16-02-2026, 05:54 PM
ఏమి రుచి
![[Image: acb93b_c00ae27f552d4720b9fb5b12d38b07d9~mv2.jpg]](https://static.wixstatic.com/media/acb93b_c00ae27f552d4720b9fb5b12d38b07d9~mv2.jpg/v1/fill/w_925,h_925,al_c,q_85,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/acb93b_c00ae27f552d4720b9fb5b12d38b07d9~mv2.jpg)
రచన: తాత మోహనకృష్ణ
"ఏమండీ! తొందరగా రెడీ అవ్వండి... ఈ రోజు మనం సినిమాకు వెళ్తున్నాము" అంది కమల
"ఇంకా టైం ఉందిగా... బాగా ఆకలి వేస్తోంది... టిఫిన్ పెట్టు... మళ్లీ ఎప్పుడు తింటామో?" అన్నాడు కమల్
"ఇప్పుడే కదా డజన్ ఇడ్లీలు తిన్నారు... అప్పుడే ఆకలా?"
"ఇడ్లీలు ఏమైనా భూమంత పెద్దగా ఉన్నాయా చెప్పు... అరచేతిలో పట్టేంత చిన్నగా ఉన్నాయి... ఇట్టే అరిగిపోయాయి"
"మీ తిండి పుష్టికి ఒక నమస్కారం... ఇంట్లో ఒక హోటల్ వాతావరణమే ఎప్పుడూ ఉంటుంది మనకి"
"అలా అనకు... నాకు దిష్టి తగులుతుంది. ఇరవై ఇడ్లీలు తినే నేను ఇప్పుడు ఒకటి తక్కువ తింటున్నా... దిష్టి తగిలింది"
"నా దిష్టికే ఒక ఇడ్లీ తగ్గితే, మంచిదే... ఇంకా దిష్టి తగలాలనే కోరుకుంటాను..."
"ఒరేయ్ కమల్!" అంటూ బయటనుంచి వచ్చాడు భాను
భాను, కమల్ ఒకే ఆఫీసులో పనిచేస్తారు.
"వచ్చారా అన్నయ్యగారు! మీరైనా కాస్త చెప్పండి"
"ఏమైంది...?"
"ఇప్పటికే ఇరవై ఇడ్లీలు తిన్నారు బకెట్ సాంబార్ తో... ఇప్పుడు ఇంకా ఆకలి అంటున్నారు. మేము బయటకు సినిమాకు వెళ్లాలనుకున్నాము"
"నువ్వు ఇలా తింటూ కూర్చుంటే, మీరు సినిమాకు ఎప్పుడు వెళ్తారు చెప్పు... ఇప్పటికే వంద కిలోలు దాటి ఉన్నావు... వెయిట్ విషయంలో హాఫ్ సెంచరీ తో ఆపేయాలి... సెంచరీ చేయడానికి ఇది క్రికెట్ కాదురా"
"తింటే పెరిగితే, నేనేం చేస్తాను?... నా తప్పు కాదు"
"కమలా...! నువ్వేం వర్రీ అవకు... వాడు అంతే! మా ఆఫీసులో క్యాంటీన్ ప్రారంభించిన నెలకే మూసేశారు... వీడి తిండి గోల భరించలేక..." అన్నాడు భాను
"ఒక విషయం చెప్పరా భాను!... ఈ జన్మ ఎందుకురా?... అన్నీ రుచి చూడడానికే కదా!... సంతృప్తిగా దేహాన్ని ఉంచడానికే కదా!... అదే నేనూ చేస్తున్నా" అన్నాడు కమల్
"సరే మహా ప్రభు!... నీతో వాదించడం కష్టం"
"ఇదంతా ఎందుకు గానీ... నాకు ఒక డజన్ పూరీలు... మసాలా కూరతో కావాలి" అని ఆర్డర్ వేశాడు కమల్
"చేస్తున్నా మీకోసమే... తిని బయల్దేరండి" విసుక్కుంటూ అంది కమల
"ఆయనికి తిండి ఈ రేంజ్ లో పెట్టాలి. బట్టలు కుట్టించాలంటే, ఒక థాన్ తీయాలి... రెడీమేడ్ పట్టవు. అదే థాన్‌తో ఒక వీధంతా బట్టలు కుట్టించవచ్చు"
"కొత్తగా వచ్చిన నీకు, మా వాడి గురించి ఇంకా తెలియదేమో... వాడికి కొంచెం తిండి పుష్టి అంతే!... ఊరుకో కమల" సర్ది చెప్పాడు భాను
"పూరీ రెడీ... తినండి..."
