16-02-2026, 10:35 AM
ఎపిసోడ్ 82
మనవాళ్ళని 50 మందిని సిద్ధం చేయండి వాళ్ళని లింగు క్షేమంగా అడవిలోకి తీసుకువెళతాడు అని బైరితో చెప్పాడు అభీర్.
ఆ మాట విని అక్కడ ఉన్న లింగు వైపు చూసి కళ్ళు లేని అతను 50 మందిని క్షేమంగా ఎలా తీసుకువెళతాడు అని డౌట్ గా అడిగింది నీలమ్.
*****************
నీలమ్ మాట విని "చీకటి దారిలో తీసుకువెళతారు బామ్రఘడ్ అడవులలో ఉన్న గుహల నుంచి బేరి అడవులలొ ఉన్న కొండలలోకి రహస్య మార్గం ఉంది.
ఆ గుహలలో ప్రయాణించేటప్పుడు వెలుతురు పడితే వాటి లోపల గోడలకి అమర్చిన రాళ్లలోనుంచి విషపదార్థాలు బయటకు వస్తాయి లోపల ఉన్న మనిషి నిమిషంలో చనిపోతాడు.
లింగుకి వెలుతురు అవసరం లేదు కాబట్టి ఆ లోపల ఉన్న చిన్న చిన్న జంతువులు, పాములు చేసే శబ్దలు విని క్షేమంగా వీళ్లని గమ్యానికి చేరుస్తాడు." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఏమిటి? బామ్రఘడ్ అడవులలో ఉన్న గుహల నుంచి మీ ప్లేస్ కి రూటు ఉందా?" అని అడిగింది నీలమ్.
"అవును! ఆ దారి మా పూర్వీకుల నుంచే ఉంది దాని గురించి తెలిసిన లోపలికి వెళ్లి బ్రతికి బయటపడిన వాళ్ళు ఎవరూ లేరు." అని చెప్పాడు అభీర్.
"ఆ వాసుకి ట్రెజర్ హంటర్ ని పిలిపిస్తుంది అని చెబుతున్నారు నిజంగా అక్కడ నిధి ఉందా? దానికి మీరు రక్షణగా ఉన్నారా? ఈ విషయాలు చంద్రశేఖర్ గారికి ఎలా తెలుసు?" అని డౌట్ గా అడిగింది మిత్ర.
"చత్రపతి శివాజీ మహారాజ్ గారి సైన్యం లో ఉండే సిలెధర్ వంశానికి చెందినవారు చంద్రశేఖర్ గారు! ఆయన పూర్వీకుల నుంచి వస్తున్న కొన్ని ఆధారాలు ద్వారా ఒకరోజు బేరా కొండల దగ్గరికి వచ్చి మా తండ్రి గారిని కలుసుకుని ఆయన కర్తవ్యం తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయారు అందుకే శివమణి నుంచి దూరంగా వెళ్లిపోయారు." అని చెప్పాడు అభీర్.
"అంటే! శంభాజీ మహారాజ్ చనిపోయినప్పుడు రాయగడ్ కోట నుంచి సిలేధర్ లు శివాజీ మహారాజ్ గారి సింహాసనంతో పాటు నిధిని తీసుకువెళ్లి జాగ్రత్త చేశారు అని చెబుతూ ఉంటారు అది నిజమేనా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీలమ్.
"మన చరిత్ర చెప్పే నిజాలు కొంతమందిలో స్ఫూర్తిని నింపితే, కొంతమందిలో ఆశలను పెంచుతుంది. అసలు విషయాలు తెలియ వలసిన రోజు కచ్చితంగా తెలుస్తాయి అప్పటివరకు ఆ దైవం మాకు అప్పచెప్పిన పని చేయడమే మా కర్తవ్యం!" అని బైరి వైపు చూసి
"మనవాళ్లు ఉదయానికి బేరా కొండల దగ్గర ఉండాలి." అని చెప్పాడు అభీర్.
