18-02-2026, 11:22 AM
Part - 104
బిందుకి ఏం చేయాలో తెలియక ధనుంజయ్ దగ్గరకు వచ్చి మాకు సమ్మతమే అని చెబుతుంది. మంచిది. బిందు ఇంకా తనకిచ్చిన రూమ్ కి వెళ్ళిపోయి పడుకుంటుంది.
చేసుకున్న వారికి చేసుకున్నంత అంటే ఇదేనేమో.. ఆరోజు పై... పై.. మెరుగులు చూసి, కాసులు కోసం కష్టపడడం మానేసి అన్యాయానికి కొమ్ముకాసం.
ఈరోజు ఆ అన్యాయమే పాములాగా మెడకి చుట్టుకుని ఊపిరాడనివ్వడం లేదు.
విక్రమ్ ఇంటికి వచ్చిన తర్వాత ధనుంజయ్ తో జరిగిన విషయం మొత్తం చెబుతాడు. అది విన్న ఇందిరా గారు ఈ విధంగా అయినా సరే వాళ్లు మారితే అదే చాలు అంటారు.
నేను అదే అనుకుంటున్నాను గ్రానీ.. ఇంతకీ అవిని ఎక్కడ అంటే.. ఇంకా అక్కడ ఉంటుంది. కొత్త పెళ్ళికూతురు తన ఎంగేజ్మెంట్ కి తీసుకున్న చీరలన్నీ చూపిస్తుంది.
వాటిని సద్దే పనిలో ఉంది. ఆ మాటకి నవ్వుతూ ఉంటే.. రాజ్ పక్కన వచ్చు కూర్చుని మేము బిజినెస్ యూఎస్ నుంచి ఇండియా షిఫ్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను రా అంటాడు.
ఎందుకు అని అడిగితే... ఆ మాట ఎలా అడగగలుగుతున్నారా.. మిత్ర ద్రోహి. నీ చెల్లి షాపింగ్ పిచ్చి చూస్తూ ఉంటే నేను సంపాదించింది అంతా కూడా ఫ్లైట్ లకే సరిపోతుంది.
మా అమ్మా ఏదో ఆన్లైన్ షాపింగ్.. అక్కడ బిజినెస్ చేసే లేడీస్ తెచ్చిన వాటిలో ఏదో నచ్చింది తీసుకునేది.. అంతేగాని ఏ రోజు మమ్మల్ని తీసుకుని వెళ్ళమనలేదు. అందుకే లేడీస్ షాపింగ్ నాకు అసలు ఐడియా లేదు.
కానీ ఇక్కడ మీ చెల్లి అలా కాదురా.. తనకి నచ్చిన డిజైన్ కూడా దగ్గరుండి మరి డిజైన్ చేపించుకుంటుంది. కలర్ కూడా కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు.
ఎలా రా.. దాన్నే టాలెంట్ అంటారు రా అంటాడు.ఆ టాలెంట్ పిచ్చి మా అమ్మకి కూడా అంట గడుతుంది. ఇద్దరూ కలిసి షాపింగ్ అని తిరిగితే నేను మా నాన్న ఏమైపోవాలి.
ఏదో మా నాన్న కోడలు వస్తుందని ఆనందంలో ఇప్పుడు తెలియడం లేదు గాని.. తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయో నాకు ఈ నెల రోజుల్లోనే బాగా తెలిసింది.
రేపు కూతురు పుట్టింది అనుకో వీళ్ళ ముగ్గురిని అమెరికా నుంచి ఇండియా.. ఇండియాలో మూల మూలకి ఉన్న షాపులకి తిప్పలేను.
అందుకే నేనే కాంప్రమైజ్ అయ్యి ఇండియా షిఫ్ట్ అయిపోతాను. వీడికి అంత సీన్ లేదు అని పార్ధుగారు వస్తారు.
అబ్బా ఈయన ఒక్కడు నా ప్రాణానికి. ఏ క్రెడిట్ ని నా ఎకౌంట్లో వేసుకోనివ్వరు కదా అని వాళ్ళ నాన్న వైపే చూస్తాడు .
ఏంట్రా ఆ చూపు అంటే చూడడం తప్ప ఇంక మేము ఏం చేయగలం లే అంటాడు. ఇది మాత్రం కరెక్ట్ రా ఇన్నాళ్ళకి నిజాలు ఒప్పుకున్నావు. అందరూ నవ్వుతూ ఉంటారు.
నాన్న నేను ఈ ఇంటికి కాబోయే అల్లుడ్ని. అత్తారింట్లో కొడుకు ని అలా అనకూడదు అంటాడు. సర్లే ఇంక సంబడాలు మనకి అని. ఏమీ లేదు విక్రమ్.. నాన్నగారు వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు.
వీడికి ఇక్కడే అలవాటైపోయింది. మేమొ ఒక్కళమే అక్కడ ఉండి ఏం చేస్తాము. అందరం ఒకే చోటు ఉంటే బాగుంటుంది అని ఆలోచించాము.
