Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller శక్తి ఆగమనం - 10
#40
శక్తి ఆగమనం..8


[Image: S8.jpg]

*"" సిద్దు హాస్పటిల్ లో తెలివి లేకుండా ఉండటం
అతడి నెక్ పై ఎవరో బలం గా నొక్కినట్టుగా గుర్తులు ఉండటం తో శివరాం అదుపు తప్పాడు
ఎవరో నా కొడుకుని చంపాలి
అని చూసాడు
నన్ను నా కుటుంబాన్ని
నాశనం చేయాలి అనే ఆలోచన ఒక్క భూషణ్ కి మాత్రమే
ఉంది వాడే ఇదంతా చేశాడు
అని అవేశం గా సెక్యూరిటీ అధికారి
కంప్లైంట్ వరకు వెళ్ళాడు
విషయం తెలుసుకున్న
హరిబాబు అడ్డుకుంటూ
ముందు అబ్బాయి కి నయం అవ్వని ఏం జరిగింది
తెలుసుకుని యాక్షన్
తీసుకుందాం అంత వరకు
నువ్వు కోపం కంట్రోల్
చేసుకో నాకు ఇప్పుడే ఒక
విషయం తెలిసింది
రాబోయే ఎలక్షన్స్ కి భూషణ్ సిద్ధం అవుతున్నాడు
నాకు పోటీ గా అంటే నన్ను
ఓడించి
నిన్ను సాధించాలి అన్నది
వాడి ప్లాన్.... వాడు గెలిస్తే నా మినిస్ట్రీ వాడికి ఇస్తారు
ఆ విషయం తెలుసుకుని
తట్టుకోలేక ఈ అబద్ధపు
కంప్లైంట్ ఇచ్చావు అని వాడు ప్రచారం చేస్తాడు
అదే జరిగితే రాబోయే
ఎలక్షన్ లో వాడిదే పై చేయి అవుతుంది
చేతులారా వాడికి అవకాశం
ఇచ్చిన వాళ్ళం అవుతాం
అని ఎన్నో విధాల నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు
హరి బాబూ మాటలకు ఎటూ తేల్చుకోలేక
శివరాం కొడుకు కోలుకోలేదు
అని భాధ భయంతో కుప్పకూలిపోయాడు
అతడి భార్య దాక్షాయణి మరింత భాధ పడుతూ కూర్చుంది.
హాస్పటిల్ పరిసర ప్రాంతం
అంతా శివరాం మనుషులు
ఉన్నారు అంతే కాదు
హరిబాబు సెక్యూరిటీ
సిబ్బంది చాలానే ఉన్నారు...!!
*"డాక్టర్స్ చెక్ చేసి ఇంజక్షన్ ఇస్తు సిలైన్ ఎక్కిస్తూ ఆక్సిజన్
వెంటిలేటర్ పరికరాలతో అతడ్ని ఫుల్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు....!!
ఇంకో వైపు ఇందు చాలా భాధ పడుతుంది
సిద్దు అల్లరి పిల్లాడు
అనుకున్నది వెంటనే జరగాలి అనుకునే మొండి తనం గలవాడు అందుకే తాను నో చెప్పే సరికి ప్రాణాలు తీసుకోవాలి అని చూసాడు అది తప్పు
ఇంత తక్కువ సమయంలో ప్రాణాలు సైతం తన కోసం వదిలేయాలి అని
అనుకున్నాడు ఎందుకు
ప్రేమలో అంత మహత్యం
ఉందా అని ఆలోచిస్తూ
కూర్చుంటే
ఆమె పక్కనే
శ్రావణి కూర్చుని శ్రీరామ్
చెప్పిన మాటలు చెబుతూ
ఉంది.
ఇందు కి వెంటనే అతడ్ని చూడాలి అని ఉంది
కానీ ఎలా ఇంకాసేపట్లో
యాది తనని తీసుకు వెళ్లేందుకు వస్తాడు
తనతో నేను ఇంటికి వెళ్ళక
పోతే ప్రాబ్లం అవుతుంది
ఇక్కడి విషయాలు అన్ని
ఇంట్లో వారికి తెలుస్తాయి
ముఖ్యం గా నాన్నగారికి తెలిస్తే
పెద్ద సమస్య వస్తుంది
ఎలా అని ఆలోచిస్తూ ఉంది.
*"శ్రావణి ఆలోచించి ఒక ఐడియా చెప్పింది
స్పెషల్ క్లాస్ ఉంది నేను
ఆలస్యం గా వస్తాను అని ఇంట్లో చెప్పు డ్రైవర్ నీ పంపొద్దు
నేను నా ఫ్రెండ్ వెహికల్ లో
వస్తాను అని చెప్పి
మేనేజ్ చెయ్యి అని సలహా ఇచ్చింది. 
