Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 84


గొర్వర్ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి చిలి, ధన లకి అక్కడ అడవిలో ఉండే గిరిజన నాయకుడు ముత్యంని పరిచయం చేసి వాళ్లతో పాటు అడవిలోకి వెళ్లి రూట్ క్లియర్ చేసి ఇన్ఫామ్ చేయమని పంపించాడు నిర్మల్.

***************

ఉదయం నంద గెస్ట్ హౌస్ దగ్గర తల్వార్ చెప్పిన ఎక్విప్మెంట్ మొత్తం రావడంతో బయలుదేరుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి "వాసుకి బేరా కొండల దగ్గర జరిగే ప్రతి మూమెంట్ నాకు ఎప్పటికప్పుడు తెలియాలి, మీరు ఆ అడవినుంచి నుంచి నిధితోనే బయటకు రావాలి." అని చెప్పింది అర్ణ.

"సరే మేడం! మీరు చేయవలసింది ఒక్కటే! మా పని అయ్యేంతవరకు అభీర్ ని అడవిలోకి రాకుండా చూసుకోండి." అని చెప్పి వ్యాన్ ఎక్కింది వాసుకి.

అక్కడినుంచి వ్యాన్ బయలుదేరగానే ఫోన్ తీసి నిర్మల్ కి కాల్ చేసింది అర్ణ.

చిలి వాళ్ళని  అడవిలోకి పంపించి ఫరూక్ తో మాట్లాడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "హలో అర్ణ! నా మనుషులు ఇప్పుడే అడవిలోకి ఎంటర్ అయ్యారు." అని చెప్పాడు నిర్మల్.

"వాసుకి ఆ ట్రెజర్ హంటర్ ని తీసుకుని అక్కడికి స్టార్ట్ అయింది. వాళ్ల మీద ఒక కన్ను వేసి ఉంచండి." అని చెప్పింది అర్ణ.

"ఈ అడవి చుట్టూ మన మనుషులే ఉన్నారు మనల్ని దాటీ ఎక్కడికి వెళ్లారు." అని చెప్పాడు నిర్మల్.

ఆర్ల దగ్గర ఫోన్ తీసుకుని "నిర్మల్! మీరు అడవిలో ఎంతైనా తిరగండి. కానీ అక్కడ అమ్మవారి విగ్రహం ఉన్న కొండ మీదకి మాత్రం వెళ్ళకండి." అని చెప్పాడు అభిజిత్.

"ఎందుకు డాడ్! అక్కడ ఏమైనా దయ్యాలు ఉన్నాయా?" అని నవ్వుతూ "సరే మీరు చెప్పారు కదా! అక్కడికి వెళ్దాము." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నిర్మల్.

ఫోన్ ఇస్తున్న అభిజిత్ వైపు చూసి "అంకుల్! ఆ కొండ మీదకి ఎందుకు వెళ్ళద్దు అంటున్నారు? మీరు దేని గురించి భయపడుతున్నారు?" అని అడిగింది అర్ణ.

"ఆ కొండమీద అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలని నేనే కత్తితో పెకిలించి తీశాను, ఇప్పటికీ నాకు నిద్రలో ఆ పంచరత్నాల నుంచి రక్తం కారుతున్నట్టు   కనిపిస్తూ ఉంటుంది. కచ్చితంగా అక్కడ ఏదో శక్తీ ఉంది దానికి మనం కొంచెం దూరంగా ఉండటమే మంచిది." అని చెప్పాడు అభిజిత్.

ఆ మాటకి నవ్వుతూ "అడవిలో మీకు జరిగిన ఆక్సిడెంట్ వల్ల ఆ ఫీలింగ్ లో ఉండిపోయారు అందుకే అలా అనిపిస్తుంది అక్కడ ఏమీ లేదు, ఏదో ఉంది అన్నట్లు మనల్ని భయపెట్టడానికి ఆ అభీర్ సేన కొంచెం ఎక్స్ట్రా డైలాగులు చెబుతున్నారు దాని గురించి మీరు ఓర్రి అవ్వకండి." అని కొట్టి పారేసింది అర్ణ.

అక్కడికి వస్తు "ఆ అభీర్ ఒక వారం రోజులు పాటు ఢిల్లీ నుంచి కదలకుండా ఉండేలాగ ప్లాన్ చేశాను ఈ లోపు అడవిలో మన పని కంప్లీట్ అవుతుంది." అని నవ్వుతూ చెప్పాడు మిథున్.

"అవునా? అభీర్ ని ఇక్కడే కట్టిపడేసే అంత ప్లాన్ ఏముంది?" అని డౌట్ గా అడిగాడు ముకుల్.

"తనకి సహాయం చేసిన వాళ్ళని తనని నమ్ముకున్న వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళలేడు కదా అందుకే ఆ సెంటిమెంట్ మీదే దెబ్బ కొట్టాను కాసేపట్లో న్యూస్ లో వస్తుంది చూడండి." అని చెప్పాడు మిథున్.

