Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 86


చిలి ఫోన్ చేయడంతో అక్కడి నుంచి కారులో నిర్మల్ వాళ్లతో బయలుదేరి తన మనిషి కమల్ కి ఫోన్ చేసి అడవిలోకి రావడానికి వెళ్లడానికి నా పర్మిషన్ కావాలి అని చెప్పాడు ఫరూక్.

తీహార్ జైల్లో సైరన్ మోగడంతో లోపల ఏదో గొడవ జరుగుతుంది సందీప్ గారు అక్కడే ఉన్నారు అని శంకర్ చెప్పడంతో నితీష్ దగ్గర గన్ తీసుకుని డోర్స్ క్లోజ్ చేయమని లోపలికి వెళ్ళాడు అభీర్.

******************

జైల్ లోపలికి వెళుతున్న అభీర్ ని చూసి కెమెరా ఆన్ చేసి "చాక్లెట్! ఏ సీన్ మిస్ అవ్వకూడదు జాగ్రత్తగా షూట్ చెయ్!" అని చెప్పింది నీలమ్.

"సరే అక్క! ఏ సీన్ మిస్ అవ్వదు అభీర్ అన్న ఎలివేషన్ అదిరిపోతుంది చూస్తూ ఉండు." అని చెప్పాడు చాక్లెట్.

"ఒరేయ్ చాక్లెట్! నువ్వు కొంచెం పిలుపు మార్చాలి వినడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. అభీర్ ని అన్న అని పిలుస్తున్నావు కాబట్టి నన్ను వదినా అని పిలువు కరెక్ట్ గా సరిపోతుంది." అని స్మైల్ ఇస్తూ చెప్పింది నీలమ్.

"కొన్ని రోజులుగా నీ దగ్గర లవ్ స్మెల్ వస్తుందేమిటబ్బా  అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది." అని కెమెరాతో షూట్ చేస్తూ ఉన్నాడు చాక్లెట్.

నీలమ్ వైపు చూసి "జాగ్రత్త! అక్కడ ఫైటింగ్ తప్పితే ఎమోషన్స్ ఉండవు." అని చెప్పి పక్కన టెన్షన్ గా ఉన్న నితీష్ వైపు చూసి "ఇలాంటి వాళ్ళకి డబ్బుఎవ తప్పితే మానవత్వం ఉండదు వీళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి." అని చెప్పింది మిత్ర.

బయటికి వెళ్లే డోర్స్ మొత్తం లాక్ చేసి తాళాలు జేబులో వేసుకుని నితీష్ వైపు చూసి "మీరు తప్పు చేశారు సార్! కానీ దానిని మా నాయకుడు ఇప్పుడు సరి చేస్తాడు." అని చెప్పి లోపలికి వెళ్ళాడు శంకర్.

ఖైదీలు సెల్లో నుంచి బయటికి వచ్చి గాడ్స్ కొడుతూ ఉండడం చూసి టెన్షన్ గా ఉన్న సందీప్ రావు దగ్గరికి వెళ్లి "ఏమైంది సార్! అసలు ఇక్కడ ఏం జరుగుతుంది?" అని అడిగాడు అభీర్.

ఆ మాట విని పక్కకు చూసి "అభీర్ నువ్వు ఇక్కడ?" అని ఆశ్చర్యంగా చూస్తూ "ఈరోజు వచ్చిన టెర్రరిస్ట్ ఖైదీలు సెల్లోనుంచి బయటికి వచ్చి రిస్ట్ క్టెడ్ ఏరియాలో ఉన్న ఖైదీల సెల్ డోర్స్ ఓపెన్ చేశారు.

వాళ్ళు విఐపి జోన్ వైపు వెళ్లడానికి ట్రై చేస్తున్నారు  అక్కడ చాలామంది రాజకీయ నాయకులు బిజినెస్మేన్  ఉన్నారు వాళ్ళని బందీలుగా చేసుకొని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేసినట్లు ఉన్నారు.