"మరి మనం అడవికి వెళ్లి షూటింగ్ చేయాలి అనుకున్నాము కదా ఎప్పుడు వెళదాము?" అని అడిగింది నీలమ్.
"ఒక్క సింహం ధర్మం కోసం వదిలిన ఆహారన్ని దోచుకోవడానికి నక్కలు వస్తున్నాయి వాటికి గుణపాఠం చెప్పడానికి తప్పకుండా వెళ్లాలి, అప్పుడు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకు వెళ్తాను." అని చెప్పి కొండల దగ్గరికి వెళ్లే వాళ్లతో మాట్లాడడానికి వెళ్ళాడు అభీర్.
ఆ మాట విని "సింహం అంటే చత్రపతి శివాజీ మహారాజ్! ఆయన ధర్మం కోసం వదిలినా ఆహారం అంటే నిధి! దాన్ని దోచుకోవడానికి వెళ్లే నక్కలు అంటే ముకుల్ వాళ్ళు!" అని చెప్పింది మిత్ర.
"అక్క! అభీర్ అన్న చెప్పినా కోడ్ ని భలే ఢీకొడ్ చేశావు." అని చెప్పాడు చాక్లెట్.
"మనం అంతవరకే చేయగలం అంతకు మించి ముందుకు వెళ్లాలి అంటే అభీర్ అడుగులలొ అడుగు వేయాలి." అని చెప్పింది నీలమ్.
"అభీర్ అడుగులో అడుగు వేయడమంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు ఆ కష్టాలు బరిస్తేనే ధర్మం వెలుగు చూడగలము, మీరు ఆ కష్టాలు భరించడానికి సిద్ధమైతేనే ఫాలో అవ్వండి." అని చెప్పింది మల్లి.
అక్కడికి వస్తూ "మల్లి చెప్పింది నిజం! ధర్మం కోసం నిలబడ్డప్పుడు కష్టాలు తప్పవు వాటిని స్వీకరించడానికి సిద్ధపడితేనే అడుగు ముందుకు వేయాలి." అని చెప్పి అభీర్ దగ్గరకు మాట్లాడ్డానికి వెళ్ళింది వసుంధర.
తనతో పాటు వచ్చిన శంకర్ వైపు చూస్తూ "ఏంటి! వదిన ఇక్కడికి సడన్ ఎంట్రీ ఇచ్చింది?" అని డౌట్ గా అడిగింది నీలమ్.
"అభీర్ మాట్లాడాలి అంటే నేనే తీసుకు వచ్చాను." అని చెప్పాడు శంకర్.
"అవునా?" అని వసుంధరతో మాట్లాడుతున్న అభీర్ ని చూసి "ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడు." అని చెప్పింది మిత్ర.
"అభీర్ ముందే చెప్పాడు కదా! ఇది ఐదవ వేదం ప్రకారం జరుగుతున్న యుద్ధం అని, దీంట్లో అన్ని శాస్త్రాలు ఉపయోగిస్తారు." అని చెప్పాడు శంకర్.
******************
నంద గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చిన అగస్త్యని తన రూమ్ కి తీసుకువెళ్లి "ఏమయ్యా! రెండు రోజులుగా ఏమైపోయావు? మంచి ప్లాన్ ఇచ్చావు జంతువులు మొత్తం అడవికి వెళ్ళాయి.
అడవి మన వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది. కానీ ఈ ప్లాన్ మాకు కాకుండా ఆ నిర్మల్ వాళ్లకి వర్కౌట్ అయింది. మనం వెళ్లేసరికి కొండలు దగ్గర మట్టి మిగులుతుందేమో!" అని కంగారుగా చెప్పాడు రఘురామ్.
"మీరు దాని గురించి కంగారు పడకండి సార్! ఆ కొండలు తవ్వడం అంత తేలికైన పని కాదు ఒకవేళ ఈజీగా అయిపోయేటట్లయితే మీ పెద్ద బామ్మర్ది వదిలిపెడతాడా? లేక ఇన్ని సంవత్సరాలు అభిజిత్ గారు చేతులు ముడుచుకుని కూర్చుంటారా?" అని అడిగాడు అగస్త్య.