అందుకే అక్కడ బ్రాంచ్ రన్ చేస్తూ మెయిన్ వర్క్ అంతా ఇండియా షిఫ్ట్ చేసేస్తున్నాను అని చెబుతారు. మంచి డెసిషన్ అంకుల్.
మేము కూడా నివి దూరంగా వెళుతుందేమో అని కొంచెం బాధగా అనిపించింది కానీ.. మీరు తీసుకున్న నిర్ణయంతో మా బాధంతా కూడా తీరిపోయింది అని సంతోషంగా చెబుతాడు.
ఇందిరా గారు కూడా చాలా సంతోషంగా ఉంది పార్ధు నీ నిర్ణయం అని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. అవని, నివి అన్నీ సర్థి నవ్వుతూ బయటకు వస్తూ ఉంటారు.
రాజ్ మాత్రం భయంగా చూస్తూ ఉంటాడు. పార్ధు కొడుకువైపు చూసి ఏమైందిరా అంత భయపడుతున్నావు. నీ కోడలు మళ్ళీ ఏ షాపింగా అంటుందో అని తడిసిపోతుంది నాన్న నాకు.
నీకు సీక్రెట్ చెప్పనా అంటారు. చెప్పండి నాన్న.. కోడల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీ అమ్మ కూడా మొదలుపెట్టింది రా..
ఏదైనా అంటే నా కొడుకు చూడండి. ఎంత బాగా తీసుకువెళుతున్నాడు. మీరు ఉన్నారు ఎప్పుడైనా తీసుకు వెళ్లారా అని రాగం అందుకుంటుంది.
తండ్రి వైపు చూసి మీదాకా పాకిందా... నువ్వు బయటపడుతున్నావు. నేను బయటపడటం లేదు అంతే. నిజం చెప్పండి నాన్న..
మీరు బిజినెస్ ఇండియా షిఫ్ట్ చేసేయాలి అనుకున్నది దీనికే కదా అంటే.. ఇది కూడా ఒక కారణం రా.. నేను మాత్రం ఒకటి డిసైడ్ అయ్యాను. అమ్మాయి పుట్టింది అనుకో మన కంట్రోల్ లోనే పెట్టి పెంచుకుందాము.
తండ్రి వైపు చూసి విరక్తిగా నవ్వుతూ మనం ఎన్ని ప్లాన్లు చేసుకున్నా వాళ్ళ ముందు జూజిబిఏ అంటాడు. అంతేనంటావా అంటే.. మీకు ఏమన్నా డౌటా..
శ్రీ గాడి ఎంగేజ్మెంట్ అప్పుడు నేను ఇచ్చిన బిల్డ్ అప్ కి ఇప్పటికీ వీళ్లిద్దరూ నన్ను ఆడేసుకుంటున్నారు. వాళ్ల అమాయకమైన ముఖాలు చూసి మనమే మోసపోతాము.
ఇప్పటికీ అదే ఇన్నోసెంట్ తో వచ్చి మన ముందు నిలబడి మరి లొంగ తీసేసుకుంటారు. అందుకే నాకు మీ కోడల్ని చూస్తుంటే భయమేస్తుంది.
గొడవ పడినా.. ఏడ్చిన ఇది ఇంతే అనుకోవచ్చు. తిట్టినా.. నోరు ఇంతే అని భరించవచ్చు. కానీ అలాంటివి ఏమీ చేయకుండా.. ఇన్నోసెంట్ లుక్స్ తో ఎదురుగుండా వచ్చి మీకు అభ్యంతరం లేకపోతే అని మొదలు పెడతారు.
ఇంకెక్కడి నుంచి అభ్యంతరం వస్తుంది నాన్న. అంత రెస్పెక్ట్ గా మాట్లాడుతుంటే.. అలాగే బెండు తీసేసింది. ఒరేయ్ పెళ్లికి ముందే బెండ్ అయిపోతే.. పెళ్లి అయ్యాక ఏంట్రా నీ పరిస్థితి.
కొన్ని కొన్ని అడక్కూడదు నాన్న చూసి చూడనట్టుగా వెళ్లిపోవాలి. నా కొడుకుకి అప్పుడే ఎంత జ్ఞానోదయం అయింది. అయాం ప్రౌడ్ అఫ్ మై సన్ అంటారు .
మీరు నన్ను పొగిడినా తిట్టినా ఏదైనా ఒకేలాగా తీసుకుంటున్నాను నాన్న. దానినే పెళ్లయ్యాక వచ్చే స్థితిప్రజ్ఞత అంటారు.
రాత్రి పడుకునే ముందు పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన అవని కి విక్రమ్ ఎక్కడా కనిపించడు. ఏమైపోయారు ఈయన అని చుట్టూ చూస్తూ బాల్కనీలోకి వెళుతుంది.
అక్కడ చేతులు కట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైందండీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని భుజం మీద చెయ్యి వేసి అడుగుతుంది.