ఇందు కి వెంటనే సిద్దు నీ
చూడాలి అనిపించడం తో కాస్త ధైర్యం తెచ్చుకుని
తండ్రి కి ఫోన్ చేసి విషయం
చెప్పింది శ్రావణి అని నా ఫ్రెండ్ ఉంది ఆమెతో కలిసి ఇంటికి
వస్తాను నాన్న గారు
ఎలాంటి ఇబ్బంది ఉండదు
అంటూ ఉంటే
శ్రావణి ఫోన్ అందుకుని
అంకుల్ నేను శ్రావణి ఇందు
ఫ్రెండ్ నీ స్పెషల్ క్లాస్ ఉంది
తను కంగారు పడుతుంది
నేను చెప్పాను టెన్షన్ లేదు
నేను డ్రాప్ చేస్తాను అని
మరీ చదువుకునే అమ్మాయిలు ఇంత అమాయకం గా ఉంటే ఎలా ఆడపిల్లలు అయినా ధైర్యం గా ఉండాలి అని చెబుతున్న
అంటూ నోటికి వచ్చిన మాటలు చెప్పింది
భూషణ్ ఆలోచిస్తూ ఈ అమ్మాయి ఎవరో కాస్త గడుసు పిల్ల లా
ఉంది మా ఇందు కి స్నేహితురాలు అయితే పాప లో మార్పు వస్తుంది అని సంతోష పడి అలా చెప్పు అమ్మ అమ్మాయికి పిరికిగా
ఉండకూడదు అని సరే
నువ్వు జాగర్తగా అమ్మాయిని
ఇంటి వద్ద వదిలి పెట్టు అని నవ్వుతూ చెప్పి ఇందు జాగర్త అంటూ ఫోన్ పెట్టేసాడు
భూషణ్
ఆ వెంటనే యాది కి ఫోన్ చేసి అమ్మాయి కి కాలేజ్ లో ఎదో స్పెషల్ క్లాస్ అంట ఆ సంగతి చూడు అంటూ ఆర్డర్ ఇచ్చి
తన పనిలో తాను ఉన్నాడు.
*"" ఇందు శ్రావణి బైక్ మీద సిద్దు ఉన్న హాస్పటిల్ వైపు వెళ్ళడం మొదలు పెట్టింది.
అప్పుడే అక్కడికి వచ్చిన
యాది వాళ్ళు బైక్ మీద వెళ్ళడం చూసి ఫాలో చేయడం
మొదలు పెట్టాడు.
*"" హాస్పటిల్ వద్ద చాలా
జనం ఉన్నారు
శివరాం ఎవర్ని లోపలికి
రానివ్వడం లేదు శ్రీరామ్
సిద్దు ఫ్రెండ్ అని చెబుతున్న
బైటకు పంపించేసాడు
తన కొడుకు మేలుకుని
జరిగింది చెప్పే వరకు ఎవర్ని నమ్మను అంటూ ఆవేశ
పడుతుంటే ఆయన భాధ అర్థం చేసుకుని శ్రీరామ్ వెలుపలికి వెళ్ళిపోతూ
ఉండగా అటుగా వస్తున్న
శ్రావణి ఇందు కనిపించారు
వాళ్ళని చూసి గబగబా దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు
అంకుల్ ఎవర్ని లోపలికి
రానివ్వడం లేదు అక్కడ ఉన్న నన్ను ఇంకా కొందరు ఫ్రెండ్స్ నీ బైటకు పంపించేశారు
ఈ టైం లో సిద్దు నీ చూడటం జరగదు వెళదాం రండి అంటూ పిలిచాడు
వాళ్ళు మాట్లాడుకుంటూ
ఉండగా యాది అక్కడికి
వచ్చాడు.
ఇందు కన్నీళ్లు పెట్టుకుంటు అన్నయ్య నేను సిద్దు నీ చూడాలి తను ఎలా ఉన్నడో అని
కంగారుగా ఉంది అని ఏడుస్తూ అడుగుతుంటే
శ్రావణి శ్రీరామ్ ఆమెను
కంట్రోల్ చేస్తూ ఏమీ కాదు
నువ్వు టెన్షన్ అవ్వకు ఇలా రా కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చుందాం కాసేపట్లో సిద్దు కి మెళుకువ వస్తుంది లే అని ధైర్యం చెప్పి ఒక పెద్ద చెట్టు వద్ద కూర్చో పెట్టారు
ఇందు మృత్యుంజయ 
మంత్రం చదువుతూ సిద్దు కి ఏమీ కాకూడదు అని వేడుకుంటూ
ఉంది
శ్రావణి శ్రీరామ్ ఆమెను కదిల్చె ప్రయత్నం చేయకుండా
దిగులుగా కూర్చుని
ఉన్నారు....!
