిరింపులకి భయపడే రక్తం కాదు, కానీ అభిర్ మాటలు వింటుంటే నాకు తెలియకుండానే చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి ఎందుకో అర్థం కావడం లేదు." అని చెప్పాడు మిథున్.

అక్కడికి వచ్చి వెటకారంగా చూస్తూ "దానినే భయం అంటారు." అని చెప్పాడు రఘురామ్.

"అసలు తీహార్ జైల్లో  ప్లాన్ విషయం నాకు తప్పితే  ఎవరికీ తెలియదు కానీ వాడికి ఎలా తెలిసిపోయింది?" అని అడిగాడు మిథున్.

ఆ మాట విని కంగారు పడి దగ్గరికి వచ్చి "నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు మందు తాగుతూ పైకి చెప్పి ఉంటావు, ఏ పక్షో విని వాడికి చేరేసింది దీనికి ఆలోచించాల్సిన పనేముంది ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి." అని చెప్పాడు వరదరాజులు.

"అసలు విషయం అది కాదు! మిథున్ కి ఏదైనా జరిగితే నిర్మల్ రాకుండా ఉండడు, మరి తలకొరివి పెట్టడానికి వేరే వాళ్ళని చూసుకోమని చెప్పాడు అంటే అడవిలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా..! మనవాళ్ళు అక్కడికి వెళ్ళి విషయం అభీర్ కి తెలిసిపోయిందా?" అని కంగారుగా అడిగాడు ప్రమోద్ తండ్రి సుభాష్.

"అడవిలోకి మనవాళ్లు ఫుల్ సెక్యూర్ గా వెళ్లారు వాళ్ళను ఎవరు ఏమి చేయలేరు." అని ఫోన్ తీసి ప్రమోద్ కి కాల్ చేసి నాట్ రీచబుల్ రావడంతో "సిగ్నల్ లేదనుకుంటా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు." అని చెప్పింది అర్ణ.

ఆ మాట విని 'అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఫోన్ కలవడం లేదు ఆగస్త్య చెప్పింది నిజమే! ఆ కొండలని ముట్టుకోవడం ఎవరి వల్ల కాదు మనం వెంటనే అభీర్ తో డీల్ మాట్లాడుకోవడం బెటర్!' అని మనసులో అనుకున్నాడు రఘురామ్.

ఆలోచిస్తున్నా రఘురాం దగ్గరికి వెళ్లి "డాడ్ మీతో కలిసి లంచ్ చేద్దాము అనుకున్నారు మీరు రాలేదు కనీసం కాఫీ తాగడానికి అయినా వస్తారా? కాసేపు మాట్లాడుకుందాము ఇద్దరికీ ఉపయోగపడుతుంది." అని నెమ్మదిగా చెప్పాడు తంబియార్.

"సరే! వెళ్లి స్ట్రాంగ్ గా రెండు కాఫీ చేయించు మోహిత్ తో కలిసి వస్తాను." అని చెప్పాడు రఘురామ్.

ఫోన్స్ కలవక పోయేసరికి టెన్షన్ పడుతూ అర్ణ వైపు చూసి "వాసుకి కూడా అక్కడికి వెళ్ళింది కదా తనకి ఫోన్ చెయ్!" అని చెప్పాడు సుభాష్.

"సరే!' అని ఫోన్ తీసి వాసుకి కి కాల్ చేసింది అర్ణ.

కాసేపటికి ఫోన్ లిఫ్ట్ చేసి "హలో మేడం! ఇప్పుడే ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ ఫరూక్ సెక్యూరిటీ గట్టిగానే పెట్టాడు వీళ్ళను దాటి ఎవరు లోపలికి రాలేరు ఇలా ఉంటే మన పని ఈజీగా అయిపోతుంది." అని చెప్పింది వాసుకి.

"సరే! నిర్మల్ వాళ్లు ఎక్కడ ఉన్నారో ఏమైనా తెలిసిందా? ఫోన్స్ కలవడంలేదు." అని అడిగింది అర్ణ.

"మేడం! వాళ్లు ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాము సిగ్నల్ ఉండదు మేము వస్తే లోపలికి పంపించమని చెప్పారు అంట అందుకే వాళ్ళ ఫోన్స్ మీకు రీచ్ అయ్యి ఉండకపోవచ్చు!" అని చెప్పింది వాసుకి.

"సరే! మీరు త్వరగా పని ముగించండి." అని చెప్పి ఫోన్ పెట్టేసి సుభాష్ వైపు చూసి "బాబాయ్! వాళ్ళు ఫారెస్ట్ లోకి వెళుతున్నాము సిగ్నల్ ఉండదని ముందే చెప్పారంట మీరు కంగారు పడకండి." అని అర్ణ.

