18-02-2026, 11:25 AM
ఎపిసోడ్ 85
నీలమ్, మిత్ర వాళ్లతో కలిసి తీహార్ జైల్ లోపలికి షూటింగ్ కోసం వెళ్లి సబ్ జైలర్ నితీష్ ని తన దగ్గరికి తీసుకు రమ్మని శంకర్ తో చెప్పాడు అభీర్.
అభీర్ తో డీల్ చేసుకోవడానికి చూస్తున్నాడు అని తెలిసి రఘురామ్ ని లంచ్ కి పిలవమని తంబియార్ తో చెప్పాడు వరదరాజులు.
అడవిలో నడుచుకుంటూ వస్తున్న లింగు, గుడ్డులను చూసి సరదాగా కాసేపు ఆడుకుందాము ఇక్కడికి తీసుకురండి అని తన మనుషులతో చెప్పాడు చీలి.
********************
బేరా అడవిలో తన దగ్గరికి వచ్చిన లింగు వైపు చూసి "ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని గంభీరమైన గొంతుతో అడిగాడు చీలి.
"నా పేరు లింగు దొర, వీడు నా తమ్ముడు గుడ్డు!' అని చెప్పి తన భుజం మీద ఉన్న కోతిని చూపిస్తూ "వీడి పేరు శివుడు, అడవిలోకి తేనె పట్టు కోసం వచ్చాము." అని చెప్పాడు లింగు.
ఆ మాటకి అనుమానంగా చూస్తూ "మిమ్మల్ని ఈ చుట్టుపక్కల ఎప్పుడు చూడలేదే ఎక్కడి నుంచి వస్తున్నారు?" అని అడిగాడు ముత్యం.
"మాది ఆ కొండ పక్కన ఉన్న అడవి అందుకే మీరు నన్ను చూసి ఉండరు, కానీ మా శివుడు ఈ అడవిలో తిరుగుతూనే ఉంటాడు వీడిని ఎప్పుడైనా చూశారా?" అని అడిగాడు లింగు.
ఆ మాటకి విచిత్రంగా చూస్తూ "ఒకవేళ చూసిన కోతిని ఎలా గుర్తుపడతారు? ఈ అడవిలో పెద్దపులులు, సింహాలు తిరుగుతూ ఉంటాయి తెలియదా?" అని అడిగాడు ధన.
"ఏమో దొర నాకు కళ్ళు కనపడవు, ఏ జంతువు అరుపు అయ్యినా ఒకేలాగా ఉంటుంది అందుకే పెద్దగా పట్టించుకోను." అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పాడు లింగు.
"అవునా? మరి నీ పక్కన ఉన్న నీ తమ్ముడుకి కనపడుతుంది కదా వాడు చెప్పడా?" అని గన్ బయటికి తీశాడు చీలి.
"నా తమ్ముడు గుడ్డుకి వినపడదు దొర, మా శివుడికి ఏమో నోరు లేదు మాట్లాడలేడు." అని చెప్పాడు లింగు.
"నీకు కనపడదు వాడికి వినపడదు దీనికి నోరు లేదు మరి ధైర్యంగా ఈ అడవిలోకి ఎందుకు వచ్చారురా..?" అని వెనకాల ఉన్న తన మనిషి వైపు చూసి సైగ చేశాడు ధన.
సైగ చేయడం గమనించి గుడ్డు మీదకి కత్తిని విసిరాడు ధన మనిషి.
వేగంగా గుడ్డు మీదకి వస్తున్న కత్తిని తన చేతిలో ఉన్న కర్రతో పక్కకు కొట్టి "నాకు కనపడదు కానీ వినపడుతుంది దొర!" అని చెప్పాడు లింగు.
ఆ మాటకి షాక్ అయ్యి చూస్తూ లింగు తల మీద గన్ పెట్టి "ఇప్పుడు వినపడుతుందా?" అని అడిగాడు చీలి.
వేగంగా ముందుకు వచ్చి చీలి చేతిలో గన్ లాక్కుని అటు ఇటు తిప్పి చూస్తూ "నాకు కనపడుతుంది దొర!" అని చెప్పాడు గుడ్డు.
ఆ మాటకి కోపంగా చూస్తూ "ఏంట్రా? మేము పిచ్చివాళ్ళ లాగా కనపడుతున్నామా? వేషాలు వేస్తున్నారా?" అని ఆవేశంతో గట్టిగా అరిచేడు ధన.
ఆ మాటకి తల అటు ఇటు ఊపుతూ "ఏమో దొర! నాకు కనపడదు, మీరు మాట్లాడిన మాట నా తమ్ముడికి వినపడదు, ఒకవేళ మా శివుడికి వినపడిన కనపడిన మాట్లాడలేడు. అయ్యినా ఎందుకు అరుస్తున్నారు? మీ రోగానికి నా దగ్గర మందు ఉంది ఇమ్మంటారా?" అని అడిగాడు లింగు.