****************

అదే సమయంలో వసుంధర ఇంటి దగ్గరికి వస్తున్న అభీర్ ని చూసి "హాయ్ అభీర్! హౌ ఆర్ యు? ఏంటి మేడం తో ఏమైనా పని ఉందా?" అని అడిగాడు సందీప్ రావు.

"అన్నయ్య! అభీర్ నాకోసమే వచ్చాడు, ఈరోజు డాక్యుమెంటరీ షూటింగ్ తీహార్ జైల్ లొ అని చెప్పా కదా పర్మిషన్ కూడా ఇప్పించావు మర్చిపోయావా?" అని అడిగింది నీలమ్.

"హౌ మర్చిపోయిన అవును కదా! ఏంటి అభీర్ క్యారెక్టర్ కి ఆర్టిస్టులు పెట్టకుండా డైరెక్టర్ గా తననే పెట్టేసావా ఏంటి?" అని నవ్వుతూ అడిగాడు సందీప్.

"నేను అంత డేర్ చేయలేను ఆ క్యారెక్టర్ కి వేరే మనిషి ఉన్నాడు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది ఒకసారి చూడడానికి రమ్మంటే వచ్చాడు." అని చెప్పింది నీలమ్.

"సరే! నేను జైల్ కి వెళుతున్నాను ఈరోజు టెర్రరిస్ట్ ఖైదీలు వస్తున్నారు మీరు షూటింగ్ కి వచ్చే టైంకి వాళ్ళని వెనకాల బారికేడ్స్ కి పంపిస్తాను, లోపలికి వచ్చేటప్పుడు కాల్ చేసి రావడం మర్చిపోకండి." అని చెప్పి శంకర్ తో కలిసి అక్కడి నుంచి కార్లో బయలుదేరడు సందీప్ రావు.

తన దగ్గరికి వచ్చిన బామ్మా తో మాట్లాడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి "బామ్మ గారు ఒక్క నిమిషం!" అని పక్కకు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి "చెప్పు వరదరాజులు నాకు ఎందుకు ఫోన్ చేయలి అనిపించింది?" అని అనుమానంగా అడిగాడు అభీర్.

"ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్! మిథున్ ఏదో ప్లాన్ చేశాడు నీ మీద మాత్రం అటాక్ చేయడానికి కాదు, నీకు సహాయం చేసిన వాళ్ళు నిన్ను నమ్ముకున్న వాళ్ళు అని ఏదో అంటున్నాడు నీకు చెప్పాలి అనిపించింది చెప్పాను." అని ఫోన్ పెట్టేసాడు వరదరాజులు.

ఫోన్లో చెప్పింది విని కాసేపు ఆలోచించి బైరికి కాల్ చేసి "ఈరోజు తీహార్ జైలుకి టెర్రరిస్టులు వస్తున్నారు అని తెలిసింది వాళ్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకో నాకెందుకో అనుమానంగా ఉంది." అని చెప్పాడు అభీర్.

"సరే నాయకుడా! ఐదు నిమిషాల్లో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని నీకు కాల్ చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు బైరి.

ఫోన్ పెట్టేసి జాజి, నారప్పలా వైపు చూసి "ఒకరు వసుంధర మేడం తో పాటు కోర్టుకు వెళ్ళండి. ఒకరు మురళి జోషి ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉండండి.

మల్లి నువ్వు కాలేజ్ దగ్గరికి వేళ్ళు, రాము నువ్వు ఇక్కడే ఉండు."అని చెప్పి నీలమ్ వైపు చూసి "మీ స్టాఫ్ ని ఇక్కడే ఉంచు ఈరోజు కొత్త స్టాఫ్ తో వెళదాము." అని అక్కడ ఉన్న మిత్ర వైపు చూశాడు అభీర్.

"ఓకే బాస్! కెమెరామెన్ చాక్లెట్ తో డైరెక్టర్ మిత్ర రెడీ." అని చెప్పింది.

"అభీర్! మళ్లీ మనకి పర్మిషన్ రావాలి అంటే చాలా రోజులు పడుతుంది షూటింగ్ లేట్ అయిపోతుంది." అని కంగారుగా అడిగింది నీలమ్.

"నేను అనుకున్నది కరెక్టే అయితే నీకు లైవ్ ప్రోగ్రాం దొరుకుతుంది. వెళదామా?" అని స్మైల్ ఇచ్చాడు అభీర్.

************

ఫోన్ మాట్లాడి టెన్షన్ తో మందు తాగుతున్న వరదరాజు దగ్గరికి వచ్చి "ఏంట్రా! ఈ విషయం అభీర్ కి ఎందుకు చెప్పావు?" అని ముందు గ్లాస్ తీసుకుంటూ అడిగాడు ప్రతాప్ మిశ్ర.

"మనం నంద, అభిజిత్ ల దగ్గర ఎంత మంచిగా ఉన్నా పక్కనే పెడుతున్నారు  ఒక్క విషయం కూడా చెప్పడం లేదు కాపలా కుక్కలాగా చూస్తున్నరు, అభీర్ కి కాస్త సహాయం చేసామనుకో మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పోయి కాస్త గుడ్ ఇంప్రెషన్ వస్తుంది." అని చెప్పాడు వరదరాజులు.