"అది కూడా కరెక్టే! నీ దగ్గర ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది కదా తొందరగా చెప్పు!" అని అడుగుతు కిటికీలోనుంచి కారు దిగుతున్న మనుషుల్ని చూసి "వీడేనా ఆ ట్రెజర్ హంటర్ తల్వార్!" అని చూస్తూ ఉన్నాడు రఘురామ్.
"సార్! నాకు తెలిసి అక్కడ నిధి లాంటిది ఏమీ లేదు ఒట్టి పుకార్లు మాత్రమే, చాలామంది వెతికి వెతికి చేతులు కాల్చుకుని ఏమి దొరక్క వెళ్లిపోయారు.
మీరు ఓకే అంటే అక్కడ ఉన్న తొమ్మిది కొండలలో ఒక్కదాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు డైరెక్టర్ అభీర్ తోనే డీల్ మాట్లాడదాము కానీ చాలా డిమాండ్ చేస్తాడు." అని చెప్పాడు అగస్త్య.
"ఏంటి నువ్వు చెప్పేది డైరెక్ట్ అభీర్ తోనే డీల్ మాట్లాడదామా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రఘురామ్.
"ఎస్! ఆ తెగ వాళ్ళు చెప్పిన పేమెంట్ కి మీరు ఓకే అంటే దానికి వంద రెట్లు సంపాదించవచ్చు!" అని చెప్పాడు అగస్త్య.
"ఈ డిల్ కి అభీర్ ఒప్పుకుంటాడా?" అని డౌట్ గా అడిగాడు రఘురామ్.
అక్కడికి వస్తూ "డబ్బు మీద ఆశ ఎవరికి ఉండదు పెద్ద నాన్న! ఆ తెగ వాళ్ళు కూడా చాలా సంవత్సరాలుగా అడవి వదిలి మార్కెట్లో ఉంటున్నారు కదా వాళ్లకి మాత్రం సంపాదించుకోవాలని ఉండదా?" అని చెప్పాడు మోహిత్.
"అలా అయితే ఒక కొండకి ఎంత అమౌంట్ డిమాండ్ చేస్తారు? ఒకవేళ మనం అమౌంట్ ఇచ్చిన ఆ కొండ అంత విలువ చేస్తుంది అంటావా?" అని డౌట్ గా అడిగాడు రఘురామ్.
"అంత విలువ చేయకుండానే అందరూ వాటీ వెనకాల పడుతున్నారా? శాంపిల్ చూసుకున్న తర్వాతే డబ్బు ఇద్దాము." అని చెప్పాడు అగస్త్య.
"గుడ్! వెంటనే ఒక మీటింగ్ ఏర్పాటు చెయ్!" అని చెప్పాడు మోహిత్.
"సరే! నువ్వు ఆ పనిలో ఉండు ఎవడో దిక్కుమాలిన వాడు వచ్చాడు కదా అక్కడ లేకపోతే మా మీద డౌట్ వస్తుంది." అని మోహిత్ తో కలిసి కిందకి వెళ్ళాడు రఘురామ్.
"ఓకే సార్!" అని అక్కడి నుంచి వెళుతూ వాళ్ల మాటలు వింటున్న సుజిత్, తంబియార్ లను చూసి చూడనట్లు వెళ్లిపోయాడు అగస్త్య.
**************
తన మనుషులతో కలిసి వచ్చిన తల్వర్ ని తీసుకొని అర్ణ మిథున్ లతో కలిసి ముకుల్ దగ్గరికి వెళ్ళి "సార్! నేను చెప్పిన ట్రెజర్ హంటర్ ఇతనే!" అని చూపించింది వాసుకి.
