17-02-2026, 08:56 AM
ఎపిసోడ్ 83
తల్వార్ తో కలిసి నందా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి నిధి గురించి చెప్పి మొత్తం మీరే తీసుకోండి కానీ దాంట్లో రెండు వస్తువులు నాకు కావాలి అని అడిగాడు గఫర్ ఖాన్.
****************
నాకు ఆ నిధి లొ రెండు వస్తువులు కావాలి అని అడిగిన గఫార్ ఖాన్ వైపు అనుమానంగా చూస్తు "పంచరత్నాలు ఇవ్వడం కుదరదు." అని చెప్పింది అర్ణ.
"ఆ పంచరత్నాలు మీరే ఉంచుకోండి అవి నాకు అవసరం లేదు." అని చెప్పాడు గఫర్ ఖాన్.
"మరి ఆ నిధిలో ఏ వస్తువులు నీకు కావాలి?" అని అడిగాడు అభిజిత్.
"చత్రపతి శివాజీ మహారాజ్ కి అమ్మవారు ప్రసాదించిన ఖడ్గం ఆయన ఆదిష్టించిన సింహాసనం!" అని చెప్పాడు గఫార్ ఖాన్.
"చంద్రహాస్ ఖడ్గం గురించి విన్నాను కానీ సింహాసనం గురించి వినలేదు దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి?" అని అడిగాడు మిథున్.
ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసుకొని "వజ్ర వైడూర్యాలు పొదిగి బంగారంతో తయారు చేసిన ఆ సింహాసనం కోసం బ్రిటిష్ వాళ్ళతో సహా చాలామంది వెతికారు, కానీ అది ఎక్కడ ఉందో కనిపెట్టడం ఎవరి వల్ల అవ్వలేదు, నా అంచనా ప్రకారం కచ్చితంగా అది బేరా కొండల దగ్గర ఉన్న నిధి దగ్గరే ఉంటుంది.
శివాజీ మహారాజ్ ప్రతిష్టిగా భావించే ఆ సింహాసనం మా పూర్వీకులు రక్తంతో తడిచిన ఆ కత్తి ఎలాగైనా నేను కైవసం చేసు కోవాలి." అని చెప్పాడు గఫర్ ఖాన్.
"సరే! ఆ నిధి దొరికిన తర్వాత దాంట్లో వెతుక్కుని నీ రెండు వస్తువులు నువ్వు తీసుకో! మరి నీ పరిస్థితి ఏమిటి?" అని తల్వార్ వైపు చూశాడు ముకుల్.
"అక్కడ దొరికిన నిధిలో 30% నా ప్లేస్ కి చేర్చవలసిన బాధ్యత మీది, దానిని కనిపెట్టి మీకు హ్యాండ్ అవుర్ చేసే బాధ్యత నాది." అని చెప్పాడు తల్వార్.
"ఏంటి? నీ ప్లేస్ కి చేర్చాలా?" అని అడుగుతున్నా మిధున్ ని ఆపి "ఈ డీల్ నాకు ఓకే! ఇంక మీరు వర్క్ లొ మూవ్ అవ్వండి. ఏ హెల్ప్ కావాలన్నా అడగండి క్షణాలలొ జరిగిపోతుంది." అని చెప్పింది అర్ణ.
"మాకు కావలసిన వస్తువులు వెపన్స్ లిస్ట్ వాసుకి ఇచ్చాను అవి అరేంజ్ చేస్తే మేము అడవికి స్టార్ట్ అవుతాము." అని చెప్పాడు తల్వర్.
"సరే! మీరు వెళ్లి ఆ అవుట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి ఈవినింగ్ మీకు కావాల్సినవన్నీ రెడీ అవుతాయి." అని చెప్పింది అర్ణ.
అక్కడి నుంచి వాసుకి తో కలిసి తల్వార్ వెళ్లడంతో "నిధి లొ 30% వాడు చెప్పిన చోటికి చేర్చడానికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? ఏదైనా రిస్క్ అయితే మనం ఇరుక్కుంటాంము." అని చెప్పాడు మిథున్.
"అసలు వాడిని ఆ నిధి ని బయటకు తీయని తర్వాత సంగతి చూద్దాము, దానికి రక్షణగా ఉంది అభీర్ సేన, అంత తేలిక పని జరుగుతుంది అనుకోను వాళ్లు ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతారు.
ఈ తల్వార్కి, గఫర్ ఖాన్ కి మనం కాస్త మనం చెయ్యి అందిస్తే ఆ నిధిని కాపాడడం కోసం అభీర్ సేన లొ ఉన్న వాళ్ళు మొత్తం బయటికి వస్తారు, వాళ్లు వాళ్లు కొట్టుకు చచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళని మనం చంపుదాము." అని చెప్పింది అర్ణ.