ఇది చూసి మిగతా ఖైదీలు కూడా బయటకు వచ్చి గాడ్స్ ని కొట్టి తప్పించుకోడానికి ట్రై చేస్తున్నారు." అని చెప్పాడు సందీప్ రావు.

ఆ మాట విని కాసేపు ఆలోచించి "టెర్రరిస్ట్ ఖైదీల ప్లాన్ ఇక్కడి నుంచి తప్పించుకోవడం మాత్రమే కాదు ఈ గొడవలో మిమ్మల్ని చంపాలని కూడా చూస్తున్నారు." అని శంకర్ వైపు చూసి

"సార్ ని రూమ్ లోకి తీసుకువెళ్లు నిన్ను దాటి అక్కడికి ఎవరు రాకూడదు." అని చెప్పాడు అభీర్.

"సరే!" అని సందీప్ వైపు చూసి "మీరు రండి సార్! ఇక్కడి నుంచి ఒక్కడు కూడా తప్పించుకోలేడు కాసేపట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది అంత అభీర్ చూసుకుంటాడు." అని చెప్పాడు శంకర్.

ఆ మాట విని అభీర్ వైపు చూసి "ఎట్టి పరిస్థితుల్లో ప్రాణానష్టం జరగకూడదు ఒక్క ఖైదీ కూడా తప్పించుకోకూడదు." అని చెప్పాడు సందీప్.

"సరే సార్!" అని తన చేతిలో ఉన్న గన్ తో గాల్లో షూట్ చేసి శంకర్ చేతిలో పెట్టాడు అభీర్.

గన్ సౌండ్ వచ్చిన వైపు చూసి "అభీర్ వచ్చాడు." అని గట్టిగా అరిచాడు ఒక ఖైదీ.

తన మీదకి వస్తున్న ఒక ఖైదీని రెండు చేతులతో ఎత్తి దూరంగా గిరాటు వేసి కోపంగా చూస్తూ "గాడ్స్ ఒంటి మీద చేయి పడిందో నా సంగతి తెలుసు కదా! ఇక్కడి నుంచి రిలీజ్ అయ్యి బయటికి వెళ్లిన సరే ఏ పని చేసుకోలేరు జీవితాంతం మంచం మీద బతకాల్సి ఉంటుంది." అని వార్నింగ్ ఇచ్చాడు అభీర్.

ఆ మాట విని సైలెంట్ అయిన ఖైదీలను చూసి లోపలి నుంచి అక్కడికి వచ్చి "ఆ రోజు మమ్మల్ని కొట్టింది వీడే ఈరోజు వీడిని చంపి ఇక్కడి నుంచి బయటికి వెళ్లి పోదాము." అని తనతో ఉన్న వాళ్లకి చెప్పాడు టెర్రరిస్ట్ ఖైదీ.

"మనం పారిపోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు జైలర్ ని చంపి వెళ్లిపోమన్నారు వీడు అడ్డం వస్తే మనం మాత్రం ఏం చేస్తాం చంపేద్దాము." అని చెప్పాడు అక్కడ ఉన్న మరొక టెర్రరిస్ట్ ఖైదీ.

"మీరు ఇక్కడి నుంచి తప్పించుకుని ఇర్ఫాన్ ని కలవడానికే కదా వెళ్ళేది మీకు అంత శ్రమ అవసరంలేదు ఆల్రెడీ వాడిని పట్టుకున్నారు రేపు ఉదయానికి ఇక్కడ ఉంటాడు ఎంతసేపు కావాలి అంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు లోపలికి వెళ్ళండి." అని చెప్పాడు అభీర్.

ఆ మాటకి కోపంగా మీదకు వచ్చిన ఒక టెర్రరిస్ట్ ఖైదీని పట్టుకుని లేపి తన మోకాలికితో గుద్ది వెన్నుపూస విరగొట్టి కింద పడేసి "వీడిలా కాకుండా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ బారికేడ్స్ లోపలికి వెళ్ళండి." అని అక్కడ ఉన్న మిగతా ఖైదీల వైపు చూసి కోపంతో గట్టిగా అరిచాడు అభీర్.

