21-02-2026, 04:51 PM
ఎపిసోడ్ 87
తీహార్ జైల్లో గొడవ చేస్తున్న టెర్రరిస్ట్ ఖైదీలకి బుద్ధి చెప్పి వార్నింగ్ ఇచ్చి సందీప్ రావు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు అభీర్.
అడవిలో లింగు మీద కోపంతో అరిచినా తన మనిషిని పెద్దపులి తీసుకువెళ్లిపోవడంతో భయంతో నోరు మూసుకుని వెనకాల వెళుతూ ఉన్నాడు ఫరూక్.
**************
లింగు వెనకాలే వెళుతూ చీలి, ధన వైపు చూసి "అడవి జంతువు వచ్చి మన మనిషిని తీసుకువెళ్ళిపోతే దానిని షూట్ చేయకుండా చూస్తూ నుంచున్నారేమిటిరా..?" అని నెమ్మదిగా అడిగాడు ఫరూక్.
"సార్! ఆ జంతువు అసలు మాకు కనపడితేనే కదా షూట్ చెయ్యడానికి అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. ఈసారి వస్తే వదిలే ప్రసక్తే లేదు." అని చెప్పాడు ధన.
నెమ్మదిగా నడుస్తు జేబులో నుంచి ఫోన్ తీసి చూస్తూ "ఇక్కడ సిగ్నల్ కూడా లేదు." అని కంగారుగా చెప్పాడు ప్రమోద్.
"టెన్షన్ పడకు బ్రదర్! నా దగ్గర శాటిలైట్ ఫోన్ ఉంది. దీంతో సముద్రపు అడుగు నుంచి కూడా మనం కాల్ చేయొచ్చు!" అని చూపిస్తూ స్మైల్ ఇచ్చాడు ఫరూక్.
ఆ మాట లింగు భుజం మీద నుంచి ఫారూఖ్ మీదకి దూకి చేతిలో ఉన్న సాటిలైట్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి చెట్ల మీదకి ఎగురుతూ వెళ్లిపోయాడు శివుడు.
ఫాస్ట్ గా వెళ్ళిపోతున్న కోతిని చూసి "అయ్యో! నీ కోతి నా ఫోన్ ఎత్తుకెళ్లిపోయింది దానిని వెనక్కి పిలువు!" అని చెప్పాడు ఫరూక్.
"ఏమో దొర అది ఎటు వెళ్లిందో నాకు కనపడదు కదా! అయ్యినా కోతి ముందు ఎవరైనా ఫోన్ బయటికి తీస్తారా..?" అని అడిగాడు లింగు.
"ఒరేయ్ గుడ్డు నీకు కనపడుతుంది కదా! ఆ కోతి ఎటు వెళ్ళిందో చూసి ఫోన్ తీసుకురా..!" అని కోపంగా చెప్పాడు నిర్మల్.
"దొర! మీరు ఎంత అరిచిన నా తమ్ముడికి వినపడదు కదా! అయినా మా శివుడు ఆ ఫోన్ ఏం చేసుకుంటాడు కాసేపట్లో తీసుకు వస్తాడు కంగారు పడకండి." అని చెప్పాడు లింగు.
అక్కడినుంచి దూరంగా కనిపిస్తున్న కొండల వైపు చూసి "అవేనా నవగ్రహాల కొండలు మనం దగ్గరికి వచ్చేసామా?" అని సంతోషంగా అడిగాడు ప్రమోద్
"దొర! అవి రాతి కొండలు అక్కడే మీ మనిషి స్పృహ లేకుండా దొరికాడు." అని చెప్పాడు ముత్యం.
"అలా అయితే! మా వాడిని ఎత్తుకెళ్లిన పక్షి ఇక్కడే ఉంటుంది కాదు, అది మనల్ని చూసి బయటికి రావచ్చు దగ్గరికి వస్తే కాల్చి పారేయండి." అని చెప్పాడు నిర్మల్.
"సరే సార్!" అని తన వాళ్ళ వైపు చూసి "ఒరేయ్ కిరా! గన్స్ లోడ్ చేసి రెడీగా ఉండండి ఆ పక్షి మన దగ్గరికి వచ్చిన వెంటనే చచ్చి కింద పడాలి." అని చెప్పాడు ధన.
"సరే బాయ్!" అని చెప్పి గన్స్ లోడ్ చేస్తూ "అందరు రెడీ గా ఉండండి ఇక్కడికి ఏ జంతువు వచ్చిన, పక్షి వచ్చిన మనకి ఆహారం అయిపోవాలి." అని చెప్పాడు కిరా.
అందరూ గన్స్ లోడ్ చేసి చూస్తూ ఉండగా భయంకరమైన శబ్దం వినిపించి "ఆ సౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది?" అని కంగారుగా అడిగాడు నిర్మల్.
"దొర! అది శిలారి పక్షి అరుపు అందరు కిందకు చుడండి లేకపోతే కళ్ళు పీకేస్తుంది." అని చెప్పాడు లింగు.