*""యాది ఏమ్ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం
చేస్తున్నాడు అక్కడ ఉన్న
కొందరు అనుచరులను
చూసి షాక్ అయ్యాడు
వాళ్లంతా శివరాం మనుషులు.... అంతే కాదు మినిష్టర్ హరిబాబు అతడి సెక్యూరిటీ అంతా కనిపించారు
యాది కంగారుగా వెనక్కి
తగ్గాడు అక్కడి వాళ్ళు
తనని చూస్తే లేనిపోని సందేహాలు వస్తాయి అని పక్కకి తప్పుకుని
ఆ హాస్పటిల్ బాయ్ కనిపిస్తే అతడ్ని అడిగాడు
ఇంత జనం ఈ గందరగోళం
ఎంటి సంగతి అని.
ఆ వ్యక్తి విషయం చెప్పాడు
ఎవరో బిజినెస్ మేన్ శివరాం
అంట అతడి కొడుకుని ఎవరో కాలేజ్ లో హత్యచేయ బోయారు అని అంటున్నారు ప్రస్తుతం ఆ బాబు హాస్పటిల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు
డాక్టర్స్ బ్రతకడం కష్టం
అంటున్నారు అందుకే ఈ జనం గందరగోళం అని విషయం చెప్పి వెళ్ళాడు
అంతా విన్న యాది గుండె ఆగిపొయింది
ఎంటి ఆ అబ్బాయిని చంపాబోయారా
బ్రతకడం కష్టం అంటున్నారా అలాంటి పరిస్థితిలో ఉన్న శివరాం కొడుకుని చూడటానికి మా
ఇందు అమ్మ వచ్చి ఇక్కడ ఏడుస్తూ కూర్చుంద
ఈ విషయం అన్న కి తెలిస్తే
పెద్ద ఎత్తున తుఫాన్ రేగుతుంది
ఆ శివరాం అమ్మాయిని
చూసినా గొడవ అవుతుంది
అని కంగారుగా ఇందు నీ
తీసుకు పోవాలి అనుకుని
ముందుకి అడుగు
వేయబోతే భూషణ్ నుంచి
ఫోన్ వచ్చింది
యాది కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి అన్నా అన్నాడు
అవతలి వ్యక్తి అడిగాడు
ఎంటి విషయం అని
యాది తడబడుతూ కాలేజ్ లో క్లాసు అవుతుంది అన్న
నేను బైట ఉన్న ఇందు అమ్మ లోపల ఉంది అని అబద్ధం
చెప్పాడు
భూషణ్ చిన్న నవ్వు నవ్వి సరే నువ్వు అమ్మాయికి కనిపించక
అలా అని వెనక్కి వచ్చేయమాకు ఇందు ఇంటికి వచ్చే వరకు
కాపలా గా ఫాలో చెయ్యి
ఏమో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు
జాగర్తగా ఉండాలి అంటూ
ఫోన్ పెట్టాడు
యాది నిట్టూరుస్తూ ఆల్ రెడీ ప్రమాదం వచ్చింది ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో అని ఇందు వైపు కదిలాడు....!
*" అతడు ఇంకో నాలుగు అడుగులు వేస్తే ఇందు నీ చేరుకుంటాడు కానీ అడుగు ముందుకి పడలేదు పాదం నేల మీద పడకుండా ఎదో శక్తి ఆపింది
చుట్టు ఉన్న జనం వెహికల్స్ వీచే గాలి అన్ని కూడా ఎక్కడికి అక్కడ స్తంభించి పోయాయి....
మొత్తం నిశ్శబ్ధం ఆవహించింది.
మంత్రం చదువుతూ ఉన్న ఇందు ఆమె చుట్టూ ఉన్న వారు ఫ్రీజ్ అయిపోవడం కాలం స్తంభించి నట్టు కదలిక లేనట్టు ఉండిపోవడం గుర్తించి ఆశ్చర్య పోయింది
ఆమెకు ఏం జరుగుతుంది
అర్థం కాలేదు కంగారుగా తల పైకి ఎత్తి చూసింది
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
శక్తి ఆగమనం - 10 - by k3vv3 - 19-11-2025, 06:08 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by anaamika - 20-11-2025, 12:16 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by Uday - 10-12-2025, 02:21 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 01-01-2026, 09:35 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 09:39 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 10:00 PM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:28 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:29 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 08-01-2026, 09:31 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:46 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:48 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:50 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:53 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 15-01-2026, 05:27 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:15 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:18 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:19 PM
RE: శక్తి ఆగమనం - 6 - by Uday - 06-02-2026, 04:01 PM
RE: శక్తి ఆగమనం - 7 - by k3vv3 - 19-02-2026, 10:18 PM



Users browsing this thread: 1 Guest(s)