"కాసేపు ఆడుకుందామని వీళ్ళని పిలిస్తే వీళ్ళు మనల్ని ఆడుకుంటున్నారు, ఈ కళ్ళు లేనోడి మాటలు వింటుంటేనే ఇరిటేషన్ వస్తుంది." అని చీలి వైపు చూసి "నువ్వు చంపుతావా?" నన్ను చంపమంటావా?" అని కోపంగా అడిగాడు ధన.
తన మనిషి వైపు చూసి "ఒరేయ్! వీళ్లిద్దరి కాళ్లు చేతులు కట్టేసి ఆ కోతిని చంపి సూప్ చేయండి. అప్పుడు దాని కేకలు వీడికి వినపడుతాయి, వాడికి కనపడుతాయి మనతో పాటు విళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు." అని నవ్వుతూ చెప్పాడు చీలి.
"సరే బాయ్!" అని ముందుకు వస్తున్న వాడి వైపు తిరిగి గుడ్డు చేతిలో ఉన్న గన్ తీసుకొని షూట్ చేసి "తప్పు దొర! మూగజీవాన్ని చంపకూడదు." అని చెప్పాడు లింగు.
తన మనిషికి కరెక్ట్ గా నుదుటి మీద బుల్లెట్టు దిగడం చూసి లింగు వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఒరేయ్! నీకు నిజంగా కళ్ళు కనపడవా?" అని దగ్గరికి వస్తూ డౌట్ గా అడిగాడు చీలి.
బులెట్ తగిలి కింద పడ్డ మనిషిని చూసి కోపంతో లింగు మీదకి దూకాడు ధన మనిషి.
అది చూసి లింగు బొడ్డులో ఉన్న కత్తి తీసి మీదకు వస్తున్న వాడి గొంతులో దింపి "మా అన్న మీ దొరతో మాట్లాడుతున్నాడు కదా! మధ్యలో రాకూడదని తెలియదా?" అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పాడు గుడ్డు.
పక్కనే ఉన్న తన మనిషి గొంతులో కత్తి దిగడం చూసి భయంతో రెండు అడుగులు వెనక్కి వేసి "చీలి! వీళ్లిద్దరూ మామూలు వాళ్ళు కాదు నాకు తెలిసి ఆ అభీర్ సేన మనుషులు అయ్యుంటారు వెంటనే వీళ్ళని చంపేయాలి." అని కంగారుగా చెప్పాడు ధన.
ఆ మాట విని "దొర! కంగారు పడకండి మాకు ఈ అడవి మొత్తం కొట్టిన పిండి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాము ఎక్కడికి తీసుకు వెళ్ళమన్న తీసుకువెళతము." అని చెప్పాడు లింగు.
ఆవేశపడుతున్న ధనని ఆపి "మీకు నవగ్రహాల కొండలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?" అని అడిగాడు చీలి.
"తెలుసు దొర! కానీ వాటి జోలికి వెళ్లడం అంత మంచిది కాదు అనవసరంగా ప్రాణాలు మీ దగ్గర తెచ్చుకోకండి." అని చెప్పాడు లింగు.
"ఆ విషయం మాకు తెలుసులే కానీ ఆ కొండలు ఎక్కడ ఉన్నాయో మాకు చూపించండి మిమ్మల్ని చంపకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తాను." అని చెప్పాడు చీలి.
"సరే దొర! రావలసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరూ మా వెనకాల వచ్చేయండి. ఆ కొండలు దగ్గరికి వెళ్లిన తర్వాత మళ్లీ ఈ దారిలో రావలసిన పని ఉండదు అక్కడ నుంచి వేరే దారి ఉంది తేలికగా అడవి బయటకు వెళ్ళిపోవచ్చు!" అని చెప్పాడు లింగు.
"అతను చెప్పింది నిజమే దొర! ఆ కొండల దగ్గర నుంచి వేరే మార్గం ఉంది అంటారు." అని చెప్పాడు ముత్యం.
"అవునా? అయితే బాస్ వాళ్ళను కూడా పిలుద్దామా?" అని అడిగాడు ధన.
"సరే!" అని ఫోన్ తీసి నిర్మల్ కి కాల్ చేసాడు చీలి.
ఫోన్ రింగ్ అవడం చూస "ఆ కొండల దగ్గరికి వెళ్లినట్లు ఉన్నారు." అని సంతోషంగా లిఫ్ట్ చేసి "మేము స్టార్ట్ అవ్వొచ్చా?" అని అడిగాడు నిర్మల్.
"ఎస్ సార్! ఆ కొండల దగ్గర నుంచి అడవి బయటికి వెళ్లడానికి వేరే రూటు ఉంది మీరు త్వరగా వచ్చేయండి." అని చెప్పాడు చీలి.