"మిథున్! నువ్వు రేపు ఒక్కరోజు కాస్త జాగ్రత్తగా ఉండు సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి వెళ్ళకు కొత్త వాళ్ళు ఎవరిని నీ దగ్గరికి కూడా రానివ్వకు." అని చెప్పాడు ముకుల్.

"రేపు ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందా తర్వాత అభీర్ మనుషులు మిథున్ జోలికి రాకుండా ఉంటారా..?" అని డౌట్ గా అడిగాడు సుభాష్.

"నాకు అభీర్ గురించి బాగా తెలుసు చెప్పిన మాటకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు, తన వాళ్ళని చావనివ్వను అని మాట ఇచ్చిన తర్వాత  సహదేవుడు చనిపోయాడు అని 12 ఏళ్లు శిక్ష అనుభవించాడు ఇప్పుడు చెప్పిన టైం లోపల మిథున్ ని ఏమి చేయలేకపోతే ఇంక జన్మలో తన జోలికి రాడు." అని చెప్పాడు ముకుల్.

"అవునా?" అని మిసైల్, నెల్సన్, సాధు వైపు చూసి "పక్షులు రాకుండా మిషన్ ఆన్ చేయండి ఇప్పటినుంచి రెండు రోజులు వరకు కొత్త వాళ్ళు ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు.

ఆఖరికి మన గెస్ట్ హౌస్ పైనుంచి ఒక పిట్ట కుడా వెళ్ళకూడదు ఫుల్ సెక్యూరిటీ అలర్ట్  చేయండి ఎవరి మీద అనుమానం వచ్చిన ఆర్డర్స్ కూడా అవసరం లేదు  చంపేయండి." అని చెప్పింది అర్ణ.

"ఓకే మేడం!" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లారు ముగ్గురు.

"నేను ఇప్పుడు ఆ అభీర్ గాడి మనుషులకు భయపడి దాక్కోవాలా?" అని కోపంగా అడిగాడు మిథున్.

"కాదు కాస్త జాగ్రత్తగా ఉంటున్నావు అంతే, రేపు ఒక్కరోజు కాస్త ఓపిక పట్టు లోపల ఉన్న బుల్లెట్ ప్రూఫ్ రూమ్ లో మందు తాగుతూ ఎంజాయ్ చెయ్!" అని చెప్పింది అర్ణ.

'రెండు మాటలకి పెద్ద తేడా ఏముందో!' అనుకుంటూ అక్కడినుంచి వరదరాజులుతో కాఫీ తాగడానికి మోహిత్ తో కలిసి బయలుదేరాడు రఘురామ్.

************

తీహార్ జైల్లో తన కేబిన్ లో ఉన్న అభీర్ వైపు చూసి "ఈ రోజు నువ్వు లేకపోతే పెద్ద ప్రాబ్లం అయ్యేది కరెక్ట్ టైం కి వచ్చావు." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు సందీప్ రావు.

"సార్! నాకు సహాయం చేసిన వాళ్ళని కాపాడుకోవడం నా బాధ్యత! అలాగే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళని శిక్షించడం కూడా నా బాధ్యతే!" అని చెప్పి నితీష్ వైపు చూసి

"ప్రాణాలతో ఉండాలి అంటే జాబ్ కి రిజైన్ చేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో నువ్వు మళ్ళీ నా కంటికి కనిపించకూడదు." అని చెప్పి నీలమ్ వాళ్ళతో కలిసి ఇంటికి బయలుదేరాడు అభీర్.

అక్కడినుంచి కార్ లొ ఇంటికి వెళుతూ "రేపు మిథున్ ని నిజంగానే చంపించేస్తావా?" అని అడిగింది నీలమ్.

"మిథున్ కి రేపు చావు రాసిపెట్టి ఉంది కాబట్టే నా నోటి నుంచి ఆ మాట వచ్చింది." అని చెప్పాడు అభీర్.

"మిథున్ ని చంపుతానని అతనితోనే డైరెక్ట్ గా చెప్పావు ఖచ్చితంగా జాగ్రత్త పడతాడు ఎక్కడ ఉన్నాడో కూడా మనం కనిపెట్టలేము." అని చెప్పింది మిత్ర.

"అతను ఎక్కడ దక్కున అతని చుట్టూ ఎంత మంది ఉన్నా  24 గంటలలో వాడి చావు కన్ఫామ్! తప్పించుకోవడానికి సైంధవుడు ఎంత ప్రయత్నించినా అర్జునుడు ప్రయోగించిన పాశుపతాస్త్రనికి బలి అవ్వక తప్పులేదు.