అది చూసి టెర్రరిస్ట్ ఖైదీలు తప్పితే మిగతా వాళ్ళందరూ లోపలికి పరిగెత్తడంతో డోర్స్ క్లోజ్ చేసి లాక్ చేస్తూ ఉన్నారు గాడ్స్.

అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఖైదీల వైపు చూసి "ఈ రోజు నుంచి మీరు గన్ పట్టుకోడానికి చేతులు పనిచేయవు, జిహాద్ అని అరవడానికి గొంతు రాదు." అని తన మీదకి వస్తున్న ఇద్దరు చేతులు విరగొట్టి గొంతులొ బలంగా తన అర చేతితో కొట్టెడు అభీర్.

కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న తన వాళ్ళని చూసి "ఆ జైలర్ ని ఎలాగైనా మన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకోండి లేకపోతే వీడిని ఆపడం కష్టం!" అని గట్టిగా అరిచాడు ఒక టెర్రరిస్ట్ ఖైదీ.

ఆ మాట విని సందీప్ రావు ఉన్న రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న టెర్రరిస్ట్ ఖైదీ పిక పట్టుకుని పైకి లేపి గట్టిగా నొక్కి "మా నాయకుడు చెప్పిన మాట జరిగి తీరుతుంది. ఈరోజు నుంచి నీ గొంతు పని చేయదు, గన్ పట్టుకోవడానికి చెయ్యి పైకి లెగదు." అని కసిగా చూస్తూ చేతిని వెనక్కి విరిచాడు శంకర్.

దూరంగా ఉండి కెమెరా లో షూట్ చేస్తూ "వదిన! నువ్వు ఎడిటింగ్ కూడా చేయనవసరం లేదు చేతులు విరిగిన సౌండ్ కూడా రికార్డు అవుతుంది." అని చెప్పాడు చాక్లెట్.

అంతలో అక్కడ ఉన్న గాడ్స్ వచ్చి టెర్రరిస్ట్ ఖైదీ లని చుట్టూ ముట్టడంతో వాళ్ల దగ్గరికి వెళ్లి "మీతో ఈ పని చేయమని చెప్పింది ఎవరు? నిజం చెబితే తినడానికి చెయ్యి, మాట్లాడడానికి గొంతు ఉంటుంది." అని ఎర్రటి కళ్ళతో  కోపంగా చూస్తూ చెప్పాడు అభీర్.

"బాయ్! మా లీడర్ ఇర్ఫాన్ నుంచి ఆర్డర్ వచ్చింది తప్పించుకోడానికి సెల్ ఓపెన్ చేసి ఉంటుంది బయటకు వచ్చి మిగతా ఖైదీలను విడిపించి జైలర్ ని చంపి నలుగురు వీఐపీ ఖైదీలను హోస్టేజ్ గా తీసుకుని ఇక్కడి నుంచి తప్పించుకోండి.

పంజాబ్ బోర్డర్ దగ్గర వ్యాన్ రెడీగా ఉంటుంది అక్కడి నుంచి బోర్డర్ దాటిస్తామని చెప్పాడు, అతనికి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో మాకు తెలియదు." అని చెప్పాడు అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఖైదీ.

"మీ ఇర్ఫాన్ ఈరోజు చనిపోతున్నాడు మీరు బతికి ఉండాలంటే జైల్లోనే ఉండండి బయటికి వస్తే చంపేస్తాను, నేను చెప్పాను అంటే జరిగి తీరుతుంది." అని గాడ్స్ వైపు చూసి

"రేపు ఇర్ఫాన్ చచ్చిన వీడియో వీళ్ళకి చూపించండి తర్వాత వీళ్ళు ఉన్న సెల్ కి తాళం వేయకపోయినా పర్వాలేదు ఇక్కడే ఉంటారు." అని చెప్పి అక్కడ నుంచి సందీప్ రావు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు అభీర్.

**************

అదే సమయంలో బేర అడవిలో చీలి వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న లింగు వాళ్ళ వైపు చూసి "ఎవర్రా వీళ్ళు? కోతులు ఆడించే వాళ్ళ ఇక్కడ ఎందుకు ఉన్నారు?" అని చనిపోయిన ఇద్దరిని చూసి "వీళ్ళని ఎవరు చంపారు?"  అని డౌట్ గా అడిగాడు నిర్మల్.