"అద్భుతంగా చేశావు కమల పూరీ. ఏమి రుచి... ఇలాంటి పూరీ ఇంతవరకు నేను తినలేదు... అంతా నా అదృష్టం"
"అంతా నా దురదృష్టం..." అని గొనుక్కుంది కమల
"సరిగ్గా చెప్పు"
"పెళ్లిచూపుల్లో మీ విగ్రహం చూసి, ఈరోజుల్లో ఆ మాత్రం ఉండాలిలే, లేకపోతే బయటకు వెళ్తే సెక్యూరిటీ ఉండదని ఓకే చేశాను... ఇంత దారుణంగా ఉంటారని అనుకోలేదు."
"నా తప్పేమీ లేదు..."
"మీది కాదు తప్పు... నాది. నెలకు సరిపడే సరుకులు వారం లోనే అయిపోతున్నాయి..." అని తల పట్టుకుంది కమల
"సంపాదిస్తున్నది నేనుగా... నీకేంటి ప్రాబ్లం?"
"అవును... చాకిరి నాదిగా మరి. మీకోసం ఒక వంట మనిషిని పెట్టుకోవచ్చుగా"
"వంట మనిషి నీ అంత రుచిగా, ఇంత ప్రేమగా చేస్తుందా చెప్పు?"
"ఇలాంటి మాటలే చెప్పి నన్ను ఐస్ చేస్తారు... నేను కరిగిపోతాను. ఇంకో రెండు పూరీలు వేసుకోండి..." అంటూ వేడిగా రెండు పూరీలు వేసింది కమల
తిండి కార్యక్రమం పూర్తి. ఇక ఇద్దరూ సినిమాకు క్యాబ్‌లో స్టార్ట్ అయ్యారు.
"ఏమండీ! చక్కగా బండిమీద వెళ్లొచ్చుగా మనం?"
"బండైతే, మధ్య దారిలో ఏమైనా తినడానికి నాకు వీలవదు... క్యాబ్ అయితే పడుకుని కూడా తినొచ్చు... అందుకే"
"ఇందులో కూడా మీ తిండి రహస్యం దాగుని ఉందన్నమాట"
ప్రయాణం వీధి చివర దాటనే లేదు...
"కమలా! కొంచెం తినడానికి ఏమైనా ఉన్నాయా? తింటూ వెళ్తే టైం తెలియదు అందుకే అన్నా..."
"నా ఖర్మ!... మూడు గంటలు ఆగలేరు? స్నాక్స్ ఉన్నాయి తినండి"
సినిమా నుంచి వచ్చిన తర్వాత...
"సినిమా బాగుంది కదండీ!" నవ్వుతూ అడిగింది కమల
"నాకేం తెలుసు... పల్లీలు, చెగోడీలు గురించి అడుగు చెబుతాను. హీరో, హీరోయిన్ ఎలా ఉంటే నాకెందుకు? ఇంటర్వెల్ ఒక్కటే బాగుంది... కాకపోతే ఒక గంట ఉంటే బాగుండేది. బోలెడు తినొచ్చు... తొందరగా అయిపోయింది."
"హీరోయిన్ కట్టిన చీరలు సూపర్ కదండీ!"
"హీరోయిన్ చీరలు ఎలా ఉంటే నాకేంటి? సినిమాలో ఆమె వెళ్ళిన హోటల్ చాలా బాగుంది... నెక్స్ట్ టైం మనం ఆ హోటల్‌కి వెళ్ళాలి"
"పోనీ హీరో బాగా నటించాడు కదండీ..."
"హీరో ఫైటింగ్ నాకెందుకు? నాకన్నా బలంగా ఏమీ లేడు. నాలాగ తింటే బాగా బలం వస్తుంది... ఇంకా వంద మందిని కొట్టొచ్చు."
"పాటలు చాలా బాగున్నాయి కదండీ..."
"ఆ భోజనం మీద పాట ఉంది... అన్ని పదార్థాలు కళ్ల ముందు ఒక్కసారి ఊరించాయనుకో... ఆ వంటకాలన్నీ నువ్వు చెయ్యాలి"
"అంతా నా ఖర్మ!... ఎప్పుడూ తిండి గురించి ఆలోచించే మీ బుర్రకి, అన్నీ అరిగించుకోగల మీ పొట్టకీ నా వందనం!" అంటూ కోపంగా తలుపు వేసుకుని పడుకుంది కమల.
కథ సమాప్తం.
***********

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)