అప్పటి వరకు ఉన్న ఆలోచనలు పక్కన పెట్టేసి భార్య వైపు నవ్వుతూ చూసి. వచ్చావా అని అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు.
ఒడిలో కూర్చుని భర్త మొఖం చూస్తూ ఏమాలోచిస్తున్నారండి... ఏమీ లేదు చిన్న ఆఫీస్ టెన్షన్ అంతే అంటారు.
మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు అంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు. మీరు ఇంటికి వచ్చాక ఎప్పుడు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచించరు.
అది మన ప్రైవేట్ ప్లేస్ లో అయితే అసలు ఆలోచించరు అంటుంది. ఆ మాటకి నవ్వుతూ అబ్బో మా భార్యామణికి అన్ని విషయాలు తెలిసే..
నాకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ మీ గురించి తెలుసు అంటుంది. ఏం జరిగిందో చెప్పండి అని చెంపపైనా చెయ్యవేసి అడుగుతుంది.
అవని కళ్ళల్లోకి చూస్తూ.. నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎమోషనల్ అవ్వద్దు అంటాడు. ముందే భయపెడుతున్నారు. లేదు జాగ్రత్త పడుతున్నాను.
సరే చెప్పండి వింటాను. ఈరోజు ఆ మనిషి నన్ను కలిశారు అని చెప్పి అవని వైపు చూస్తాడు. అప్పటికే అవని ఫేస్ లో రంగులు మారుతూ ఉంటాయి.అందుకే చెప్పాను ఎమోషనల్ అవ్వద్దు అంటే.. ఏమీ లేదు చెప్పండి.
ఎల్లుండి వాళ్ళ కంపెనీ యాన్యువల్ డే. ఆరోజు అన్ని డాక్యుమెంట్స్ అందరి ముందు నీకు ఇవ్వాలి అని చెప్పడానికి వచ్చారు అని చెబుతాడు.
అవని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కొంచెంసేపు అవని కి టైం ఇవ్వాలి అని ఏమీ మాట్లాడకుండా విక్రమ్ కూడా సైలెంట్ గా ఉంటాడు.
అంతా నా పేరు మీదే రాసేస్తే.. మరి ఆయన కూతురు సంగతి ఏమిటి అని అడుగుతుంది. ఆ మాటకి నవ్వుతూ అందుకేనే నిన్ను బంగారం అనేది.
ఒక్క చిల్లి గవ్వ కూడా నీకు అందకూడదు. నీకు ఆ వారసత్వంతో ఎటువంటి సంబంధం లేకుండా చూడాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచే జరగాలి అనుకుంటున్నావు చూడు.. అక్కడ ఇంకో మెట్టు ఎక్కేసావు అని గట్టిగా హగ్ చేసుకుంటాడు.
కాసేపటికి వదిలి అవన్నీ.. ఆ మనిషి ఆలోచించకుండా ఉండడు కదా.. చూద్దాం ఏం చేస్తారో అన్నది. కాకపోతే ఆరోజు నువ్వు వచ్చి ఆ డాక్యుమెంట్స్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్.
నువ్వు కచ్చితంగా వెళ్ళాలి అంటే మీరు ఉంటారు కదా అంటే.. మన కుటుంబం మొత్తం ఉంటుంది అని చెబుతాడు.
అలాగైతే ఓకే... ఒక్క విషయం. నేను మాత్రం అక్కడ ఏమీ తాగను. తినను. ఆ విషయంలో నన్ను ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అని చెబుతుంది.
నీకు ఎలా కావాలంటే అలా చేద్దాం బంగారం. పొద్దుటి నుంచి నువ్వు, నివి శారీస్ బిజీలోనే ఉన్నట్టున్నారు అంటూ డైవర్ట్ చేస్తాడు. అవునండి... నివి దగ్గర చాలా కలెక్షన్ ఉంది.
ఆ టెస్ట్ ని కూడా మెచ్చుకోవాలండి. ఆ కాంబినేషన్ సెట్ చేయడం అంటే మాటలు కాదు కదా.. మంచి డిజైనర్ ఉంది తనలో. అటువైపు ఎందుకు తను ట్రై చేయడం లేదు.
ఫ్యూచర్లో ట్రై చేస్తుంది ఏమో అంటాడు. యూఎస్ వెళ్ళిపోతారు కదా. లేదు ఫ్యామిలీ మొత్తం ఇండియా షిఫ్ట్ అయిపోతున్నారు అని చెబుతాడు.
ఎంత మంచి వార్త చెప్పారండి. ఇలాగైతే మావి శారీస్ గాని ఏమైనా కావాలి అంటే నివితోనే డిజైన్ చేపించుకుంటాను అని ఉత్సాహంగా చెబుతుంది.
నవ్వుతూ మాట్లాడుతున్న అవని మొఖాన్ని చూస్తూ మొఖంపై పడుతున్న ముంగురులను చెవి వెనక్కి సర్దుతూ చెప్పేవి అన్నీ వింటూ ఉంటాడు.
యాన్యువల్ డే ??
కథ కొనసాగుతుంది..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)