"అవునా? ఇప్పుడే స్టార్ట్ అవుతాము." అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫరూక్ వైపు చూసి "మళ్లీ మనం ఈ రూట్లో బయటికి రానవసరం లేదు మీ వాళ్ళకి కాల్ చేసి వాసుకి వస్తే లోపలికి పంపించమను." అని చెప్పాడు నిర్మల్.
"ఓకే!" అని కార్ ఎక్కి ఫోన్ తీసి కాల్ చేసి "కబీర్! నీ మొబైల్ కి ఒక ఫోటో సెండ్ చేశాను ఆ అమ్మాయి తో పాటు కొంతమంది మనుషులు వస్తారు వాళ్ళని అడవిలోకి పంపించు నా పర్మిషన్ లేనిదే వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదు." అని చెప్పాడు ఫరూక్.
"సరే బాయ్!" అని చెప్పాడు కబీర్.
"నేను అడవిలోకి వెళ్తున్నాను ఫోన్ రీచ్ అవ్వకపోతే కంగారు పడకండి నా పర్మిషన్ లేనిదే ఎవరు లోపలికి రాకూడదు ఎవరు బయటికి వెళ్ళకూడదు." అని చెప్పి ఫోన్ పెట్టేసి నిర్మల్ వైపు చూసి "బయలుదేరుదామా?" అని చెప్పాడు ఫరూక్.
కార్ లొ బయలుదేరి "ఆ కొండల్లో చూడాలని చాలా ఆశగా ఉంది." అని చెప్పాడు ప్రమోద్.
డ్రైవింగ్ చేస్తూ "ఆ కొండలని చూసిన తర్వాత మీ కళ్ళలో ఆనందం చూడాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది." అని చెప్పాడు అరుల్.
****************
అదే సమయంలో తీహార్ జైల్లో సబ్ జైలర్ నితీష్ దగ్గరికి వెళ్లి "సార్! ఛానల్ వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి వచ్చారు మీరు ఒక్కసారి వచ్చి చూసి ఓకే అంటే వాళ్ళని లోపలికి పంపుతాను." అని చెప్పాడు శంకర్.
"సరే పద!" అని చెప్పి అక్కడికి వచ్చి నీలమ్ దగ్గర పర్మిషన్ కాగితాలు తీసుకుని చూస్తూ "మీరు ఈ ప్లేస్ లో మాత్రమే షూటింగ్ చేయాలి, కానీ మీరు మా జైలర్ వారి సిస్టర్ కాబట్టి మీకు లోపల షూటింగ్ చేసుకోడానికి కూడా నేను పర్మిషన్ ఇస్తాను." అని నవ్వుతూ చెప్పాడు నితీష్.
ఆ మాట విని ముందుకి వస్తూ "నితీష్ గారు బాగున్నారా? నేను పెంచిన చెట్లకి నీళ్లు పోస్తున్నారా?" అని అడిగాడు అభీర్.
ఆ మాట విని కంగారుగా చూస్తూ "అభీర్! నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నీ చెట్లకి రోజు నేనే దగ్గర ఉండి నీళ్లు పోయిస్తున్నాను." అని టెన్షన్ చెప్పాడు నితీష్.
"చాలా థాంక్స్! ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా?" అని అడిగాడు అభీర్.
"నేను కొంచెం అర్జెంటుగా బయటకు వెళ్లాలి శంకర్ ఫోన్ లో నుంచి చేసుకో!" అని అక్కడి నుంచి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు నితీష్.
"మిథున్ ప్లాన్ ఏమిటో చెబితే ఇక్కడ జరిగే గొడవలో నువ్వు ప్రాణాలతో ఉంటావు." అని చెప్పాడు అభీర్.
ఆ మాటకి వెనక్కి తిరిగి టెన్షన్ గా చూస్తూ "నాకు ప్లాన్ గురించి ఏమి తెలియదు ఇక్కడకి ఖైదీలుగా వచ్చిన టెర్రరిస్టుల్ని సెల్ లో పెట్టి లాక్ చేయకుండా వదిలేసి నన్ను బయటికి వెళ్లిపోమన్నాడు." అని చెప్పాడు నితీష్.
"అవునా?" మరి షూటింగ్ కి వచ్చిన వీళ్ళని కూడా పర్మిషన్ లేకుండా లోపలికి పంపించమని చెప్పాడా? " అని అడిగాడు అభీర్.
అంతలో సైరన్ మోగడంతో "అభీర్! లోపల ఏదో గొడవ జరుగుతుంది సందీప్ గారు అక్కడే ఉన్నారు." అని కంగారుగా చెప్పాడు శంకర్.
సైరాన్ విని శంకర్ వైపు చూసి "డోర్స్ మొత్తం లాక్ చెయ్! నేను లోపలికి వెళుతున్నాను ఇక్కడి నుంచి ఎవరు తప్పించుకోకూడదు." అని నితీష్ దగ్గర ఉన్న గన్ తీసుకుని లోపలికి వెళ్ళాడు అభీర్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)