ఆ మాట విని "శిలారీ పక్ష? ఆ పేరు ఇప్పుడు వినలేదే!" అని తల కిందకి దించుకుని నడుస్తూ ఉన్నాడు ముత్యం.
అంతలో వేగంగా వచ్చి మీద పడి చేతిలో ఉన్న గన్స్ మొత్తం పట్టుకుని పైకి ఎగిరిపోయాయి సింబా సైన్యం.
ఆకాశంలో వెళుతున్న పక్షులని చూసి "సార్! గన్స్ మొత్తం అవి తీసుకువెళ్లిపోతున్నాయి." అని కంగారుగా చెప్పాడు చీలి.
"మీరు చాలా అదృష్టవంతులు దొర! ఎవరిని ఎత్తుకు వెళ్లకుండా గన్స్ మాత్రమే తీసుకువెళ్లాయి." అని నవ్వుతూ చెప్పాడు లింగు.
"ఒరేయ్! నువ్వు నవ్వుతుంటే నాకు చిరా చిరా లాడిపోతుంది." అని కోపంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.
"గట్టిగా అరవకు ఏ జంతువు అయ్యినా వచ్చిందంటే మన దగ్గర గన్ కూడా లేదు." అని భయంగా చూస్తూ చెప్పాడు ఫరూక్.
"ఫోన్ లేదు, చేతిలో గన్ లేదు, ఎక్కడ ఉన్నామో తెలీదు, ఎటు వెళుతున్నమో తెలీదు, ఈ కళ్ళు లేని వాడిని నమ్మి చాలా పెద్ద తప్పు చేసాము." అని చెప్పాడు ప్రమోద్.
"దొర! మా మీద మీకు అనుమానంగా ఉంటే నా తమ్ముడిని తీసుకుని నేను పోతాను మీ దారినా మీరు పొండి." అని కోపంగా చెప్పాడు లింగు.
"ఒరేయ్! నీకు దండం పెడతారా బాబు! మమ్మల్ని వదిలేసి వెళ్ళకు ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు, ఎటువైపు చూసిన ఒకేలాగా ఉంది." అని కంగారుగా చూస్తూ చెప్పాడు ఫరూక్.
"సరే దొర! ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్లాలి?" అని అడిగాడు లింగు.
ఆ మాటకి షాక్ అయి చూస్తూ "ఏంటి? ఎక్కడికి తీసుకు వెళ్లాలి అని అడుగుతున్నావు? నీకు నవగ్రహాల కొండలు తెలుసు అని చెప్పావు కదా!" అని అడిగాడు ప్రమోద్.
"నాకు తెలుసు అని చెప్పాను దొర కానీ మీరు అక్కడికి తీసుకు వెళ్ళమని చెప్పలేదు కదా!" అని చెప్పాడు లింగు.
"ఒరేయ్ గుడ్డి నా కొడకా! నేను నీతో చెప్పలేదు." అని కోపంగా అడిగాడు చీలి.
"ఏమో దొర మా గుడ్డు గాడికి వినపడదు." అని చెప్పాడు లింగు.
"ఒరేయ్! నీకు కనపడదు మాకు తెలుసు, ఇప్పుడైనా ఆ కొండల దగ్గరికి తీసుకు వెళ్ళరా బాబు, నడవలేక చచ్చిపోతున్నాము." అని చెప్పాడు నిర్మల్.
"సరే దొర! అని గుడ్డుని పట్టుకుని కింద కూర్చున్నాడు లింగు.
అది చూసి "ఏంట్రా! సరే అని ఇక్కడ కూర్చున్నావు?" అని ఇరిటేషన్ గా చూస్తూ అడిగాడు ధన.
"దొర! ఇక్కడి నుంచి చాలా దూరం పోవాలి ఆకలిగా ఉంది బువ్వ తిని పోదాము." అని తన దగ్గర ఉన్న ముఠా విప్పి గుడ్డుతో కలిసి తింటూ ఉన్నడు లింగు.
ఇద్దరు తినడం చూసి "నాకు కూడా ఆకలిగా ఉంది మన దగ్గర ఉన్న ఫుడ్ బయటికి తీయండి." అని చెప్పాడు నిర్మల్.
"సరే!" అని లగేజ్ కిందకి దింపి ఫుడ్ బయటికి తీసి తినడానికి రెడీ అవ్వడంతో సడన్గా కోతులు గుంపు చుట్టుముట్టి మీద పడి ఫుడ్ మొత్తం తీసుకుని వేగంగా చెట్లు ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోయాయి.
ఆ కోతులు వెంటపడుతున్న తన మనుషుల్ని చూసి ప్రశాంతంగా కూర్చుని తింటున్న లింగుని చూస్తూ "ఒరేయ్! ఆ కోతులు మా ఫుడ్ మొత్తం తీసుకు వెళ్లిపోయాయి కనీసం నువ్వు తింటున్న అన్నం లొ చెయ్యి కూడా పెట్టలేదు ఏమిటి?" అని అడిగాడు ప్రమోద్.
"ఏమో దొర నాకు కనబడదు." అని ఆత్రంగా తింటూ ఉన్నాడు లింగు.