ఆ మాటకి నవ్వుతూ "ఇప్పుడు నా మనవరాలు అనిపించావు కరెక్ట్ గా ఆలోచిస్తున్నావు, నా వంశంలో ఎవరు మిగలకపోవడం కాదు ఆ జారువా తెగలొ ఎవరు మిగలకూడదు." అని చెప్పాడు ముకుల్.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "రాజస్థాన్ నుంచి నిర్మల్ కాల్ చేస్తున్నాడు." అని లిఫ్ట్ చేసి "ఏమైంది? విష్ణు జాడ దొరికిందా?" అని అడిగింది అర్ణ.
"నేను ప్రమోద్ మాట్లాడుతున్నాను, విష్ణుని ఫరూక్ మనుషులు అడవి నుంచి బయటకు తీసుకువచ్చారు ప్రాణాలకి ఎటువంటి ముప్పు లేదు, కానీ ఫుడ్ లేకపోవడం వల్ల బాగా నీరస పడిపోయాడు, హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది రెండు రోజులలొ అక్కడకి పంపిస్తాను." అని చెప్పాడు.
"సరే! అడవిలో ఆ అభీర్ సేన మనుషుల జాడ ఏమైనా తెలిసిందా?" అని అడిగింది అర్ణ.
"ఈ అడవిలో పురుగు పుట్రా తప్పితే మనిషి అన్న వాడు లేడు, మేము ఉదయం లో ఆ కొండల దగ్గరికి వెళుతున్నము." అని చెప్పాడు ప్రమోద్.
"గుడ్! త్వరగా స్టార్ట్ చేయండి. ఆ కొండలని బ్లాస్ట్ చేసేటప్పుడు వీడియో తీయండి. మనం మీద డాక్యుమెంటరీ తీసే వాళ్ళకి పంపిద్దాము.
రెండు రోజులలొ అక్కడికి వాసుకి తో పాటు కొంతమంది వస్తారు వాళ్ల పని వాళ్ళని చేసుకునివ్వండి. ఏదైనా హెల్ప్ కావాలి అంటే చేయండి." అని చెప్పి ఫోన్ పెట్టేసి ముకుల్ వైపు చూసి
"విష్ణు దొరికాడు హాస్పిటల్ లో ఉన్నాడు రెండు రోజుల్లో ఇక్కడికి వస్తాడు ఎటువంటి ప్రమాదం లేదు, రేపటి నుంచి ఆ కొండలు తవడం మొదలు పెడుతున్నారు." అని కసిగా చూస్తూ చెప్పింది అర్ణ.
ఆ మాట విని "మనవాళ్లు సాధించారు ఇంక మన పని మనం చేయాలి, ఇప్పుడు అభీర్ కచ్చితంగా అడవికి వెళ్లడానికి ట్రై చేస్తాడు వాడిని ఢిల్లీ నుంచి కదలనివ్వకూడదు." అని చెప్పాడు అభిజిత్.
"ఆ సంగతి నేను చూసుకుంటాను ప్లాన్ ప్రకారం దెబ్బ కొట్టడం వాడికే కాదు నాకు తెలుసు!" అని చెప్పాడు మిథున్.
వాళ్ళ మాటలు వింటూ మోహిత్ దగ్గరికి వెళ్లి "ఆ కొండల దగ్గర నిర్మల్ వాళ్ళు ఏం చేస్తారో చూసినా తరువాత అభీర్ తో డిల్ లొ కూర్చోవాలి అప్పటివరకు తొందరపడకూడదు." అని నెమ్మదిగా చెప్పాడు రఘురామ్.
వరదరాజులు దగ్గరికి వెళ్లి "మనం కూడా ఏదైనా ఆలోచించాలి లేకపోతే కొండలు కింద ఉన్న మట్టిని, నిధి ఖాళీ అయిన తర్వాత అక్కడ ఉన్న చక్క పెట్టెలని చూస్తూ కూర్చోవాలి." అని చెప్పాడు ప్రతాప్ మిశ్ర.
అక్కడి నుంచి లోపలికి వెళుతూ "నువ్వేం కంగారు పడకు బయటి నుంచి వచ్చి వాళ్ళు చేయగలేనిది ఇక్కడ ఉన్నవాడిని నేను చేయలేనా? గవర్నమెంట్ ఏ నా చేతిలో ఉంది." అని చెప్పాడు వరదరాజులు.
*******************
మరుసటి రోజు ఉదయానికి బేర కొండల దగ్గరకి తన వాళ్ళని తీసుకుని క్షేమంగా చేరుకుని అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చి నమస్కరించి
"సోము, కేశవ! నాయకుడి ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చేవరకు మీ అందరికీ నేను సారధిని, ఇకనుంచి ఇక్కడ ఉన్న దళానికి మీరే సారధులు ముందుకు నడిపించండి. మనం క్షేమంగా చేరుకున్నామని సింబా ద్వారా నాయకుడికి సమాచారం పంపించండి." అని చెప్పాడు లింగు.