అలాగే నేను కూడా మిధున్ మీదికి నా దగ్గర ఉన్న పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను దానిని తప్పించుకుని ఎక్కడికి పారిపోలేదు." అని చెప్పాడు అభీర్.

కారు దిగిన నీలమ్ వాళ్లతో పాటు ఇంట్లోకి వస్తున్న అభీర్ వైపు చూసి "నువ్వు చెప్పినట్లే అపాయింట్మెంట్ తీసుకున్నాను రేపు బైరి నేను వెళ్లి కలుస్తాము తప్పకుండా మనకి సపోర్టుగా ఉంటారు." అని చెప్పింది వసుంధర.

ఆ మాట విని "మీరు ఎవరిని కలవడానికి వెళుతున్నారు?" అని అనుమానంగా అడిగింది నీలంమ్.

"కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. రెండు రోజుల్లో మీరు బేరా అడవికి బయలుదేరాలి రెడీగా ఉండండి." అని చెప్పాడు అభీర్.

"సరే!" అని మిత్ర వాళ్ళ వైపు చూసి "వదిన అభీర్ ని కలవడానికి వచ్చినపుడే చెప్పా కదా, ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడు అని  మనకి కూడా చెప్పడం లేదు చూడు." అని నెమ్మదిగా చెప్పింది నీలమ్.

"నీ మనసులో విషయం కూడా నువ్వు అభీర్ కి చెప్పడం లేదు కదా!" అని నవ్వుతూ అడిగింది మిత్ర.

ఆ మాటకి స్మైల్ ఇస్తూ "ఆ విషయం చెప్పడానికి మంచి టైమ్ రావాలి ఇంతకీ అభీర్ వదిలే పాశుపతాస్త్రం ఎవరో నీకు తెలుసా?" అని అడిగింది నీలమ్.

"అభీర్ సేనాలో పవర్ఫుల్ వెపన్స్ చాలా ఉన్నాయి మిథున్ మీదకి ఎవరిని ఎక్కు పెట్టాడో చూడడానికి నేను కూడా వెయిటింగ్!" అని చెప్పింది మిత్ర.

*************

వరదరాజుల వాళ్ళతో కలిసి కాఫీ తాగుతూ "సడన్ గా నా మీద ఎందుకు ప్రేమ పుట్టుకు వచ్చిందో విషయం ఏమిటో చెప్పండి?" అని అడిగాడు రఘూరామ్.

"నువ్వు కూడా మాలాగా గోడ మీద పిల్లి లాంటి వాడివి ఏటు అనుకూలంగా ఉంటే అటు దూకేస్తావు ఆ విషయం నాకు బాగా తెలుసు అందుకే ముకుల్ గారు నంద గ్రూప్ బాధ్యతలు నీ చేతిలో నుంచి తీసి అర్ణ చేతిలో పెట్టారు.

ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీకి ఎగైనెస్ట్ గా అభీర్ తో డిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు అనే విషయం మాకు తెలుసు! మేము ఆల్రెడీ అభీర్ తో డీల్ లొ ఉన్నాము ఇద్దరం చేతులు కలిపితే మన బలం పెరుగుతుంది అందుకే మాట్లాడడానికి పిలిపించాము." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

"మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నా ఫ్యామిలీకి ఎగైనెస్ట్ గా నేను ఎందుకు వెళ్తాను నన్ను టెస్ట్ చేయమని ఆర్ల మిమ్మల్ని పంపించిందనుకుంటా వెళ్లి ఇటువంటి పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దని చెప్పండి." అని కోపంగా చూస్తూ చెప్పాడు రఘురామ్.

ఆ మాటకి స్మైల్ ఇస్తూ "అగస్త్య కన్నా నాకు అభీర్ బాగా తెలుసు!" అని చెప్పాడు వరదరాజులు.

ఆ మాటకి షాక్ అయ్యి చూస్తూ "మిమ్మల్ని అర్ణ పంపలేదని అర్థమైంది. ఏం చేద్దామో చెప్పండి?" అని అడిగాడు రఘురామ్.

"అభీర్ తో డైరెక్ట్ గా నేను మాట్లాడతాను ఆ అగస్త్యని ఎడంకాలితో పక్కకి తన్ను మధ్యలో మూడో మనిషి ఉండకూడదు." అని చెప్పాడు వరదరాజులు.

ఆ మాటకి మోహిత్ వైపు చూసి ఆలోచిస్తూ ఉన్నాడు రఘురామ్.
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 21-02-2026, 04:52 PM



Users browsing this thread: 1 Guest(s)