ఆ మాట విని దగ్గరికి వెళ్లి "ఇప్పుడు నీ అవసరం లేకపోతే ఇక్కడే చంపేసేవాడిని." అని ఆవేశంగా చూస్తూ "నీ దగ్గర ఇంకో అన్నం మూట ఉందా? చాలా ఆకలిగా ఉంది." అని అడిగాడు ఫరూక్.
"ఊరుకోండి దొర మీరు మా కుడు ఏమి తింటారు?" అని నవ్వుతూ తింటూ ఉన్నాడు లింగు.
"ఏయ్ ఫరూక్! సిగ్గు లేదు వాడి దగ్గర సద్ధి అన్నం అడుకుంటున్నావు?" అని చికాకుగా చూస్తూ అన్నాడు నిర్మల్.
"ఆకలి వేసినప్పుడు సిగ్గు ఏంది బాయ్!" అంటూ ముత్యం వైపు చూసి "ఆ కోతులు మన ఫుడ్ ఎక్కడైనా పెట్టేఏమో చూడండి నీరసం కూడా వస్తుంది." అని చెప్పాడు ఫరూక్.
"ఏంటి సార్! మీరు మరీను కోతులు ఎత్తుకు వెళ్లిన ఫుడ్ ఇంకా దొరుకుతుందా..! కొంచెం ముందుకు వెళితే పళ్ళ చెట్లు ఏమైనా ఉంటాయేమో చూద్దాము." అని చెప్పాడు అరుల్.
"దొర! ఇక బయలుదేరుదామా? చీకటి పడితే జంతువులు బయటికి వస్తాయి." అని చేతిని తన చొక్కాకి తుడుచుకుంటూ అడిగాడు లింగు.
ఆ మాటకి ఆక్రోసంగా చూస్తూ "నువ్వు తినడం అయింది కదా పద వెళదాము." అని చేతితో పొట్టని గట్టిగా పట్టుకుని చెప్పాడు ఫరూక్.
***************
నంద గెస్ట్ హౌస్ లో మిథున్ దగ్గరికి వచ్చి "న్యూస్ చూస్తూ కళ్ళు కాయలు కాస్తున్నాయి కానీ మనకు ఉపయోగపడేది ఏమి చెప్పడం లేదు." అని వేటకారంగా చూస్తూ అన్నాడు రఘురామ్.
టెంక్షన్ గా ఉన్న మిథున్ దగ్గరికి వెళ్లి "ఇంతకీ నీ ప్లాన్ ఏమిటి?" అని అడిగింది అర్ణ.
"ఒక్క నిమిషం!" అని నితీష్ కి కాల్ చేశాడు మిథున్.
జైల్ లోపల తన ఫోన్ రింగ్ అవ్వడం చూసి కంగారుగా సందీప్ రావు రూమ్ లోకి వెళ్లి "సారీ సార్! నేను చేసిన దానికి ఈ ఒక్కసారి క్షమించండి. మిథున్ కాల్ చేస్తున్నాడు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు నితీష్.
"లిఫ్ట్ చేసి మాట్లాడి ఆ ఫోన్ నాకు ఇవ్వు వాడితో నేను ఒకసారి మాట్లాడాలి." అని చెప్పాడు అభీర్.
"సరే!" అని ఫోన్ లిఫ్ట్ చేసి "సార్ చెప్పండి?" అని అడిగాడు నితీష్.
"ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత సేపు పట్టిందా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? న్యూస్ లో ఒక్క మాట కూడా చెప్పడం లేదు." అని అడిగాడు మిథున్.
"సార్! ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది మీతో ఒక వ్యక్తి మాట్లాడతారంట!" అని అభీర్ కి ఫోన్ ఇచ్చాడు నితీష్.
ఆ మాట విని "నాతో ఎవరు మాట్లాడేది?" అని కంగారుగా అడిగాడు మిథున్.
నితీష్ దగ్గర ఫోన్ తీసుకుని "మిథున్ టెన్షన్ పడుతున్నావా? నా గొంతు విని నేను ఎవరో ఈపాటికి నీకు అర్థం అయ్యిఉంటుంది." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని "అభీర్.. నువ్వు అక్కడ?" అని టెన్షన్ గా చూస్తున్న మిథున్ చేతిలో ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేసింది అర్ణ.
"బానే గుర్తుపట్టావు నీ చావుకి ఇంకాస్త టైం ఉంది అనుకున్నాను, కానీ నువ్వు తొందర పడ్డావు రేపు నా మనుషులు నీ తల తీసుకువెళ్లిపోతారు.
నీ పాడికి నిప్పు అంటించడానికి మీ నాన్న చేతులు పని చేయడం లేదు మీ అన్న దగ్గర లేడు ఎవరినైనా సిద్ధం చేసుకో లేకపోతే రాబందులు పిక్కు తింటాయి." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు అభీర్.
ఫోన్లో అభీర్ చెప్పినా మాటలు విని చెమటలు తుడుచుకుంటూ టెన్షన్ గా చూస్తూ ఉండిపోయాడు మిథున్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)