"సరే!" అని తనతో పాటు వచ్చిన వాళ్ళని చూసి ఈ ప్రదేశం అంత శుభ్రం చేయండి, అమ్మ వారి దగ్గర దీపం పెట్టండి. మన నాయకుడు ఇక్కడ అడుగు పెట్టే వరకు అమ్మవారికి శాంతి జరిపించాలి. " అని రాతి కొండ వైపు చూసి వింత శబ్దం చేసాడు కేశవ.
ఆ అరుపు విని వేగంగా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసి సంతోషంతో అరుస్తూ ఉన్నాడు సింబా.
"మేము క్షేమంగా చేరుకున్నామని నాయకుడికి సమాచారం ఇవ్వు!" అని చెప్పాడు సోము.
ఆ మాట విని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వేగంగా ఎగిరిపోయాడు సింబా.
ఆ అరుపు విని "లింగు! సింబ మనకి ఏదో చెప్పాడు నీకు అర్థమైందా?" అని అడిగాడు కేశవా.
"నాకు అర్థమైంది మీరు సిద్ధం అవ్వండి. నేను నా తమ్ముడు వెళ్లి బలికి మేకల్ని పంపుతాము." అని చెప్పి "గుడ్డు వెళదామా?" అని అడిగాడు లింగు.
"అన్న!" అని చేయి పట్టుకుని కొండ కిందకి బయలుదేరాడు గుడ్డు.
*********
గొర్వర్ గెస్ట్ హౌస్ దగ్గరకి చేరుకుని "ఈ అడవి చుట్టూ నా మనుషులు ఉన్నారు వాళ్ళని దాటి ఒక్కడు కూడా లోపలికి రాలేడు." అని చెప్పాడు ఫరూక్.
అక్కడికి వచ్చిన తను మనుషుల్ని చూపించి "ఇతని పేరు 'చిలి' నాగాలాండ్ నుంచి వచ్చాడు అడవిలో ఏ జంతువైనా కనిపిస్తే దానిమీద ఎటాక్ చేసి పచ్చి మాంసాన్ని తినేస్తారు, వీళ్ళ గ్యాంగ్ దెబ్బకి నాగాలాండ్ లొ కుక్కలు మొత్తం మాయమైపోయాయి." అని నవ్వుతూ చెప్పాడు నిర్మల్.
"అతను బిహార్ నుంచి వచ్చాడు పేరు 'ధన' ఈ గ్యాంగ్ కోడి తల నరకడం మనిషి తల నరకడం ఒకటే అనుకుంటారు వీళ్లని బీహార్ లో అందరు నరరూప రాక్షసులు అని ముద్దుగా పిలుస్తారు." అని చెప్పాడు ప్రమోద్.
ఆ ఇద్దరిని వెనకాల ఉన్న మనుషుల్ని చూస్తూ "మీరు చెప్పిందానికి వీళ్ళ కటౌట్ కి కరెక్ట్ గా సరిపోయింది. మనకి కావలసింది కూడా ఇలాంటి వాళ్లే!" అని చెప్పాడు ఫరూక్.
చిలి,ధన లా వైపు చూసి తన పక్కన ఉన్న మనిషిని చూపించి "ఇతని పేరు ముత్యం! ఈ అడవిలో ఉండే గిరిజనులకి నాయకుడు వీళ్ళ మనుషులు మిమ్మల్ని ఆ కొండల దగ్గరికి తీసుకువెళతారు మీరు రూట్ మొత్తం క్లియర్ చేసి ఇన్ఫామ్ చేస్తే మేము బయలుదేరి వస్తాము." అని చెప్పాడు నిర్మల్.
"అక్కడ మీకు జంతువు కానీ మనిషి కానీ ఏది కనిపించినా నిర్దాక్షిణ్యంగా చంపేయండి మిమ్మల్ని అడిగేవాడు ఎవ్వరు ఉండరు." అని చెప్పాడు ఫరూక్.
"అర్ణ తో మాట్లాడినప్పుడు ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం గాని వాసుకి తో కలిసి కొంతమంది ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి అని చెప్పింది. ఎందుకు వస్తున్నారో నీకేమైనా ఐడియా ఉందా?" అని అడిగాడు ప్రమోద్.
"ఇంక దేనికి అక్కడ ఏదో నిధి ఉంది అని ఆ వాసుకి చెప్పింది కదా దానిని వెతకడానికి వస్తున్నారేమో! అని చెప్పాడు అరుల్.
"వాళ్ల పని వాళ్ళది మన పని మనది దాని గురించి పెద్దగా ఆలోచించాకు." అని చెప్పి చీలి వాళ్ళ వైపు చూసి "మీరు బయలుదేరండి." అని చెప్పాడు నిర్మల్.
"ఓకే సార్!" అని చెప్పి వాళ్ళ మనుషుల్ని తీసుకుని అడవిలోకి బయలుదేరారు చిలి, ధన.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)