"అసలు! ఆ మిథున్ గాడి ప్లాన్ ఏమిటో అర్థం కాలేదు." అని చెప్పాడు తంబియార్.

"ఆ ప్లాన్ గురించి మనం తలలు పగలగొట్టుకోవడం ఎందుకు అభీర్ కి హింట్ ఇచ్చాము కదా వాడే చూసుకుంటాడు ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి." అని చెప్పాడు వరదరాజులు.

"ఆ నంద ఫ్యామిలీలో ఒక గుంట నక్క ఉంది అని తెలుసుకున్నము దానిని మన గుంపులోకి రమ్మంటే సరిపోతుంది." అని చెప్పాడు సుజిత్.

"నువ్వు ఆ రఘురామ్ గురించి మాట్లాడుతున్నావా? వాడు పెద్ద వెధవ మనల్ని కూడా ముంచేస్తాడు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

"మనం ఏమన్నా మహానుభావులమా? వెధవలు వెధవలు ఒకటి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఆ రఘురామ్ ప్లాన్ ఏమిటి?" అని అడిగాడు వరదరాజులు.

"ఆ కొండల గురించి డైరెక్ట్గా అభీర్ తో డీల్ మాట్లాడడానికి చూస్తున్నడు." అని చెప్పాడు తంబియార్.

"అవునా? అయితే రఘురామ్ ని లంచ్ కి తీసుకురండి సరదాగా మాట్లాడదాము, ఇప్పుడు మనం ఆబీర్ కి హెల్ప్ చేసాము కచ్చితంగా మనకి ఫేవర్ గా ఉంటాడు ఏదైనా డీల్ చేసుకుంటే మనతోనే చేసుకుంటాడు." అని చెప్పాడు వరదరాజులు.

********************

నీలమ్ వాళ్లతో కలిసి షూటింగ్ పర్మిషన్ చూపించి తీహార్ జైల్ లోపలికి వెళ్ళాడు అభీర్.

అక్కడికి వచ్చిన అభీర్ ని ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని డౌట్ గా అడిగాడు శంకర్.

"సందీప్ గారు ఎక్కడ ఉన్నారు." అని అడిగాడు అభీర్.

"ఈరోజు కొత్త ఖైదీలు వచ్చారు ఆ పనిలో బిజీ గా ఉన్నారు మీరు షూటింగ్ చేసుకోవడానికి అటువైపు బారికేడ్స్ ఖాళీ చేయించారు." అని చెప్పాడు శంకర్.

"సరే! నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు  మిథున్ ఏదో ప్లాన్ చేశాడు అని తెలిసింది ఇక్కడే ఏదో జరుగుతుందని డౌట్ గా ఉంది నేను ఒకసారి సబ్ జైలర్ నితీష్ ని కలవాలి." అని చెప్పాడు అభీర్.

"మీరు షూటింగ్ జరిగే ప్లేస్లో ఉండండి నేను నితీష్ గారిని తీసుకువస్తాను." అని చెప్పాడు శంకర్.

******************

బేరా అడవిలోకి వెళ్లి నిర్మల్ వాళ్లు రావడానికి దారి క్లియర్ చేస్తూ జంతువులు దూరంగా పారిపోవడానికి బాంబులు విసురుతూ ముందుకు వెళుతూ ఉండగా ఒక చేత్తో కర్ర పట్టుకుని ఒక చేత్తో గుడ్డుని పట్టుకుని పాట పాడుకుంటూ నెమ్మదిగా వస్తున్న లింగు ని చూసి

"వీడెవడురా అడవిలో పాట పాడు కుంటూ తిరుగుతున్నాడు?" అని అడిగాడు ధన.

ఆ మాట విని లింగు వాళ్ళ వైపు చూస్తూ "దొర వీళ్ళని ఈ అడవిలో నేనెప్పుడూ చూడలేదు." అని చెప్పాడు ముత్యం.

తన మనుషుల వైపు చూసి "వాళ్ళిద్దర్నీ ఇక్కడికి తీసుకురండి గట్టిగా అరవకండి బెదిరి చచ్చిపోతారు." అని నవ్వుతూ చెప్పాడు చీలి.

"ఆ ఇద్దరిని ఇక్కడికి తీసుకు రావడం ఎందుకు? చంపేస్తే సరిపోతుంది కదా!" అని చికాకుగా చూస్తూ చెప్పాడు ధన.

ఆ మాట విని "వాడిని చూడు కళ్ళు లేవు కర్ర పట్టుకుని నడుస్తున్నాడు, ఆ పక్కన ఉన్న వాడి సహాయం లేకపోతే ఎటు వెళ్లలేడు నాకు తెలిసి దారి తప్పి ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు రానివ్వు  కాసేపు సరదాగా ఆడుకోవచ్చు!" అని చెప్పాడు చిలి.

"అలా అంటావా! అయితే సరే వెళ్లి తీసుకురండి కాసేపు ఆడించి చంపితే మజా ఉంటుంది." అని వికృతంగా చూస్తూ చెప్పాడు ధన.
[+] 13 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 17-02-2026, 08:57 AM



Users browsing this thread: 1 Guest(s)