ఎదురుగా ఉన్న తల్వార్ వైపు చూస్తూ "మీ గురించి వాసుకి చాలా విషయాలు చెప్పింది. ఎప్పుడైనా బేరా కొండల గురించి విన్నారా? తను చెప్పినట్లు నిజంగా అక్కడ నిధి ఉందా? దాని గురించి మీకేమైనా తెలుసా?" అని అడిగాడు ముకుల్.
"సాబ్! నా దగ్గరికి ఒక విషయం వచ్చింది అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుని అక్కడ ఏదైనా ఉంది అంటేనే నేను బయలుదేరి వస్తాను." అని చెప్పి తన పక్కన కూర్చున్న వ్యక్తిని చూపిస్తూ
"ఇతని పేరు గఫర్ ఖాన్! ఔరంగజేబు దగ్గర సైన్యాధిపతిగా చేసిన మూక్రత్ ఖాన్ వారసుడు, నిధి గురించి చాలా సమాచారం ఇతని దగ్గర నాకు దొరికింది. దానిని మనం సంపాదించగలిగితే ప్రపంచంలోనే కుబేరులం అయిపోతాము." అని చెప్పాడు తల్వర్.
"అవును! అంత భారీ నిధి మరాఠా సామ్రాజ్యానికి ఎక్కడిది?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"అక్కడ ఉన్న నిధి మరాఠా సామ్రాజ్యాన్నిధి మాత్రమే కాదు, ఔరంగజేబు అఖండ భారతాన్ని కైవసం చేసుకోవడానికి ప్రతి రాజ్యం మీద యుద్ధం చేసేవాడు
మొగలుల నుండి వాళ్ల సంపదను కాపాడి హిందూ ధర్మన్ని నిలబెట్టడం కోసం రాజపుత్రుల దగ్గర నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు భారీ నిధిని సమకూర్చి దానిని కాపాడే వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే అని అందరూ నిర్ణయించుకుని రాయగడ్ కోటకి తరలించారు.
శంభాజీ మహారాజ్ చనిపోయాడని వార్త తెలిసిన వెంటనే నమ్మకస్తులైన కొంతమంది సీలేదర్ ల నాయకత్వంలో ఆ నిధిని అభీర్ సేన దగ్గరికి చేర్చారు అప్పట్నుంచి వారు రక్షణగా ఉన్నారు.
ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కాబట్టి మనం ఈజీగా దానిని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, దానిని ఎక్కడ దాచి పెట్టారో తెలుసుకోవడమే మన ముందు ఉన్న సవాల్!" అని చెప్పాడు గఫర్ ఖాన్.
"నువ్వు చెప్పిందాన్ని బట్టి అక్కడ భారీ నిధి ఉండి ఉంటుంది. నాకు తెలిసి దానికి మార్గం ఆ అమ్మవారి విగ్రహం కింద నుంచి ఉండొచ్చు!" అని చెప్పాడు అభిజిత్.
"ఐదు సంవత్సరాల క్రితం వియత్నం టీం తో నేను ఆ కొండల దగ్గరికి వెళ్లాను కానీ అక్కడ మా వాళ్ళు జంతువులకు బలయ్యారు తప్పితే ఎక్కడ నిధి జాడ దొరకలేదు.
కానీ ఇప్పుడు గఫర్ ఖాన్ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయి నాకు తెలిసి దానిని అంత సులభంగా చేరుకోలేము ఈసారి నా సొంతమంది మంది మార్బలంతో వచ్చాను దానిని సాధించిన తర్వాతే తిరిగి వెళతాను." అని చెప్పాడు తల్వర్.
"ఈ విషయంలో మనం ముందుగానే షేర్ మాట్లాడుకుంటే ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది." అని చెప్పింది అర్ణ.
"మీరు నిధి మొత్తం తీసుకోండి. కానీ అక్కడ ఉన్న రెండు వస్తువులు నాకు కావాలి." అని చెప్పాడు గఫర్ ఖాన్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)