"దొర! వాళ్ళని చంపింది మేమే! నా పేరు లింగు నాకు కనబడదు, వీడు నా తమ్ముడు గుడ్డు వీడికి వినపడదు వీడి పేరు శివుడు వీడికి నోరు లేదు." అని చెప్పాడు లింగు.

ఆ మాట విని "వీళ్లని ఇంకా చంపకుండా ఏం చేస్తున్నారు మేము వచ్చేదాకా వెయిట్ చేయాలి అనుకున్నారా..?" అని కోపంగా అడిగాడు ప్రమోద్.

"కాదు సార్! చంపేద్దాము అనుకున్నాను కానీ వీళ్ళకి నవగ్రహాల కొండలు ఎక్కడ ఉన్నాయో తెలుసు అని చెప్పారు, అవి నిజంగా చూపిస్తే బతుకుతారు లేకపోతే అప్పుడే చంపేద్దాము." అని చెప్పాడు చీలి.

"సరే పదండి. చూపించక పోయిన చస్తారు, చూపించిన చస్తారు." అని కోపంగా చూస్తూ నెమ్మదిగా చెప్పాడు ఫరూక్.

"దొర! మీరు నెమ్మదిగా మాట్లాడిన నాకు వినపడుతుంది ఆ కొండలు చూసినా ఆనందంలో మీరు నన్ను చంపరులే కానీ ఇక్కడినుంచి నడుస్తూనే వెళ్లాలి కారు వెళ్ళదు నా వెనకాలే రండి." అని చెప్పాడు లింగు.

కాసేపటికి వెనకాల వెళుతూ చెమటలకు కక్కుతూ ఆయాసపడుతూ "ఇంకా ఎంత దూరం వెళ్లాలిరా..?" అని అడిగాడు నిర్మల్.

ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా నడుచుకుంటూ వెళుతున్న లింగు వైపు చూసి  "అడిగితే సమాధానం చెప్పవేమిటి?" అని కోపంగా అడిగాడు ఫరూక్.

"మా తమ్ముడికి వినపడదు దొర!" అని చెప్పాడు లింగు.

"నీకు వినపడుతుంది కదా నువ్వు చెప్పొచ్చుగా..!" అని అడిగాడు ప్రమోద్.

"నాకు కనపడదుగా దొర! ఎవరిని అడిగారో ఎలా తెలుస్తుంది." అని వెరైటీగా ఫేస్ పెట్టి చెప్పాడు లింగు.

ఆ మాటకి "ఒరేయ్!" అని అరుస్తూ ఆవేశంగా లింగు మీదకి వస్తున్న ఫారుక్ మనిషిని వేగంగా వచ్చిన నోటితో పట్టుకుని వెళ్లిపోయింది ఒక పెద్ద పులి.

అది చూసి షాక్ లొ ఉన్న వాళ్ళ వైపు తిరిగి "ఈ అడవిలో గట్టిగా అరవకూడదు దొర, అరిస్తే ఇలాగే జరుగుతుంది మాట్లాడకుండా నా వెనకాలే రండి." అని చెప్పాడు లింగు.

"ఇప్పుడు నా మనిషి మీద దాడి చేసింది ఏ జంతువు?" అని కంగారుగా చూస్తూ అడిగాడు ఫరూక్.

"నాకెలా తెలుస్తుంది దొర! నాకు కనపడదు కదా!" అని ముందుకు నడుస్తూ చెప్పాడు లింగు.

ఆ మాటకి ఆవేశంగా అరవబోయి ఒక చేత్తో నోరు మూసుకుని ఇంకొక చేత్తో తల కొట్టుకుంటూ భయంతో అటు ఇటు చూస్తూ  వెనకాలే వెళ్ళాడు ఫరూక్.
[+] 12 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 18-02-2026, 11:28 AM



Users browsing this thread: 1 Guest(s)